
ఈ వారం యూట్యూబ్ హిట్స్
మీరేమైనా అనుకోండి బాస్.. ఇంటì కిటికీ రెక్కలు తెరిచి, ఇంట్లోని ఆడవాళ్లకు .....
మీ కలల రాణి ఆర్జే సులోచన
విద్యాబాలన్: తుమ్హారీ సులు
నిడివి : 1 ని.
హిట్స్ : 13,81,874
మీరేమైనా అనుకోండి బాస్.. ఇంటì కిటికీ రెక్కలు తెరిచి, ఇంట్లోని ఆడవాళ్లకు ఉద్యోగాల రెక్కల కట్టి వదిలిస్తే బయటి ప్రపంచమంతా ఎంత పీస్‌ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా మారిపోతుందోచెప్పలేం. ఇక మన ‘సులు’ చేస్తున్న జాబ్‌లాంటిదైతే.. రోజూ రాత్రిళ్లు నిద్రపట్టక దొర్లుతుండే ‘టెన్షన్ పార్టీ’లకు మత్తుగొలిపే స్వరామృతమే! ‘హలో.. ఆప్‌కీ రాతోంకో జగానే.. ఆప్‌కే సప్నోంకోసజానే.. మై సులు..’ అంటూ రోజూ ఒక టైమ్‌కి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్‌లో ‘పట్టని నిద్రల్ని తట్టి లేపే’ నడిరేయి ముంబై రేడియో జాకీ సులు. అసలు పేరు సులోచన. గృహిణి. లక్కీగా ఆర్జేఉద్యోగం వస్తుంది. రాత్రిపూట రేడియో స్టేషన్‌కి వెళ్లి లైవ్‌లో మాట్లాడాలి. ఎలా?! ఇంట్లో వాళ్లను కన్విన్స్ చేస్తుంది సులోచన. ఫస్ట్ డే డ్యూటీకి వెళుతుంది. గొంతులో ఇంకొంచెం ‘గసగస’ఉండాలంటారు స్టేషన్ వాళ్లు. అంటే ‘సెక్సీ’గా అని! ఆ గసగస కోసం ఇంట్లో రహస్యంగా ప్రాక్టీస్ చేస్తుంది ఆమె. అది విని ఫ్యామిలీ మొత్తం బెంబేలెత్తుతుంది. ‘నీ కలల రాణికి ఈ నడి రేయిఫోన్ చెయ్యవా? చేస్తావు కదూ!’ అని సులోచన చాటుగా ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తే.. అది ప్రాక్టీస్ అని తెలియక గతుక్కుమంటారు. పెద్దగా నవ్వుకుంటుంది సులోచన..తన గొంతు తనకే గమ్మత్తుగా అనిపించి. వీడియోలో ఈ నవ్వును మీరు చూడాల్సిందే. సులోచనగా విద్యాబాలన్ నటిస్తున్న ‘తుమ్హారీ సులు’ చిత్రం టీజర్ ఇది. ఈ ఫ్యామిలీ కామెడీడ్రామా మూవీ డిసెంబర్ 1న రిలీజ్ అవుతోంది.
ఎవరు తల్లి? ఎవరు కూతురు?
హల్లో, వరల్డ్. మీట్ అవర్ బేబీ గర్ల్
నిడివి 2 ని. :15 సె.
హిట్స్ :21,51,232
ముప్పై ఐదేళ్ల అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సెప్టెంబర్ 1న ‘మామ్ స్లామ్’ టైటిల్‌ని కొట్టేశారు. ఇదెక్కడి టైటిల్? ఎక్కడిదో కాదు, తొమ్మిది నెలలు మోసి, కని, సాధించిన టైటిల్. డాక్టర్లు ఆమెకు పండంటి ఆడబిడ్డను తెచ్చివ్వగానే సెరీనా చేతుల్లో ఆ బిడ్డం అచ్చం ఆమె గెలుచుకున్న ట్రోఫీలానే ఉంది! తండ్రి అలెక్సిస్ ఒహానియన్ ఆ పాపకు అలెక్సిస్ ఒలింపియా ఒహానియన్ జూనియర్ అనే పేరు పెట్టాడు. అలెక్సిస్ జూనియర్ మరికొన్ని రోజులు అమ్మ కడుపులోనే ఉండి, సెప్టెంబర్ 26న పుట్టి ఉంటే, తల్లీకూతుళ్లిద్దరి బర్త్‌డే ఒకేరోజు అయి ఉండేది! అయితే బర్త్‌డేలతో నిమిత్తం లేకుండా ఎవరు తల్లో, ఎవరు కూతురో తెలియని విధంగా ఇద్దర్నీ పసి బిడ్డల్లాగే అపురూపంగా చూసుకుంటున్నాడు అలెక్సిస్.అంతేనా! సెరీనా నవమాసాల అనుభూతులను అందంగా కూర్చి ‘హల్లో వరల్డ్. మీట్ అవర్ బేబీ గర్ల్’ అంటూ ఓ వీడియోను యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేశాడు. ఎనిమిది వారాలగర్భిణిగా సెరెనా గత జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించడం, భార్యాభర్తలిద్దరూ కలిసి ‘పిల్లలు ఎలా పుడతారు?’ అనే వీడియోలను చూడడం వంటివన్నీ ఈ వీడియోలోఉన్నాయి. ఇలాంటి వీడియో ఒకటి విడుదల చెయ్యాలన ఆలోచన అలెక్సిస్‌కి ముందే ఉన్నట్లుంది. అందుకే సెరెనా ప్రెగ్నెంట్ అయినప్పుడు తీసిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఫిల్మ్‌ని భద్రపరిచి దాంతోనే వీడియోను స్టార్ట్ చేశాడు. ఎక్స్‌లెంట్‌గా ఉంది చూడండి. తొలిసారి తల్లులు, తండ్రులు కాబోతున్న దంపతులకైతే ఇది కచ్చితంగా ఓ క్రియేటివ్ గైడ్.
