Jharkhand
-
ఊహించని విషాదం.. రిటైర్మెంట్ రోజే అనంతలోకాలకు
ఇది మాటలకందని విషాదం.. ఊహించని ఘటన ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ ట్రైన్ల డ్రైవర్లు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో మృతి చెందిన లోకో పైలట్ గంగేశ్వర్ ఏప్రిల్ 1న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అదే రోజే ఆయన అనంత లోకాలకు పయనమయ్యారు.ఇక తమ కుటుంబంతో ఆనందంగా గడపొచ్చనే ఆయన కలలు ఆవిరైపోవడంతో పాటు కుటుంబ సభ్యులకు ఊహించని విషాదమే మిగిలింది. రిటైర్మెంట్ రోజు ఆయనతో కలిసి విందు చేసుకోవాలని ఎదురు చూస్తున్న కుటుంబానికి కన్నీరే మిగిలింది.విధి నిర్వహణలో చివరి రోజున తోటి ఉద్యోగులతో సరదాగా గడిపి.. ఎన్నో జ్ఞాపకాలతో తిరిగి వస్తాడనుకున్న తన తండ్రి ఇంకెప్పటికీ రాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఆయన కూతురు విలపించింది. రేపటి నుంచి ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటానని ఆనందంగా చెప్పి వెళ్లిన తండ్రి.. ప్రమాదంలో మృతి చెందడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
జయహో జార్ఖండ్
పంచ్‌కులా (హరియాణా): ఎట్టకేలకు జార్ఖండ్ మహిళల హాకీ జట్టు అనుకున్నది సాధించింది. తొలిసారి జాతీయ సీనియర్ మహిళల చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించింది. ‘షూటౌట్’ వరకు కొనసాగిన టైటిల్ సమరంలో అల్బెలా రాణి టొప్పో నాయకత్వంలోని జార్ఖండ్ జట్టు 4–3 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా జట్టును ఓడించింది. 2011లో హాకీ ఇండియా (హెచ్ఐ) ఆవిర్భవించాక 15 సార్లు జాతీయ చాంపియన్‌షిప్ జరిగింది. జార్ఖండ్ జట్టు ఆరుసార్లు (2012, 2013, 2014, 2022, 2023, 2024) మూడో స్థానాన్ని దక్కించుకోగా... ఒకసారి (2015) రన్నరప్‌గా నిలిచింది. ఎనిమిదో ప్రయత్నంలో జార్ఖండ్ విన్నర్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. హరియాణాతో జరిగిన ఫైనల్లో నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. హరియాణా తరఫున కెప్టెన్ రాణి (42వ నిమిషంలో), జార్ఖండ్ తరఫున ప్రమోదిని లాక్రా (44వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో జార్ఖండ్ తరఫున రజని కెర్కెట్టా, నిరాలి కుజుర్, బినిమా ధన్, అల్బెలా రాణి టొప్పో సఫలంకాగా... ష్యామీ బారా విఫలమైంది. హరియాణ తరఫున సోనమ్, కెపె్టన్ రాణి గురి తప్పగా... పింకీ, అన్ను, మనీషా సఫలమయ్యారు. జార్ఖండ్ గోల్‌కీపర్ అంజలి బింజియా హరియాణా ప్లేయర్ల రెండు షాట్లను నిలువరించి తమ జట్టుకు తొలిసారి టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు మిజోరం జట్టు తొలిసారి మూడో స్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మిజోరం జట్టు 2–1 గోల్స్ తేడాతో మహారాష్ట్ర జట్టును ఓడించింది. మహిళల విభాగంలో రైల్వేస్ జట్టు అత్యధికంగా 8 సార్లు టైటిల్ దక్కించుకోగా... హరియాణా (3 సార్లు) రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ రెండుసార్లు టైటిల్‌ను గెలవగా.. ఒడిశా, జార్ఖండ్ ఒక్కోసారి జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి. -
కుంభమేళా నుంచి వస్తుండగా కారు ప్రమాదం.. ఎంపీకి తీవ్ర గాయాలు
లతేహార్: ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో కుంభమేళాకు వచ్చారు. ఇక, తాజాగా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించి తిరిగి వెళ్తుండగా రాజ్యసభ ఎంపీ మహువా మాజీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎంపీకి గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ మహువా మాజీ కుంభమేళాకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో జార్ఖండ్‌లోని లతేహర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హాట్‌వాగ్ గ్రామ సమీపంలోని NH-75పై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును ఆమె కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే ఆమెను రాంచీలోకి రిమ్స్‌కు తరలించారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంపీ కుమారుడు, కోడలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఎంపీ కుమారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతోంది. ఉదయం 3:45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఆమె ఎడమ చేతికి బలమైన గాయమైనట్టు వైద్యులు తెలిపారు. కొన్ని టెస్టులు కూడా చేశారు. కాసేపట్లో చేతికి సర్జరీ చేయనున్నారు. ప్రస్తుతం ఆమె మాతో మాట్లాడుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. #WATCH | Jharkhand: JMM Rajya Sabha MP Mahua Maji's son Somvit Maji says "We were returning from Maha Kumbh, Prayagraj when this accident took place...My mother (Mahua Maji) and wife were in the back seat. I was driving the car, and around 3:45 AM, I fell asleep, and the car hit… https://t.co/Rz1MXP3tAZ pic.twitter.com/6yswYEnkuH— ANI (@ANI) February 26, 2025ఇదిలా ఉండగా.. ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది ఈక్రమంలో బుధవారం మహా శివరాత్రి (Maha siva rathri) పర్వదినం సందర్భంగా భక్తులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళాలో నేడు చివరి అమృత్ స్నానం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు భక్తులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు.శివరాత్రి రోజున భక్తులు ట్రాఫిక్‌లో చిక్కకుపోకుండా ఉండేందుకు కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ (No Vehicle Zone)గా అధికారులు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి దీన్ని అమలుచేశారు. కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనం అయ్యేలా ప్రయాగ్‌రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు బుధవారం 350 రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇక, ఇప్పటివరకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. -
ఒకే ఇంట్లో ముగ్గురి మృతి.. డైరీలో ఆమె ఫోన్ నంబర్!
వారిద్దరూ విద్యావంతులు. దానికి తోడు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదుగానీ తల్లితో కలిసి విగతజీవులుగా మారిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణాలు కేరళలో (Kerala) కలకలం రేపాయి. వారు ముగ్గురు ఎలా చనిపోయారు, ఎందుకు అకాల మరణం చెందారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితేనే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.అసలేం జరిగింది?కొచ్చిలోని ఎకాముఖ్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురి మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. మృతులు శాలిని విజయ్, మనీశ్ విజయ్, శకుంతలగా గుర్తించారు. శాలిని.. జార్ఖండ్ (Jharkhand) సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ఆమె సోదరుడు మనీశ్.. ఐఆర్ఎస్ అధికారి. కొచ్చిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో అడిషనల్ కమిషనర్ ఉద్యోగం చేస్తున్నాడు. లివింగ్ రూములో సీలింగ్ హుక్కు ఉరివేసుకుని మనీశ్ చనిపోయాడు. మరో గదిలో శాలిని నిర్జీవంగా కనిపించారు. వీరి తల్లి శకుంతల మృతదేహం తెల్లని వస్త్రంలో చుట్టివుందని, పూలు చల్లిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.మనీశ్ డైరీలో చెల్లెలి ఫోన్ నంబర్మనీశ్, శాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శకుంతల మరణానికి గల కారణాలు అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు. ‘శకుంతల మరణం సహజమా, మరేదైనా కారణాలు ఉన్నాయనేది అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంద’ని త్రిక్కకరా ఏసీపీ పీవీ బేబీ తెలిపారు. మనీశ్ డైరీలో ఫిబ్రవరి 15న రాసిన నోట్‌ను పోలీసులు గుర్తించారు. తమకు సంబంధించిన కొన్ని పత్రాలను దుబాయ్‌లో (Dubai) ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాలని కోరుతూ, ఆమె ఫోన్ నంబరు కూడా అందులో రాశారు.టాపర్‌గా నిలిచి.. కేసులో ఇరుక్కుని.. శాలిని.. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) 2003లో నిర్వహించిన మొదటి సివిల్ సర్వీసెస్ కంబైన్డ్ పోటీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్ష ద్వారా 64 మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో 2022, జూలైలో జార్ఖండ్ హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. శాలినితో పాటు మిగతా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27న జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో శాలిని మరణించడం చర్చనీయాంశంగా మారింది.ప్రొఫెసర్ శకుంతల శకుంతల బొకారో (Bokaro) ప్రాంతానికి చెందిన వారని, వీరి కుటుంబం రాంచీలో 2013 వరకు అద్దె ఇంటిలో ఉందని తెలిసింది. శకుంతల కుటుంబ సభ్యులు భక్తిభావంతో మెలిగేవారని, తమతో స్నేహంగా ఉండేవారని పొరుగింటివారు వెల్లడించారు. బొకారోలో శకుంతల ప్రొఫెసర్‌గా పనిచేసేవారని తెలిపారు. ఆమె మరో కుమార్తె పెళ్లిచేసుకుని రాజస్థాన్‌లో స్థిరపడిందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం రాంచీ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో కలిసినప్పుడు మనీశ్ అప్యాయంగా పలకరించాడని.. అతడితో పాటు శాలిని, శకుంతల మరణించారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డామన్నారు. కాగా వీరి ముగ్గురి మరణానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.చదవండి: వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయంఅన్నికోణాల్లోనూ దర్యాప్తుశాలినిపై సీబీఐ కేసు కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శకుంతల సహజంగా చనిపోయివుంటే ఆమె మరణాన్ని తట్టుకోలేక కూతురు, కొడుకు ప్రాణాలు తీసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వీరి మానసిక పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
Maha Kumbh: ‘కుంభమేళా’ అనగానే 15 ఏళ్ల గతం గుర్తుకువచ్చి..
మహాకుంభమేళా.. ప్రపంచాన్నంతటినీ ఆకట్టుకుంటున్న మహోత్సవం. దీనిలో పలు అద్భుతాలు, వింతలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం ఎంతో ఆసక్తిగొలుపుతోంది. 15 ఏళ్ల క్రితం కనుమరుగైన ఒక వ్యక్తి అత్యంత విచిత్ర పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ కథనం జార్ఖండ్‌లోని కోడర్మా జిల్లాకు చెందిన ప్రకాష్ మహతోకు సంబంధించినది.ఆ సమయంలో ప్రకాష్.. కోడర్మా మునిసిపల్ కార్పొరేషన్(Koderma Municipal Corporation)లో పనిచేసేవాడు. 2010లో ఒక రోజున డ్యూటీకి వెళ్లిన ప్రకాష్ ఇంటికి తిరిగి రాలేదు. మానసిక పరిస్థితి సరిగా లేనందున ఇంటికి వెళ్లే దారిని మరచిపోయాడు. ప్రకాష్ కుటుంబసభ్యులు తమకు తెలిసిన అన్నిచోట్లా వెదికినా ఫలితం లేకపోయింది. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎంత గాలించినా ప్రకాష్ ఆచూకీ తెలియరాలేదు.అయితే 15 ఏళ్ల తరువాత తాజాగా ప్రకాష్ మహతోను బీహార్‌లోని రాణిగంజ్(Raniganj in Bihar) ప్రాంతంలో హోటల్లో పనిచేస్తుండగా పోలీసులు గుర్తించారు. ఆ హోటల్ యజమాని సుమిత్ అతనికి పహల్వాన్ అని పేరుపెట్టాడు. చాలాకాలంగా ప్రకాష్ అదే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల హోటల్లో కుంభమేళా ప్రస్తావన వచ్చింది. దీంతో ప్రకాష్ తాను కుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నానని, అదే దారిలో తమ ఇల్లు ఉందని హోటల్ యజమాని సుమిత్‌కు చెప్పాడు. దీంతో సుమిత్ ఈ విషయాన్ని కోడర్మా పోలీసులకు ఫోనులో తెలియజేశాడు. వారు ప్రకాష్ అతనేనని నిర్థారించాక ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.దీంతో ఎంతో ఆనందంతో ప్రకాష్ భార్య గీతాదేవి, కుమారుడు సుజల్, కుమార్తె రాణీ తదితరులు రాణిగంజ్ చేరుకున్నారు. భర్తను చూసిన గీతాదేవి, తండ్రిని చూసిన సుజల్, రాణి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకాలం గీతాదేవి కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. 15 ఏళ్ల తరువాత ఇంటిపెద్ద కనిపిస్తాడని, వారెవరూ ఊహించలేదు. వారంతా కోడర్మాలోని తమ ఇంటికి చేరుకుని, ఇదంతా కుంభమేళా మహత్మ్యమేనని అందరికీ చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి? -
రాగాల పల్లకిలో రాష్ట్రపతి చెంతకు..
జార్ఖండ్(Jharkhand )కు చెందిన ఈ పాతిక మందిలో ఎక్కువ మంది ఆదివాసీ అమ్మాయిలే. ఎవరూ ఎప్పుడూ ఢిల్లీకి వెళ్లలేదు. వీరికి ఢిల్లీకి వెళ్లే అవకాశం రావడమే కాదు రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలలో పాల్గొని, రాష్ట్రపతి ముందు పైపర్ బ్యాండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అపూర్వ అవకాశం వచ్చింది.కర్తవ్యపథ్ దగ్గర ప్రదర్శన(Republic Day Parade ) ఇవ్వడానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు పాఠశాలల్లో జార్ఖండ్‌లోని సింగ్భమ్ జిల్లా ‘కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయ’ ఒకటి. ట్యూన్స్ వాయించడంలో కచ్చితత్వం, ఏకరూపత కారణంగా ఈ పైపర్ బ్యాండ్ ఎంపికైంది. రాష్ట్ర్రపతి ముందు ప్రదర్శన ఇవ్వబోతున్న ఈ గర్ల్ బ్యాండ్ ఉత్సాహంగా ఉంది. ‘ఇది చాలా గొప్ప అవకాశం. జీవితంలో ఎప్పుడూ మరచి΄ోలేని అవకాశం’ అంటుంది బ్యాండ్ సభ్యులలో ఒకరైన పార్వతి మహతో. (చదవండి: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం: స్టైలిష్ లుక్‌లో మెలానియా ట్రంప్) -
80 మంది విద్యార్థునుల పట్ల స్కూల్ ప్రిన్సిపల్ పైశాచికత్వం!
ధన్‌బాద్: ఓ ప్రైవేట్ స్కూల్ (private school) యాజమాన్యం 80 మంది పదో తరగతి విద్యార్థునుల పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. పెన్ డే పేరుతో నిర్వహించిన వేడుకల్లో బలవంతంగా విద్యార్థునుల షర్ట్‌లను విప్పదీయించి బ్లేజర్‌తో ఇంటికి పంపించింది. పరీక్షలు పూర్తవడంతో ‘పెన్ డే’ (penday)పేరిట షర్ట్‌లపై పెన్నులతో రాసుకున్న పదో తరగతి విద్యార్థునులను ఆ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ దారుణంగా శిక్షించిన ఘటన జార్ఖండ్ jharkhand)లో ఆలస్యంగా వెలుగుచూసింది. మొత్తం 80 మంది అమ్మాయిల షర్ట్‌లను బలవంతంగా వారితోనే విప్పదీయించి అందర్నీ బ్లేజర్ (కోటు) మీదనే ఇంటికి పంపించేసిన ఉదంతం ధన్‌బాద్ జిల్లాలోని డిగ్వాడియా పట్టణంలో జరిగింది.విషయం తెల్సుకుని జిల్లాయంత్రాంగం వెంటనే విచారణకు ఆదేశించింది. జోరాపోఖార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుందని వివరాలను ధన్‌బాద్ డెప్యూటీ కమిషనర్ మాధవీ మిశ్రా వెల్లడించారు. స్నేహితులకు సందేశాల పేరిట చొక్కాలను పెన్ను గీతలతో నింపేయడమేంటంటూ ప్రిన్సిపల్ పట్టరాని ఆవేశంతో విద్యార్థులపై కోప్పడి షర్ట్‌లను తీసేయాలని ఆజ్ఞాపించాడు. పిల్లలు క్షమాపణలు చెప్పినా వినిపించుకోలేదు. బలవంతంగా వారితోనే తీయించి ఇంటికి పంపేశారు.అవమానంగా భావించిన కొందరు విద్యార్థునులు తమ తల్లిదండ్రులకు చెప్పడం, వారు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు కోసం జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ , జిల్లా విద్యాధికారి, జిల్లా సామాజిక సంక్షేమాధికారి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఉంటారు. ప్రిన్సిపల్ ఘటన సిగ్గుమాలిన, దురదృష్టకర చర్య అని ఝరియా ఎమ్మెల్యే రాగిణి సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.👉చదవండి : మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది! -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్పీడ్‌స్టర్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్(Varun Aaron) రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం తెలిపాడు. గత ఇరవై ఏళ్లుగా ఆట కోసమే జీవించానని.. ఇకపై క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించాడు.గాయాలు వేధిస్తున్నా‘‘ఫాస్ట్ బౌలింగే ఊపిరిగా బతికాను. ఇరవై ఏళ్లుగా నా ఆశ, శ్వాస అంతా క్రికెటే. ఆట పట్ల కృతజ్ఞత కలిగి ఉన్న నేను.. ఈరోజు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఆ దేవుడు, నా కుటుంబం, స్నేహితులు, సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అభిమానుల ప్రోత్సాహం వల్లే ఈ ప్రయాణం కొనసాగింది.గాయాలు వేధిస్తున్నా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు శారీరకంగా, మానసికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించగలిగాను. నా ఫిజియోలు, ట్రైనర్లు, కోచ్‌లతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీ వల్లే ఇదంతా సాధ్యమైంది.ఆటే నాకు అన్నీ ఇచ్చిందినా కెరీర్‌ను ఇన్నాళ్లు కొనసాగించేలా తోడ్పడిన భారత క్రికెట్ నియంత్రణ మండలి, జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించవచ్చని తెలుసు. అయితే, నా జీవితంలోని ప్రతీ చిన్న ఆనందానికి ఆటే కారణం. ఆటే నాకు అన్నీ ఇచ్చింది.నా ఫస్ట్ లవ్ ఫాస్ట్ బౌలింగ్. అందుకే నేనిక మైదానంలో అడుగుపెట్టకపోయినా.. క్రికెట్లో భాగంగానే ఉంటాను. ఎందుకంటే.. నేను అందులో ఓ భాగం కాబట్టి..’’ అంటూ వరుణ్ ఆరోన్ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.గంటకు 153 కిలోమీటర్ల వేగంతోకాగా సింగ్‌భూమ్‌కు చెందిన వరుణ్ ఆరోన్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)- 2010- 11 సందర్భంగా వరుణ్ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్లో ఈ జార్ఖండ్ పేసర్.. గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి.. తన స్పీడ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.ఈ క్రమంలో.. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వరుణ్ ఆరోన్.. తొమ్మిది టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు. చివరగా 2015లో సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొన వరుణ్ ఆరోన్.. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.ఐపీఎల్‌లోనూ..ఇక గాయాల బెడద కారణంగా గతేడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకొన్న వరుణ్ ఆరోన్.. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఐదు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఈ స్పీడ్‌స్టర్.. 2022లో చివరగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పుణెలో జరిగిన మ్యాచ్ అతడి ఐపీఎల్ కెరీర్లో ఆఖరిది. ఇక క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా 52 మ్యాచ్‌లు ఆడిన 35 ఏళ్ల వరుణ్ ఆరోన్.. 44 వికెట్లు పడగొట్టాడు. స్కూల్ ఫ్రెండ్‌తో పెళ్లివరుణ్ ఆరోన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2016లో రాగిణితో అతడి వివాహం జరిగింది. కోర్టు మ్యారేజీ చేసుకున్న వీళ్లిద్దరు స్కూల్ ఫ్రెండ్స్. చదవండి: ‘గంభీర్ నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..’ -
Success Story: పట్టుదలకు మారుపేరు అనురాగ్ గౌతమ్
పట్టుదల, ఏకాగ్రత విజయానికి మూలసూత్రాలని చెబుతారు. వీటిని ఆశ్రయించినవారు ఏ రంగంలోనైనా రాణిస్తారని అంటారు. పట్టుదలతో చదివి విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని మనం చూసేవుంటాం. అలాంటి వారిలో ఒకరే అనురాగ్ గౌతమ్.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన అనురాగ్ గౌతమ్ ఐఈఎస్ ఫలితాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించాడు. ఆల్ ఇండియా ర్యాంక్ వన్ (ఏఐఆర్ 1) సాధించి, అనురాగ్ అందరి అభినందనలు అందుకుంటున్నాడు.అనురాగ్ గౌతమ్ బొకారో డీపీఎస్ స్కూలులో చదువుకున్నాడు. అతని తండ్రి అనుపమ్ కుమార్ బొకారో స్టీల్ ప్లాంట్‌లో అధికారి. అతని తల్లి కుమారి సంగీత గృహిణి. చిన్నతనం నుంచే అనురాగ్‌కు చదువుపై అమితమైన ఆసక్తి ఉంది. పాఠశాల విద్య పూర్తిచేసిన అనురాగ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.తన కుమారుడు ఎన్టీఎస్ఈ, కేవీపీవై తదితర పరీక్షలలో విజయం సాధించాడని అనురాగ్ తండ్రి అనుపమ్ కుమార్ తెలిపారు. అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) అధికారి కావడం అనురాగ్ కల అని, తొలి ప్రయత్నంలో విఫలమైనా ధైర్యం కోల్పోకుండా, రాత్రి పగలు కష్టపడి ఎట్టకేలకు ఈ పరీక్షలో విజయం సాధించాడన్నారు. రెండవ ప్రయత్నంలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచి అనురాగ్ తన కలను నెరవేర్చుకున్నాడన్నారు.అనురాగ్ సాధించిన విజయం గురించి తెలుసుకున్న డీపీఎస్ బొకారో ప్రిన్సిపాల్ డాక్టర్ గంగ్వార్ కూడా అనురాగ్‌ను అభినందించారు. ఈ విజయం అతని కుటుంబానికే కాకుండా, రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఎవరైనా అంకితభావంతో పనిచేస్తూ, లక్ష్యం దిశగా పయనించినప్పుడు ఏ సవాలూ పెద్దది కాదనేందుకు ఈ విజయం ఉదాహరణగా నిలుస్తుందన్నారు.ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా.. -
శతక్కొట్టిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం
మూలపాడు (ఆంధ్రప్రదేశ్): భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (153 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో మెరిశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకున్నాడు.మూడు రోజుల మ్యాచ్‌లో ఆఖరి రోజు కర్ణాటక తొలిఇన్నింగ్స్‌లో 123.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 441 పరుగుల భారీస్కోరు చేయగా, మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అన్వయ్ మొదట శమంతక్ అనిరుధ్ (76)తో కలిసి మూడో వికెట్‌కు 167 పరుగులు జతచేశాడు.387 పరుగులకు ఆలౌట్అనిరుధ్ అవుటయ్యాక వచ్చిన సుకుర్థ్ (33)తో నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 128.4 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది. 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా, జార్ఖండ్ ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకుంది.జోనల్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీఅన్వయ్ ద్రవిడ్ గతేడాది కర్ణాటక అండర్–14 జట్టుకు సారథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ టోర్నీకి ముందు జరిగిన కేఎస్‌సీఏ (కర్ణాటక క్రికెట్ సంఘం) అండర్–16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో బెంగళూరు జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన అన్వయ్... తుంకూర్ జోన్‌పై చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో అజేయంగా నిలిచాడు.ఇక అన్వయ్ అన్నయ్య 19 ఏళ్ల సమిత్ కూడా ఇదివరకే జూనియర్ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో సమిత్ ద్రవిడ్ రాణించాడు. చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
జార్ఖండ్ కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే
రాంచీ: ఎట్టకేలకు జార్ఖండ్‌లో మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని మంత్రి మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహేశ్‌పూర్ ఎమ్మెల్యే స్టీఫెన్ మరాండీతో జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ జార్ఖండ్ విధానసభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన రాందాస్ సోరెన్, దీపక్ బీరువా, హఫీజుల్ హసన్, కాంగ్రెస్‌కు చెందిన దీపికా పాండే సింగ్‌లు తమ పదవులను కొనసాగించారు. వీరితోపాటు జేఎంఎం నుంచి చమ్ర లిండా, యోగేంద్ర ప్రసాద్, సుదివ్య కుమార్, ఇర్ఫాన్ అన్సారీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాధా కృష్ణ కిషోర్, శిల్పి నేహా టిర్కీ, ఆర్జేడీ ఎమ్మెల్యే సంజయ్ ప్రసాద్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.Ranchi, Jharkhand | Congress MLA Radha Krishana Kishore, JMM MLA Deepak Birua, JMM MLA Chamra Linda and RJD MLA Sanjay Prasad Yadav take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/BXU7ozCGcx— ANI (@ANI) December 5, 2024Ranchi, Jharkhand | JMM MLA Ramdas Soren, Congress MLA Irfan Ansari, JMM MLA Hafizul Hasan and Congress MLA Dipika Pandey Singh take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/46PTFLlabh— ANI (@ANI) December 5, 2024 Ranchi, Jharkhand | JMM MLA Stephen Marandi took oath as Protem Speaker of the Legislative Assembly pic.twitter.com/n45Ih1sQ4V— ANI (@ANI) December 5, 2024కాగా జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాంచీలోని మొరాబాది మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ రోజే జేఎంఎం సీనియర్ ఎమ్మెల్యే అయిన మరాండీని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. డిసెంబర్ 9-12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జేఎంఎం ప్రభుత్వం నిర్ణయించారు.#WATCH | Ranchi: After the Jharkhand cabinet expansion, CM Hemant Soren says, " As the time is moving forward, everything is happening quickly. Govt will get the direction now and we will move forward at a fast pace" pic.twitter.com/mGgfaDh0r2— ANI (@ANI) December 5, 2024ఇక ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ 2 సీట్లు గెలుచుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 సీట్లు సాధించింది. -
Jharkhand: హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణపై జాప్యమెందుకు?
రాంచీ: జార్ఖండ్‌లో గత వారం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇటీవల వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం ఘన విజయం సాధించడంతో..జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్(49) గనవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సోరెన్ ప్రమాణ స్వీకారం చేసి అయిదు రోజులు అవుతున్న కేబినెట్ విస్తరణపై మాత్రం జాప్యం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు లేవని తెలుస్తోంది.ప్రస్తుతానికి జార్ఖండ్ కేబినెట్లో సోరెన్ ఒక్కరు మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసిగా పోటీచేయడంతో.. మిత్రపక్షాల మధ్య బెర్త్‌ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఇక జార్ఖండ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 12 మంది మంత్రులుగా ఉండవచ్చు. అయితే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నలుగురు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఈసారి సోరెన్ మంత్రివర్గం భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఒక్కో పార్టీ గెలిచిన నాలుగు స్థానాలకు గానూ ఒక మంత్రి పదవి లభించింది. ఈ ఫార్ములాతో కాంగ్రెస్‌కు నాలుగు బెర్త్‌లు, సోరెన్‌కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముఖ్యమంత్రి పదవితో సహా ఏడు స్థానాలు లభించాయి. తేజస్వి యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌కు ఒక మంత్రి పదవి లభించింది.గతంతో పోల్చితే ఈసారి జేఎంఎం నాలుగు సీట్లు అదనంగా గెలుపొంది. దీంతో ఒక మంత్రి పదవికి ఐదు 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనతో కాంగ్రెస్‌కు మంత్రి పదవులు తగ్గే అవకాశం ఉంది. జేఎంఎం గెలుచుకున్న 34 సీట్లతో పోలిస్తే ఆ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఆర్జేడీ ప్రస్తుతం నాలుగు సీట్లు గెలుచుకున్నందున ఒకటి కంటే ఎక్కువ మంత్రి పదవులు ఆశించవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ గతసారి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. -
ఇషాన్ కిషన్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో తుపాన్ ఇన్నింగ్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే వేదికగా అరుణాచాల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ తరపున కిషన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అరుణాచాల్ బౌలర్లను ఉతికారేశాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే జార్ఖండ్ వికెట్ నష్టపోకుండా ఊదిపడేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(13) ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో స్పిన్నర్ అనుకుల్ రాయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. రవి కుమార్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్ఆర్హెచ్లోకి ఎంట్రీ..కాగా ఇటీవలే జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్ భారీ ధర దక్కింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ వరకు అతడు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.కానీ ఈసారి అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. కాగా దేశీవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో కిషాన్ సెంట్రాల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. -
జార్ఖండ్ సీఎంగా హేమంత్
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్(49) ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. తెల్లని కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్ ధరించిన హేమంత్ ముందుగా జేఎంఎం చీఫ్, తన తండ్రి శిబూ సోరెన్‌ను కలుసుకున్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతలు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా రాంచీలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ దంపతులు ఉన్నారు. పంజాబ్ సీఎం మాన్, సీపీఐఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా హాజరయ్యారు. కాగా, సీఎంగా హేమంత్ ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి.ఇది చారిత్రక దినంప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని హేమంత్ సోరెన్ ‘ఎక్స్’లో..‘ఇది చారిత్రక దినం..రాష్ట్ర ప్రజలు ఐకమత్యమే ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో తిరుగులేని తీర్పిచ్చారు. మా గొంతు నొక్కేందుకు వాళ్లు ప్రయత్నించిన ప్రతిసారీ ఉద్యమం మరింతగా తీవ్రతరమైంది. జార్ఖండ్ వాసులు ఎవరికీ తలొంచరు. తుది శ్వాస వరకు మా పోరాటం కొనసాగుతుంది’అని బీజేపీను ద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 81 సీట్లకు గాను జేఎంఎం సారథ్యంలోని కూటమి అత్యధికంగా 56 సీట్లను సొంతం చేసుకుంది. 43 స్థానాల్లో పోటీకి దిగిన జేఎంఎం మొదటిసారిగా ఏకంగా 34 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. #WATCH | JMM executive president Hemant Soren takes oath as the 14th Chief Minister of Jharkhand, in Ranchi.(Video: ANI/Jhargov TV) pic.twitter.com/30GxxK9CXe— ANI (@ANI) November 28, 2024 -
ఒక ప్రేయసి.. 50 ముక్కలు!
జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తనతో సహజీవనం చేస్తున్న యువతిని అతి కిరాతంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా.. మృతురాలి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని జిల్లాలోని జోర్దాగ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నరేష్ బెంగ్రా అనే యువకుడు గంగి కుమారి(24) అనే యువతితో గత రెండేళ్లుగా సహ జీవనంలో ఉన్నారు. వీరిద్దరూ తమిళనాడులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు.నరేష్ బెంగ్రా తన ప్రియురాలు గంగి కుమారికి తెలియకుండా ఖుంటిలో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఏమి తెలియనట్లు మళ్లీ తమిళనాడు వచ్చి గంగితో కలిసి జీవించేవాడు. ఇటీవల ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నవంబర్ 9న ఇద్దరు జార్ఖండ్‌లోని ఖుంటికి తిరిగి వచ్చారు. యువతిని తన ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శరీరాన్ని 50 ముక్కలుగా నరికి అడవిలోనే విసిరేశాడు.నవంబర 24న యువతి శరీరంలోని ఓ భాగాన్ని కుక్క తింటూ కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అటవీ ప్రాంతం నుంచి మరి కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవిలో గంగి వస్తువులు, ఆమె ఆధార్ కార్డు, ఫోటోతో సహా, ఆమె బ్యాగ్‌ని కూడా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు నరేశ్ బెంగ్రా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాధితురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని నరికివేసినట్లు అతను ఒప్పుకున్నాడు. -
నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్
-
రేపు జార్ఖండ్ లో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం
-
జార్ఖండ్‌లో భట్టి బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల నేప థ్యంలో ఏఐసీసీ పరిశీలకు ని హోదాలో రాంచీలో మ కాం వేసిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జార్ఖండ్ పీసీసీ కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. జేపీసీసీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేశ్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన భట్టి.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో పార్టీ వ్యూహాలను ఎమ్మెల్యేలకు వివరించారు.ఆ తర్వాత ఇండియా కూటమి ఎమ్మెల్యేలతో కలిసి జార్ఖండ్ గవర్నర్ సంతోశ్ గంగ్వార్‌ను కలిశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంఎల్ పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. కాగా, జార్ఖండ్ ఎన్నికల ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన భట్టి ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాల్లో కాంగ్రెస్ పక్షాన కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పనిచేయండి దేశాన్ని ఓ వికృత పార్టీ పాలిస్తోందని, ఆ పార్టీని కాదని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందున వారి కోసం కష్టపడి పనిచేయాలని జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భట్టి దిశానిర్దేశం చేశారు. రాంచీలోని హోటల్ చాణక్యలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడ కూర్చున్న వాళ్లు అదృష్టవంతులు. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్నారు. కానీ అందరికీ టికెట్లు దక్కలేదు. కాంగ్రెస్ పారీ్టలో పనిచేయడం అదృష్టం’ అని వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ పక్షాన కొత్త ఎమ్మెల్యేలను అభినందించిన భట్టి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రాష్ట్రానికి రావాలని కోరుతూ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు సాదర ఆహా్వనం పలికారు. ఈ సమావేశంలో జార్ఖండ్ పార్టీ ఇన్చార్జి సిరివెళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే !
-
అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
-
ఒకే ఒక్కడు హేమంత్
సాక్షి, నేషనల్ డెస్క్: హేమంత్ సోరెన్. జార్ఖండ్ అత్యంత యువ ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించిన గిరిజన నేత. ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతుండగానే ఎన్నో సవాళ్లు. భూవివాదంలో చిక్కుకుని ఈడీ అరెస్ట్‌తో జైలుపాలైనా, అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్ట మసకబారినా, వదిన సీత సోరెన్, అత్యంత ఆప్తుడైన నేత చంపయీ సోరెన్ పార్టీని వీడి తిరుగుబాటు జెండా ఎగరేసినా అన్నింటినీ తట్టుకుని సవాళ్లకు ఎదురొడ్డి జార్ఖండ్ శాసనసభ సమరంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)ను విజయతీరాలకు చేర్చి జార్ఖండ్ గిరిజన కోటపై తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకున్నారు. హేమంత్ సోరెన్ ఒక్కడే అంతా తానై, అన్నింటా ముందుండి నడిపించిన జేఎంఎం, కాంగ్రెస్ కూటమికి ఘన విజయం దక్కేలా చేసి తన రాజకీయపటిమను మరోసారి చాటిచెప్పారు. విపక్ష బీజేపీ కూటమి తరఫున ప్రధాని మోదీ మొదలు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ తదితరులు కాళ్లకు బలపం కట్టుకుని విస్తృతస్థాయి ప్రచారం చేసినా హేమంత్ సోరెన్ ప్రభ ముందు అదంతా కొట్టుకుపోయింది. జేఎంఎం మిత్రపక్షం కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ఖర్గే కొన్ని చోట్ల ప్రచారం చేసినా కూటమి తరఫున పూర్తి ప్రచార బాధ్యతల్ని హేమంత్ తన భుజస్కంధాలపై మోపి కూటమిని విజయశిఖరాలపై నిలిపారు. తన అరెస్ట్‌తో ఆదివాసీ సెంటిమెంట్‌ను తెరమీదకు తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు జేఎంఎం మాత్రమే పాటుపడగలదని ప్రచారంచేసి మెజారిటీ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. తండ్రి, జేఎంఎం దిగ్గజం శిబూసోరెన్ నుంచి రాజకీయ వారసత్వం పొందినా తొలినాళ్ల నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించి సిసలైన సీఎంగా పేరు తెచ్చుకున్నారు. 2009లో రాజ్యసభలో అడుగుపెట్టి.. మూడోసారి ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారైన హేమంత్ రాజకీయ ప్రస్థానం శాసనసభకు బదులు రాజ్యసభలో మొదలైంది. 2009లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే అనివార్యకారణాల వల్ల కొద్దికాలానికే రాజీనామాచేయాల్సి వచి్చంది. నాటి మిత్రపక్షంగా బీజేపీ సారథ్యంలోని అర్జున్‌ముండా ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రెండేళ్లకే ప్రభుత్వం కుప్పకూలడం రాష్ట్రపతిపాలన అమలుకావడంతో సోరెన్ జేఎంఎం పగ్గాలు చేపట్టారు. తర్వాత కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతులో 2013లో 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే ఏడాదికే పదవిని కోల్పోవాల్సి వచి్చంది. 2014లో అధికార పీఠాన్ని బీజేపీ హస్తగతంచేసుకోవడంతో సోరెన్ విపక్షనేత బాధ్యతలు నెత్తినేసుకున్నారు. మలుపుతిప్పిన 2016.. 2016లో నాటి బీజేపీ ప్రభుత్వం జార్ఖండ్‌లో గిరిజన అటవీ భూములను సులభంగా వ్యవసాయేతర అవసరాలకు బదలాయించేందుకు వీలుగా అత్యంత వివాదాస్పద ‘చోటానాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ 1908(సవరణ)ఆర్డినెన్స్, సంథాల్ పరగణ టెనెన్సీ యాక్ట్ 1949(సవరణ) ఆర్డినెన్స్‌లను తీసుకొచి్చంది. గిరిజనులు అధికంగా ఉండే రాష్ట్రంలో వారి భూములను ప్రభుత్వం అన్యాయంగా స్వా«దీనంచేసుకుని సొంత వ్యక్తులు, బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తోందని హేమంత్ సోరెన్ 2016లో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం లేవదీశారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం చేసిన ఈ ఉద్యమం విజయవంతమవడంతో సోరెన్ శక్తివంత గిరిజన నేతగా అవతరించారు. 2019లో కొనసాగిన హవా కాంగ్రెస్, ఆర్జేడీల మద్దతుతో 2019లో హేమంత్ మరోసారి సీఎం పదవిని నిలబెట్టుకున్నారు. 81 సీట్లున్న అసెంబ్లీలో జేఎంఎం పార్టీ ఒక్కటే ఏకంగా 30 సీట్లను కైవసం చేసుకోవడంలో హేమంత్ కృషి దాగిఉంది. అయితే 2023లో భూవివాదంలో మనీలాండరింగ్ జరిగిందంటూ హేమంత్‌ను అరెస్ట్‌చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కటకటాల వెనక్కి నెట్టింది. జనవరి 31న అరెస్ట్‌కు ముందు సీఎం పదవికి రాజీనామాచేసి పారీ్టలో అత్యంత నమ్మకస్తుడైన చంపయీ సోరెన్‌కు పగ్గాలు అప్పజెప్పి జైలుకెళ్లారు. జార్ఖండ్ హైకోర్టు జూన్‌లో బెయిల్ ఇవ్వడంతో మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే తనను అవమానకర రీతిలో సీఎం పదవి నుంచి కిందకు తోశారని చంపయీ సోరెన్, పారీ్టలో విలువ ఇవ్వట్లేరని వదిన సీతా సోరెన్ జేఎంఎంను వీడి హేమంత్‌కు తలనొప్పిగా మారారు. ప్రజలకు చేరువగా పథకాలు పలు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేసి ప్రజారంజక నేతగా హేమంత్ పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి మయ్యాన్ సమ్మాన్ యోజన ఆర్థిక ప్రయోజనం లబ్ధిని పెంచారు. 18–51 ఏళ్ల మహిళలకు ప్రతి నెలా రూ.1,000 ఆర్థికసాయం అందేలా చేశారు. దాదాపు 1.75 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేసి రైతన్నల మన్ననలు అందుకున్నారు. గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించారు. సహజవనరులతో తులతూగే జార్ఖండ్ నుంచి సహజసంపదను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యథేచ్ఛగా దోచేస్తోందని ప్రచారకార్యక్రమాల్లో ప్రధానంగా ప్రస్తావించి బీజేపీ పట్ల ఓటర్లలో ఆగ్రహం పెంచారు. బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించి మోదీ సర్కార్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1.36 లక్షల కోట్ల బకాయిలపై నిలదీసి గిరిజనులకు అండగా తానొక్కడినే ఉన్నానని ఓటర్ల మనసుల్లో ముద్రవేశారు. 2022లో సొంతంగా మైనింగ్ లీజుకు ఇచ్చుకున్నాడనే అపవాదుతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే ప్రమాదం నుంచి కాస్తలో తప్పించుకున్నారు. జార్ఖండ్ పేదలను మోదీ సర్కార్ తన స్వప్రయోజనాల కోసం నిమ్మకాయ పిండినట్లు పిండుతోందని హేమంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తెగ పాపులర్ అయ్యాయి. గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాలు, నమ్మకస్తులైన ఓటర్లు అంతా కలిసి హేమంత్‌కు మరోసారి ఘన విజయమాల వేశారు. -
కొంత మోదం.. కొంత ఖేదం
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టికి కొంత నిరాశం, కొంత ఉపశమనం కలిగించాయి. మహారాష్ట్రలో కూటమి పక్షాలతో కలిసి అధికార బీజేపీ కూటమికి ఓటమి రుచి చూపిద్దామన్న కసితో పనిచేసిన కాంగ్రెస్‌కు ఫలితాలు ఊహించని షాక్ ఇచ్ఛాయి. సీట్ల పంపకాల్లో తప్పిదాలు, ఓట్ల బదిలీ జరగకపోవడం, పార్టీ ఇచ్చిన గ్యారంటీలను ప్రజలు పెద్దగా నమ్మకపోవడం ఘోర పరాజయానికి దారితీశాయి. జార్ఖండ్‌లో మాత్రం తన బలాన్ని నిలుపుకోవడం, కూటమి పార్టితో కలిసి తిరిగి అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు ఊపిరినిచ్చింది. మహారాష్ట్రలో ఊహించని దెబ్బ ఆరు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ అద్భుత ప్రదర్శన కనబరించింది. మొత్తం 48 పార్లమెంట్ స్థానాలకు గానూ 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ 16.12 శాతం ఓట్లను రాబట్టుకొని 13 స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షాలైన శివసేన (ఉద్ధవ్) 9, ఎన్సీపీ(శరద్ పవార్) 8 స్థానాలు దక్కించుకున్నాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ కేవలం 15 సీట్లకే పరిమితమైంది. తన ఓట్ల శాతాన్ని సైతం కోల్పోయి కేవలం 12 శాతం ఓట్లకు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో 147 సీట్లలో పోటీ చేసి 44 సీట్లు రాబట్టుకున్న కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో 101 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ తన పేలవ ప్రదర్శనతో 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం తమకు బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఉన్న నియోజకవర్గాలను మిత్రపక్షాలకు వదిలేయడమేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీలో అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయావకాశాలను, సీట్లను తగ్గించేలా నియోజకవర్గాల ఎంపిక జరిగిందని ఆరోపించారు. దీనికి తోడు 75 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోటీపడ్డాయి. ఆయా స్థానాల్లో 65కి పైగా స్థానాలను బీజేపీ గెలుచుకుంది. హిందువుల ఓట్ల ప్రాబల్యంతోపాటు గరిష్ట సంఖ్యలో మరాఠాలు బీజేపీకి జైకొట్టడంతో కాంగ్రెస్‌కు పరాజయం ఎదరయ్యింది. జార్ఖండ్‌తో దక్కిన పరువు జార్ఖండ్‌లోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నెగ్గింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో 31 స్థానాల్లో పోటీచేసి 16 సీట్లు గెలిచిన ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 30 స్థానాల్లో పోటీచేసి 16 స్థానాలు దక్కించుకుంది. జేఎంఎం 41 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ నుంచి పూర్తి సహకారం అందడంతో జేఎంఎం గెలుచుకున్న స్థానాలు 30 నుంచి 34కి పెరిగాయి. పొత్తులపై ముందునుంచే అవగాహన ఉండడం, జార్ఖండ్‌లో రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించడం ఇండియా కూటమికి కలిసొచ్చింది. ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో 9 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ 2 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి సరైన మద్దతు లేకపోవడంతో మరో 2 స్థానాలు గెలిచే అవకాశమున్నా ఎస్పీ తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయింది. పశి్చమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన 6 స్థానాల్లోనూ మిత్రపక్షమైన తృణముల్ కాంగ్రెస్ గెలిచింది. ఈ ఎన్నికల్లో పొత్తు లేకపోవడంతో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఓటమి చవిచూసింది. పంజాబ్‌లోనూ నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టితో పొత్తు లేకపోవడంతో కాంగ్రెస్ ఒక స్థానంలో నెగ్గింది. మూడు స్థానాల్లో ఆప్ గెలుపొందింది. రాజస్తాన్‌లో 7 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించగా, బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆరింటిని గెలుచుకున్నాయి. కర్ణాటకలో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, అన్నింటినీ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మరోవైపు వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ విజయం పట్ల కాంగ్రెస్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, న్యూఢిల్లీ -
మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు: హరీష్ రావు
-
జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులు..
-
మహారాష్ట్ర ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ VS రియల్ ఫలితాలు
-
ఒకసారి ఇండియా కూటమి.. ఒకసారి NDA కూటమి
-
ఎగ్జిట్‌పోల్స్ తలకిందులు: జార్ఖండ్‌లో మళ్లీ ఇండియా కూటమినే!
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఫలితాల సరళి చూస్తుంటే అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి మెజార్టీకి మించిన ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతుండగా.. ఇటు జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా సాగుతోందిఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎమ్ఎల్) అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉన్నారు. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను(41) దాటి 50కి పైగా స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులు 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ బర్హైత్లో4,921 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఆయన సతీమణి గాండే అసెంబ్లీ స్థానం నుంచి 4,593 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. బీజేపీకి చెందిన మునియా దేవి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.జేఎంఎం నుంచి ఇటీవల బీజేపీలో చేరిన చంపై సోరెన్ సెరైకెలా స్థానం నుంచి వెరెకంజలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి జేఎంఎం అభ్యర్థి గణేష్ మహాలీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గతంలో నాలుగుసార్లు జేఎంఎం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు చంపైధన్మర్ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరండీ ఆధిక్యంలో ఉన్నారు.బీజేపీకి చెందిన సీతా సోరెన్ జమ్తారాలో వెనుకంజలో ఉన్నారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ అన్సారీ 4 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని మెజార్టీ సర్వేలు ప్రకటించాయి. ఎన్డీఏ కూటమి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెఎస్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండగా.. ఎన్డీయేలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ , జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఉన్నాయి.చదవండి: ‘ఎన్డీయే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది’: మహా ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలుజార్ఖండ్లో అధికార మార్పిడి ఖాయమని వెల్లడించాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి భంగపాటు తప్పదని అంచనా వేశాయి. కానీ నేడు వెలువడుతున్న అధికారిక ఫలితాలతో గ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.కాగా రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 41. అధికార పక్షం.. జేఎంఎం 41, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి.. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి. -
బీజేపీ జోష్
-
ఉత్కంఠ రేపుతున్న ప్రజాతీర్పు..
-
Watch Live: మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలపై ఉత్కంఠ
-
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. వయనాడ్‌లో తేలనున్న ప్రియాంక గాంధీ భవితవ్యం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కాసేపట్లో ప్రారంభం కానున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ
-
ఎన్డీఏ వైపే సర్వేలు.. మహారాష్ట్ర, జార్ఖండ్ లో NDA కూటమిదే పైచేయి
-
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ .. ఎవరి సత్తా ఎంతంటే?
సాక్షి,ఢిల్లీ: మహరాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయ్. ఫలితాల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అయితే, రెండు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇండియా కూటమి తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ అంచనాలను తలకిందులు చేస్తూ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని వెల్లడించాయి. ఇక, సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర (పీపుల్స్‌పల్స్)బీజేపీ 182, కాంగ్రెస్ 97,ఇతరులు 9 మహరాష్ట్ర (ఏబీపీ) : బీజేపీ 150-170 కాంగ్రెస్ 110-130ఇతరులు 8-10 ఝార్ఖండ్ (పీపుల్స్ పల్స్) ఎన్డీయే-46-58జేఎంఎం కూటమి 24-37 ఇతరులు 6-10 చాణక్య (మహారాష్ట్ర)ఎన్డీఏ 152-160ఇండియా 130-138చాణక్య(ఝార్ఖండ్) ఎన్డీఏ 45-50జేఎంఎం 35-38ఏబీపీ(మహారాష్ట్ర)ఎన్డీఏ 150-170ఎంవీఏ 110-130ఇతరులు 6-8కాగా, మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగ్గా. 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 288 స్థానాల్లో బీజేపీ 149 స్థానాలు, శివసేన షిండే వర్గం 81 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ 101 సీట్లు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 95 సీట్లు, ఎన్సీపీ శరద్‌పవార్ 86 సీట్లలో తలపడుతున్నారు.ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 30 సీట్లలో, జేఎంఎం 42, ఆర్జేడీ 6, సీపీఐఎంఎల్ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమి 81 సీట్లలో తలపడుతోంది. ఈ నెల 23న ఫలితాలు విడుదల కానున్నాయి.
/telugu-news/national/liveblog/jharkhand-election-2024-phase-2-polling-live-updates-2261099
-
Jharkhand Election 2024: ముగిసిన పోలింగ్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. రెండో విడతలో భాగంగా 38 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. -
ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత ఆ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో విమానాన్ని విమానాశ్రయంలోనే ఉంచారు. విమానంలో సమస్యను చక్కదిద్దేందుకు నిపుణులు పనిచేస్తున్నారు. ఈ లోపు మోదీ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని డియోఘర్‌కు పంపారు. దీంతో మోదీ ఢిల్లీ తిరుగు ప్రయాణం ఆలస్యం కానుంది.జార్ఖండ్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి (జనజాతీయ గౌరవ్ దివస్) కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం డియోఘర్ పట్టణానికి వచ్చారు. అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ అక్కడ ప్రచారాన్ని కూడా నిర్వహించారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. కాగా నవంబర్ 20వ తేదీన జార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉంది.మరోవైపు డియోఘర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో గొడ్డాలో రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమంతి ఆలస్యమైంది. దీంతో క్లియరెన్స్ కోసం 45 నిమిషాలు గ్రౌండ్పైనే ఉండిపోయింది. అయితే ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నాయకుడి ప్రచార షెడ్యూల్‌కు అంతరాయం కలిగించారని కాంగ్రెస్ ఆరోపించింది. -
రాహుల్ హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి నిరాకరణ.. గంటపాటు ఆలస్యం
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి శుక్రవారం అనుకోని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు ఏటీసీ నుంచి ఆనుమతి రాకపోవడంతో టేకాఫ్‌కు గంటకు పైగా ఆలస్యం అయ్యింది. దీంతో రాహుల్ చాలాసేపు హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గొడ్డాలో ప్రచారానికి వెళ్లారు కాంగ్రెస్ నేత. అక్కడ బహిరంగ ర్యాలీలో ప్రసంగించడం ముగిసిన తర్వాత ఆయన ప్రచారం కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదు. భద్రతా కారణాల పేరుతో క్లియరెన్స్ ఆలస్యంగా లభించింది. ఈ సమస్యతో 75 నిమిషాలపాటు రాహుల్ హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది. హెలికాప్టర్ టేకాఫ్‌కు ఆలస్యం అవడంతో రాహుల్ ప్రయాణ షెడ్యూల్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది.HUGE BREAKING 🚨⚡LoP Rahul Gandhi’s helicopter denied permission from flying in JharkhandIt’s been more than 2 hours but no permission granted yet 🚨Why is Modi & BJP so scared? pic.twitter.com/WJltLvaB5p— Ankit Mayank (@mr_mayank) November 15, 2024హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి ఆలస్యంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రాజకీయంగా ప్రేరేపితమైనదని మండిపడింది. ఇది బీజేపీ పన్నిన కుట్రేనని ఆరోపించింది. తమ ప్రచారాలను అణగదొక్కే ప్రయత్నమని పేర్కొంది. ‘రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేయడానికి చేసిన ప్రయత్నమే.. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు.మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), స్థానిక అధికారులు కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, అదనపు భద్రతా తనిఖీలు, ఎయిర్‌స్పేస్ మేనేజ్మెంట్ ఆందోళనలు హోల్డ్అప్కు కారణమై ఉండవచ్చని సమాచారం. -
ప్రశాంతంగా ముగిసిన ఝార్కండ్ తొలి విడత ఎన్నికలు
-
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై రాహుల్ గాంధీకి అమిత్ షా వార్నింగ్
రాంచీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపించి అవమానించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుక కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ ఎప్పటికీ అనుమతించదని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా.. పాలమూలో నిర్వహించిన సభలో మాట్లాడారు.‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపించారు. ఆయన చూపించిన రాజ్యాంగం కాపీ కవర్‌పై భారత రాజ్యాంగం అని వ్రాసి ఉంది. అందులో ఏ కంటెంట్ లేదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. నకిలీ రాజ్యాంగ కాపీతో బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారు. నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుంచి రిజర్వేషన్లను లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఆ రిజర్వెషన్లనుమైనారిటీలకు ఇవ్వాలని యోచిస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో.. మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ ఎన్నటికీ అనుమతించదు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాంగ్రెస్ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాదని నేను రాహుల్ గాంధీని హెచ్చరిస్తున్నా. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది. ఇక.. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తాం’ అని అన్నారు.ఇక.. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి.చదవండి: దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి -
జార్ఖండ్: జేఎంఎం కూటమీ మేనిఫెస్టో.. ఎన్ని హామీలంటే?
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏడు హామీలు పొందుపర్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మేం మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ప్రాధాన్యతాపరంగా ఈ 7 హామీలను అమలు చేస్తాం. ఇవాళ మహాఘటబంధన్ నాయకులందరూ సమావేశమై.. ఈ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకువచ్చాం’ అని అన్నారు.జేఎంఎం నేతృత్వంలోని కూటమి.. జార్ఖండ్ పౌరులకు ఇచ్చిన ఏడు హామీలు ఇవే..1. 1932 నాటి ఖతియాన్ విధానాన్ని ఆధారంగా సర్నా మత నియమావళి అమలు చేయటం.2. డిసెంబర్ 2024 నుంచి మైయా సమ్మాన్ పథకం కింద రూ.2,500 అందించడం.3. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ కోసం వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయటం.4. ఒక్కో కుటుంబానికి రూ.450 చొప్పున ఎల్పీజీ సిలిండర్లు, ఒక్కో వ్యక్తికి రేషన్ పరిమాణాన్ని 7 కిలోలకు పెంచటం.5. 10 లక్షల మంది యువకులకు ఉపాధి, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య భృతి కల్పించటం.6. ప్రతి బ్లాక్‌లో డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు. ప్రతి జిల్లాలో 500 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటం.7. బియ్యం ఎంఎస్పీ రూ.2,400 నుంచి రూ.3,200కి పెంచడంతో పాటు ఇతర పంటల రేట్లను 50 శాతానికి పెంపుఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయం
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్‌లో జరగ నున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయమని ఉపముఖ్యమంత్రి, జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జి, స్టార్ క్యాంపెయినర్ మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించుకోవాలనే ఉత్సాహం అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ కేడర్‌లోనూ కనిపిస్తోందన్నారు. ఎన్నికల ఇన్చార్జిగా జార్ఖండ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన భట్టి శుక్రవారం రాంచీలో జరిగిన రాష్ట్ర పీసీసీ నేతలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీల సమావేశానికి హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ...అసెంబ్లీ ఇన్చార్జీలు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ నేతలెవరూ ఎన్నికలు పూర్తయ్యేవరకు తమకు కేటాయించిన నియోజకవర్గాలను వదిలిపెట్టవద్దని సూచించారు. కూటమిలో అసంతృప్తితో ఉన్న నేతలతో చర్చించి వారు ప్రచారంలో పాల్గొనేలా చేయాలన్నారు. ప్రచారాన్ని నిర్వహించాలని, సోషల్‌మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అసెంబ్లీ ఎన్ని కల్లో అనుసరించాల్సిన వ్యూహం, మేనిఫెస్టో తయారీపై అభిప్రాయాలను తెలిపారు. సమావేశంలో కేసీ వేణుగో పాల్, కేశవ్మహతో కమలేశ్, గులాం అహ్మద్ మీర్‌సాబ్, బి.కె.హరి ప్రసాద్, రామేశ్వరరావు పాల్గొన్నారు. -
జార్ఖండ్ ఎన్నికలు: 32 సీట్లలో ‘లేడీస్ ఫస్ట్’
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అంతకంతకూ ఆసక్తిరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్యనే ఉంది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఈసారి మహిళలే కీలకం కానున్నారు. ఓటర్ల జాబితా లెక్కలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా మారనుంది. ఈ 32 స్థానాల్లో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. జార్ఖండ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.60 కోట్లు. వీరిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న స్థానాలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి. మహిళల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుత హేమంత్ సోరెన్ ప్రభుత్వం మహిళల కోసం ‘మయ్యా సమ్మాన్ యోజన’ను అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 50 లక్షల మందికి పైగా మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తున్నారు. మరోమారు తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని నెలకు రూ.2500కు పెంచుతామని ఇటీవల సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు.ఎన్డీఏలో మొత్తం 14 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉండగా ఏజేఎస్‌యూలో ఇద్దరు మహిళా అభ్యర్థులు టిక్కెట్లు దక్కించుకున్నారు. ఇండియా కూటమిలో మొత్తం 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.ఇది కూడా చదవండి: స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి -
లిక్కర్ స్కామ్: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ:లిక్కర్ స్కామ్‌లో ఛత్తీస్‌గఢ్,జార్ఖండ్‌లలోని మొత్తం 17 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఏకకాలంలో సోదాలు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ చౌబే,ఎక్సైజ్ ఉన్నతాధికారి గజేంద్రసింగ్ నివాసాలు, స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల్లో ఈడీ మంగళవారం(అక్టోబర్ 29) తనిఖీలు నిర్వహించింది.ఐఏఎస్ అధికారులతో కలిపి మొత్తం ఏడుగురితో కూడిన సిండికేట్‌పై ఛత్తీస్‌గఢ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో లిక్కర్‌స్కామ్‌కు పాల్పడడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సిండికేట్ భారీగా గండికొట్టిందన్న ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో మనీలాండరంగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు తాజాగా ఈడీ రంగలోకి దిగింది. ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం.. ఏం జరిగిందంటే.. -
Jharkhand Election: రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
రాంచీ: త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో పోటీచేయబోయే తమ అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలోని వివరాల ప్రకారం ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్‌పై బార్హెట్ స్థానం నుండి గమ్లియాల్ హెంబ్రోమ్ పోటీకి దిగారు.హెంబ్రోమ్ 2019లో బార్హెత్ నుంచి ఏజేఎస్‌యూ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి 2,573 ఓట్లను పొందారు. తుండి స్థానం నుంచి వికాస్ మహతో అభ్యర్థిత్వాన్ని బీజేపీ ప్రకటించింది. నవంబర్ 13, 20 తేదీల్లో జార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫలితాలు నవంబర్ 23న విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సాహిబ్‌గంజ్ జిల్లాలోని బర్హెట్ (ఎస్జీ)నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన సైమన్ మాల్టోపై 25,740 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఇటీవల బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అందులో 66 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీని ధన్వార్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ పెద్ద కోడలు, బీజేపీ మహిళా నేత సీతా సోరెన్‌ను పార్టీ జమ్తారా నుంచి పోటీకి దింపింది. జంషెడ్పూర్ తూర్పు నుంచి మాజీ సీఎం, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ సాహుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఇది కూడా చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు -
దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ
రాంచీ: జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. నవంబర్ ఒకటి నుంచి నవంబర్ 10 వరకు ఎన్నికల ర్యాలీల కోసం ప్రధాని నరేంద్ర మోదీతో సహా స్టార్ క్యాంపెయినర్లు సమయం కేటాయించాలని పార్టీ కోరింది.మీడియాకు అందిన తాజా సమాచారం ప్రకారం జార్ఖండ్‌లో దీపావళి తర్వాత బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఎన్నికల ర్యాలీలు జరగనున్నాయి. ప్రధానమంత్రి ఆరు ఎన్నికల ర్యాలీలలో పాల్గొనేలా బీజేపీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పార్టీలోని ఆరు సంస్థాగత విభాగాల్లోనూ ప్రధాని ఎన్నికల సభను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండు ర్యాలీలు నిర్వహించారు.గడచిన నవంబర్ 15న జంషెడ్‌పూర్‌లో ప్రధాని మోదీ తన మొదటి ర్యాలీ నిర్వహించారు. రెండో ర్యాలీ అక్టోబర్ 2న హజారీబాగ్‌లో జరిగింది. బీజేపీ పరివర్తన్ యాత్రను ఆయన రాష్ట్రంలో ముగించారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా సాహిబ్‌గంజ్, గిరిడిహ్లలో ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగం, అవినీతి, బంగ్లాదేశ్ చొరబాట్లు వంటి వివిధ సమస్యలు ప్రధాని మోదీ, అమిత్ షాల ప్రచారాస్త్రాలుగా ఉండనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతోపాటు పేపర్ లీక్ ఉదంతం కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానాశం కానుంది.ఇది కూడా చదవండి: బ్రెయిన్ స్ట్రోక్: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్..! -
జార్ఖండ్ ఎన్నికల్లో విచిత్రం.. సక్సెస్ @ 60
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు యువ నాయకత్వానికి ఝలక్ ఇస్తూ, అనుభవజ్ఞులకు మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన గణాకాంలను పరిశీలిస్తే, పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.2005 ఎన్నికల్లో రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన 18 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, వీరిలో ఐదుగురు విజయం సాధించారు. గెలుపొందిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో కడియా ముండా, ఇందర్ సింగ్ నామ్ధారి లోక్‌నాథ్ మహతో తదితరులు ఉన్నారు. నాటి ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన రాజేంద్ర ప్రసాద్ సింగ్, యమునా సింగ్, సమరేష్ సింగ్ (ముగ్గురూ మరణించారు) ఓడిపోయారు. 2005 ఎన్నికలలో కడియా ముండా, హరు రాజ్‌వర్‌లు 68 ఏళ్లు దాటిన అభ్యర్థులు వీరిద్దరూ ఎన్నికల్లో గెలిచారు. అయితే అత్యంత వృద్ధ అభ్యర్థి డాక్టర్ విశేశ్వర్ ఖాన్ (83) నాటి ఎన్నికల్లో ఓడిపోయారు.2009 ఎన్నికల్లో కూడా రాష్ట్ర ఓటర్లు అనుభవజ్ఞులపై నమ్మకం వ్యక్తం చేశారు. 2005తో పోలిస్తే జార్ఖండ్ అసెంబ్లీలో 60 ఏళ్లు పైబడిన నేతల సంఖ్య పెరిగింది. 2005లో ఈ సంఖ్య ఐదు కాగా, 2009లో ఎనిమిదికి పెరిగింది. ఈ ఎన్నికల్లో రాజేంద్ర సింగ్, సమేష్ సింగ్‌లు తిరిగి ఎన్నికల్లో పోటీచేశారు. రాజేంద్ర సింగ్ బెర్మో నుంచి, సమరేష్ సింగ్ బొకారో నుంచి గెలుపొందారు. అలాగే మాజీ స్పీకర్ ఇందర్ సింగ్ నామ్ధారి 2007లో తన 63 ఏళ్ల వయసులో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో ఛత్ర ఎంపీ అయ్యారు. ఎన్నికల్లో గెలిచిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో సైమన్ మరాండి (61), నలిన్ సోరెన్ (61), ఫూల్‌చంద్ మండల్ (66), మన్నన్ మల్లిక్ (64), సవన లక్రా (69), చంద్రశేఖర్ దూబే అలియాస్ దాదాయ్ దూబే (66) తదితరులు ఉన్నారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక వయసు కలిగిన అభ్యర్థి ఫూల్‌చంద్ మండల్ (71 సంవత్సరాలు)విజయం సాధించారు. 60 ఏళ్లు పైబడిన అభ్యర్థులు సరయూ రాయ్ (63), రామచంద్ర చంద్రవంశీ (68), రాజ్ కిషోర్ మహతో (68), యోగేశ్వర్ మహతో (60), అలంగీర్ ఆలం (60), స్టీఫెన్ మరాండి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన 20 మంది ప్రధాన అభ్యర్థులు ఉండగా, వారిలో 10 ఎన్నికల్లో విజయం సాధించగా, 10 ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో హాజీ హుస్సేన్ అన్సారీ (66), లాల్ చంద్ మహతో (62), మాధవ్ లాల్ సింగ్ (62), రాజేంద్ర ప్రసాద్ సింగ్ (68), సమరేష్ సింగ్ (73) తదితరులు ఉన్నారు.2019లో 60 ఏళ్లు పైబడిన 27 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో 17 మంది విజేతలుగా నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన ప్రముఖులలో రాజేంద్ర ప్రసాద్ సింగ్ (73), రామచంద్ర చంద్రవంశీ (72), డాక్టర్ రామేశ్వర్ ఓరాన్ (72), నలిన్ సోరెన్ (71), హాజీ హుస్సేన్ అన్సారీ (70), అలంగీర్ ఆలం (69), సరయూ రాయ్ (68), లోబిన్ హెంబ్రామ్ (68), డాక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ (66), స్టీఫెన్ మరాండి (66), చంపై సోరెన్ (63), సిపి సింగ్ (63), ఉమాశంకర్ అకెలా (61), బాబులాల్ మరాండి (61), డా. రవీంద్ర నాథ్ మహతో (60) మరియు కమలేష్ కుమార్ సింగ్ (60) ఉన్నారు.ఇది కూడా చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు..ఎంతంటే.. -
మధుకోడాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో తనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని మధుకోడా సుప్రీం తలుపు తట్టారు. స్టే ఇస్తే తాను ప్రస్తుతం జరుగుతున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హున్నవుతానని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.కోడా పిటిషన్‌ను శుక్రవారం(అక్టోబర్ 25) విచారించిన జస్టిస్ సంజీవ్కన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కోడాకు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. గతంలో తాము బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ విషయంలో ఇచ్చిన ఊరట మధుకోడాకు ఇవ్వలేమని తెలిపింది. అన్సారీ సిట్టింగ్ ఎంపీ అయినందువల్లే ఆయనకు పడిన శిక్షపై స్టే ఇచ్చామని పేర్కొంది. ఇవే తరహా స్టేలు రొటీన్‌గా ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో మధుకోడాకు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఛాన్స్ లేకుండాపోయింది. కాగా, ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండు అంతకంటే ఎక్కువ ఏళ్లు శిక్ష పడిన ప్రజాప్రతినిధుల చట్టసభ సభ్యత్వాలు రద్దవడంతో పాటు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరేళ్ల దాకా మళ్లీ ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోతారు.ఇదీ చదవండి: వయనాడ్‌లో ఖర్గేకు అవమానం నిజమేనా.. -
జార్ఖండ్‌లో హోరాహోరీ
గిరిజన రాష్ట్రం జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్టకు చేరుతోంది. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణం ప్రయతి్నస్తోంది. ఆ కూటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి జార్ఖండ్‌లో కాషాయ జెండా ఎగరేసేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు ఇతర నేతల అవినీతినే ప్రధాన ఎజెండాగా మలచుకుని ప్రజల్లోకి వెళ్తోంది. అయితే పుంఖానుపుంఖాలుగా ప్రకటించిన సంక్షేమ పథకాలే తమను మరోసారి గట్టెక్కిస్తాయని అ«ధికార కూటమి విశ్వసిస్తోంది. రాష్ట్రంలో నవంబర్ 13, 20ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు 23న వెల్లడవుతాయి. ఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో జార్ఖండ్‌లో విజయం కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో జేఎంఎం–కాంగ్రెస్, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటముల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే... బీజేపీ దూకుడు మంత్రం దూకుడైన ప్రచారమే మంత్రంగా జార్ఖండ్ ప్రచార పర్వంలో బీజేపీ దూసుకెళ్తోంది. ఎప్పట్లాగే ప్రధాని మోదీ కరిజ్మాపైనే పార్టీ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తదితర నేతలు కూడా రాష్ట్రంలో కాలికి బలపం పట్టుకుని తిరుగుతున్నారు. పలు అంశాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధిస్తూ ప్రజలను ఆలోచింపజేయడమే గాక అధికార కూటమిని ఇరుకున పెట్టేందుకు ప్రయతి్నస్తున్నారు. 2014లో బీజేపీ 31.8 శాతం ఓట్లతో 37 అసెంబ్లీ స్థానాలు ఒడిసిపట్టి విజయం సాధించింది. 2019లో ఓట్ల శాతం 33.8కి పెరిగినా 25 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎక్కడా చిన్న అవకాశం కూడా వదలరాదని పార్టీ అధిష్టానం పట్టుదలగా ఉంది. ⇒ బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్‌లోకి చొరబాట్లపై బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. వారివల్ల స్థానికుల అవకాశాలన్నింటికీ భారీగా గండి పడుతుందని జోరుగా ప్రచారం చేస్తోంది. ⇒ సీఎం హేమంత్‌తో పాటు జేఎంఎం, కాంగ్రెస్ నేతల్లో పలువురిపై ఈడీ, సీబీఐ దాడులను ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తోంది. ⇒ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు భద్రత లేదని ఆరోపిస్తోంది. ⇒ మోదీ సర్కారు అభివృద్ధి నినాదాన్ని వల్లెవేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేతలు ప్రచారం చేస్తున్నారు. ⇒ గత కొద్ది నెలల్లో జార్ఖండ్‌లో వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పార్టీలో వలసల జోష్: గిరిజనుల్లో గట్టి ఆదరణ ఉన్న మాజీ సీఎం చంపయ్ సోరెన్ జేఎంఎంను వీడి బీజేపీలో చేరడం కమలనాథులకు మరింత ఊపునిచి్చంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏకైక ఎంపీ గీతా కోరా కూడా అదే బాట పట్టారు. అంతేగాక సీతా సోరెన్, అమిత్ కుమార్ యాదవ్, కమలేశ్ సింగ్ రూపంలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ జేఎంఎం సంక్షేమ మంత్రంఅధికార జేంఎంఎ, కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు తెర తీసింది. ⇒ మయ్యా సమ్మాన్ యోజన పేరిట 18–50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఏటా నేరుగా రూ.12 వేల నుంచి రూ.30 వేల దాకా ఆర్థిక సాయం అందిస్తోంది. ⇒ ఆప్కీ యోజనా, ఆప్కీ సర్కార్, ఆప్కే ద్వార్, అబువా ఆవాస్, సార్వత్రిక పెన్షన్‌కు తోడు ఆహార భద్రత, క్రీడలు–విద్యా పథకాలను అమలు చేస్తోంది. ⇒ గిరిజన సెంటిమెంట్‌కు ఇవన్నీ తోడై తమను మరోసారి విజయ తీరాలకు చేరుస్తాయని నమ్ముతోంది. కల్పన ఫ్యాక్టర్ సీఎం హేమంత్ సోరెన్ కల్పన ప్రచార సభలకు లభిస్తున్న భారీ ఆదరణ కమలనాథుల్లో గుబులు రేపుతోంది. భర్తపై బీజేపీ చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆమె గట్టిగా తిప్పికొడుతున్నారు. ఇటీవల జేఎంఎంలో చేరి ఉప ఎన్నికలో గండే అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజారిటీతో నెగ్గడం అధికార కూటమిలో జోష్ పెంచింది.గిరిజన సీట్లే నిర్ణాయకంజార్ఖండ్లో ఏకంగా 28 ఎస్టీ రిజర్వుడు స్థానాలున్నాయి. మొత్తం సీట్లలో ఇవి మూడో వంతు కంటే అధికం! అధికార, విపక్ష కూటముల భాగ్యరేఖలను ఇవే నిర్దేశించనున్నాయి. ⇒ ఈ నేపథ్యంలో గిరిజనుడైన తనను మోదీ ప్రభుత్వం వేధిస్తోందంటూ హేమంత్ చేస్తున్న ప్రచారం ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనన్న భయాందోళనలు బీజేపీలో లేకపోలేదు. ⇒ అధికార కూటమి గిరిజన సెంటిమెంట్‌ను గట్టిగా నమ్ముకుంది. ⇒ గిరిజనులు పాటించే సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ జేఎంఎం, కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఇరు కూటముల్లోనూ లుకలుకలు అధికార, విపక్ష కూటములు రెండూ ఇంటి పోరుతో సతమతమవుతుండటం విశేషం. ముఖ్యంగా బీజేపీని నేతల విభేదాలు బాగా కలవరపెడుతున్నాయి. ముఖ్య నేతల మధ్య సమన్వయం బాగా కొరవడిందంటూ వార్తలు వస్తున్నాయి. అధికార కూటమిలోనూ లుకలుకలు లేకపోలేదు. పలువురు కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేల సిగపట్ల వివాదం ఎన్నోసార్లు హస్తిన దాకా వెళ్లింది. చాలా అసెంబ్లీ స్థానాల్లో సమన్వయంతో కలిసి పని చేసేందుకు కూడా ఇష్టపడనంతగా ఇరు పార్టీల ముఖ్య నేతల మధ్య విభేదాలు పొడసూపాయి. -
Jharkhand Elections: నేడు రాహుల్ జార్ఖండ్ రాక.. 20న అభ్యర్థుల ఎంపికపై చర్చ
రాంచీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు (శనివారం) జార్ఖండ్ రానున్నారు. రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో ఆయన పాల్గొని, 500 మందికి పైగా ప్రతినిధులతో ఆయన సంభాషించనున్నారు.రాహుల్ గాంధీ తన జార్ఖండ్ పర్యటనలో పార్టీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లాక అక్టోబర్ 20న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జార్ఖండ్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. అదే రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. కాగా రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. అభ్యర్థుల పేర్లపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ఇన్చార్జి గులాం అహ్మద్ మీర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి గులాం అహ్మద్ మీర్ మీడియాకు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కొనసాగుతుందన్నారు. సీట్ల పంపకానికి సంబంధించి మూడు దఫాలుగా చర్చించామని, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో కూడా చర్చలు జరిగాయన్నారు.ఇది కూడా చదవండి: మియాపూర్: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’ -
మోగిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా... షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే
-
ఆ రెండు రాష్ట్రాల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తాం: జేపీ నడ్డా
సిమ్లా: రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జోస్యం చెప్పారు. ఇవాళ (శుక్రవారం) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని నైనా దేవి ఆలయంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. హర్యానా తరహాలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుంది. నేడు తీవ్రవాదం అదుపులో ఉంది. బీజేపీ పాలన కేవలం అధికారంలో రావటామే కాదు. దేశాన్ని సురక్షితంగా ఉంచేలా చూస్తుంది. ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులపై ఇది యుద్ధం సమయం కాదు. అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. అందరూ కలిసికట్టుగా నడుచుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు.హర్యానాలో అధికారాన్ని నిలుపుకోవడానికి.. కాంగ్రెస్ కుట్రలు ఎదుర్కొని మరీ బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక.. జమ్ము కశ్మీర్లో 90 సీట్లకు గాను 29 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీ చెప్పుకోదగ్గ మెరుగైన ఫలితాలు రాబట్టింది. బీజేపీ హయాంలో హిమాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి పనులు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేశాం. బీజేపీ అంటే అభివృద్ధి అని చూపించాం. విభజించి పాలించు, ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పర్యాయపదం. ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.आज मुझे शारदीय नवरात्रों में नवमी के दिन मां नैना देवी का आशीर्वाद लेने का सौभाग्य प्राप्त हुआ।हम सब लोग माता के आशीर्वाद से प्रधानमंत्री मोदी जी के विकसित भारत के सपने को पूरा करने में अपनी पूरी ऊर्जा के साथ कार्य करेंगे।- श्री @JPNadda pic.twitter.com/LE0avEBDsm— BJP (@BJP4India) October 11, 2024 -
జార్ఖండ్‌లో ఎన్ఆర్సీ అమలు చేస్తాం: కేంద్ర మంత్రి
రాంచి: తాము జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం చొరబాటుదారులుకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. ఈ ఎన్నికలు ఒకరిని ముఖ్యమంత్రిగా చేయటం లేదా అధికారాన్ని అప్పగించటం మాత్రమే కాదు. ఇది జార్ఖండ్‌ను రక్షించడం గురించి జరిగే ఎన్నికలు. రోటీ, మతీ, భేటీ రక్షిండానికి బీజేపీ నిశ్చయించుకుంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల కారణంగా ఈ ప్రాంతం జనాభా వేగంగా మారుతోంది. దీంతో సంతాల్ ప్రాంతంలోని గిరిజన జనాభా ఇప్పుడు 28 శాతానికి తగ్గింది...ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చొరబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు అనుకూలంగా ఉంది. మేము అధికారంలోకి వస్తే.. జార్ఖండ్‌లో ఎన్ఆర్సీని అమలు చేస్తాం. దీనిలో స్థానిక నివాసితులను నమోదు చేస్తారు. చొరబాటుదారులను ఎంపిక చేసి బయటకు పంపుతారు’’ అని అన్నారు.జార్ఖండ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అక్టోబరు 5న యువత, మహిళల కోసం ‘పాంచ్ ప్రాణ’ను విడుదల చేసిందని తెలిపారు. బీజేపీ.. యువ సతి, గోగో దీదీ యోజన, ఘర్ సాకార్, లక్ష్మీ జోహార్ , ఉపాధి కల్పిస్తామని హామీ వంటి ఐదు వాగ్దానాలు ప్రకటించిందని పేర్కొన్నారు. ఇక.. ప్రస్తుత ఉన్న హేమంత్ సోరెన్ ప్రభుత్వ పదవీకాలం 2025 జనవరిలో ముగియనుంది. 81 సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి డిసెంబర్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 30 సీట్లు, బీజేపీ 25 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.ఎన్ఆర్సీ అంటే..అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. అయితే.. దీనిపైనా వివాదం కొనసాగుతోంది.చదవండి: సీఎం యోగి వార్నింగ్.. ‘ వివాదాస్పద వ్యాఖ్యలకు శిక్ష తప్పదు’ -
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఆస్పత్రిలో చేరారు. బ్లడ్ షుగర్‌కు సంబంధించిన సమస్యల కారణంగా చంపయ్ ఆసుపత్రిలో చేరినట్లు ఆదివారం ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ ఆసుపత్రిలో చేరారు.स्वास्थ्य संबंधित परेशानियों की वजह से आज वीर भूमि भोगनाडीह में आयोजित "मांझी परगना महासम्मेलन" में वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से शामिल रहूंगा।डॉक्टरों के अनुसार चिंता की कोई खास बात नहीं है। मैं शीघ्र पुर्णतः स्वस्थ होकर, आप सभी के बीच वापस आऊंगा। जोहार ! pic.twitter.com/rUrCzCd7lK— Champai Soren (@ChampaiSoren) October 6, 2024‘‘చంపయ్ రక్తంలో చక్కెర స్థాయి తగ్గింది.దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చంపయ్ పరిస్థితి మెరుగుపడుతోంది’ అని టాటా మెయిన్ హాస్పిటల్ జీఎం డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు.ఆగస్టు 30న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో చంపయ్ సోరెన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. చంపయ్ సీఎంగా ఫిబ్రవరి 2న ప్రమాణం చేశారు. హేమంత్ బెయిల్‌పై విడుదలైన తర్వాత చంపయ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జూలైలో హేమంత్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి నుంచి చంపయ్ సోరెన్ జేఎంఎం పార్టీకి దూరంగా ఉండి.. అనంతరం బీజేపీలో చేరారు.చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత -
రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు.. దూరంగా ఎగిరిపడిన ట్రాక్
రాంచీ: జార్ఖండ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు రైల్వే ట్రాక్‌పై బాంబు అమర్చారు. ఈ క్రమంలో బాంబు పేలడంతో పేలుడు ధాటికి రైల్వే ట్రాక్ 40 అడుగుల దూరంలో ఎగిరిపడింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లా రంగగుట్టు జిల్లాలో రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ట్రాక్‌పై పేలుడు పదార్ధాలు అమర్చాడు. దీంతో, పేలుడు సంభవించడంతో ట్రాక్ దాదాపు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రైల్వే అధికారులు చేరుకున్నారు. అయితే, ఈ ట్రాక్ ఎన్టీపీసీ నుంచి బొగ్గును తరలించే గూడ్స్ రైలుకు సంబంధించిందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లు కనుక ప్రయాణం చేసి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. झारखंड में रेलवे ट्रैक को बम से उड़ा दिया..झारखंड के साहिबगंज में बदमाशों ने विस्फोटक लगाकर रेलवे ट्रैक उड़ा दिया है. हादसे के बाद रेल मार्ग पर रेल सेवा बाधित.#IndianRailways #Jharkhand pic.twitter.com/Yenx6C92EB— Pankaj Tiwari । पंकज तिवारी (@pankaj_cktd) October 2, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. కొందరు ఆకతాయిలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం కొందరు రైల్వే ట్రాకులపై గ్యాస్ సిలిండర్లు, ఇనుప కడ్డీలు పెట్టిన వీడియోలు బయటకు వచ్చాయి. మరికొందరు ఏకంగా ట్రాక్‌లకు ఉన్న జాయింట్స్‌ను తొలగించారు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న రైల్వే అధికారులు పలుచోట్ల ఆకతాయిలను అరెస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు -
తెరుచుకున్న జార్ఖండ్- బెంగాల్ సరిహద్దు
కోల్‌కతా/రాంచీ: పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దు దాదాపు 24 గంటల తరువాత తెరుచుకుంది. అంతర్రాష్ట్ర వాణిజ్యం కోసం ట్రక్కుల తరలింపును ఉద్దేశిస్తూ సరిహద్దును తిరిగి తెరిచారు. పశ్చిమ బెంగాల్లో వరదలకు జార్ఖండ్‌లోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ దరిమిలా పశ్చిమ బెంగాల్- జార్ఖండ్ సరిహద్దును మూడు రోజుల పాటు మూసివేయాలంటూ మమత అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం సాయంత్రం ఈ రెండు రాష్ట్రాల సరిహద్దును మూసివేశారు.జార్ఖండ్ ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడుతూ అంతర్ రాష్ట్ర సరిహద్దు తెరుచుకుందని, ఎన్‌హెచ్ -2, ఎన్‌హెచ్-5 వేలాది ట్రక్కులు పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరాయని తెలిపారు. అయితే అయితే సరిహద్దు వద్ద 20 నుంచి 25 కిలోమీటర్ల పొడవైన క్యూలో ట్రక్కులు ఉన్నాయని, ఇవి ముందుకు కదిలేందుకు కొంత సమయం పడుతుందన్నారు.జార్ఖండ్‌ను సురక్షితంగా ఉంచేందుకు డీవీసీ తన డ్యామ్‌ల నుండి నీటిని విడుదల చేయడం వల్లే తమ రాష్ట్రంలో వరద పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే జార్ఖండ్ నుండి పశ్చిమ బెంగాల్‌కు వచ్చే భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. కాగా న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుపీ) సూచనల మేరకు నీటిని విడుదల చేశామని, అయితే ఇప్పుడు దానిని నిలిపివేసినట్లు డీవీసీ అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు -
Jharkhand: నేడు, రేపు ఐదు గంటలు ఇంటర్నెట్ బంద్
రాంచీ: జార్ఖండ్‌లో నేడు (శనివారం) రేపు (ఆదివారం) ఐదు గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (జేజీజీజీఎల్‌సీసీఈ)దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది.పరీక్ష సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకే శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని, అలాగే ఆదివారం కూడా ఇదే పరిమితి కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా పరీక్ష ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రత్యేకంగా చర్చించారు. పరీక్ష సమయంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సోరెన్ హెచ్చరించారు. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాష్ట్రంలోని 823 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తుండగా, దాదాపు 6.39 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని సంబంధిత అధికారి తెలిపారు.జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ ‘ఇప్పుడే సీనియర్ అధికారులతో మాట్లాడి, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాను. అధికారులకు అవసరమైన మార్గదర్శకాలను అందించాను. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు’ అని దానిలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకం -
సీఎం మమత కీలక నిర్ణయం.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత
కోల్‌కతా: సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో బెంగాల్-జార్ఖండ్ భూ సరిహద్దును మూడు రోజులపాటు మూసివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.అయితే జార్ఖండ్‌ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీవీసీ ద్వారా నీటిని విడుదల చేశారని మమత ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద నీరు ముంచెత్తినట్లు తెలిపారు. ఇది కేవలం మనవ తప్పదమని ఆమె పేర్కొన్నారు. డీవీసీ.. డ్యామ్‌ల వద్ద పూడిక తీయడంలో దారుణంగా విఫలమయిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో వరద నీరు చుట్టు ముట్టిన హౌరా, మిడ్నాపూర్ జిల్లాల్లోని పలు వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత పర్యటించారు.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కారణమని ఆరోపించారు. ఇష్టమున్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని దీదీ డిమాండ్ చేశారు. -
Narendra Modi: బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు
జంషెడ్పూర్: జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వెల్లువలా వచి్చపడుతున్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్రమ వలసల వల్ల సంథాల్ పరగణాలు, కోల్హాన్ ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో వేగంగా మార్పులొస్తున్నాయి. స్థానికులు మైనారీ్టలుగా మారిపోయే ప్రమాదముంది. స్థానికేతరుల ఆధిపత్యం వల్ల గిరిజన జనాభా క్రమంగా తగ్గిపోతోంది. అక్రమ వలసదారులు పంచాయతీ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారు. భూములు కబ్జా చేస్తున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమకు భద్రత లేదని జార్ఖండ్‌లో ప్రజలు భావిస్తున్నారు’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం జంషెడ్‌పూర్‌లో ‘పరివర్తన్ మహార్యాలీ’లో మోదీ ప్రసంగించారు. విదేశాల నుంచి అక్రమంగా వలస వచి్చన వారికి జేఎంఎం అండగా నిలుస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీపై అక్రమ వలసదారులు పట్టు బిగించారన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లపై దర్యాప్తు కోసం స్వతంత్ర కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జనమే బుద్ధి చెబుతారు జార్ఖండ్‌కు జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెసే అతిపెద్ద శత్రువులని మోదీ అన్నారు. అధికార దాహంతో అవి ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకున్నాయని ఆక్షేపించారు. ‘‘గిరిజనుల ఓట్లతో అధికారం దక్కించుకున్న జేఎంఎం ఇప్పుడు వారికి అన్యాయం చేస్తున్న శక్తులతో చేతులు కలిపింది. రాజకీయ స్వార్థం కోసం దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలను బలి పెడుతోంది. గిరిజన సీఎం చంపయ్ సోరెన్‌ను అన్యాయంగా పదవి నుంచి తప్పించి ఘోరంగా అవమానించారు. జార్ఖండ్‌లో గిరిజనులకు జరుగుతున్న ద్రోహానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. సీఎం హేమంత్ సోరెన్ తన వదిన సీతా సోరెన్‌కే తగిన గౌరవమివ్వడం లేదు. జేఎంఎంకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’’ అన్నారు. మతం పేరిట జేఎంఎం కూటమి ఓటు బ్యాంకును పెంచుకోజూస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ముప్పు తప్పాలంటే బీజేపీని బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఐదేళ్లపాటు జరిగిన అవినీతి అక్రమాలు, కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని విచి్ఛన్నం చేసేందుకు విపక్షాలు పెద్ద కుట్ర పన్నాయని ఆరోపించారు. జార్ఖండ్ సంక్షేమానికి కేంద్రం ఎంతో చేసిందన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకున్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై–జి) కింద జార్ఖండ్‌లో 32 వేల మంది లబ్ధిదారులకు ఈ సందర్భంగా మోదీ వర్చువల్‌గా అనుమతి పత్రాలు పంపిణీ చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గృహాలు పొందిన మరో 46 వేల మందికి తాళాలు అందజేశారు. జార్ఖండ్‌లో రూ.660 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు.నేడే వందేమెట్రోకు పచ్చజెండారాంచీ: మెట్రో నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాల కోసం దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సేవలను మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇది గుజరా త్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు 359 కి.మీ. దూరాన్ని కేవలం 5.45 గంటల్లో చేరనుంది. ఆరు వందే భారత్ రైళ్లను మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇవి టాటానగర్–పట్నా, బ్రహ్మపూర్–టాటానగర్, రుర్కెలా–హౌరా, దేవ్‌గఢ్–వారణాసి, భాగల్పూర్–హౌరా, గయా–హౌరా మార్గాల్లో ప్రయాణిస్తాయి. -
