government hospitals
-
అమ్మ ప్రాణానికి ఆపద!
ప్రసవం కోసం ఆస్పత్రికి వెళితే.. ఆ తల్లి క్షేమంగా తిరిగొస్తుందో లేదోననే భయం వెంటాడుతోంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో నమోదవుతున్న మాతృ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆధునిక వైద్య వ్యవస్థ అందుబాటులో ఉన్నా.. మాతృ మరణాలు తప్పకపోవడం విస్తుగొలుపుతోంది. నంద్యాల జిల్లా పాములపాడు మండలం బానుముక్కల గ్రామానికి చెందిన కవిత కర్నూలు జిల్లా కోసిగి మండలం చాకలిగేరి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తోంది. ఏడాది క్రితం ఆమెకు సచివాలయ ఉద్యోగి వినోద్‌తో వివాహం కాగా.. మూడు నెలల క్రితం ప్రసూతి సెలవులో భాగంగా సొంతూరు బానుముక్కల గ్రామానికి వెళ్లింది. ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రసవ సమయంలో హైబీపీ రావడంతో కవిత ఆస్పత్రిలోనే కన్నుమూసింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పురిటి సమయంలో వందల సంఖ్యలో తల్లులు మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 11 నెలల్లోనే (2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు) రాష్ట్రవ్యాప్తంగా 287 మంది తల్లులు ప్రసవ సమయంలో మృతిచెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మరణాలు కేవలం ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైనవి మాత్రమే. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదు కాని మరణాల సంఖ్య మరింత అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆధునిక వైద్య వ్యవస్థ అందుబాటులో ఉన్నా మాతృ మరణాలు అధికంగా నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ట్రాకింగ్ సిస్టమే దారుణం రాష్ట్రంలో గర్భిణుల ట్రాకింగ్ సిస్టం దారుణంగా ఉండటం, సకాలంలో వైద్యసేవలు అందకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొన్ని నెలలుగా గర్భిణుల ట్రాకింగ్ సిస్టం సరిగా లేకపోవడం వల్లే ఈ దయనీయ పరిస్థితి తలెత్తుతోందని స్పష్టం చేస్తున్నారు. యాంటినేటల్ చెకప్‌కు వచ్చిన ప్రతి గర్భిణి ఇంటికి ఏఎన్ఎం క్రమం తప్పకుండా వెళ్లి ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలి. ఐరన్, ఫోలిక్ మాత్రలు ఇవ్వాలి. రక్తపోటు, మధుమేహం వంటివి పరీక్షించాలి. హైరిస్క్ ఉన్న గర్భిణులను రోజూ పర్యవేక్షించి, రెఫరల్ ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. అవసరమైతే ఇన్‌పేషెంట్‌గా చేర్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. కొంతకాలంగా ఇవన్నీ సరిగా చేయకపోవడం వల్లే మాతృ మరణాలు ఎక్కువగా జరుగుతున్నట్టు సమాచారం. వైద్య ఆరోగ్య సిబ్బంది నా కుమార్తెను పట్టించుకోలేదు.. గత ఏడాది ఆగస్టులో నా చిన్న కుమార్తె లక్ష్మి బిడ్డ పుట్టాక ప్రాణాలు కోల్పోయింది. ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవం చేయించాను. బిడ్డ పుట్టిన ఐదో రోజు ఇంటికి వచ్చాక రక్తపోటు పెరిగి చనిపోయింది. వైద్య, ఆరోగ్య సిబ్బంది నా కూతురి ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. ఒంట్లో బాగుండటం లేదని ఆస్పత్రికి వెళ్లి చెప్పినా పట్టించుకోకపోవడం వల్ల ఇంటికి వచ్చేసింది. నా మనవరాలిలోనే కుమార్తెను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాను. – అద్దంకి మాణిక్యమ్మ, జి.మామిడాడ, తూర్పుగోదావరి జిల్లా వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే మా అక్క బతికేది మా అక్క రాజాన దమయంతికి మొదటి కాన్పులో మగబిడ్డ జన్మించాడు. రెండో కాన్పు కూడా సజావుగా అవుతుందనుకున్నాం. గర్భిణిగా (ఐదోనెల) ఉన్న సమయంలో రక్తం తక్కువగా ఉందని విజయనగరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాం. ఆ రోజు సెలవు కావడంతో అక్కడి వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. కేజీహెచ్‌లో చేరి్పంచిన రోజు బాగానే ఉంది. మరుసటి రోజు రక్తం ఎక్కిస్తామని వైద్యులు చెప్పారు. ఉదయం అకస్మాత్తుగా చనిపోయింది. ఇప్పటికీ ఆమె మరణం అంతుపట్టడం లేదు. వైద్యులు సకాలంలో స్పందించి మెరుగైన వైద్యం అందిస్తే బతికేది. – పి.నాగరాజు, దమయంతి సోదరుడు, పి.లింగాలవలస, దత్తిరాజేరు మండలం, విజయనగరం జిల్లామరణాలకు ప్రధాన కారణాలు » ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం »ఎక్కువ మందిలో ఇన్ఫెక్షన్స్ పెరగడం.. బీపీ ఎక్కువగా ఉండటం »గతంలో సురక్షితంగా అబార్షన్ చేయకపోవడం »ప్రసవ సమయంలో నైపుణ్యం కలిగిన వైద్యులు, నర్సులు లేకపోవడం » వైద్యులు అందుబాటులో ఉండక.. సకాలంలో వైద్యసేవలు అందకపోవడం » ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతి పడకలు తక్కువగా ఉండటం -
పుట్టెడు దుఃఖంలో ఉన్న పేదలపై భారం
సాక్షి, అమరావతి: ఓవైపు అయినవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖం.. మరోవైపు వారి మృతదేహాల తరలింపు భారం.. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీ..! ప్రమాదాలకు గురై, అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించినవారి మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు బంధువులు ఎదుర్కొంటున్న కష్టం ఇది. ప్రైవేట్ ఆసుపత్రులలో సొంత డబ్బుతో చికిత్స చేయించుకునే స్థోమత లేకనే ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న పేద, మధ్య తరగతికి ఇబ్బందులు పరిపాటిగా మారాయి. మందులు, వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు మృతదేహాలను తరలించే వాహనాల కొరత కూడా అధికంగా ఉంటోంది. ప్రైవేటు అంబులెన్స్ వారు చెప్పిందే ధర..! వారు అడిగినంత ఇవ్వకపోయినా, మరో వాహనంలో తరలింపునకు ప్రయతి్నంచినా అడ్డుకుని గొడవకు సైతం దిగుతున్నారు. వీరితో ఆసుపత్రుల్లోని కొందరు సిబ్బంది సైతం చేతులు కలిపి.. వార్డుల్లో ఎవరైనా మృతి చెందితే సమాచారం చేరవేస్తున్నారు. అంబులెన్స్ నిర్వాహకులు నేరుగా వార్డుల్లోకి వెళ్లి మరీ బాధిత కుటుంబ సభ్యులతో బేరాలకు దిగుతున్నారు. జిల్లాల పరిధిలో అయితే 50 కిలోమీటర్ల వరకు అంబులెన్స్ అద్దె, డ్రైవర్ బేటా/బత్తా, డీజిల్‌కు రూ.5 వేల నుంచి రూ.7 వేల మేర వసూలు చేస్తున్నారు. 50 నుంచి 100 కి.మీ.కు రూ.10 వేలపైన, వంద కి.మీ. పైగా ఉన్న దూరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు అంతకంటే ఎక్కువ కూడా ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. సగం మంది సొంత ఖర్చుతోనే.. పెద్ద ఆసుపత్రుల్లో నమోదైన మరణాల్లో మృతదేహాలను ఉచితంగా స్వస్థలాలకు చేరవేసే మహాప్రస్థానం వాహనాలకు తీవ్ర కొరత ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల 54 వాహనాలు ఉండగా సగం మృతదేహాలను మాత్రమే ప్రభుత్వం ఉచితంగా తరలిస్తోంది. మిగిలిన సగంవాటికి ప్రైవేట్ అంబులెన్స్‌లను ఆశ్రయించక తప్పడం లేదు. గత ఏడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య 17 చోట్ల 25,094 మరణాలు నమోదవగా, 13 వేల కేసుల్లోనే మహాప్రస్థానం వాహనాల్లో మృతదేహాలను తరలించారు. నంద్యాల, విజయనగరం, మచిలీపట్నంలో కేవలం ఒక్కటి చొప్పునే వాహనాలు ఉన్నాయి. వైఎస్సార్, ఏలూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, నెల్లూరుల్లో రెండేసి వాహనాలే ఉన్నాయి. అప్పటికే ఇవి మృతదేహాల తరలింపునకు వెళ్తే తిరిగి వచ్చేదాక ఎదురుచూడాల్సి ఉంటోంది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, కాకినాడ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో రోజువారీ మరణాలకు, అందుబాటులో ఉన్న వాహనాలకు పొంతన లేదు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యే మృతదేహాలను తరలించాలనే నిబంధనలున్నాయి. రాత్రివేళ చనిపోతే.. మృతదేహాలను మార్చురీల్లో భద్రపరిచి, మరుసటి ఉదయం తరలించాల్సి వస్తోంది. అప్పటికి మృతుల సంఖ్య పెరిగి వాహనాలకు తీవ్ర డిమాండ్ నెలకొంటోంది. ప్రకటనలతో కాలక్షేపం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ ఆసుపత్రులకు మహాప్రస్థానం వాహనాలు సమకూరుస్తున్నామంటూ పలుసార్లు మంత్రి సత్యకుమార్ ప్రకటనలు చేశారు. డిసెంబరులో 53 వాహనాలకు సీఎం ఆమోదం తెలిపారని వెల్లడించారు. కానీ, అంబులెన్స్‌లు అందుబాటులోకివచ్చిన దాఖలాలు లేవు. కాగా, ప్రభుత్వం సమకూరుస్తామని చెబుతున్న వాహనాలు ప్రస్తుత అవసరాలకు సరిపోవని, ఇంకా పెంచాలని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కోరుతున్నారు. -
జ్వరం గోలీలూ లేవు!
ఆస్పత్రిలో మందుల్లేక..బయట కొనలేక! ఈ ఫొటోలో కన్పిస్తున్న వృద్ధురాలి పేరు మాశమ్మ. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని నాగనూల్ గ్రామానికి చెందిన ఈమె ఒంటి నొప్పుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చింది. పరీక్ష చేసిన డాక్టర్ మందులు రాశారు. అయితే ఆ మందులు ఆసుపత్రిలో లేవని చెప్పిన సిబ్బంది బయట ప్రైవేటులో తీసుకోవాలని చెప్పారు. డబ్బులు పెట్టి ప్రైవేట్ దుకాణంలో మందులు కొనే స్తోమత లేని మాశమ్మ ఇలా నిస్సహాయంగా నిలబడింది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను మందుల కొరత పీడిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో (పీహెచ్‌సీలు) పాటు రాష్ట్రంలో కీలకమైన ఉస్మానియా, గాం«దీ, నిలోఫర్, ఎంఎన్‌జే, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్ వంటి ఆసుపత్రుల్లో కూడా రోగులు మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అనేకచోట్ల సాధారణ జబ్బులకు అవసరమైన ట్యాబ్లెట్లు కూడా ఉండటం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.జ్వరానికి వాడే పారాసెటమాల్, జలుబుకు ఉపయోగించే సిటిరిజైన్ లాంటివి కూడా బయట కొనుక్కోవాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. డాక్టర్లు రాసిచ్చిన 5 మందుల్లో కనీసం 2 లేదా 3 బయట కొనుక్కోక తప్పడం లేదని అంటున్నారు. మందుల కొరత నేపథ్యంలో కొన్ని జిల్లా ఆసుపత్రుల్లో అవసరమైన మేరకు కాకుండా 10 రోజుల వరకే మందులు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.అయితే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు అవసరమైన మందుల నిల్వలు తమ వద్ద ఉన్నాయని టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ చెపుతున్నారు. అలాగే జిల్లాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్)లలో కూడా మందుల నిల్వలు ఉన్నాయని ఆయా జిల్లాల డీఎంహెచ్ఓలు చెబుతున్నప్పటికీ..వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. చాలాచోట్ల అవసరమైన మందుల కోసం ఇండెంట్లు పెట్టేవారే లేరని, మరోవైపు మందులు సమీకరించి పంపాల్సిన టీజీఎంఎస్ఐడీసీకి నిధుల కొరత సమస్యగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణ మందులకూ తిప్పలు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) ద్వారా రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రులు, బోధన కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు, పీహెచ్‌సీలకు అక్కడి నుంచి ఆరోగ్య ఉప కేంద్రాలకు మందులు సరఫరా అవుతుంటాయి. ఈ మేరకు జిల్లా ఆస్పత్రులు, తదితర ఆస్పత్రుల నుంచి ఇండెంట్లు అందుతుంటాయి. ఈ విధంగా పలు ఆస్పత్రులు ఇండెంట్లు పంపినా కొన్ని మందులు నెలలుగా సరఫరా కావడం లేదు. జ్వరానికి వాడే పారాసెటమాల్ టాబ్లెట్ ప్రతి ఆసుపత్రిలో తప్పక ఉండాలి.కానీ పెద్దపల్లి జిల్లాలోని కొన్ని పీహెచ్‌సీల్లో ఈ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్లు రోగులు చెపుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో కంటి చూపు సమస్య నివారణ కోసం వ్యాధి నిరోధక టీకాలకు అనుబంధంగా అందించే విటమిన్ –ఏ సిరప్ కొరత దాదాపుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఉంది. నెల రోజులుగా ఈ సిరప్ నిల్వలు నిండుకోగా.. జిల్లా ఆసుపత్రులతో పాటు పీహెచ్‌సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో కేవలం టీకాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులే చెపుతున్నారు.అలాగే సర్వ సాధారణ మందులైన రాన్టాక్, పాన్‌టాప్, జోఫర్, డైసైక్లోమిన్, ఎవిల్, ఫెరజోడిన్, సిటిరిజైన్, మెట్రోజిల్, బెటాడిన్ ఆయింట్మెంట్, డైక్లో, స్రైబీష్ లోషన్ వంటివి కూడా కొన్నిచోట్ల అందుబాటులో లేవు. పీహెచ్‌సీల్లో బీపీ, షుగర్‌కు సంబంధించి నెల రోజులకు సరిపడే మందులు ఇవ్వాల్సి ఉండగా, గత కొంతకాలంగా 10 రోజులకే పరిమితం చేస్తున్న పీహెచ్‌సీలు చాలా ఉన్నాయి. జింక్, యాంటి బయోటిక్, ఐరన్ గోలీలతో పాటు ఐవీ సెట్లు కూడా చాలా పీహెచ్‌సీలు, ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవని, బయట కొనుక్కోమంటున్నారని రోగులు చెపుతున్నారు. ప్రముఖ ఆసుపత్రుల్లోనూ... ఉస్మానియా, గాందీ, నీలోఫర్, ఎంజీఎం, ఎంఎన్‌జే ఆసుపత్రుల్లో అధికారిక పడకలు, నిత్యం వచ్చే రోగులను పరిగణనలోకి తీసుకుని టీజీఎంఎస్ఐడీసీ మందులను సరఫరా చేస్తోంది. 80 శాతం మందులు ఇక్కడి నుంచే వస్తుండగా, మరో 20 శాతం మందులను అత్యవసర పద్ధతిలో ఆసుపత్రి అధికారులు కొనుగోలు చేస్తుంటారు. కానీ 20 శాతం మందుల కొనుగోలుకు సంబంధించి 8 నెలలైనా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు అధికారిక లెక్కల కంటే రోగుల తాకిడి ఎక్కువగా ఉండటం కూడా సమస్యకు కారణమవుతోంది.ఉస్మానియా ఆసుపత్రిలో 1,100 పడకల వరకు ఉండగా, నిత్యం 1,500 మందికి పైగానే రోగులు వస్తున్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో 1000 పడకలకు గానూ 1,500కు పైనే రోగుల తాకిడి ఉంటోంది. కొన్నిసార్లు (సీజన్) ఈ రెండు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య 2 వేలకు పైగానే ఉంటోంది. దీంతో గాం«దీ, ఉస్మానియా ఆసుపత్రుల ఆవరణల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ప్రైవేటు మెడికల్ దుకాణాలు 24 గంటలు రోగులతో కిటకిటలాడుతూ ఉంటున్నాయి. వరంగల్ ఎంజీఎంలో 2,500 నుంచి 3,000 వరకు రోగులు నమోదవుతున్నారు. కాగా మందుల కొరత నేపథ్యంలో జిల్లా ఆసుపత్రులు, మండలాలు, పట్టణ కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాల పక్కనే ఉంటున్న ప్రైవేటు మెడికల్ షాపులే రోగులకు గతవుతున్నాయి. 293 మందులకు 100 కూడా ఉండటం లేదు.. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) మార్గదర్శకాల ప్రకారం గ్రామాల్లోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్స్‌లో మందులు, సిరప్లు, ఇంజెక్షన్లు, ఆయింట్మెంట్లు, లోషన్లు, యాంటి బయాటిక్స్, ఐవీ సెట్లు మొదలైనవన్నీ కలిపి 293 కేటగిరీల మందులు ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుతో వచ్చే రోగులు మొదలుకొని ధీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, బీపీతో వచ్చే వారికి, చర్మ వ్యాధులు, పాము కాట్లు, పురుగు మందులు తాగి ఆత్మహత్యకు ప్రయత్నిచిన వారికి ఉపయోగపడే మందుల వరకు ప్రతి ఒక్కటీ పీహెచ్‌సీల్లో ఉండాలి.కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 249 పట్టణ పీహెచ్‌సీలు, 4,693 ఉప ఆరోగ్య కేంద్రాల్లో పలుచోట్ల 50 నుంచి 100 లోపు కేటగిరీల్లోనే మందులు ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. పాముకాటుకు గురై పీహెచ్‌సీలకు వచ్చే వారికి ‘పాం’ ఇంజక్షన్ అందుబాటులో ఉండడం లేదు. కుక్కకాటుకు కూడా ఇంజెక్షన్ అందుబాటులో ఉండాలని ఎన్హెచ్ఎం చెపుతుండటం గమనార్హం. మందుల కొరత లేదు.. టీజీఎంఐడీసీ ద్వారా 568 రకాల మందులను కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు పంపిస్తున్నాం. ఇందులో ఒక కేటగిరీ కింద 293 రకాల మందులు, మరో కేటగిరీలో 100 రకాల మందులు అవసరానికి అనుగుణంగా పంపిస్తాం.ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాం«దీ, ఎంఎన్‌జే, నీలోఫర్, ఎంజీఎం ఆసుపత్రులను వారానికోసారి సంప్రదించి ఇండెంట్ ద్వారా వారికి అవసరమైన మందులను పంపిస్తాం. అలాగే జిల్లాల్లోని సీడీఎస్‌లకు కూడా వారు పంపే ఇండెంట్లను బట్టి మందులు పంపిస్తున్నాం. మందుల కొరత లేదు. ఎక్కడైనా ఉన్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే పంపించే ఏర్పాటు చేస్తాం. – హేమంత్ (టీజీఎంఐడీసీ ఎండీ) పాముకాటు మందు కోసం 17 కి.మీ ప్రయాణం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన శ్రీను కొన్నిరోజుల క్రితం ఓ ఇంటి దగ్గర ఉదయం వేళ పనిచేస్తుండగా, కట్టెల కింద పడుకున్న విషపు పాము చేతిపై కాటేసింది. అక్కడే ఉన్న శ్రీను బావ తాడుతో చేయికి కట్టుకట్టి, బైక్‌పైన గ్రామంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అక్కడ పాము కాటుకు వేసే మందు ‘పాం’ అందుబాటులో లేదు. కరీంనగర్ వెళ్లాలని సిబ్బంది సూచించారు. దాంతో బైక్ పైనే అక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ పెద్దాసుపత్రికి వెళ్లగా వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో మందుల్లేవ్..
-
ఒట్టి హడావుడి.. మందులే లేవు మరి
సాక్షి, అమరావతి: విజయవాడ జీజీహెచ్‌లో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా శ్రీను, శివయ్య తరహాలోనే పదుల సంఖ్యలో రోగులు, వారి సహాయకులు ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రైవేట్ మందుల దుకాణానికి క్యూ కట్టారు. ఎవరిని కదిలించినా లోపల మందుల్లేవ్.. అందుకే బయట కొనుక్కోమని చీటీలు రాసిచ్చారని చూపించారు. ఆ దృశ్యాలు రాష్ట్రంలో గాడి తప్పిన ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థకు అద్దం పట్టాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు అవసరమైన మందులన్నింటినీ సరఫరా చేయలేని ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తి చూపాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వంద మందికిపైగా ఆస్పత్రిలోని ఓపీ, ఐపీ రోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ మెడికల్ స్టోర్ వద్దకు వచ్చారు. కడుపు నొప్పి, బీపీ, గ్యాస్, నొప్పులు వంటి చిన్న సమస్యలతో పాటు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ, గుండె, ఇతర జబ్బుల్లో చికిత్సలకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు, సిరప్లు సొంతంగా కొనుగోలు చేశారు. వీరందరూ డబ్బు పెట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోలేక.. ఉభయ గోదావరి, కృష్ణా జిలాల నుంచి ఈ ఆస్పత్రికి వచ్చారు. పశ్చి మ గోదావరి జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి మెడికల్ స్టోర్ ముందు నిలబడి ‘ప్రభుత్వాస్పత్రి అంటే నే చికిత్స, మందులు, పరీక్షలు అన్నీ ఉచితం. దీంతో రానుపోను చార్జీలు, తిండి, ఇతర అవసరాలకు కొంత డబ్బు తెచ్చుకున్నాం. తీరా ఆస్పత్రిలో చేరాక మందుల్లేవ్ బయట కొనమన్నారు. రూ.వెయ్యి ఫోన్ పే చేయ్ రా’ అంటూ స్నేహితుడి ని అభ్యర్థించడం ఆవేదనకు గురి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయవాడ జీజీహెచ్‌కు సుమారు వంద రకాల మందులు ఆస్పత్రి నుంచి ఇండెంట్ పెట్టినా సరఫరా కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది.ఇంజెక్షన్ బయట కొనుక్కోమన్నారునా భర్తకు స్టెంట్లు వేశారు. చికిత్సలో భాగంగా ఓ ఇంజెక్షన్ (నికోరన్) రాశారు. ఇక్కడేమో అది లేదన్నారు. బయట కొనుక్కుని రమ్మన్నారు. రూ.450 పెట్టి ఇంజెక్షన్ కొనక తప్పలేదు. – హృద్రోగ బాధితుడు వెంకట సురేశ్ భార్య, తణుకుస్టాక్ లేవన్నారునా మనవరాలికి అనారోగ్యంగా ఉంటే చికిత్స కోసం వచ్చాను. వైద్యులు చూశారు. మందులు రాసిచ్చారు. కౌంటర్ వద్దకు వెళితే మందులు అందుబాటులో లేవన్నారు. బయట కొనుక్కోవాల్సిందే. లేదంటే మళ్లీ రమ్మన్నారు. మళ్లీ ఇంకో రోజు రావాలంటే రానుపోను చార్జీలు, ప్రయాసలు పడాల్సి వస్తుంది. చేసేదేమీ లేక కష్టాలుపడి డబ్బు పెట్టి మందులు కొనుకున్నాం. – నవమ్మ, పైడూరిపాడు, విజయవాడ రూరల్డాక్టర్ రాసిన మందులు ఇవ్వలేదునెల రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సేవలపై రెండు సార్లు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. గత నెల 27న నిర్వహించిన సర్వేలో ఆస్పత్రుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు ఇవ్వలేదని 43 శాతం మంది వెల్లడించారు. ఈ నెల 7న 38.23 శాతం మంది రోగులు మందులు ఇవ్వలేదని పేర్కొన్నారు. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇన్సులిన్, బీపీ, గ్యాస్ సమస్యలకు కూడా బోధనాస్పత్రుల్లో బయటకు చీటీలు రాసిస్తున్న దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దూది, సర్జికల్ గ్లౌజ్‌లకు సైతం కటకటగా ఉంటోందని పలువురు సూపరింటెండెంట్లు వెల్లడించారు. -
గాల్లో దీపంలా పేదల ప్రాణాలు
టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జీబీఎస్ కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనోగ్లోబిలిన్స్ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనో గ్లోబిలిన్స్ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు. సోమవారం నాటికి కర్నూలు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, తిరుపతి, నంద్యాల, విజయనగరం, పాడేరు, మరికొన్ని జీజీహెచ్‌ల్లో ఇమ్యునో గ్లోబులిన్ ఇంజెక్షన్ల నిల్వలు “సున్నా’గా ఉన్నాయి. గడిచిన ఐదు, ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల్లోని వైద్యాధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) నుంచి సరఫరా నిలిచిపోయిందని ప్రభుత్వానికి పలుమార్లు తెలియజేశామని చెబుతున్నారు. రాష్ట్రంలో జీబీఎస్ కేసులు క్రమంగా పెరుగుతుయని, ఈ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పలుమార్లు చెప్పడంతో ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న రెండు, మూడు ఆస్పత్రుల నుంచి మిగిలిన వాటికి చాలీచాలనట్టుగా సర్దుబాటు చేసే పనిలో వైద్య శాఖ నిమగ్నమైంది.కేసులన్నీ రిఫర్ ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌కు గురవుతారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. జీబీఎస్ బారినపడిన వారిలోను స్వీయ రోగనిరోధక శక్తి దెబ్బతిని ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడం కోసం చికిత్స సమయంలో ఇమ్యూనో గ్లోబులిన్స్ థెరపీ ఇస్తుంటారు. ప్రైవేట్‌లో ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ.40 వేల వరకు ఉంటోంది. ఇంత ఖరీదైన ఇంజెక్షన్లను కొనుగోలు చేసి, చికిత్స చేయించుకోవడం పేద, మధ్యతరగతి ప్రజలకు స్తోమతకు మించిన వ్యవహారం. ఇక జీబీఎస్‌తో పాటు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌తో బాధపడే చిన్న పిల్లలు... బోధనాస్పత్రుల్లో చేరిన సందర్భాల్లో చికిత్సకు ఇమ్యూనో గ్లోబులిన్స్ అందుబాటులో లేక ఆ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. కేవలం ఈ కారణంతో గడిచిన ఐదారు నెలలుగా అనేక కేసులను విజయవాడ, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, మచిలీపట్నం ఆస్పత్రుల నుంచి గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేసినట్టు వెల్లడైంది. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు ఆస్పత్రుల నుంచి విశాఖకు, కర్నూలు ఆస్పత్రికి అనంతపురం, కడప తదితరాల నుంచి రిఫరల్ కేసులు పెరగడంతో ఈ ఆస్పత్రుల్లో ఇంజెక్షన్ల కొరత నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలతో చెలగాటంవైద్యశాఖలో ఏఐ వినియోగం పెరగాలి.. రోగులకు వైద్య సేవలు మరింత చేరువవ్వాలి... అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొడుతుంటారు. అయితే, ఆయన చెబుతున్న మాటలకు.. చేతలకు అస్సలు పొంతన కుదరట్లేదు. అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రులకు వెళితే కనీసం మందులు కూడా అందుబాటులో లేని దీనావస్థలో ఆస్పత్రులను నెట్టేశారు. మెరుగైన వైద్యం కోసం కాకుండా.. కేవలం ఇంజెక్షన్లు, మందులు లేవన్న కారణంతో రోగులను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి రిఫరల్ పేరిట ప్రభుత్వమే బంతాట ఆడుతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీంతో చికిత్సల్లో కాలయాపన జరుగుతోంది. వెరసి రోగులు ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. మరోవైపు సకాలంలో చికిత్సలు అందక అమాయకులు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.నెట్వర్క్ ఆస్పత్రులు ఆ ఇంజక్షన్ ఇవ్వడంలేదుగులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) అంటువ్యాధి కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. సోమవారం జీబీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో 43 కేసులు నమోదు కాగా వారిలో 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో 749 ఇమ్యూనో గ్లోబులిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.అయితే ఎన్టీఆర్ వైద్యసేవ కింద నెట్ వర్క్ ఆస్పత్రులు ఈ ఇంజక్షన్‌ను ఇవ్వడానికి ముందుకురావడంలేదన్నారు. గత ఏడాది 10 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 301 కేసులు నమోదు కాగా, వీటిలో అధిక మొత్తంలో 115 కేసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదయ్యామని వెల్లడించారు. -
ఆస్పత్రుల్లో మందుల్లేవ్.. ప్రమాదంలో ప్రజారోగ్యం
-
ప్రమాదంలో ప్రజారోగ్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు దొరక్క రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమయ్యే ఇన్సులిన్ కొరత.. గ్యాస్ బిళ్లలకు కటకట.. అరకొరగానే రక్తహీనత చికిత్సలో వినియోగించే ఐరన్ సుక్రోజ్.. కనీసం దగ్గు సిరప్లు కూడా ఆస్పత్రుల్లో లభించడంలేదు. గతంలో షుగర్ రోగులకు ఇంటి దగ్గర కూడా ఇన్సులిన్ వేసుకోవడానికి నెలకు 3, 4 వెయిల్స్ ఇచ్చేవారు. నాలుగైదు నెలలుగా ఇన్సులిన్ వెయిల్స్ ఇంటికి ఇవ్వడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీమోఫీలియా చికిత్సలో వాడే అన్ని రకాల ఇంజెక్షన్లు రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో దొరకడంలేదు. ఇలా.. అన్ని రకాల మందుల కొరత పేద రోగులను వేధిస్తోంది. మందులు బయట కొనుక్కోండంటూ రోగులకు వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. ఇది రోగులపై భారాన్ని మోపుతోంది.సరఫరా ‘గుండు సున్నా’రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్య శాఖ మందులు సరఫరా చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో నాలుగు క్వార్టర్లుగా మందులు సరఫరా అవుతాయి. తొలి మూడు క్వార్టర్లకే మందులు సరిగా సరఫరా కాలేదు. ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టినప్పటికీ కొన్ని రకాల మందులు, సర్జికల్స్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి రాలేదు. ఇక నాలుగో క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) మొదలై నెల రోజులైనా ఈ మూడు నెలలకు రావాల్సిన మందులు రాలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. నిబంధనల ప్రకారం బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉండాలి. గతేడాది డిసెంబర్‌కి పూర్తయిన మూడు క్వార్టర్లకు ప్రధానమైన 100 రకాల మందులు కూడా అందుబాటులో లేవు. మందులు లక్షల సంఖ్యలో అవసరమని ఆస్పత్రుల నుంచి ఏపీఎంఎస్‌ఐడీసీకి ఇండెంట్ పెట్టారు. రాజధానికి చేరువలోని ఆస్పత్రుల్లోనూ అవస్థలేరాజధానికి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు, విజయవాడ జీజీహెచ్‌లను కూడా మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గడిచిన మూడు క్వార్టర్లలో ఈ ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టిన 100 రకాల మందులు సరిగా సరఫరా కాలేదు. గుండె వైఫల్యానికి అందించే చికిత్సలో వినియోగించే ఇవాబ్రడిన్ హైడ్రోక్లోరైడ్ 5 ఎంజీ మాత్రలు 25 వేలు కావాలని గుంటూరు జీజీహెచ్ ఇండెంట్ పెట్టగా ఒక్క మాత్ర కూడా రాలేదు. బ్యాక్టీరియా చికిత్సల్లో వాడే అమోక్సిలిన్, క్లావులనేట్ యాసిడ్ మందు 50 వేలు, మూర్ఛ, కొన్ని రకాల శస్త్ర చికిత్సలకు వినియోగించే లారాజెపామ్ ఇంజెక్షన్లు వెయ్యి కావాలని కోరినా ఇవ్వలేదు. విజయవాడ జీజీహెచ్‌లో కిడ్నీ, గుండె, జనరల్ మెడిసిన్ వంటి పలు విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం జీజీహెచ్ అధికారులు ఫ్యాక్టర్–8 ఇంజెక్షన్ వెయిల్స్ 50, మైగ్రేన్ మాత్రలు ఫ్లూనరిన్ 13 వేలు, తేలికపాటి నొప్పుల నుంచి విముక్తి కోసం వాడే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్లు 21 వేలకు డిమాండ్ పెట్టినా ఒక్కటీ పంపలేదు. సాధారణ జ్వరం, ఆర్థరైటిస్, గౌట్, తల, కండరాల నొప్పి నిగవారణకు వినియోగించే నాప్రొక్సెన్ 500 ఎంజీ మాత్రలు 30వేలు, తీవ్రమైన నొప్పుల కోసం స్వల్ప కాలిక విముక్తికి వాడే ట్రమాడోల్ హెచ్‌సీఎల్ 100 ఎంజీ ఇంజెక్షన్లు 8 వేలు అవసరమైన నెల్లూరు జీజీహెచ్ ఇండెంట్ పెట్టగా ఒక్కటీ సరఫరా చేయలేదు. ఇటీవల విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు బయట నుంచి మందులు కొనుగోలు చేసి తెచ్చుకోవాలని రోగులకు రాసిచ్చిన చీటీలు దగ్గు సిరప్లకూ కటకటేప్రీవెంటివ్ కేర్‌లో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్లనూ మందుల కొరత వేధిస్తోంది. వీటిలో కనీసం దగ్గు సిరప్‌లకు కూడా కటకటగా ఉంటోందని కొందరు మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇన్సులిన్, గ్యాస్, నొప్పులు, థైరాయిడ్, యాంటిబయోటిక్స్ అందుబాటులో లేవు. గుండె, న్యూరో వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా వాడాల్సిన మందులు సైతం పూర్తి స్థాయిలో ఉండటంలేదు. స్కిన్ అలర్జీ, గాయాలకు వాడే ఆయింట్మెంట్ల కొరతా తీవ్రంగానే ఉంది.సూపరింటెండెంట్లు లేఖ రాసినా..డ్రగ్ స్టోర్స్‌లో అన్ని రకాల మందులు లేకపోవడం, కొరత కారణంగా వైద్య సేవల్లో ఇబ్బందులపై పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు సూపరింటెండెంట్లు తెలిపారు. ప్రధాన మందుల కోసం ఇండెంట్ పెట్టినా ఒక్క మందు, ఇంజెక్షన్ కూడా సరఫరా అవలేదని, దీంతో స్థానికంగా కొనాల్సివస్తోందని వెల్లడించారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటంఏపీఎంఎస్ఐడీసీ నుంచి సరఫరా అవ్వని మందులు, అత్యవసర మందుల సరఫరాకు గత ప్రభుత్వంలో ఓ సంస్థను టెండర్ ద్వారా ఎంపిక చేశారు. ఈ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఇక తిరుపతికి చెందిన జన్–ఔషధి మందుల సరఫరా సంస్థతో ఓ మంత్రి డీల్ కుదుర్చుకుని, ఆ సంస్థ ద్వారానే బోధనాస్పత్రులకు మందులు సరఫరా అయ్యేలా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఉత్తర్వులు ఇప్పించారు. జన్–ఔషధికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మెలిక పెట్టారు. అయితే ఆస్పత్రులకు పెద్దమొత్తంలో అవసరమయ్యే జన్–ఔషధి మందులను వేగంగా సరఫరా చేయలేమని సరఫరాదారులు చేతులెత్తేస్తున్నారు. ఇది ప్రజారోగ్యంతో చెలగాటమాడటమేనని పలువురు వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అంతటా కడుపు ‘కోతే’!
