జార్ఖండ్లో భద్రతాదళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందాడు.
గిరిదిహ్: జార్ఖండ్లో భద్రతాదళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందాడు. గిరిదిహ్ జిల్లా పతర్చ్చప్ర అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగినట్లు సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ ఆనంద్ తెలిపారు. మావోయిస్టుల సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తుండగా, హఠాత్తుగా మావోయిస్టులు కాల్పులకు దిగటంతో ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందనట్లు వెల్లడించారు. జవాను మృతదేహాన్ని గిరిదిహ్ తరలించినట్లు చెప్పారు. మరోవైపు ఈ సమాచారం అందుకున్న గిరిదిహ్ ఎస్పీ అఖిలేష్ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.