జార్ఖండ్‌కు ఆ మూడు పార్టీలు శత్రువులు: మోదీ
రాంచీ: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీలు జార్ఖండ్ రాష్ట్రానికి.. అతిపెద్ద శత్రువులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జార్ఖండ్‌ను కాంగ్రెస్ చాలా కాలంగా ద్వేషిస్తోందని చెబుతూనే.. ఆర్జేడీ ఇప్పటికీ రాష్ట్ర ఏర్పాటుపై ప్రతీకారం కోరుకుంటోందని అన్నారు. ప్రధాని మోదీ జార్ఖండ్‌లోని ఆదివారం నిర్వహించిన ఓ సభలో మాట్లాడారు. ‘‘అధికార జేఎంఎం పార్టీ ఆదివాసీ వర్గాలకు ద్రోహం చేస్తోంది. ఆదివాసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారు ఇప్పుడు ఆ వర్గాల అటవీ భూమిని ఆక్రమించినవారితో చేతులు కలుపుతోంది. బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారుతో అధికార పార్టీ సంబంధాలు ఏర్పరుచుకుంటోంది. అంతే కాకుండా బుజ్జగింపు రాజకీయాలపై చేయటంలో అధికార జేఎంఎం పార్టీ కాంగ్రెస్ పార్టీని సైతం అధిగమించింది. బుజ్జగింపు రాజకీయం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా. దళితుల, గిరిజనులు వెనుకబడిన వర్గాల ప్రయోజనాలను దెబ్బతీసి.. వారికి ద్రోహం చేయటమే కాంగ్రెస్ పార్టీ అజెండా. ప్రస్తుతం అదే విధమైన ద్రోహం జేఎంఎం చర్యలలో స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు.#WATCH | Jamshedpur, Jharkhand: PM Modi says, "...In Santhal Pargana, the Adivasi population is decreasing rapidly. The lands are being grabbed. Infiltrators are taking over positions in Panchayats. The incidents of crime against daughters are increasing... Every Jharkhandi is… pic.twitter.com/ECYnXNID83— ANI (@ANI) September 15, 2024‘‘ జేఎంఎం ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో జార్ఖండ్‌ను దోచుకోవడం, అవినీతిపై మాత్రమే దృష్టి సారించింది. ఏ రంగాన్ని కూడా విడిచిపెట్టలేదు. నీరు, అడవులు, భూమి అన్నింటిలో అవినీతికి పాల్పడింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఈ కేసులన్నీ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇస్తున్నా. కొన్ని నెలల తర్వాత జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరిస్తాం. కొత్త పరిపాలనలో జవాబుదారీతనం, న్యాయాన్ని తీసుకురావాలనే బలమైన ఉద్దేశం మాది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే ఏకైక పార్టీ బీజేపీ’ అని మోదీ అన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ జార్ఖండ్‌లోని రాంచీలో రూ.660 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. టాటానగర్ నుంచి ప్రధాని మోదీ.. ఆరు వందే భారత్ రైళ్లను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.చదవండి: నాకు ప్రధాని ఆయ్యే అవకాశం వచ్చింది : గడ్కరీ -
వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
రాంచీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్15) ఆరు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ జెండా ఊపి ప్రారంభించనున్న ఆరు కొత్త వందే భారత్ రైళ్లు వేగం, సురక్షితమైన సౌకర్యాలను ప్రయాణికులకు అందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జార్ఖండ్ టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ కొత్త రైళ్లు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో, 280 జిల్లాలను కవర్ చేస్తూ ప్రతిరోజు 120 సార్లు రాకపోకలు నిర్వహిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. కాగా,ఈ రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా ఈ ఆరు కొత్త మార్గాల్లో కార్యకలాపాల్ని నిర్వహించనున్నాయి.గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ ట్రైన్లు సెప్టెంబర్ 14, 2024 నాటికి 54 రైళ్లు 108 సర్వీసులుతో 36,000 ట్రిప్పులను పూర్తి చేసి 3.17 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చింది. కాగా, మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 15,2019న ప్రారంభమైంది.ఇదీ చదవండి : నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది -
కేంద్రమంత్రి బూట్లు తీసిన ప్రభుత్వ అధికారి.. వీడియో వైరల్
కేంద్రమంత్రికి ఓ ప్రభుత్వ అధికారి సేవలు చేయడం విదాదాస్పదంగా మారింది. సదరు ఉన్నతాధికారి మంత్రి పైజామాను సరిచేయడం, బూట్లను తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అధికారి, మంత్రి తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే సోమవారం జార్ఖండ్ పర్యటనకు వచ్చారు. కోల్ ఇండియా లిమిటెడ్ అనుంబంధ సంస్థ అయిన బీసీసీఎల్ జనరల్ మేనేజర్ అరిందమ్ ముస్తాఫీ.. కేంద్ర మంత్రి బూట్లను తొలగించారు. అలాగే ధన్‌బాద్‌లోని భూగర్భ గని సందర్శన సమయంలో ఆయన పైజామాను సరిచేశారు.On an official visit to review several coal projects of BCCL, Union Minister of State for Coal Satish Chandra Dubey was seen taking the help of a senior BCCL official to remove his shoes and tighten his pajama. #Watch #Dhanbad #Jharkhand #India #SatishChandraDubey #BCCL pic.twitter.com/v1mvbbUxWo— Mirror Now (@MirrorNow) September 9, 2024ఈ వీడియో వైరలవ్వడంతో కాంగ్రెస్ స్పందిస్తూ.. ఈ ఘటన అవమానకరమైన విషయమని విమర్శించింది. బీసీసీఎల్ అధికారులు తమ అవినీతిని దాచడానికి ఇలాంటి చర్యల ద్వారా మంత్రులను సంతోష పెడుతున్నారని ఆరోపించింది.‘మంత్రి కాళ్లకు షూస్ జీఎం తొలగిస్తే అది సిగ్గుచేటు. జీఎంను బీబీసీఎల్ సీఎండీ (చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్)గా చేయాలి. అలాంటి బీసీసీఎల్ అధికారులు అవినీతికి పాల్పడి, తమ లోపాలను దాచిపెట్టి మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు’ అని ధన్‌బాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ సింగ్ మండిపడ్డారు. -
బీజేపీలో చేరిన చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్(67) బీజేపీలో చేరారు. జేఎంఎం ప్రస్తుత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీలో తనను అవమానించారని ఆరోపిస్తూ రెండు రోజుల క్రితం ఆయన ఆ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాంచీలోలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చంపయ్ సోరెన్‌కు కండువా కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంపయ్ సోరెన్‌ను ‘టైగర్ జిందా హై’అంటూ చౌహాన్ అభివర్ణించారు. జార్ఖండ్ ఉద్యమంలో కొల్హన్ ప్రాంతంలో కీలకంగా ఉన్న చంపయ్‌ను అక్కడి వారు ‘కొల్హన్ టైగర్’గా పిలుచుకుంటారు. చంపయ్ మాట్లాడుతూ..ఢిల్లీ, కోల్‌కతాలలో ఉన్న సమయంలో తనపై హేమంత్ సోరెన్ ప్రభుత్వం నిఘా పెట్టిందని, దీన్ని జీర్ణించుకోలేకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. -
జార్ఖండ్ సీఎం నివాసాన్ని ముట్టడించిన BJYM నేతలు
-
మాజీ సీఎం చంపయీ సోరెన్ కొత్త పార్టీ
రాంచి : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీపై ప్రకటన, పార్టీ గుర్తు ఇతర అంశాలపై మరో వారంలో చంపయీ సోరెన్ స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి,జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరో వారంలో చంపయీ సోరెన్ కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు. చంపయీ సోరెన్ బీజేపీలో చేరుతున్నానే వార్తల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.#WATCH | Former Jharkhand CM & JMM leader Champai Soren says, "I will not retire from politics. In the new chapter that I have started, I'll strengthen the new organisation and if I find a good friend in the way, I'll move ahead with that friendship to serve the people and… pic.twitter.com/Q8VwIK694o— ANI (@ANI) August 21, 2024మంగళవారం నుండి మద్దతుదారులు చంపయీ సోరెన్ భారీగా చేరుకుంటున్నారు. ఆయనతో మంతనాలు జరుపుతున్నారు. ఇదే అంశంపై చంపయీ సోరెన్ మాట్లాడారు. నేను ఇప్పటికే చెప్పా. ఒకటి రాజకీయాల నుంచి తప్పుకోవడం, కొత్త పార్టీని పెట్టడం, లేదంటే మరో పార్టీలో చేరడం. ఇప్పుడు చెబుతున్నా. నేను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు. నేను నా సొంత పార్టీని ఎందుకు పెట్టకూడదు.నా తదుపరి భవిష్యత్ కార్యచరణ ఏంటనేది వారంలో తేలిపోతుందన్ని అన్నారు. ఆగస్ట్ 18న ఢిల్లీలో మకాంఆగస్ట్ 18న చంపయీ సోరెన్ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆయన అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.దీనికి తోడు చంపయీ సోరెన్‌ను ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతూ ‘చంపయీ సోరెన్ నువ్వు ఒక పులివి.. నువ్వు ఎప్పుడూ పులిలాగే ఉండాలి.. నీకు ఎన్డీయే కూటమిలోకి స్వాగతం’అంటూ కేంద్ర మంత్రి జీతన్‌రామ్ మాంఝీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి పోవడంతోనే భూ కుంభకోణం కేసులో అప్పటి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. ఈడీ అరెస్ట్‌తో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోరెన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చంపాయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. వరుస పరిణామాల అనంతరం హేమంత్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడం వల్ల చంపయీ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
ఢిల్లీలో భారీ వర్షం.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (మంగళవారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి నీరు చేరింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాతో వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జరీచేసింది. ఆగస్టు 22 ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయలో ఆగస్టు 20 నుండి 22 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లక్షద్వీప్, కోస్టల్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, యానాం, రాయలసీమ, దక్షిణ కర్ణాటకలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. VIDEO | Delhi: Heavy rainfall lashes parts of the national capital. Visuals from Janpath.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/4XCCXwHrBN— Press Trust of India (@PTI_News) August 20, 2024 -
బీజేపీ లో చేరిక పై స్పందించిన జార్ఖండ్ మాజీ సీఎం
-
భారత సెలెక్టర్లకు తలనొప్పిగా మారిన ఇషాన్ కిషన్
టీమిండియా యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ పర్యటనకు ముందు భారత సెలెక్టర్లకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాడు. బుచ్చి బాబు టోర్నీలో వరుసగా సెంచరీ (114), మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (41 నాటౌట్) ఆడిన ఇషాన్.. బ్యాట్‌తో సెలెక్టర్లకు సవాలు విసిరాడు. బంగ్లాదేశ్ పర్యటన నేపథ్యంలో భారత బ్యాటింగ్ లైనప్ ఇప్పటికే ఖాళీ లేకుండా ఉంది. ఇప్పుడు ఇషాన్ కొత్తగా రేసులోకి వచ్చి సీనియర్ల స్థానాలను ప్రశ్నార్థకంగా మార్చాడు. భారత సెలెక్టర్లు బంగ్లాదేశ్ పర్యటనకు ఇషాన్‌ను ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.Ishan Kishan - the hero of Jharkhand !!!- Jharkhand needed 12 with 2 wickets in hands, captain smashed 6,0,6 to seal the game. pic.twitter.com/3uTqFF1KI2— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024బుచ్చి బాబు టోర్నీలో భాగంగా జార్ఖండ్, మధ్య ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ను జార్ఖండ్ కెప్టెన్ అయిన ఇషాన్ కిషన్ స్టయిల్‌గా ముగించాడు. తన జట్టు గెలుపుకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాన్ రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఇషాన్ విన్నింగ్ షాట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. -
సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.. 86 బంతుల్లోనే!
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ రెడ్‌బాల్ క్రికెట్ పునరాగమనం అదిరిపోయింది. ఆకాశమే హద్దుగా 86 బంతుల్లోనే శతక్కొట్టాడు ఈ జార్ఖండ్ డైనమైట్. భారత జట్టులో చోటే లక్ష్యంగా కఠినంగా శ్రమిస్తున్నానని సెలక్టర్లకు తన సెంచరీతో సందేశం పంపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో తనను ఉద్దేశపూర్వకంగా బెంచ్‌కే పరిమితం చేశారని ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.రంజీల్లో ఆడనందుకు వేటు మానసిక ఇబ్బందులు అని చెప్పి ఆ టూర్ మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తదుపరి కుటుంబంతో ట్రిప్‌నకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇషాన్‌పై కన్నెర్ర చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే టీమిండియాలో మళ్లీ చోటు దక్కుతుందని అతడికి స్పష్టం చేసింది. అయినప్పటికీ.. స్వరాష్ట్రానికి చెందిన జార్ఖండ్ తరఫున రంజీల్లో ఆడటానికి అతడు నిరాకరించాడు.ఫలితంగా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఐపీఎల్-2024లో ఇషాన్ కిషన్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కెరీర్‌పై దృష్టి సారించిన ఈ జార్ఖండ్ బ్యాటర్... బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా తిరిగి రెడ్‌బాల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. జార్ఖండ్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ డైనమైట్.. మధ్యప్రదేశ్‌తో తమ తొలి మ్యాచ్‌లో శతకంతో కదం తొక్కాడు.సిక్సర్‌తో సెంచరీ పూర్తిసిక్సర్తో సెంచరీ మార్కు అందుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అంతకుముందు.. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ సమయంలో మూడు అద్భుత క్యాచ్‌లతో మెరిసి వికెట్ కీపర్‌గానూ తనను తాను నిరూపించుకున్నాడు 26 ఏళ్ల ఇషాన్ కిషన్. కాగా జార్ఖండ్‌తో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 225 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆటలో భాగంగా ఇషాన్ సెంచరీ కారణంగా జార్ఖండ్ 69.1 ఓవర్లోనే 233 పరుగుల మార్కు అందుకుంది. ఇక టీమిండియా తరఫున ఈ జార్ఖండ్ కెప్టెన్ చివరగా 2023 నవంబరులో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భాగమయ్యాడు.చదవండి: తప్పంతా ఆమెదేనా?.. ఇంకా మగాడు మగాడే అంటారా?: సిరాజ్ పోస్ట్ వైరల్ISHAN KISHAN YOU’RE SO ICONIC!!!Ishan Kishan 100 in 86 balls!!#IshanKishan pic.twitter.com/I37dgcnciS— shrey (@slidinjun) August 16, 2024 -
రీ ఎంట్రీ అదుర్స్: అద్భుత క్యాచ్‌తో మెరిసిన ఇషాన్ కిషన్
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ బాటపట్టాడు. జాతీయ జట్టులో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న ఈ డాషింగ్ క్రికెటర్ తాజాగా బుచ్చిబాబు టోర్నమెంట్ బరిలో దిగాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో సొంత రాష్ట్రం జార్ఖండ్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్.. తొలిరోజు శుభారంభం అందుకున్నాడు.బుచ్చిబాబు టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న మధ్యప్రదేశ్‌తో జార్ఖండ్ తొలి మ్యాచ్ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సరికి జార్ఖండ్ మధ్యప్రదేశ్ జట్టును 224-8కు కట్టడి చేసింది. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేయడంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు.సూపర్ క్యాచ్ అందుకున్న ఇషాన్ అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని మూడు వికెట్లు పడగొట్టడంలో భాగం పంచుకున్నాడు. ముఖ్యంగా క్రీజులో నిలదొక్కుకుని.. జార్ఖండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన మధ్యప్రదేశ్ లెఫ్టాండర్ బ్యాటర్ శుభం కువాష్ ఇచ్చిన క్యాచ్ తనదైన స్టైల్లో ఒడిసిపట్టి వారెవ్వా అనిపించాడు. 74వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ ఆదిత్య సింగ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన శుభం(84).. షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.బ్యాట్ ఎడ్జ్‌ని తాకిన బాల్ తన వైపునకు రాగానే ఇషాన్ కిషన్ ఏమాత్రం పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. మిస్ అవుతుందనుకున్న బంతిని ఒడిసిపట్టి శుభంను డిస్మిస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో శుభంతో పాటు చంచల్ రాథోడ్, రామ్‌వీర్ గుర్జార్ వికెట్లు పడగొట్టడంలోనూ ఇషాన్ కిషన్ కీపర్‌గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు. కాగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే టీమిండియాను వీడిన ఇషాన్ కిషన్.. రంజీలు ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రా క్టు కోల్పోయాడు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇషాన్.. తొలుత బుచ్చిబాబు టోర్నీతో దేశవాళీ క్రికెట్ మొదలు పెట్టాడు. బుచ్చిబాబు టోర్నమెంట్- ఏగ్రూపులో ఏ జట్లు?తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుచ్చిబాబు టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల మ్యాచ్‌ల ఈ రెడ్‌బాల్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో పాటు జార్ఖండ్, హైదరాబాద్.. గ్రూప్-బిలో రైల్వేస్, గుజరాత్, తమిళనాడు ప్రెసిడెంట్స్ ఎలెవన్, గ్రూప్-సిలో ముంబై, హర్యానా, తమిళనాడు ప్రెసింగ్ ఎలెవన్ 2, గ్రూప్-డిలో జమ్మూ కశ్మీర్, బరోడా, ఛత్తీస్‌గఢ్ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆగష్టు 15- సెప్టెంబరు 5 వరకు ఈ టోర్నీ జరుగనుంది. Ishan Kishan in good rhythm. 💥- Great piece of wicketkeeping!pic.twitter.com/sjnsGZTaQF— Mufaddal Vohra (@mufaddal_vohra) August 15, 2024 -
Jharkhand: మహిళలకు ఏటా రూ. 12,000
జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ సర్కారు రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. వారి సంక్షేమం కోసం నూతన పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 21 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ప్రతి సంవత్సరం రూ.12,000 అందజేస్తుంది. ఈ పథకానికి ‘మైయా సమ్మాన్ యోజన’ అని పేరు పెట్టారు. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు ప్రారంభించింది. అర్హులైన మహిళలను ఎంపిక చేసేందుకు రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక భద్రత శాఖ పలు ప్రాంతాల్లో క్యాంపులను నిర్వహిస్తోంది. జార్ఖండ్ ఏజెన్సీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌ను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక భద్రత శాఖ కార్యదర్శి మనోజ్ కుమార్ పేర్కొన్నారు.రాష్ట్రంలోని సుమారు 50 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంకింద ప్రయోజనం పొందేందుకు ఏ ఇతర పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందని మహిళలు అర్హులు. జార్ఖండ్ నివాసితులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులను ఆగస్టు 21 నుంచి పోర్టల్ ద్వారా సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. -
పట్టాలు తప్పిన హౌరా–ముంబై రైలు
జంషెడ్పూర్/రాంచీ/చాయ్‌బసా/కోల్‌కతా: జార్ఖండ్‌లోని సెరాయ్‌కెరా–ఖర్సావాన్ జిల్లాలో హౌరా–ముంబై మెయిల్ రైలు పట్టాలు తప్పింది. 18 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. జంషెడ్పూర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని బారాబంబూ స్టేషన్ దగ్గర్లోని పోటోబెబా గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి సమీపంలోనే గూడ్సు రైలు ఒకటి పట్టాలు తప్పిందని, రెండు ఘటనలు ఒకేసారి జరిగాయా అనేది తేల్చాల్సి ఉందని సౌత్‌ఈస్ట్‌రైల్వే అధికార ప్రతినిధి ఓం ప్రకాశ్ చరణ్ చెప్పారు. అయితే ఆగిఉన్న గూడ్సు రైలును హౌరా–ముంబై రైలు ఢీకొట్టిందని వెస్ట్ సింఘ్భమ్ డెప్యూటీ కమిషనర్ కుల్దీప్ చౌదరి చెప్పారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి తలో రూ.1 లక్ష ఇవ్వనున్నారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియాను జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటన జరిగిన రైల్వే మార్గం గుండా వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దుచేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. -
జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. ఇద్దరి మృతి
రాంచీ: జార్ఖండ్‌లో హౌరా-సీఎస్ఎంటీ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మందికి గాయాలు కాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జార్ఖండ్‌లోని చక్రధర్పూర్ డివిజన్లో అర్ధరాత్రి 3గం. దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో రైల్వే సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 18 బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అందులో ప్రయాణికులకు సంబంధించినవి 16 బోగీలు, ఒకటి పవర్ కార్ బోగీ, మరోకటి పాంట్రీ బోగీ అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమదానికి గల కచ్చితమై కారణం తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. #WATCH | Jharkhand: Train No. 12810 Howara-CSMT Express derailed near Chakradharpur, between Rajkharswan West Outer and Barabamboo in Chakradharpur division at around 3:45 am.Two people have lost their lives so far.(Visuals from the spot) pic.twitter.com/zYvhUHI9cV— ANI (@ANI) July 30, 2024Train no.12810 Howrah -CSMT Mail got accident in Jharkhand near Tatanagar. pic.twitter.com/6mQyUBeIWT— Santu1213 (@santu_1213) July 30, 2024 -
ఏనుగుల దాడిలో ఇద్దరి మృతి
రాంచీ: జార్ఖండ్‌లో రెండు వేరువేరు ఏనుగుల దాడి ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. ఈస్ట్‌సింగ్‌భుమ్ జిల్లాలోనే ఈ రెండు ఘటనలు జరిగాయి. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న చౌతియా గ్రామంలో ఏనుగు ఒక వ్యక్తిని తొక్కి చంపేసింది. ఇదే జిల్లాలోని డిఘీ గ్రామంలో జరిగిన మరో ఘటనలో ఏనుగు ఓ ఇంటిపై దాడి చేసింది. ఈ దాడిలో ఇంటి గోడ కూలి లోపల నిద్రిస్తున్న వృద్ధురాలు మరణించింది. జిల్లాలోని అటవీ ప్రాంతంలో వరుసగా ఏనుగుల దాడులు జరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళకు దిగారు. ఏనుగుల దాడిలో మృతిచెందిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
రాహుల్‌కు ఎందుకింత అహంకారం?: అమిత్ షా ధ్వజం
రాంచీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్‌షా తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్లమెంటులో రాహుల్ అహాంకారాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జార్ఖండ్‌లోని రాంచీలోజరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్ధేశిస్తూ అమిత్‌షా ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అహంకారం పెరిగిన కొందరు నాయకులను చాలాసార్లు చూస్తుంటాం. జార్ఖండ్‌లో అలాంటి వారే అధికారంలో ఉన్నారు. కానీ ఓడిపోయిన తర్వాత కకూడా అహంకారం కలిగిన వ్యక్తిని నేను తొలిసారి చూస్తున్నాను.లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎవరు గెలిచారో, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అందరికీ తెలుసు. ఎవరూ ఓడిపోయారో కూడా తెలుసు.అయినా రాహుల్ అనేకసార్లు పార్లమెంట్లో అహంకారంగా ప్రవర్తించారు. రాహుల్ ఓటమిని అంగీకరించలేపోతున్నారు. అందుకే పార్లమెంట్లో ఆ విధంగా ప్రవర్దిస్తున్నారు. మూడింట రెండు వంతుల సీట్లు గెలిచిన(బీజేపీ) పార్టీ నుంచి ప్రజలు ఇంత అహంకారాన్ని ఎదుర్కోవడం లేదు’ అని అమిత్‌షా పేర్కొన్నారు.ఈ సభ వేదికగా కాంగ్రెస్ నేతలకు చెప్పాలనుకుంటున్నాను. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ దక్కింది. కేవలం బీజేపీకే 240 సీట్లు దక్కాయి. ఇవి ఇండియా కూటమి మొత్తానికి దక్కిన స్థానాల కంటే ఎక్కువ. అలాంటప్పుడు వారికి ఎందుకింత అహంకారం?. 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన స్థానాల కంటే ఈసారి బీజేపీ ఎక్కవ గెలుచుకుంది. మేము వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాం. కానీ, ఈ వాస్తవాన్ని ప్రతిపక్ష నేతలు అంగీకరించలేకపోతున్నారు’’ అని మండిపడ్డారు..అదే విధంగా మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలై మళ్లీ సీఎం బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిపరమైందని దుయ్యబట్టారు. భూకుంభకోణం, మద్యం, మైనింగ్ పాల్పడి రూ. కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
నాడు ఈడీ అరెస్ట్.. నేడు మోదీతో సీఎం సొరేన్ భేటీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, హేమంత్ సొరేన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానిని కలవడం ఇదే తొలిసారి.కాగా, మోదీని సీఎం హేమంత్ సొరేన్ మర్యాదపూర్వంగా కలిసినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఇక, జార్ఖండ్‌లో ల్యాండ్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హేమంత్ సొరేన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. माननीय प्रधानमंत्री श्री .@narendramodi जी से शिष्टाचार मुलाक़ात हुई। pic.twitter.com/jByrjWHsUw— Hemant Soren (@HemantSorenJMM) July 15, 2024 ఈ క్రమంలో జనవరి 31వ తేదీన సీఎం పదవికి సొరేన్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఇటీవలే జార్ఖండ్ కోర్టు హేమంత్ సొరేన్‌కు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం, మళ్లీ జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేశారు. -
జార్ఖండ్: బలపరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ ప్రభుత్వం
జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని పాలక కూటమికి అనుకూలంగా 45 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో సోరెన్ ప్రభుత్వం బలపరీక్షలో సునాయాసంగా గట్టెక్కింది.భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి.. దాదాపు 5 నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు హేమంత్ సోరెన్ ఆ తరువాత జూలై 4న మూడోసారి జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. సోమవారం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొన్నారు.జార్ఖండ్ స్పీకర్ రవీంద్రనాథ్ మహ్తో విశ్వాస తీర్మానంపై చర్చకు గంట సమయం కేటాయించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఆమోదం పొందడంతో..హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.కాగా 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బల పరీక్షలో నెగ్గాలంటే 338 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు (జేఏఎంఎం 27, కాంగ్రెస్ 17, ఆర్జేడీ1). బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులున్నారు. -
హేమంత్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్ష.. అసెంబ్లీలో ఎవరి బలం ఎంత?
జార్ఖండ్‌లో కొత్తగా కొలువు దీరిన సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం నేడు (జూలై 8) అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు కానుంది. సభలో విశ్వాస పరీక్ష పూర్తయిన వెంటనే సోరెన్ తన మంత్రివర్గాన్ని కూడా విస్తరించనున్నారు. కొత్త క్యాబినెట్లో సీఎం సతీమణి కల్పనా సోరెన్‌కు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఎవరి బలం ఎంత?కాగా 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బల పరీక్షలో నెగ్గాలంటే 41 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు దీంతో సునాయసంగా సోరెన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో కూడిన జేఎంఎం నేతృత్వంలోని కూటమికి 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి 24 మంది ఉన్నారు. అధికార కూటమిలో జేఎంఎం 27 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉంది, కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలతో రెండవ స్థానంలో ఉంది. జార్ఖండ్‌లో ఆర్జేడీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.ఇద్దరు ఎమ్మెల్యేలు నలిన్ సోరెన్, జోబా మాఝీ ప్రస్తుతం ఎంపీలుగా ఎన్నికవ్వడంతో జేఎంఎం బలం 27కు తగ్గింది, అదే విధంగా జామా శాసనసభ్యురాలు సీతా సోరెన్ బీజేపీలో చేరారు. ఇక ఇటీవల జేఎంఎం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను (బిషున్‌పూర్ ఎమ్మెల్యే చమ్రా లిండా, బోరియో ఎమ్మెల్యే లోబిన్ హెంబ్రోమ్) పార్టీ నుంచి బహిష్కరించింది.అదేవిధంగా, జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీ బలం 24కి తగ్గింది, పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. బగ్మారా నుంచి ధులు మహ్తో, హజారీబాగ్‌కు ప్రాతినిధ్యం వహించిన మనీష్ జైస్వాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచారు. ఇక కాంగ్రెస్‌లో చేరిన మండు ఎమ్మెల్యే జైప్రకాష్ భాయ్ పటేల్‌ను కాషాయ పార్టీ బహిష్కరించింది.కాగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ మూడోసారి ముఖ్యమంత్రిపీథాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిలుపై విడుదలైన హేమంత్.. 5 నెలల తర్వాత మళ్లీ జూలై 4న సాయంత్రం జార్ఖండ్ 13వసీఎంగా ప్రమాణం చేశారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు.ఇక 2013లో తొలిసారిగా జార్ఖండ్‌కు హేమంత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గురువారం మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. -
జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్
రాంచీ: జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన హేమంత్.. 5 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ల్యాండ్ స్కాం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై జనవరి 31న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య.. అరెస్ట్ కంటే ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదు నెలల తర్వాత.. హేమంత్‌కు హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో జూన్ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ తరుణంలో బుధవారం చంపయీ సోరెన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా సమావేశమై హేమంత్ సోరెన్‌ను తమ సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తొలుత జులై 7న ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే ఆలస్యం చేయకుండా ఆయన గవర్నర్‌ను కలిసిన హేమంత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి గవర్నర్ అంగీకారం లభించడంతో.. ఇవాళ సాయంత్రం జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. -
జులై 7న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్‌లో మరోసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు పనులు చకచకా జరిగిపోతున్నాయి. బుధవారమే చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసి గవర్నర్‌కు సమర్పించగా.. జేఎంఎం చీఫ్ నేడు హేమంత్ సోరెన్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆయనతోపాటు ఇండియా కూటమి నేతలు కూడా ఉన్నారుఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను గవర్నర్ ఆహ్వానించారు. జులై 7న హేమంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్నిజేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు. హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. -
చంపై సోరెన్ రాజీనామా..జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్
రాంచీ : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు స్వీకరించేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నియామకానికి జార్ఖండ్ ముక్తా మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీలు సోరెన్ ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హేమంత్ సోరెన్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరారు.రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో ప్రస్తుత జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు.Champai Soren resigns as Jharkhand CM, Hemant Soren stakes claim to form govtRead @ANI Story | https://t.co/Mc2d74htr5#ChampaiSoren #JharkhandCM #HemantSoren pic.twitter.com/T6fkdW4I2Q— ANI Digital (@ani_digital) July 3, 2024 ఈడీ ఆరోపణలపై కోర్టు తీర్పుమనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అవమానం జరిగిందని మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యే సమయంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. చంపై సోరెన్ ఆ పదవి బాధ్యతల్ని స్వీకరించారు. తాజాగా, హేమంత్ సోరెన్‌కు బెయిల్ రావడం.. చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. ఈ అనూహ్య నాటకీయ పరిణామాలతో సీఎం పదవికి రాజీనామా చేయించడం చంపై సోరెన్ తనకు అవమానం జరిగిందని తన సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. -
జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సొరేన్!