సాధారణ ప్రసవాల సంఖ్య తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తగ్గుతోంది. కాసుల కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లే ఎక్కువగా నమోదవుతున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు (Cesarean) పెరిగాయి. సాధారణ ప్రసవాలపై వైద్యారోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పించాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు లేవు. గత ప్రభుత్వ హయాంలో సాధారణ ప్రసవాల పెంపునకు మొదలుపెట్టిన మిడ్‌వైవ్స్ (Midwife) సేవలు ఇప్పుడు నామమాత్రమయ్యాయి.అమ్మో సాధారణ ప్రసవమా?సాధారణ ప్రసవాల విషయంలో నొప్పులు అనుభవించాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొందరు గర్భిణులు విముఖత చూపుతున్నారు. కొందరు వైద్యులు సిజేరియన్లతో భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. శిశువు తలకిందులుగా ఉన్నప్పుడు, పెద్దగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. అయితే, సాధారణ ప్రసవంతో త్వరగా దినచర్యలో భాగం కావొచ్చని, సిజేరియన్లతో దీర్ఘకాలంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నా, గర్భిణులు, వారి కుటుంబసభ్యులు ఆపరేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మిడ్‌వైవ్స్ అంతంతేప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు గత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 2019లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మిడ్‌వైవ్స్ సేవలను ప్రారంభించి 30 మందికి శిక్షణ ఇవ్వగా, వీరు గర్భిణులకు సాధారణ ప్రసవంతో లాభాలను వివరించి వ్యాయామాల ద్వారా ప్రసవాలకు సిద్ధం చేసేవారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో ఇప్పుడా సేవలు అందుబాటులో లేవు. అవగాహన కల్పించక..గర్భిణిగా నమోదైనప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు ప్రభుత్వ ఆస్ప త్రిలో వైద్య సేవలు పొందితే వారి ఆరోగ్యంపై డాక్టర్లకు అవగాహన ఉంటుంది. అలా కాకుండా డెలివరీ సమయంలోనే వస్తుండడంతో ఏదో ఒక సమస్య తలెత్తగానే ఆపరేషన్ చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా సాధారణ ప్రసవాలతో కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిసినా, ఆ దిశగా ప్రయత్నించడం లేదు. » భద్రాచలం ఏరియా ఆస్పత్రిని పరిశీలిస్తే షిఫ్ట్‌కు ఎనిమిది మంది చొప్పున మూడు షిఫ్ట్‌ల్లో 24 మంది సిబ్బంది ఉండాలి. కానీ ఐదుగురే ఉన్నారు.» ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియా ఆస్పత్రిలోనూ 8 నెలలుగా మిడ్‌వైవ్స్ సేవలు నామమాత్రమయ్యాయి. ఇక్కడ నలుగురు సిబ్బంది చేయాల్సిన మిడ్‌వైవ్స్ సేవలు ఇద్దరే చేస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారంఉండటం లేదు.. ప్రసవం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోచేరిన గర్భిణులకు సాధారణ ప్రసవం చేసేందుకే ప్రయత్నిస్తున్నాం, కానీ వారి కుటుంబసభ్యులనుంచి సహకారం ఉండటం లేదు. గర్భిణి కొద్దిసేపు నొప్పులు తట్టుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు మాపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుతోంది. - డాక్టర్ రామకృష్ణ, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, భద్రాచలం.బిడ్డకు హార్ట్‌బీట్ ఎక్కువగా ఉందని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సత్యవతికి గతనెల 31న పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తే పరీక్షలు చేసిన వైద్యులు బిడ్డ హార్ట్‌బీట్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ వెంటనే ఆపరేషన్‌కు నిర్ణయించి సత్యవతికి సిజేరియన్ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది.- సత్యవతి,మణుగూరు,భద్రాద్రికొత్తగూడెం జిల్లా -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికీ దిక్కులేదు
సాక్షి, అమరావతి: రోగులకు అవసరమైన మందులన్నింటినీ బయట తెచ్చుకోవాలంటూ రాస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో ఉండటం లేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్‌లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు దఫాలుగా బయటే కొంటున్నాను నేను వాచ్‌మెన్‌గా పని చేస్తుంటాను. నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. ఆ తర్వాత కాళ్ల నొప్పులు ఉన్నాయి. దీంతో తరచూ ఆస్పత్రికి చెకప్‌కు వస్తుంటాను. గడిచిన మూడు దఫాలుగా నొప్పులకు వాడే మందులు లేవని బయటకు రాస్తున్నారు. ఏం చేస్తాం? అతి కష్టంగా కొనుగోలు చేయక తప్పడం లేదు. – గోవింద్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు, విజయవాడమందులన్నీ బయటకే రాస్తున్నారు మా నాన్న తిరుపతికి షుగర్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఉదయం నుంచి రాత్రి వరకు డాక్టర్లు చూస్తున్నా.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. మందులు ప్రతిదీ బయటకే రాస్తున్నారు. మందులకే రూ.1,800 ఖర్చు అయింది. సాయంత్రం 7.30 గంటలకు నమ్మకం లేదని చెప్పారు. పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తే రోగిని పట్టించుకోకపోవడం దుర్మార్గం. – క్రాంతి కుమార్, గద్వాలషుగర్, బీపీ బిళ్లలకూ కటకట⇒ బీపీ, షుగర్, గ్యాస్ వంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్ట్సార్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీíÙయా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక బయట కొనుగోలు చేయాలని రోగులపైనే భారం మోపుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేస్తున్న రోగుల బంధువులు ⇒ గుంటూరు జీజీహెచ్‌లో బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్ యాంటిబయోటిక్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్లకు తీవ్ర కొరత ఉంది. పిప్లాజ్, మోరోపెనెమ్ వంటి మరికొన్ని యాంటి బయోటిక్స్, నెబులైజేషన్ మాస్క్‌లు, ప్లాస్టిక్ యాప్రాన్లు అందుబాటులో లేవు. మల్టీ విటమిన్ మాత్రలు ఉండటం లేదు. న్యూరో, కిడ్నీ, కార్డియాలజీ, పీడియాట్రిక్ విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. ఎముకలు, గైనిక్ విభాగాల్లో స్పైనల్ నీడిల్స్, రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కల్పించే బుటోర్పనాల్, ఫెంటానిల్, మత్తు ఇచ్చే ఇంజెక్షన్ల కొరత ఉంది. ⇒ విజయవాడ జీజీహెచ్‌లో ఎగ్జామినేషన్ గ్లౌజ్‌లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు, బ్లడ్ థిన్నర్, నొప్పులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందులు, ఇంజెక్షన్ల కొరత వేధిస్తోంది. మెట్రోజిల్–400ఎంజీ, సిట్రిజన్ హెచ్‌సీఎల్ 10 ఎంజీ, క్లోరో ఫినరమైన్ హెచ్‌సీఎల్, బి.కాంప్లెక్స్, ఐరెన్ పోలిక్ యాసిడ్, నియోమైసిన్ టాబ్లెట్స్ కొరత ఉంది. నుప్రోసిన్, సిల్వర్ సల్పోడైజన్, పేరా మెట్రిన్, డైక్లో సోడియం ఆయింట్మెంట్లు లేవు. సిప్రో ప్లాక్సిన్, జెంటామైసిన్, జెంటాప్లాక్స్ డ్రాప్స్ లేవు. పాంటాప్ ఇంజక్షన్ల కొరత ఉంది. డెలివరీ సర్జరీలకు, ఆపరేషన్ సమయంలో అవసరమైన మందులను, కిట్లను రోగులు ప్రైవేట్ దుకాణాల్లో కొనుక్కు రావాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా ఆస్పత్రిలో ఫ్లూ్కనజోల్, హైవిస్కిన్ బ్యూటైల్ బ్రోమైడ్, లంబార్ పంక్చర్ (ఎల్పీ సూది), ఎల్పీ నీడిల్, విటమిన్ కే 1 ఇంజెక్షన్‌తో పాటు పలు యాంటీబయోటిక్స్ అందుబాటులో లేవు. లివర్ సిర్రోసిస్ రోగులకు వాడే బిలిరుబిన్ ఇంజక్షన్ కొరత ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు ఇచ్చే థ్రోంబలైజ్ ఇంజక్షన్స్ అందుబాటులో లేవు. ఇవన్నీ రోగులు బయటే కొంటున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజిలు, ఐవీ సెట్లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్‌షీట్స్, బెటాడియన్ సొల్యూషన్ కొరత ఉంది. ప్రోఫ్లాక్సిన్, గెటిఫ్లానిక్స్, జెంటామైసిన్, మాక్సీఫ్లాక్సిన్, మానసిక జబ్బులకు సంబంధించిన అమిజుల్రీ్ఫడే –200 ఎంజీ, లిథియం 450 ఎంజీ, క్వటియాపైన్ 25 ఎంజీ, క్లోజాఫైన్ 50 ఎంజీ, క్లోణజపం 0.5 ఎం.జీ., లోరాజెపామ్ 2 ఎం.జీ. మాత్రలు స్టాక్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పాంటాప్ మాత్రలు కూడా లేవు.⇒ విశాఖ కేజీహెచ్‌లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో ఉండటం లేదు. విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్టీ ఆస్పత్రి, రాణి చంద్రమతిదేవి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ మందుల కొరత ఉంది. దెబ్బలు తగిలిన వారికి డ్రెస్సింగ్ చేయడానికి కిట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్సులిన్, ఫిట్స్ నివారణ కోసం వాడే మందులు, అన్ని రకాల బ్లీడింగ్ నివారణకు వాడే మందులు, పలు రకాల యాంటి బయోటిక్స్, హిమోగ్లోబిన్ పెంచే మందులు, వెంటిలేటర్స్ కిట్స్, ఆక్సిజన్ పైపులు, కార్డియాలజీ సమస్యలకు వాడే మందుల కొరత తీవ్రంగా ఉంది. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, తిమ్మిర్ల నియంత్రణ, రుతుక్రమంలో వచ్చే లోపాల నియంత్రణ, ఆపరేషన్ సమయంలో కుట్లు వేసే దారం, మలబద్ధకం, గాయాలు మానడం కోసం వాడే మందులు, గర్భాశయ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందుల కొరత వేధిస్తోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి. ⇒ కర్నూలు జీజీహెచ్‌లో యాంటిబయోటిక్స్ కొరత ఉంది. కార్డియాలజీ, న్యూరో, ఇతర సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. ⇒ కడప రిమ్స్‌లో అధిక రక్తపోటు బాధితులు వాడే రామిప్రిల్, అమాక్సిలిన్ 500 ఎంజీ, డోపామైన్ వంటి చాలా రకాల మందుల సరఫరా ఆగిపోయింది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్‌లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్‌లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంజక్షన్లకు రోజుకు రూ.2 వేలు మా నాన్న ఆళ్ల పెంటారావుకు కాలు, చేయి పడిపోవడంతో విజయవాడ ఆస్పత్రికి తీసుకొచ్చాం. డాక్టర్లు పరీక్షించి పెరాలసిస్ అని నిర్ధారణ చేశారు. ఇంజక్షన్లు, మందుల కొరత తీవ్రంగా ఉండటంతో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. పిరాసెటమ్ ఇంజక్షన్, సిటికొలైన్ ఇంజక్షన్లు, లెవోకార్టినిటైన్ టాబ్లెట్స్, మొడాఫినైల్ టాబ్లెట్స్ ఇక్కడ ఆస్పత్రిలో లేకపోవడంతో రోజుకు రూ.2 వేలు పెట్టి బయట కొంటున్నాం. – ఆళ్ల మహేష్, సీతానగరం, తాడేపల్లి, గుంటూరు జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలింత పేరు జ్యోతి. అనంతపురం జిల్లా యాడికి మండలం వెంకటాంపల్లి గ్రామం. బత్తలపల్లి ఆస్పత్రిలో సిజేరియన్ జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. వైద్యం అందించడంలో భాగంగా గైనిక్ వైద్యులు.. పారాసిటమాల్ ఇంజెక్షన్లు, థైరోనార్మ్, పారాసిటమాల్ ఇన్ఫ్యూషన్ ఐపీ తదితరాలు కావాలని చెప్పారు. సర్వజనాస్పత్రిలో అవి లేకపోవడంతో గత్యంతరం లేక జ్యోతి కుటుంబీకులు బయట ప్రైవేట్ మందుల షాపులో కొనుగోలు చేశారు. రూ.2 వేల వరకు ఖర్చు అయ్యింది. మచిలీపన్నానికి చెందిన ఎం.కామేశ్వరరావు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఐదు రోజుల క్రితం చికిత్స కోసం గర్భిణి అయిన కుమార్తెను వెంట బెట్టుకుని విజయవాడ జీజీహెచ్‌కు వచ్చాడు. ఆస్పత్రికి రాకముందు 5గా ఉన్న అతడి క్రియాటిన్ లెవెల్, ఇప్పుడు 6.5 దాటింది. ఆస్పత్రిలో చూపించుకుంటే నోడోసిస్, ఆర్కామిన్ వంటి మాత్రలను బయట తెచ్చుకోవాలని రాశారు. సమస్య ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇక ఇంటికి వెళ్లిపోవాలంటూ వైద్యులు డిశ్చార్జి రాశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేసే కామేశ్వరరావు కుమార్తె సిబ్బందితో వాదించింది. సమస్య తగ్గకుండానే ఎలా డిశ్చార్జి చేస్తారని ప్రశ్నించడంతో డిశ్చార్జి చేయలేదు. ఆ తర్వాత మలబద్ధకం నివారణ కోసం ప్రోక్టోలిసిస్ ఎనిమా 100 ఎంఎల్ బయట తెచ్చుకోవాలని చీటి రాసిచ్చారు. ‘వచ్చిన రోజు నుంచి మందులు బయట తెచ్చుకోవాలని చీటిలు రాసిస్తున్నారు. మందులు ఎలాగోలా తిప్పలు పడి కొనుగోలు చేస్తాం. వార్డుల్లో రోగులను పట్టించుకుంటే చాలు. ఇక్కడికి వచ్చాక మా నాన్నకు జబ్బు తగ్గాల్సింది పోయి... పెరిగింది’ అని కామేశ్వరరావు కుమార్తె వాపోయింది. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీకి టాస్క్‌ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో పరికరాలు, మందుల లభ్యత, ఫైర్ సేఫ్టీ తదితరాలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా పది టాస్‌్కఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరో గ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ బృందాలు క్రమం తప్పకుండా ఆస్పత్రులను సందర్శించి నివేదిక ఇవ్వాలన్నారు. గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన శాఖ ఉన్నాధికారులతో సమావేశం నిర్వహించారు. టాస్‌్కఫోర్స్ బృందాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల తీరు ను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు పర్యవేక్షణ సాగేలా నూతన వ్యవస్థ అందుబాటులోకి తేవాలని చెప్పారు. దీనిపై త్వర లో సెంట్రల్ పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్న ట్లు పేర్కొన్నారు. ఎక్విప్మెంట్ స్థాయిని బట్టి రెండు నుంచి నాలుగు రోజుల్లో రిపేర్లు పూర్తి చేయాలన్నారు. నిర్దేశించిన సమయంలో పరికరాలకు రిపేర్లు చేయకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. జిల్లాకో బయోమెడికల్ ఇంజనీర్ రాష్ట్ర విభజన సమయంలో బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు ఏపీకి వెళ్లాయని, ఈ పదేళ్లలో బయోమెడికల్ ఇంజనీర్లనునియమించకపోవడంతో చిన్న చిన్న రిపేర్ల కోసమూ ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోందని అధికారులు రాజనర్సింహకు వివరించారు. రాష్ట్రస్థాయిలో చీఫ్ బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ క్రియేట్ చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతీ జిల్లాకు కనీసం ఒక బయోమెడికల్ ఇంజనీర్ ను తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలన్నా రు. కొంతమంది సిబ్బంది ఉద్దేశపూర్వకంగా మిషన్లను రిపేర్‌లో పెడుతున్నారని అధికారులు వివరించగా... అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మందుల సరఫరాలో నిర్లక్షం వహిస్తే సంబంధిత అధికారిపై కొర డా ఝుళిపించాలన్నారు. ఎక్స్పైరీ తేదీ కంటే 3 నెలల ముందే మెడిసిన్‌ను వినియోగించాలని, లేని పక్షంలో వెనక్కి పంపించాలన్నారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్లు, హాస్పిటల్ ఫార్మసీ స్టోర్లలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలన్నారు. పలు హాస్పిటల్స్‌లో ఫైర్ అలారమ్స్, స్మోక్ డిటెక్టర్స్ సరిగా లేవని గుర్తించామని, నాలుగైదు సంవత్సరాలుగా నిర్వహణ సరిగా లేదని అధికారులు వివరించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో అజాగ్రత్త వద్దని, ప్రతి హాస్పి టల్లో అవసరమైనమేర అలారమ్, స్మోక్ డిటెక్టర్స్, మంటలను ఆర్పే యంత్రాలను అందుబాటులో ఉంచాలని రాజనర్సింహ ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు ఆసుపత్రి.. ప్రైవేటు మందు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ప్రైవేట్ మందుల మాఫియా రాజ్యమేలుతోంది. పేద రోగులను పీల్చిపిప్పి చేస్తోంది. ఆసుపత్రిలోని ఉచిత ఫార్మసీలో లేని మందును, ఈ ప్రైవేట్ మెడికల్ షాపుల యజమానులు తెప్పిస్తారు. ఏ మందులు తెప్పించాలో డాక్టర్లు వీరికి చెప్తారు. అదే మందును స్టాక్ పెట్టి రోగులకు అమ్ముతారు. అందులో డాక్టర్ కమీషన్ కనీసం 10 నుంచి 20 శాతం ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులైన గాందీ, ఉస్మానియా, పేట్ల బురుజు, అలాగే వరంగల్‌లోని ఎంజీఎం, కరీంనగర్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మందుల షాపులు ఏటా రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి. ఉచిత మందులు ఇవ్వాల్సిన పెద్దాసుపత్రుల్లో బహిరంగంగా ప్రైవేట్ మందుల మాఫియా దోపిడీ కొనసాగుతున్నా, దాన్ని అడ్డుకునే నాథుడే లేకుండా పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఆ మందుల దుకాణాలెందుకు? రాష్ట్రంలో కీలకమైన ఈ ఆసుపత్రుల్లో సాధారణ జ్వరం మొదలు... అత్యంత కీలకమైన అవయవ మారి్పడి చికిత్సల వరకు జరుగుతుంటాయి. వీటిల్లో పేదలకు ఉచిత వైద్యం, ఉచిత మందులు ఇవ్వాలనేది లక్ష్యం. అయినా అక్కడ ఉచిత మందుల దుకాణాలున్నా, ప్రైవేట్ మందుల దుకాణాలు ఎందుకు పెట్టారన్నది అంతుబట్టని ప్రశ్న. గాంధీ ఆసుపత్రిలో ఓపీ బ్లాక్‌కు సరిగ్గా ఎదురుగా వరుసగా నాలుగు ప్రైవేట్ మెడికల్ షాపులున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఐదు, నిలోఫర్‌లో రెండు, పేట్లబుర్జు మెటర్నిటీ ఆసుపత్రిలో ఒకటి, కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండు ప్రైవేట్ మందుల దుకాణాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ మందుల దుకాణాలు ఉండవు.. కానీ దానికి అత్యంత సమీపంలోని మూడు మెడికల్ షాపులు కేన్సర్ మందులను అందుబాటులో ఉంచుతాయి. కొందరు ఆంకాలజిస్టులకైతే నెలకు ఐదారు లక్షల రూపాయల వరకు ఆ దుకాణాల నుంచి కమీషన్ తీసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. కొన్ని ఫ్రీగా... కొన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మెడికల్ దుకాణాలకు డాక్టర్లు, సూపరింటెండెంట్లు, రాష్ట్రస్థాయిలో కీలకమైన అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. వారి అండతోనే ప్రైవేట్ మందుల దుకాణాదారులు రెచ్చిపోతుంటారు. రోగికి వైద్యుడు నాలుగు రకాల మందులు రాస్తే, అందులో ప్రభుత్వ దుకాణంలో రెండే ఉంటాయి. మిగిలిన రెండింటిని ప్రైవేట్ దుకాణంలో కొనాల్సిందే. ఒక్కోసారి మందులున్నా కూడా లేవని ప్రభుత్వ ఫార్మసీ వారు చెబుతారు. అప్పుడు ప్రైవేట్‌లో కొనాల్సిందే. ఇక ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందులన్నీ దాదాపు బేసిక్‌వే. అడ్వాన్స్ ట్రీట్మెంట్కు అవసరమైన మందులు ఇవ్వాలంటే ఎంఎన్‌జే ఆసుపత్రిలో దొరకవు. పైగా అవి అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. కొన్ని డోసులైతే రూ.లక్షల్లో ఉంటాయి. సీఎంఆర్ఎఫ్ కింద బిల్లులు పెట్టి ప్రైవేట్ దుకాణాల్లో కొని వాడుతుంటారు. ఎంఎన్‌జే మినహా మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చే మందులను తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) సరఫరా చేస్తుంది. అయితే చాలామందులు అత్యాధునికమైనవి కాకుండా బేసిక్ మందులనే సరఫరా చేస్తుందన్న ఆరోపణలున్నాయి. ఆయా ప్రైవేట్ దుకాణాలను ఎత్తి వేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగకపోవడంతో రోగులు నష్టపోతున్నారు. కాగా, ప్రైవేట్ దుకాణాలు కోర్టుల్లో స్టేలు తెచ్చుకొని చలామణిలో ఉంటున్నాయని చెబుతున్నారు. రోజుకు జరిగే వ్యాపారం » గాంధీ ఆసుపత్రిలోని ప్రైవేట్ మందుల దుకాణాల్లో రూ. 10 లక్షలు » ఉస్మానియాలో రూ. 12 లక్షలు » ఎంఎన్‌జేపై ఆధారపడిన మూడు ప్రైవేట్ దుకాణాల్లో రూ.15 లక్షలు » ఎంజీఎంలో రూ. 5 లక్షలు -
ప్రభుత్వ ఆస్పత్రులపై పోలీస్ నిఘా
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణ యం తీసుకోగా, వైద్య,ఆరోగ్యశాఖ గురు వారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సీసీ కెమెరాలను స్థానిక పోలీస్స్టేషన్లకు అనుసంధానించాలని మంత్రి ఆదేశించారు. ఆయా సీసీ కెమెరాల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా వ్యవహరించే వారిపై నిఘా పెడతారు. 24 గంటల కంట్రోల్ రూమ్‌తోపాటు బారికేడ్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఆస్పత్రి ప్రధాన గేట్ల వద్ద స్క్రీనింగ్, సీసీ కెమెరాలతో చెకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో సెక్యూరిటీ, వయలెన్స్ నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రజారోగ్య విభాగం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యవిద్య విభాగం పరిధిలోని బోధనాస్పత్రుల్లో అన్నింటిలో ఈ కమిటీలు ఏర్పడనున్నాయి. ఈ కమిటీలు ఆస్పత్రుల భద్రత పెంపుతోపాటు వైద్య సిబ్బంది భద్రతకు కీలకంగా ఉంటాయి. ఆస్పత్రుల్లో కొన్ని సందర్భాల్లో రోగుల బంధువులు, డాక్టర్లు, ఇతరుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకొని దాడులకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కమిటీ ఏర్పాటు ఇలా...ఆస్పత్రి సూపరింటెండెంట్ చైర్మన్ / చైర్పర్స న్గా, సేఫ్టీ ఆఫీసర్ (ఆర్ఎంవో) కన్వీనర్‌గా, స్టేషన్ హౌస్ ఆఫీసర్, నర్సింగ్ సూపరింటెండెంట్, బయో మెడికల్ ఇంజినీర్, సెక్యూరిటీ స్టాఫ్ ఇన్చార్జ్, ఐఎంఏ మెంబరు, సీనియర్ డాక్టర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ అలైడ్ హెల్త్స్టాఫ్ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. సెక్యూరిటీ, వయలెన్స్ నియంత్రణ కమిటీలు రెండు వేర్వేరుగా పనిచేస్తాయి. ఈ రెండు కమిటీలకు చైర్మన్‌గా ఒకరే వ్యవహరిస్తారు. కమిటీలు ఏం చేస్తాయంటే?ప్రతిరోజూ ఆస్పత్రులను ఆడిట్ చేస్తాయి. మూడు షిప్టులలోని భద్రతపై ఆరా తీస్తాయి. ఆస్పత్రి బయట, వార్డులలోనూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల తరహాలోనే రోగుల సహాయకులు, బంధువులకు విజిటర్ పాస్ వ్యవస్థను అందుబాటులో తీసుకొస్తారు. డాక్టర్ల డ్యూటీ రూమ్స్, రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్ వద్ద అదనంగా లైటింగ్, డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బంది అందరికీ రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల పనితీరును చెక్ చేస్తూనే, వాటి సంఖ్య మరింత పెంచుతారు. సీసీ కెమెరాల ఫుటేజ్ స్టోరేజ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తారు. ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, ఫైర్‌సేఫ్టీ, మెడికల్ ఎక్విప్మెంట్, సెక్యూరిటీ మేనేజ్మెంట్పై సమీక్షిస్తారు. చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుతూ, ఆస్పత్రుల సిబ్బంది భద్రతకు సెక్యూరిటీ సిబ్బందికి డ్రిల్, ట్రైనింగ్ ఇస్తారు. -
AP: రోగం తిరగబెట్టింది
మునుపటికొకడు ఒక కుక్కపై కక్షగట్టి చంపాలనుకుని.. ‘అది పిచ్చి కుక్క’ అని అరిచాడట. పక్కనున్న వారందరూ తలో రాయి వేసి దానిని హతమార్చారట. ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వ తీరు అచ్చం అలానే ఉంది. రెండున్నర నెలల వరకు ప్రభుత్వాసు పత్రులంటే పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల్లో అపార నమ్మకం కలిగేలా పనితీరు ఉండింది. కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఉద్దేశ పూర్వకంగా వాటిని పతనావస్థకు తీసుకెళ్లేలా అడుగులు వేస్తోంది. ఒక్కో విభాగాన్ని నిర్వీర్యం చేస్తూ.. పేద రోగులకు వైద్య సేవలు సరిగా అందకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. మందులు అయిపోయినా, సిబ్బంది సీట్లలో లేకపోయినా పట్టించుకోవడం లేదు. ఆస్పత్రుల నిర్వహణను అంతకంటే పట్టించు కోవడం లేదు. క్రమంగా ప్రజల్లో దురభిప్రాయం కలిగేలా చేసి.. ‘ప్రైవేట్’కు కట్టబెట్టాలన్నదే సర్కారు లక్ష్యం. రాష్ట్రంలో ఆ చివర ఉన్న అనంతపురం నుంచి ఈ చివరనున్న శ్రీకాకుళం వరకు కేవలం ఈ రెండు నెలల్లోనే ఏ ఆస్పత్రి నిర్వహణ చూసినా అస్తవ్యస్తంగా మారిపోవడమే ఇందుకు తార్కాణం. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన వాస్తవమిది.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసి, ప్రైవేట్ ఆస్పత్రులు, వ్యక్తులకు మేలు చేయాలన్న లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ మేరకు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని మారుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ వ్యవస్థలను తీసుకుని వెళ్లేలా ఆ పార్టీ నాయకులు లీకులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్య శాఖలోని నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ముందుకు తీసుకుని వెళతామని ఇప్పటికే ప్రకటించారు. అదే విధంగా 2014–19 తరహాలోనే టెలీమెడిసిన్, ల్యాబ్‌లు, ఇతర సేవలను ప్రైవేట్‌కు కట్టబెట్టి ప్రభుత్వ నిధులను లూఠీ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందికి కొరత లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన జీరో వేకెన్సీ విధానానికి కూటమి సర్కార్ ఇప్పటికే తిలోదకాలు ఇచ్చేసింది. గత ప్రభుత్వంలో సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఖాళీ అయిన వైద్య పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. ఎన్నికలకు ముందు నియామకాలు దాదాపు పూర్తయిన పోస్టుల ప్రక్రియనూ కూటమి ప్రభుత్వం ఆపేసింది. నోటిఫికేషన్లను సైతం రద్దు చేసింది. కూటమి ప్రభుత్వం నిరంతర నియామక ప్రక్రియకు ఇలా పుల్‌స్టాప్ పెట్టడంతో ఆస్పత్రుల్లో రోగుల సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంకో వైపు మందులు, సర్జికల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బోధనాస్పత్రులు, సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో కొరత నెలకొంది. పలు చోట్ల గ్లౌజ్‌లు, సిరంజులకూ దిక్కులేదుజిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా, బోధనాస్పత్రుల్లో ఇందులో చాలా మందులు లేవు. విశాఖ కేజీహెచ్, గుంటూరు, కర్నూలు, విజయవాడ జీజీహెచ్, తదితర పెద్దాసుపత్రుల్లో సైతం 100 రకాల మందుల కొరత ఉంది. పాడేరు ఆస్పత్రిలో చాలా వ్యాధుల నివారణకు సంబంధించిన యాంటిబయాటిక్స్ మందులు లేవు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి పంపిణీ కాకపోవడంతో రోగులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మందులనే పంపిణీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో సిరంజులు కూడా బయటకు రాసిస్తున్నారు. రూ.30 నుంచి రూ.1000 విలువ చేసే మందుల వరకు చీటి రాసి బయటకు పంపుతున్నారు. చేసేది లేక చాలా మంది ప్రైవేటు మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో గ్లౌజ్‌ల కొరత ఉంది. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు చికిత్సలు, ఆపరేషన్ల సమయంలో కావలసిన కాటన్, ఐవీ క్యానల్, స్కానింగ్ జల్ కొరత ఉంది. కొన్ని రకాల సర్జికల్ వస్తువులు, రోజుకు రూ.5 వేలు లోపు వస్తువులను ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నారు. ఆపరేషన్ సమయంలో రోగులు ప్రైవేట్ మందుల దుకాణంలో కొనుగోలు చేసి తీసుకుని వచ్చి వైద్యులకు ఇస్తున్నారు. రెండు నెలల నుంచి ఫాంటాప్ ఇంజక్షన్లు లేవు. విజయవాడ జీజీహెచ్‌లో షుగర్ ఇన్ఫెక్షన్, నరాల సమస్య, గుండె జబ్బుల రోగులు బయట మందులు కొనుగోలు చేస్తున్నారు. కాంబినేషన్ మందులు, మల్టీ విటమిన్ మందులు దాదాపు పూర్తిగా బయటే కొనాల్సి వస్తోంది. ఇన్ఫెక్షన్ సోకిన రోగులకు హై యాంటిబయోటిక్ ఇంజక్షన్ అవసరమైన వారు బయట కొనుగోలు చేస్తున్నారు. ఖరీదైన ఆల్బుమిన్ ఇంజక్షన్లు, ఇన్‌పేషెంట్‌గా చేరి, డిశ్చార్జి అయిన రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేక పోవడంతో బయటకు రాస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో 608 మందులకు గాను 566 మందులు రేట్ కాంట్రాక్ట్‌లో ఉన్న వాటిని రాష్ట్ర వ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేసేవారు. తక్కువ వినియోగం ఉన్న మందులను డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందించారు. ఇలా విలేజ్ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200లకు పైగా, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేసేవారు. ఈ ఏడాది రెండో క్వార్టర్‌కు సంబంధించి మందుల సరఫరాను కూటమి ప్రభుత్వం ఆలస్యంగా సరఫరా చేయడంతో ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఓపీ వద్ద బారులుతీరిన రోగులు నోటిఫికేషన్లు రద్దుకు యత్నాలుప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు, ఇతర ఆస్పత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పారామెడికల్‌తో పాటు ఇతర పోస్టులను ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 200 నుంచి 250 చొప్పున భర్తీ చేయడానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చారు. దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిశీలన, మెరిట్ జాబితాలను సిద్ధం చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కోడ్ కంటే ముందే పోస్టుల భర్తీ పూర్తి చేశారు. మిగిలిన జిల్లాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం మొత్తం నోటిఫికేషన్లను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే అంశాన్ని వైద్య శాఖ పరిశీలిస్తోంది. గత ప్రభుత్వంలో వైద్య శాఖలో మానవ వనరుల కొరతకు తావు లేకుండా ఏకంగా 54 వేల పోస్టులను భర్తీ చేశారు. ప్రత్యేకంగా వైద్య శాఖ నియామకాల కోసమే రిక్రూట్మెంట్ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. హిందూపురంలోని జిల్లా ఆస్పత్రి ఓపీ కౌంటర్ వద్ద రోగుల పడిగాపులు ఇంటి నుంచి తెచ్చుకున్న కుర్చీలోనేఇతని పేరు శ్రావణ్‌కుమార్. నెల్లూరు రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న పేద వ్యక్తి. వయస్సు 60 ఏళ్లు పైబడి ఉన్నాయి. షుగర్ ఉండటంతో ఇన్ఫెక్షన్ వచ్చి నాలుగు నెలల క్రితం ఒక కాలుకు యాంపుటేషన్ (సర్జరీ చేసి మోకాలు వరకు తొలగించారు) చేశారు. నడవలేడు కనుక మూత్ర విసర్జనకు కెథీటర్ వేశారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఈ కెథీటర్ను వారం, లేదా పది రోజులకు ఒకమారు మార్చి కొత్తది వేయాలి. ఇలా మార్పించుకునేందుకు తరచూ పెద్దాస్పత్రిలోని ఎమర్జెన్సీ (క్యాజువాలిటీ)కి ఆటోలో వస్తాడు. ఇటీవల ఒకటి, రెండు దఫాలుగా వీల్ చైర్ దొరకలేదు. ఎండలో గంటకు పైగా ఉంచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఇంటి వద్ద నుంచే కుర్చీ తెచ్చుకున్నారు. దానిలోనే ఎమర్జెన్సీ వార్డు వద్దకు తీసుకెళ్తున్నారు. అక్కడ వారు గంటల కొద్దీ చూస్తే గాని కెథీటర్ మార్పు జరగ లేదు.బిడ్డతో పాటు ఆక్సిజన్ సిలిండర్ నెల్లూరు నగరానికి చెందిన ఈ ఫొటోలోని పసిబిడ్డ పేరు హృతిక్నందన్. ఇతనికి మూడేళ్లు. తలలో గడ్డ ఉండటంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ నెల్లూరులోని పెద్దాస్పత్రిలో చిన్న పిల్లల వార్డులో చేర్చారు. ఆక్సిజన్ మీద వైద్యం పొందుతున్నాడు. ఇక్కడ వాంతులు కావడంతో డాక్టర్లు ఎంఆర్ఐ స్కానింగ్ రాశారు. పిల్లల వార్డు నుంచి ఎంఆర్ఐ తీసే చోటు కొంత దూరంలో ఉంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు ఆ పసిబిడ్డ తండ్రి.. బిడ్డకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సిలిండర్‌ను తోసుకుంటూ పరీక్షలకు తీసుకెళ్లాడు. ఆక్సిజన్ సిలెండర్‌ని తోసుకుంటూ వెళ్తున్న ఈమె పేరు శాంతి. గుండె జబ్బుతో బాధపడుతున్న అమ్మకు సీరియస్‌గా ఉందని మధురవాడ నుంచి 108 వాహనంలో విశాఖ కేజీహెచ్‌కు ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. లోపలికి వెళ్లి త్వరగా క్యాజువాలిటీకి తీసుకెళ్లి వైద్యం అందించాలంటూ అక్కడున్న సిబ్బందిని వేడుకున్నారు. ఎవ్వరూ స్పందించలేదు. ఓ నర్స్ వచ్చి వివరాలు తీసుకున్నారు. వెంటనే ఆక్సిజన్ సిలిండర్‌ని ఇచ్చి.. శాంతి తీసుకొచ్చిన అమ్మ బాధ్యతని వార్డు బాయ్‌కి అప్పగించారు. నర్స్ అటు వెళ్లగానే.. సిలెండర్‌ని వార్డు బాయ్ శాంతి చేతికి ఇచ్చి.. నువ్వే తీసుకురావమ్మా అంటూ విసుక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. శాంతి ఆ సిలెండర్‌ని మోసుకుంటూ బయటికి వచ్చింది. తన కుటుంబ సభ్యులు, 108 వాహన సిబ్బంది సహాయంతో సిలెండర్‌ని తానే తోసుకుంటూ క్యాజువాలిటీకి అమ్మని తీసుకెళ్లింది. అరగంట నుంచి అడుగుతున్నా.. ఎవ్వరూ స్పందించలేదు.. అమ్మకి ఏదైనా అయితే.. ఎవరిది బాధ్యత సార్ అంటూ కన్నీటి పర్యంతమైంది.ఇలాగైతే ఎలా? నా బిడ్డ శ్రీవిద్యకు రెండ్రోజులుగా జ్వరం వస్తోంది. ఆత్మకూరులో అంతంత మాత్రంగానే చూస్తారని తెలిసి, అనంతపురం పెద్దాస్పత్రిలోనైతే బాగా వైద్యం అందిస్తారని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే ఉదయం 10 గంటలైనా వైద్యులు రాలేదు. ఉదయం 8 గంటల నుంచి వేచి చూస్తున్నాం. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – ఆదినారాయణ, బి.యాలేరు, ఆత్మకూరు మండలంరాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో ఇదీ సంగతి⇒ శ్రీకాకుళంలోని రిమ్స్‌లో నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఆధార్‌కార్డులతో వచ్చినప్పటికీ సెల్‌ఫోన్ లేక ఓపీ రశీదు పొందలేకపోతున్నారు. కాళ్లావేళ్లా బతిమాలిడితే... ఎవరో ఒకరు స్పందించి కొందరికి ఓపీ ఇప్పిస్తున్నారు. ఫోన్లు లేని చాలా మంది వైద్యం పొందలేక ఇళ్లకు వెనుదిరిగారు. ఫ్యాన్లు, ఏసీలు, సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఐసీయూలో కూడా ఏసీలు పని చేయని దుస్థితి.⇒ రాజమహేంద్రవరం, ఒంగోలు, నంద్యాల, విశాఖ, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, పాడేరు, విజయనగరం, నర్సరావుపేట, పార్వతీపురం, కాకినాడ, తిరుపతి రుయా ఆస్పత్రుల్లో పాలన అస్తవ్యస్తమైంది. నాలుగవ తరగతి సిబ్బందితో ఇబ్బందులెదురయ్యాయి. స్ట్రెచర్లు, వీల్ చైర్లు అందుబాటులో లేవు. చాలా చోట్ల ఈసీజీ, 2డీ ఎకో మిషన్లు మొరాయిస్తున్నాయి. రక్త పరీక్షల రిపోర్టుల కోసం రోజుల తరబడి తిప్పుకుంటున్నారు. పారిశుధ్య లోపం బాగా ఇబ్బంది పెడుతోంది. బాత్రూంలు, మరుగుదొడ్లలో చాలా చోట్ల రన్నింగ్ వాటర్ లేదు. మంచి నీరు కూడా అందుబాటులో లేదు. ఆక్సిజన్ సిలెండర్లు సైతం బంధువులే మోసుకెళ్లారు. రెండు నెలలుగా మందుల సరఫరా నిలిచి పోయింది. మృతదేహాలు పెట్టేందుకు తగినన్ని ప్రీజర్లు లేవు. ఆసుపత్రిలో రోగులకు పెడుతున్న భోజనం నాసిరకంగా ఉంది. నిధులు లేక శానిటేషన్ లోపం కనిపిస్తోంది. సెక్యూరిటీకి సైతం జీతాలు సక్రమంగా అందడం లేదు. వార్డుల్లోకి కోతులు, కుక్కలు చొరబడుతున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు సరిగా లేవు. మహాప్రస్తానం వాహనాలు అందుబాటులో లేవు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే జనరేటర్ వేయడం లేదు. దోమలను అరికట్టలేక పోతున్నారు. ⇒ భీమవరంలో బాలింతల వార్డుల్లో ఏసీలు పని చేయడం లేదు. ఎక్స్‌రే, ఈసీజీ టెక్నీషియన్లు లేరు. రక్త పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది. డెడ్ బాడీ ఫ్రీజర్లు దెబ్బ తిన్నాయి. స్కానింగ్ కోసం ఏలూరుకు రిఫర్ చేస్తున్నారు. ⇒ కర్నూలు జీజీహెచ్‌లో ఒకటి, రెండు రకాల యాంటిబయాటిక్స్ మాత్రమే ఉన్నాయి. దళారులు, ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకులు ఆసుపత్రిలో బాహాటంగా తిరుగుతున్నారు. వార్డు బాయ్‌లు, స్ట్రెచర్ బాయ్‌లు లేక రోగుల కుటుంబీకులే ఆ పని చేస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది సగానికి సగం డ్యూటీలో కనిపించలేదు. కోతుల బెడద విపరీతంగా ఉంది. ఆసుపత్రిలో సైన్ బోర్డులు లేవు.⇒ హిందూపురం జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్ మిషన్ చెడిపోయింది. మరమ్మతులు చేయలేదు. చాలా మంది రోగులను స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. ⇒ అనంతపురం జీజీహెచ్‌లో పారిశుధ్య నిర్వహణ దారుణంగా ఉంది. వార్డుల్లో బయోవేస్ట్ డబ్బాలు ఏర్పాటు చేయలేదు. మందుల కొరత ఉంది. రక్త పరీక్షల రిపోర్టుల్లో జాప్యం జరుగుతోంది. 160కి గాను 60 ఏసీలు మాత్రమే పని చేస్తున్నాయి. గైనిక్, ఎక్స్‌రే, రక్తనిధి వార్డుల్లో కరెంటు పోతే చిమ్మ చీకటే.⇒ అనకాపల్లిలో ఉదయం 10 గంటల నుంచి 11.45 గంటల వరకూ కరెంట్ లేదు. జనరేటర్ ఉన్నా, 10 నిమిషాల పాటు మాత్రమే పని చేసింది. ఎక్స్‌రే కోసం చాలా మంది ఇబ్బంది పడ్డారు. గర్భిణీలకు అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తున్నా.. రిపోర్టు ఇవ్వడం లేదు. తెల్ల పేపర్‌పై పెన్‌తో రాసి పంపిస్తున్నారు. సర్జికల్ గ్లౌజులు, కాటన్, ఐవి క్యానల్, స్కానింగ్ జల్ కొరత ఉంది. రోగులకు ఇచ్చే భోజనంలో నాణ్యత తగ్గింది. ⇒ కృష్ణాజిల్లా మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో స్ట్రక్చరు, వీల్‌చైర్స్ సరిపడా లేవు. ఉన్న వాటిలో బంధువులే తోసుకెళ్తున్నారు. బాగా పని చేస్తున్న వెంటిలేటర్లను గదుల్లో పెట్టి తాళాలు వేశారు. రోగులకు కనీసం బీపీ కూడా చూడటం లేదు. ⇒ విజయవాడ జీజీహెచ్‌లో నాల్గవ తరగతి సిబ్బంది కొరత చాలా ఉంది. అవుట్‌పేషెంట్ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులే చూస్తున్నారు. ఓపీలో ఇన్‌పేషెంట్స్‌గా చేర్చిన వారిని మరుసటి రోజు పరీక్షించి మందులు రాస్తున్నారు. అత్యవసర కేసుల్లో వార్డుకు తరలించడానికి ఎక్కువ సమయం పడుతోంది.⇒ ఏలూరు జీజీహెచ్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం రోగులు కనీసం 15, 20 రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. వీల్ చైర్లు, స్ట్రెచర్లు సరిపడా లేవు. ఓపీకి వచ్చే రోగులు, వారి బంధువులు గంటల తరబడి బయట షెడ్ల కింద ఉండాల్సి వస్తోంది. కనీసం ఫ్యాన్లు కూడా లేవు. రెండు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రైవేటు సంస్థ సరఫరా చేస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి మాత్రమే రోగులకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ⇒ కడపలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లోని ఐపీ, ఓపీ విభాగాల్లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఓపీ విభాగంలో కుర్చీలు, స్ట్రక్చర్లను మూలన పడేశారు. మెడికల్ ఐసీయూలో ఏసీలు పని చేయడం లేదు. పెడస్టల్ ఫ్యాన్లు పెట్టారు. ఎంఆర్ఐ, ఇతర ఓపీ విభాగాల్లోకి యథేచ్చగా కోతులు, కుక్కలు వస్తున్నాయి. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అల్టిమేటం ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోయి ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారుతోందని, అందువల్ల ఈ నెల 15వ తేదీ నుంచి సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. సమస్యను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ఆరోగ్యశ్రీ సీఈవోకు మంగళవారం లేఖ రాసింది. ఆస్పత్రుల నిర్వహణకు నిధులు లేక సిబ్బంది జీతాల చెల్లింపు, మౌలిక సదుపాయాలు, మందులు, డిస్పోజబుల్స్ నిర్వహించడం కూడా కష్టతరంగా మారినట్టు పేర్కొంది. గత నెల 30న సీఈవోను కలిసి సమస్యల్ని వివరించినప్పటికీ ఎటువంటి కదలిక లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?శ్రీకాకుళం/శ్రీకాకుళం క్రైమ్: రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జునుజ్జయిపోయిన ఓ క్షతగాత్రుడు ఆస్పత్రికి వస్తే.. గంట పాటు అతనికి వైద్యం అందించకుండా శ్రీకాకుళం రిమ్స్ వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీనిపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రణస్థలం వద్ద యూబీ పరిశ్రమకు చెందిన కార్మికుడు పతివాడ సన్యాసినాయుడును మంగళవారం మ«ధ్యాహ్నం లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అతని రెండు కాళ్లు నుజ్జునుజ్జయిపోయాయి. మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రమాదం జరిగింది. సన్యాసినాయుడును యూబీ కంపెనీ అంబులెన్స్‌లో 2.55 గంటలకు శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకువచ్చారు. అంబులెన్సు నుంచి అతడ్ని తీసుకెళ్లడానికి అరగంట వరకు ఎవరూ రాలేదు. 3.45 ప్రాంతంలో సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స మాత్రమే చేశారు. -
ప్రైవేటుపరం..! బాబు, పవన్ వాటాలు బయటపడ్డ నిజాలు
-
ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటుపరం వెనుక అసలు నిజం
-
ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ పెరిగింది. పట్టణాల్లోనూ ఇంటి పక్కనే సర్కారు వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఆస్పత్రులను సీఎం వైఎస్ జగన్ సర్కారు బలోపేతం చేయడంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ)నూ సకల పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాడు–నేడు పేరుతో యూపీహెచ్‌సీల్లో సౌకర్యాలు, వైద్య పరీక్షలు, అవసరమైన మందులతో పాటు ఇద్దరేసి వైద్యులు, నర్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.700 కోట్లతో వీటిని ఆధునికీకరించారు. ఫలితంగా ఇప్పుడు యూపీహెచ్‌సీలకు వైద్య సేవల కోసం వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. చంద్రబాబు హయాంలో పడకేసిన వైద్యం చంద్రబాబు హయాంలో యూపీహెచ్‌సీల్లో వైద్య పరీక్షలతోపాటు అన్ని సేవలనూ ప్రైవేట్ పరం చేయడమే కాకుండా వైద్యులు, నర్సులను భర్తీ చేయలేదు. టీడీపీ పాలనలో యూపీహెచ్‌సీలపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు యూపీహెచ్సీల వైపు చూసేవారు కాదు. చిన్నపాటి అనారోగ్యమైనా జనమంతా ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. అప్పట్లో నెలకు కేవలం వేల సంఖ్యలోనే ఔట్ పేషెంట్ల సేవలందేవి. ఇందుకు ప్రధాన కారణం వైద్య పరికరాలు, వైద్యులు, మందులు అందుబాటులో ఉండేది కాదు. దీంతో ప్రజలంతా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేదని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పుడు అన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు, వైద్యులు అందుబాటులో ఉండటంతో యూపీహెచ్‌సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అప్పటికి ఇప్పటికీ ఇదే మార్పు అని వైద్యులతోపాటు పేషెంట్లు సైతం చెబుతున్నారు. ఇంతలోనే.. ఎంతో మార్పు సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి.. సంపూర్ణ సౌకర్యాలు సమకూర్చడంతోపాటు వైద్యులు, వైద్య సిబ్బందిని భారీగా నియమించారు. ఫలితంగా పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల గడప తొక్కడం మానేసి.. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. ఫలితంగా యూపీహెచ్‌సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గర్భిణి పరీక్షల నుంచి చిన్నపాటి సుస్తీ చేసినా వైద్య సేవలకు, పరీక్షలకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు వెళ్తున్నారు. మొత్తం 65 రకాల పరీక్షలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యూపీహెచ్‌సీలలో ఔట్ పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికార్డు స్థాయిలో 61.47 లక్షల మందికి ఔట్ పేషెంట్ సేవలను అందించారు. అంటే రోజుకు సగటున ఒక్కో యూపీహెచ్‌సీలో 40 మందికి పైగా ఔట్ పేషెంట్ సేవలు అందించారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఎస్) ద్వారా ఔట్ పేషెంట్ల డేటాను నమోదు చేశారు. మరోవైపు 2022 ఫిబ్రవరి నుంచి 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత నెల 21వ తేదీ వరకు 92,82,536 ల్యాబ్ పరీక్షలు సైతం నిర్వహించారు. ఖరీదైన పరీక్షలు ఉచితం గత ప్రభుత్వంలో గర్భిణి పరీక్షల్ని ప్రైవేట్ ల్యాబ్‌లో చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఖరీదైన వైద్య పరీక్షల్ని సైతం ఉచితంగా పొందగలుగుతున్నాం. ఆర్థిక స్థోమత లేకపోతే కేజీహెచ్‌కి వెళ్లే వాళ్లం. ఇప్పుడు సమీపంలోని ఇసుక తోటలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఆరోగ్యానికి భరోసా లభించింది. – పి.సుజాత, గర్భిణి, మద్దిల పాలెం, విశాఖపట్నం నాణ్యమైన వైద్య సేవలందుతున్నాయి పట్టణాల్లో వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యం అందిస్తోంది. ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దాస్పత్రికి పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ఇంటి పక్కనే వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ వైద్యం అందేది కాదు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా దూర ప్రాంతాలకు వెళాల్సి వచ్చేది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం వైఎస్ జగన్‌పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సౌకర్యాలు కల్పించడంతో పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందుతున్నాయి. పరీక్షలన్నీ ఇక్కడే చేస్తున్నారు. ముందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. – సూరాడ ఈశ్వరమ్మ, 12వ డివిజన్, సంజయ్ నగర్, కాకినాడ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుష్కలంగా మందులు
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. చంద్రబాబు పాలనలో ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, ఇతర వనరులకు తీవ్ర కొరత ఉండేది. దీంతో అప్పట్లో ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ఈ పరిస్థితులను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల పాలనలో పూర్తిగా చక్కబెట్టింది. ఆస్పత్రుల్లో పుష్కలంగా మందులను ఉంచేలా చర్యలు తీసుకుంది. 2019 ముందు ఏటా చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా రెట్టింపు ఖర్చు చేసి మందుల సరఫరా చేపట్టింది. కొరతకు తావివ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలు కలిగిన నాణ్యమైన మందులను ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల సరఫరాకు సంబంధించి 2018–19 సమయంలో రేట్ కాంట్రాక్ట్‌లో 608 గాను 229 మందులే ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వంలో 608 మందులకు గాను 566 మందులు రేట్ కాంట్రాక్ట్‌లో ఉంటున్నాయి. రేట్ కాంట్రాక్ట్‌లో ఉన్న మందులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేస్తోంది. తక్కువ వినియోగం ఉన్న మందులను డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. ఇలా విలేజ్ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200లకు పైగా, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్నారు. పీహెచ్‌సీలు, విలేజ్‌క్లినిక్స్‌కు మూడు నెలలకు సరిపడా మందులను ముందే అందుబాటులో ఉంచుతున్నారు. మందుల బడ్జెట్లో గణనీయమైన పెరుగుదల టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో మందుల కోసం బడ్జెట్ గణనీయంగా పెరిగింది. పెరిగిన బడ్జెట్ ప్రభుత్వాస్పత్రుల్లో పుష్కలంగా మందులు ఉంటున్నాయనడానికి నిదర్శనంగా నిలిచింది. టీడీపీ ప్రభుత్వంలో 2015–19 మధ్య మందుల కోసం సుమారు రూ. 868 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ. 216 కోట్లు మాత్రమే మందులకు వెచ్చించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019 నుంచి మందుల కోసం రూ. 2,090.39 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి రూ. 418.07 కోట్లు వ్యయం చేశారు. దీన్ని బట్టి టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఏటా రూ. 200 కోట్లకు పైగా అదనంగా మందుల కోసమే ఖర్చు పెట్టారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగి వైద్య సేవల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.700 కోట్ల మేర మందుల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంది. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన శస్త్ర చికిత్సలు
గుంటూరు మెడికల్/కర్నూలు(హాస్పిటల్): తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన వారికి శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు నిలిపిన ఘటనలకు గుంటూరు జీజీహెచ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు వేదికయ్యాయి. వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లాకు చెందిన 62 ఏళ్ల నూతి దుర్గారావు విపరీతమైన కడుపు నొప్పితో జనవరి 17న గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. జనరల్ సర్జరీ మూడో యూనిట్ ప్రొఫెసర్ డాక్టర్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పాంక్రీస్ డక్ట్ స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. మద్యం తాగడం వల్ల ఏర్పడిన ఈ రాళ్లను జనవరి 19న సుమారు నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి తొలగించారు. సుమారు రూ.1.50 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ తెలిపారు. బాలిక ఛాతీలో కణితి తొలగింపు కర్నూలు జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామానికి చెందిన పద్మ(15)కు ఛాతీలో గుండె పక్కన గడ్డ వచ్చింది. గుండె వెనుక భాగంలో న్యూరో ఫైబ్రోమా అని పిలిచే ఈ గడ్డ నరాల నుంచి వస్తోందని వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కణితిని ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంది. ఇలా చేస్తే బాలిక కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. త్వరలో ఆ బాలిక పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉన్నందున వీఏటీఎస్ వీడియో అసిస్టెడ్ తొరాసిక్ సర్జరీ పద్ధతి ద్వారా కణితిని తొలగించినట్లు కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. -
70 శాతం రోగులకు యాంటీ బయోటిక్స్!
సాక్షి, హైదరాబాద్: యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు మరెన్నో వైద్య సంస్థలు సూచిస్తున్నప్పటికీ వాటి వినియోగం ఎంతమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా 20 ప్రభుత్వ ఆసుపత్రులలో జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని అంచనా వేయడానికి ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన అతిపెద్ద మల్టీ సెంటర్ పీపీఎస్ (పాయింట్ ప్రెవలెన్స్ సర్వే)ల్లో ఇది ఒకటి. కాగా ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన 10 మంది రోగులలో ఏడుగురికి యాంటీ బయోటిక్స్‌ను సూచిస్తున్నట్టు (ప్రిస్క్రైబ్) ఈ సర్వే వెల్లడించింది. 70%లో కనీసం 5% మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రకాల యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నారని వెల్లడైంది. వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్సే ఎక్కువ సాధారణంగా రోగులకు ఉపయోగించే 180 రకాల యాంటీబయోటిక్‌లను, వాటి సామర్థ్యాలకు అనుగుణంగా, వినియోగించాల్సిన తీరుతెన్నులను నిర్ధారించడానికి వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు. వీటిలో అత్యధిక సామర్ధ్యం కలిగిన హయ్యర్ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కిందకు వచ్చే వాచ్ గ్రూప్ తరహా యాంటీ బయాటిక్స్నే ఎక్కువగా సూచిస్తున్నారని సర్వే నిర్ధారించింది. అదే సమయంలో తక్కువ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కలిగిన యాక్సెస్ గ్రూప్ రకాన్ని తక్కువగా సూచిస్తున్నట్టు వెల్లడించింది. యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ ప్రిస్క్రిప్షన్‌ను రెండు వెబ్సైట్లు మాత్రమే అధికంగా నమోదు చేశాయని తెలిపింది. యాంటీ బయాటిక్స్ కలపడం వల్ల ప్రతికూల ప్రభావం చాలా కేసుల్లో పాలీ ఫార్మసీ (బహుళ ఔషధాలను ఒకే సమయంలో వినియోగించడం) గమనించామని, రెండు యాంటీ బయాటిక్స్ కలపడం వలన ప్రతికూల ప్రభావాలు చూపేందుకు, ఔషధ పరస్పర చర్యల ప్రమాదాన్ని పెంచేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య మంగళవారం విడుదల చేశారు. యాంటీ బయాటిక్స్ అధిక వాడకం వల్ల కలిగే హానిని దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ వినియోగం వీలైనంత తక్కువ స్థాయిలో ఉండేలా చూడాలని ఈ అధ్యయనం ఆసుపత్రులకు సిఫారసు చేసింది. -
CM Jagan: ‘నాడి’ పట్టిన నేత
సాక్షి, గుంటూరు: 2019కి ముందు చిన్న జబ్బు చేసినా ప్రజలు పట్టణాలు, నగరాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నం. ఏకంగా రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కింద వివిధ కార్యక్రమాలను చేపట్టారు.గతంలో పడకేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి రెట్టింపు భరోసా కల్పిస్తున్నారు. పథకంలో ఏకంగా 3,257 వైద్య ప్రొసీజర్లు అందుబాటులో తీసుకొచ్చారు. అంతేకాక.. దేశంలో ఎక్కడా లేనట్లుగా వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి చికిత్సలు అందించే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు.నాడుప్రభుత్వాసుపత్రుల్లో శిశువులను ఎలుకలు పీక్కుతిన్న అధ్వాన పరిస్థితులు.. సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో సర్జరీలు చేసిన ఘటనలు.. విపరీతమైన సిబ్బంది కొరత.. వెరసి ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం అడుగంటింది.. నేడుసర్కారీ వైద్యం ప్రజలకు అత్యంత చేరువైంది. నాడు–నేడుతో ప్రభుత్వాసుపత్రులు కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా మారాయి. 53 వేలకుపైగా పోస్టుల భర్తీ. అటకెక్కిన ఆరోగ్యశ్రీ మళ్లీ పట్టాలెక్కింది. పిలవగానే పలికే అంబులెన్సులు. గ్రామస్థాయిలో ఆరోగ్య శిబిరాలు. ఇలా నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజారోగ్య ముఖచిత్రాన్ని సీఎం వైఎస్ జగన్ సమూలంగా మార్చేశారు. ఆరోగ్యశ్రీ బలోపేతం ఇలా.. ♦ 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 1,059 ♦ వైఎస్ జగన్ సర్కార్ కొత్తగా చేర్చిన ప్రొసీజర్లు 2,198 ♦ వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు. ♦ 2019 నుంచి ఈ ఏడాది నవంబరు వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం పొందినవారు– 37,40,525 మంది ♦ వీరికి వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం – రూ. 11,859.96 కోట్లు ♦ ఆరోగ్య ఆసరా కోసం వెచ్చించిన మొత్తం– రూ.1,309.90 కోట్లు ♦ నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం చేసిన ఖర్చు– రూ.13,169.86 కోట్లు ♦ ఆరోగ్యశ్రీకి 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు– రూ. 5,177.38 కోట్లు ♦ కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను 2021 మే, జూన్ నెలల్లో ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. ♦ రెండు లక్షల మందికిపైగా కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించారు. ♦ కోవిడ్ బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.744 కోట్లు. ప్రజారోగ్యానికి రక్ష జగనన్న ఆరోగ్య సురక్ష.. ♦ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శిబిరాలు12,423 ♦ మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసింది 86,690 మంది ♦ సొంత గ్రామంలోనే చికిత్స పొందినవారు 60.27 లక్షలు ♦ కేటరాక్ట్ సర్జరీలు నిర్వహించింది 78,292 మందికి నాడు–నేడులో పనులు.. ♦ రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు.. వీటి ద్వారా 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు గ్రామంలోనే అందుతున్నాయి. ♦ రూ.664.96 కోట్లతో పీహెచ్‌సీల బలోపేతం చేశారు. 983 పీహెచ్సీ భవనాలకు మరమ్మతులు చేయడంతోపాటు 150 కొత్త భవనాలను నిర్మించారు. కొత్తగా 176 పీహెచ్‌సీల ఏర్పాటు. ప్రతి పీహెచ్సీలో 63 రకాల వైద్య పరీక్షలు, 215 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. ♦ రూ. 374.61 కోట్లతో 528 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. వీటికోసం 184 భవనాలకు మరమ్మతులు, 344 కొత్త భవనాల నిర్మాణం. ♦ రూ.682 కోట్లతో 42 ఏరియా ఆస్పత్రులు, రూ.13 కోట్లతో ఎంసీహెచ్/జిల్లా ఆస్పత్రులు, రూ.528 కోట్లతో 121 సీహెచ్‌సీల బలోపేతం చేశారు. ♦ రూ.246 కోట్లతో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఐదు ట్రైబల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు.. ♦ రూ. 272 కోట్లతో కడపలో క్యాన్సర్, మెంటల్ హెల్త్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. ♦ రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుచేశారు. 17 వైద్యకళాశాలల ఏర్పాటుతో నూతన అధ్యాయం మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలను మెరుగుపరచడంతో పాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో తన ముద్ర చూపించారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు.♦ రూ. 8,480 కోట్లతో 17 కొత్త కళాశాలల ఏర్పాటుద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లు. ♦ 2023లో విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం వైద్యకళాశాలల ప్రారంభం. ♦ కొత్త వైద్య కళాశాలలో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి. ♦ వచ్చే విద్యాసంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని వైద్యకళాశాలల ప్రారంభం. ♦ ఇక మిగిలిన ఏడు కళాశాలలు 2025–26లో ప్రారంభించడానికి అనుగుణంగా చర్యలు. 108 సేవలకు ఊపిరి.. ఇక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని దుస్థితి ఉండేది. ఈ పరిస్థితుల్లో మార్పునకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ 2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో.. ♦ ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చుచేశారు. ♦ గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్‌లను 2022 అక్టోబరులో అదనంగా కొన్నారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ♦ వీటిలో 2.5 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుకు మరో రూ.34.79 కోట్లు ఖర్చుచేసింది. ♦ మరోవైపు.. గత ప్రభుత్వంలో కేవలం 292 ‘104’ వాహనాలు ఉండగా ఇందులో పాతవాటిని తొలగించి మొత్తం 910 మొబైల్ క్లినిక్ యూనిట్లను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ కోసం గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు భారీగా ఖర్చు పెడుతున్నారు. ♦ ఇలా అంబులెన్స్‌ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు ఖర్చుచేశారు. వీటి నిర్వహణ కోసం ఏటా రూ.188 కోట్ల చొప్పున ఖర్చుచేస్తున్నారు. ♦ ఈ లెక్కన పరిశీలించినట్లయితే నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు రూపంలో రూ.750 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లయింది. -
బోధనాస్పత్రులపై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చివేసిన ప్రభుత్వం... రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రుల నిర్వహణపై కూడా దృష్టి పెట్టింది. కార్పొరేట్ హాస్పిటల్స్ తరహాలో ప్రభుత్వాస్పత్రుల్లోనూ నిర్వహణ బాధ్యతలను చూసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 11 పాత బోధనాస్పత్రులకు ప్రత్యేకంగా జాయింట్ డైరెక్టర్(జేడీ) స్థాయి అధికారులను వైద్యశాఖ నియమించనుంది. వీరికి సహాయకులుగా మరో 88 మందిని నియమిస్తుంది. ఈ మేరకు కొత్తగా 99 పోస్టులను ఇటీవల సృష్టించింది. ఎవరి బాధ్యతలు ఏమిటంటే... ♦ సాధారణంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యపరమైన (క్లినికల్) అంశాలను మెడికల్ సూపరింటెండెంట్ పర్యవేక్షిస్తారు. నాన్–క్లినికల్ (ఆస్పత్రి నిర్వహణకు సంబంధించిన అంశాలు) వ్యవహారాలపర్యవేక్షణకు సీఈవో/జీఎం ఆపరేషన్స్/అడ్మినిస్ట్రేటర్ హోదాలో మరొకరు ఉంటారు. ♦ ఇప్పటి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో క్లినికల్, నాన్ క్లినికల్ రెండింటి పర్యవేక్షణ బాధ్యత సూపరింటెండెంట్ చూస్తున్నారు. ♦ ఇకపై ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో మెడికల్ సూపరింటెండెంట్లను వైద్యపరమైన వ్యవహారాలకు పరిమితం చేస్తారు. ♦ పరిపాలన కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. జేడీ నేతృత్వంలో ముగ్గురు ఏడీలతోపాటు అసిస్టెంట్ ఇంజినీర్, ఫెసిలిటీ మేనేజర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్ వంటి సహాయక సిబ్బంది పనిచేస్తారు. వీరు ఆస్పత్రిలో భవనాల నిర్వహణ, సెక్యూరిటీ, శానిటేషన్, డైట్, ఉద్యోగుల హాజరు, జీతభత్యాలు, ఇతర నాన్ క్లినికల్ అంశాలను చూస్తారు. ♦ సూపరింటెండెంట్లకు ఇప్పటివరకు ఉన్న ఆస్పత్రి నిర్వహణ భారం తొలగిపోయి రోగుల సంరక్షణకు ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశం లభిస్తుంది. వైద్యుల హాజరు, ఐపీ, ఓపీ, సర్జరీ సేవలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు. ఎన్ఏబీహెచ్ గుర్తింపే లక్ష్యంగా... ప్రభుత్వాస్పత్రుల్లో ప్రమాణాలు పెంచి మంచి వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఈ క్రమంలో మన ఆస్పత్రులకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్, హెల్త్‌కేర్(ఎన్ఏబీహెచ్) గుర్తింపు పొందడమే లక్ష్యంగా వైద్యశాఖ అడుగులు వేస్తోంది. ఈ దశగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇప్పటికే విశాఖపట్నంలోని ఛాతీ, మెంటల్ కేర్ ఆస్పత్రులకు ఎన్ఏబీహెచ్ గుర్తింపు లభించింది. మరోవైపు రాష్ట్రంలోని అత్యధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్–క్వా‹Ù) గుర్తింపు పొందాయి. ఎన్–క్వాష్ గుర్తింపులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రులను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించడానికి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. -
స్వైన్ ‘ఫ్లో’: వేగంగా విస్తరిస్తున్న వైరస్.. పదేళ్లలో 8,064 మంది మృతి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్‌ఫ్లూపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2014 సంవత్సరం నుంచి ఈ ఏడాది జూలై వరకు అంటే దాదాపు పదేళ్లలో దేశవ్యాప్తంగా 1.47 లక్షల మందికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకింది. అందులో 8,064 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక వెల్లడించింది. ఆ వివరాలను తెలంగాణ వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 2015 సంవత్సరంలో అత్యధికంగా దేశంలో 42,592 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా, అందులో ఏకంగా 2,990 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకగా, అందులో 2,270 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక తెలిపింది. 2014లో మాత్రం 937 మందికి స్వైన్‌ఫ్లూ రాగా, 218 మంది చనిపోయారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దాని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడు నెలల్లోనే 2,783 కేసులు దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఈ ఏడు నెలల కాలంలో 2,783 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 52 మంది చనిపోయారు. గతేడాది దేశంలో 13,202 మందికి సోకగా, 410 మంది చనిపోయారు. ఇవిగాక కొందరు రోగులు నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంతో అవి రికార్డుల్లోకి ఎక్కడంలేదని అంటున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు స్వైన్‌ఫ్లూ భయం పెట్టి వేలకు వేలు గుంజుతున్నాయి. చివరకు అక్కడ తగ్గకపోవడంతో కొన్ని కేసులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూపై నిరంతర అవగాహన కల్పించడం, నియంత్రణ చర్యలు తీసుకోవడమే పరిష్కారమని నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల చెబుతున్నారు. జాగ్రత్తలే శ్రీరామరక్ష... గుంపులున్న చోట తిరగకుండా చూసుకోవాలి. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశముంటే రక్షణ కవచంగా గ్లౌవ్స్ తొడుక్కోవాలి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్‌ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బీపీ, స్థూలకాయం, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్‌ఫ్లూ త్వరగా సోకే అవకాశముంది. కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు... తీవ్రమైన జ్వరం వస్తుంది. దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు ఉంటాయి. జ్వరం ఒక్కోసారి అధికంగా ఉంటుంది. తలనొప్పి కూడా తీవ్రంగానే ఉంటుంది. పిల్లల్లో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ఎదురవుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. నడవడమూ కష్టంగానే ఉంటుంది. ఇక పెద్దల్లో అయితే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీనొప్పి, కడుపునొప్పి కూడా ఉంటుంది. నిరంతరాయంగా వాంతులు అవుతాయి. -
ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసింది. మానవ వనరుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తోంది. ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, తగినన్ని మందులు, ఇతర వనరులు సమకూర్చింది. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెరిగింది. దీంతో గతంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రెట్టింపవుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2019 అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని స్థాయిల్లో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించారు. దీంతో 2018–19లో 1,22,626 సేవలు మాత్రమే నమోదు కాగా 2022–23లో ఏకంగా 4,42,929కు చేరాయి. దీంతో అదే మేర ప్రభుత్వాస్పత్రులకు వచ్చే నిధులు పెరిగాయి. ఆరోగ్యశ్రీ కింద 2018–19లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రూ.200 కోట్ల విలువ చేసే వైద్య సేవలు అందించగా.. గత సంవత్సరం ఈ మొత్తం ఏకంగా రూ.350 కోట్లకు పెరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో ఆరోగ్యశ్రీ కింద అత్యధిక సేవలు అందిస్తూ విశాఖపట్నంలోని కేజీహెచ్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత విజయవాడ, కర్నూలు ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల వాటా పెంచడానికి ప్రత్యేక చర్యలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరతకు తావులేకుండా ఏకంగా 50 వేలకు పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఎప్పుడు ఖాళీ అయిన పోస్టులను అప్పుడే వెంటనే భర్తీ చేస్తోంది. దీనికి తోడు నాడు–నేడు కింద ఆస్పత్రులకు కొత్త భవనాలు సమకూర్చడంతో పాటు పాత భవనాలకు మరమ్మతులు చేపట్టింది. అత్యాధునిక వైద్య పరికరాలతో ఆపరేషన్ థియేటర్లను తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్యను వీలైనంత తగ్గించాలని వైద్య శాఖ నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను గణనీయంగా పెంచడం ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద నమోదవుతున్న వైద్య సేవల్లో 69 శాతం మేర ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో, 31 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల వాటాను మరింతగా పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సేవల పెంపునకు ప్రత్యేక చర్యలు.. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలను మరింత పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా వైద్యులు, సిబ్బంది వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు ఇన్సెంటివ్ నిధుల చెల్లింపునకు చర్యలు చేపట్టాం. – ఎం.ఎన్.హరేందిరప్రసాద్, సీఈవో, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గతంతో పోలిస్తే మెరుగుపడ్డ సేవలు.. బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు గతంతో పోలిస్తే మెరుగుపడ్డాయి. వీటిని మరింతగా పెంచడానికి ఆస్పత్రులకు విభాగాల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్తున్నాం. గతేడాది నిర్వహించిన కేసుల కంటే ప్రస్తుత ఏడాది 20 శాతం ఎక్కువ కేసులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – డాక్టర్ నరసింహం, డీఎంఈ ఆరోగ్యశ్రీ సేవలు వేల నుంచి లక్షల్లోకి.. ఇక వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు 2018–19తో పోలిస్తే వేల నుంచి ప్రస్తుతం లక్షల్లోకి పెరిగాయి. అప్పట్లో ఏడాదికి 16 వేలు మాత్రమే ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు ఉండేవి. వీటికి సంబంధించి నిధుల వాటా కేవలం రూ.34.94 కోట్లు మాత్రమే ఉండేది. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. 2022–23లో ఏకంగా రూ.151 కోట్ల విలువ చేసే వైద్యాన్ని 2.05 లక్షల కేసుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించారు. -
‘స్టెమీ’తో గుండె సేఫ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. గుండె జబ్బులు, కేన్సర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గుండె జబ్బులతో బాధపడే గ్రామీణులకు సత్వర వైద్య సేవలందించి, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమి)గా పిలిచే ఈ కార్యక్రమం ద్వారా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో 40 నిమిషాల్లోనే చికిత్స అందిస్తారు. తద్వారా బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడటానికి వీలుంటుంది. ఇప్పటికే తిరుపతి రుయా ఆస్పత్రిలో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా వైద్య, ఆరోగ్య శాఖ అమలులో పెట్టింది. రెండో దశ పైలెట్ ప్రాజెక్టును వచ్చే నెల 29 నుంచి కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం కేంద్రంగా ప్రాజెక్టును అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈలోగా పాత 11 బోధనాస్పత్రుల్లో కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ (సీటీవీఎస్) విభాగాలను బలోపేతం చేస్తారు. ఇందుకోసం కార్డియాలజీ, క్యాథ్లాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ ఆస్పత్రుల్లో రూ.120 కోట్లతో క్యాథ్లాబ్స్ను సమకూర్చింది. గుండె సంబంధిత వ్యాధులతోనే 32.4 శాతం మరణాలు రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా గుండె జబ్బుల బాధితులున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్ ఉంచుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులపై ఫోకస్ పెట్టారు. సత్వరమే నాణ్యమైన చికిత్సను అందించడం ద్వారా మరణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా స్టెమీ ప్రాజెక్టు చేపట్టారు. ప్రాణాపాయం నుంచి కాపాడతారిలా.. స్టెమీ అంటే గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే గుండెపోటు. దీనికి గురైన బాధితుడికి వీలైనంత త్వరగా ఆ పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్ ఇంజక్షన్)ను ఇవ్వగలిగితే ప్రాణాల ను కాపాడవచ్చు. నగరాలకు దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ చికిత్స అందుబాటులో ఉండదు. సరైన సమయంలో వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని రక్షించడానికి ప్రభుత్వం స్టెమీ పేరుతోనే కార్యక్రమాన్ని చేపట్టింది. వచ్చే నెలలో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్‌లలోని హబ్‌ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్డియాలజిస్టులు, క్యాథ్లాబ్ సౌకర్యం ఉన్న ఈ మూడు ఆస్పత్రులను హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నారు. వీటికి ఆ జిల్లాల పరిధిలోని 48 స్పోక్స్ (ఏపీవీవీపీ ఆస్పత్రులు)ను అనుసంధానం చేసి సామాన్యులు, గ్రామీణులకు హార్ట్ కేర్ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. ఛాతీనొప్పి, గుండెపోటు లక్షణాలతో స్పోక్స్‌కు వచ్చిన వారికి వెంటనే టెలీ–ఈసీజీ తీస్తారు. ఆ ఫలితం హబ్‌లో ఉన్న కార్డియాలజిస్ట్‌కు వెళుతుంది. గుండె రక్తనాళం ఎంతశాతం పూడిపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్ అవసరమా అనేది కార్డియాలజిస్ట్ నిర్ధారిస్తారు. వెంటనే స్పోక్ వైద్యుడికి తగిన సూచనలు చేస్తారు. అవసరమైతే రూ.40 వేలు విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ ఉచితంగా బాధితులకు ఇస్తారు. ఇదంతా 40 నిమిషాల్లోనే జరుగుతుంది. దీంతో రోగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. ఆ తర్వాత తదుపరి చికిత్స కోసం హబ్‌కు లేదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలిస్తారు. ప్రజలకు అవగాహన కల్పిస్తాం గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వోల ద్వారా గుండెపోటు లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. గుండెపోటుకు గురైన వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్‌కు తరలిస్తారు. బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స లభిస్తుంది. తద్వారా మరణాలు కట్టడి అవుతాయి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబసంక్షేమ కమిషనర్ మందులు, పరికరాలు సమకూరుస్తున్నాం మూడు జిల్లాల్లో స్పోక్స్ ఆస్పత్రులను గుర్తించాం. వాటిలో స్టెమీ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా అవసరమైన మందులు, వైద్య పరికరాలను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సమకూరుస్తున్నాం. వైద్యులు, సిబ్బందికి ప్రోటోకాల్స్‌పై శిక్షణ ఇచ్చాం. – డాక్టర్ వెంకటేశ్వర్, ఏపీవీవీపీ కమిషనర్ -
ఆ డాక్టర్లపై చర్యలు తీసుకోండి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తూ దీర్ఘకాలం విధులకు హాజరుకాని డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయడంతోపాటు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోందని చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ఇంత ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో వైద్యులు దీర్ఘకాలం సెలవులో ఉండడం, అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం వంటివి సమర్థనీయం కాదని, అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. నూరుశాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా ఆస్పత్రుల వారీగా, సిబ్బంది వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంపానల్ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై క్వాలిటీ చెక్ చేయాలని చెప్పారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కు సంబంధించి ఉద్యోగులు నెలనెలా చెల్లించే మొత్తానికి సమానంగా ప్రభుత్వ వాటా సొమ్మును కూడా ప్రతి నెల సకాలంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు జమయ్యేవిధంగా చూడాలని ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్‌ను సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ దీర్ఘకాలం విధులకు హాజరుకాని ప్రభుత్వ డాక్టర్లను గుర్తించి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, తదుపరి చర్యలకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, ఆరి్థకశాఖ కార్యదర్శి గుల్జార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి మంజుల, ఏపీవీవీపీ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, డీఎంఈ నర్సింహం, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
ఎల్లో మీడియా రాతలు ఊహాజనితం
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లుతున్న మందులే గతి అంటూ ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఖండించింది. ఈ కథనం పూర్తిగా ఊహాజనితమని ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ మురళీధర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణ చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే దురుద్దేశంతో కథనం రాశారని అన్నారు. నెల క్రితం ఒంగోలు జీజీహెచ్‌కు 2 నెలల కాల వ్యవధి ఉన్న మందులను పంపి, వాటిని తీసుకోవాలని సిబ్బందిపై ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తోసిపుచ్చారు.డబ్ల్యూహెచ్‌వో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలున్న మందులను మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్)లకు సరఫరా చేస్తున్నామన్నారు. 6 నెలల కాలవ్యవధి ఉన్న మందులను సంబంధిత కంపెనీలకు సమాచారమిచ్చి, వాటి స్థానంలో అంతే పరిమాణంలో కొత్త స్టాక్ పొందుతున్నట్టు తెలిపారు. ఏదైనా కంపెనీ కొత్త స్టాక్ ఇవ్వకపోతే వారికి చెల్లించే బిల్లుల నుంచి రికవరీ చేస్తామన్నారు. అంతేకాకుండా 3 నెలల కాల వ్యవధి ఉన్న మందులను ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు ఈ–ఔషధి పోర్టల్ అనుమతించదని స్పష్టం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 207 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 5 శాతం కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 483 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 0.85 శాతం మందులు మాత్రమే కాలం చెల్లినవి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ పేదలకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
మందుల పైనా మాయదారి రాతలు
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు అంటే నరకానికి నకళ్లు. మంచాలు, బెడ్లు, దుప్పట్లు, వైద్యులు, ఇతర సిబ్బంది ఉండే వారు కాదు. కంపు కొట్టే వార్డులు, అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా ఆస్పత్రులు ఉండేవి. చిన్నపాటి మందు బిళ్లలకు కూడా కొరతే. అన్ని మందులూ బయట కొనుక్కోవాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్పత్రుల రూపురేఖలే మార్చేశారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అధునాతన వైద్య సౌకర్యాలతో తీర్చిదిద్దారు. నిరంతర వైద్య సేవలందేలా వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించారు. మందులకు కొరతే లేదు. ఏ మందు కావాలన్నా ప్రభుత్వాస్పత్రుల్లో దొరుకుతుంది. మొత్తంగా వైద్య రంగం ముఖచిత్రాన్నే మార్చిన సీఎం వైఎస్ జగన్. అందుకే ఇప్పుడు ప్రజలంతా నిర్భయంగా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందుతున్నారు. సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో అధ్వానంగా ఉన్న ఆస్పత్రులు ఈనాడు అధిపతి రామోజీరావుకు కనిపించలేదు. ఎందుకంటే.. ఆయనకు అప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు అద్భుతంగా కనిపించాయి. మరి ఇప్పుడు.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు నిరంతర వైద్యసేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులపై అబద్ధాలు ఆచ్చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత అంటూ అసత్య కథనాన్ని ప్రచురించారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓ సారి పరిశీలిస్తే... కొరతకు తావివ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వాస్పత్రుల్లో మందులకు తావు లేకుండా చర్యలు చేపట్టింది. జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన నాణ్యమైన మందులను ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో 608 రకాల మందులకుగాను 229 రకాలే సరఫరా చేసేవారు. సర్జికల్ కన్జ్యూమబుల్స్ 357 రకాలకు గాను 232 మాత్రమే అందుబాటులో ఉండేవి. రీఎజెంట్స్ అసలు సరఫరా చేసేవారే కాదు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అరకొరగా సరఫరా చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో 608 రకాల మందులకు గాను 566 రకాలు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సరఫరా చేస్తున్నారు. మిగిలిన 42 మందులు డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల ద్వారా నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. సర్జికల్ కన్జ్యూమబుల్స్ 377 కు గాను 326, రీఎజెంట్స్ 449 కు గాను 172 అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ వినియోగం ఉన్న మందులు, రీఎజెంట్స్, సర్జికల్ కన్జ్యూమబుల్స్ను డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందిస్తున్నారు. ఎమ్మార్పీపై 35.60 శాతం డిస్కౌంట్‌తో సరఫరా చేస్తున్నారు. రీఎజెంట్స్ను రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో తొలిసారి ఈ ప్రభుత్వంలోనే సెంట్రల్ టెండర్ విధానం ద్వారా సరఫరా చేస్తున్నారు. 2023–24 ఆర్ధిక సంవత్సరంలో తొలి రెండు క్వార్టర్స్‌కు డి–సెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద బోధన, జిల్లా ఆస్పత్రులకు రూ.14.59 కోట్లు కేటాయించారు. ఇందులో రూ. 3.44 కోట్లు వినియోగించారు. భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు లేకుండా ఏపీఎంస్ఐడీసీ మందులు, సర్జికల్స్ నిల్వలను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో ఉంచుతోంది. ప్రస్తుతం 13 డ్రగ్ స్టోర్స్‌లలో వచ్చే మూడు నెలలకు సరిపడా రూ.117.10 కోట్ల విలువైన మందులు, సర్జికల్స్ నిల్వ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో మందుల కొరత అంటూ రామోజీరావు కథనాలు ప్రచురించడం ప్రభుత్వ వైద్య రంగం పట్ల ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించాలనే కుట్రకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో కేవలం 229 రకాల మందులు అందుబాటులో ఉండి, ఇతర వనరుల కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో ప్రభుత్వాస్పత్రులకు జనాలు పోటెత్తుతున్నారని ఇదే ఈనాడులో ప్రచురించారు. గతంతో పోలిస్తే గణనీయంగా మందులు, సర్జికల్స్, మానవ వనరులు పెరిగిన సందర్భంలో నేడు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని రాతలు రాయడం దిగజారుడుతనానికి నిదర్శనమని వైద్య రంగ నిపుణులు వాపోతున్నారు. బడ్జెట్ గణనీయంగా పెరుగుదల టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో మందులు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ బడ్జెట్ గణనీయంగా పెరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ పుష్కలంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వంలో 2015–18 మధ్య మందుల కోసం రూ. 1080 కోట్లు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ కోసం రూ.235.94 కోట్లు చొప్పున రూ.1,315.94 కోట్లు ఖర్చు చేశారు. అదే 2019 నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మందుల కోసం రూ.2,229.99 కోట్లు, సర్జికల్ కన్జ్యూమబుల్స్ కోసం రూ. 458.33 కోట్లు వెచ్చించింది. ఇలా 2019–23 మధ్య రూ.2,688.32 కోట్లు ఖర్చు చేశారు. అంటే గత ప్రభుత్వం కన్నా రూ.1372.38 కోట్లు అదనంగా వైఎస్ జగన్ ప్రభుత్వం వెచ్చించింది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టి వెళ్లిన రూ. 150 కోట్లను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి సీఎం జగన్ సంస్కరణలు చేపట్టారు. ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో రూ. 8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 5 వైద్య కళాశాలలు ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల్లో వసతుల కల్పనతో పాటు పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులను కూడా బలోపేతం చేశారు. గ్రామాల్లో ప్రతి 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. వీటిలోనే 105 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. వైద్య శాఖలో ఒక్క పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ఇప్పటి వరకు 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. -