తెల్ల గుర్రాన్ని చూసిన రోజు
లానా డెల్ రే – వైట్ మస్టాంగ్
నిడివి : 2 ని.
హిట్స్ : 38,03,477
ఆమెరికన్ పాప్ గాయని లానా డెల్ రే ఇటీవలి ఆల్బమ్ ‘లస్ట్ ఫర్ లైఫ్’లోని ఐదో ట్రాక్ ఈ ‘వైట్ మస్టాంగ్’. మస్టాంగ్ అంటే తెల్ల గుర్రం. పాటలో మాత్రం అది ఫోర్ట్ కంపెనీ కారు. ‘నీ తెల్ల గుర్రాన్ని నేను చూసిన రోజు..’ అంటూ రే ఈ ట్రాక్ మొత్తం మొత్తుకుంటూ ఉంటుంది. పోస్ట్ బ్రేకప్ సాంగ్ మరి. పాతజ్ఞాపకాలు గుచ్చేస్తుంటాయి. ఆ జులపాలవాడు ప్రియుడు. ఇంతెత్తున.. తెల్లగా.. గుర్రంలానే ఉంటాడు చూడ్డానికి. వాడికి సంగీతం అదీ వచ్చు. వాడిని ప్రేమించి, కిందేసి కాలితో తొక్కేస్తుంటుంది రే. ఫ్లాష్‌బ్యాక్‌లో వీడియో తొలి సీన్ అదే. మస్టాంగ్ కారు ఈమెకూ ఉంది. ఆ కారులో రే.. సిటీ అంతా తిరుగుతూ తన మాజీ హృదయేశ్వరుడిని తలచుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి కొంచెం సన్నీలియోన్‌లా ఉంటుంది. అతడు.. బ్రిటిష్ గిటారిస్ట్ ఎద్ షీరన్‌కు, లానా డెల్ రేకి పుట్టిన వాడిలా ఉంటాడు. (ఈ పాపపు మాట మనది కాదు. ‘పాప్’ లోకానిది.) హుమ్.. ఇక ఈమె ఏం పాడుతోందో వినండి. ‘నేనెంత ఫూల్‌నో చూడు, నిన్ను నమ్మాను. నువ్వెప్పటికైనా మారతావని నమ్మాను. కానీ నువ్వు మారలేదు. నీతో నా గొడవంతా యుగాంతపు యుద్ధంలా ఉంది. కలల్లో నన్ను బిగిస్తావు. కళ్లు తెరవగానే వదిలేస్తావు’.. దీ వరస. దేవ్‌డా! ఈ పాడు ప్రేమ భూమి మీద ఎవర్నీ బతకనివ్వదా?
చైనా బాండ్.. యాక్షన్ బ్రాండ్
బ్లీడింగ్ స్టీల్ : ట్రైలర్
నిడివి : 2 ని. 12 సె.
హిట్స్ : 6,09,676
ఈ ట్రైలర్‌ను చూస్తే జాకీ చాన్‌కు 63 ఏళ్లు ఉంటాయని ఎవరూ ఊహించరు! డిసెంబర్ 22న విడుదలకు సిద్ధం అవుతున్న చైనీస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బ్లీడింగ్ స్టీల్’లో అసాధారణమైన పోరాట సన్నివేశాలలో ఈ హీరో దుమ్మురేపబోతున్నట్లు ట్రైలర్‌లో అడుగడుగునా కనిపిస్తుంది. కథ మాత్రం వివరంగా తెలియడం లేదు. ఒక టీవీ షో ఉంటుంది. ఆ షోకి ఒక పెద్దాయన గెస్ట్‌గా వస్తాడు. అతడు రచయిత. ‘బ్లీడింగ్ స్టీల్’ అనే బుక్ రాస్తాడు. దాని మీద డిబేట్. ఆ తర్వాత అతడు కిడ్నాప్ అవుతాడు. ‘ఈ పుస్తకంలోని ఇన్ఫర్మేషన్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది?’ అని కిడ్నాపర్‌లు అతడిని అడుగుతారు. అతడిని కాపాడ్డానికి ఏజెంట్ జాకీచాన్ Ðð ళ్తాడు. అక్కడి నుంచి ఫైట్స్, థ్రిల్స్. అదే సమయంలో అతడొక యువతిని కాపాడవలసి వస్తుంది. ఆ యువతిని విలన్‌ల ముఠా ఒకటి వెంటాడుతుంటుంది. వాళ్ల నుంచి ఆమెను రక్షించాలి. ఆ క్రమంలో ఛాన్‌కి ఆ అమ్మాయిపై ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. ఏ జన్మలోనో తామిద్దరికీ ఏదో బంధం ఉన్నట్లు అనిపిస్తుంటుంది. అది ఏ జన్మ? మానవ జన్మా? మానవాతీత జన్మా? సినిమా ఇంకా కంఫ్లీట్ కాలేదు. ఈలోపు కథ కొంచెం మారినా మారొచ్చు. చాన్ ఉన్నప్పుడు కథ ఎన్ని వంకర్లు తిరిగితే మాత్రం ఏముంది?!