నెల్లూరు జిల్లాలో మళ్లీ భూమి కంపించింది. శనివారం సీతారాంపురం, వరికుంటపాడు మండలాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది.
► రెండు సెకన్లపాటు కంపించిన భూమి
► రెండు నెలల వ్యవధిలో ఏడోసారి భూ ప్రకంపనలు
► భయాందోళనలో ప్రజలు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మళ్లీ భూమి కంపించింది. శనివారం సీతారాంపురం, వరికుంటపాడు మండలాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది.
ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనలతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. రెండు నెలల వ్యవధిలో ఏడోసారి నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చినట్టు జీయోలిజకల్ నిపుణులు వెల్లడించారు.