లెవల్–1 క్యాన్సర్ సెంటర్‌గా గుంటూరు
సాక్షి, అమరావతి : ప్రభుత్వరంగ ఆస్పత్రుల్లోనే క్యాన్సర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముమ్మరం చేసింది. వ్యాధి నియంత్రణ, నివారణకు సీఎం వైఎస్ జగన్ ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ వైద్యం కోసం బాధితులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పనిలేకుండా అన్ని ప్రాంతాల్లో 50 కి.మీ పరిధిలోనే వైద్య సదుపాయాలను కల్పించేలా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ రోడ్ మ్యాప్‌ను రాష్ట్ర వైద్యశాఖ రూపొందించింది. తొలిదశ కింద.. గుంటూరు జీజీహెచ్‌లోని క్యాన్సర్ విభాగాన్ని లెవల్–1 సెంటర్‌గా, కర్నూలు, విశాఖపట్నంలో లెవల్–2 క్యాన్సర్ సెంటర్లను అభివృద్ధి చేయనుంది. రెండో దశలో కాకినాడ, అనంతపురం జీజీహెచ్‌లలోని విభాగాలను లెవెల్–2 క్యాన్సర్ సెంటర్లుగా అభివృద్ధిచేస్తుంది. ఇందుకుగాను రూ.119.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అధునాతన పరికరాల ఏర్పాటు గుంటూరు, కర్నూలు, విశాఖ క్యాన్సర్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వైద్య పరికరాలను సమకూరుస్తోంది. నాట్కో సహకారంతో గుంటూరు జీజీహెచ్‌లో క్యాన్సర్ సెంటర్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది. క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ థెరపీ అందించడానికి ఆధునిక వైద్య పరికరాల్లో ఒకటైన లీనియర్ యాక్సిలేటర్ (లినాక్) ఇక్కడ అందుబాటులో ఉంది. దీనిని లెవెల్–1 సెంటర్‌గా అభివృద్ధి చేపట్టడానికి వీలుగా పెట్ స్కాన్ మిషన్‌ను సర్కార్ సమకూరుస్తోంది. మరోవైపు.. రూ.120 కోట్లతో కర్నూలులో కొత్తగా ఏర్పాటుచేస్తున్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ భవన నిర్మాణ పనులు వచ్చేనెలలో పూర్తవుతాయి. విశాఖపట్నంలో ఇప్పటికే భవనం అందుబాటులో ఉంది. ఈ రెండు చోట్లకు లినాక్, హెచ్డీఆర్ బ్రాకీ, సీటీ సిమ్యులేటర్ పరికరాల కొనుగోలుకు అధికారులు పర్చేజింగ్ ఆర్డర్లు(పీఓ) ఇచ్చారు. అదే విధంగా.. సర్జికల్, మెడికల్, రేడియేషన్ అంకాలజీ పరికరాల కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా పరికరాలను సమకూర్చే ప్రక్రియ పూర్తిస్థాయిలో పూర్తవుతుంది. అనంతపురం, కాకినాడల్లో లినాక్, సీటీ సిమ్యులేటర్ పరికరాల ఏర్పాటుకు బంకర్ల నిర్మాణం, ఇతర పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా అండగా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. దీనికితోడు.. టీడీపీ సర్కార్ హయాంలో ప్రభుత్వాస్పత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా.. క్యాన్సర్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులపైనే మెజారిటీ శాతం ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్స సదుపాయాల కల్పన, ఆయా ఆస్పత్రుల బలోపేతం, వ్యాధి నియంత్రణ చర్యలపై దృష్టిసారించారు. అలాగే, క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. గత ఏడాది క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం పథకం కింద ఏటా రూ.600 కోట్లు ఖర్చుచేశారు. ప్రణాళికాబద్ధంగా క్యాన్సర్‌కు కళ్లెం క్యాన్సర్‌కు వైద్యం, వ్యాధి నియంత్రణ చర్యల విషయంలో ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ రంగంలోనే ఇందుకు మెరుగైన వైద్యం అందాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు చర్యలు ప్రారంభించాం. ఈ ఏడాది ఆఖరుకు లెవల్–1 సెంటర్‌గా గుంటూరు.. లెవల్–2 కేంద్రాలుగా కర్నూలు, విశాఖపట్నం క్యాన్సర్ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం. మరోవైపు.. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏపీ చాప్టర్‌ను ప్రారంభించాం. దీని పరిధిలోకి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రులను తీసుకొచ్చి చికిత్స విషయంలో నిర్దేశిత ప్రొటోకాల్స్‌ను పాటించేలా చూస్తున్నాం. క్యాన్సర్ రిజిస్ట్రీని కూడా ప్రారంభించాం. – ఎం.టి. కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ -
ఖాళీలు కనపడొద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులు ఒక్కటి కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభంకానున్న ఐదు కొత్త వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్షించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని సీఎం పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, వైద్య శాఖలో పోస్టుల భర్తీ, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఇతర కార్యక్రమాల అమలు పురోగతిపై సమీక్షించిన సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఐఏఎస్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు భర్తీ.. ప్రభుత్వాస్పత్రులను వేధించే ప్రధాన సమస్య మానవ వనరుల కొరత. దీనికి చెక్ పెట్టేలా ఇప్పటికే 48 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టాం. ఈ నియామకాల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుండాలి. ఎప్పటికప్పుడు ఖాళీ అయిన పోస్టులను గుర్తించి భర్తీ చేయాలి. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ వ్యవస్థ సమర్థంగా పనిచేయాలి. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. ఏదైనా పోస్టు ఖాళీ అయితే నాలుగు వారాల్లో భర్తీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య పరిస్థితులపై ట్రాకింగ్ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలి. అప్పుడే ప్రివెంటివ్ కేర్‌లో ఆశించిన లక్ష్యాలను సాధించగలం. కార్యక్రమం అమలులో పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల పాత్ర ఎంతో కీలకం. మధుమేహం, రక్తపోటు, ఇతర నాన్ కమ్యూనికబుల్, కమ్యూనికబుల్ జబ్బుల బాధితులకు మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్ వద్ద వీరికి చికిత్స అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. విలేజ్ క్లినిక్‌ల స్థాయిలో కంటి పరీక్షలు చేపట్టాలి. క్రమం తప్పకుండా ఈ ప్రక్రియ కొనసాగాలి. టీబీ నిర్ధారణ పరీక్షలు అందరికీ చేయడం ద్వారా బాధితులను గుర్తించాలి. వారికి మంచి చికిత్స అందించే దిశగా అడుగులు వేయాలి. క్యూ ఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హత పొందిన కుటుంబాల్లో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ క్యూ ఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ కార్డులు అందజేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చర్యలు చేపట్టాలి. సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రతి చోటా ఫోన్ నంబర్లు ప్రదర్శించాలి. వాటిని సకాలంలో పరిష్కరించాలి. 1.39 కోట్ల మందికి ఫ్యామిలీ డాక్టర్ సేవలు గతేడాది అక్టోబర్ 22 నుంచి ఇప్పటివరకు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 1,39,97,189 మందికి సేవలందించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 35,79,569 మంది రక్తపోటు, 24,31,934 మంది మధుమేహం బాధితులని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (సీహెచ్‌వో) శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఫస్ట్ ఎయిడ్, పాముకాటు, ఐవీ ఇన్ఫ్యూజన్, ఇంజక్షన్, డ్రస్సింగ్, బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ లాంటి అంశాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. సికిల్‌సెల్ అనీమియా నివారణలో భాగంగా ఈ ఏడాది 6.68 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈ నెలలోనే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దంత వైద్యులు ప్రతినెలా పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు. టీబీ నివారణపైనా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామన్నారు. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మరో 3 మెడికల్ కాలేజీలు.. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నందా్యలలో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మరో 3 కొత్త వైద్య కళాశాలలు పాడేరు, పులివెందుల, ఆదోనిలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిగిలిన కళాశాలల్లో పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ జవహర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీవీవీపీ కమిషనర్ వెంకటేశ్వర్, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, ఔషధ నియంత్రణ విభాగం డీజీ రఘురామరెడ్డి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ రామిరెడ్డి, డీఎంఈ నరసింహం పాల్గొన్నారు. -
ప్రభుత్వ ప్రతిష్టకు ఆస్పత్రులు వన్నెతేవాలి
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యరంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తానికి అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు బాగుండాలని సీఎం జగన్ ఆశిస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఆమె మంగళవారం మంగళగిరిలోని వైద్యశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే రోగికి తాను పొందబోయే సౌకర్యాల గురించిన నాలుగైదు ప్రాధాన్యాంశాల పోస్టర్లను ప్రతి ఆస్పత్రిలో ప్రదర్శించాలని సూచించారు. రోగి ఆస్పత్రిలో వైద్యం పొందాక డిశ్చార్జి అయినప్పుడు సంతోషంతో ఇంటికి వెళ్లాలని, సేవల పట్ల సంతృప్తి వ్యక్తపరచాలని చెప్పారు. ముఖ్యంగా పారిశుధ్యం విషయంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుధ్యం, పరిపాలన, ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు బలవర్థకమైన ఆహారం పంపిణీ ఇవన్నీ సరిగా అమలవుతున్నదీ లేనిదీ అధికారులు తరచూ చూడాలని చెప్పారు. తనిఖీల్లో అవకతవకలు వెలుగు చూస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ వార్డుల్లో పింక్ కలర్ కర్టెన్లు ఏర్పాటు చేసి, పాలిచ్చే తల్లులకు తగినంత మరుగు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహిళా వార్డుల వద్ద క్లోజ్డ్ డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రుల పనితీరుపై కేటాయించే మార్కుల విషయంలో పారదర్శకత ఉండాలని, పనితీరు అన్నివిధాలా బాగున్నప్పుడే మార్కులు ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ నిధులతో, సీఎస్ఆర్ సహకారాన్ని తీసుకుని, 16 బోధనాస్పత్రుల్లో ఇన్సినిరేటర్స్ ఏర్పాటు చేసి, వ్యర్థాల ప్రక్షాళన చేపట్టాలని సూచించారు. రోగులకు బలవర్ధక ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో గతంలో రూ.40గా ఉన్న డైట్చార్జీలను రూ.80కి పెంచిన నేపథ్యంలో మెనూలో మార్పు రావాలన్నారు. గిరిజన ప్రాంతాలు, ఒడిశాకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు విశాఖ, విజయనగరం ఆస్పత్రుల్లో మహాప్రస్థానం వాహనాలను పెంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీటీ, ఎమ్మారై యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించాలన్నారు. ఈవెనింగ్ క్లినిక్‌లను బోధనాస్పత్రుల్లో పక్కాగా అమలు చేయాలని చెప్పారు. ఉదయం ఓపీలకు హాజరైన రోగుల వైద్యపరీక్షల ఫలితాల పరిశీలన, ఇతర సేవలను ఈవెనింగ్ క్లినిక్‌లలో అందించాలని ఆమె సూచించారు. డీఎంఈ డాక్టర్ నరసింహం పాల్గొన్నారు. -
‘Andhra Pradesh: ఉన్నత’ వైద్యం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో 48 వేలకుపైగా వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో గ్రామాల్లోనే వైద్య సేవలందిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరత అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు వివరాలను సేకరించడంపై దృష్టి సారించింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా ఒక్కో ఆస్పత్రిని యూనిట్‌గా తీసుకుని క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో మానవ వనరులపై ఆడిట్ చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల పురోగతి, కరోనా తాజా పరిస్థితులను పరిశీలించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వైద్య, ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిబ్బందిపై ప్రతి సమీక్షలోనూ వివరాలివ్వాలి.. ప్రభుత్వాస్పత్రులను నాడు – నేడు ద్వారా తీర్చిదిద్దడం ద్వారా ప్రజల్లో భరోసా ఏర్పడింది. రోగుల తాకిడికి సరిపడా నియామకాలను చేపడితే సగం సమస్యలకు తెర పడుతుంది. మానవ వనరులపై ఆడిట్ నిర్వహించిన అనంతరం గుర్తించిన ఖాళీలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వెంటనే భర్తీ చేయాలి. అవసరం మేరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ ఎప్పటికప్పుడు మందులు సరిపడా స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టాలి. సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అనే అంశాలపై ప్రతి సమీక్షలోనూ నాకు వివరాలు అందచేయాలి. పకడ్బందీగా ‘ఫ్యామిలీ డాక్టర్’ సేవలు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ (ఎఫ్పీసీ) అత్యంత పకడ్బందీగా అమలు కావాలి. నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) మేరకు వైద్యులు గ్రామానికి వెళ్లి సేవలు అందించాలి. జీవనశైలి జబ్బుల బాధితులను గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్ ఫలానా గ్రామానికి ఫలానా రోజు వస్తారనే వివరాలను ముందుగానే వెల్లడించాలి. ఆయా తేదీల్లో గ్రామానికి డాక్టర్ వస్తున్నట్లు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రజలందరికీ తెలియచేయాలి. దీనివల్ల డాక్టర్ వద్దకు వచ్చి వైద్య సేవలు పొందగలుగుతారు. ఎఫ్పీసీని మెరుగ్గా ముందుకు తీసుకెళ్లేలా జిల్లాల్లో సమర్థులైన అధికారుల సేవలను వినియోగించుకోవాలి. రక్తహీనత నివారణ.. నేత్ర పరీక్షలు గర్భిణులు, చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా రక్తహీనత సమస్యను ఎదుర్కోవాలి. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలి. రక్త హీనతతో బాధపడే గర్భిణులను గుర్తించి తప్పనిసరిగా పౌష్టికాహారం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు కూడా నిర్వహించాలి. ఈమేరకు కంటి డాక్టర్లకు షెడ్యూల్ రూపొందించి నెల, రెండు నెలలకు ఒకసారి నేత్ర పరీక్షలు చేయాలి. దృష్టి సంబంధిత సమస్యలున్న వారికి కంటి అద్దాలు ఇవ్వాలి. ఎమర్జెన్సీ సీపీఆర్‌పై శిక్షణ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను (సీహెచ్‌వో) విధి నిర్వహణలో సుశిక్షితులుగా తయారు చేయాలి. ఇందుకోసం ప్రత్యేక కరిక్యులమ్‌ను సిద్ధం చేయాలి. సీహెచ్‌వోలకు సరఫరా చేసే వైద్య పరికరాల వినియోగంపై బోధనాసుపత్రుల్లో శిక్షణ ఇవ్వాలి. వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో సమీక్షించాలి. దంత సంరక్షణ, ఈఎన్టీ, వృద్ధాప్య సమస్యలతోపాటు సీపీఆర్ లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా వైద్య సేవలు అందించాలో శిక్షణ ఇప్పించాలి. వీటితోపాటు గ్రామాల్లో పాము కాట్లకు సంబంధించి వెంటనే చికిత్స అందించేలా శిక్షణ ఉండాలి. 5 కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఏడాదే రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపై సీఎం జగన్ తాజాగా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఏకంగా మరో 2,100 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వివరించారు. 2023–24 విద్యాసంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలోని కొత్త మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 2024–25లో మరో 350 మెడికల్ సీట్లు అదనంగా రాబట్టేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, మదనపల్లె, పెనుకొండ, పాలకొల్లు, మార్కాపురం, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో తరగతులు మొదలయ్యేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తద్వారా మరో 1,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 23 రోజుల్లో 20.25 లక్షల మందికి వైద్య సేవలు ఏప్రిల్ 6వతేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానం పూర్తి స్థాయిలో ప్రారంభం కాగా గత నెల 28 నాటికి గ్రామాల్లో 20,25,903 మందికి వైద్య సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. రక్తపోటుతో 4.86 లక్షల మంది, మధుమేహంతో 2.70 లక్షల మంది బాధ పడుతుండగా 4.43 లక్షల మంది ఈ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైద్యం, మందులు అందజేస్తున్నామన్నారు. నోటి క్యాన్సర్ బాధితులు 4,649 మంది, ఛాతీ క్యాన్సర్ బాధితులు 1,761 మంది, గర్భాశయ క్యాన్సర్ బాధితులు 7,042 మంది గ్రామాల్లోనే వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు. పూర్తిగా అదుపులో కోవిడ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, గత వారం రోజుల్లో నమోదైన పాజిటివ్ కేసులను బట్టి దేశంలో 23వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. 24 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా ఫీవర్ సర్వేను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 20 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. 14 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు పని చేస్తున్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టుల్లో టెస్టులు చేస్తున్నామని, మందులు, మాస్క్‌లు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిర ప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, నాడు–నేడు టెక్నికల్ డైరెక్టర్ మనోహరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో మెరుగైన వైద్య సేవలు
-
హరీష్ రావును అభినందిస్తూ ట్వీట్ చేసిన కేటీఆర్.. ఎందుకంటే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సాక్షిలో ‘సర్కార్ సర్జరీ.. సూపర్’ అనే శీర్షికతో ప్రచురితమైన వార్త క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేశారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖాన సూపర్ అనే స్థాయికి రావడం గర్వకారణమని కొనియాడారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద1539 కిడ్నీ, 51 కాలేయ మార్పిడి సర్జరీలు జరిగినట్లు తెలిపారు. హార్ట్ ట్రాన్స్‌ప్లంట్ జరగడం.. స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లంట్ సెంటర్ ఏర్పాటు అదే విధంగా బేరియాట్రిక్ సర్జరీలు కూడా చేయడం అభనందనీయమన్నారు. ఇందుకు కృషి చేస్తున్న మంత్రి హరీష్‌రావు, వైద్య బృందానికి అభినందనలు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖాన సూపర్ అనే స్థాయికి రావడం గర్వకారణం 👏 1539 కిడ్నీ, 51 లివర్, హార్ట్ Transplants జరగడం, State Organ Transplant Centre ఏర్పాటు అదే విధంగా Bariatric surgeries కూడా చెయ్యడం… https://t.co/NBDNQAmVJI pic.twitter.com/S9MClqz6X9 — KTR (@KTRBRS) March 12, 2023 -
సర్కార్ సర్జరీ సూపర్.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యం
సాక్షి హైదరాబాద్ : భాగ్యనగరంలోని ప్రభుత్వాస్పత్రులు ఆధునిక చికిత్సలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా’కు అనే స్థాయి నుంచి ‘పోదాం పద సర్కారు దవాఖానాకు’ అనే దశకు చేరుకున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా క్లిష్టమైన ఆపరేషన్లను సైతం చేస్తూ రోగులకు పునర్జన్మనిస్తున్నాయి. నిష్ణాతులైన వైద్య బృందాలతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో కొంతకాలంగా అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయి. ఉస్మానియా, గాందీల్లో పూర్తి ఉచితంగా నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా తక్కువ మొత్తంలో ఆపరే షన్లు చేస్తున్నారు. కుటుంబసభ్యుల అవయవదానం, జీవన్‌దాన్ ద్వారా రోగులకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. వాటిల్లో కొన్నింటిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 8 నెలల చిన్నారికి అరుదైన వైద్యం జగిత్యాల జిల్లాకు చెందిన నారాయణ, ప్రేమలత దంపతులది మేనరిక వివాహం. వారి 8 నెలల పాప నిస్ సిండ్రోమ్ అనే అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో నిలోఫర్‌కు వెళ్లగా అక్కడి వైద్యులు ఉస్మానియాకు వెళ్లమన్నారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి పాపకు పునర్జన్మను ప్రసాదించారు. ఇలాంటి వ్యాధి ప్రపంచంలోనే నాలుగోది కాగా, భారత్‌లో మొదటిదని వైద్యులు తెలిపారు. లక్షలు ఖరీదుచేసే ఆపరేషన్‌ను రూపాయి కూడా తీసుకోకుండా 28 మంది వైద్యులు దాదాపు 18 గంటలపాటు సర్జరీ పూర్తి చేసి తమ పాపకు మళ్లీ జీవం పోశారని ఆ చిన్నారి తల్లి పేర్కొంది. 2 నెలల్లో 70 కిలోలు తగ్గింపు గుడిమల్కాపూర్‌కు చెందిన శివరాజ్‌సింగ్ కుమారుడు మునీందర్‌సింగ్ ఐదేళ్ల ప్రాయం నుంచి అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నాడు. 23 ఏళ్లకు దాదాపు 220 కిలోలతో నడవలేని స్థితికి చేరాడు. కుటుంబసభ్యులు అతడిని ఉస్మానియాలో చేర్పించారు. చిన్నతనం నుంచే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తోపాటు శ్వాస సమస్యలు ఉన్నాయి. ఉస్మానియా వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు. 2 నెలల్లోనే దాదాపు 70 కిలోల బరువు తగ్గాడు. ‘నన్ను చూసి చాలా మంది హేళన చేసేవారు. ఉచితంగా సర్జరీ చేసిన ఉస్మానియా వైద్యులకు కృతజ్ఞతలు’అని మునీందర్‌సింగ్ సంతోషంగా చెప్పాడు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో.. బోరబండకు చెందిన మల్లెల వాణి కాలేయంలో కుడివైపు పెద్ద కణితితో బాధపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే దాదాపు రూ.15 లక్షలు ఖర్చవుతాయనడంతో ఆమె ఉస్మానియాకు వెళ్లింది. సాధారణంగా ఎడమ వైపు కణితి ఏర్పడే అవకాశం ఉండగా వాణికి కుడివైపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. లాపరోస్కోపీ ద్వారా శస్త్రచికిత్సను పూర్తి చేయడంతో రోగి వారంలోనే కోలుకుంది. ఓ ప్రభుత్వాస్పత్రిలో ఇలాంటి సర్జరీ చేయడం దేశంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. రోజువారీ పని చేసుకుంటూ జీవిస్తున్న తనకు ఆపరేషన్ ఉచితంగా చేయడం పూర్వజన్మ సుకృతమని వాణి పేర్కొంది. ఆరోగ్యశ్రీతో గుండె మార్పిడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నర్సింహులు కుమారుడు వరుణ్‌తేజ్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు ఆ స్కూల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వరుణ్‌తేజ్ గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు వస్తే ఆపరేషన్ చేస్తామనడంతో కుటుంబసభ్యులు వరుణ్‌ను తీసుకెళ్లారు. ఒక్కరోజుకే అక్కడ రూ.10 వేలు ఖర్చవడంతో బంధువుల సలహా మేరకు వారు నిమ్స్‌ను ఆశ్రయించారు. కార్డియో థొరాసిక్ విభాగం వైద్యులు వరుణ్‌తేజ్‌కు ఆరోగ్యశ్రీ కింద గత నెల 28న గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆరోగ్యం కుదుటపడటంతో రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేశామని నిమ్స్ సీటీ సర్జన్ విభాగం అధిపతి డాక్టర్ అమరే‹శ్ మాలెంపాటి తెలిపారు. ఒకే నెలలో 15 కిడ్నీల మార్పిడి దేశంలోనే తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను చేసి నిమ్స్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా యురాలజీ, నెఫ్రాలజీ, అనస్తీషియా విభాగాలను మంత్రి హరీశ్‌రావు ఇటీవలే అభినందించారు. 2014 నుంచి ఇప్పటివరకు కిడ్నీ మార్పిళ్లు 839 (నిమ్స్), 700 (ఉస్మానియా) కాలేయ మార్పిళ్లు 25 (నిమ్స్), 26 (ఉస్మానియా) జరిగాయి. నిమ్స్‌లో గుండె (10), ఊపిరితిత్తుల మార్పిడి (01) శస్త్రచికిత్సలు జరిగాయి. దక్షిణాదిలోకెల్లా రికార్డు.. స్కోలియోసిస్ (గూని)తో ఇబ్బంది పడేవారికి చేసే వెన్నుపూస సర్జరీ చాలా క్లిష్టమైనది. సుమారు 12–14 గంటలు పడుతుంది. ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ రోగి రెండు కాళ్లు చచ్చుబడే ప్రమాదముంటుంది. నిమ్స్‌లో మూడేళ్లుగా 200 మందికి ఈ సర్జరీలు చేశారు. గత ఏడాదిలో ఏకంగా 80 సర్జరీలు నిర్వహించి దక్షిణాదిలో రికార్డు సొంతం చేసుకుందని ఆర్థోపెడిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ నాగేష్ తెలిపారు. నిజాం కాలంలో బొక్కల దవాఖానా (ఆర్థోపెడిక్)గా ప్రారంభమైన నిమ్స్ నేడు వేర్వేరు సర్జరీలకు వేదికైందన్నారు. ఏడాదికి హిప్, నీ రీ ప్లేస్మెంట్లు 350, వెన్నెముక 80, ట్రామా 3వేలు, ఆంకాలజీ 60 చొప్పున సర్జరీలు నిర్వహిస్తూ తనదైన ప్రత్యేకతను సంతరించుకుంటోందని నాగేశ్ తెలిపారు. 18 గంటలపాటు శ్రమించి.. కర్నూలు జిల్లా అవుకుకు చెందిన ఎక్కలూరు సత్యమయ్య (61) పోస్టల్ శాఖలో రికరింగ్ డిపాజిట్ ఏజెంట్. ఏడాది క్రితం కాళ్లు, చేతులు వాచిపోవడంతో కుటుంబసభ్యులు కర్నూలులోని ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. సత్యమయ్యకు హెపటైటీస్ బి, లివర్ సిర్రోసిస్, కాలేయ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించి కాలేయ మార్పిడి చేయాలన్నారు. వెస్ట్ మారేడుపల్లికి చెందిన అభిజిత్ (20) అనే యువకుడు బ్రెయిన్‌డెడ్ అవడంతో అవయవదానానికి అతడి కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో నిమ్స్, ఉస్మానియా వైద్యులు సంయుక్తంగా 18 గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం సత్యమయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. గాందీలో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ గాందీలో రూ.35 కోట్లతో స్టేట్‌ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ నిర్మాణపనులు కొనసాగుతున్నాయి. 4 ఆత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, స్టెప్‌డౌన్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు లు ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. ఒకేచోట గుండె, మూత్రపిండాలు, తుంటి, కీళ్ల మార్పిడి, ఊపిరితిత్తులు, కాలేయం శస్త్రచికిత్సలు, కాక్లియర్ వంటి కృత్రిమ అవయవాల ఏర్పాటుతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. రెండోదశలో రొబోటిక్ ఆపరేషన్ థియేటర్, ఇతర అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తాం. –ప్రొ.రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
డాక్టర్లు, సిబ్బంది ఖాతాలకే ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవల్లో నాణ్యతను మరింతగా పెంపొందించడంపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్) సొమ్మును నేరుగా వైద్యులు, వైద్య సిబ్బంది బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావులేకుండా పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, అన్ని ప్రభుత్వాస్పత్రులను నెట్వర్క్ ఆస్పత్రులుగా నోటిఫై చేయడం వంటి ప్రభుత్వ చర్యలతో ఆరోగ్యశ్రీ సేవలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు భారీగా పెరిగాయి. మొత్తం క్లెయిమ్‌లలో 30 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. వీటిని ఇంకా పెంచడం ద్వారా ప్రభుత్వాస్పత్రులకు ఎక్కువ నిధులు రాబట్టి, ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే ప్రోత్సాహకాల జమలోనూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ కింద ఒక ఆపరేషన్ చేస్తే.. దానికి వచ్చే క్లెయిమ్ మొత్తంలో 25 శాతం ప్రోత్సాహకం కింద హెల్త్ కేర్ స్టాఫ్‌కు వస్తుంది. ఈ మొత్తాన్ని నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి కేటాయిస్తారు. ఇప్పటివరకూ ఈ సొమ్మును ఆస్పత్రుల సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఉండే ఖాతాల్లో జమ చేస్తున్నారు. అనంతరం వాటిని వైద్యులు, సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. ఈ విధానంలో కాలయాపన జరుగుతోంది. దీంతో నేరుగా, వైత్యులు, సిబ్బంది ఖాతాల్లోనే ఈ సొమ్ము జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏపీవీవీపీ, డీఎంఈ ఆస్పత్రుల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది బ్యాంక్ ఖాతాల వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల నుంచి డీఎంఈలో ప్రారంభం ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలు నేరుగా సిబ్బంది ఖాతాల్లో జమ చేసే విధానాన్ని ఈ నెల నుంచి డీఎంఈ ఆస్పత్రుల్లో ప్రారంభిస్తున్నాం. అనంతరం ఏపీవీవీపీ ఆస్పత్రులకూ విస్తరిస్తాం. జనవరి వరకు పాత విధానంలో చెల్లింపులు ఉంటాయి. ఏ నెలకు ఆ నెల ప్రోత్సాహకాలు నేరుగా వ్యక్తిగత ఖాతాల్లో ట్రస్టు నుంచి జమ అవుతాయి. ఈ విధానంతో వైద్యులు, సిబ్బందిలో నూతనోత్తేజం వస్తుందని భావిస్తున్నాం. తద్వారా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. – డాక్టర్ వినోద్‌కుమార్, డీఎంఈ -
అమ్మ పాలకూ బ్యాంక్
అమ్మ పాలు అమృతం కంటే విలువైనవి. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు అద్భుతమైన ఔషధంలా పని చేస్తాయి. మరో విషయం ఏమంటే.. బిడ్డకు పాలివ్వడం తల్లి ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు కలుగుతుంది. తల్లి పాల నుంచి బిడ్డకు విటమిన్లు, ప్రొటీన్లు లభించడమే కాకుండా.. తల్లి స్పర్శ, వాత్సల్యపూరిత ఆలింగనం వల్ల బిడ్డ మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో భరోసా కలుగుతుంది. అంత గొప్ప విశిష్టత కలిగిన తల్లి పాలకు కొందరు బిడ్డలు దూరం కావాల్సి వస్తోంది. తల్లి పాలు దొరక్క నవజాత శిశువులు అక్కడక్కడ మరణిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు కాకినాడ జీజీహెచ్‌లో తల్లి పాల బ్యాంక్ ఏర్పాటు కాబోతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. ఇప్పుడు అంతకంటే గొప్ప దానం మరొకటి రాబోతోంది. అదే తల్లి పాల దానం చేయవచ్చు. తల్లి పాలు దానం చేయడమేమిటని ఆశ్చర్యపోతున్నారా! ఔను.. తల్లి పాలను సైతం ఇకనుంచి దానం చేయొచ్చు. తల్లి పాలకు దూరమైన బిడ్డలకు ప్రాణ భిక్ష, ఆరోగ్య భిక్ష కల్పించవచ్చు. రక్తదానం మాదిరిగా అమ్మ పాలను దానంగా స్వీకరించి నిల్వ చేసేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో ‘మదర్ మిల్క్ బ్యాంక్’ సిద్ధమవుతోంది. ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) పీడియాట్రిక్ విభాగం పైఅంతస్తులో 8 గదులతో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘సుశేణ హెల్త్ ఫౌండేషన్’ మధ్య ఇందుకు సంబంధించి ఇటీవల ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్‌కుమార్ దేశంలోనే 8వ మదర్ మిల్క్ బ్యాంక్‌ను ఈ నెల 13న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫౌండేషన్ రూ.కోటితో మూడు విడతల్లో దీని నిర్మాణం చేపడుతోంది. తల్లి పాలు బిడ్డ ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో కీలకం. వీటి ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల కొందరు.. శరీరాకృతి మారిపోతుందనే అపోహతో మరికొందరు.. తల్లి పాలు రాక ఇంకొందరు పిల్లలు చనుబాలకు దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయంగా పోత పాలతో బిడ్డ ఆకలి తీరుస్తుండటం వల్ల బిడ్డల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆరోగ్యాన్ని పరోక్షంగా దెబ్బ తీస్తున్నాయి. తల్లి నుంచి పాలు సేకరిస్తున్న దృశ్యం (ఫైల్) బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను.. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువగా ప్రసవాలు జరిగే టాప్–5లో ఉన్న కాకినాడ జీజీహెచ్‌ను ‘సుశేణ’ హెల్త్ ఫౌండేషన్ ఎంపిక చేసుకుంది. నవజాత శిశువు నుంచి రెండేళ్ల బిడ్డ వరకు ఈ బ్యాంక్‌లో పాలు ఇస్తారు. తల్లి బిడ్డకు ఇవ్వగా మిగులు పాలను సేకరించి అవసరమైన పిల్లలకు అందిస్తారు. హెచ్ఐవీ, వీడీఆర్ఎల్ (వెనెరియల్ డిసీజ్ రీసెర్చ్ లేబొరేటరీ టెస్ట్), హెపటైటిస్ పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే తల్లి పాలు తీసుకుంటారు. కాగా, ఇక్కడ తల్లుల చనుబాల పరిమాణం పెంచేందుకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలపై అవగాహన కల్పిస్తారు. మసాజ్ థెరఫీ, న్యూట్రిషనల్ ట్రీట్మెంట్ (పోషకాలతో కూడిన వైద్యం), మదర్‌కేర్ (బిడ్డను హత్తుకుని పాలిచ్చే) తరహాలో తల్లులకు బిడ్డలను కనీసం గంటపాటు హత్తుకుని ఉండేటట్టు ఈ బ్యాంక్‌లోని ప్రత్యేక వార్డులో నిపుణుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలా ఈ బ్యాంక్‌లో రెండు, మూడు రోజులు ఉంచి తల్లులకు అవగాహన వచ్చాక ఇంటి వద్ద ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించి పంపేస్తారు. స్వచ్ఛంద దాతలు జీజీహెచ్ మిల్క్ బ్యాంక్‌కు వచ్చి పాలు దానం చేయవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఉచితం. తొలి దశలో సేకరించిన పాలను నిల్వ చేయకుండా వెంటనే అవసరమైన శిశువులకు పట్టిస్తారు. రెండో దశలో పాలను నిల్వ చేస్తారు. కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా ఏడాది పాటు వాటిని పాడవకుండా భద్రపరుస్తారు. ఇందుకు ప్రత్యేక యంత్రాలు జీజీహెచ్‌లో సిద్ధమయ్యాయి. తొలి దశ ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలో మిల్క్ పాశ్చరైజేషన్ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఏపీలో తొలి బ్యాంక్ సామాజిక బాధ్యతలో భాగంగా నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత తీసుకున్నాం. రాష్ట్రంలోనే తొలిసారి కాకినాడ జీజీహెచ్‌లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాం. ప్రభుత్వంతో ఇటీవలనే ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇది సాధ్యమవుతోంది. – రమేష్ లక్కర్సు, కన్సల్టెంట్ ప్రోగ్రాం మేనేజర్, సుశేణ హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధి విస్తృతం చేస్తాం ఈ సేవలను విస్తృతం చేసేందుకు నెట్వర్క్ ఆస్పత్రులతో అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాం. మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు జీజీహెచ్‌లో పరిస్థితులు ఉండటంతో సుశేణ ఫౌండేషన్ ముందుకొచ్చింది. – డాక్టర్ హేమలతాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ శిశువుల ప్రాణాలకు రక్ష కాకినాడ జీజీహెచ్‌లో ప్రతి నెలా 700 నుంచి 800 ప్రసవాలు జరుగుతున్నాయి. రెండున్నర కేజీల కంటే తక్కువ బరువుతో పుడుతున్న నవజాత శిశువుల సంఖ్య 75 నుంచి 85 మధ్య ఉంటుంది. కిలో కంటే తక్కువ బరువుతో పుడుతున్న వారు 10 మంది ఉంటున్నారు. ఈ బ్యాంక్ శిశువుల ప్రాణ రక్షణకు తోడ్పడుతుంది. – ఎంఎస్ రాజు, హెచ్‌వోడీ, పీడియాట్రిక్, జీజీహెచ్, కాకినాడ -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4.83 కోట్ల ఓపీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ల (ఓపీ) సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు బదులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022 తెలిపింది. 2021లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ 4.23 కోట్లుగా నమోదవగా 2022లో అది 4.83 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. అలాగే 2021లో ఇన్–పేషెంట్ (ఐపీ) సేవలు 14.16 లక్షలుగా ఉండగా 2022లో అవి 16.97 లక్షలకు పెరిగాయని పేర్కొంది. 2021లో 2.57 లక్షలు జరగ్గా 2022 నాటికి సర్జరీల సంఖ్య 3.04 లక్షలకు పెరిగిందని తెలిపింది. నివేదికలోని ముఖ్యాంశాలు... ►2022లో ఒకేసారి 8 వైద్య కాలేజీల ప్రారంభం. ఈ ఏడాది మరో 9 కాలేజీలు ప్రారంభించే పనులు. గతేడాది అదనంగా 200 పీజీ సీట్లు. ►ఎంబీబీఎస్ సీట్లలో లక్ష జనాభాకు 19 సీట్లతో దేశంలో మొదటి స్థానం... లక్ష జనాభాకు ఏడు పీజీ మెడికల్ సీట్లతో దేశంలో రెండో స్థానం. ►మాతృత్వ మరణాల రేటు 56 నుంచి 43కు (జాతీయ సగటు 97) తగ్గుదల. ►శిశుమరణాల రేటు జాతీయ స్థాయిలో 28 ఉండగా రాష్ట్రంలో 21. ►సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 8,200 పడకలు అందుబాటులోకి తెచ్చేలా పనులు ప్రారంభం. ►గతేడాది 515 డయాలసిస్ పరికరాలతో 61 కొత్త డయాలసిస్ కేంద్రాలు మంజూరు. గతేడాది 50 లక్షలు దాటిన డయాలసిస్ సెషన్స్ సంఖ్య. ►కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ మొదటి దశలో భాగంగా 9 జిల్లాల్లో పంపిణీ ప్రారంభం. ►కంటివెలుగు రెండో దశ ప్రారంభం. ►ప్రభుత్వ ఆసుపత్రుల్లో 33 శాతంగా ఉన్న ప్రసవాల రేటు ఇప్పుడు 61 శాతానికి పెరుగుదల. ►గతేడాది జరిగిన 5.40 లక్షల ప్రసవాల్లో 61 శాతం అంటే 3.27 లక్షల ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహణ. ►ఇన్ఫెక్షన్ల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు. ►రోగాలను ముందే గుర్తించి చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం. గతేడాది చివరి నాటికి 1.48 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహణ. బీపీ, షుగర్ రోగులకు కిట్లు అందజేత. ►కరోనా బూస్టర్ డోసు పంపిణీ 47 శాతం (జాతీయ సగటు 23 శాతం) పూర్తి. ►ఇప్పటివరకు 11 వేల కొత్త పడకలు అందుబాటులోకి వచ్చాయి. 27,500 పడకలకు ఆక్సిజన్ సరఫరాకు ఏర్పాటు. ►డైట్ చార్జీలు రూ. 40 నుంచి రూ. 80కి పెంపు. ►రోగి సహాయకుల కోసం 18 పెద్దాసుపత్రుల్లో రూ. 5కే భోజన పథకం ప్రారంభం. -