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం హేమంత్ సొరేన్ మరోసారి ముఖ్యమంత్రి చేపట్టబోతున్నట్లు సమాచారం. తమ నేతగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకుంటూ జార్ఖండ్ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. జార్ఖండ్‌లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో హేమంత్ సొరేన్ జైలుకు వెళ్లారు. అనంతరం, జూన్ 28వ తేదీన రాంచీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో సొరేన్ బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం చంపై సొరేన్ స్థానంలో హేమంత్ సొరేన్ మళ్లీ బాధత్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంపై సొరేన్ అధికారిక కార్యక్రమాలను కూడా ఆయన రద్దు చేసుకున్నారు. -
జార్ఖండ్‌లో కూలిన గిర్డర్
జార్ఖండ్: జార్ఖండ్‌లో పెను ప్రమాదం తప్పింది. గిరిధ్ జిల్లాలోని ఆర్గా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన గిర్డర్ ఒకటి కూలిపోయింది. రాష్ట్ర రాజధాని రాంచీకి 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియోరీ బ్లాక్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.భారీ వర్షం కారణంగా గిర్డర్ కూలిపోయిందని, పిల్లర్ కూడా వంగిపోయిందని ఈఈ వినయ్‌కుమార్ తెలిపారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన జార్ఖండ్‌లోని గిరిధ్, బిహార్‌లోని జమూయి జిల్లాలను కలుపుతుంది. -
‘నీట్–యూజీ’ కేసులో దర్యాప్తు వేగవంతం
న్యూఢిల్లీ: నీట్–యూజీ అక్రమాల కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. శనివారం గుజరాత్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. జార్ఖండ్‌లో ఓ హిందీ పత్రిక జర్నలిస్టు జమాలుద్దీన్ అన్సారీని అరెస్ట్ చేశారు. నీట్–యూజీ పేపర్ లీకేజీ కేసులో నిందితులైన హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ అలామ్‌కు జమాలుద్దీన్ సహకరినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. గుజరాత్‌లోని ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్, గోద్రా జిల్లాల్లో నిందితులకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయ్ జలారామ్ స్కూల్ ప్రిన్సిపాల్ పురుషోత్తమ్, టీచర్ తుషార్, మధ్యవర్తులు వి¿ోర్æ, అరిఫ్‌లను నాలుగు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ గోద్రా కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గోద్రా, ఖేడా జిల్లాల్లో నీట్ పరీక్ష జరిగిన సెంటర్లు జయ్ జలారామ్ సూక్ల్ యాజమాన్యం ఆ«దీనంలో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. -
బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం: హేమంత్ సోరెన్
రాంచీ: జార్ఖండ్‌లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమంటూ జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీని కోసం కృషి చేస్తానంటూ శపథం చేసిన ఆయన.. తనను జైలులో నిర్బంధించేందుకు బీజేపీ కుట్రపన్నిందంటూ మండిపడ్డారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్, శనివారం.. జేఎంఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో సామాజిక వ్యవస్థను ధ్వంసం చేయడంలో బీజేపీకి ఆరితేరిపోయిందని విమర్శలు గుప్పించారు. మాపై కుట్ర పన్నిన వారికి తగిన సమాధానం చెబుతాం. బీజేపీ శవపేటికకు చివరి మేకు వేసే సమయం వచ్చిందని.. జార్ఖండ్‌లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ధ్వజమెత్తారు.కాగా, భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్(48)కు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనను తప్పుడు కేసులో ఇరికించి, ఐదు నెలలపాటు జైల్లో పెట్టారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యర్తలు, జర్నలిస్టుల గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. -
హేమంత్ సోరెన్‌కు బెయిల్
రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్(48)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హేమంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రంగోన్ ముఖోపాధ్యాయ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హేమంత్ సోరెన్‌కు బెయిల్ ఇస్తే మళ్లీ ఇదే తరహా అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తరఫు న్యాయవాది ఎస్.వి.రాజు పేర్కొన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఈడీ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హేమంత్ ఏ నేరమూ చేయలేదని, బెయిల్‌పై బయట ఉన్నప్పుడు ఆయన నేరం చేసే అవకాశం లేదని, అందుకే బెయిల్ ఇస్తున్నామని స్పష్టంచేసింది. హేమంత్ రూ.50 వేల పూచీకత్తు సమరి్పంచాలని, ఆయనకు ష్యూరిటీ ఇస్తూ మరో ఇద్దరు రూ.50 వేల చొప్పున పూచీకత్తు సమరి్పంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఈ బెయిల్ తీర్పుపై 48 గంటలపాటు స్టే విధించాలని ఈడీ తరఫున మరో న్యాయవాది జోహబ్ హుస్సేన్ విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో 8.86 ఎకరాల భూకుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులో ఇరికించారు: హేమంత్ తనను తప్పుడు కేసులో ఇరికించి, ఐదు నెలలపాటు జైల్లో పెట్టారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యర్తలు, జర్నలిస్టుల గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. -
అయిదు నెలల తర్వాత.. బెయిల్‌పై హేమంత్ సోరెన్ విడుదల
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎట్టకేలకు విడుదలయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ లభించడంతో దాదాపు అయిదు నెలల శిక్ష అనంతరం శుక్రవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ ముక్తిమోర్చ కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. అరెస్టుకు కొన్ని గంటల ముందే ఆయన నాటకీయ పరిణామాల నడుమ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. నూతన సీఎంగా చంపాయి సోరెన్ బాధ్యతలు చేపట్టారు. -
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్‌కు బెయిల్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఊరట లభించింది. ల్యాండ్ స్కామ్ కేసులో సోరేన్‌కు బెయిల్ మంజూరైంది. సోరేన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో, ఆయన జైలు నుంచి బయటకు అవకాశం ఉంది.ఇక, ఐదు నెలల తర్వాత జైలు నుంచి హేమంత్ సోరేన్ విడుదల కానున్నారు. అయితే, ఆయనపై పెండింగ్ కేసులు ఏవీ లేకపోవడంతో నేడు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ల్యాండ్ స్కామ్‌లో ఈడీ.. హేమంత్ సోరేన్‌ను జనవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జైలుకు వెళ్లిన అనంతరం, సోరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. -
బాయ్స్ హాస్టల్లో 25 మందికి నీట్ పేపర్ లీక్.. సంజీవ్ ముఖియా ఎవరు?
ఢిల్లీ: నీట్ పరీక్షా ప్రతాల లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇక, పేపర్ లీక్ ఘటనలో జార్ఖండ్‌లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే, నీట్ పేపర్లు లీక్ కావడానికి బీహార్‌కు చెందిన సంజీవ్ ముఖియా గ్యాంగ్ కారణమని ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు.కాగా, నీట్ పేపర్ల లీక్ ఘటనలో సంజీవ్ ముఖియా గ్యాంగ్ సైబర్ నేరగాళ్లతో టచ్‌లో ఉన్నట్టు బీహార్ పోలీసులు వెల్లడించారు. జార్ఖండ్‌లో అరెస్ట్ అయిన ఐదుగురిలో ముగ్గురు సైబర్ నేరగాళ్లు కూడా ఉన్నారని చెప్పారు. ఇక, వీరి వద్ద నుంచి పోస్ట్ డేటెడ్ చెక్కులు, పలు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లో కూడా వీరి ప్రమేయం ఉంది. ఈ కేసులో సంజయ్ ముఖియా కొడుకు శివ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.ఇక, నీట్ పరీక్షకు ముందు రోజు సంజీమ్ ముఖియా గ్యాంగ్ పాట్నాలోని లేర్న్ ప్లే స్కూల్‌తో సంబంధం ఉన్న బాయ్స్ హాస్టల్లో దాదాపు 25 మంది అభ్యర్థులను ఉంచినట్టు ఆరోపణలు వచ్చాయి. అదే హాస్టల్లో అభ్యర్థులకు పేపర్ లీక్, సమాధాన పత్రాలు అందించినట్టు సమాచారం. ఇక, ఈ కేసులో సంజీవ్ ముఖియా మేనల్లుడు రాఖీ కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాఖీ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇదిలా ఉండగా.. నీట్ పేపర్ లీక్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగం ప్రవేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం విషయానికి సంబంధించి ఈడీ త్వరలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశముంది. ఈడీ పాత కేసుల్లో అరెస్ట్‌లు చేస్తోందని, వారి నెట్‌వర్క్‌లు, మనీలాండరింగ్ లింక్‌లపై విచారణ జరుపుతోందని సమాచారం.పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ బృందం బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. సోమవారం పాట్నాలోని బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కార్యాలయానికి సీబీఐ బృందం కూడా చేరుకుంది. అక్కడ పేపర్ లీక్ కేసు దర్యాప్తుకు సంబంధించిన అన్ని వాస్తవాలను ఆర్థిక నేరాల విభాగం సీబీఐకి అప్పగించింది. నీట్ పేపర్ లీక్ కుంభకోణంలో ఎవరు ఎలాంటి పాత్ర పోషించారో ఈఓయూ తన విచారణలో కనుగొంది. -
జార్ఖండ్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి
చైబాసా: జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింహ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. గువా పోలీస్‌స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతంలో సోమవారం ఉదయం 5 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు ఐజీ అమోల్ వి హోంకార్ చెప్పారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమాండర్ టైగర్ అలియాస్ పాండు హన్స్దా, బట్రి దేవ్‌గమ్‌లను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు ఎస్ఎల్ఆర్లు, మూడు రైఫిళ్లు, ఒక పిస్టల్‌ను స్వాదీనం చేసుకున్నామన్నారు. మృతులను జోనల్ కమాండర్ కండె హొన్హాగా, సబ్ జోనల్ కమాండర్ సింగ్రాయ్ అలియాస్ మనోజ్, ఏరియా కమాండర్ సూర్య అలియాస్ ముండా దేవ్‌గమ్, మహిళా నక్సల్ జుంగా పుర్టి అలియాస్ మర్లా, సప్ని హన్స్‌డాగా గుర్తించామన్నారు. -
జార్ఖండ్‌లో ఎన్కౌంటర్: నలుగురు మావోయిస్టుల మృతి
రాంచి: జార్ఖండ్‌లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం ఉదయం సింగ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నాలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.టోంటో, గోయిల్కేరా ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను టార్గెట్ చేస్తూ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారి అమోల్ వి హోమ్కర్ తెలిపారు. ‘‘ఎదురు కాల్పుల్లో నాలుగు మావోయిస్టులు మృతి చెందారు.అందులో ఒక మహిళా మావోయిస్టు ఉంది. మరో ఇద్దర మావోయిస్టులను అరెస్ట్ చేశాం. ఘటన స్థలం నుంచి రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నాం’’ అని పోలీసులు తెలిపారు.ఇక.. రెండు రోజుల క్రింతం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ జవాన్ మృతి చెందారు. -
Lok Sabha Election 2024: మూడు సీట్లు... ముచ్చెమటలు!
సార్వత్రిక ఎన్నికల జాతర చివరి అంకానికొచ్చింది. జార్ఖండ్‌లో 14 లోక్‌సభ స్థానాలకు గాను 11 చోట్ల పోలింగ్ ముగిసింది. మిగతా మూడింటికి నేడు ఏడో విడతలో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీతో సహా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలంతా సుడిగాలి ప్రచారాలతో హోరెత్తించారు. ఈ మూడు సీట్లలో రెండు ఎస్టీ నియోజకవర్గాలు. వీటిలో 2 బీజేపీ, ఒకటి జేఎంఎం ఖాతాలో ఉన్నాయి. ఈ స్థానాలపై ఫోకస్...గొడ్డా.. బీజేపీ అడ్డా ఇది కమలనాథుల కంచుకోట. 1991లో మాత్రం జేఎంఎం నుంచి సూరజ్ మండల్ విజయం సాధించారు. కేంద్రంలో పీవీ నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వానికి అనుకూలంగా పార్లమెంటులో ఓటేసేందుకు జేఎంఎం ఎంపీలు ముడుపులు తీసుకున్న వివాదంలో సూరజ్ మండల్ పేరు మార్మోగింది. కాంగ్రెస్ కూడా ఒక్క 2004లో మాత్రమే గెలిచింది. గత మూడు ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం. హ్యాట్రిక్ కొట్టిన ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ నిశికాంత్ దూబే మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 4.5 లక్షల ఓట్లు సాధించిన జార్ఖండ్ వికాశ్ మోర్చా (ప్రజాతాంత్రిక్) నేత ప్రదీప్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్నారు. బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఈ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ స్థానాల్లో 3 కాంగ్రెస్, 2 బీజేపీ, ఒకటి జేఎంఎం చేతిలో ఉన్నాయి. ఈసారి బీజేపీ హవాకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని ఇండియా కూటమి గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఇక్కడ పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. దుమ్కా... సోరెన్ ఫ్యామిలీ వార్ఈ ఎస్టీ రిజర్వుడ్ స్థానం జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ శిబు సోరెన్ కంచుకోట. ఆయన 1980లో జేఎంఎం తరఫున ఇక్కడ తొలిసారి పాగా వేశారు. 1989 నుంచి మూడుసార్లు గెలిచినా, తర్వాత రెండు సార్లు బీజేపీ నేత బాబూలాల్ మరాండీ చేతిలో ఓటమి చవిచూశారు. మళ్లీ వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ సోరెన్‌దే హవా. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నళిన్ సోరెన్ ఈసారి జేఎంఎం తరఫున బరిలోకి దిగారు. బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీని కాదని శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్‌కు టికెటిచి్చంది. ఆమె సోరెన్ పెద్ద కుమారుడు దివంగత దుర్గా సోరెన్ భార్య. మామ కంచుకోటలో కోడలే జేఎంఎంకు సవాలు విసురుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. దుమ్కాలో 40 శాతం గిరిజనులు, 40 శాతం వెనకబడిన వర్గాలు, 20 శాతం ముస్లింలు ఉంటారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 జేఎంఎం, 2 బీజేపీ, ఒకటి కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. రాజ్‌మహల్... హోరాహోరీ ఈ స్థానంపై కాంగ్రెస్ క్రమంగా పట్టు కోల్పోయింది. 1989లో తొలిసారి జేఎంఎం నెగ్గింది. అప్పట్నుంచి కాంగ్రెస్, బీజేపీ, జేఎంఎం మధ్య చేతులు మారుతూ వస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ విజయం జేఎంఎంనే వరిచింది. 2019లో విజయ్‌కుమార్ హన్స్డా లక్ష ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి హేమ్లాల్ ముర్ముపై వరుసగా రెండోసారి గెలిచారు. ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. బీజేపీ ఈసారి రాజ్‌మహల్ లోక్‌సభ స్థానం పరిధిలోని బోరియో సిట్టింగ్ ఎమ్మెల్యే తాలా మరాండీని రంగంలోకి దించింది. సీపీఎం నుంచి గోపెన్ సోరెన్ కూడా తలపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్టీనా?.. కోడలు పిల్లనా?.. సంకటంలో శిబు సోరెన్?
జార్ఖండ్ రాజకీయాల్లో గత నాలుగు దశాబ్దాలుగా దుమ్కా పార్లమెంటరీ నియోజకవర్గం కీలకంగా మారింది. జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ పురిటి గెడ్డ దుమ్కాకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. వృద్ధుడైన శిబు సోరెన్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ దుమ్కా గతంలో కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.తాజాగా దుమ్కా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ ఎన్నికల బరిలోకి దిగారు. ఇది మొదలు ఆమె జేఎంఎంపై మాటల యుద్ధం చేస్తున్నారు. దీనికి ప్రతిగా శిబు సోరెన్ చిన్న కోడలు కల్పనా సోరెన్ తన భర్త, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపినందుకు బీజేపీని కార్నర్ చేస్తున్నారు.ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో శిబు సోరెన్ రాజకీయ ప్రతిష్ట దిగజారుతున్నదనే వాదన వినిపిస్తోంది. ఓ వైపు పార్టీ, మరోవైపు ఇంటి పెద్ద కోడలు.. మధ్యలో శిబు సోరెన్ నలిగిపోతున్నారని వినికిడి. ఇది సోరెన్ కుటుంబానికి మాత్రమే కాకుండా బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. 2019లో బీజేపీకి చెందిన సునీల్ సోరెన్ దుమ్కా నుంచి గెలిచి, శిబు సోరెన్ కోటను కూల్చివేశారు. ఈసారి సీతను అభ్యర్థిగా నిలబెట్టి, జేఎంఎం (కూటమి)ని గందరగోళపరిచేందుకు బీజేపీ ప్లాన్ చేసింది.అయితే జేఎంఎం.. బీజేపీ అభ్యర్థి సీతకు వ్యతిరేకంగా కుటుంబం నుండి ఎవరినీ అభ్యర్థిగా నిలబెట్టలేదు. అయితే చిన్న కోడలు కల్పనా సోరెన్‌కు పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించింది. పార్టీ ఈ స్థానం టిక్కెట్‌ను నలిన్ సోరెన్‌కు కేటాయించింది. 1952లో మొదటిసారిగా దుమ్కా స్థానానికి ఎన్నికలు జరిగాయి. నాడు కాంగ్రెస్‌కు చెందిన పాల్ జుజార్ సోరెన్ విజయం సాధించారు. అప్పటి నుండి ఈ లోక్‌సభ స్థానం 19 ఎన్నికల్లో 11 సార్లు సోరెన్ వర్గం చేతికే దక్కింది. శిబు అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అయితే ఆయన పార్టీ ఆప్తమిత్రుడు నళిన్ సోరెన్ జెఎంఎం సత్తా చాటేందుకు రంగంలోకి దిగారు.2019 ఎన్నికల డేటా ప్రకారం జార్ఖండ్‌లోని దుమ్కా లోక్‌సభ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 10 లక్షల 25 వేల 968. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా 20 లక్షల 59 వేల 611. ఇక్కడి జనాభాలో 92 శాతం మంది గ్రామాల్లో, మిగిలిన వారు నగరాల్లో నివసిస్తున్నారు. కుల సమీకరణలను పరిశీలిస్తే ఎస్సీ కేటగిరీ జనాభా 7.84 శాతం, ఎస్టీ కేటగిరీ జనాభా 37.39 శాతంగా ఉంది. -
విపక్షాలు చల్లే బురదలోనే కమల వికాసం
దుమ్కా: ‘‘బురద చల్లి మోదీని భయకంపితులను చేయగలమని ప్రతిపక్ష నాయకులు అనుకుంటున్నారు. వారు ఎంత ఎక్కువ బురద చల్లితే అన్ని ఎక్కువ కమలాలు విరగబూస్తాయి. ఆ సంగతి వారికి అర్థం కావడం లేదు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విపక్ష నాయకుల బండారం తాను బయటపెడుతుండటంతో వారు తట్టుకోలేక తనపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కొని ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టడానికి విపక్ష ‘ఇండియా’ కూటమి కుట్రలు చేస్తోందని ఆరోపించారు.తాను జీవించి ఉన్నంతకాలం రిజర్వేషన్లను కాపాడుతానని ప్రకటించారు. మంగళవారం జార్ఖండ్‌లోని దుమ్కా, పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. జూన్ 4 తర్వాత అవినీతిపై యుద్ధం ఉధృతం చేస్తామని వెల్లడించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను లంచాలు తీసుకోనని, ఎవరినీ తీసుకోనివ్వనని తేలి్చచెప్పారు. ఒకవేళ ఎవరైనా లంచాలు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందేనని, ఇది తన కొత్త గ్యారంటీ అన్నారు. ‘లవ్ జిహాద్’ పుట్టింది జార్ఖండ్‌లోనే... జార్ఖండ్‌లోని సంథాల్ పరగణాల్లో గిరిజనుల జనాభా తగ్గిపోతోందని, అక్రమ వలసలే ఇందుకు కారణమని ప్రధానిమంత్రి మండిపడ్డారు. జేఎంఎం ప్రభుత్వం అక్రమ వలసదార్లను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. అక్రమ వలసదార్లు గిరిజనుల భూములు కబ్జా చేస్తున్నారని, మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారని, వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ‘లవ్ జిహాద్’ పదం మొదట జార్ఖండ్‌లోనే పుట్టిందన్నారు.జేఎంఎం ప్రభుత్వం మత రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఓటు జిహాద్ చేసేవారిని సంతోషపర్చడానికి ఓబీసీ యువత హక్కులను కాజేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రధాని మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. బాగ్‌బజార్‌లోని శారదా మాత ఇంటిని దర్శించుకున్నారు. ఆమెకు నివాళులరి్పంచారు. అనంతరం శ్యామ్బజార్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నివాళులరి్పంచారు. మూడు రోజులపాటు మోదీ ధ్యానం⇒ ఈ నెల 30 నుంచి కన్యాకుమారి ⇒ వివేకానంద రాక్ మెమోరియల్‌లో ధ్యానం చేయనున్న ప్రధాని న్యూఢిల్లీ/చెన్నై: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజులపాటు ధ్యానం చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం నుంచి వచ్చే 1వ తేదీ సాయంత్రం దాకా తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో ఆయన ధ్యానం చేస్తారని బీజేపీ నేతలు మంగళవారం వెల్లడించారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ గుహలో ధ్యానం చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఆయన దక్షిణాదిని ఎంచుకున్నారు. స్వామి వివేకానందను మోదీ తన ఆధ్యాతి్మక గురువుగా భావిస్తుంటారు. కన్యాకుమారి రాక్ మెమోరియల్‌లో వివేకానంద మూడు రోజులపాటు ధ్యానం చేశారు. శివుడి కోసం పార్వతీదేవి ఇక్కడే తపస్సు చేశారని చెబుతుంటారు. ఇప్పుడు అదే ప్రదేశంలో మోదీ ధ్యానం చేయబోతున్నారు. -
Lok Sabha Election 2024: సిట్టింగ్ సీట్లలో గట్టి పోటీ
ఆరో విడతలో భాగంగా జార్ఖండ్‌లో 4 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. ఇవన్నీ ఎన్డీఏ సిట్టింగ్ స్థానాలే కావడం విశేషం. మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ బీజేపీ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమంటూ జేఎంఎం ప్రచారంలో హోరెత్తిస్తోంది. బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఆదివాసీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయతి్నస్తోంది. ఆరో విడత స్థానాలపై ఫోకస్... ధన్‌బాద్ బొగ్గు గనుల స్థావరం. ఇక్కడి ఓటర్లలో 62 శాతం పట్టణవాసులే. ఎస్సీలు 16 శాతం, ఎస్టీలు 8 శాతముంటారు. యూపీ, బిహార్, పశి్చమబెంగాల్ నుంచి వలస వచ్చినవారు ఎక్కువ. 2009 నుంచి బీజేపీ కంచుకోటగా ఉంది. హ్యాట్రిక్ కొట్టిన సిట్టింగ్ ఎంపీ పశుపతినాథ్ పోటీకి దూరంగా ఉండటంతో ఎమ్మెల్యే దుల్లు మహతోకు బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి అనుపమా సింగ్ పోటీ పడుతున్నారు. వీరిపై రెండు పారీ్టల్లోనూ అసంతృప్తే ఉంది. బీఎస్పీ, సమతా, ఆజాద్ సమాజ్, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా వంటి పారీ్టలు, స్వతంత్రులు... ఇలా మరో డజను మంది బరిలో ఉన్నారు.జంషెడ్పూర్ దీన్ని టాటా నగర్, స్టీల్ సిటీ అని కూడా పిలుస్తారు. టాటా స్టీల్ అతిపెద్ద ప్లాంట్ ఇక్కడ ఉంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బిద్యుత్ బరణ్ మహతో హాట్రిక్‌పై కన్నేశారు. 2019లో ప్రస్తుత సీఎం చంపయ్ సోరెన్‌పై 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారాయన. మాజీ ఎమ్మెల్యే కునాల్ సారంగికి టికెటివ్వకపోవడం ఒడిశావాసుల ఓట్లపై ప్రభావం చూపేలా ఉంది. కాకపోతే కురి్మ–మహతో ఓటర్లు 3 లక్షలకు పైగా ఉండటం మహతోకి కలిసొచ్చే అంశం. 27 శాతమున్న ఆదివాసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జేఎంఎం నుంచి సమీర్‌కుమార్ మొహంతీ బరిలో ఉన్నారు.రాంచీ సిట్టింగ్ ఎంపీ సంజయ్ సేత్‌ను కాదని 2014లో గెలిచిన రామ్ తహాల్ చౌదరికి బీజేపీ ఈసారి టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి సు¿ోద్కాంత్ సహాయ్ కుమార్తె, ప్రముఖ న్యాయవాది. యశస్వి పోటీ చేస్తున్నారు. తండ్రి ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడం ఆమెకు కలిసొచ్చే అంశం. అయితే ఎంపీగా సంజయ్ పనితీరుపై ఏకంగా 73 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు గతేడాది ఓ సర్వేలో తెలిసింది. రాష్ట్రంలో బీజేపీకి ఆయన బలమైన గళంగా నిలుస్తున్నారు.గిరిధ్ బీజేపీకి బలమైన స్థానమిది. పొత్తులో భాగంగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)కు విడిచిపెట్టింది. ఏజేఎస్‌యూ సిట్టింగ్ ఎంపీ చంద్రప్రకాశ్ చౌదరి మరోసారి పోటీ చేస్తున్నారు. జేఎంఎం నుంచి మధుర ప్రసాద్ మహతో బరిలో ఉన్నారు. వీరిద్దరికీ స్వతంత్ర అభ్యర్థి జైరాం కుమార్ మహతో గట్టి సవాల్ విసురుతున్నారు. ముగ్గురు నేతలూ కుర్మి సామాజికవర్గీయులే. టైగర్ జైరాంగా పిలిచే జైరాం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల మంచి స్పందన కూడా వస్తోంది. దీంతో పోటీ ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
షోకాజ్ నోటీసులపై స్పందించిన బీజేపీ ఎంపీ
రాంచీ: జార్ఖండ్ బీజేపీ తనకు షోకాజ్ నోటీసులు పంపించటం తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా అన్నారు. ఇటీవల ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని, పార్టీ క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనటంలేదని జార్ఖండ్ బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిపై బుధవారం జయంత్ సిన్హా స్పందిస్తూ జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరికి లేఖ రాశారు.‘‘జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరీ పంపిన షోకాజ్ నోటీసులు అందుకున్న నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అసలు తనను పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ర్యాలీలు, సంస్థాగత సమావేశాలకు కనీస ఆహ్వానం పంపలేదు. పార్టీ హజారీబాగ్ స్థానంలో మనీష్ జైశ్వాల్‌ను బరిలోకి దించుతున్నట్ల ప్రకంటించిన సమయంలో నా పూర్తి మద్దతు తెలియజేశా. మనీష్‌కు అభినందనలు తెలియజేశా. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూ కొత్త అభ్యర్తికి మద్దతు ఇస్తానని తెలిపా. అయితే నేను ప్రచారంలో పాల్గొనాలని పార్టీ భావించి ఉంటే నాకు కచ్చితంగా సమాచారం అందించేది. జార్ఖండ్‌కు సంబంధించిన ఓ సీనియర్ గాని, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరూ నన్ను సంప్రదించలేదు. నాకు ఎటువంటి పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాలను పిలుపు రాలేదు’’ అని జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరి ఆధిత్య సాహుకు లేఖ ద్వారా తెలిజేశారు.My response to Shri Aditya Sahu ji’s letter sent on May 20, 2024 pic.twitter.com/WfGIIyTvdz— Jayant Sinha (Modi Ka Parivar) (@jayantsinha) May 22, 2024 ఇక.. జయంత్ సిన్హా మార్చిలోనే తాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని, ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరమే తాను ప్రాతినిధ్యంలో వహిస్తున్న హజారీబాగ్ పార్లమెంట్ స్థానంలో మనీష్ జైశ్వాల్‌ను బీజేపీ బరిలోకి దించిన విషయం తెలిసిందే. -
హేమంత్ సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. జనవరిలో ఈడీ సొరెన్‌ను ఆరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. రాంచీ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్న ఫిర్యాదులో వాస్తవాలను బయటపెట్టకపోవటంపై ప్రశ్నించింది. దీంతో తాము దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు సొరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసే అవకాశాలు ఉన్నందున బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరిచుకున్నారు. దీంతో మాజీ సీఎం సొరెన్ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. జార్ఖండ్ మొత్తం 14 లోక్‌సభ సీట్లలో ఇప్పటి వరకు 7 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మరో 7 స్థానాకలు ఆరో విడత( మే 25), ఏడో విడత (జూన్ 1)న పోలింగ్ జరగనుంది. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం పాల్గొనడాడికి మధ్యంతర బెయిల్ కోరుతూ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనపై దాఖలైన నగదు అక్రమ చలామణీ కేసులో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా సొరెన్ చెడగొట్టేందుకు ప్రయత్నించొచ్చని సుప్రీంకోర్టుకు తెలిపింది -
ఓటర్లకు స్ఫూర్తి ఆ వృద్ధ మహిళలు..! ఆ ఏజ్‌లోనూ..
