Strong Earthquake Tremors Were Felt Across Parts of Delhi - Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భారీగా భూప్రకంపనలు.. జనం పరుగులు

Published Tue, Jan 24 2023 2:45 PM | Last Updated on Tue, Jan 24 2023 3:18 PM

Strong earthquake tremors felt in Delhi - Sakshi

దేశ రాజధాని పరిధిలో భారీగా భూమి కంపించింది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో.. 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో భూకంపం చోటు చేసుకుంది. మంగళవారం పలు ప్రాంతాల్లో భారీగా భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో బయటకు పరుగులు తీశారు జనాలు.

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌ ప్రాంతంలో భూకంప కేంద్ర నమోదు అయ్యింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్‌ పరిధిలో మధ్యాహ్నం 2.30 గం. ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.8 తీవ్రతగా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. 

జనం బయటకు పరుగులు తీయగా, మరికొందరు ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement