ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం ఉదయం భూమి స్పల్పంగా కంపించింది.
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం ఉదయం భూమి స్పల్పంగా కంపించింది. రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూమి కంపించటంతో జనాలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.