ఆ మహిళా ఓటర్లకు చేతులెత్తి దండం పెట్టాల్సిందే. ఓటర్లకు స్పూర్తి వాళ్లు. ఈ రోజు జరుగుతున్న ప్రజాస్వామ్య పెద్ద వేడుకలో భాగం అయ్యేందుకు తమ వంతుగా వస్తున్న ఆ వృద్ధ మహిళా ఓటర్లకు హ్యాట్సాప్ అని చెప్పాల్సిందే. ఒక వృద్ధురాలు కర్ర ఊతంతో రాగ, మరోకరు నార్మల్‌గా నడుచుకుంటూ వచ్చారు. ఇద్దరు అత్యంత వృద్ధులే కానీ ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధతనుక కనబరుస్తూ బాధ్యతగా ఓటు వేయడానికి వచ్చిన ఆ వృద్ధ మహిళలకు స్కూల్ పిల్లల చేత పూల వర్షంతో ఘనంగా స్వాగం పలికారు అధికారులు. మిగతా ఓటర్లందరికి స్ఫూర్తి ఆ ఇద్దరూ మహిళలు. హ్యాట్సాప్ అని చెప్పకుండా ఉండలేం కదూ..!. అందుకు సంబంధించిన వీడియోని జార్ఖండ్ ఎలక్షన్ కమిషన్ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.बुजुर्ग मतदाताओं का बूथ पर कुछ इस तरह पुष्प-वर्षा कर किया गया अभिनंदन..!#SeniorVoters #YouAreTheOne #Phase4@ECISVEEP @SpokespersonECI 🎥 DEO, Simdega. pic.twitter.com/cQtAZ5yHFJ— Chief Electoral Officer, Jharkhand (@ceojharkhand) May 13, 2024 (చదవండి: మహిళలు ఓటు వేస్తున్నారా..! ఈ ఎన్నికల్లో మీదే కీలక తీర్పు..!) -
Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
తూర్పు భారతంలో కీలక రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఎన్నికల పర్వానికి రంగం సిద్ధమైంది. సోమవారం తొలి దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం 4 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కేంద్ర గిరిజన శాఖ మంత్రి, జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా, మాజీ సీఎం మధు కోడా భార్య గీత, మాజీ డీజీపీ విష్ణు దయాళ్ రామ్ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 10 జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ నాలుగూ రిజర్వ్డ్ స్థానాలే కావడం విశేషం. పలాము ఎస్సీ, మిగతా మూడు ఎస్టీ నియోజకవర్గాలు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తదితరులు ఇక్కడ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో పోటీ ప్రధానంగా బీజేపీ; కాంగ్రెస్, జేఎంఎంలతో కూడిన విపక్ష ఇండియా కూటమి మధ్యే ఉంది. 2019 ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాల్లో మూడు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ నెగ్గాయి... ఖుంటీ కేంద్ర మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ అర్జున్ ముండా మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్ ముండాపై కేవలం 1,445 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారాయన. కాంగ్రెస్ నుంచి మళ్లీ కాళీచరణే బరిలో ఉన్నారు. ఖుంటీ బీజేపీ కంచుకోట. ఆ పార్టీ నేత కరియా ముండా ఇక్కడ ఏకంగా ఎనిమిదిసార్లు గెలిచారు. గిరిజనుల ఆరాధ్యుడు బిర్సా ముండా స్వగ్రామం ఉలిహట్ ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. గత నంబర్లో మోదీ ఈ గ్రామాన్ని సందర్శించి బిర్సా ముండాకు నివాళులర్పించారు. పేదరికం, మానవ అక్రమ రవాణా, మావోయిజం, నల్లమందు సాగు ఇక్కడి ప్రధాన సమస్యలు. కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్‌కు గిరిజనుల్లో పలుకుబడి ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. కూటమి భాగస్వామి జేఎంఎం మాజీ ఎమ్మెల్యే బసంత్ కుమార్ లోంగా రెబల్‌గా పోటీ చేస్తున్నారు. దాంతో ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌కు ఓట్ల బదిలీ ఏ మేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.సింగ్భమ్ కాంగ్రెస్ పారీ్టకి బలమైన స్థానమిది. ఐదుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు బీజేపీ, ఒసారి జేఎంఎం, ఐదుసార్లు జార్ఖండ్ పార్టీ గెలిచాయి. సింగ్భమ్లో మాజీ సీఎం మధు కోడా కుటుంబానికి గట్టి పట్టుంది. 2009లో మధు కోడా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2014లో మాత్రం బీజేపీ నేత లక్ష్మణ్ గిలువా చేతిలో ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో మధు కోడా భార్య గీత కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం ఇదే. కానీ గీత గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ దీన్ని జేఎంఎంకు కేటాయించింది. దీంతో ఇక్కడ గెలుపును జేఎంఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర మంత్రిగా చేసిన ఐదుసార్లు ఎమ్మెల్యే జోబా మాంఝిని రంగంలోకి దింపింది.లోహర్దగ ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. అయితే సిట్టింగ్ ఎంపీ సుదర్శన్ భగత్‌ను పక్కన పెట్టి సమీర్ ఒరాన్‌కు టికెటిచి్చంది. గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి సుఖ్‌దేవ్ భగత్ ఈసారీ బరిలో ఉన్నారు. జార్ఖండ్ పార్టీ నుంచి దియోకుమార్ ధాన్ పోటీ చేస్తున్నారు. బిష్ణుపూర్ జేఎంఎం ఎమ్మెల్యే చమ్రా లిండా కూడా ఇండిపెండెంట్‌గా బరిలో ఉండటం విశేషం! ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంది. ఈ నియోజకవర్గంలో 70 శాతానికి పైగా గిరిజన జనాభాయే.పలాము రాష్ట్రంలో ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ లోక్‌సభ స్థానం. మాజీ డీజీపీ విష్ణు దయాళ్ రామ్ బీజేపీ టికెట్‌పై 2019లో 4.77 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి ఆర్జేడీ తరఫున మమతా భూయాన్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2009లో జేఎంఎం గెలవగా 2014లో విష్ణు దయాళ్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి నెగ్గారు. ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ పలాములో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. మమతా భూయాన్ రాజకీయాలకు కొత్తయినా ఇక్కడ ఆమె సామాజిక వర్గం ఓటర్లు 4.5 లక్షలకు పైగా ఉంటారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో నాలుగు బీజేపీ చేతిలోనే ఉన్నాయి.అక్కడ తొలిసారి ఓటింగ్ సింగ్భమ్ లోక్‌సభ స్థానం పరిధిలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ. దాంతో మారుమూల గ్రామాల్లోని వారికి ఓటేసే అవకాశం ఉండేది కాదు. అడవులు, కొండల్లోని అలాంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలు కూడా దశాబ్దాల విరామం తర్వాత ఈసారి ఓటేయనున్నారు. అనేక కష్టనష్టాలకోర్చి అక్కడ 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం పోలింగ్ సిబ్బంది కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లారు. దట్టమైన అడవిలో ఉన్న సరండ అనే మారుమూల గ్రామానికైతే హెలికాప్టర్ ద్వారా ఎన్నికల సామగ్రిని తరలించారు. ఏ ఓటరూ ఓటింగ్‌కు దూరంగా ఉండొద్దన్నది తమ సంకల్పమని వెస్ట్ సింగ్భమ్ జిల్లా ఎన్నికల అధికారి కులదీప్ చౌదరి తెలిపారు.మహిళల ఓట్లే కీలకం సింగ్భమ్, ఖుంటి, లోహర్దగ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం మహిళల చేతుల్లో ఉందని చెప్పాలి! ఎందుకంటే అక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. జార్ఖండ్‌లో గిరిజన మహిళలు పురుషులతో సమానంగా సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఓటింగ్‌లోనూ చురుకైన పాత్ర పోషిస్తుంటారు. దాంతో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ, ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలూ చేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ ప్రేమ జంట టీ దుకాణానికి వినియోగదారుల క్యూ!
మన దేశంలో టీ అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో.. తేనీరులో అనేక రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రుచి అంటే ఇష్టం. ఏదిఏమైనా టీ లేకుండా చాలామందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక ప్రేమ జంట విక్రయిస్తున్న టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ప్రేమ జంట తయారు చేసే టీ, వారు ఏర్పాటు చేసిన టీ స్టాల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటూ, అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జార్ఖండ్‌లోని రాంచీలో వీరు ఈ వినూత్న టీ దుకాణాన్ని నడుపుతున్నారు. ప్రేమ జంట మనీష్, పుతుల్ కుమారి ఇద్దరూ కలసి ఈ టీ స్టాల్‌ను ప్రారంభించారు. ఓ కంపెనీలో కలుసుకున్న వీరు ఈ రోజు సొంతగా టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.మనీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను శారదా గ్లోబల్ యూనివర్సిటీ నుంచి బీటెక్ చేశానని, ఆ తర్వాత గోద్రెజ్ టెక్ మహీంద్రాలో పనిచేశానని తెలిపారు. అదే సమయంలో పుతుల్‌ను కలిశానని, తాము ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉన్నామన్నారు. తాము ఏదో ఒక వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని ఈ టీ స్టాల్ ప్రారంభించామన్నారు. ప్రస్తుతం రాంచీలోని తమ స్టాల్ ఎంతో ఆదరణ పొందుతున్నదని, ఇక్కడికి టీ తాగడానికి చాలామంది వస్తుంటారని తెలిపారు.తమ పాకెట్ మనీతో ఈ స్టాల్ ఓపెన్ చేశామని మనీష్ తెలిపారు. చిన్నగా వ్యాపారం ప్రారంభించి, క్రమంగా దానిని విస్తరించాలనుకున్నామన్నారు. తాము మట్టి కుండలో రకరకాల టీలను అందిస్తామని తెలిపారు.ప్రస్తుతం తాము రోజూ సాయంత్రం టీ దుకాణం తెరిచి, 500 కప్పుల టీలు విక్రయిస్తున్నామని తెలిపారు. రాంచీలో మరిన్ని టీ స్టాల్స్ తెరవాలనేది తమ కల అని, ఏ పని అయినా ప్రాణం పెట్టి చేస్తే విజయం సాధిస్తామని మనీష్ తెలిపారు. తాము ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నామని, భవిష్యత్తులో ఈ సంబంధాన్ని కొనసాగిస్తామని మనీష్ పేర్కొన్నారు. -
గుట్టలుగా... అవినీతి కట్టలు
ఆరు కౌంటింగ్ మిషన్లు... పదుల కొద్దీ సిబ్బంది... 12 గంటల పైగా లెక్కింపు... 32 కోట్లకు పైగా విలువైన నగదు... దాదాపు అన్నీ అయిదొందల నోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని గాడీఖానా చౌక్‌లోని ఆ చిన్న రెండు బెడ్రూమ్ల ఫ్లాట్‌లో అంత పెద్ద మొత్తం, పెద్ద పెద్ద సంచీల కొద్దీ నోట్ల కట్టలు ఉంటాయని ఎవరూ ఊహించరు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో పేరుకుపోయిన అవినీతికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాటి సోదాల్లో ఎదురైన దృశ్యాలే కళ్ళుచెదిరే సాక్ష్యాలు. సదరు శాఖ మంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి ఇంట, ఆ కార్యదర్శికి పనివాడి ఫ్లాట్‌లో, ఇతరుల వద్ద సోదాల్లో మొత్తం కలిపి రూ. 35 కోట్ల పైనే బయటపడేసరికి అంతా అవాక్కయ్యారు. అంతలేసి ధనం లెక్కాపత్రం లేకుండా ఎవరింట్లోనైనా ఉందంటే, అది అక్రమధనం కాక మరేమిటి? ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’ (పీఎంఎల్ఏ) కింద వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇక, మంగ ళవారం రాంచీలో మరో 5 చోట్ల సోదాలు జరిపితే, ఓ కాంట్రాక్టర్ వద్ద 1.5 కోట్లు దొరికాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్... ఇలా ప్రాంతాలు, ప్రభుత్వాలు ఏవైనా సోదా చేస్తే చాలు... నల్లధనం విశ్వరూపం గుట్టల కొద్దీ కట్టల రూపంలో సాక్షాత్కరిస్తున్న తీరు ఆందోళనకరం.జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పై నుంచి కింద దాకా సమస్తం అవినీతిమయమేనని ఈడీ మాట. తీగ లాగితే డొంకంతా కదలడానికి తాజా కేసు ఉదాహరణ. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర∙గ్రామీణాభివృద్ధి శాఖలో ఛీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కేవలం పదివేల రూపాయల లంచం తీసుకున్నందుకు జరిగిన ఆ అరెస్టు కథ చివరకు అనూహ్యంగా ఇంత పెద్ద కరెన్సీ గుట్టు విప్పింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చిన్నస్థాయిలోనే ఉన్నప్పటికీ, అవినీతి పరులైన ఉద్యోగులు నిఘా సంస్థల కంటబడకుండా తమ అక్రమార్జనను ఎలా తరలిస్తున్నదీ వీరేంద్రరామ్ విచారణలో తెలిసింది. సంక్లిష్టమైన అవినీతి వ్యవస్థలో తాను, తన లాంటి అధికారుల కోటరీ ఎలా భాగమైనదీ, టెండర్ల ప్రక్రియ సందర్భంగా లంచం సొమ్మును వివిధ మార్గాల్లో తరలించే పద్ధతీ ఆయన బయటపెట్టారు. ఆ వివరాలకు తగ్గట్లే... గ్రామీణాభివృద్ధి శాఖలో విస్తృతంగా అవినీతి సాగుతోందని గ్రహించిన ఈడీ తగిన చర్య చేపట్టాల్సిందిగా గత ఏడాది మేలోనే రాష్ట్ర సర్కారుకు గోప్యంగా లేఖ రాసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెద్దగా స్పందించలేదు. పైగా, నిఘా నీడలోని అవినీతి అధికారుల చేతిలోనే ఆ లేఖ పడడం విడ్డూరం.తిరుగులేని సాక్ష్యాధారాలు లభించడంతో గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగిర్ ఆలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌లాల్ సహా పలువురు కీలక అనుమానితులపై ఈ సోమవారం ఈడీ దాడులు జరిపింది. కాంట్రాక్టులు ఇస్తూ అవినీతి ముఠాలో కీలకంగా వ్యవహరిస్తూ, లాల్ కోట్లు కూడ బెట్టారట. లాల్ పనివాడి ఇంట్లో ఏకంగా రూ. 32 కోట్ల పైగా డబ్బు గుట్టలుగా దొరకడంతో వ్యవహారం సంచలనమైంది. ఇదికాక, మరో వ్యక్తి ఇంట్లో మరో 3 కోట్లు దొరికిందంటే, అక్కడి ప్రభుత్వ శాఖలో ఏ స్థాయిలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయో అర్థమవుతోంది. ఈడీ దాడుల్లో లభించిన దస్తావేజులను బట్టి ముందుగా ఊహించిట్టే ఇందులో మంత్రి గారి హస్తం ఉండనే ఉందని రుజువవుతోంది. ఆయన మెడకు ఉచ్చు బిగుస్తోంది. జార్ఖండ్‌లోని పాకూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డెబ్భై ఏళ్ళ ఈ సీనియర్ కాంగ్రెస్ నేతను ఈడీ ప్రశ్నించడమే ఇక బాకీ. పనివాడినీ, అతని ఇంటిని అవినీతి సొమ్ముకు గిడ్డంగిగా మార్చిన వ్యక్తిగత కార్యదర్శినీ అరెస్ట్ చేసినా అమాత్యవర్యులు అదరక, బెదరక అమాయకత్వం ప్రకటిస్తుండడం విడ్డూరం. జార్ఖండ్‌లోని చంపాయ్ సోరెన్ ప్రభుత్వంపై పడ్డ ఈ అవినీతి మచ్చ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి బాగా అంది వస్తోంది. కాంగ్రెస్‌కు పెద్దదిక్కయిన గాంధీ కుటుంబానికి సన్నిహితులైన వారి ఇళ్ళల్లోనే గతంలోనూ, మళ్ళీ ఇప్పుడూ... ఇంత భారీగా అక్రమ ధనం లభించడాన్ని వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రస్తావిస్తున్నారు. అవినీతిని ఆపడానికి తాను ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమను విమర్శిస్తున్నాయని ఆయన వాదన. కాగా, ఇదంతా ప్రత్యర్థులే లక్ష్యంగా మోదీ సర్కార్ సాగిస్తున్న దర్యాప్తు సంస్థల దుర్వినియోగమని ప్రతిపక్ష కూటమి ఆరోపణ. గత డిసెంబర్లో జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన ఒడిశా మద్యం డిస్టిలరీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపితే, కనివిని ఎరుగని రీతిలో రూ. 350 కోట్ల పైగా మొత్తం దొరికిన సంగతి తెలిసిందే. పరస్పర ఆరోపణలెలా ఉన్నా, ఈ ఘటనలన్నీ ప్రమాదకరమైన పరిణామాన్ని సూచిస్తు న్నాయి. అక్రమధనంపై దీర్ఘకాలంగా దేశవ్యాప్త ఉద్యమం జరుగుతూనే ఉంది. దర్యాప్తు సంస్థలు చురుగ్గానే ఉన్నాయి. అయినా సమస్య తీరకపోగా, కొత్తవి బయటపడడం పెను సవాలు. అవినీతిని అంతం చేసి, అక్రమధనాన్ని అందరికీ పంచిపెడతామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు గత పదేళ్ళుగా గద్దె మీదే ఉన్నారు. అవినీతి, కుటుంబ పాలనపై పోరాటమని చెబుతూనే వస్తున్నారు. ఫలితం శూన్యం. పెద్దనోట్ల రద్దు లాంటివి ఎంత విఫలయత్నాలో అర్థమవుతూనే ఉంది. ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల్లో నిందితులైన నేతలు సైతం జెండా మార్చి, కాషాయం కప్పుకుంటే పరమ పునీతులైపోతున్న పరిస్థితులూ చూస్తున్నాం. ఏలికల చేతుల్లో ఏజెన్సీలు, పీఎంఎల్ఏ లాంటి అసమంజస కఠిన చట్టాలున్నా సమస్య తీరకపోవడానికి కారణమేమిటో ఆలోచించాలి. ఇవాళ వ్యాపారం, రాజకీయాలు, సమాజం ఏ స్థితికి చేరాయో గ్రహించాలి. నేతలు, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ఒకరి కోసం ఒకరు నడిచే తీరు దేశానికి క్షేమం కాదు. ఎన్నికల వేళ ఈ అక్రమధనం పెనుసమస్య. దాని పర్యవసానాలు ఎన్నికలపైనే కాదు, ఆ తర్వాతా ఉంటాయని విస్మరించరాదు. -
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
రాంచీ: కాంగ్రెస్ నేత, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) పనిమనిషి ఇంట్లో బ్యాగుల కొద్దీ నోట్ల కట్టలు బయటపడటం సంచలనం రేపుతోంది. సోమవారం రాంచీలోని గడీఖానా చౌక్‌లోని పనిమనిషి జహంగీర్ ఆలం ఫ్లాట్‌లో సోదాలు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బయటపెట్టారు. మంత్రి ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ కూడా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారని చెబుతున్నారు. దాదాపుగా అన్నీ రూ.500 నోట్ల కట్టలు కాగా, కొన్ని ఆభరణాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు 17 గంటలపాటు లెక్కించిన సొమ్ము రూ.35.23 కోట్లుగా తేలిందన్నారు. ఆరు యంత్రాలతో లెక్కింపు కొనసాగుతోందని చెప్పారు. మొత్తం ఆరు చోట్ల సోదాలు జరపగా మరో చోట రూ.3 కోట్ల నగదు బయటపడినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామంపై కాంగ్రెస్‌కు చెందిన మంత్రి ఆలం స్పందిస్తూ.. ప్రభుత్వం నాకు సమకూర్చిన ప్రైవేట్ కార్యదర్శికి చెందిన ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు టీవీల్లో చూశానన్నారు. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. గత ఏడాది అరెస్ట్ చేసిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ రిటైర్డు చీఫ్ ఇంజినీర్ వీరేంద్రకుమార్ రామ్‌పై ఉన్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా దాడులు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో రామ్‌కు చెందిన రూ.39 కోట్ల ఆస్తులను సైతం అటాచ్ చేసింది. -
జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు
-
జార్ఖండ్‌లో ఈడీ సోదాలు.. భారీగా పట్టుబడ్డ నోట్ల కట్టలు
రాంచీ: జార్ఖండ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. సోమవారం రాంచీలోని పలుచోట్ల ఈడీ సోదాలు చేపట్టగా.. మంత్రి అలంగీర్ సన్నిహితుడి ఇంట్లో సుమారు రూ. 25 కోట్ల భారీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.జార్ఖండ్ మంత్రి అలంగీర్ సన్నిహితుల ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రకారం.. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి అలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజయ్ లాల్ ఇంట్లోని గది నిండా ఉన్న భారీ నోట్ల కట్టలను ఈడీ స్వాధీనం చేసుకుంది. 70 ఏళ్ల అలంగీర్ ఆలం పాకూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్నారు.‘‘జార్ఖండ్‌లో అవినీతి అంతం కావటం లేదు. ఈ డబ్బును ఎన్నికల్లో పంచాలని ప్రణాళిక వేశారు. దీనిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతూల్ సహదేవ్ అన్నారు. -
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
హెయిర్ కంటింగ్ అనేది అటు పురుషులకు, ఇటు అందంగా కనిపించాలనుకునే మగువలకు తప్పనిసరి. కొందరు ఫ్యాషన్‌తో కూడిన హెయిర్ కటింగ్ కోసం పలు సెలూన్లను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి హెయిర్ కంటింగ్ ఎక్కడైనా రూ. 10కే చేస్తున్నారని తెలిస్తే జనం క్యూ కట్టకుండా ఉండలేరు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ది హెయిర్ స్టోరీ పేరుతో ఓ నూతన సెలూన్ ప్రారంభమయ్యింది. ఇక్కడ మే నెల అంతటా పురుషులు, మహిళలు అనే బేధం లేకుండా అందరికీ అడ్వాన్స్ హెయిర్ కటింగ్ కేవలం రూ. 10కే చేస్తున్నారు.ఈ సందర్భంగా ది హెయిర్ స్టోరీ డైరెక్టర్ సన్నీ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇది కొత్త సెలూన్ అయినందున ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నామని, ప్రకటనలు, మార్కెటింగ్ కోసం లక్షలు ఖర్చు చేయడం కంటే ఆఫర్లను అందించడం ఉత్తమమని ఆయన తెలిపారు.పురుషులకు రూ. 200, స్త్రీలకు 350 విలువైన హెయిర్ కంటింగ్ సర్వీస్‌ను రూ. 10కే అందిస్తున్నామని తెలిపారు. తాము అందిస్తున్న ఆఫర్ చూసి, ప్రతీరోజూ వందమందికిపైగా జనం వస్తున్నారని, మా సెలూన్లో హెయిర్ డ్రెస్సర్లుగా నలుగురు యువకులు, ఆరుగురు యువతులు పనిచేస్తున్నారని సన్నీ తెలిపారు. ఇక్కడికి వచ్చే జనం తమ హెయిర్ కటింగ్ కోసం నాలుగు గంటలకుపైగా సమయం వెచ్చించాల్సి వస్తున్నదన్నారు. -
PM Narendra Modi: వచ్చే ఐదేళ్లు అవినీతిపై యుద్ధమే
సిసాయ్/దర్భంగా: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అవినీతిపరుల ముసుగు తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే ఐదేళ్లలో అవినీతిపై యుద్ధం సాగిస్తామని, అవినీతి తిమింగలాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు ఇక తప్పించుకోలేరని తేలి్చచెప్పారు. శనివారం జార్ఖండ్‌లోని సిసాయ్, పాలాము, బిహార్‌లోని దర్భంగాలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు అవినీతిపరులకు మద్దతుగా రాంచీలో, ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు. జనం సొమ్ము దోచుకున్నవారికి మద్దతుగా మాట్లాడారని, వారి ఆసలు రంగు బయటపడిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినందుకే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి(హేమంత్ సోరెన్) ఇప్పుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నాడని చెప్పారు. అవినీతి భూతాన్ని భూస్థాపితం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఎన్నికల సభల్లో నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. యూపీఏ పాలనలో ఆకలి చావులు ‘‘అభివృద్ధిలో గిరిజన ప్రాంతాలు వెనుకంజలోనే ఉండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం. 2004 నుంచి 2014 దాకా యూపీఏ ప్రభుత్వ పాలనలో ఆహార ధాన్యాలు గోదాముల్లో పందికొక్కుల పాలయ్యాయి. అప్పట్లో ఎంతోమంది గిరిజనుల బిడ్డలు తగిన ఆహారం లేక ఆకలితో మాడిపోయారు. సోనియా గాంధీ–మన్మోహన్సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ రాచరిక పాలనలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. మేము అధికారంలోక వచ్చాక పరిస్థితి మారిపోయింది. పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచడాన్ని అప్పటి పాలకులు వ్యతిరేకించారు. కేవలం సంపన్నులకే ఆ సదుపాయం ఉండేది. మేమొచ్చాక మారుమూల ప్రాంతాల్లోనూ అందరికీ ఇంటర్నెట్ అందుతోంది. డేటాను చౌకగా అందుబాటులోకి తీసుకొచ్చాం. నేడు సోషల్ మీడియాలో యువత హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు. గోద్రా ఘటనపై బోగస్ నివేదిక 20 ఏళ్ల క్రితం గుజరాత్లో గోద్రా రైలు దహనం ఘటనకు బాధ్యులైన వారిని కాపాడేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు(లాలూ ప్రసాద్ యాదవ్) ప్రయతి్నంచారు. కరసేవలకుపైనే నింద మోపారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో ఆయన సహవాసం చేశారు. సోనియా మేడమ్ హయాంలోనే గోద్రా రైలు దహనం జరిగింది. 60 మందికిపైగా కరసేవకులు మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి నియమించిన బెనర్జీ కమిషన్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. బోగస్ నివేదిక సమరి్పంచేలా జాగ్రత్తపడ్డారు. అసలు దోషులను కాపాడుతూ కరసేవకులనే బాధ్యులుగా చిత్రీకరించారు. ఆ నివేదికను న్యాయస్థానం చెత్తబుట్టలో పడేసింది. అసలు దోషులను గుర్తించి శిక్ష విధించింది. కొందరికి మరణశిక్ష పడింది’’ అని ప్రధాని మోదీ వివరించారు. సాధారణ జీవితం గడుపుతున్నా.. ‘‘కాంగ్రెస్ రాజకుమారుడు నోట్లో వెండి చెంచాతో పుట్టాడు. పేదల ఇళ్లను సందర్శిస్తూ కెమెరాలకు పోజులిస్తున్నాడు. నేను సాధారణ జీవితమే గడుపుతున్నా. పేదల కష్టాలు నాకు తెలుసు కాబట్టి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రారంభించా. దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. నేను గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పదవుల్లో ఉన్నప్పటికీ నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నాకు సొంత ఇల్లు, సొంత సైకిలు కూడా లేదు. జార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం నాయకులు అవినీతికి పాల్పడుతూ తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు’’ గిరిజనులపై అకృత్యాలు సహించం ‘‘మావోయిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడానికి మావోయిస్టుల జోలికి వెళ్లలేదు. నిషేధిత తీవ్రవాద సంస్థలు గిరిజన మహిళలపై అత్యాచారాలకు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. గిరిజనుల భూములను లూటీ చేస్తున్నాయి. ఇలాంటి అకృత్యాలు సహించే ప్రసక్తే లేదు’’ -
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ 2024 ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగానే మోదీ జార్ఖండ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి రహిత పాలన సాగించానని అన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 15 ఏళ్ల కాలంలో.. ప్రధానమంత్రిగా కొనసాగిన 10 సంవత్సరాల కాలంలో కూడా నాపైన ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ కూడా లేదని మోదీ స్పష్టం చేశారు. నా తల్లి, సోదరీమణులు దూరంగా ఉన్నాను. నాకు ఆనందం ముఖ్యం కాదు, ప్రజలు నా మీద ఉంచిన విశ్వాసమే ముఖ్యమని అన్నారు.500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం , జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ముఖ్యమైన మైలురాళ్లుగా పేర్కొంటూ, తన నాయకత్వంలో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రధాని నొక్కిచెప్పారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా ముందుకు సాగుతుందని అన్నారు.కాంగ్రెస్ కూటమి నాయకుల అవినీతి విధానాలను మోదీ ఖండించారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం తన దార్శనికతతో వారి స్వయంసేవ ఉద్దేశాలను విభేదించారు. జేఎంఎం, కాంగ్రెస్ నేతలు అవినీతితో అపారమైన సంపదను కూడబెట్టుకున్నారని ప్రధాని ఆరోపించారు.మోడీ ఒక లక్ష్యం కోసం పుట్టారు.. జేఎంఎం-కాంగ్రెస్ నేతలు అవినీతితో అపారమైన సంపదను కూడబెట్టారు. నాకు సైకిల్ కూడా లేదు. కానీ వారు తమ పిల్లలకు కూడా వారసత్వంగా ఎన్నో సమకూర్చారు. కానీ మీరంతా నా వారసులు. మీ పిల్లలు, మనవరాళ్లకు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు.పేద, అట్టడుగు వర్గాలకు చెందిన వారి జీవితాలపై ప్రభుత్వ పథకాల పరివర్తన ప్రభావాన్ని ప్రధాన మంత్రి వివరించారు. గత 10 సంవత్సరాలలో.. మీకు ఇల్లు, విద్యుత్, గ్యాస్, నీరు అన్నీ బీజేపీ ప్రభుత్వం అందించిందని మోదీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ మద్దతును కొనసాగించాలని.. అభివృద్ధి, పురోగతి కోసం ప్రజలకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. -
జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
న్యూఢిల్లీ, సాక్షి: జార్ఖండ్ కాంగ్రెస్ ఖాతాను ‘ఎక్స్’ (ట్విటర్) నిలిపివేసింది. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఎక్స్ ఈ చర్య తీసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎస్ఐ నివేదించింది. ఈ హ్యాండిల్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన 'డీప్‌ఫేక్ మార్ఫ్డ్ వీడియో' పోస్ట్ చేసిన తర్వాత ఖాతాను ‘ఎక్స్’ నిలిపివేసింది.మరోవైపు జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్‌కు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బుధవారం తెల్లవారుజామున సీఆర్పీసీ సెక్షన్ 91 కింద నోటీసు జారీ చేసింది. మే 2న సెల్ కార్యాలయంలో హాజరు కావాలని కోరింది. ‘ఢిల్లీ పోలీసుల నుండి నోటీసు అందింది. కానీ నాకు ఎందుకు నోటీసు ఇచ్చారో అర్థం కాలేదు. ఇది అరాచకం తప్ప మరొకటి కాదు’ అని ఠాకూర్ స్పందించినట్లుగా పీటీఐ పేర్కొంది. -
జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ.. ఆరోగ్యశాఖ అప్రమత్తం!
జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. రాంచీలోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హోత్వార్‌లోని ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్‌లో కేసులు నిర్ధారణ అయిన దరిమిలా పలు కోళ్లతో సహా నాలుగు వేల వివిధ రకాల పక్షులను అంతమొందించారు. వందలాది గుడ్లను ధ్వంసం చేశారు. ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లూ) కనిపించిన ప్రాంతం నుంచి ఒక కిలోమీటరు పరిధిలో చికెన్, కోళ్లు, గుడ్లు అమ్మకాలను నిషేధించారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లను శాస్త్రీయ పద్ధతుల ద్వారా తొలగించనున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కోళ్లు, ఇతర పక్షులు, గుడ్లు కొనుగోళ్లు, అమ్మకాలపై పూర్తి నిషేధం ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జిల్లా వైద్యశాఖ అధికారులు బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతంలోని ఇంటింటికీ తిరుగుతూ అక్కడివారిని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కూడా చనిపోయిన పక్షులు కనిపిస్తే తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. -
Lok Sabha Elections 2024: 20 ఏళ్ల తర్వాత ఓటు
న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత జార్ఖండ్‌లోని సింగ్భూమ్ లోక్‌సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు రెండు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా 2024 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం మావోయిస్టులకు కంచుకోటల్లాంటి మారుమూల ప్రాంతాల్లో 118 బూత్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కుల్దీప్ చౌదరి చెప్పారు. ఆసియాలోనే అత్యంత దట్టమైన సాల్ అడవుల్లో ఉన్న సరండా వంటి 118 గ్రామాల్లోకి మే 13వ తేదీన జరిగే పోలింగ్‌కు సిబ్బందితోపాటు సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా పంపుతామన్నారు. నుగ్డి గ్రామంలోని మిడిల్ స్కూల్, బొరెరో గ్రామంలోని మధ్య విద్యాలయలో మొదటిసారిగా పోలింగ్ బూత్‌లను నెలకొల్పామన్నారు. కొన్ని ప్రాంతాల్లోకి సిబ్బంది నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. ఏ ప్రాంతాన్నీ వదలకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ‘ఆపరేషన్ అనకొండ’ ద్వారా భద్రతా బలగాలు తల్కోబాద్ వంటి 25 వరకు గ్రామాల్లో 15 కొత్త క్యాంపులను ఏర్పాటు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశాయని పేర్కొన్నారు. 121 పోలింగ్ బృందాలను రైళ్ల ద్వారా పంపించామన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారికి ఇళ్ల వద్దే ఓటు వేసే సదుపాయం కలి్పంచినట్లు చెప్పారు. ఎస్టీ్ట రిజర్వుడు స్థానమైన సింగ్భూమ్లో బీజేపీ నుంచి మాజీ సీఎం మధు కోడా భార్య, సిట్టింగ్ ఎంపీ గీతా కోడా రంగంలో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యరి్థని ప్రకటించాల్సి ఉంది. -
సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్ భేటీ
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో ఉన్న సీఎం నివాసానికి ఆమె వెళ్లారు. సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్‌లు సుమారు 20 నిమిషాల సేపు మాట్లాడుకున్నారని అధికారులు తెలిపారు. అనంతరం కల్పన మీడియాతో మాట్లాడారు. ‘సునీతా జీతో ఆవేదన, బాధను పంచుకునేందుకు ఇక్కడికి వచ్చా. ఆమె తన పరిస్థితిని వివరించారు. తుది వరకు పోరాడాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. యావత్తూ జార్ఖండ్ ప్రజలు కేజ్రీవాల్ వెన్నంటే ఉంటారు’అని చెప్పారు. ‘జార్ఖండ్‌లో రెండు నెలల క్రితం జరిగిందే ఢిల్లీలో పునరావృతమైంది. నా భర్త హేమంత్ జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు. జార్ఖండ్, ఢిల్లీల్లో పరిస్థితులు ఒకేలా ఉన్నాయి’అని చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని కలిసి, పరిస్థితిని వివరిస్తానన్నారు. భూకుంభకోణం మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, కల్పనా సోరెన్, జార్ఖడ్ సీఎం చంపాయి సోరెన్‌తోపాటు ఆదివారం ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొంటారని సమాచారం. సునీతా కేజ్రీవాల్ కూడా ర్యాలీలో పాలు పంచుకుంటారని ఆప్ నేతలు తెలిపారు. -
అసెంబ్లీ ఉప ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలతోపాటు జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్‌లోని బగిదోర అసెంబ్లీ నుంచి సుభాష్ తంబోలియాకు టికెట్ ఇవ్వగా, గాండే అసెంబ్లీ నుంచి దిలీప్ కుమార్ వర్మను పోటీకి దింపింది. ఏప్రిల్ 26న రాజస్థాన్‌లోని బగిదోర అసెంబ్లీలో ఉప ఎన్నిక జరగనుండగా, గాండే అసెంబ్లీకి మే 20న ఉప ఎన్నిక జరగనుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దాదాపు 96.8 కోట్ల మంది ప్రజలు 12 లక్షలకు పైగా పోలింగ్ స్టేషన్లలో రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫేజ్ 1లో ఏప్రిల్ 19న 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 స్థానాలకు రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాషాయ పార్టీ 24 సీట్లు గెలుచుకోగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే పొందగలిగింది. -
Sita Soren: జేఎమ్ఎమ్కు రాజీనామా.. గంటల్లోనే బీజేపీలో చేరిక
జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీత సోరెన్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. జేఎంఎం పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆమె కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు, వచ్చే ఏడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీత సోరెన్ పార్టీ మార్పు చర్చనీయాంశంగా మారింది. కాగా జేఎమ్ఎమ్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతా సోరెన్ శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ సతీమణీ. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన అవుతుంది. అనారోగ్యంతో దుర్గా సోరెన్ 2009లో మరణించారు. అప్పుడు ఆయన వయసు 39 ఏళ్లు. అయితే భర్త మరణానంతరం తనను, తన కుటుంబాన్ని సోరెన్ కుటుంబ సభ్యులు పక్కన పెట్టారని ఆరోపిస్తూ మంగళవారం జేమ్ఎమ్ పార్టీకి సీత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీలోని అన్ని పదవులకు, జార్ఖండ్ అసెంబ్లీలోని జామా స్థానానికి కూడా ఆమె రాజీనామా చేశారు. ‘కుటుంబంలోనే కాదు పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని తాను నిర్లక్ష్యానికి గురవుతున్నానని ఆరోపించారు. తనకు, తన కుతూళ్లకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు.. ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా పార్టీ నడుస్తోందని విమర్శించారు. అయిష్టంగానే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు మామ శిబు సోరెన్‌కు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులు, కుటుంబం తమను వేరు చేసే విధంగా వ్యవహరించడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. -
జేఎంఎంకు సీతా సోరెన్ రాజీనామా!
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఓటుకు నోటు కేసులో సీతా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. సీతా సోరెన్ జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌కు పెద్ద కోడలు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు వదిన. ఆమె దుమ్కాలోని జామా అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో శిబు సోరెన్ పెద్ద కుమారుడు. నాటి జేఎంఎం ప్రధాన కార్యదర్శి దుర్గా సోరెన్ బొకారోలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పటికి అతని వయస్సు కేవలం 39 సంవత్సరాలు. దుర్గో సోరెన్ మృతికి అతని కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని చెబుతుంటారు. సోదరుని మరణానంతరం పార్టీలో హేమంత్ సోరెన్ స్థాయి పెరిగింది. కాగా రాష్ట్రంలో జరిగే అక్రమ మైనింగ్, రవాణా సమస్యపై సీతా సోరెన్ తరచూ తన గొంతు వినిపించేవారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో జన్మించిన సీతా సోరెన్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె తండ్రి పేరు బోడు నారాయణ్ మాంఝీ. తల్లి పేరు మాలతీ ముర్ము. అక్టోబర్ 2021లో ఆమె కుమార్తెలు రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తమ తండ్రి పేరిట పార్టీని స్థాపించారు. దీనికి దుర్గా సోరెన్ సేన అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని అవినీతి, నిర్వాసిత, భూ దోపిడీ తదితర సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యమని రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తెలిపారు. రాజశ్రీ బిజినెస్ మేనేజ్మెంట్, జయశ్రీ లా కోర్సు చదువుకున్నారు. -
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌కు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరగాల్సి ఉంది. అయితే ఈలోపు జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయనే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరిగేదాకా సీపీ రాధాకృష్ణన్ గవర్నర్‌గా కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వుల సారాంశం. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్.. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్. 1998, 99 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో బీజేపీ బలపడేందుకు ఎన్నో పోరాటాలు చేశారాయన. అలాగే.. బీజేపీ తరఫున ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆయన జార్ఖండ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు. -
జార్ఖండ్‌లో కొలిక్కిరాని ఇండియా కూటమి సీట్ల కేటాయింపు
త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడేందుకు అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. అయితే జార్ఖండ్‌లో ఎన్‌న్డీఏ కూటమి సీట్ల కేటాయింపు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ప్రతిపక్ష పార్టీ బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దాని మిత్రపక్షాలు కూడా ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే ఇండియా కూటమిలో సీట్ల కేటాయింపు సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. రెండు సీట్ల విషయంలో చిక్కుముడి పడిందని సమాచారం. సీట్ల కేటాయింపు విషయంలో ఆర్జేడీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాలము సీటు ఆర్జేడీకి ఖరారుకాగా, చత్రా సీటు కోసం ఆర్జేడీ కూడా పట్టుపడుతోంది. మంత్రి సత్యానంద్ భోక్తా ఈ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఈ సీటును వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఆర్జేడీ సీట్ల కేటాయింపులో ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఆయన బీహార్ సమీకరణల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ నేపధ్యంలో జార్ఖండ్‌లో సీట్ల పంపకంలో గందరగోళం కొనసాగుతోంది. లోహర్దగా సీటు కోసం అటు జేఎంఎం, ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. జేఎంఎం నుంచి చమ్రా లిండా ఈ సీటు కోసం ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు హజారీబాగ్ స్థానంలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి ఎవరూ దొరకలేదు. -
బీజేపీకి నో చెప్పా... ఈడీ వచ్చింది: జార్ఖండ్ ఎమ్మెల్యే
రాంచీ: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తున్నాయి. చివరి నిమిషంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారేవారికి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితాల్లో చోటు దక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపపథ్యంలో జార్ఖండ్‌లోని బర్కాగాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చిందని ఈ ఆఫర్ రిజెక్ట్ చేసినందుకే తన నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో అర్ధరాత్రి దాడులు చేస్తోందన్నారు. VIDEO | ED raids to break morale ahead of LS polls: Congress MLA Amba Prasad's mother READ: https://t.co/J7UeiSbEIC "I was offered an MP ticket from the BJP for Hazaribagh, which I declined. Some people from the BJP side pressurised me to contest from the side of BJP MP Chatra.… pic.twitter.com/rDocABkLvp — Press Trust of India (@PTI_News) March 12, 2024 ‘నాకు బీజేపీ హజారీబాగ్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. కొందరు బీజేపీ నేతలు నన్ను ఛాత్రా నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారు. ఈ ఆఫర్లను నేను తిరస్కరించాను. దీంతో ఈడీని రంగంలోకి దించి నాపై దాడులు చేయిస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని ఎమ్మెల్యే మండిపడ్డారు. మనీలాండరింగ్ కేసులో అంబ ప్రసాద్‌కు సంబంధించిన 17 ప్రదేశాల్లో ఈడీ మంగళవారం అర్ధరాత్రి సోదాలు ప్రారంభించింది. జార్ఖండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా ఉన్న అంబ ప్రసాద్ మాజీ మంత్రి యోగేంద్ర సా కుమార్తె. హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అంబప్రసాద్ కుటుంబానికి గట్టి పట్టుండటం గమనార్హం. #WATCH | Ranchi, Jharkhand: The Enforcement Directorate (ED) leaves after conducting raids on the premises of Congress MLA Amba Prasad for almost 18 hours. pic.twitter.com/2vrhhMimsW — ANI (@ANI) March 12, 2024 ఇదీ చదవండి.. పోలీసుల బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్‌స్టర్, రివాల్వర్ రాణి -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెటర్ షాబాజ్ నదీమ్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఇవాళ (మార్చి 5) ప్రకటించాడు. వయసు పైబడటంతో పాటు టీమిండియాకు ఆడే దారులు మూసుకుపోవడంతో తాను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు నదీమ్ వెల్లడించాడు. మన్ముందు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. 34 ఏళ్ల నదీమ్ 2019-2021 మధ్యలో టీమిండియా తరఫున రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. జార్ఖండ్ స్టార్ స్పిన్నర్‌గా పేరున్న నదీమ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 140 మ్యాచ్‌లు ఆడి 542 వికెట్లు పడగొట్టాడు. నదీమ్ జార్ఖండ్ తరఫున రంజీల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. నదీమ్‌కు రంజీల్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇతను 2015-16, 2016-17 సీజన్లలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. నదీమ్‌కు లిస్ట్-ఏ క్రికెట్లోనూ ఘనమైన రికార్డు ఉంది. నదీమ్ ఈ ఫార్మాట్లో 134 మ్యాచ్‌లు ఆడి 175 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో నదీమ్ పేరిట అత్యుత్తమ గణాంకాల రికార్డు (8/10) నమోదై ఉంది. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన నదీమ్‌కు ఐపీఎల్‌ల్లో కూడా ప్రవేశం ఉంది. నదీమ్.. 2011 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడుతూ వివిధ జట్ల తరఫున 72 మ్యాచ్‌ల్లో 48 వికెట్లు పడగొట్టాడు. నదీమ్ 2022 నుంచి లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలో సభ్యుడిగా ఉన్నాడు. నదీమ్ 2011లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున అత్యుత్తమంగా రాణించి ఐపీఎల్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. -
Lok Sabha elections 2024: ‘మోదీ గ్యారంటీల’తో గెలుస్తాం
బర్వాడా/సింద్రీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400కుపైగా సీట్లు సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మోదీ గ్యారంటీలే తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా ‘మోదీ గ్యారంటీ’ అనే నినాదం గట్టిగా వినిపిస్తోందని చెప్పారు. ప్రజల ఆశలు అంతమైన చోటునుంచే మోదీ గ్యారంటీ ప్రారంభమవుతుందని మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లాలోని సింద్రీలో రూ.35,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అనంతరం ‘విజయ్ సంకల్ప్ మహార్యాలీ’లో ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అబివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా కూడా ఒకటి అని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 8.4 వృద్ధిరేటు నమోదైందని, ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉందని వెల్లడించారు. ప్రజల కలలే మా ప్రతిజ్ఞ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. జార్ఖండ్‌లో అధికార జేఎంఎం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. రూ.350 కోట్ల నగదుతో జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ దొరికిపోవడాన్ని మోదీ ప్రస్తావించారు. అన్ని నోట్ల కట్టలు తన జీవితంలో ఏనాడూ చూడలేదని అన్నారు. ఆ సొమ్మంతా జార్ఖండ్ ప్రజలదేనని తేలి్చచెప్పారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సిన డబ్బును కాంగ్రెస్ నేతలు లూటీ చేశారని ధ్వజమెత్తారు. వారు దోచుకున్న సొమ్మును తిరిగి వసూలు చేసి, ప్రజలకు అందజేస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు. జార్ఖండ్ ప్రజలు కష్టపడి పనిచేస్తారని, వారి కష్టం వృథా కానివ్వబోమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఎంత బురద చల్లినా కమలం(బీజేపీ గుర్తు) ప్రతిచోటా వికసిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ‘ప్రజల కలలే మా ప్రతిజ్ఞ, వారి సంక్షేమమే మోదీ గ్యారంటీ’ అని స్పష్టం చేశారు. తన జీవితంలో ప్రతిక్షణం ప్రజలకే అంకితం అని పేర్కొన్నారు. జనం బాగు కోసమే తాను పని చేస్తున్నానని వెల్లడించారు. దేశంలో గత పదేళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని హర్షం వ్యక్తం చేశారు. పేదరికాన్ని పూర్తిగా అంతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు. సందేశ్‌ఖాలీపై నోరు విప్పరెందుకు? ప్రధాని మోదీ శుక్రవారం పశి్చమ బెంగాల్లో పర్యటించారు. హుగ్లీ జిల్లాలోని అరామ్‌బాగ్‌లో రూ.7,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ పాలనలో అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయని మోదీ మండిపడ్డారు. సందేశ్‌ఖాలీలో మహిళలు ఘోరమైన అకృత్యాలు జరిగాయని, దీనిపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు. సందేశ్‌ఖాలీలో మన అక్కచెల్లెమ్మలను తృణమూల్ కాంగ్రెస్ నేతలు వేధించారని, అత్యాచారాలు చేశారని, ఇది నిజంగా సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. నిందితులను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. -
జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం
రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితుల ఆధారంగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం జంతారా జిల్లా కళాఝారియా రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అసాన్సోల్-ఝాఝా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. #Jharkhand: Nearly 12 people have lost their lives in a #trainaccident near #KalijhariyaHalt under #Asansol railway division in #Jamtara district. According to sources, these people have been cut off by a passing Express train between #Asansol and #Jhajha. pic.twitter.com/8Zhi2C2zyK — All India Radio News (@airnewsalerts) February 28, 2024 -
Jharkhand: మంత్రి పదవుల ముసలం.. హస్తినలో ఎమ్మెల్యేలు బిజీ!
న్యూఢిల్లీ: జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రి పదవుల ముసలం పుట్టింది. చంపయ్ సోరేన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంతో తమకు మంత్రి పదవులు దక్కలేదని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. అక్కడితో ఆగకూండా ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలడానికి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. తాజాగా చంపయ్ సోరేన్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు చెందిన ఆలంగీర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, బాదల్ పత్రలేఖ్లకు మళ్లీ మంత్రి పదవులు ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘మేము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలవడానికి ఢిల్లీ వచ్చాం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ. వేణుగోపాల్, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గేతో మా సమస్యలు చెబుతాం’ అని ఎమ్మెల్యే రాజేష్ కచాప్ తెలిపారు. ఢిల్లీ బయలుదేరే ముందు మరో ఎమ్మెల్యే కుమార్ జైమంగల్ అలియాస్ అనూప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్లోకి తీసుకున్న నలుగురు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు. అంత కంటే ముందు.. మంత్రి పదవులపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు జేఎంఎం పార్టీకి చెందిన కొత్త మంత్రి బసంత్ సొరెన్‌ను కలిసి తమ అసంతృప్తి తెలియజేశారు. అయితే సమావేశం అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ... ‘రెండు పార్టీల మధ్య ఎటువంటి అనిశ్చితి లేదు. తామంతా ఐకమత్యంగా ఉన్నాం’ అని చెప్పారు. మరోవైపు.. అసంతృప్త ఎమ్మెల్యేల కంటే ముందే సీఎం చంపయ్ సొరెన్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ ఢిల్లీలో చేరుకున్నారు. వీరు కూడా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. కేబినెట్లో నలుగురు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వకపోతే.. ఫిబ్రవరి 23న జరిగే అసెంబ్లీ సమావేశాలకు అసంతృప్త ఎమ్మెల్యేలు హాజరుకాకుండా జైపూర్పు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం చంపయ్ సొరెన్ జనవరి 16 కొత్త కెబినెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2న హేమంత్ సొరెన్‌ను భూకుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో చంపయ్ సొరెన్ జార్ఖండ్‌కు కొత్త సీఎం బాధ్యతలు చేపట్టారు. జేఎంఎం-29, కాంగ్రెస్-17, ఆర్జేడీ-1 స్థానంతో జార్ఖండ్‌లో జేఎంఎం సంకీర్ణం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. రంజీ ట్రోఫీ 2024లో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ తనకు చివరి రెడ్ బాల్ మ్యాచ్ అని వెల్లడించాడు. ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు తన శరీరం సహకరించడం లేదని, అందుకే రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 34 ఏళ్ల వరుణ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో జార్ఖండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తన సొంత మైదానమైన కీనన్ స్టేడియంలో (జంషెడ్పూర్) రాజస్థాన్‌తో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. 2010 దశకంలో టీమిండియా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న వరుణ్.. 2011-15 మధ్యలో 9 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 52 మ్యాచ్‌లు ఆడి 44 వికెట్లు పడగొట్టాడు. 2008లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన వరుణ్ 65 మ్యాచ్‌లు ఆడి 168 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. వరుణ్ దేశవాలీ క్రికెట్లో జార్ఖండ్‌తో పాటు బరోడా జట్టుకు కూడా ఆడాడు. 2014 ఓల్డ్‌ట్రాఫర్డ్ టెస్ట్‌లో రాకాసి బౌన్సర్‌తో ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ ముక్కు పగలగొట్టడం ద్వారా వరుణ్ వెలుగులోకి వచ్చాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
జార్ఖండ్ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ సౌరభ్ తివారి ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 34 ఏళ్ల తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని జంషెడ్‌పూర్‌లో ఇవాళ (ఫిబ్రవరి 12) ప్రకటించాడు. ప్రస్తుత రంజీ సీజన్లో తన జట్టు ప్రస్తానం ముగిసిన అనంతరం తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. దాదాపు 17 ఏళ్ల పాటు జార్ఖండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తివారి.. టీమిండియా తరఫున, ఐపీఎల్లో పలు మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన తివారి.. ఐపీఎల్లో నాలుగు ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచ్‌లు ఆడాడు. తివారికి హార్డ్ హిట్టర్‌గా పేరుంది. అతని ఆహార్యం, హెయిర్ స్టయిల్ చూసి అప్పట్లో అందరూ మరో ధోని అనే వారు. 2010 ఐపీఎల్ సీజన్లో తివారి ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. ఆ సీజన్లో అతను 419 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే తివారికి టీమిండియాలో ఛాన్స్ దక్కింది. భారత్ తరఫున అతను ఆడిన 3 మ్యాచ్‌ల్లో 49 పరుగులు చేవాడు. అంతర్జాతీయ స్థాయి తివారి రాణించలేకపోయినా, దేశావాలీ క్రికెట్లో స్టార్‌గా పేరుంది. అతను జార్ఖండ్ తరఫున 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 22 సెంచరీల సాయంతో 8030 పరుగులు చేశాడు. ఈ గణంకాలు అదే జార్ఖండ్‌కు ప్రాతినిథ్యం వహించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కంటే ఎక్కువ కావడం విశేషం. తివారి కోహ్లి నేతృత్వంలోని అండర్-19 ప్రపంచకప్ (2008) గెలిచిన భారత యువ జట్టులో సభ్యుడు కావడం మరో విశేషం. కోహ్లి చొరవతోనే తివారిని ఆర్సీబీ 2011 సీజన్ కోసం భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. జాతీయ జట్టుకు కాని, ఐపీఎల్లో కాని ఆడనప్పుడు క్రికెట్లో కొనసాగడం వేస్ట్ అని రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించే సందర్భంగా తివారి అన్నాడు. -
రిసార్ట్ పాలిటిక్స్.. తొలిసారి ఎక్కడ ఎప్పుడంటే..?
న్యూఢిల్లీ: దేశంలో పార్లమెంట్ ఎన్నికల ముందు రిసార్ట్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. జార్ఖండ్‌కుచెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం వరకు హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో క్యాంపు వేసిన విషయం తెలిసిందే. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన చంపయ్ సోరెన్ బల పరీక్షలో వారు పాల్గొని సర్కారును విజయవంతంగా గట్టెక్కించారు. జార్ఖండ్ సంక్షోభం ఇలా తెరపడగానే బీహార్‌లో నితీశ్‌కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ,బీజేపీ సర్కారు బలనిరూపణ అంశం తెరపైకి వచ్చింది. ఈ నెల 12న జరిగే నితీశ్ సర్కారు బలపరీక్షకు ముందు పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కడ లాక్కుంటారో అన్న భయంతో కాంగ్రెస్ తమ 16 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌కు తరలించింది. రిసార్ట్‌లలో క్యాంపు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఎమ్మెల్యేలకు రాజకీయ పార్టీలు సకల లగ్జరీ సౌకర్యాలు, వసతులు కల్పిస్తాయి. అదే సమయంలో వారిపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. దేశ్యాప్తంగా రిసార్ట్ పాలిటిక్స్ పాపులర్‌గా మారాయి. అసలు దేశంలోనే తొలిసారిగా 1982లో రిసార్ట్ పాలిటిక్స్ హర్యానాలో ప్రారంభమయ్యాయి. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో ఐఎన్ఎల్డీ,బీజేపీ కూటమికి 37 సీట్లు రాగా, దేశంలోనే శక్తివంతమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు 36 సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా అప్పటి గవర్నర్ కాంగ్రెస్‌ను ఆహ్వానించడంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఐఎన్ఎల్డీ హైకమాండ్ ఎమ్మెల్యేలందరినీ హిమాచల్ ప్రదేశ్‌లోని సొలాన్‌లోని ఓ రిసార్టుకు తరలించి దేశంలోనే తొలిసారిగా రిసార్టు రాజకీయాలకు నాంది పలికింది. ఇదీచదవండి.. విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్ సర్కారు -
జార్ఖండ్ అసెంబ్లీలో నేడు బలపరీక్ష..ఏ పార్టీ బలం ఎంత..?
-
రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్‌కు బలపరీక్ష
రాంచీ: జార్ఖండ్‌లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. నేడు చంపయ్ సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. దీంతో, జార్ఖండ్‌లో ఏం జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, హైదరాబాద్‌లో ఉన్న 40 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్వరాష్ట్రం చేరుకున్నారు. కాగా, జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతిస్తుండగా.. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే, ప్రస్తుత కూటమికి బలపరీక్షను గెలిచే ఛాన్స్ ఉంది. మరోవైపు.. జేఎంఎం ఎమ్మెల్యే లాబిన్ హెమ్‌బ్రోమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. త్వరలోనే ఆ పార్టీతో అన్ని సంబంధాలు తెంచుకుంటానని, గిరిజనుల హక్కుల కోసం అసెంబ్లీ వేదికగా గళమెత్తుతానని లాబిన్ హెమ్‌బ్రోమ్ అన్నారు. తన సలహాను పట్టించుకోనందుకే మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. చోటా నాగ్‌పుర్ అద్దె చట్టం, సంథాల్ పరగణాల అద్దె చట్టం తీసుకొస్తామని 2019 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో జేఎంఎం పేర్కొంది. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు. కేంద్రం ప్రభుత్వం తెచ్చిన పంచాయతీ చట్టం-1996ని కూడా ఇక్కడ అమలు చేయలేదు. తొలి రెండు చట్టాలు గిరిజనులకు భూ హక్కులు కల్పించేవి కాగా, పీఈఎస్ఏ చట్టం గ్రామసభలకు బలాన్నిస్తుంది. గిరిజనుల హక్కులను కాపాడుతుంది. కానీ, ఈ మూడింటినీ హేమంత్ ప్రభుత్వం అమలు చేయలేదు. అందుకే జార్ఖండ్ బచావో మోర్చా ఫోరాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక విష్ణుపూర్ ఎమ్మెల్యే చమ్రాలిండా ఇటీవల జేఎంఎం నిర్వహించిన పార్టీ సమావేశానికి రాలేదు. ఆయన అనారోగ్యం బారిన పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన అసలు ఎవరికీ అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. సోమవారం విశ్వాసపరీక్షకు ఆయన గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. జేఎంఎం వర్గాలు మాత్రం.. తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తున్నాయి. కాగా.. సోమవారం నాటి పరీక్షలో హేమంత్ సోరెన్ ఓటు వేసేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. -
జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.. బిహార్ ఎమ్మెల్యేలు వచ్చారు
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ రాజకీయం అయిపోగానే తెలంగాణలో బిహార్ రాజకీయం ప్రారంభమయింది. 3 రోజుల క్రితం రాంచీ నుంచి వచ్చిన జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోగానే, బిహార్‌కు చెందిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో చంపయీ సొరేన్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చంపయీ సొరేన్ బలనిరూపణకు సోమ వారం వరకు గడువు ఉండడంతో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేటలో ఉన్న ఓ రిసార్టుకు తీసుకువచ్చారు. శుక్ర, శని,ఆదివారం ఉదయం వరకు అక్కడే ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లిపోయారు. వారు అటు వెళ్లిపోగానే బిహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్నా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు వచ్చిన వారికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ ప్రొటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, సీనియర్ నేత మల్రెడ్డి రాంరెడ్డిలు ఎయిర్‌పోర్టులో ఆహ్వానం పలికారు. వారిని అక్కడి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్‌కు తరలించారు. ఈనెల 10వ తేదీన బిహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోనుండటంతో అప్పటివరకు వీరంతా రిసార్ట్‌లోనే ఉంటారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. -
Jharkhand: గవర్నర్‌పై జేఎంఎం నేత కీలక వ్యాఖ్యలు
రాంచీ: జార్ఖండ్‌లో అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఆ రాష్ట్ర గవర్నర్‌పై ఫైర్ అయ్యింది. తమ ప్రభుత్వాన్ని మళ్లీ బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ నేరుగా ఎందుకు ఆదేశించారని, ఈ విషయంలో ఆయనను ఎవరు ప్రభావితం చేశారో చెప్పాలని జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య డిమాండ్ చేశారు. ‘ఎక్కడైనా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే గవర్నర్ కేర్‌టేకర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ గవర్నర్ అలాంటిదేమీ చేయలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జనవరి 31వ తేదీనే మేం సంసిద్ధతను వ్యక్తం చేశాం. మా లెజిస్లేచర్ పార్టీ నేతను ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా గవర్నర్ ఎందుకు ఆహ్వానించలేదు. ప్రజల నుంచి ఉన్న ఒత్తిడి వచ్చిన తర్వాతే గవర్నర్ మమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా పిలిచారు. కానీ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫ్లోర్ టెస్ట్‌కు ఎందుకు ఆదేశించారు. దీనికి హేతుబద్దత ఏంటో తెలియదు. మాకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది’ అని సుప్రియో భట్టాచార్య తెలిపారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం సోమవారం(ఫిబ్రవరి 5) మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంది. మెజార్టీ నిరూపించుకోవడానికి కావాల్సిన సభ్యుల బలం ఇండియా కూటమి ప్రభుత్వానికి ఉందని జేఎంఎం, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదీచదవండి.. విమానంలో మహిళతో అసభ్య ప్రవర్తన -
బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు
రాంచీ: జార్ఖండ్‌లో కొత్తగా ఏర్పాటైన చంపయ్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైన వేళ ప్రభుత్వ సానుకూల ఉత్తర్వును రాంచీ కోర్టు వెలువరిచింది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీలో చంపయ్ సర్కార్ చేపట్టే బలపరీక్షలో పాల్గొనేందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌కు అనుమతినిస్తూ రాంచీలోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. జార్ఖండ్ భూకుంభకోణం ఉదంతంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ హేమంత్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. -
వేధించే తండ్రి, తాగుబోతు భర్త.. కట్ చేస్తే..!
జార్ఖండ్‌కు చెందిన రుక్మణి దేవికి చిన్నప్పటినుంచీ కష్టాలే. భరింలేని పేదరికం. దీనికి తోడు ఆమెకు వినపడదు..మాట్లాడలేదు కూడా. ఈ నేపథ్యంలో తండ్రి వేధింపులు.. తనకంటే చాలా పెద్దవాడైన వ్యక్తితో పెళ్లి. అయినా పెళ్లి తరువాతైనా తన జీవితం బాగుపడుతుందని భావించిన ఆమె పరిస్థితి పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్టయింది. కానీ అన్నింటిని అధిగమించి అందరికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంతకీ రుక్మిణీ దేవీ సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..? ది బెటర్ ఇండియా కథనం ప్రకారం గుమ్లా జిల్లాలో రోజువారీ కూలి పని మీద ఆధారపడే నిరు పేద కుటుంబంలో జన్మించిన ఎనిమిది మందిలో రుక్మిణి కూడా ఒకరు. పైగా తన వైకల్యం గురించి అవహేళనలతో బాల్యమంతా చాలా భారంగా నడిచింది. ఒక్క పక్క కుటుంబం ఆర్థిక పరిస్థితి, మరోపక్క ఎందుకూ పనికిరావంటూ తండ్రి వేధింపులు, హింస. రోజంతా ఇంటి పనులుతోనే సరిపోయేది. పాఠశాల మొఖం ఎన్నడూ చూసింది లేదు. తండ్రి బతుకుదెరువు కోసం రాళ్ళు కొట్టే పనిచేసేవాడు. దీంతో పని ఉన్న రోజే బువ్వ. లేదంటే పస్తే. కొద్దిగా మిల్లెట్స్, అడవి నుండి తెచ్చిన చింతపండు ఇదే ఆధారం ఆ కుటుంబానికి దీనికి తోడు మాటలురాని రుక్మిణి మరింత ‘భారం’గా భావించాడు తండ్రి. ఆమెకంటే 20 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తితో ఆమెకుపెళ్లి చేసేశాడు. ఇక అప్పటినుంచి ఆమెకష్టాలు మరింత పెరిగాయి. రోజూ తాగి వచ్చి భర్త కొట్టేవాడు. ఇంటినుంచి బయటికి గెంటేసేవాడు. ఇలా అతనితో ఉన్నన్ని రోజులు దాదాపు సగం రోజులు పొరుగిళ్లలో దాక్కోవడమే సరిపోయింది. అలా ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. అయితే మద్యానికి బానిసైన భర్త 2014లో క్షయవ్యాధితో మరణించాడు. ఒక విధంగా భర్త మరణం తర్వాత ఆమె జీవితంలో ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనే ఆమె సక్సెస్‌కు బాటలు వేసింది. నెలవారీ వితంతు పింఛనురూ.1000తో నలుగురు పిల్లలను పెంచడం కష్టంగా మారింది. ఈ క్రమంలోగ్రామీణ మహిళలకోసం వ్యవసాయానికి సాయపడే లక్ష్యంతో ఎన్జీవో సంస్థ‘ ప్రదాన్’ 2022లో వర్క్‌షాప్‌ని నిర్వహించింది. ఈ సమావేశానికి గ్రామీణ మహిళలందరూ గ్రామ చౌపాల్‌కు తరలి రావడం చూసి, రుక్మిణీదేవికి కూడా ఆసక్తి పెరిగింది. అసలేంటో చూద్దామని అక్కడి వెళ్లింది. ఇక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. జార్ఖండ్‌లోని నీటి కొరత ఉన్న గ్రామ పంచాయతీలలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రవేశపెట్టింది ప్రధాన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, మేము పొలాల్లో పైపులు వేసి, సౌరశక్తిని ఉపయోగించి నీటిపారుదల కోసం తగిన నీటిని సరఫరా చేయడానికి వాటిని సమీప నదితో అను సంధానించామని ప్రదాన్లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సత్యం శర్మ ది బెటర్ ఇండియాతో చెప్పారు. రుక్మిణి కూడా ప్రధాన్ సాయం తీసుకుంది. అలా నిరుపయోగంగా తన వ్యవసాయ భూమిలో పంట పండించడం మొదలు పెట్టింది. అలా తొలి ఏడాది నాలుగు బస్తాల పెసలు , బంగాళాదుంపలను పండించింది. ఇంటికి ఏడాదికి సరిపడా పప్పులు, ఆలూ గడ్డలతోపాటు రూ. 4,000 ఆదాయం పొందింది. దీంతో చిన్న మట్టి వంటగదిని, పశువుల కోసం షెడ్డును నిర్మించుకుంది. ఇక అప్పటి నుండి అంటే సుమారు ఒకటిర్నరేళ్ల నుంచి రుక్మణి రెండు ఎకరాల భూమిలో సాగును పెంచింది. ఇప్పుడు పెసలు, శనగలు, బీన్స్, బంగాళ దుంపలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఆవాలు వంటి అనేక రకాల కూరగాయలను పండిస్తోంది. ఈ నేల తల్లే తనకు ఎంతో సాయం చేసిందంటూ హర్షం వ్యక్తం చేసింది రుక్మిణి. -
జార్ఖండ్ ప్రభుత్వ బలపరీక్షకు డేట్ ఫిక్స్.. ఎవరి బలమెంత?
జార్ఖండ్‌లో కొత్తగా కొలువుదీరిన సీఎం చంపయ్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్షకు తేదీ ఖరారైంది. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని స్పీకర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి ప్రభుత్వానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో బస చేస్తున్నారు. తమ సంఖ్యా బలాన్ని కాపాడుకునేందుకు, ఇతర పార్టీల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తపడుతున్నారు. సోమవారం ఫ్లోర్ టెస్ట్ జరిగే వరకు కూటమి ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లో ఉండనున్నట్లు జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఇక భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ విచారించడం, అరెస్ట్ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈడీ అరెస్టుకు ముందే సోరెన్ రాజీనామా చేసి స్పీకర్‌కు సమర్పించారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపయ్ సోరెన్‌ను ఎన్నుకున్న తరువాత శుక్రవారం జార్ఖండ్ నూతన సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన తన ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం అసెంబ్లీ బల పరీక్షను ఎదుర్కోనున్నారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. మెజార్జీని నిరూపించుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యే మద్దతు కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జేఎంఎం(28)-కాంగ్రెస్(16)- ఆర్జేడీ(1), సీపీఎంఎల్(1) కూటమికి 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కూడిన ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాజకీయాలు ఏ మలుపు తిరుగనున్నాయో.. ఎవరూ అధికారం చేపట్టనున్నారో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. చదవండి: కేజ్రీవాల్ జైలుకెళ్తే.. ‘ఆప్’ ఏం చేయనుంది? -
జార్ఖండ్ సర్కార్‌ను కూల్చే కుట్ర: రాహుల్
పాకూర్(జార్ఖండ్): హేమంత్ సోరెన్‌ను అక్రమంగా జైలుకు పంపి జార్ఖండ్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ కుట్ర పన్నిందని, ప్రజాతీర్పుకు భంగం కల్గకుండా తాము అడ్డుకున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం జార్ఖండ్‌లోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టిన సందర్భంగా పాకూర్ జిల్లాలో కార్యకర్తలనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాతీర్పును బీజేపీ పరిహసించాలని చూసింది. మేం దానిని అడ్డుకున్నాం. ధనం, దర్యాప్తు సంస్థల అండతో బీజేపీ చెలరేగుతోంది’’అని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు తాను కట్టుబడిఉంటానన్నారు. ‘‘ అస్సాంలో యాత్రకు అడ్డుపడిన సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్రలో పార్టీ మారిన మిలింద్ దేవ్రా వంటి నేతలతో పార్టీకి పనిలేదు’’ అని రాహుల్ అన్నారు. నకిలీ రాహుల్ ఆచూకీ దొరికింది: హిమంత మరోవైపు, అస్సాంలో న్యాయ్‌యాత్ర వేళ బస్సులో రాహుల్ స్థానంలో కూర్చుని అభివాదం చేస్తున్న నకిలీ రాహుల్ ఆచూకీ తామ గుర్తించామని హిమంత చెప్పారు. ‘‘ అస్సాంలో మోదీ పర్యటన ముగిశాక పత్రికా సమావేశం ఏర్పాటుచేసి మరో రాహుల్ వివరాలు బహిర్గతం చేస్తా. జనానికి చేతులు ఊపుతూ, యాత్ర బస్సులో ఉన్నది రాహుల్ కాదు’’ అని హిమంత అన్నారు. -
Jharkhand politics 2024: సీఎంగా చంపయ్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ఆయనతో సీఎంగా ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలంగీర్ అలాం, రాష్రీ్టయ జనతాదళ్(ఆర్జేడీ) నేత సత్యానంద్ భోక్తా రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 67 ఏళ్ల గిరిజన నాయకుడు చంపయ్ సోరెన్ జార్ఖండ్‌కు 12వ ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపయ్ సోరెన్‌ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హేమంత్ సోరెన్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. తమ ఎమ్మెల్యేలపై విపక్ష బీజేపీ వల విసిరే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా వారిని బయటకు తరలించినట్లు కూటమి నేతలు చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్‌తో చంపయ్ సోరెన్ -
రాంచీ టు శామీర్‌పేట
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్‌కు చేరింది. మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపయ్ సోరెన్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉండడంతో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్ పార్టీలకు చెందిన 41 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంప్‌కు తరలించారు. రాంచీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రత్యేక విమానంలో బయలుదేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు నేరుగా బేగంపేట విమానాశ్రయంలో దిగారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌లు వారికి ఆహ్వనం పలికి రెండు ప్రత్యేక బస్సుల్లో శామీర్‌పేటలోని ఓ రిసార్టుకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఈ ముగ్గురు నేతలు ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. బలపరీక్ష జరిగేవరకు ఇక్కడే.. జార్ఖండ్‌లో పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ నేతలు బుధవారమే సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర టీపీసీసీ ముఖ్యులతో టచ్‌లోకి వచ్చారు. ఎమ్మెల్యేలను క్యాంపు కోసం హైదరాబాద్‌కు తీసుకువస్తామనే సమాచారం అందించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నమే వీరు హైదరాబాద్‌కు రావాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో శుక్రవారానికి వాయిదా పడింది. కాగా ఏఐసీసీ నేతలు ఆదేశాల మేరకు టీపీసీసీ వీరి క్యాంపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మాజీ జెడ్పీటీసీ నక్కా ప్రభాకర్‌గౌడ్ పేరిట శామీర్‌పేట రిసార్ట్స్‌లో 38 రూంలు వీరి కోసం బుక్ చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేలంతా మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఈనెల ఐదో తేదీన జార్ఖండ్ అసెంబ్లీలో చంపయ్ సోరేన్ బలనిరూపణ జరగనున్న నేపథ్యంలో అదేరోజు ఉదయం లేదంటే ముందు రోజు అర్ధరాత్రి వారు ప్రత్యేక విమానంలో రాంచీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. శిబిరానికి సీఎం రేవంత్! శుక్రవారం ఇంద్రవెల్లి పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఈ ముగ్గురు నేతలతో సంప్రదింపులు జరిపారని, ఆయన కూడా క్యాంపునకు వెళ్లి జార్ఖండ్ ఎమ్మెల్యేలను కలుస్తారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఎమ్మెల్యేలు సురక్షితంగా ఉంటారన్న ఆలోచనతో వారిని హైదరాబాద్‌కు తరలించాలని ఏఐసీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా క్యాంపు నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను టీపీసీసీ పూర్తి చేసింది. శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు రిస్టార్టుకు వెళ్ళారు. -
ఇంత నాటకీయత దేనికి?!
జార్ఖండ్ చుట్టూ ఈ వారమంతా చోటుచేసుకున్న పరిణామాలు దేశ ప్రజానీకాన్ని నివ్వెరపరిచాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జాడ తెలియడం లేదనీ, ఆయన గురించి జనవరి 27 నుంచి వెదుకుతున్నామనీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత నెల 28న చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 30 గంటల పాటు ఆయన ఆచూకీ లేదు. ఢిల్లీ వెళ్లారన్న సమాచారం ఉన్నా అక్కడి నివాసంలో ఆయన అధికారు లకు చిక్కలేదు. అన్ని మార్గాలనూ దిగ్బంధించి వెతుకులాడిన దర్యాప్తు అధికారులకు చివరకు నిరాశే మిగిలింది. జనవరి 31న ఆయన తనంత తానే రాంచీ నివాసంలో ప్రత్యక్షం కావటం, గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించటం, అటుపై ఆయన్ను రాత్రి 9.30కి ఈడీ అరెస్టు చేయటం చకచకా జరిగిపోయాయి. హేమంత్ స్థానంలో కొత్త సీఎంగా ‘జార్ఖండ్ టైగర్’గా పేరున్న చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈ నెల 5 లోపు బలపరీక్ష నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో జేఎంఎం ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు తరలివచ్చారు. రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు పిలుస్తారో లేదోనన్న ఆందోళన సమసిపోయాక, తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవటం ఎలా అన్నది జేఎంఎంకు సమస్యగా మారినట్టుంది. కూటమి సర్కారులో భాగస్వామి అయినకాంగ్రెస్ మిత్రధర్మంగా తెలంగాణలో తలదాచుకోవటానికి చోటిచ్చింది. ఈ వ్యవహారంలో ఈడీ పట్టుదల... ఏదేమైనా దానికి చిక్కరాదన్న హేమంత్ తీరు... మీడియాకు కావలసినంత మేతనిచ్చాయి. ముఖ్యమంత్రి హోదాలో వున్న నాయకుణ్ణీ, అందులోనూ ఒక ఆదివాసీ నేతనూ వెంటాడటం అంత అత్యవసరం ఎందుకైందో బోధపడదు. ఆయనపై వున్న కేసులు తీవ్రమైనవే కావొచ్చు, వాటి విషయమై ప్రశ్నించాలని ఈడీ అధికారులు భావించివుండొచ్చు... దాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఫోర్జరీ పత్రాలతో ఆయన రాంచీలోనూ, వేరేచోట్లా భూములు కాజేశారని ఆ సంస్థ ఆరోపణ. కానీ ఆయన చట్టానికి దొరక్కుండా తప్పించుకుపోయే సాధారణ వ్యక్తేమీ కాదు. అలాగని బ్యాంకులకు వేలకోట్లు ఎగనామంపెట్టి విదేశాలకు పోయిన కొందరిలా వ్యాపారో, పారిశ్రామికవేత్తో కాదు. ఆయన ఒక రాజకీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్న నాయకుడు. జార్ఖండ్ సీఎం. జనం మధ్యనే ఉండి, వారి మద్దతుతో రాజకీయాల్లో కొనసాగదల్చు కున్నవారు. హేమంత్ సోరెన్ ఉద్దేశపూర్వకంగా ఈడీ సమన్లను బేఖాతరు చేయటం వల్ల వారంలో పూర్తయ్యే దర్యాప్తు నెలరోజులు పట్టొచ్చు. లేదా మరికొన్ని నెలలు కొనసాగొచ్చు. ఈలోగా మిన్ను విరిగి మీద పడుతుందా? ఇప్పటికే 41 చోట్ల సోదాలు చేసి, అయిదు సర్వేలు నిర్వహించామని ఈడీ చెబుతోంది. హేమంత్ ఢిల్లీ నివాసంలో నిర్వహించిన దాడిలో భారీగా నగదు, కీలకమైన పత్రాలు లభించాయన్నది ఈడీ ప్రకటన సారాంశం. ఈ విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నా రని హేమంత్ సోరెన్ ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈడీ సిబ్బందిపై కేసు కూడా పెట్టారు. దేనికైనా సమయం, సందర్భం ఉండాలంటారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రాబోతు న్నాయి. ఈ ఏడాది ఆఖరుకు జార్ఖండ్ అసెంబ్లీ గడువు కూడా ముగుస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ కేసుల్లో ఇరికించి అరెస్టు చేయాలనుకోవటం అప్రదిష్ట పాలు చేయటానికేననీ, తనను రాజకీయంగా దెబ్బతీసే కుట్రనీ హేమంత్ చేస్తున్న ఆరోపణ జనం విశ్వసించే అవకాశం లేదా? హేమంత్ కూడా ఇంత నాటకీయతకు తావివ్వకుండా ఉండాల్సింది. రాజకీయంగా ఆయన ఇబ్బందులు ఆయనకుండొచ్చు. తన అరెస్టు ఖాయమని తెలిశాక తదుపరి సీఎం ఎవరన్న అంశంలో గృహచ్ఛిద్రాలు కమ్ము కున్నాయి. సతీమణి కల్పనా సోరెన్ వైపు ఆయన మొగ్గుచూపగా, హేమంత్ దివంగత సోదరుడి సతీమణి, ఎమ్మెల్యే సీతా సోరెన్ పేచీకి దిగటం సమస్య అయిందంటున్నారు. సంక్షేమ పథకాల అమలులో, మెరుగైన పాలన అందించటంలో హేమంత్ సర్కారుకు మంచిపేరే ఉంది. జార్ఖండ్ ఏర్పడి 24 ఏళ్లు కావస్తుండగా 2014–19 మధ్య అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మినహా ఏ ప్రభుత్వమూ పూర్తిగా అయిదేళ్లూ పాలించలేకపోయింది. అస్థిరత్వమే రాజ్యమేలిన ఆ రాష్ట్రంలో తొలిసారి 2019 ఆఖరులో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమికి 47 స్థానాలు లభించాయి. 81 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో అధికార కూటమికి ఇంత మెజారిటీ ఉండటం అదే మొదటిసారి. చిత్రమేమంటే అంతకు ఆర్నెల్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలకు బీజేపీ–ఏజేఎస్‌యూ కూటమి 12 గెల్చుకుంది. జార్ఖండ్‌లో గతంలో బీజేపీతో జేఎంఎం కూటమి కట్టిన సందర్భాలు లేకపోలేదు. కానీ మౌలికంగా రాష్ట్రంలో తనకు బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అని గ్రహించాక గత దశాబ్ద కాలంగా బీజేపీతో పొత్తుకు జేఎంఎం సుముఖత చూపటం లేదు. పైగా ఆదివాసీలను హిందువులుగా చూపాలన్న సంఘ్ పరివార్ వైఖరికి భిన్నంగా వారిని ప్రత్యేక మతస్థులుగా గుర్తించాలని హేమంత్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణాల వల్లే ఈడీ ఆయన్ను వేధిస్తున్నదని ఆదివాసీలు నమ్మితే అది రాజకీయంగా బీజేపీకి నష్టంగా పరిణమిస్తుంది. ఏదేమైనా ఈ వ్యవహారంలో ఈడీ అత్యుత్సాహం ప్రదర్శించిందన్న అప్రదిష్టను మూటకట్టుకుంది. ఇప్పటికే ఆ సంస్థ తీరును విపక్షాలు తూర్పారబడుతున్నాయి. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా హేమంత్ సోరెన్ మాదిరే ఈడీ సమన్లను ధిక్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ సంయమనంతో వ్యవహరించి నిందకు తావులేకుండా చూసుకోవాలి. అలాగే జార్ఖండ్‌లో ఎలాంటి రాజకీయ అస్థిరతకూ బీజేపీ తావీయరాదు. -
రెండు ప్రత్యేక విమానాల్లో బేగంపేటకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు
-
హైదరాబాద్‌లో ‘రిసార్ట్’ పాలిటిక్స్.. జాలీగా జార్ఖండ్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. రాంచి బిర్సా ముండా ఎయిర్‌పోర్టు నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు మొత్తం 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వారిని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్స్‌కు తరలించారు. జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష తేదీ ఖరారయ్యే వరకు హైదరాబాద్ క్యాంపులో జార్ఖండ్ కాంగ్రెస్ జేఎంఎం ఎమ్మెల్యేలు ఉండనున్నారు. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్‌కు ఏఐసీసీ అప్పగించింది. కాగా, నిన్న మధ్యాహ్నం నుంచే జార్ఖండ్ రాజకీయ అలజడి ప్రారంభం కాగా, హైదరాబాద్‌లో గురువారం రాత్రే జడ్పీటీసీ నక్కా ప్రభాకర్‌గౌడ్ పేరిట రూమ్‌లు బుక్ అయ్యాయి. హైదరాబాద్ క్యాంపునకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకోవడంతో ఇంద్రవెల్లి పర్యటన నుంచే ఎప్పటికప్పుడు రేవంత్ టచ్‌లో ఉన్నారు. రాత్రికి జార్ఖండ్ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణం -
జార్ఖండ్‌లో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం
-
హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్.. టీపీసీసీ భారీ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్ రాజకీయం నడుస్తోంది. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్‌కు టీపీసీసీ అప్పగించింది. ఇందులో భాగంగా జార్ఖండ్ కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలు నేడు హైదరాబాద్‌కు రానున్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ వారి కోసం మూడు హోటల్స్‌ను సిద్ధం చేసింది. గచ్చిబౌలి, రామోజీ ఫిల్మ్ సిటీ, శామీర్‌పేట్ లియోనియో హోటల్స్‌ను టీపీసీసీ బుక్ చేసింది. ఈ క్రమంలో 43 మంది ఎమ్మెల్యేలను హోటల్స్‌కు తరలించేందుకు బస్సులను కూడా సిద్ధం చేశారు. కాగా, జార్ఖండ్‌లో బలపరీక్ష నిరూపణ వరకు ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. మరోవైపు.. కొద్దిసేపటి క్రితమే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ
సుప్రీంకోర్టులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోలేమని.. ముందుగా హైకోర్టుకు వెళ్లాలని తెలిపింది. కాగా భూ కుంభకోణంలో తన అరెస్టు అక్రమమంటూ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లను చట్టవిరుద్ధం, తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనంటూ పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు సంజీవ్‌ఖన్నా, ఎంఎం సుందరేష్, బేల ఎం త్రివేదిలతో కూడిన ప్రత్యేక త్రిసభ ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. కాగా హేమంత్ సోరెన్ మొదట జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే సోరెన్ తరపు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, హైకోర్టు నుంచి పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఈ ఇద్దరు న్యాయవాదులు గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరై తమ పిటిషన్‌పై అత్యవసర జాబితా కింద విచారించాలని పేర్కొన్నారు. హేమంత్ సోరెన్ బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అలాగే సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు జార్ఖండ్‌లో నేడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని జేఎంఎం శాసనసబాపక్షనేత చంపయ్ సోరెన్‌ను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ గురువారం రాత్రి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. చదవండి: ఎన్నికల్లో గెలవాలనే అందర్నీ జైలుకు పంపుతోంది: మమత -
ఎన్నికల్లో గెలవాలనే అందర్నీ జైలుకు పంపుతోంది: మమత
కోల్‌కతా: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలందరినీ జైళ్లకు పంపుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఒక వేళ తనను జైలుకు పంపినా బయటకు రాగలనని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలకు గాను రాష్ట్రంలో కాంగ్రెస్‌తో జట్టుకట్టేందుకు తమ టీఎంసీ పార్టీ ఆసక్తి చూపినా ఆ పార్టీ తిరస్కరించిందన్నారు. కాగా మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్ ఆధీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వీడిన సందిగ్ధత
-
జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెర
రాంచీ: జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేసి 24 గంటలు గడిచిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జేఎంఎం శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్‌ను జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గురువారం రాత్రి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తొలుత సందిగ్ధత నెలకొంది. గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి నేతలు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చంపయ్ సోరెన్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం చంపయ్ సోరెన్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారని వెల్లడించారు. గవర్నర్‌ను చంపయ్ సోరెన్ కలవడానికి కంటే ముందు జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి ఓ వీడియోను విడుదల చేసింది. చంపయ్‌కి మద్దతిస్తున్న 43 మంది ఎమ్మెల్యేలు ఈ వీడియోలో కనిపించారు. మరోవైపు, బీజేపీ బారి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. 43 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరబాద్‌కు గురువారం రెండు ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్‌కు చేర్చాలని నిర్ణయించారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో రాంచీ నుంచి ప్రత్యేక విమానాల టేకాఫ్‌కు ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. రెండు గంటలపాటు విమానాల్లోనే కూర్చుండిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసేది లేక సర్క్యూట్ హౌజ్‌కు తిరిగివచ్చారు. వీరిలో హేమంత్ సోరెన్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ కూడా ఉన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటులకు ఎట్టకేలకు గవర్నర్ నుంచి ఆహా్వనం రావడంతో ఊహాగానాలకు తెరపడింది. రాంచీ జైలుకు హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అధికారులు రాంచీలోని హొత్వార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు ఆయనను బుధవారం 7 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్ ఆ«దీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీíÙయల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టులో సోరెన్ పిటిషన్ తన అరెస్టు అక్రమమంటూ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం çశుక్రవారం విచారణ చేపట్టనుంది. -
ఈడీ అరెస్ట్ ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో సోరెన్ పిటీషన్
-
Jharkhand Crisis: హైదరాబాద్‌లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్
రాంచీ: రాష్ట్రం ఏర్పడి 23 ఏళ్లు అవుతోంది. ఈ కాలంలో 12 మంది సీఎంలు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అంతటి అనిశ్చితిని ఎదుర్కొంటూ వస్తున్న జార్ఖండ్‌లో ఇప్పుడు రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపయ్ సోరెన్‌ను జేఎంఎం ప్రకటించినప్పటి గంటలు గడుస్తున్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం అందలేదు. దీంతో ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ మొదలైంది. అదే సమయంలో జార్ఖండ్‌లో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. జార్ఖండ్‌లో అధికారం కోల్పోతామనే భయం జేఎంఎం-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో నెలకొంది. చంపయ్‌కు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానం పంపకపోవడంతో.. ఈ గ్యాప్‌లో బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు జేజారిపోకుండా ఉండేందుకు అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం మద్ధతుగా ఉన్న 47 మంది ఎమ్మెల్యేలను చేజారిపోనివ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఎల్లా హోటల్‌కు.. హైదరాబాద్‌లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్ ఖరారైంది. సాయంత్రం నాలుగు గంటలకు రాంచీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు ఇండియా కూటమి ఎమ్మేల్యేలు. అందుబాబులో ఉన్న సుమారు 35 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. వాళ్లను బేగంపేట నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంపయ్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని బీజేపీ అంటోంది. తగినంత మద్ధతు లేకపోవడమే అందుకు కారణమని చెబుతోంది. ఇదిలా ఉంటే.. జేఎంఎం మిత్రపక్షం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ గిరిజన ముఖ్యమంత్రిని దర్యాప్తు సంస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ హింసిస్తోందని.. వాళ్ల కుట్రలు ఎక్కువ కాలం కొనసాగవని అన్నారాయన. హేమంత్‌కే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారాయన. జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు బలం 41 స్థానాలు. ఇదిలా ఉంటే ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రేపు(శుక్రవారం) ఆ పిటిషన్‌ను విచారణ చేపట్టనుంది చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్. సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించబోతున్నారు. -
జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్!.. కల్పనా సోరెన్‌కు షాక్?
రాంచీ: జార్ఖండ్ కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ పేరు ఖరారైంది. జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా చంపయ్ సోరెన్‌ను ఎన్నుకున్నట్లు జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రాజేశ్ ఠాకుర్ తెలిపారు. ఆ తరువాత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా లేఖ అందజేశారని వెల్లడించారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. కాగా, చంపయ్ సోరెన్ 1956 నవంబర్‌లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్ కుటుంబంతో చంపయ్ సోరెన్‌కు ఎలాంటి బంధుత్వం లేదు. చంపయ్‌ను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. #WATCH | Jharkhand Minister Alamgir Alam says, "Hemant Soren has resigned from the post of CM...We have the support of 47 MLAs...We have proposed to form a new government. Champai Soren will be our new CM...We have not been given time for swearing in..." pic.twitter.com/AMjjoKNH1F — ANI (@ANI) January 31, 2024 సోరెన్ కుటుంబంలో పొలిటికల్ ట్విస్ట్.. ముఖ్యమంత్రి పదవిపై సోరెన్ కుటుంబంలో ఇంటిపోరు బయటపడింది. హేమంత్ సతీమణి కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బహిరంగ ప్రకటన చేశారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నిక కాని, రాజకీయ అనుభవం లేని కల్పననే ఎందుకు? పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలుండగా.. ఆమె పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో నేనే సీనియర్. 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. ఆమెను ముఖ్యమంత్రి చేయాలనే ఏ చర్యపైనైనా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తాను’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
మనీ లాండరింగ్ కేసు: సీఎం సోరెన్ అరెస్ట్
రాంచీ: జార్ఖండ్ రాజకీయాలు అనూహ్యమైన మలుపు తిరిగాయి. పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను బుధవారం రాత్రి 9.30 గంటలకు అరెస్టు చేశారు. గురువారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో సోరెన్‌ను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. అరెస్టు కంటే ముందే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నూతన ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపయ్ సోరెన్ పేరును అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)–కాంగ్రెస్–రా్రïÙ్టయ జనతాదళ్(ఆర్జేడీ) నేతలు ప్రతిపాదించారు. మనీ లాండరింగ్ కేసులో తొలుత హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు పటిష్టమైన భద్రత మధ్య సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయన తమ ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌ను కలిసి తన రాజీనామా పత్రాలు అందజేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్‌ను నిమిషాల వ్యవధిలోనే ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జేఎంఎం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధికార నివాసంలో సమావేశమయ్యారు. తమ పార్టీ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నికపై చర్చించారు. కొత్త సీఎంగా చంపయ్ సోరెన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు జేఎంఎం అధికార ప్రతినిధి వినోద్ పాండే చెప్పారు. మొత్తం 81 స్థానాలున్న అసెంబ్లీలో తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చంపయ్ సోరెన్ అన్నారు. అంతకుముందు హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ లేదా వదిన సీతా సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారని ప్రచారం జరిగింది. హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారని జేఎంఎం మహిళా ఎంపీ మహువా మాఝీ చెప్పారు. 7 గంటలపాటు సోరెన్ విచారణ మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు బుధవారం ప్రశ్నించారు. రాంచీలోని సోరెన్ అధికార నివాసంలో 7 గంటలపాటు ఈ విచారణ కొనసాగింది. సోరెన్‌కు సంఘీభావం తెలియజేస్తూ ఆయన నివాసానికి జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ఈడీ విచారణకు సోరెన్ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా చెప్పారు. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో జేఎంఎం నేతలు, కార్యకర్తలు రాంచీకి చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సోరెన్‌ను లక్ష్యంగా చేసుకొని, విచారణ పేరుతో వేధిస్తోందని వారు మండిపడ్డారు. దళితుడు కావడం వల్లే సోరెన్‌పై వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. తమ ముఖ్యమంత్రి జైలుకు వెళితే తాము ఆయనతోపాటు వెళ్తామని తేలి్చచెప్పారు. ఇదే కేసులో ఈడీ అధికారులు ఈ నెల 20న హేమంత్ సోరెన్‌ను 7 గంటలపాటు విచారించారు. సోమవారం ఢిల్లీలో సోరెన్ నివాసంలో సోదాలు జరిపారు. చట్టవిరుద్ధంగా భూయాజమాన్య మారి్పడికి పాల్పడిన వ్యవహారంలో హేమంత్ సోరెన్ పాత్ర ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈడీ అధికారులపై సోరెన్ ఫిర్యాదు ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోరెన్ ఫిర్యాదు మేరకు రాంచీలోని ఎస్సీ/ఎస్టీ పోలీసు స్టేషన్లో కొందరు సీనియర్ ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలోని తన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిందని, తనను వేధింపులకు గురి చేస్తోందని, తన సామాజిక వర్గాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని ఫిర్యాదులో సోరెన్ ఆరోపించారు. ఈడీ అధికారుల తీరు వల్ల తన కుటుంబం మానసిక వేదన అనుభవిస్తోందని మండిపడ్డారు. ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలో హేమంత్ సోరెన్ ఇంట్లో సోదాలు చేశారు. రూ.36 లక్షల నగదు, కీలక పత్రాలతోపాటు ఓ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ నగదు, ఆ కారుతో తనకు సంబంధం లేదని హేమంత్ తేలి్చచెప్పారు. ఎవరీ చంపయ్ సోరెన్? జార్ఖండ్ కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ పేరు ఖరారైంది. ఆయన 1956 నవంబర్‌లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో జని్మంచారు. మెట్రిక్యులేషన్ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్ కుటుంబంతో చంపయ్ సోరెన్‌కు ఎలాంటి బంధుత్వం లేదు. చంపయ్‌ను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. -
నేడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ప్రశ్నించనున్న ఈడీ
-
హేమంత్ సోరెన్ అరెస్ట్ కు రంగం సిద్ధం
-
జార్ఖండ్ లో వేడెక్కిన రాజకీయం