జిల్లాకు త్వరలో గోదావరి నుంచి సాగునీరు తెప్పించే ఏర్పాటు చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
జిల్లాకు త్వరలో గోదావరి నుంచి సాగునీరు తెప్పించే ఏర్పాటు చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వ్యవసాయం పట్ల గత పాలకుల నిర్లక్ష్యమే రైతుల కష్టాలకు కారణమని ఆయన శనివారమిక్కడ అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉండగా.. ఎన్నడూ రైతుల గోడు పట్టించుకోని కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు రైతు ఓదార్పు యాత్రలు చేయడం సిగ్గుచేటని హరీశ్ విమర్శించారు.