Andhra Pradesh: క్వాలిటీ వైద్యానికి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి: ‘ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం. ఇందులో భాగంగానే నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం కింద ఆస్పత్రుల బలోపేతానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. తద్వారా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్)కు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం’ అని మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభం సందర్భంగా 2020 ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలకు కార్యరూపం ఇస్తూ అడుగులు ముందుకు వేశారు. ఫలితంగా మన రాష్ట్రంలోని అత్యధిక ప్రభుత్వ ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) గుర్తింపు దక్కింది. ఏకంగా 443 ప్రభుత్వాస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపుతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. 209 ఆస్పత్రులతో రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో కేరళ (134), నాలుగో స్థానంలో హరియాణ (121), ఐదో స్థానంలో తెలంగాణ (114) ఉన్నాయి. ఎన్‌క్వాష్ అంటే.. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 2016 నుంచి అత్యున్నత ప్రమాణాలతో రోగులకు నాణ్యమైన సేవలందించే ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) గుర్తింపు ఇవ్వడం ప్రారంభించింది. ఆస్పత్రిలోకి రోగి అడుగు పెట్టినప్పటి నుంచి వైద్యం చేయించుకుని బయటకు వెళ్లేంత వరకు అన్ని స్థాయిల్లో సదుపాయాల కల్పనను పరిగణనలోకి తీసుకుంటారు. పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), జిల్లా ఆస్పత్రు(డీహెచ్)లకు ఎన్‌క్వాష్ గుర్తింపు ఇస్తారు. పీహెచ్‌సీల్లో 6 విభాగాల్లో 1,600 రకాల అంశాలను.. ఏరియా, సీహెచ్‌సీ, డీహెచ్‌లలో 18 విభాగాల్లో 6,625 అంశాలను పరిశీలిస్తారు. ఉదాహరణకు రోగి సింక్ వద్దకు వెళ్లి చేతులు కడుక్కునే తీరు, ఆహారం తీసుకునే విధానం, వారికి మందులు ఇచ్చే విధానం తదితర విషయాలన్నింటినీ క్షుణ్ణంగా గమనిస్తారు. ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నోసిŠట్క్స్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రోగులకు సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 70 శాతానికి పైగా పాయింట్లు సాధించిన ఆస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపు ఇస్తారు. అప్పట్లో 26 ఆస్పత్రులకే ఎన్‌క్వాష్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి నామ మాత్రంగా కేవలం 26 ఆస్పత్రులకు మాత్రమే ఎన్‌క్వాష్ గుర్తింపు ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తూ నాడు–నేడు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకాం చుట్టారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గడిచిన మూడున్నరేళ్లలోనే ఏకంగా 417 ఆస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపు లభించింది. వీటిలో 391 పీహెచ్‌సీలు, 25 సీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరి నెలలోగా 200 వరకూ వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లకు ఎన్‌క్వాష్ గుర్తింపు కోసం వైద్య శాఖ దరఖాస్తు చేయనుంది. కాగా, ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 1,142 పీహెచ్‌సీలను అభివృద్ధి చేయడం కోసం రూ.664.96 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో పాత భవనాలకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు, శిథిలావస్తలో ఉన్న పీహెచ్సీ భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఆస్పత్రులను అధునాతనంగా తీర్చిదిద్దారు. ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్, ఆస్పత్రిలో వసతులు లేదా గదులకు సంబంధించి సైన్ బోర్డులు, రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా జనరల్ వార్డులు, మరుగుదొడ్లు, ఆస్పత్రికి వచ్చిన రోగులు కూర్చోవడానికి కుర్చీలు ఇలా అన్ని రకాల వసతులు సమకూరాయి. ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి చేసింది అనేదానికి గత మూడున్నరేళ్లలో ఏకంగా 391 పీహెచ్‌సీలకు ఎన్‌క్వాష్ గుర్తింపు రావడమే నిదర్శనం అని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు, 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, పలు సూపర్ స్పెషాలిటీ, గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేస్తోంది. మానవ వనరుల కొరతకు చెక్ పెడుతూ వైద్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 47 వేలకు పైగా పోస్టులు భర్తీ చేపట్టారు. దీంతో 2019తో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన, ఇతర ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాగా పెరిగారు. ‘లక్ష్య’ గుర్తింపులో రెండో స్థానం మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన ప్రసూతి సేవలకుగాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపు విభాగంలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో గత నెలలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎంసీహెచ్ వర్క్‌షాప్‌లో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య శాఖకు అవార్డు ప్రదానం చేసింది. ఆస్పత్రుల్లో ప్రసూతి సేవల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఆస్పత్రులకు లక్ష్య గుర్తింపు వస్తుంది. నెలకు వంద, అంత కంటే ఎక్కువ ప్రసవాలు జరిగే ఆస్పత్రులకు ఈ గుర్తింపు పొందడానికి అర్హత ఉంటుంది. కాగా, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్‌లలో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఆస్పత్రులకు ఈ గుర్తింపు ఇస్తారు. మన రాష్ట్రంలో 40 ప్రభుత్వాస్పత్రులకు ఇప్పటి వరకు లక్ష్య గుర్తింపు లభించింది. ఎన్‌క్వాష్, లక్ష్య ఇతర కేంద్ర వైద్య శాఖ ఇచ్చే గుర్తింపు పొందిన ఆస్పత్రులకు ఆర్థిక ప్రోత్సాహకాలు సైతం లభిస్తాయి. ఆస్పత్రి వాతావరణంతో రోగి ప్రభావితం ఆస్పత్రుల్లోని వాతావరణం రోగులను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజలకు ఒక రకమైన భావన ఉంటుంది. ఇక్కడ శానిటేషన్ సరిగా ఉండదు. వసతుల కొరత ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు రావడానికి మొగ్గు చూపరు. ఈ క్రమంలో వాటి రూపురేఖలు మార్చడం ద్వారా సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి సీఎం వైఎస్ జగన్ పలు చర్యలు తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై అధ్వానంగా తయారైన ఆస్పత్రులన్నీ ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా తయారవుతున్నాయి. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రులను తీర్చిదిద్దడంతో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి తగ్గుతుంది. శుభ్రమైన, ప్రశాంతమైన వాతావరణం రోగులకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది వారు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుంది. – డాక్టర్ యాదల అశోక్‌బాబు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రత్యేకాధికారి విలేజ్ క్లినిక్లకూ ఎన్‌క్వాష్ గుర్తింపు కోసం దరఖాస్తు ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాల విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆ మేరకు నాడు–నేడు కింద ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక ఎన్‌క్వాష్ గుర్తింపు కలిగిన ఆస్పత్రులు మన రాష్ట్రంలో ఉన్నాయి. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు కూడా ఎన్‌క్వాష్ గుర్తింపు కోసం చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం కోసం 10,032 విలేజ్ క్లినిక్‌లు నెలకొల్పింది. దశల వారీగా వీటికి ఎన్‌క్వాష్ కోసం దరఖాస్తు చేస్తున్నాం. – ఎం.టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఎన్‌క్వాష్ గుర్తింపు సంవత్సరం ఆస్పత్రులు 2017–18 4 2018–19 22 2019–20 46 2020–21 కరోనా కారణంగా సర్టిఫికేషన్ ప్రక్రియ ఆపేశారు 2021–22 306 2022–23 65 (మరో 23 ఆస్పత్రులకు అసెస్మెంట్ పూర్తి. ఫలితాలు రావాల్సి ఉంది.) ––––––––– -
ఇక పక్కాగా ఇన్ఫెక్షన్ల కట్టడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఖరారు చేసింది. అందుకు సంబంధించిన మ్యాన్యువల్‌ను విడుదల చేసింది. గాంధీ ఆసుపత్రి రూపొందించిన ఈ మార్గదర్శకాలు ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు తోడ్పడతాయని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడా ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, ఇటీవల మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు ఇన్ఫెక్షన్కు గురై మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, రోగుల చికిత్సలకు ఉపయోగించే పరికరాలను స్టెరిలైజ్ చేయడం, పీపీఈ కిట్లు వాడటం, లాండ్రీ నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఇమ్యునైజేషన్ తప్పనిసరి చేయడం వంటివి చేపట్టాలని మార్గదర్శకాల్లో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ముఖ్యమైన మార్గదర్శకాలు... ►రోగుల మూత్ర నమూనాలు, ఆసుపత్రుల్లోని నీటి నమూనాలు, వెంటిలేటర్లపై ఉన్న రోగుల మందుల నమూనాలను ఎప్పటికప్పుడు ల్యాబ్‌లో పరీక్షించి వాటి ఫలితాలపై ఆసుపత్రి అంటువ్యాధుల నియంత్రణ కమిటీ తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ►రోగులకు అందించే ఆహారాన్ని ప్రతి 4 నెలలకోసారి పరీక్షించాలి. ►తాగునీటిలో ఉండే బ్యాక్టీరియాపై నెలవారీ నిఘా చేపట్టాలి. పేషెంట్ కేర్ యూనిట్లు, హాస్పిటల్ కిచెన్, క్యాంటీన్లు, హాస్టళ్ల నుంచి ల్యాబ్‌లో ప్రతి నెలా ఒకసారి తాగునీటి పరీక్ష నిర్వహించాలి. ►వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులకు చేతి శుభ్రత శిక్షణా కార్యక్రమాన్ని నెలకోసారి తప్పనిసరిగా నిర్వహించాలి. ►బయో వ్యర్థాల నిర్వహణ, పారబోత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. సెంట్రల్ స్టోరేజీ ఏరియాలో బయోమెడికల్ వ్యర్థాలను నిల్వ చేయడానికి సురక్షితమైన, వెంటిలేషన్ ఉన్న ప్రాంతం కేటాయించాలి. ఆయా సిబ్బందికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. ►అంటువ్యాధుల తీవ్రత ఉన్నప్పుడు రోగులు, సిబ్బంది, సందర్శకుల రాకపోకలను తగ్గించాలి. రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలి. వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. ►అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్న సమయంలో అదనపు సిబ్బందిని నియమించుకోవాలి. ►ఒకేసారి అవుట్‌బ్రేక్ జరిగితే వ్యాప్తిని గుర్తించి ప్రమాదంలో ఉన్నవారెవరో తెలుసుకోవాలి. -
ప్రభుత్వాసుపత్రుల్లోనే మందులు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: మందులు ఎట్టి పరిస్థితు ల్లోనూ బయటకు రాయ కూడదని, డిశ్చార్జి అయిన రోగు లకు ప్రభుత్వ ఆసు పత్రుల్లోనే మందులు ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి అవస రమైన మందులు ఆసుపత్రు లకు సకాలంలో అందించాలన్నా రు. సోమవా రం తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధి లోని ఆసు పత్రుల నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించిన 56 టిఫా స్కానింగ్ సేవలు గర్బిణులకు అందేలా చూడాలని సూచించారు. సి సెక్షన్ల శాతం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కు వగా ఉందని, దాన్ని తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. అనవసర సి సెక్షన్ల వల్ల కలిగే నష్టాన్ని కౌన్సెలింగ్ ద్వారా వివరించాలన్నారు. సి సెక్షన్ లేదా సాధా రణ డెలివరీ చేయాలా వద్దా అనేది పూర్తిగా డాక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని తెలియజేయాలని ఆయన చెప్పారు. డైట్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది రోగు లు, వారి సహాయకులతో మర్యాదగా ప్రవర్తించాలని, నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
AP: ‘కార్పొరేట్’కు కన్నుకుట్టేలా..
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2017 నుంచి ఉన్నట్లుండి కండరాలు బిగుసుకుపోయే సమస్యతో బాధపడుతున్నాడు. ఒంగోలు, గుంటూరు, విజయవాడల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నాలుగేళ్లపాటు నరకయాతన అనుభవించాడు. వెళ్లిన ప్రతి ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్‌రే అంటూ శరీరంలోని ప్రతి అవయవాన్ని పరిశీలించారు. ఒకరు వెన్నెముకలో సమస్య ఉందని, మరొకరు నాడీవ్యవస్థలో సమస్య ఉందని.. అనేక రకాల మందులు రాసిచ్చి ఫీజులు గుంజారే తప్ప ఎక్కడా నయంకాలేదు. చివరి ప్రయత్నంగా 2021లో బాధితుడిని కుటుంబసభ్యులు గుంటూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల అనంతరం అతడు ‘స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సుందరాచారి నిర్ధారించారు. మూడ్రోజుల చికిత్స తరువాత ఆ వ్యక్తి అందరిలాగే లేచి నడవడం ప్రారంభించాడు. కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన 44 ఏళ్ల బసవయ్య ఔట్సోర్సింగ్ ఉద్యోగి. గత నెల 20వ తేదీ ఉదయం విధినిర్వహణలో ఉండగా ఇతనికి ఎడమ చేయి, కాలు చచ్చుబడిపోయాయి. దీంతో తోటి ఉద్యోగులు హుటాహుటిన విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. బ్రెయిన్‌స్ట్రోక్‌గా వైద్యులు నిర్ధారించారు. గంటన్నరలోనే వైద్యులు థ్రోంబలైజ్ ఇంజక్షన్ ఇచ్చారు. ఐదున్నర గంటల్లో బసవయ్య లేచి ఎవరి సాయంలేకుండా నడవగలిగాడు. సాక్షి, అమరావతి: ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యులకు అంతుపట్టని అరుదైన వ్యాధులకు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో మంచి వైద్యం లభిస్తోంది. దీంతో పెద్దాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకు పెరుగుతోంది. పెద్దాస్పత్రుల్లో సేవలు పొందుతున్న వారిసంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగంపై సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు లభిస్తున్నాయి. గణనీయంగా పెరిగిన సర్జరీలు టీడీపీ హయాంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికి శిశువులు మృతిచెందడం, సెల్‌ఫోన్ టార్చ్లైట్ల వెలుతురులో ఆపరేషన్లు చేసిన ఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు అదే ఆస్పత్రుల్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కన్నా మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు లభిస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే బోధనాస్పత్రుల్లో గణనీయంగా సర్జరీల సంఖ్య పెరగడమే. 2018–19లో రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 1.99 లక్షల మైనర్, 98 వేల మేజర్ సర్జరీలు నిర్వహించారు. అప్పట్లో ఏడాది కాలంలో జరిగిన సర్జరీల కంటే ఎక్కువ సర్జరీలను ప్రస్తుతం 9 నెలల్లోనే చేపట్టారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని బోధనాస్పత్రుల్లో 2,42,980 మైనర్, 1,18,482 మేజర్ సర్జరీలను చేశారు. ఈ లెక్కన పరిశీలిస్తే టీడీపీ హయాంలో రోజుకు సగటున 870 సర్జరీలు నిర్వహిస్తే, ప్రస్తుతం రోజుకు సగటున 1,338 సర్జరీలు చేపడుతున్నారు. రోజుకు 22వేలకు పైగా ఓపీలు ఇక ప్రస్తుతం బోధనాస్పత్రుల్లో రోజుకు 22 వేల మందికి పైగా అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు పొందుతున్నారు. అదే విధంగా 2,400 మంది వరకూ ఇన్ పేషెంట్ (ఐపీ) సేవలు అందుకుంటున్నారు. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో 60.99 లక్షలకు పైగా ఓపీలు, 6.25 లక్షలకు పైగా ఐపీలు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూల్ జీజీహెచ్‌లో 6.06 లక్షల మంది ఓపీ సేవలు పొందారు. ఆ తర్వాత విశాఖ కేజీహెచ్‌లో 5.34 లక్షలు, కాకినాడ జీజీహెచ్‌లలో 5.31 లక్షల ఓపీలు నమోదయ్యాయి. నాడు అవస్థలు.. నేడు అత్యున్నత ప్రమాణాలు టీడీపీ పాలనలో ప్రభుత్వాస్పత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. అప్పట్లో బోధనాస్పత్రుల్లో మందులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర వసతుల కొరత తీవ్రంగా వేధించేది. కానీ, 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం వైఎస్ జగన్ ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ సారించారు. ఈ క్రమంలో మానవ వనరుల కొరతకు చెక్‌పెడుతూ వైద్యశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 47 వేలకు పైగా పోస్టులు భర్తీచేపట్టారు. దీంతో 2019తో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన, ఇతర ఆస్పత్రుల్లో వైద్యల సంఖ్య పెరిగింది. ఇక టీడీపీ ప్రభుత్వంలో ఎసెన్షియల్ డ్రగ్స్‌కు కూడా కొరత ఉండేది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మందుల కొరతకు తావులేకుండా, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు కలిగిన మందులను 608 రకాల వరకూ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతోంది. ఇందులో 530కు పైగా రకాల మందులను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ రూపంలో సరఫరా చేస్తోంది. మిగిలిన మందులను ఆస్పత్రుల్లో అవసరాలకు అనుగుణంగా స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు కూడా ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఆరోగ్యశ్రీలోనూ టీడీపీ హయాంలో కేవలం 1,059 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తే.. ఇప్పుడు ఏకంగా 3,255 రకాలకు చికిత్స అందిస్తున్నారు. అంతేకాక.. నాడు–నేడు కింద రూ.16వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతోపాటు, ప్రస్తుతం ఉన్న బోధనాస్పత్రులు, కళాశాలలను బలోపేతం చేస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 207 పీజీ సీట్లు పెరిగాయి. ఇవేకాక.. గత ఏడాది మరో 630 పీజీ సీట్ల పెంపునకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడంలో కేసీఆర్ కిట్, అమ్మ ఒడి సహా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు కేవలం 30 శాతం ఉంటే ఇప్పుడు 66 శాతానికి పెరిగాయి. డిసెంబర్ నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఆ జిల్లాలో అత్యధికంగా 86 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగాయి. సబ్ సెంటర్ల వారీగా చూస్తే జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిపై డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, డిప్యూటీ డీంహెచ్‌వోలు క్షేత్ర స్థాయి పర్యటన చేసి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువగా సి– సెక్షన్లు జరుగుతున్నాయి. అనవసర సి సెక్షన్లు తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మూడు నెలల ఓపీ పరిశీలిస్తే, రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఓపీ నమోదు చేస్తున్న నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, కొమురంభీం, జనగాం జిల్లాల్లో పరిస్థితులు మారాలన్నారు. కేసీఆర్ కిట్ లో భాగంగా ప్రతి గర్భిణికి నాలుగు ఏఎన్సీ చెకప్స్ క్రమం తప్పకుండా చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సౌకర్యం తీసుకు వచ్చామని, సేవలు గర్బిణులకు అందేలా చూడాలన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌వో, డీఎంహెచ్వోలతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. 18 నుంచి కంటి వెలుగు... ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్న కంటి వెలుగు రెండో దఫా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆశ, ఏఎన్ఎంలను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు జరిగేలా చూసి, మందులు, కళ్లద్దాలు అందించడంలో క్షేత్రస్థాయిలో ఉండే ఆశాలు, ఏఎన్ఎంల పాత్ర కీలకమన్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో కుటుంబ, ఆరోగ్య సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. -
వైద్య సేవలు సంతృప్తికరమేనా?
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు సంతృప్తికరమేనా? వసతులు బాగున్నాయా? డాక్టర్లు తగిన సమయం కేటాయించారా?..’ అంటూ రాష్ట్ర వైద్య శాఖ రోగుల నుంచి అభిప్రాయ సేకరణను ప్రారంభించింది. వారి అభిప్రాయాలకు అనుగుణంగా.. మరింత నాణ్యమైన సేవలందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఈ అభిప్రాయ సేకరణ కోసం ఒక వెబ్ అప్లికేషన్‌ను రూపొందించింది. ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స తీసుకొని.. ఇంటికి వెళ్లిన రోగులకు అదే రోజు సాయంత్రంలోగా అప్లికేషన్ లింక్‌ను మొబైల్ ఫోన్‌కు టెక్ట్స్ మెసేజ్ పంపిస్తారు. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే వెబ్ అప్లికేషన్లోకి వెళ్తారు. అక్కడ 10 ప్రశ్నలు ప్రత్యక్షమవుతాయి. ప్రతి ప్రశ్నకు మూడు ఆప్షన్లు ఉంటాయి. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత మీరు డాక్టర్‌ను కలవడానికి ఎంత సమయం వేచి ఉన్నారు? డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో మీరు కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయా? చికిత్స సమయంలో డాక్టర్ మీ అనారోగ్య వివరాలు, లక్షణాలు అర్థం చేసుకోవడానికి తగిన సమయం కేటాయించారా? మీ సమస్య గురించి చెప్పేటప్పుడు డాక్టర్, నర్స్‌లు వింటున్నట్టు అనిపించిందా? శరీర పరీక్షలు చేస్తున్నప్పుడు వేరే వారికి కనపడకుండా అడ్డుగా కర్టెన్ వేశారా?.. ఇలా వైద్య సేవలు, రోగి గోప్యత, ఆస్పత్రిలో సౌకర్యాలపై పది ప్రశ్నల ద్వారా అభిప్రాయం సేకరిస్తారు. 10 ప్రశ్నలకు 11 పాయింట్లు ఉంటాయి. అభిప్రాయాల ఆధారంగా 0–4 పాయింట్లు వస్తే బిలో యావరేజ్, 4–8 పాయింట్లు వస్తే యావరేజ్, 8–10 పాయింట్లు వస్తే గుడ్, 11 పాయింట్లు వస్తే ఎక్స్లెంట్ అని ఆస్పత్రులకు గ్రేడింగ్ ఇస్తారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఒక డ్యాష్‌బోర్డును కూడా అందుబాటులోకి తెస్తున్నారు. బిలో యావరేజ్, యావరేజ్ గ్రేడింగ్ ఉన్న ఆస్పత్రుల్లో.. ఏ అంశాల్లో రోగులు అసంతృప్తిగా ఉన్నారో మెడికల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లకు అలర్ట్ వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు డ్యాష్ బోర్డును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. -
కరోనా నియంత్రణకు సన్నద్ధం
సాక్షి, అమరావతి: చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కరోనా నియంత్రణపై రాష్ట్ర వైద్యశాఖ ముందుజాగ్రత్త చర్యలను ప్రారంభించింది. ఇదే క్రమంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. మాక్‌డ్రిల్ నిర్వహణ, కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలకు వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఆదేశాలు జారీచేసింది. కరోనా కేసులు పెరిగితే ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలు, నియంత్రణ కోసం చేయాల్సిన ఏర్పాట్లు, సన్నద్ధతపై సమీక్షించుకోవడమే ఈ మాక్ డ్రిల్ నిర్వహణ ముఖ్య ఉద్దేశం. మాక్ డ్రిల్‌లో భాగంగా అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ఆస్పత్రులు ఉన్నాయా.. లేదా.. అని పరిశీలిస్తారు. ఆయా ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్, సాధారణ పడకల సామర్థ్యం, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్‌లలో కరోనా పరీక్షల సామర్థ్యం, ఆర్టీపీసీఆర్, ఆర్ఏటీ కిట్స్, పరీక్షల నిర్వహణకు అవసరమైన రీఏజెంట్స్ సరిపడా అందుబాటులో ఉన్నాయా.. లేదా.. అని చూస్తారు. తప్పనిసరి మందులు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్క్‌లు, ఇతర మందులు, సర్జికల్స్ నిల్వలను పరిశీలిస్తారు. ఆక్సిజన్ కాన్సెట్రేటర్లు, సిలిండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్, మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ వ్యవస్థ గురించి తెలుసుకుంటారు. ఆక్సిజన్ నాణ్యత, పైప్‌లైన్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూస్తారు. జీనోమ్ ల్యాబ్‌కు విదేశీ ప్రయాణికులకు నమూనాలు ప్రతి అంతర్జాతీయ విమానంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ర్యాండమ్‌గా రెండు శాతం మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న జిల్లాల డీఎంహెచ్‌వోలకు సోమవారం వైద్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నమూనాలను విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపాలని ఆదేశించింది. ర్యాండమ్ పరీక్షల నుంచి 12ఏళ్లలోపు పిల్లలను మినహాయించింది. రాష్ట్రంలోని గన్నవరం, విశాఖపట్నం, రేణిగుంట, కర్నూల్, కడప, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టులలో ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీచేసింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను కరోనా నిబంధనలకు అనుగుణంగా ఐసోలేషన్‌లో ఉంచాలంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసి వచ్చిన వారికి కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వాస్పత్రిని సంప్రదించాలని, లేదా 104కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి సలహాలు, సూచనలు తీసుకోవాలని తెలిపింది. -
461 స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ప్రభుత్వాస్పత్రుల్లోని 461 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు జోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బుధవారం నుంచి డిసెంబర్ 5 వరకు http://cfw.ap.nic.in వెబ్సైట్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా వైద్య, ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి 42 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్–సర్వీస్మెన్లకు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు 10 ఏళ్ల పాటు వయోపరిమితి నుంచి సడలింపు ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును రూ.500గా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.300గా నిర్దేశించారు. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వైద్య శాఖ తెలిపింది. కోవిడ్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ తదితర ఇతర వెయిటేజ్‌లు వర్తిస్తాయని పేర్కొంది. భవిష్యత్‌లో ఖాళీ అయ్యే నర్సింగ్ పోస్టుల భర్తీకి అనుగుణంగా ఈ నోటిఫికేషన్ మెరిట్ లిస్ట్‌ను వచ్చే ఏడాది ఆగస్టు వరకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావివ్వకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2019 నుంచి 46 వేలకు పైగా పోస్టుల భర్తీని ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కాంట్రాక్ట్ పద్ధతిలో 461 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన వైద్యులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యం అందాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం వైద్య, ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల అందుబాటు పెరిగింది. శిశు మరణాల రేటు తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2021–22’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2015లో అప్పటి ప్రభుత్వం 2,270 వైద్య పోస్టులను మంజూరు చేస్తున్నట్లు ఘనంగా ప్రకటించింది. వాస్తవానికి పీహెచ్‌సీల్లో 1,412 మంది వైద్యులు మాత్రమే ఉండేవారు. మిగిలిన 858 పోస్టులు ఖాళీగానే ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ పీహెచ్‌సీల్లో రెండు వైద్య పోస్టులను తప్పనిసరి చేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు కూడా చేపట్టింది. దీంతో 2015తో పోలిస్తే 2021 నాటికి పీహెచ్‌సీల్లో వైద్యుల సంఖ్య పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీలకు 2146 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 2021లో ఆర్బీఐ లెక్కలు చేపట్టే నాటికి 2,001 మంది వైద్యులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్నారు. 145 పోస్టులు ఖాళీగా ఉండేవి. ఈ ఖాళీ పోస్టులతో పాటు, ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా అదనపు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. తగ్గిన శిశు మరణాలు రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో శిశు మరణాల రేటు కూడా తగ్గింది. 2018లో సగటున వెయ్యి ప్రసవాలకు 29 శిశు మరణాలు ఉండేవి. ఈ రేటు 2019లో 25కు, 2020లో 24కు పడిపోయింది. జాతీయ స్థాయికన్నా మన రాష్ట్రంలో శిశు మరణాల రేటు తక్కువగా ఉంటోంది. 2020లో జాతీయ శిశు మరణాల రేటు 28గా నమోదైంది. 9 ఏళ్లు పెరిగిన ఆయుర్దాయం వైద్య సౌకర్యాలు ప్రజలకు ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ పెరగడం వంటి కారణాలతో దేశవ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగింది. ఇదే పద్ధతిలో రాష్ట్రంలోనూ ఆయుర్దాయం పెరిగింది. 1991–95 మధ్య రాష్ట్రంలో మనిషి ఆయుర్దాయం 61.8 సంవత్సరాలు, దేశంలో 60.3 సంవత్సరాలుగా ఉండేది. 2015–19 నాటికి దేశంలో 69.7 సంవత్సరాలకు, రాష్ట్రంలో 70.3 సంవత్సరాలకు పెరిగింది. పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా నమోదైంది. 2015–19 మధ్య రాష్ట్రంలో పురుషుల ఆయుర్దాయం 68.9 సంవత్సరాలు, మహిళల్లో 71.8 ఏళ్లుగా నమోదైంది. -
అవీ సర్కారు ఆసుపత్రులు.. ఆరోగ్యశ్రీ లేకుంటే.. వైద్యమూ అందట్లే!
ఆమె పేరు శ్వేత (పేరు మార్చాం)... పది రోజుల క్రితం ప్రసవం కోసం నిలోఫర్ ఆసుపత్రికి వచ్చారు. ఆమెకు మగ బిడ్డ పుట్టాడు. డిశ్చార్జి సమయంలో మగబిడ్డ పుట్టినందున రూ.3 వేలు చెల్లించాలని అక్కడి సిబ్బంది ఒత్తిడి చేశారు. వైద్యాధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో రూ. 3 వేలు, ఇతరత్రా రూ.500 చెల్లించి బయటికొచ్చారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల తీరుకు ఈ రెండు ఘటనలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రికి వచ్చిన రోగికి ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే గుండె వైద్యం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్‌పేషంట్లుగా చేరే రోగులకూ చాలాచోట్ల సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. రెండు మూడు రోజులు ఇన్‌పేషంట్‌గా ఉంటే సొమ్ములు ఇవ్వాల్సిందే. లేకుంటే వారికి వైద్యసేవలు గగనమే. ఇలాంటి వాటిపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి, ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధమేంటని.. ఎవరికైనా ఉచిత వైద్యం చేయాల్సిందే కదాని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉచిత వైద్యం అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడుతున్నారు. కోట్లలో వసూలు... సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవానికి, ఇతర చికిత్సలకు ఒక్కో రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్న పరిస్థితులున్నాయి. విచిత్రమేంటంటే కొన్ని చోట్ల కేసీఆర్ కిట్టు ఇచ్చినందుకూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాంటి దందాల్లో కొందరు డాక్టర్లు సూత్రధారులుగా ఉంటున్నారని ఆరోపణలున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వసూలు చేసిన సొమ్మును డాక్టర్‌కు లేదా ఏజెన్సీ నిర్వాహకుడికి ఇచ్చి అంతా పంచుకుంటున్నారు. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో జరిగే కాసుల దందాతో ఏడాదికి రూ.కోట్లు వసూలు అవుతున్నాయి. నిలోఫర్‌లో ఏడాదికి రూ. 2 కోట్లు, గాం«దీలో రూ.కోటిన్నర, ఉస్మానియాలో రూ. కోటి వరకు వసూలు అవుతున్నట్లు అంచనా. జిల్లా ల్లోని పెద్ద ఆసుపత్రుల్లోనూ జోరుగా వసూళ్లపర్వం సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఏటా దాదాపు 6 లక్షల కాన్పులు జరుగుతుండగా, వీటిలో 4 లక్షల కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. డబ్బులు వస్తేనే చేయగలం! యాంజియోగ్రాం చేసేటప్పుడు అవసరమైతే స్టెంట్లు వేయాలని, వాటికి ఖర్చవుతుంది కాబట్టి ఆరోగ్యశ్రీ అడుగుతున్నామని వైద్యులంటున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అయితే స్టెంట్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలోనూ ఇదే పద్ధతి నడుస్తోంది. కాగా, ‘గాంధీ’లోని ఒక గైనకాలజీ వైద్యురాలు ఆపరేషన్‌కు రూ.10 వేలు డిమాండ్ చేశారని ఒక బాధితురాలు ఇటీవల లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. నిలోఫర్ ఆసుపత్రిలోనూ వసూలు దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రసవానికి వచి్చన మహిళ నుంచి ఆడబిడ్డ పుడితే రూ. 2 వేలు, మగబిడ్డ పుడితే రూ.3 వేలు ఇవ్వాలన్న షరతు పెట్టారు. ఈ దందా వెనుక ఒక ప్రముఖ వైద్యుడు కీలకంగా ఉండటం గమనార్హం. కాసుల కక్కుర్తిలో మచ్చుకు కొన్ని... ► గాంధీ ఆసుపత్రి గైనకాలజీ విభాగంలో ఆడబిడ్డ పుడితే రూ. వెయ్యి, మగబిడ్డ పుడితే రూ. 1,500 వసూలు చేస్తున్నారు. ► పాతబస్తీలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రితోపాటు బేలాలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన వారి నుంచి అబ్బాయి పుడితే రూ.2 వేలు, ఆడపిల్ల పుడితే రూ.1,500 వసూలు చేస్తున్నారు. ► హైదరాబాద్ సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే రూ.వెయ్యి, మగబిడ్డ పుడితే రూ. 2 వేలు డిమాండ్ చేస్తున్నారు. ► నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడ బిడ్డ పుడితే రూ.వెయ్యి, మగ బిడ్డ పుడితే రూ.1,500 వసూలు చేస్తున్నారు. డెలివరీ తరువాత ఆయాలకు రూ. 500 ఇవ్వాల్సి వస్తోంది. ► జనగామ జిల్లాలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడబిడ్డ పుడితే రూ.500, మగ బిడ్డ పుడితే రూ.వెయ్యి గుంజుతున్నారు. ► ఎంజీఎం ఆస్పత్రికి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ప్రభుత్వం మందులు సరఫరా చేస్తున్నా, అందుబాటులో లేని ఔషధాల కొనుగోలుకు బడ్జెట్ కేటాయించినప్పటికీ రోగులు ప్రైవేట్ దుకాణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఐదు రకాల మందులు రాస్తే కనీసం రెండు రకాల ఔషధాలు బయటి నుంచి కొనుగోలు చేయాల్సిందే. నాకు ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డ జన్మించాడు. గురువారం డిశ్చార్జి చేసేటప్పుడు అక్కడి సిబ్బంది రూ.వెయ్యి వసూలు చేశారు. అలాగే కేసీఆర్ కిట్టుకూ వంద రూపాయలు తీసుకున్నారు. - ఝాన్సీ, హైదరాబాద్ -
సురక్షిత మాతృత్వం.. ఖర్చు లేని కాన్పు
మాతృత్వం అనేది ఓ వరం. ప్రసవ ఘట్టం మహిళకు పునర్జన్మ వంటింది. దీనిని కొందరు స్వార్థపరులు తమ సంపాదనకు మార్గంగా మలుచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సురక్షిత మాతృత్వాన్ని ఉచితంగా ప్రసాదించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి చేరుకునే వరకు అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచింది. ప్రధానంగా ప్రసూతి ఆస్పత్రుల్లో సేవలపై ప్రధాన దృష్టి సారించింది. మార్కాపురం(ప్రకాశం జిల్లా): తల్లీబిడ్డ క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లాలోని వైద్యశాలలు, ఏరియా, కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బందిని నియమించడంతో ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై పూర్తి నమ్మకం ఏర్పడింది. గత ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. డాక్టర్లు లేక మందుల కొరతతో ప్రజలు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించారు. తాజాగా పరిస్థితి మారింది. నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో సర్కార్ ఆస్పత్రులపై నమ్మకం ఏర్పడింది. జిల్లాలో మొత్తం వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 12 వైద్యశాలలు ఉన్నాయి. ఇందులో మార్కాపురంలో జిల్లా వైద్యశాల, ఒంగోలులో మాతాశిశు వైద్యశాల ఉన్నాయి. కనిగిరి, దర్శి, పొదిలి, చీమకుర్తి, పామూరు, దోర్నాల, కంభం, కొండపి ఉండగా గిద్దలూరు, యర్రగొండపాలెంలో ఏరియా వైద్యశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా 9 కమ్యూనిటీ ఆస్పత్రులు ఉన్నాయి. ఇవన్నీ వైద్య విధాన పరిషత్ కో ఆర్డినేటర్ పరిధిలో ఉండగా, డీఎంహెచ్ఓ పరిధిలో 64 పీహెచ్‌సీలు ఉన్నాయి. జిల్లాలో బేస్తవారిపేటలో అత్యధికంగా నాలుగు పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లో కాన్పులు చేస్తున్నారు. అనంతరం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు. నిపుణులైన డాక్టర్లు గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు రావడంతో ప్రభుత్వ వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి. జిల్లా వైద్యశాలలో ఇద్దరు గైనకాలజిస్టులు, ఇద్దరు సర్జన్లతో పాటు అనస్థీషియన్ (మత్తు డాక్టరు), నిపుణులైన నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. నెలకు సుమారు 180 నుంచి 200 మ«ధ్య కాన్పులు జరుగుతున్నాయి. ఆధునిక వైద్య పరికరాలు, ఆక్సిజన్ సౌకర్యం, బ్లడ్ బ్యాంక్, ఐసీయూ బెడ్లు, అందుబాటులో ఉండడంతో సమీప మండలాల్లోని గ్రామాల గర్భిణులు కాన్పుల నిమిత్తం జిల్లా వైద్యశాలలకు వస్తున్నారు. మొత్తంగా గత నాలుగు నెలల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో సుమారు 2,500 వరకు ప్రసవాలు జరిగాయి. ప్రోత్సాహకాలు.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాన్నిస్తోంది. పీహెచ్‌సీల్లో ప్రసవం చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా కింద రూ.4 వేలు, జననీ సురక్ష యోజన కింద రూ.వెయ్యి ఇస్తోంది. మొత్తంగా రూ.ఐదు వేలు ఇస్తుండగా పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే రూ.4600 ఇస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తోంది. సురక్షితంగా ఇంటికి... ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు రవాణా నుంచి మందుల వరకు అన్నీ ఉచితమే. గర్భిణికి పురిటినొప్పులు రాగానే 108కు ఫోన్ చేస్తే ఆస్పత్రికి తీసుకెళ్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. ప్రసవం అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తల్లీబిడ్డను ఇంటికి తరలించేటప్పుడు ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల సమన్వయం కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతాశిశు సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలను యాప్‌కు అనుసంధానించి బాలింతలను క్షేమంగా ఇంటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటారు. బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక ఈ యాప్‌లో డ్రైవర్ ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. మంచి వైద్య సేవలు అందాయి కాన్పు కోసం జిల్లా వైద్యశాలకు వచ్చాను. డాక్టర్లు, నర్స్‌లు మంచి వైద్య సేవలు అందించి సాధారణ కాన్పు చేశారు. పాప పుట్టింది. ఒక్క రూపాయి ఖర్చు కాలేదు. మంచి మందులు ఇచ్చారు. డాక్టర్లకు ధన్యవాదాలు. – నాగలక్ష్మి, రాగసముద్రం, తర్లుపాడు మండలం మంచి సేవలందిస్తున్నాం జిల్లా వైద్యశాలలో గైనకాలజిస్టులు, సర్జన్లు, మంచి సేవా భావం కలిగిన వైద్య సిబ్బంది ఉన్నారు. నార్మల్ డెలివరీలు చేస్తారు. తక్షణ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. హైరిస్క్ పేషెంట్లకు కూడా మా డాక్టర్లు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రోగులకు భరోసా ఇస్తాం. మందుల కొరత లేదు. – డాక్టర్ సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, మార్కాపురం -
అన్ని పోస్టులూ భర్తీ చేసేలా...
