మావల్లే మహా అభివృద్ధి | Rahul Gandhi conducts rally in Mumbai targetting Narendra Modi; Sonia Gandhi and Sharad Pawar absent from the rally | Sakshi

మావల్లే మహా అభివృద్ధి

Apr 20 2014 11:11 PM | Updated on Mar 29 2019 9:24 PM

నగరంలో మోనో, మెట్రో, ఈస్టర్న్ ఫ్రీవే, అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్-2 తదితర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులన్నీ కేవలం యూపీఏ ప్రభుత్వం వల్లే సాధ్యమయ్యాయని, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.

సాక్షి, ముంబై: నగరంలో మోనో, మెట్రో, ఈస్టర్న్ ఫ్రీవే, అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్-2 తదితర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులన్నీ కేవలం యూపీఏ ప్రభుత్వం వల్లే సాధ్యమయ్యాయని, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. గుజరాత్ అభివృద్ధి అనేది ఒక భ్రమ అని బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టారు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఆదివారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముంబైలోనే అవిర్భవించిందని గుర్తుచేశారు.

 ఇక్కడ సర్వమతాల, కులాల ప్రజలు సోదరభావంతో కలిసిమెలసి ఉంటారని, అందుకే కాంగ్రెస్ ఇక్కడ పుట్టిందని కొనియాడారు. ఇన్నాళ్లూ శ్రీమంతులకు మాత్రమే మెరుగైన వైద్యం ఖరీదైన ఆస్పత్రుల్లో లభిస్తోందని, కాగా అదే ఆస్పత్రిలో పేదలకు కూడా మెరుగైన వైద్యం లభించేలా కాంగ్రెస్ కృషిచేస్తోం దని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి గూడు కల్పించడమే కాంగ్రెస్ ధ్వేయంగా పెట్టుకుం దన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, ఇటీవల పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్థి పనులు చేపట్టింది, మళ్లీ అధికారంలో వస్తే ఏం చేయబోతుందో సమగ్రంగా వివరించారు. ముఖ్యం గా ముస్లిం, గిరిజన, దళిత వర్గాలకు చెంది న పేద పిల్లలకు ఉచితంగా చదువు, మధ్యాహ్న భోజనం తదితర వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

 ఒక కులాన్ని మరో కులంతో, ఒక మతాన్ని మరో మతంతో రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుందని ప్రతి పక్షమైన ఎన్డీయే కూటమిపై విమర్శల వర్షం కురి పించారు. వారి చర్యల వల్ల దేశంలో మతఘర్షణలు చెలరేగుతున్నాయని, ఇందులో ఎక్కువ నష్టపోయేది పేదలేనని అన్నారు. గుజరాత్ అభివృద్ధి ఒక నాటకమని, ఆ నాటకానికి త్వరలో ప్రజలు తెరదిం చుతారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సభకు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని అందుకు సోదరులందరూ మన్నించాలని అన్నారు. రాహుల్ సభకు ముందు నారాయణ్ రాణే, పృథ్వీరాజ్ చవాన్, సుశీల్‌కుమార్ షిండే తది తరులు ప్రసంగించారు.

శివసేన పార్టీలో ప్రస్తుతం గాండ్రిం చే పులుల్లేవని, కేవలం పిల్లులు మాత్రమే మిగిలాయని పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రముఖ వ్యక్తుల్లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ రావ్ పేరు ఉన్నప్పటికీ ఆయన ఈ సభకు గైర్హాజరు కావడం కొందరు మంత్రులు జీర్ణించుకోలేకపోయారు. అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన రాలేకపోయారని జయంత్ పాటిల్ చెప్పి సమర్ధించుకున్నారు. అనంతరం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ బీజేపీలో చీలికలు మొదలయ్యాయన్నారు. మోడీ ఒకవైపు మాట్లాడితే, అద్వానీ ఒకవైపు, సుష్మాస్వరాజ్ మరోవైపు.. ఇలా నాయకులంతా ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు ఉంటున్నారని, ఇక దేశాన్ని ఎలా ఐక్యంగా ఉంచుతారని దుయ్యబట్టారు. ఈ సభలో ముఖ్యమంత్రి అశోక్ చవాన్, నారాయణ్ రాణే, మాణిక్‌రావ్ ఠాక్రే, వర్షా గైక్వాడ్, గురుదాస్ కామత్ తదితర కాంగ్రెస్ , ఎన్సీపీ నాయకులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement