రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకు దిక్కు లేకుండా పోయిందని, ఆరోగ్యశాఖకే పెద్దరోగం వచ్చిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకు దిక్కు లేకుండా పోయిందని, ఆరోగ్యశాఖకే పెద్దరోగం వచ్చిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులపై నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పేదల ఆరోగ్యమంటే సీఎం కేసీఆర్‌కు లెక్క లేకుండా, చులకనగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై, ఆరోగ్యశాఖ పనితీరుపై సీఎం ఎందుకు సమీక్ష చేయడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆస్ప త్రులపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల విషయంలో నిరంకుశ, నిర్లక్ష్య ధోరణిని ప్రభుత్వం వీడకపోతే కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుందని మల్లు రవి హెచ్చరించారు.