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వినూత్న విధానాలను, సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీలు లేదని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టంగా చెప్పారు. మాటలు చెప్పడమే కాకుండా అందుకు తగ్గట్టుగా 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 46 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. తాజాగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరత అనేది తలెత్తకుండా వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నియామక ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి వైద్య కళాశాల, బోధనాస్పత్రి వరకు అన్ని స్థాయిల్లో వైద్య శాఖలో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చింది. కేవలం నియామకాల కోసమే ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఏపీఎంఎస్‌ఆర్‌బీ)ను ఏర్పాటు చేస్తోంది. ప్రతి నెలా 20న ఖాళీల గుర్తింపు ఏపీఎంఎస్‌ఆర్‌బీ ద్వారా వైద్య శాఖలో ఖాళీల గుర్తింపు, వాటిని ఆన్లైన్ విధానంలో భర్తీ చేయడానికి ప్రత్యేకంగా కాంప్రహెన్సివ్ హెచ్ఆర్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోర్టల్‌లో వేతన చెల్లింపుల సమాచారం ఆధారంగా ప్రతి నెలా 20వ తేదీన ఆస్పత్రుల్లో మంజూరైన పోస్టులు, ఇన్ పొజిషన్, ఖాళీల వివరాలను పీహెచ్సీ డీడీవో, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీసీహెచ్ఎస్, డీఎంహెచ్‌వోల లాగిన్‌కు సీఎఫ్ఎంస్ నుంచి ఆన్లైన్లో వెళతాయి. వీరు ఖాళీలను ధ్రువీకరించిన అనంతరం రాష్ట్ర స్థాయిలో ఆయా విభాగాధిపతులు పరిశీలిస్తారు. విభాగాధిపతులు కూడా ధ్రువీకరించిన అనంతరం 25వ తేదీన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏపీఎంఎస్‌ఆర్‌బీ ఆన్లైన్ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. మరుసటి నెల 7వ తేదీలోగా పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తుంది. నియామకాల్లో భర్తీ అయిన పోస్టులు, భర్తీ కాకుండా మిగిలిపోయిన, కొత్తగా ఏర్పడిన ఖాళీలు మళ్లీ తిరిగి 20వ తేదీన గుర్తిస్తారు. ఇలా సైక్లింగ్ విధానంలో ప్రతి నెలా ఖాళీల గుర్తింపు, వాటి నియామక ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అంతా ఆన్లైన్ లోనే వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను గుర్తించడం మొదలు భర్తీ చేయడం వరకు మొత్తం ఆన్లైన్లోనే చేపట్టేలా ప్రత్యేక పోర్టల్‌ను రూపొందిస్తున్నాం. బదిలీల ప్రక్రియను కూడా ఈ పోర్టల్ ద్వారానే చేపడతాం. పోర్టల్ ద్వారా ప్రతి నెలా 20న ఖాళీలు గుర్తిస్తాం. మరుసటి నెల 7వ తేదీలోగా పోస్టుల భర్తీ పూర్తి చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిన వెంటనే కార్యాచరణ మొదలుపెడతాం. – జి.ఎస్. నవీన్ కుమార్, కార్యదర్శి (ఎఫ్ఏసీ), వైద్య ఆరోగ్య శాఖ -
వైద్య నియామకాలకు స్పెషల్ మెడికల్ బోర్డు
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీ ఎంస్‌ఆర్‌బీ) ఏర్పాటు చేయనుంది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి మెంబర్ సెక్రటరీగా, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యుడిగా బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావుండరాదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్ 2019 నుంచి ఏకంగా 46 వేల పోస్టుల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. వైద్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2012లో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు ద్వారానే వైద్య శాఖలో నియామకాల ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం తమిళనాడులో పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ఎంఎస్ఆర్బీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఈ బోర్డు ద్వారానే వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన నియామకాలను చేపట్టనున్నారు. కీలక పరిణామం ఏపీ ఎంఎస్ఆర్బీ ఏర్పాటు వైద్య శాఖ చరిత్రలో కీలక పరిణామం కానుంది. ప్రభుత్వ ఆస్పత్రులను వేధిస్తున్న సమస్యల్లో మానవ వనరుల కొరతే ప్రధానం. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడం వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరిగిన జనాభా, రోగుల రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిని సమకూర్చడం, మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులంటే నరకానికి చిరునామాగా 2019 ముందు వరకూ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుస్థితిని అరికట్టేందుకు వైద్య శాఖలో ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో సీఎం జగన్ నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు 17 కొత్త వైద్య కళాశాలలు, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పుతున్నారు. నిరంతర ప్రక్రియగా నియామకాలు వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడ పోస్టు ఖాళీగా ఉన్నా వెంటనే నోటిఫై చేసి భర్తీకి చర్యలు తీసుకోవాలని, నియామకాల కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈమేరకు బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వైద్య శాఖలో నియామకాలను నిరంతర ప్రక్రియగా కొనసాగించి ఎప్పటికప్పుడు ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిపై ఆడిట్ నిర్వహిస్తాం. ప్రస్తుతం వైద్య శాఖకు అవసరమైన మందులు, పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీఎంఎస్ఐడీసీ ఉంది. ఇదే తరహాలో మానవ వనరుల కల్పనకు ఏపీ ఎంఎస్ఆర్బీ పని చేస్తుంది. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి -
1,458 ‘సీనియర్ రెసిడెంట్’ల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్, డెంటల్ బోధనాస్పత్రుల్లో 1,458 సీనియర్ రెసిడెంట్ (ఎస్ఆర్) డాక్టర్ల నియామకానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ రాత్రి 12 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 45 ఏళ్ల లోపు వయసుండి, ప్రభుత్వ మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ పూర్తి చేసిన వైద్యులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. http://dme.ap.nic.in వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఎస్ఆర్లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.85 వేలు, స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.70 వేలు, సీనియర్ రెసిడెంట్(పీజీ)కు రూ.65 వేలు చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇస్తుంది. పీజీ తుది పరీక్షల్లో వచ్చిన (థియరీ, ప్రాక్టికల్స్)మార్కుల్లో మెరిట్ ప్రామాణికంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపికలు చేపడతారు. అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 144, జనరల్ మెడిసిన్‌లో 101, జనరల్ సర్జరీ విభాగంలో 101 ఖాళీలున్నాయి. పాథాలజీలో 88, అనాటమీలో 85, ఫార్మకాలజీలో 80, గైనకాలజీలో 69, అనస్థీషియాలో 56, పీడియాట్రిక్స్‌లో 56, ఆప్తమాలజీలో 56 ఖాళీలున్నాయి. ఇలా మొత్తంగా 49 విభాగాల్లో 1,458 ఎస్ఆర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ప్రభుత్వం 46 వేల పోస్టులను భర్తీ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివిన వారికే.. ఎస్ఆర్ పోస్టుల నియామకంలో తమకు అవకాశం కల్పించాలని కొందరు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ చేసిన వైద్యులు సంప్రదిస్తున్నారు. అయితే నేషన్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అడ్మిషన్ నిబంధనల మేరకు కళాశాలల్లోని ప్రతి విభాగంలో ఎస్ఆర్ పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఈ క్రమంలో కేవలం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివిన వారికే అవకాశం కల్పిస్తున్నాం. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చదివిన వారు తాము చదివిన కళాశాలల్లో ఎస్ఆర్లుగా పనిచేసేందుకు ఆయా కళాశాలల యాజమాన్యాలను సంప్రదించాలి. – డాక్టర్ వినోద్‌కుమార్, డీఎంఈ -
గైర్హాజరులోని వైద్యులకు మెమోలు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో నెలలతరబడి అనధికారికంగా గైర్హాజరులో ఉన్న వైద్యుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది కొరతకు తావులేకుండా సీఎం వైఎస్ జగన్ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో 46 వేల వరకు పోస్టులను భర్తీ చేపట్టింది. అయితే కొందరు వైద్యులు కొన్ని నెలల తరబడి విధులకు హాజరవ్వడం లేదు. ఆ స్థానంలో కొత్త వారిని నియమించలేని పరిస్థితులు ఉంటున్నాయి. దీనివల్ల ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో గైర్హాజరులో ఉన్న 112 మంది వైద్యులకు నోటీసులు జారీ చేశారు. వారిలో పలువురు వైద్యులు తిరిగి విధుల్లో చేరగా, మరికొందరు విధుల్లో చేరలేదు. విధుల్లో చేరని 18 మంది వైద్యులకు చార్జ్‌మెమోలు జారీ చేయబోతున్నట్టు సమాచారం. వీరిలో ఎనిమిది మంది కడప రిమ్స్, 10 మంది తిరుపతి రుయాకు చెందిన వైద్యులు ఉన్నట్టు తెలిసింది. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు చార్జ్‌మెమోలు జారీ చేసి, వారిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టీఫా యంత్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 అత్యాధునిక టీఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్– పుట్టబోయే పిల్లల్లో ఏవైనా లోపాలున్నాయా అనేది ఈ స్కాన్‌లో తెలుస్తుంది) యంత్రాలను ఈనెల 18న ఏక కాలంలో ప్రారంభించనున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. గర్భిణులు టెస్టుల కోసం ప్రైవేటుకు వెళ్లాల్సిన అవసరం లేదని, టి–డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా థైరాయిడ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీఫా స్కానింగ్ నిర్వహిస్తారని వెల్లడించారు. ఆప్తాల్మిక్ ఎక్విప్మెంట్ కూడా ప్రారంభించనున్నామన్నారు. టీఎస్ఎంఎస్ఐడీసీ, ఎన్హెచ్ఎం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి హరీశ్ రావు సోమవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సివిల్, ఎక్విప్మెంట్, ఈ– ఉపకరణ్, డ్రగ్స్, సర్జికల్, డయాగ్నొస్టిక్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ తదితర అంశాలపై చర్చించారు. గాంధీ, నిమ్స్, జహీరాబాద్, హుస్నాబాద్, మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రాల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. టీవీవీపీ పరిధిలోని 32 ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్ పనులు, 13 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 41 బస్తీ దవాఖానాలను 31 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, జిల్లాల్లో ఏర్పాటవుతున్న బస్తీ దవాఖానాల పనులు వేగవంతం చేయాలన్నారు. డీఎంహెచ్వోలు బాధ్యత తీసుకొని, జిల్లా కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో పని చేయాలని సూచించారు. ఎప్పటికపుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలన్నారు. జీవన్ దాన్ ద్వారా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు, బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్‌రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
40,676 పోస్టుల్లో వైద్య సిబ్బందిని నియమించిన ప్రభుత్వం
-
17 నుంచి వైద్యుల నియామకానికి ఇంటర్వ్యూలు
సాక్షి, అమరావతి: వైద్య శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్ఎస్) పోస్టుల భర్తీకి ఈ నెల 17, 18, 19 తేదీల్లో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావుండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 40 వేలకు పైగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లలో భర్తీ చేసింది. ఇటీవల ఏపీవీవీపీలో 351 సీఏఎస్ఎస్, డీఎంఈలో 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో సీఏఎస్ఎస్ పోస్టులు 240, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 304 భర్తీ అయ్యాయి. కొన్ని స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇతర నియామక నిబంధనలకు లోబడి అభ్యర్థులు లేకపోవడంతో మిగిలిన పోస్టులు భర్తీ అవ్వలేదు. అలాగే గతంలో భర్తీ కాకుండా కొన్ని మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో డీఎంఈలో మిగిలిపోయిన 304 అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏపీవీవీపీలో 150 సీఏఎస్ఎస్ పోస్టులకు వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులను శాశ్వత ప్రాతిపదికన లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నారు. కాగా ఏపీవీవీపీలో వైద్యుల వినతి మేరకు బదిలీలకు ఇటీవల ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇందుకు 135 మంది వైద్యులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి బుధవారం బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అన్ని పోస్టుల భర్తీకి చర్యలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఒక్కటి కూడా ఖాళీగా ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు పోస్టులన్నీ భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీ వైద్యుల పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాం. ఈ అవకాశాన్ని వైద్యులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ వినోద్ కుమార్, కమిషనర్, ఏపీవీవీపీ, ఇన్చార్జి డీఎంఈ -
సిజేరియన్లు వద్దు
సాక్షి, హైదరాబాద్: సిజేరియన్ల ద్వారా డెలివరీలు వద్దని, సాధారణ ప్రసవాలు చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు, సిబ్బందికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో, తల్లీబిడ్డలకు ప్రమాదం ఉందని గ్రహిస్తే మాత్రమే సిజేరియన్ల జోలికిపోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలని.. గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులకు కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరుపై మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో మంత్రి హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మెదక్, ములుగు జిల్లాల్లో 80శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని, అలా ఇతర జిల్లాల్లో ఎందుకు జరగడం లేదని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత స్థానిక అధికారులు, సిబ్బందిదేనని స్పష్టం చేశారు. డెలివరీ తేదీని ముందే గుర్తించి 104 వాహనంలో దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ జిల్లాల్లో ఎక్కువగా సిజేరియన్లు రాష్ట్రంలో సెప్టెంబర్‌లో 57.99 శాతం డెలివరీలు సిజేరియన్లు అయ్యాయని.. అత్యధికంగా హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో సిజేరియన్లు జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయా జిల్లాల్లో వైద్యులు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రయత్నించాలని ఆదేశించారు. ఇక కరోనా బూస్టర్ డోస్ పంపిణీ వంద శాతం జరిగేలా చూడాలని సూచించారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి, క్రమం తప్పకుండా మందులు అందించాలన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారి సమాచారం ఆన్లైన్లో పొందుపర్చాలని.. తద్వారా వారు డైరెక్ట్ బెనిఫిట్ స్కీంకు అర్హులవుతారని తెలిపారు. కాగా, టీబీ బారిన పడ్డవారికి సిద్దిపేట, వనపర్తిలో మాదిరిగా అన్ని జిల్లాల్లో నిక్షయ పోషకాహార కిట్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. అదే విధంగా జిల్లాల్లోని గర్భిణీలకు త్వరలో న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేయాలన్నారు. -
ఆస్పత్రుల్లో స్వచ్ఛత.. రోగులతో సఖ్యత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రి పరిశుభ్రతతో మెరిసిపోవాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధికారులు, వైద్యులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెలవారీ పురోగతిపై సమీక్షలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు, వైద్యులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో డైట్ మెనూ తెలుగులో అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇచ్చే డైట్ మెనూ స్పష్టంగా పొందుపర్చాలని ఆదేశించారు. ఆస్పత్రిలో శానిటేషన్ పరిస్థితులు మరింత మెరుగుపడాలని, హాస్పిటల్ లోపల మాత్రమే కాకుండా కాంపౌండ్‌లోనూ పరిశుభ్రత పాటించాలన్నారు. శానిటైజేషన్, డైట్ కాంట్రాక్ట్ బిల్లులు, ఉద్యోగుల వేతనాలు సమయానుకూలంగా అందేలా చూడాలని హరీశ్ సూచించారు. ఆలస్యమైతే ఆస్పత్రి సూపరింటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఆపరేషన్ థియేటర్లను స్టెరిలైజేషన్ చేయాలని, సర్జికల్ కిట్స్ ఎన్ని అవసరమైతే అన్ని కొనుగోలు చేసి వినియోగించాలని తెలిపారు. రోగులు, రోగుల సహాయక సిబ్బంది పట్ల స్టాఫ్‌నర్సుల దురుసు వైఖరి మారాలని, ప్రేమగా, నవ్వుతూ పలకరించాలన్నారు. చికిత్సకు వచ్చిన వారినుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
గ్రామాలకు స్పెషలిస్ట్ వైద్యులు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు స్పెషలిస్ట్ వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రూరల్/ప్రభుత్వ సేవలను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ కళాశాలల్లో రాష్ట్ర కోటా, ప్రైవేట్ కళాశాలల్లో ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు పొంది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఒక సంవత్సరం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తుంది. ఈ మేరకు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 2022–23వ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు పొందే విద్యార్థులకు ఈ నిబంధన వర్తిస్తుంది. కోర్సులు పూర్తి చేసుకున్న స్పెషలిస్ట్ వైద్యులను తొలి ప్రాధాన్యత కింద ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో నియమిస్తారు. ఆ తర్వాత మిగిలిన వారి సేవలను డీఎంఈ పరిధిలో వినియోగించుకుంటారు. ముందుగానే ఒప్పందం నాన్ సర్వీస్ అభ్యర్థులు కోర్సు అనంతరం సంవత్సరం పాటు రూరల్/ప్రభుత్వ సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రం తీసుకుంటారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి కోర్సు పూర్తయిన 18నెలల వ్యవధిలో ప్రభుత్వ సేవల్లో చేరకపోతే పీజీ చేసినవారికి రూ.40 లక్షలు, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసిన వారికి రూ.50లక్షల జరిమానా విధిస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రాష్ట్ర కోటా సీట్లలో 707 మంది, ప్రైవేట్ కళాశాలల్లో ఏ–కేటగిరీ సీట్లలో 1,142 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతారు. వీరందరూ ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా సేవలు అందించాల్సి ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందనున్న వీరందరూ 2025–26లో కోర్సులు పూర్తి చేసుకుంటారు. అనంతరం గ్రామీణ సేవల్లో చేరాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత తీరనుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. అన్ని కళాశాలలకు ఆదేశాలు మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్–సర్వీస్ అభ్యర్థులకు రాష్ట్ర కోటా, ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బాండ్ తీసుకోవాలని తెలిపారు. అన్ని కాలేజీలకు ఆదేశాలు ► మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్–సర్వీస్ అభ్యర్థులకు రాష్ట్ర కోటా, ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బాండ్ తీసుకోవాలని తెలిపారు. -
డిజిటల్ వైద్యసేవల్లో ఏపీకి అవార్డులు
సాక్షి, అమరావతి: ప్రజలకు డిజిటల్ వైద్యసేవలు అందించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఆరు అవార్డులు లభించాయి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం–జేఏవై) నాలుగో, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) ఒకటో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర వైద్యశాఖ నిర్వహిస్తున్న ఆరోగ్య మంథన్–2022 కార్యక్రమంలో సోమవారం కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్ ఈ అవార్డులను అందుకున్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ (అభా)కు అత్యధికంగా ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేసిన రాష్ట్రం, జిల్లాలు, 100 శాతం ఆస్పత్రులు ఈహెచ్‌ఆర్‌లో ఎన్రోల్మెంట్, ఉత్తమ ప్రభుత్వ ఆరోగ్య రికార్డు ఇంటిగ్రేటర్ విభాగాల్లో ఏపీ ఆరు అవార్డులు సాధించింది. దేశంలోనే అభాకు అత్యధిక ఆరోగ్య రికార్డులు అనుసంధానించిన విభాగంలో పార్వతీపురం మన్యం, బాపట్ల, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ డిజిటల్ వైద్యసేవల్లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇందుకుగాను జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. తొలినుంచి ఏబీడీఎం కార్యకలాపాల్లో ఏపీ దూకుడుగా అడుగులు వేసిందన్నారు. ఇప్పటివరకు కోటిమంది డిజిటల్ హెల్త్ ఖాతాలకు ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేసినట్లు చెప్పారు. ఈ ఘనత దేశంలో ఏపీకి మాత్రమే దక్కిందన్నారు. డిజిటల్ వైద్యసేవల్లో దేశంలోనే నంబర్–1గా ఏపీ రాణించడం వెనుక క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కృషి విశేషమైనదని చెప్పారు. 3.4 కోట్లమందికి హెల్త్ ఐడీలు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 24.38 కోట్లమంది ప్రజలకు డిజిటల్ హెల్త్ ఐడీలను సృష్టించారు. 3.4 కోట్లమందికి హెల్త్ ఐడీలు సృష్టించి ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. 2.6 కోట్ల హెల్త్ ఐడీలతో మధ్యప్రదేశ్, 1.99 కోట్ల హెల్త్ ఐడీలతో ఉత్తరప్రదేశ్ తరువాత స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రంలో 3.4 కోట్ల మందికి ఐడీలు సృష్టించగా వీరిలో కోటిమందికిపైగా ఐడీలకు ఆరోగ్య రికార్డులను అనుసంధానించారు. మరోవైపు రాష్ట్రంలో 13,335 ప్రభుత్వ ఆస్పత్రులు, వాటిల్లో పనిచేస్తున్న వైద్యులు 16,918 మందిని ఏబీడీఎంలో రిజిస్టర్ చేశారు. -
AP: వైద్య రంగానికి చికిత్స
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావివ్వకుండా గత మూడేళ్లలో చర్యలు చేపట్టాం. ఏకంగా 45 వేల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాం. ఇప్పటి వరకు 40,800 మందిని నియమించాం. మిగిలిన పోస్టుల భర్తీ కొనసాగుతోంది. అక్టోబర్ 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించాం. వైద్యం కోసం పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలు కాకూడదన్న నాన్న గారి లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేశాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన వైద్య ఆరోగ్య రంగానికి విప్లవాత్మక కార్యక్రమాలు, చర్యలతో చికిత్స చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా జబ్బు బారిన పడితే పేదలు అప్పులపాలు కాకుండా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించేలా సమూల మార్పులు చేశామని చెప్పారు. శాసనసభలో మంగళవారం విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడు కార్యక్రమంపై జరిగిన స్వల్ప కాలిక చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నాడు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులు శిథిలావస్థకు చేరినా పట్టించుకోని దుస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం, సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆపరేషన్ చేయడం వంటి ఘటనలు అప్పట్లో చూశాం. అలాంటి æపరిస్థితుల్లో 2019లో అధికారంలోకి వచ్చాక మనసు పెట్టి వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మన రాష్ట్రంలో టయర్–1 సిటీలు లేవు.. ► తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు రాష్ట్రాల్లో మాదిరిగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి టయర్–1 సిటీలు మన రాష్ట్రంలో లేవు. ఈ కారణంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న పరిస్థితులు మన దగ్గర లేవు. దీంతో ఇతర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మన వైద్య రంగంలో ఎలాంటి మార్పులు తెస్తే ప్రజలకు మంచి చేయగలుగుతాం అని ఆలోచించి.. ఆ దిశగా వేగంగా అడుగులు వేశాం. ► దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. నిరుపేదలు పెద్ద పెద్ద జబ్బుల బారిన పడినప్పుడు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొచ్చారు. ► ఆ మహానేత మరణం తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టే నాటికి టీడీపీ ప్రభుత్వం రూ.680 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిపెట్టి పోయింది. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు విముఖత చూపే పరిస్థితి. ► ఈ క్రమంలో డాక్టర్లా చికిత్స మొదలు పెట్టాను. టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.680 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాం. చెల్లింపుల్లో ఎటువంటి తారతమ్యాలకు పోలేదు. నందమూరి బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి ఈ రోజున బిల్లు చెల్లింపులు.. చంద్రబాబు హయాంలో కంటే చాలా వేగంగా చేస్తున్నాం. 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ► వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకువచ్చాం. అంటే నెలకు రూ.40 వేల ఆదాయం ఉండే మధ్యతరగతి కుటుంబాలకూ పథకాన్ని వర్తింపజేశాం. ఫలితంగా 95 శాతానికి పైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. ► గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1059 ప్రొసీజర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈ అక్టోబర్ 5వ తేదీ నుంచి ఏకంగా 3,118 ప్రొసీజర్లకు పథకాన్ని వర్తింప చేయబోతున్నాం. ప్రొసీజర్ల సంఖ్య పెంచడం, మరో వైపు నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లు చెల్లింపుల ద్వారా ఈ పథకాన్ని బలోపేతం చేశాం. ► ప్రతి ప్రభుత్ర ఆస్పత్రిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మారుతున్న ఆస్పత్రుల రూపురేఖలు ► రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇందుకోసం ఏకంగా రూ.16,255 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో నాడు–నేడు కింద 11,888 పనులు చేపట్టగా 4,851 పనులు పూర్తయ్యాయి. ► వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రులు (ఏహెచ్), జిల్లా ఆస్పత్రులు (డీహెచ్), బోధనాస్పత్రుల వరకూ నాడు–నేడు కింద అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రతి చోటా పూర్తి సదుపాయాలు కల్పిస్తున్నాం. ► గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలు ఈ రెండూ కూడా ప్రివెంటివ్ కేర్‌లో చాలా కీలకమైన మార్పులు తీసుకొస్తాయి. ఈ క్రమంలో గ్రామాల్లో రూ.1,692 కోట్ల వ్యయంతో 10,032 హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 3,673 క్లినిక్స్ నిర్మాణం పూర్తయింది. మిగిలినవి ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. విలేజ్ క్లినిక్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం ఉంటారు. ► ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్సీ ఒక సీహెచ్‌సీ లేదా ఒక పీహెచ్సీ ఒక ఏరియా ఆస్పత్రి ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉంటారు. తద్వారా ప్రతి మండలంలో నలుగురు వైద్యులు అందుబాటులోకి వస్తారు. ప్రతి గ్రామానికి నెలలో రెండు మూడు సార్లు వైద్యుడు ► త్వరలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని పీహెచ్సీ వైద్యుడు నెలలో రెండు, మూడు సార్లు సందర్శిస్తాడు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. పీహెచ్సీలో ఉండే ఇద్దరు వైద్యుల్లో ఒకరు రోజు విడిచి రోజు 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)తో తమకు కేటాయించిన గ్రామాలను సందర్శించి, అక్కడే వైద్య సేవలందిస్తారు. ► దీంతో మెజారిటీ జబ్బులకు గ్రామాల్లోనే వైద్యం అందుతుంది. వైద్యుడితో గ్రామస్తులకు అనుబంధం ఏర్పడుతుంది. నెలలో రెండు, మూడు సార్లు గ్రామాన్ని సందర్శించడంతో ప్రజలను వైద్యుడు పేరు పెట్టి పిలిచే పరిస్థితులు ఏర్పడతాయి. ఓ వైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంతో విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీ స్థాయిలో అడుగులు వేస్తుండగా, మరో వైపు సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నాం. ఈ ఆస్పత్రులు క్యురేటివ్ కేర్‌లో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. కొత్తగా 17 వైద్య కళాశాలలు ► రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. వీటని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ.. కొత్తగా మరో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. పాడేరు, విజయనగరం, నర్సీపట్నం, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పులివెందుల, పెనుకొండ, ఆదోని, నంద్యాల, పార్వతీపురంలలో వైద్య, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. ► పాత కళాశాలల అభివృద్ధి, కొత్త కళాశాలల ఏర్పాటు కోసం రూ.12,268 కోట్లు వ్యయం చేస్తున్నాం. విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రి వరకు అన్ని స్థాయిల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మక మార్పులు చేపట్టాం. నాడు–నేడు ద్వారా విద్య, వైద్య ఆరోగ్య రంగంలో పూర్తి మార్పులు వచ్చే ఏడాది, రెండేళ్లలో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. -
క్యాన్సర్‌కు రాష్ట్రంలోనే అధునాతన చికిత్స
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని క్యాన్సర్ రోగులకు ఇకమీదట ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అధునాతన వైద్యం అందనుంది. క్యాన్సర్ రోగులు వ్యయప్రయాసలకోర్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే మంచి వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వాస్పత్రులు రూపు దిద్దుకుంటున్నాయి. వీటిలో క్యాన్సర్ చికిత్సకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి, వైద్యులకు అధునాతన చికిత్స పద్ధతులను అందుబాటులోకి తేవడానికి కీలకమైన ముందడుగు పడింది. రాష్ట్రంలో నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏపీ చాప్టర్‌ను వైద్య శాఖ ప్రారంభించింది. ఎన్సీజీ నెట్‌వర్క్‌లోకి రాష్ట్రంలోని 11 ప్రభుత్వ బోధనాస్పత్రులను తీసుకెళ్లింది. ఎన్సీజీ చాప్టర్‌ను తొలుత కేరళలో ఏర్పాటు చేయగా, రెండో రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బోధనాస్పత్రుల్లోని క్యాన్సర్ విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులు, లైబ్రరీలోని సమాచారం, ఇతర వివరాలను ఎన్‌సీజీకి అప్డేట్ చేస్తున్నారు. ఇది ముగిసిన తర్వాత ఎన్సీజీతో ఆస్పత్రులకు యాక్సెస్ లభిస్తుంది. దీంతో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు, వైద్యులు, పరిశోధకులతో మన వైద్యులు సంప్రదింపులు జరపవచ్చు. తద్వారా వ్యాధికి సంబంధించి నూతన పరిజ్ఞానం, ఇతరత్రా వివరాలను తెలుసుకొని, అధునాతన చికిత్సను రాష్ట్రంలోని రోగులకు అందజేసే అవకాశం కలుగుతుంది. క్యాన్సర్ కేర్‌లో అసమానతల తొలగింపునకే ఎన్సీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద టాటా మెమోరియల్ సెంటర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 2012లో ఎన్సీజీని ఏర్పాటుచేసింది. దేశంలో క్యాన్సర్ కేర్‌లో అసమానతల తొలగింపే దీని ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగా 266 ప్రముఖ క్యాన్సర్ ఆస్పత్రులు, పరిశోధన కేంద్రాలు ఈ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. క్యాన్సర్ వ్యాధికి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడంపై నిరంతరం కసరత్తు జరుగుతుంది. క్యాన్సర్ నివారణ, రోగనిర్ధారణ, చికిత్స, రోగుల సంరక్షణ, ఆంకాలజీలో ప్రత్యేక శిక్షణ, వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం వంటి అంశాలపై ఏకరీతి ప్రమాణాల ఏర్పాటుకు ఇది కృషి చేస్తుంది. ఎన్సీజీలో భాగస్వామ్యంతో ప్రయోజనాలివీ.. ► అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ వ్యాధి నిపుణులు, ఆస్పత్రులు, పరిశోధన సంస్థలతో సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. అభిప్రాయాలు, చికిత్స విధానాలను ఒకరికొకరు పంచుకోవడానికి వీలుంటుంది. ► దేశంలో ఎక్కడ నుంచైనా రోగులకు పరీక్షలు, చికిత్స, సంరక్షణ తదితర అంశాలపై నిపుణుల అభిప్రాయాలు పొందవచ్చు. ► ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స, నిర్ధారణ పరికరాలు, మందులను తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ► ఎన్సీజీ సెక్రటేరియట్ ద్వారా క్యాన్సర్ పరిశోధనలు, చికిత్సకు సంబంధించిన గ్రంథాలయం మన వైద్యులకు అందుబాటులోకి వస్తుంది. దీనిద్వారా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన చికిత్సా విధానాలు, మందులు, ఇతర అంశాలను తెలుసుకోవచ్చు. ► క్యాన్సర్ చికిత్సలో కీలకమైన ప్రణాళిక రచనలో ముఖ్య పాత్ర పోషించే ట్యూమర్ బోర్డుతో ప్రభుత్వాస్పత్రులకు యాక్సెస్ లభిస్తుంది. క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో ఎన్సీజీ కీలకపాత్ర ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ముఖ్యమైనది. దేశంలో దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఎన్సీజీ కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్సీజీ స్టేట్ చాప్టర్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయం. ఏపీలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, ఏకరీతి చికిత్స ప్రమాణాలతో ముందుకు వెళ్లడానికి ఇది ఎంతగానో అవకాశం కలి్పస్తుంది. – డాక్టర్ ఎం. ఉమేశ్, డైరెక్టర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, విశాఖపట్నం కీలక ఘట్టం రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో ఇది కీలక ఘట్టం. క్యాన్సర్ చికిత్సలో ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. వ్యాధిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. (ఎన్సీజీ) లైబ్రరీలో పరిశోధనలు, కొత్త కొత్త చికిత్సల సమాచారం ఉంటుంది. ఆ నెట్‌వర్క్‌లోకి మన ఆస్పత్రులు వెళ్లడంతో మన వైద్యులకు చికిత్స, వ్యాధి నియంత్రణలపై మరింత అవగాహన పెరుగుతుంది. – నవీన్‌కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి -
డెంగీ విజృంభణ.. ఆ జిల్లాలో రోజుకు 28 కేసులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అధిక వర్షాలు.. వాతావరణ మార్పులు.. పెరుగుతున్న దోమలతో డెంగీ పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసులు అధికమవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, మలేరియా లాంటి ప్రమాదకర జ్వరాలు వ్యాపిస్తుండడంతో పల్లెలన్నీ మంచం పడుతున్నాయి. ప్రతీఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. రెండు నెలలుగా జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా పీహెచ్‌సీలతో పాటు జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రులలో ఓపీ, ఐపీ కోసం రోగులు బారులు తీరుతున్నారు. ఆగస్టు, సప్టెంబర్‌లో విజృంభణ వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అనారోగ్య వాతావరణం నెలకొంది. ఈ వాతావరణమే వైరల్ ఫీవర్ల వ్యాప్తికి కారకంగా మారుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య లోపం కారణంగానే దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో జ్వరాల ప్రభావం పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ విపరీతంగా పెరిగిపోయింది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే డెంగీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆగస్టులో 181 కేసులు, సెపె్టంబర్ (15 నాటికి)లో ఇప్పటి వరకే 422 కేసులు నమోదుతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రులు కిటకిట సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల అనధికారికంగా పదుల సంఖ్యలో డెంగీ మరణాలు నమోదు కావడంతో జ్వరం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. జ్వరం వస్తే చాలు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా రోగులు వైద్యం కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ ప్రతి రోజు 2 వేలకుపైగా నమోదవుతుండగా, ఇన్‌పేషెంట్లకు సరిౖయెన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో జ్వరాల బారినపడిన పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్లేట్లెట్స్ పేరుతో దోపిడీ డెంగీ ప్రయివేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తుంది. కరోనా తర్వాత అంతటి సంపాదన తెచ్చే అస్త్రమైంది. డెంగీ జ్వరం వచ్చిందంటే ప్లేట్లెట్స్ తగ్గడం సర్వసాధారణం. ప్లేట్లెట్స్ సాకుగా చూపుతూ ప్రయివేటు ఆసుపత్రులు పేషెంట్లను వారి బం«ధువులను భయాందోళనకు గురిచేసి సొమ్ము చేసుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకుండా ప్లేట్లెట్స్ పరీక్ష చేయడం, ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయంటూ తప్పుడు రిపోర్టులు ఇస్తూ పేషెంట్‌ను ఆసుపత్రికి పరిమితం చేస్తున్నారు. ఇక ఆంటిబయోటిక్స్, సెలాయిన్స్ పెట్టుకుంటూ రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. అవకాశం వచి్చందే తడవుగా సీజనల్ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి. డెంగీకి మెరుగైన వైద్యసేవలు అందించాలని అందుకు ఖర్చు రూ.వేలల్లో ఉంటుందని ఆసుపత్రి నిర్వాహకులు చెబుతుండడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు డబ్బులకు వెనుకాడకుండా పేదలు జేబులను గుల్ల చేసుకుంటున్నారు. రోజుకు 28 కేసులు ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రోజుకు ఒకటి లేదా రెండుకు మించి కేసులు నమోదు కాలేదు. తాజాగా సెప్టెంబరులో డెంగీ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా రోజుకు 28 కేసులు చొప్పున నమోదవడం పరిస్థితికి అద్ధం పడుతోంది. దోమల సంఖ్య పెరగడమే ఈ వైరల్, డెంగీ, మలేరియా జ్వరాలకు కారణమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. గతంతోపోలిస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలువలు, చెరువులు, కుంటలు నిండాయి. ఈ కారణం వల్ల కూడా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరీంనగర్ విషయానికి వస్తే.. చుట్టూ హారంలా జలాశయాలు, కాలువలు ఉండటంతో దోమల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఇదీ చదవండి: వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం -
ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్పవార్ కితాబిచ్చారు. ఎక్కువమంది విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించడానికి కూడా కృషి జరుగుతోందని చెప్పారు. మూడ్రోజుల రాష్ట్ర పర్యటనకు వచి్చన ఆమె సోమవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తన రాష్ట్ర పర్యటనలో భాగంగా.. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు అందించే వైద్యసేవలను తనిఖీ చేసినట్లు ఆమె చెప్పారు. 64 రకాల పరీక్షలను, 350 రకాల మందులను ఉచితంగా ఇస్తున్నారన్నారు. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను కూడా పరిశీలించినట్లు భారతీ ప్రవీణ్పవార్ చెప్పారు. ఆ కాలేజీకి 150 సీట్లను కూడా మంజూరు చేసినట్లు చెప్పారు. నిర్ణీత గడువులోగా మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తిచేయాలని సూచించానన్నారు. ఇక ‘స్పందన’ కార్యక్రమంలోనూ తాను పాల్గొన్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. కొంతమంది రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఐదు కేజీల కంటే తక్కువ బియ్యం పంపిణీ జరుగుతున్న విషయం తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. మచిలీపట్నంలో 8,912 టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయిందని.. అయితే, ఆ ప్రాంతానికి ప్రభుత్వం రోడ్లు, మంచినీరు, కరెంట్ వసతి కలి్పంచాల్సి ఉందని, డిసెంబరు నాటికి ఆయా పనులు పూర్తిచేస్తామని అధికారులు చెప్పారన్నారు. అలాగే, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేంద్రం దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ సమయంలో.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుచేస్తున్న విషయాన్ని మీడియా గుర్తుచేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా పొరుగు రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే అవకాశం ఉండదు కదా అని కేంద్రమంత్రి బదులివ్వగా.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని విలేకరులు వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో మిగిలిన రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది కదా అని కేంద్రమంత్రి వివరించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ గురించి తెలీదు ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలుచేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం గురించి తనకు పూర్తిగా అవగాహనలేదని.. వైద్య సేవలకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలతో కలిసి చాలా కార్యక్రమాలు అమలుచేస్తోందని, అవి సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న దానిపై తాను ప్రధానంగా దృష్టి పెట్టినట్లు భారతీ ప్రవీణ్పవార్ చెప్పారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి నిధులతో అమలయ్యే పథకాలలో కేంద్రానికి కూడా రాష్ట్రాలు తగిన గుర్తింపునివ్వాలని, ప్రధాని మోదీ ఫొటోను ఉంచాలని ఆమె ఆకాంక్షించారు. -
నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్స.. ప్రభుత్వ ఆసుపత్రులపై చిన్నచూపు?
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ మనోహర్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరడం వివాదాస్పదంగా మారింది. ప్రతిష్టాత్మక ఆసుపత్రికి డైరెక్టర్‌గా ఉన్న మనోహర్... తమ దవాఖానాను కాదని ప్రైవేటులో చికిత్స పొందుతుండడం చర్చనీయాంశంగా మారింది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి ప్రతిష్టను మసకబార్చే చర్యగా నిమ్స్ ఉద్యోగులతో పాటు వైద్యరంగంలోని వారు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎవరు ఏ ఆసుపత్రిలోనైనా.. మరెక్కడైనా చికిత్స పొందవచ్చు. అయితే సాక్షాత్తూ ఒక ఆసుపత్రికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తే ఆ ఆసుపత్రిని కాదని మరో చోట వైద్యసేవలు పొందడం సామాన్య ప్రజలకు అది ఎలాంటి సందేశం ఇస్తుంది? అంటూ పలువురు నిమ్స్ డైరెక్టర్ చికిత్స ఉదంతాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఉదంతాలు ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ నిమ్స్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడం చర్చకు దారి తీసింది. అయితే ఈ దఫా ఏకంగా డైరెక్టరే నిమ్స్‌ను కాదని నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించడం మరింత వివాదంగా మారింది. వ్యక్తిగత, కుటుంబ వైద్యుడు అపోలోలో పనిచేస్తుండడం వల్లనే అక్కడ చికిత్సకు వెళ్లినట్టుగా డైరెక్టర్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే గతంలో ఇలాంటి సందర్భాల్లో సదరు వ్యక్తిగత వైద్యులే నిమ్స్‌కు వచ్చి ట్రీట్మెంట్స్ ఇచ్చిన దాఖాలాలున్నాయని మరికొందరు అంటున్నారు. నిజానికి నిమ్స్ కార్డియాలజీ విభాగానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది. ఎక్కడెక్కడి నుంచో రోగులు నిమ్స్‌కు వచ్చి చికిత్స తీసుకుని కోలుకుని వెళుతుంటారు. చదవండి: హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో భారీ వర్షం ఈ పరిస్థితుల్లో సాక్షాత్తూ నిమ్స్ డైరెక్టర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం ఆసుపత్రి పేరు ప్రతిష్టలకు నష్టం కలుగజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో బుధవారం రోజంతా చర్చోపచర్చలు నడిచాయి. ఎక్కువ మంది డైరెక్టర్ చేరికను తప్పుపట్టగా కొందరు సమర్థిస్తూ కూడా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల పిల్లలు చదవకపోవడం లాంటి పోలికల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు సైతం ప్రైవేటు ఆసుపత్రుల్నే ఆశ్రయిస్తుండడం దాకా ఈ చర్చల్లో భాగమయ్యాయి. ఏదేమైనా ఈ తరహా ఉదంతాలు పునరావృతం కాకుంటే మేలని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై, ఉన్నతాధికారులపై ఉందని, వారు వ్యక్తిగత చికిత్సల కోసం ప్రభుత్వాసుపత్రులను ఎంచుకోవడం ద్వారా ప్రజలకు స్ఫూర్తిని అందించాలని అందరూ కోరుకుంటున్నారు. -
విధులు పక్కాగా.. ప్రభుత్వాస్పత్రుల ఉద్యోగులకు జాబ్‌చార్ట్
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసి వాటికి మరింత పదును పెడుతోంది. నాడు–నేడు కింద ఇప్పటికే రూ.16వేల కోట్లతో 16 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో పాటు, ప్రస్తుతమున్న ఆస్పత్రుల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పన చేపడుతున్న విషయం తెలిసిందే. అలాగే, 40 వేలకు పైగా పోస్టుల భర్తీని చేపట్టారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా పలు సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వాటి పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తూ నిర్ధేశిత జాబ్‌చార్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా బోధనాస్పత్రులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. పేషెంట్ కేర్, క్లినికల్ కార్యకలాపాలపై.. రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. వీటికి అనుబంధంగా బోధనాస్పత్రులు నడుస్తున్నాయి. స్పెషలిస్టు వైద్య సేవల కోసం రోజూ వేలాది మంది రోగులు ఇక్కడకు వస్తుంటారు. ప్రభుత్వం ఎన్ని చేస్తున్నా బోధనాస్పత్రుల నిర్వహణ, పర్యవేక్షణ, వసతులు, అందుబాటులో వైద్యులు–సిబ్బంది తదితర అంశాల్లో లోటుపాట్లు ఎదురవుతూనే ఉన్నాయి. వీటిని చక్కదిద్దడం కోసం ఆస్పత్రి నిర్వహణ, పర్యవేక్షణ విధుల్లో అసిస్టెంట్ డైరెక్టర్/డిప్యూటి డైరెక్టర్లు, ఏఓలను భాగస్వామ్యం చేస్తూ జాబ్‌చార్ట్ సిద్ధంచేస్తున్నారు. వీరిని భాగస్వామ్యులు చేయడం ద్వారా పేషెంట్ కేర్, క్లినికల్ కార్యకలాపాలపై సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంఓలు దృష్టి కేంద్రీకరించేలా చర్యలు చేపడుతున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలు మరోవైపు.. వైద్య, ఆరోగ్య శాఖలోని డీఎంఈ విభాగంలో బయోమెట్రిక్ హాజరు విధానం ఇంకా గాడినపడలేదు. ఈ విభాగంలో 15 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల వరకూ చాలామంది ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరువేయడంలో ఎన్రోల్ కాలేదు. ఈ నేపథ్యంలో.. డీఎంఈ కార్యాలయంలో ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేసి ఉన్నతాధికారులు బయోమెట్రిక్ హాజరును పర్యవేక్షిస్తున్నారు. దీనికితోడు.. ఇటీవల కాలంలో ఆస్పత్రుల్లోని సెక్యూరిటీ, శానిటేషన్, పెస్టిసైడ్ కంట్రోల్ కార్మికులను కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడంలేదన్న ఫిర్యాదులు అధికారులు, వైద్యశాఖ మంత్రికి అందాయి. దీంతో.. వీరికి కూడా ఫేషియల్ రికగ్నిషన్ హాజరును అమలుచేయనున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తరహాలో శానిటేషన్, పెస్టిసైడ్ కంట్రోల్, సెక్యూరిటీ ఉద్యోగుల నుంచి రోజూ ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు చర్యలు తీసుకుంటున్నారు. వీరందరి వివరాలు సేకరించి అంతా ఎన్రోల్ అయ్యారో లేదో అన్నది పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన వైద్య సేవలే లక్ష్యం ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఆస్పత్రుల నిర్వహణ, పర్యవేక్షణలో ప్రస్తుతమున్న లోపాలను సరిదిద్దుతున్నాం. ఆయా అధికారులు, ఉద్యోగులకు జాబ్చార్ట్లు రూపొందిస్తున్నాం. వైద్యులు, వైద్య సిబ్బంది పనివేళల్లో విధిగా ఆస్పత్రిలో అందుబాటులో ఉండాల్సిందే. ప్రతిఒక్కరూ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు వేయాల్సిందే. కుంటి సాకులతో పనివేళల్లో ఎవరైనా ఆస్పత్రుల నుంచి బయటకు వెళ్తే చర్యలు తీసుకుంటాం. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
బయోమెట్రిక్‌ను పక్కాగా అమలు చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పక్కాగా అమలుచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి విడదల రజని ఆదేశించారు. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులతో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సల సంఖ్యను ప్రభుత్వం గణనీయంగా పెంచిందని, అర్హులైన ప్రజలకు సరైన చికిత్స అందేలా చూడాలన్నారు. ఆయుష్ డిస్పెన్సరీలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అన్ని పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు ఎంటీ కృష్ణబాబు, ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య శాఖలో బోధనాస్పత్రుల పాత్ర కీలకం పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విషయంలో ప్రభుత్వ బోధనాస్పత్రుల పాత్ర కీలకమని మంత్రి విడదల రజని చెప్పారు. డీఎంఈ పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు విధుల్లో ఉండేలా చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లదేనని స్పష్టంచేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ ఏజెన్సీల పనితీరును మెరుగుపరచాలని, ఈ మూడు ఏజెన్సీల సిబ్బందికి కూడా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేయాలని చెప్పారు. -
ప్రభుత్వాసుపత్రుల్లోనే శిశు ఆధార్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ రానుంది. ఈ ప్రక్రియను త్వరలో ప్రారంభించడానికి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆధార్ ఎన్రోల్మెంట్ చేపట్టడానికి ఏరియా, జిల్లా, బోధన ఆస్పత్రులకు ట్యాబ్‌లు, ఫింగర్ ప్రింట్ స్కానర్లను సమకూర్చారు. ఆస్పత్రుల్లో పుట్టిన పిల్లలకు బర్త్ రిజిస్ట్రేషన్ తరహాలోనే శిశు ఆధార్ ఎన్రోల్మెంట్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు యూఐడీఏఐ ఓ పరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి ఆధార్ ఎన్రోల్మెంట్పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ మొదలవుతుంది. తాత్కాలిక ఆధార్ యూఐడీఏఐ ఐదేళ్ల లోపు పిల్లలకు నీలిరంగులో తాత్కాలిక ఆధార్‌ను జారీ చేస్తుంది. ఇందుకు శిశువుల బయోమెట్రిక్ డేటాతో పనిలేదు. పిల్లల ఫొటో, తల్లిదండ్రుల పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ తదితర వివరాల ఆధారంగా శిశువుకు తాత్కాలిక ఆధార్ జారీ చేస్తారు. -
ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సమర్ధంగా పర్యవేక్షించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఫోన్ నంబర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబరు 1 నాటికి రెండు వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు పత్రాలు ఇవ్వాలని, అనంతరం ప్రతి నెలా వెయ్యి గ్రామాల చొప్పున భూహక్కు పత్రాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం కావాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.3,111.92 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో మహిళల మొబైల్లో దిశ యాప్ ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ... నాడు – నేడు పనులపై స్పెషల్ ఫోకస్ ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మొదటి విడతలో 15, 715 స్కూళ్లను బాగు చేశాం. రెండో విడత కింద 22,279 స్కూళ్లలో నాడు – నేడు కింద పనులు చేపట్టాం. పనులు నాణ్యంగా ఉండేలా కలెక్టర్లు నిశిత పరిశీలన చేయాలి. అక్కడక్కడా మిగిలిపోయిన చోట్ల కూడా నెలాఖరు నాటికి అన్ని స్కూళ్లలో పనులు ప్రారంభం కావాలి. నాడు – నేడుకు సకాలంలో నిధులు అందచేస్తూ ప్రభుత్వం ఎంతో శ్రద్ధ చూపుతోంది. ప్రతి వారం జరుగుతున్న పనుల వివరాలు తెప్పించుకుని ఎక్కడైనా సమస్యలుంటే పరిష్కరించాలి. స్కూళ్ల నిర్వహణ, మరమ్మతులు (ఎస్ఎంఎఫ్), టాయిలెట్ల శుభ్రత కోసం అందుబాటులో ఉంచిన నిధులు వినియోగించుకోవాలి. ఫిర్యాదులకు ప్రత్యేక ఫోన్ నంబర్లు స్కూళ్ల నిర్వహణపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్‌ను పాఠశాలల్లో ప్రదర్శించాలి. ఈ నంబర్‌కు అందే ఫిర్యాదులను స్వీకరించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ప్రతి ఆస్పత్రి, స్కూల్లో నిర్వహణకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు ఈ నంబర్ ఉండాలి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు.. ఇలా ప్రతి చోటా ఈ ప్రత్యేక నంబర్‌ను ప్రదర్శించాలి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నాం. దీనికి సంబంధించి సంబంధిత జిల్లా కలెక్టర్, ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను కలెక్టర్లు పరిశీలించాలి. వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. నాలుగు కీలక దశలు.. అత్యంత కీలకమైన జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష కార్యక్రమం చరిత్రలో ఓ అధ్యాయాన్ని సృష్టిస్తుంది. సర్వేకు సంబంధించి ఓఆర్ఐ జనరేషన్, గ్రౌండ్ సర్వే, నోటిఫికేషన్ జారీ, జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ అనే నాలుగు కీలక దశలున్నాయి. ప్రతి అంశం ఫలానా తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిపై కలెక్టర్ల సమగ్ర పర్యవేక్షణ ఉండాలి. అంతిమంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే లక్ష్యం. వేగంగా గృహ నిర్మాణాలు.. పేదల ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం కావాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.3,111.92 కోట్లు ఖర్చు చేశాం. గృహ నిర్మాణాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. రెండో విడత కింద మంజూరైన ఇళ్ల నిర్మాణంపైనా దృష్టి సారించాలి. విశాఖలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. లేఅవుట్లలో లెవలింగ్ పనులతోపాటు కరెంట్, నీరు లాంటి కనీస వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఆప్షన్ –3 ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్లు శ్రద్ధ తీసుకుని పనులను వేగవంతం చేయాలి. పది వేలకుపైగా ఇళ్లు నిర్మిస్తున్న విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరంతోపాటు పెద్ద సంఖ్యలో నిర్మించాల్సిన ఏలూరు లేఅవుట్లపై సంబంధిత కలెక్టర్లు దృష్టి పెట్టాలి. కాలనీలు పూర్తయ్యే సమయానికి కరెంట్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను కల్పించాలి. ఇంటి పట్టాలపై పరిశీలన ఇప్పటివరకూ ఇచ్చిన ఇంటి పట్టాలపై ఒక్కసారి పరిశీలన చేయాలి. లబ్ధిదారులకు పట్టాలు అందాయా? లేవా? వారి పొజిషన్‌కు అప్పగించామా? లేదా? అన్నది అధికారులు పరిశీలించాలి. ఎక్కడైనా అలా జరగకపోతే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. స్థలంలో లబ్ధిదారుడు పట్టాతో ఉన్న ఫొటో తీసుకోవాలి. ఈ నెలాఖరు నాటికి ఈ ఆడిట్ పూర్తి చేయాలి. 90 రోజుల్లోగా ఇంటిపట్టాలు అందించే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిశీలన చేయాలి. అర్హులుగా గుర్తించిన వారికి ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో ఖాళీగా ఉన్న చోట్ల వెంటనే కేటాయించాలి. అవసరమనుకుంటే వెంటనే భూ సేకరణ చేసి వారికి పట్టాలు ఇవ్వండి. స్వాపింగ్ విధానాన్ని వినియోగించుకోండి. కుదరని చోట భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వండి. ప్రతి మహిళ మొబైల్లో దిశ యాప్ ప్రతి ఇంట్లో మహిళల మొబైల్లో దిశ యాప్ ఉండాలి. వలంటీర్, మహిళా పోలీసుల సహకారంతో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయించాలి. 15 రోజులకు ఒకసారి దిశ యాప్ పనితీరును కూడా పర్యవేక్షించాలి. ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేయడం, ఫోన్‌ను షేక్ చేయడం ద్వారా దిశ యాప్‌ను యాక్టివేట్ చేస్తూ పోలీసుల ప్రతిస్పందనను గమనించాలి. తద్వారా ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎస్పీ, కలెక్టర్, జేసీ స్ధాయిలో ఈ తరహా మాక్ట్రైల్ నిర్వహించాలి. ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఆగస్టు, సెప్టెంబరులో ఇవీ కార్యక్రమాలు ఈ నెల 25న నేతన్న నేస్తం అమలు వచ్చేనెల 22న వైఎస్సార్ చేయూత కార్యక్రమం అమలు ఎస్ఈబీ నంబర్‌తో బోర్డులు డ్రగ్స్, నార్కోటిక్స్, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టాలి. అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలపైనా దృష్టి పెట్టాలి. విద్యాసంస్థల్లో ప్రతి చోటా ఈ తరహా అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించేందుకు వీలుగా ఒక నంబర్‌ను డిస్ప్లే చేయాలి. ఈ నంబర్ అందరికీ కనిపించేలా ప్రతి కాలేజీ, యూనివర్సిటీ ముందు హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. అక్రమ మద్యం, జూదం, నార్కోటిక్స్‌కి సంబంధించిన ఫిర్యాదుల కోసం ఎస్ఈబీ నంబర్‌ను డిస్ప్లే చేయాలి. వీటిపై కఠినంగా వ్యవహరించాలి. జిల్లా కలెక్టర్, ఎస్పీ కనీసం వారానికి ఒకసారి సమావేశమై ఈ తరహా కార్యకలాపాలపై చర్చించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. వచ్చే సమావేశం నాటికి ప్రతి కాలేజీ, యూనివర్సిటీలో ఈ నంబర్‌తో హోర్డింగ్‌లు ఏర్పాటు కావాలి. -
మాత, శిశు మరణాల కట్టడికి పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మాత, శిశు మరణాల కట్టడికి వైద్య శాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది. మాత, శిశు మరణాల నమోదు, విశ్లేషణలో కచ్చితత్వం ఉండేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టిన ‘మెటర్నల్, పెరినాటల్ డెత్ సర్వేలెన్స్ అండ్ రెస్పాన్స్’ (ఎంపీసీడీఎస్ఆర్) పోర్టల్‌లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఎన్రోల్ చేశారు. ఈ పోర్టల్‌కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో డ్యాష్ బోర్డును ఏర్పాటు చేశారు. మాత, శిశు మరణాలకు సంబంధించి వివరాలు నమోదుకు ప్రతి ఆస్పత్రి, జిల్లాకు రెండు రకాల లాగిన్లు ఉంటాయి. మాతృ మరణాలకు సంబంధించి లాగిన్లు కేటాయింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 127 మాతృ మరణాలు సంభవించాయి. ఈ వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. గతంలో మాత, శిశు మరణాలు సంభవిస్తే ఆఫ్‌లైన్ విధానంలోనే నమోదు ఉండేది. వీటిపై జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఎంహెచ్వోలు మరణాలు సంభవించడానికి గల కారణాలపై సమీక్షించి.. తదుపరి ఆ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని చర్యలు తీసుకునేవారు. అయితే నూతన విధానంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సంభవించిన మాత, శిశు మరణాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలో రాష్ట్రంలో ఏ జిల్లా, మండలం, గ్రామంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నది సులువుగా తెలుసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా సంబంధిత జిల్లా అధికారులు మరణాల కట్టడిపై సమీక్షలు నిర్వహించారా లేదా అన్న అంశాలు రాష్ట్ర అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. మరణాలు యాంటేనేటల్, పోస్ట్‌నేటల్‌లో సంభవిస్తున్నాయా, మరణాలు సంభవించడానికి గల కారణాలేమిటి, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత, పౌష్టికాహారం లోపం, ఇతర కారణాలేమిటనేది సులువుగా విశ్లేషించడానికి వీలు కలుగుతోంది. ఆన్లైన్ విధానం వల్ల వివరాల నమోదు, సమాచార మార్పిడిలో గతంలో ఉండే కాలయాపన తగ్గడంతోపాటు, కచ్చితత్వం ఉండనుంది. ఏపీకి నాలుగో స్థానం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధతో ఇప్పటికే రాష్ట్రంలో మాత, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. జాతీయ సగటు కన్నా రాష్ట్రంలో తక్కువగా మరణాలు ఉంటున్నాయి. ప్రతి లక్ష ప్రసవాలకు తల్లుల మృతుల సంఖ్య 70కి మించకూడదనేది నిబంధన. అయితే, జాతీయ స్థాయిలో సగటున ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలు రేటు (ఎంఎంఆర్) 112గా ఉంది. రాష్ట్రంలో మాత్రం లక్ష ప్రసవాలకు ఇది 58గా నమోదైంది. ఈ క్రమంలో మాతృ మరణాల కట్టడిలో దేశంలోనే నాలుగో స్థానంలో మన రాష్ట్రం ఉంది. అదే విధంగా సగటున వెయ్యి ప్రసవాల్లో జాతీయ స్థాయిలో 30 మంది శిశువులు మరణిస్తున్నారు. రాష్ట్రంలో ఈ సంఖ్య 25గా ఉంది. -
ప్రమాదకర హెపటైటిస్.. మరో 18 ఆస్పత్రుల్లో వైద్యం.. వివరాలివే!
సాక్షి, అమరావతి: అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 13 ఆస్పత్రుల్లో ఈ వ్యాధికి వైద్యం అందిస్తుండగా, కొత్తగా మరో 18 వైద్య విధాన పరిషత్ ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో స్క్రీనింగ్, వైద్య సేవలకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఆస్పత్రుల్లో హెపటైటిస్ బాధితులకు వైద్యానికి జనరల్ మెడిసిన్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజీ లేదా హెపటాలజీ వైద్యుల్లో ఒకరిని ప్రత్యేకంగా నియమిస్తారు. రాష్ట్రంలో 2.3 శాతం జనాభా హెపటైటిస్ – బి, 0.3 శాతం హెపటైటిస్ – సి తో బాధపడుతున్నట్టు అంచనా. వ్యాధిని త్వరగా గుర్తించి, అరికట్టడానికి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి హెపటైటిస్ స్క్రీనింగ్ నిర్వహించాలన్నది వైద్య శాఖ లక్ష్యం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి స్క్రీనింగ్ చేశారు. 1.41 లక్షల మంది రక్త దాతలకు, 5,840 మంది ఖైదీలు, 30 వేల మంది సాధారణ ప్రజలు, 20 వేల మందికి పైగా ఎయిడ్స్ బాధితులకు స్క్రీనింగ్ చేశారు. వీరిలో 1,500 మందికి పైగా హెపటైటిస్ బి, సి వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది. హై రిస్క్ వర్గానికి చెందిన హెచ్ఐవీ రోగులకు 45 యాంటీ రిట్రోవల్ థెరఫీ (ఏఆర్టీ) సెంటర్లలో స్క్రీనింగ్, వైద్య సేవలు అందిస్తున్నారు. దేశంలో హెచ్ఐవీ బాధితులకు హెపటైటిస్ స్క్రీనింగ్, వైద్య సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీకి ఘనత దక్కింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అవార్డు సైతం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు వచ్చింది. హైరిస్క్ వర్గాల వారికి టీకా హెపటైటిస్ బీ వ్యాధి నియంత్రణకు టీకా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే వైద్య శాఖలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది లక్ష మందిలో 99 శాతం మందికి తొలి డోసు టీకా ఇచ్చారు. 95 శాతం మందికి రెండో డోసు, 89 శాతం మందికి మూడో డోసు పూర్తయింది. హైరిస్క్ వర్గానికి చెందిన హెచ్ఐవీ బాధితులు, సెక్స్‌వర్కర్లు, ఇంజెక్షన్ల ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకునే 2 లక్షల మందికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి హెపటైటిస్ బి, సి కాలేయంపై ప్రభావం చూపుతాయి. అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి. వ్యాధి పట్ల అవగాహనతో నియంత్రణ సాధ్యం అవుతుంది. రక్తమార్పిడి, సురక్షితం కాని శృంగారం, సిరంజుల ద్వారా ఇవి సోకుతాయి. తల్లి నుంచి బిడ్డకు హెపటైటిస్ బి సోకుతుంది. ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ బి ఉంటే కుటుంబ సభ్యులు అందరూ స్క్రీనింగ్ చేయించుకోవాలి. గర్భిణులు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. తద్వారా బిడ్డకు వ్యాధి సోకకుండా నియంత్రించవచ్చు. – డాక్టర్ ఎస్.నూర్‌బాషా, గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ -
ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరిచాం: హరీష్ రావు
దూద్‌బౌలి: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి పరిచామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మిల్క్ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తల్లిపాలు లభించని వారికి మిల్క్ బ్యాంకులు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుప్రతుల్లో 55 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం 20 శాతం సాధారణ ప్రసవాలు, 80 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వైద్య సేవలను అందించడంలో దేశంలో మూడో స్థానంలో ఉందని చెప్పారు. పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు అందిస్తున్న సేవలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాప పుట్టిన అనంతరం కొందరు కిందిస్థాయి సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని ఓ పాప తల్లి ఫిర్యాదు చేయగా... అలాంటివి జరగకుండా చూసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చుపెడతామన్నారు. ఏ సమస్యలున్నా..డీఎంఈ ద్వారా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని మంత్రి హరీష్‌రావు హమీ ఇచ్చారు. ఓపీ, ఇతర వార్డుల్లో తిరిగి ఆసుపత్రిలో అందుతున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పేట్లబురుజు ఆసుపత్రిలోని మహిళలకు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి పసుపు బొట్టు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి, పేట్లబురుజు ఆసుప్రతి సూపరింటెండెంట్ పి.మాలతి, ఆర్ఎంఓ సి.పి.జైన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: నిజామాబాద్‌లో హోల్‌సేల్ చేపల మార్కెట్! -
ప్రసవాలన్నీ ఆస్పత్రుల్లోనే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి చేరుకునే వరకూ అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకూ రాష్ట్రంలో 1,51,419 ప్రసవాలు జరగ్గా ఇందులో ఏకంగా 99.99 శాతం అంటే 1,51,405 ప్రసవాలు ఆస్పత్రుల్లోనే చేశారు. కేవలం 0.01 శాతం మాత్రమే ఆస్పత్రుల బయట జరిగాయి. వీటిని కూడా అధిగమించి వందకు వంద శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగేలా వైద్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలుండగా కాకినాడ (99.98), అల్లూరి సీతారామరాజు (99.82), శ్రీ సత్యసాయి (99.78), చిత్తూరు (99.98) మినహా మిగిలిన 22 జిల్లాల్లో వందకు వంద శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగాయి. 46.19 శాతం ప్రభుత్వాస్పత్రుల్లో.. ఒకప్పుడు మొత్తం ప్రసవాల్లో 30–35 శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లో ఉండేవి. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. దీంతోపాటు అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ చేపట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం జరిగితే కలిగే ప్రయోజనాలపై ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకూ జరిగిన ప్రసవాల్లో 46.19 శాతం అంటే 69,932 ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగాయి. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వంద శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే చేపట్టారు. పార్వతీపురం మన్యంలో 85.11 శాతం, అనకాపల్లిలో 75.12 శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే నిర్వహించారు. మెరుగైన వైద్య సేవలే లక్ష్యం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను మరింత పెంచేందుకు కృషిచేస్తున్నాం. పీహెచ్‌సీల్లో ప్రసూతి సేవలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే అసలు ప్రసవాలే చేయని పీహెచ్‌సీలను గుర్తించాం. వాటిలో ప్రసవాలు చేసేలా చర్యలు చేపట్టాం. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీల్లో లేబర్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన వాటిల్లో పనులు నడుస్తున్నాయి. – జె.నివాస్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
సురక్షితంగా.. సౌకర్యవంతంగా...
గత నెల ఒకటో తేదీన విజయవాడ రైల్వేస్టేషన్లో ఎస్.కె.అమీనాకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. ఆ కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. విజయవాడ పాత జీజీహెచ్‌కు అమీనాను తరలించింది. వైద్యులు అమీనాకు ప్రసవం చేశారు. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం 11వ తేదీ ఆస్పత్రి నుంచి అమీనాను డిశ్చార్జి చేశారు. అమీనాది వైఎస్సార్ జిల్లా కడప నగరం యానాది కాలనీ. ఈ క్రమంలో ఇంటికి వెళ్లాలంటే 400 కి.మీ మేర ప్రయాణించాల్సిన పరిస్థితి. ప్రైవేట్ ట్యాక్సీ అద్దెకు తీసుకుని వెళ్లాలంటే సుమారు రూ.10వేల మేర వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమీనాకు ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనం అండగా నిలిచింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాహనంలో బాలింత అమీనా ఆమె బిడ్డను వైద్యశాఖ క్షేమంగా ఇంటికి తరలించింది. సాక్షి, అమరావతి: ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల రూపంలో అండగా నిలుస్తోంది. ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మెరుగు పరిచింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించింది. దీంతో గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతోంది. రోజుకు 700 మంది.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదికి 3 లక్షల మేర ప్రసవాలు చేస్తుంటారు. ఏప్రిల్‌కు ముందు కేవలం 279 వాహనాలే అందుబాటులో ఉండేవి. డిశ్చార్జ్ సమయంలో బాలింతలకు వాహనాలు అందుబాటులో ఉండేవి కాదు. దీంతో సొంత డబ్బు ఖర్చు పెట్టి బస్సు, ఆటోలు, ట్యాక్సీల్లో ఇళ్లకు వెళ్లేవారు. ఏప్రిల్ నుంచి 500 వాహనాలతో సేవలను విస్తరించారు. ప్రస్తుతం రోజుకు సగటున 700 మంది బాలింతలను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళుతున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68,252 మంది బాలింతలు ఈ సేవలను వినియోగించుకున్నారు. తల్లులు, బిడ్డల రక్షణ, భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటోంది. ఫిర్యాదుల స్వీకారం.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులపై ఫిర్యాదులను వైద్య శాఖ స్వీకరిస్తోంది. టోల్ ఫ్రీ నెంబర్ 104 ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. గత నెల నుంచి ఫిర్యాదుల స్వీకారం ప్రారంభించగా..ఇప్పటికి 18 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిని సకాలంలో వైద్య శాఖ పరిష్కరించింది. కాగా.. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకునేంత వరకూ అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రసవానంతరం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద తల్లికి విశ్రాంతి సమయానికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం చెల్లిస్తున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల్లో వచ్చిన మార్పులు ఇలా ఏప్రిల్‌కు ముందు వరకు.. ► 279 వాహనాలు ► ఇరుకైన మారుతీ ఓమినీ వాహనం ► ఏసీ సౌకర్యం ఉండదు ► ట్రిప్‌కు ఇద్దరు బాలింతల తరలింపు ఏప్రిల్ నెల నుంచి.. ► 500 వాహనాలు ► విశాలమైన మారుతీ ఈకో వాహనం ► ఏసీ సౌకర్యం ఉంటుంది ► ట్రిప్‌కు ఒక బాలింత మాత్రమే తరలింపు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తొమ్మిదో తేదీ కేజీహెచ్‌లో ప్రసవించాను.ఆస్పత్రి నుంచి మా గ్రామం 200 కి.మీ దూరం. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి చేర్చారు. – సి.గంగోత్రి, గుమ్మలక్ష్మిపురం, విజయనగరం జిల్లా -
ప్రభుత్వాస్పత్రుల్లో షిఫ్టుల వారీగా బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరును షిఫ్టుల వారీగా వేయాలని వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా ఆస్పత్రులూ, సంస్థల బాధ్యులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కొద్ది నెలలుగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే 24/7 పనిచేసే ఆస్పత్రుల్లో ఉద్యోగుల హాజరు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాటిలో ఆస్పత్రులు, ఇతర సంస్థల్లో బయోమెట్రిక్ హాజరు 3 షిఫ్ట్‌ల ప్రకారం సవరించి, డ్యూటీ రోస్టర్‌ను సంబంధిత హెల్త్ కేర్ ఫెసిలిటీ హెడ్ సిద్ధం చేయాలని సూచించారు. అలర్ట్ మెకానిజం కూడా అభివృద్ధి చేసి సంబంధిత ఉద్యోగులకు ఆబ్సెంట్ మెసేజ్‌లను ఎప్పటికప్పుడు ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపనున్నారు. వచ్చే ఆగస్టు నుంచి బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు జమ చేయాలని ఆదేశాలిచ్చారు. -
వ్యసన విముక్తి కేంద్రాలను బలోపేతం చేయాలి
నెహ్రూ నగర్ (గుంటూరు ఈస్ట్): ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన వ్యసన విముక్తి (డీ అడిక్షన్) కేంద్రాలను బలోపేతం చేయాలని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. మంగళవారం గుంటూరుకు విచ్చేసిన ముఖ్యమంత్రిని కలిసి ఆయన ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 50 పడకల డీ–అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో బహిరంగ మద్య సేవనాన్ని పూర్తిగా నిర్మూలించాలని, అన్ని టోల్గేట్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నిర్మూలించాలని కోరారు. ఇందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తూ ఈ అంశాలపై సరైన చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ కార్యదర్శి ముత్యాలరాజును ఆదేశించారు. -
నెలలో ఓ రోజు ఆసుపత్రిలో నిద్రిస్తా: మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘క్షేత్రస్థాయిలోని సమస్య లు తెలుసుకునేందుకు, తక్షణం పరిష్కరించి ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రతినెలా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ను తప్పనిసరిగా సందర్శించాలి. నెలలో ఒకరోజు రాత్రి పీహెచ్‌సీల్లో నిద్ర చేయాలి. నేను కూడా ఓ రోజు నిద్ర చేస్తాను’ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నెలవారీ సమీక్షలో భాగంగా పీహెచ్‌సీల పనితీరు, పురోగతిపై ఆదివారం ఆయన అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌ౖ వైజరీ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఎన్సీడీ స్క్రీనింగ్, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సి–సెక్షన్ల రేటు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్, గర్భిణులకు అందుతున్న ఇతర సేవలు, ఓపీ, టీబీ, టి–డయాగ్నొస్టిక్, ఐహెచ్ఐపీ తదితర వైద్యసేవలపై జిల్లాలు, పీహెచ్‌సీలవారీగా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ తాజాగా విడుదలైన కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం.. శిశు మరణాల రేటు 23 నుంచి 21కి తగ్గిందని, 2014లో ఇది 39 ఉండేదన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరగటం, కేసీఆర్ కిట్లు, ఆరోగ్యలక్ష్మీ, 102 వాహన సేవలు, మారుమూల ప్రాంతాలకు సైతం మెటర్నిటీ సేవలు విస్తరించడం, ప్రత్యేకంగా చిన్నపిల్లలకు ఆరోగ్యకేంద్రాల ఏర్పాటు వంటి వి శిశు మరణాలరేటు తగ్గుదలకు దోహదం చేశాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 60 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, ఇవి చాలావరకు తగ్గాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అనవసర సిజేరియన్లు జరగకుండా చూడాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిపై మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో అన్ని పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 24 గంటలు నడిచే పీహెచ్‌సీలు అత్యవసర సేవలను అన్నివేళల్లో అందించాలని ఆదేశించారు. అన్ని వివరాలను ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాంలో అప్లోడ్ చేయాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు శ్వేతామహంతి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్‌ఎంసీఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘బయోమెట్రిక్’ లెక్కనే జీతాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరుపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. వైద్యులు నిత్యం ఆస్పత్రులకు వచ్చేలా, సకాలంలో హాజరయ్యేలా చూడాలని.. జీతాలు ఇవ్వాలంటే బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బయోమెట్రిక్ హాజరు సరిగా లేని వైద్యులు, సిబ్బందికి నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు ఉన్నా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు వ్యవస్థలు ఉన్నప్పటికీ సరిగా అమలు చేయడం లేదు. వైద్యులు, సిబ్బంది కూడా బయోమెట్రిక్‌ను పట్టించుకోవడం లేదు. కొన్నిచోట్ల సదరు పరికరాలను పాడుచేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇక నుంచి ఏరియా, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లోనూ బయోమెట్రిక్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి, బయోమెట్రిక్ హాజరు ప్రకారమే జీతాలు ఇవ్వనుంది. ఎక్కడైనా వైద్య సిబ్బంది సకాలంలో హాజరుకాకున్నా, చెప్పాపెట్టకుండా గైర్హాజరైనా ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని కరీంనగర్, గజ్వేల్‌లలోని జిల్లా ఆస్పత్రుల్లో పలువురు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు సకాలంలో హాజరుకాకపోవడంతో కమిషనర్ అజయ్‌కుమార్ నోటీసులు జారీచేశారు. నల్లగొండ మెడికల్ కాలేజీలో 57 మంది అధ్యాపకులకు కూడా నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం నాయకులు అక్కడికి వెళ్లి పరిస్థితిని ఆరా తీశారు. కక్షగట్టి నోటీసులు ఇచ్చారని ఆందోళన చేయడంతో చివరికి నోటీసులను వెనక్కు తీసుకున్నారు. కొన్నిచోట్ల స్థానిక సూపరింటెండెంట్లు, కాలేజీల ప్రిన్సిపాల్లు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వైద్యులు ఆరోపిస్తుండటం గమనార్హం. ఆకస్మిక తనిఖీలు కూడా.. పేదలకు వైద్యాన్ని చేరువ చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల దాకా అన్నిచోట్లా మెరుగైన వసతులు కల్పిస్తూనే, వైద్యులు, సిబ్బంది సరిగా హాజరయ్యేలా చూడాలని నిర్ణయించింది. వైద్యులు సకాలంలో హాజరయ్యేలా చూడాలని సంబంధిత అధిపతులకు సూచించింది. ‘‘ఉన్నతాధికారులు వారంలో మూడు రోజులు జిల్లాలకు వెళ్లాలి. ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి. సకాలంలో హాజరుకాని వారిపైనా, అనధికారిక గైర్హాజరుపైనా చర్యలు తీసుకోవాలి. పరిస్థితిని చక్కదిద్దాలి’’ అని ఇటీవల వైద్యారోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు జిల్లాలకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపరుస్తున్నారు. వచ్చిన రెండు నెలల్లోనే వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ 20 జిల్లాల్లో పర్యటించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉదయం 8 గంటలకే ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఇలా ఉన్నతాధికారుల తనిఖీలతో వైద్య సిబ్బందిలో భయం నెలకొందని అంటున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కూడా వరుసగా జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులపై సమీక్ష చేస్తున్నారు. మొత్తం అన్ని ఆస్పత్రులపైనా నెలవారీ సమీక్ష కేలండర్ చేపట్టి.. వైద్య సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్న వైద్యు లు, దూర ప్రాంతాల నుంచి వచ్చిపోయేవారు మాత్రం బయోమెట్రిక్ హాజరుపై ఆగ్రహంగా ఉన్నారని వైద్యారోగ్య సిబ్బంది చెప్తున్నారు. -
సర్కారు ఆస్పత్రుల్లో నిరంతర వైద్యం
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అడ్డన్నదే ఉండదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడంలో వెనకడుగే వేయడంలేదు. ఇందుకు ఉదాహరణే ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (పీహెచ్సీ)లు. గ్రామీణ, పేద ప్రజలకు అందుబాటులో ఉండే పీహెచ్‌సీలు నాణ్యమైన సేవలందించడం చరిత్రలో ఇదే తొలిసారి. అదీ ఇరవై నాలుగ్గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి పేదలకు సేవలందిస్తున్నారు. ఇది గతానికి భిన్నం. గతంలో పీహెచ్సీ అంటే గ్రామీణ, పేద ప్రజలకు చేరువలో ఉన్నవైనప్పటికీ, సేవల్లో మాత్రం నాసిరకం. వైద్యులు, సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండే వారు కాదు. ఆసుపత్రి పరిసరాలు కాసేపు నిలబడటానికి కూడా దుర్లభంగా ఉండే పరిస్థితి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిలో పెద్ద మార్పే తెచ్చింది. మంచి వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఆసుపత్రిలో మంచి వాతావరణం కల్పించింది. ఇరవై నాలుగ్గంటలూ ప్రజలకు వైద్య సేవలందిస్తోంది. రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలలో మారిన ఈ దృశ్యాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ‘రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్(ఆర్హెచ్ఎస్) 2020–21’ కళ్లకు కట్టింది. మరో రెండు చిన్న రాష్ట్రాలు మినహా దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఈ విధమైన సేవలు అందడంలేదని వెల్లడించింది. ఆ నివేదిక సారాంశమిదీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 1,142 పీహెచ్‌సీలు వంద శాతం 24/7 పని చేస్తున్నాయి. 99.3 శాతం పీహెచ్‌సీల్లో లేబర్ రూమ్ సౌకర్యం ఉంది. 98.9 శాతం పీహెచ్‌సీల్లో ఆపరేషన్ థియేటర్ ఉంది. కనీసం 4 పడకలున్నవి 98.1%. వీటిలో వసతులకూ కొరత లేదు. 2021 మార్చి నాటికి సిక్కిం, అండమాన్ నికోబార్ వంటి చిన్న రాష్ట్రాల్లో మాత్రమే వంద శాతం పీహెచ్‌సీలు 24/7 పనిచేస్తున్నాయి. దక్షిణాదిలోని తెలంగాణలో 49.4%, కర్ణాటకలో 41.1, తమిళనాడులో 92.5%, కేరళలో 81.7% పీహెచ్‌సీలు మాత్రమే 24/7 సేవలు అందిస్తున్నాయి. పీహెచ్‌సీల్లో వంద శాతం కంప్యూటర్ సౌకర్యం కల్పించిన జాబితాలో ఏపీ, గోవా, సిక్కిం, రాజస్తాన్, తెలంగాణ ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రంలోని 141 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (సీహెచ్సీలలో) కనీసం 30 పడకలు, లేబొరేటరీ, వినియోగంలో ఉన్న ఆపరేషన్ థియేటర్లు, లేబర్ రూమ్, న్యూ బార్న్ కేర్ యూనిట్, రెఫరల్ ట్రాన్స్పోర్ట్, సాధారణ అనారోగ్యాలకు అల్లోపతిక్ మందులు ఉన్నాయి. అన్ని సీహెచ్‌సీ, పీహెచ్సీలలో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. పెరిగిన వైద్యులు, వైద్య సిబ్బంది 2019–20తో పోలిస్తే పీహెచ్సీలలో వైద్యుల సంఖ్యా పెరిగింది. 1,142 పీహెచ్‌సీల్లో 2019–20లో 1,798 మంది వైద్యులు ఉండగా.. 2020–21లో వైద్యుల సంఖ్య 2,001కి పెరిగింది. అదే విధంగా 141 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 2020లో స్పెషలిస్ట్ వైద్యులు 315 మంది ఉండగా 2021లో 322కు చేరారు. గిరిజన ప్రాంతాల్లోనూ వైద్య సేవలు గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రాథమిక వైద్య సేవలు నిరంతరం అందుతున్నాయి. రాష్ట్రంలో గిరిజన జనాభా 22.58 లక్షలుగా ఉంది. వీరి కోసం గిరిజన ప్రాంతాల్లో 752 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ అవసరం కాగా 822 ఉన్నాయి. 112 పీహెచ్‌సీలు ఉండాలి. కానీ అంతకంటే ఎక్కువగా 159 ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 1,593 మంది ఏఎన్ఎంలు, పీహెచ్‌సీల్లో 278 మంది పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. దేశ సగటుకన్నా తక్కువ మాత, శిశు మరణాల కట్టడికి సీఎం వైఎస్ జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. శిశు మరణాల రేటు (ఐఎంఆర్)లో దేశ సగటుకన్నా రాష్ట్ర సగటు తక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యి జననాలకు సగటున 30 శిశు మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 25 మరణాలు ఉంటున్నాయి. జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 34 మరణాలు ఉండగా రాష్ట్రంలో 28గా ఉంది. జాతీయ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో 20గా ఉండగా రాష్ట్రంలో 19గా ఆ నివేదిక పేర్కొంది. -
పనులు చకచకా
పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని బొబ్బిలి సామాజిక కేంద్రంలో 30 పడకలు ఉన్నాయి. ఆరు మండలాల పేద రోగులు ఇక్కడికి వస్తుంటారు. పాత భవనంలో అరకొర వసతులతో ఆస్పత్రి నడిచేది. ఈ పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నాడు–నేడు కింద ఆస్పత్రి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలోని ఓపీ బ్లాక్ పాత భవనాన్ని కూల్చి రూ.3.36 కోట్లతో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వం ఇక్కడ నూతన భవనాన్ని నిర్మించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన నూతన భవనంలో ఓపీ, ల్యాబ్, సర్జికల్, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. వసతులు మెరుగుపడటంతో ఆస్పత్రికి వచ్చే రోగుల తాకిడి పెరిగింది. రోజుకు సగటున 250 నుంచి 300 వరకూ ఓపీలు ఉంటున్నాయి. నూతన భవనంపై మరో అంతస్తు నిర్మించి జనరల్ వార్డుతోపాటు, ఇతర వసతులు కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. సాక్షి, అమరావతి: నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), ప్రాంతీయ ఆస్పత్రుల(ఏహెచ్)లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వీటిలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 ఏహెచ్‌లు, 177 సీహెచ్‌సీలు ఉండగా.. వీటిలో 11,380 పడకలు ఉన్నాయి. టీడీపీ పాలనలో ఆస్పత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. పెరుగుతున్న రోగుల తాకిడికి అనుగుణంగా ఆస్పత్రులు అప్‌గ్రేడ్ కాకపోవడం, వసతులు అరకొరగా ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదలకు ప్రభుత్వ రంగంలో ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో నాడు–నేడు కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీంతో సీహెచ్‌సీ, ఏహెచ్‌ల రూపురేఖలు మారుతున్నాయి. రూ.1,223 కోట్లు వెచ్చించి.. రాష్ట్రవ్యాప్తంగా 45 ఏహెచ్‌లు, 121 సీహెచ్‌సీలు, 2 ఎంసీహెచ్/సీడీహెచ్‌లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,223.28 కోట్లను వెచ్చిస్తోంది. ఏపీ వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో నాడు–నేడు పనులు చేపట్టారు. మూడు ప్యాకేజీలుగా పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెలకు సగటున రూ.60 కోట్లకు పైగా విలువైన పనులు జరుగుతున్నాయి. ఆస్పత్రుల అభివృద్ధిలో భాగంగా పలుచోట్ల ఉన్న భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు. మరికొన్నిచోట్ల నూతన భవనాలు నిర్మిస్తున్నారు. ప్రతి ఆస్పత్రిలో అన్ని వసతులతో ఓపీ బ్లాక్, లేబర్ వార్డు, పోస్టుమార్టం యూనిట్, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను అభివృద్ధి చేస్తున్నారు. మూడు దశలుగా వచ్చే డిసెంబర్ నాటికి ఈ పనులన్నిటినీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి 59 ఆస్పత్రులు, అక్టోబర్ నెలాఖరు నాటికి మరో 69, డిసెంబర్ నెలాఖరు నాటికి మిగిలిన 40 ఆస్పత్రుల్లో నిర్మాణాలను పూర్తి చేస్తారు. సకాలంలో పూర్తి చేయకుంటే పెనాల్టీలు ఆస్పత్రుల్లో చేపట్టే పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లేకుండా చూస్తున్నాం. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు పెనాల్టీలు విధిస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పనులన్నీ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంన్నాం. పనుల నాణ్యతలో రాజీపడటం లేదు. డిసెంబర్‌లోగా మొత్తం పనులు పూర్తి చేస్తాం. – డి.మురళీధర్‌రెడ్డి, ఎండీ అండ్ వైస్‌చైర్మన్, ఏపీ ఎంఎస్ఐడీసీ ఆస్పత్రి మెరుగుపడింది నాడు–నేడు కింద బొబ్బిలి ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. గతంతో పోలిస్తే ఆస్పత్రిలో చాలా మార్పు వచ్చింది. వసతులు మెరుగుపడ్డాయి. గతంలో ఆస్పత్రిలోకి అడుగు పెట్టాలంటేనే అపరిశుభ్రత వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. వాతావరణం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రైవేట్ ఆస్పత్రులకన్నా బొబ్బిలి ఆస్పత్రి మెరుగ్గా ఉంది. – రేజేటి ఈశ్వరరావు, బొబ్బిలి -
మధుమేహం, నొప్పుల మాత్రల అత్యధిక వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జంటజబ్బులు మధుమేహం, రక్తపోటు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగిస్తున్న మందులే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 2021–22లో మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే మెట్ఫార్మిన్ మాత్రలు ఏకంగా 18.10 కోట్లు వినియోగించారు. రక్తపోటు బాధితులు వాడే అటెనోలాల్ 10.72 కోట్లు, ఆమ్లోడిపైన్ 9.45 కోట్లు చొప్పున వినియోగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అటెనోలాల్ మాత్రల వినియోగం 2020–21తో పోలిస్తే 4.15 కోట్ల మేర పెరిగింది. ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగమైనవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో వినియోగించిన వారు ఉంటారు. కరోనా వైరస్ సోకిన కొందరిలో వైరస్ ప్యాంక్రియాస్ (క్లోమం)పై దాడిచేయడం, చికిత్స సమయంలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ వాడటం కారణంగా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మధుమేహం మాత్రల వినియోగం పెరగడానికి మారుతున్న జీవనశైలికి తోడు కరోనా కూడా ఓ కారణం అయి ఉండొచ్చని వారు విశ్లేషిస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా 2021–22లో ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరాకు ప్రభుత్వం రూ.410 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచింది. డబ్ల్యూహెచ్‌వో, గుడ్ మాన్యుఫ్యాక్ఛరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) నిబంధనలకు లోబడి 480 రకాల మందులు ఆస్పత్రుల్లో ఉంటున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో 229 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉండేవి. రెండో స్థానంలో పెయిన్ కిల్లర్ మాత్రలు ప్రభుత్వాస్పత్రుల్లో మధుమేహం మాత్రల వినియోగం అనంతరం రెండో స్థానంలో పెయిన్ కిల్లర్ మాత్రలు నిలిచాయి. నొప్పి నివారణకు వాడే డైక్లోఫినాక్ మాత్రలు 17.65 కోట్లు వినియోగించారు. 2020–21లో మూడోస్థానంలో ఉన్న ఈ మాత్రల వినియోగం 2021–22లో రెండోస్థానానికి పెరిగింది. అదేవిధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్నపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు సూచనలున్నా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పారాసిట్మల్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గడిచిన రెండేళ్లలో ఈ మాత్రలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. అయితే కరోనా తొలిదశ వ్యాప్తితో పోలిస్తే రెండోదశలో పారాసిట్మల్ మాత్రల వినియోగం ప్రభుత్వాస్పత్రుల్లో కొంతమేర తగ్గింది. 2020–21లో 18 కోట్ల మాత్రలు వినియోగించగా... 2021–22లో 16.78 కోట్లు వినియోగించారు. -
ప్రభుత్వ వైద్యం.. పల్లెల దైన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతా ల్లో ప్రభుత్వ వైద్యం అంతంతే అందుతోంది. జనాభా పెరుగుతున్నా ఆ మేరకు వైద్య సేవలు విస్తృతం కావట్లేదు. పల్లెల్లో అనుకున్నంత సంఖ్యలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) అందుబాటులో లేవు. ఈ వివరాలన్నింటినీ కేంద్ర ఆరో గ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన దేశంలో ‘గ్రామీణ వైద్య గణాంకాలు 2020– 21’లో వెల్లడించింది. ఇందులో రాష్ట్రాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవల తీరును ప్రస్తావించింది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు పెరగాలి గ్రామీణ జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలో 721 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవసరం ఉండగా ప్రస్తుతం 636 మాత్రమే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాజిక ఆరోగ్య కేంద్రాలు 180 అవసరం ఉండగా 85 మాత్రమే కొనసాగుతున్నాయంది. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంజూరు చేసిన పోస్టుల కంటే పనిచేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని చెప్పింది. సిబ్బంది సంఖ్య కూడా మరింత పెరగాలని, గ్రామీణ వైద్య సేవలు మెరుగు పడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో 33 జిల్లాలున్నాయి. వీటి పరిధిలో 5 వేల ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఇవి 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కొనసాగుతున్నాయి. వీటితో పాటు 95 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 37 సబ్ డివిజినల్ ఆస్పత్రులు, 5 జిల్లా ఆస్పత్రులున్నాయి. గ్రామీణ ఆస్పత్రుల పరిస్థితి ఇలా.. ♦రాష్ట్రంలోని 5 జిల్లా ఆస్పత్రుల్లో 319 వైద్యుల పోస్టులు ప్రభుత్వం మంజూరు చేయగా 266 మంది డాక్టర్లే పని చేస్తున్నారు. సబ్ డివిజినల్ ఆస్పత్రుల్లో 1,421 వైద్యుల పోస్టులకు 681 మందే విధుల్లో ఉన్నారు. 85 గ్రామీణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జనరల్ సర్జన్లు, గైనకాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లు, పీడియాట్రీషియన్లు కలుపుకొని మొత్తం 625 స్పెషలిస్టు పోస్టులు మంజూరవగా 367 ఖాళీగా ఉన్నాయి. వీటిలో 53 మంది జనరల్ సర్జన్లు, 141 మంది గైనకాలజిస్టులు, 49 మంది జనరల్ ఫిజీషియన్లు, 124 మంది పిల్లల వైద్యుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. సీహెచ్‌సీల్లో 219 అనస్థటిస్ట్ పోస్టులకు 126.. అలాగే 44 కంటి వైద్యుల పోస్టులకు 19 భర్తీ కాలేదు. ♦సీహెచ్‌సీల్లో జనరల్ డ్యూటీ వైద్యులకు సంబంధించి ఆయుష్ కేటగిరీలో 29 ఖాళీలు, అల్లోపతిలో 122 ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం ఒక్కొక్కరు చొప్పున స్పెషలిస్టు ఆయుష్ వైద్యులను నియమించాల్సి ఉండగా ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. ♦ఆరోగ్య ఉప కేంద్రాలకు 8,996 ఏఎ¯న్ఎం పోస్టులు మంజూరు చేస్తే 1,053 ఖాళీగా ఉన్నాయి. పురుషుల కేటగిరీలో 1,911 ఆరోగ్య కార్యకర్తల పోస్టులను 689 నింపాల్సిఉంది. ♦పీహెచ్‌సీల్లో 1,254 మంది అల్లోపతి వైద్య పోస్టులకు 41 ఖాళీగా ఉన్నాయి. ఆయుష్ వైద్యుల పోస్టులు 394 మంజూరవగా 151 భర్తీ కాలేదు. ♦పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు 2,412 నర్సుల పో స్టులు మంజూరవగా 336 ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఆస్పత్రుల్లో పారామెడికల్ పోస్టులు 869 మంజూరవగా 708 మాత్రమే భర్తీ చేశారు. ప్రాంతీయ ఆస్పత్రుల్లో 1,217 పోస్టులకు 979 మాత్రమే భర్తీ అయ్యాయి. -
వైద్య శాఖలో బయోమెట్రిక్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండేలా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రతి ఒక్క ఉద్యోగికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది. దీంతో బయోమెట్రిక్ హాజరు విధానం రోజురోజుకు గాడినపడుతోంది. ప్రజారోగ్య విభాగం పరిధిలో 1,690, వైద్య విధాన పరిషత్ పరిధిలో 277, డీఎంఈ పరిధిలో 54 ఆస్పత్రులు, ఇతర సంస్థలున్నాయి. ఈ విభాగాల్లో 49,805 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రజారోగ్య విభాగంలో 65 శాతం, వైద్య విధాన పరిషత్‌లో 80%, డీఎంఈలో 60 శాతానికిపైగా ఉద్యోగులు రోజూ బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 100% ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేసేలా చర్యలు చేపట్టారు. బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులో లేని చోట వెంటనే వాటిని సరఫరా చేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఆస్పత్రులు, డీఎంహెచ్‌వో, ఆర్డీ కార్యాలయాలు, ఇతర సంస్థల వారీగా మొత్తం ఉద్యోగుల వివరాలు రాబడుతున్నారు. అనంతరం ఈ సమాచారాన్ని మాస్టర్ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించాలని యోచిస్తున్నారు. విధులకు గైర్హాజరు కాకుండా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ సహా 12 మంది సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేస్తూ గతేడాది ఉత్తర్వులు ఇచ్చింది. పీహెచ్‌సీలవారీగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల వివరాలు సేకరించి సిబ్బంది కొరతకు తావివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అవసరం లేకున్నా ఏదో ఒక సాకుతో జిల్లా, ఆర్డీ కార్యాలయాలకు వెళ్తున్నట్టు చెప్పి విధులకు గైర్హాజరు అవుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా పెదకాకాని పీహెచ్సీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దీంతో ఇలాంటివి ఎక్కడా పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. నెలలో ఒక నిర్ణీత రోజు మాత్రమే ఆస్పత్రి పని మీద జిల్లా కార్యాలయానికి వెళ్లాలని పీహెచ్సీ సిబ్బందిని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ నివాస్ ఆదేశించారు. -
పుష్కలంగా మందులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల అవసరాలకు సరిపడా ఔషధాలు, వైద్య పరికరాలు సమృద్ధిగా ఉన్నాయని ఏపీ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ డి. మురళీధరరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మందులు, సర్జికల్స్ కోసం రూ.2,250 కోట్లు వెచ్చించిందన్నారు. దీంతోపాటు గత ప్రభుత్వ బకాయిలు రూ.160 కోట్లను సైతం చెల్లించిందన్నారు. ‘మందులు లేవాయే’ శీర్షికతో ఈనాడు పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉందని ఆయన ఖండించారు. నవరత్నాలు, నాడు–నేడు పథకాలతో రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు వాటి బలోపేతం దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజారోగ్య రక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. మందుల రకాలు 480 వరకు పెంపు రాష్ట్రంలో మే 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం కేవలం 229 రకాల మందులను మాత్రమే అందుబాటులో ఉంచేదని.. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ సంఖ్యను 480కు పెంచినట్లు ఆయన తెలిపారు. అప్పట్లో సరఫరాదారులకు చెల్లింపుల్లో కూడా తీవ్రజాప్యం జరిగేదని గుర్తుచేశారు. ఫలితంగా మందుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడేదన్నారు. ఇక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆస్పత్రుల్లో రోగుల అవసరాలు, డిమాండ్ కంటే ఆంధ్రప్రదేశ్ పెద్ద మొత్తంలోనే మందులు, సర్జికల్స్ కొనుగోలు చేస్తోందని మురళీధరరెడ్డి స్పష్టంచేశారు. ఇందులో భాగంగా 2021–22లో రూ.254 కోట్లతో కొనుగోళ్లు చేశామన్నారు. అవసరానికి తగ్గట్లుగా సరఫరా ఇక మధుమేహం, రక్తపోటు, హృద్రోగం నివారణకు అవసరమైన ఔషధాలు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆస్పత్రుల అవసరాల మేరకు వాటిని సరఫరా చేస్తున్నట్లు మురళీధరరెడ్డి తెలిపారు. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆస్పత్రులకు 1.93 కోట్ల పాంటాప్రజోల్ టాబ్లెట్లు, 2.32 కోట్ల రాంటిడిన్ టాబ్లెట్లను సరఫరా చేసిందని వివరించారు. అయితే.. మూడు బ్యాచ్‌ల రాంటిడిన్, ఆరు బ్యాచ్‌ల పాంటాప్రజోల్ టాబ్లెట్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని విజయవాడలోని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఎల్) ప్రకటించడంతో వాటిని నిలిపివేశామన్నారు. వీటికి తాజాగా టెండర్లు పిలిచామని, వచ్చే వారంలో ఖరారు చేస్తామన్నారు. రూ.150 కోట్లతో యాంటీ బయోటిక్స్, ఫ్లూయిడ్స్ కొనుగోళ్లు మరోవైపు.. కోవిడ్ వ్యాప్తి సమయంలో డిమాండ్ కంటే ఎక్కువగా రూ.150 కోట్ల వ్యయంతో యాంటిబయోటిక్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. అయితే.. కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవటంతో వీటిని ఆ చికిత్సకు వినియోగించామన్నారు. తర్వాత కాలంలో అవసరాల మేరకు యాంటీబయోటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ కొనుగోలుకు ప్రభుత్వం ఆర్డర్ పెట్టిందన్నారు. ప్రస్తుతం తగిన స్థాయిలో వీటి నిల్వలున్నాయన్నారు. -
మూడో టీకా ఎక్కడ?
శివాజీనగర: రానున్న రోజుల్లో కరోనా నాలుగో దాడి నుంచి బయటపడడానికి మూడవ టీకా.. బూస్టర్ డోస్ తీసుకోవటం అనివార్యం. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బూస్టర్ డోస్ లభించకపోవడంతో జనం ఆందోళనకు కారణమైంది. బెంగళూరులోని పాలికె ఆసుపత్రుల్లో బూస్టర్ డోస్ ఉండడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం కావలసింత టీకా నిల్వలు ఉన్నాయి. బూస్టర్ డోస్ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ ధరను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్థోమత ఉన్నవారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా వేసుకొంటున్నారు. అంత డబ్బు పెట్టలేనివారు ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరుగుతూ లేదని చెప్పించుకుంటున్నారు. సామాన్యులకు కష్టం మరోవైపు మంత్రులేమో ఆస్పత్రుల్లో బూస్టర్ టీకా ఉచితంగా వేస్తున్నట్లు రోజూ చెబుతుంటే వాస్తవం మరోలా ఉంది. సామాన్యులు, పేదలు మూడో టీకా కోసం వేచి చూస్తున్నారు. రెండు డోస్‌ల టీకాలను ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం నాలుగో దాడి పొంచి ఉన్న సమయంలో చేతులెత్తేయడం ఏమిటని పలువురు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తక్షణం ఉచిత బూస్టర్ డోస్‌ను అందరికీ పంపిణీ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. (చదవండి: పరిహారం కోసం సీఎం ఇంటికి పాదయాత్ర..) -
నాణ్యత లేని భోజనం.. ‘ఎగ్’నామం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు అరకొరగా, నాణ్యతలేని ఆహారం అందుతోంది. గర్భిణులు, బాలింతలతోపాటు వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న పేదలు, ప్రమాదాల బారిన పడిన సామాన్యులకు ప్రభుత్వాస్పత్రులే దిక్కు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే ఆర్థికస్తోమత లేకపోవడంతో ఎక్కువ మంది ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులనే ఆశ్రయిస్తుంటారు. పేదరోగుల ఆహారం కోసం ప్రభుత్వమే ఉద యం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉచితంగా అందజేస్తోంది. ఈ మేరకు ధరలు నిర్ణయించి, నిబంధనలు విధించి.. ఈ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. కానీ కాంట్రాక్టర్ల కక్కుర్తి, పర్యవేక్షించాల్సిన ఆయా ఆస్పత్రుల ఉన్న తాధికారుల నిర్లక్ష్యంతో చాలా ఆస్పత్రుల్లో రోగులు అర్ధాకలితో అలమటిస్తున్నట్టు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. జిల్లాల వారీగా పరిస్థితి ఇలా.. ♦ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ రిమ్స్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యత లేని భోజనం సరఫరా చేస్తు న్నారు. ఆసిఫాబాద్‌లో కొన్నిసార్లు భోజనమే పెట్టడం లేదు. నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో అన్నం, చారుతోనే సరిపుచ్చుతున్నారు. కూరగాయలు వండ డం లేదు. కోడి గుడ్లు ఇవ్వడం లేదు. ♦సిద్దిపేట జనరల్ ఆస్పత్రిలో రోగులకు రోజూ అల్పాహారం, భోజనం అందిస్తు న్నారు. అలాగే ఈనెల 4వ తేదీ వరకు గుడ్డు ఇచ్చారు. కానీ దాదాపు 20 రోజు లుగా గుడ్డు ఇవ్వడం లేదు. అరటిపండు కూడా అందడం లేదు. ♦నిజామాబాద్ ఆస్పత్రిలో రోజూ 340 నుంచి 400 మందిరోగులకు ఆహారం అందిస్తున్నారు. మెనూ ప్రకారం కాకుం డా ఉదయం ఎక్కువగా ఇడ్లీ మాత్రమే ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనంలో నీళ్లచారు మాత్రమే ఉంటోందని రోగులు ఆరోపిస్తున్నారు. ♦నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోజూ గుడ్డు ఇస్తున్నారు. కానీ చిన్నగా ఉంటోంది. అరటిపండు రోజూ ఇవ్వాల్సి ఉన్నా.. కొందరికి మాత్రమే ఇస్తున్నారు. నీళ్ల చారు, మరీ పలుచగా మజ్జిగ ఇస్తున్నారని, కూరలు కూడా నీళ్లు నీళ్లుగా ఉంటున్నాయని చెబుతున్నారు. ♦మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో 600 మంది రోగులకు, 50 మంది వైద్యులకు ఏజెన్సీ ఆహారం సరఫరా చేస్తోంది. నీళ్ల చారు, ఉడకని అన్నం పెడుతుండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. రోగులకు ఏమివ్వాలి.. ♦ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సాధారణరోగులకు ఉదయం 4 బ్రెడ్డు ముక్కలు, 200 మిల్లీలీటర్ల పాలు.. మధ్యాహ్నం అన్నం, కూర, గుడ్డు, సాం బారు.. రాత్రి అన్నం, కూర, మజ్జిగ అంద జేయాలి. ఇందుకు ఒక్కొక్కరికి రూ.40 చొప్పున ఏజెన్సీకి ప్రభుత్వం చెల్లిస్తోంది. ♦పౌష్టికాహారలోపంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నవారికి ఉదయం 4 బ్రెడ్ ముక్కలు, 200 ఎంఎల్ పాలు.. మధ్యాహ్నం, రాత్రి అన్నం, 2 కూరలు, గుడ్డు, అరటి పండు చొప్పున అందిం చాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభు త్వం ఏజెన్సీకి రూ.56 చెల్లిస్తోంది. ♦బాలింతలకు బలవర్ధక ఆహా రం కోసం ఉదయం అల్పా హా రం కింద ఇడ్లీ లేదా ఉప్మా, 200 ఎంఎల్ పాలు, 4 బ్రెడ్డు ముక్కలు.. మధ్యాహ్నం, రాత్రి అన్నం, 2 కూరలు, గుడ్డు, అరటి పండు అందజేయాలి. ఇందుకోసం ఏజెన్సీకి రూ.వంద చొప్పున చెల్లిస్తోంది. ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి.. ♦పలు ఆస్పత్రుల్లో వైద్యులకు ప్రత్యేకంగా నాణ్యమైన ఆహారం అందజేస్తుండగా.. రోగులకు మాత్రం నాసిరకమైన భోజనం పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ♦ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజెన్సీల నిర్వాహకులు రోజువారీగా మెనూ ప్రదర్శించాల్సి ఉంది. ఆ మెనూ ప్రకారమే ఆహారం ఇవ్వాలి. కానీ ఇది చాలాచోట్ల అమలుకు నోచుకోవడం లేదు. ♦చాలావరకు ఆస్పత్రుల్లో రెండు, మూడు బ్రెడ్డు ముక్కలు, తాగేందుకు వీలు లేనివిధంగా ఉన్న పాలు, అది కూడా చాలా తక్కువ పరిమాణంలో ఇస్తున్నారు. మధ్యాహ్నం కూర, సాంబారులో ఏదో ఒకటే ఇస్తుండగా, అరటిపండు ఎప్పుడో ఒకసారి ఇస్తున్నారు. ఒకవేళ ఇచ్చినా చాలావరకు పాడైనవే ఉంటున్నాయి. కొన్ని చోట్ల గుడ్డు ఇవ్వడం లేదు. అన్నంతో పాటు కూరలు సరిగా ఉండడం లేదు. నీళ్ల సాంబారుతో సరిపుచ్చుతున్నారు. ఈ ఫొటోలో భోజనం చేస్తున్న ఈయన పేరు మోరే లక్ష్మణ్. ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్‌కు చెందిన ఈయనకు నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఇతనికి ఒక పూటే, అదికూడా నాసిరకమైన భోజనం అందుతోంది. దీంతో ఇంటి నుంచి తెప్పించుకుని తింటున్నాడు. రెండు రోజులుగా ఇక్కడ భోజనమే ఇవ్వలేదని మరికొందరు రోగులు చెప్పారు. గుడ్డు, పాలు, బ్రెడ్ కూడా రోజూ ఇవ్వడం లేదని లక్ష్మణ్ తెలిపాడు. ఉడకని అన్నం పెడుతున్నారు.. మా బాబుకు రక్తం తక్కువగా ఉందని 9 రోజులుగా ఆస్పత్రిలో ఉంటున్నాం. ఆహారం అయితే రెండు పూటలు ఇస్తున్నారు. కాకపోతే కూరలు నీళ్ల మాదిరి ఉంటున్నాయి. అన్నం కూడా సరిగ్గా ఉడకడం లేదు. – అనిత, పొల్కంపల్లి, భూత్పూర్, మహబూబ్‌నగర్ ఒక్కరోజే అరటి పండు ఐదు రోజుల కిందట కూతురి కాన్పు కోసం వచ్చాం. ఐదు రోజుల్లో ఒక్కరోజు మాత్రమే అరటి పండు ఇచ్చారు. గుడ్డు, భోజనం పెడుతున్నప్పటికీ అంత మంచిగా ఉండడం లేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం తినిపిస్తున్నాం. –పగిడిమర్రి లక్ష్మమ్మ, నల్లగొండ అమల్లోకి రాని పెరిగిన రేట్లు ఆస్పత్రుల్లో డైట్ నిర్వహణ బాధ్యతలను టెండర్ పద్ధతిన ఏజెన్సీలకు అప్పచెబుతున్నారు. నిర్ణయించిన రేటు ప్రకారం ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. అయితే ప్రస్తుత రేట్లు గిట్టుబాటు కావడం లేదని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ధరలను రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 21న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. -
శానిటేషన్.. పరేషాన్!
♦వనపర్తి ప్రభుత్వాస్పత్రిలో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉన్న ప్రసూతి వార్డు ఇది. గతంలో 100 పడకలతో ఉన్న ఈ ఆస్పత్రిని 330 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ఇక్కడ కనీసం 80 మంది శానిటేషన్ వర్కర్లు అవసరం. కానీ ఉన్నది 44 మందే. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించకపోవడం, సరిగా శుభ్రం చేయకపోవడంతో వార్డులన్నీ కంపు కొడుతున్నాయి. పలు వార్డులు, గదుల్లో పందికొక్కులు తిరుగుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. ♦సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వాస్పత్రి శానిటేషన్ స్టోర్ గది, ఆస్పత్రిలో వాడే నాసిరకం ఫినాయిల్, ఇతర సామగ్రి ఇవి. ఇక్కడ తగిన శుభ్రత కోసం వినియోగించే సామగ్రి లేదు. కాస్త ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ మాత్రమే ఉన్నాయి. 3 నెలలుగా పరిస్థితి ఇలాగే ఉందని సిబ్బంది, రోగులు చెప్తున్నారు. ♦రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్యం దుస్థితికి ఇవి చిన్న ఉదాహరణలు. ఆస్పత్రుల్లో శానిటేషన్ పనులు చేసే కాంట్రాక్టు ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తగిన సంఖ్యలో సిబ్బందిని అందుబాటులో ఉంచకపోవడం.. ఏమాత్రం నాణ్యతలేని సామగ్రిని వినియోగించడం.. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోవడం.. తూతూమంత్రంగా క్లీనింగ్ చేయడం వంటివి పరిపాటిగా మారిపోయాయి. అధికారవర్గాలు దీనిని పట్టించుకోకపోవడంతో ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో శానిటేషన్ పరిస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగిని ఎలుకలు కొరకడం.. గతంలో మెదక్ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని పందికొక్కులు కొరుక్కుతినడం వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇందుకు ప్రధానంగా పారిశుధ్య లోపం, కొరవడిన పర్యవేక్షణ కారణమనేది సుస్పష్టం. ఇలాంటి సమయంలో అసలు సమస్య ఎక్కడ? ఎవరు బాధ్యులు? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రక్షాళన చేపట్టాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని.. దీనిని ఆసరాగా తీసుకుని శానిటేషన్ కాంట్రాక్టు ఏజెన్సీలు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో బుధవారం ‘సాక్షి’ చేపట్టిన విజిట్‌లో ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. ప్రైవేట్ ఏజెన్సీల తెంపరితనం, రోగుల అవస్థలు వెలుగుచూశాయి. సిబ్బంది లేరు.. పరిశుభ్రత అసలే లేదు.. ♦ప్రభుత్వాస్పత్రుల్లో నిబంధనల ప్రకారం ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు పర్యాయాలు వార్డులు, ఆవరణ, ఐసీయూ, ఇతర గదులను షిఫ్టుల వారీగా శుభ్రం చేయాలి. కానీ చాలాచోట్ల రెండుసార్లు మాత్రమే శుభ్రం చేస్తున్నారు. ♦శానిటేషన్ ఏజెన్సీలు అగ్రిమెంట్ ప్రకారం.. నాణ్యమైన డెట్టాల్, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్, ఇతర సామగ్రి వినియోగించాలి. చాలాచోట్ల డెట్టాల్ వాడటంలేదు. ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ కూడా నాసిరకాలవి వినియోగిస్తున్నారు. ♦శానిటేషన్ సిబ్బంది హాజరుకు సంబంధించి ఒకట్రెండు చోట్ల మినహా ఎక్కడా బయోమెట్రిక్ హాజరు లేదు. ఏజెన్సీల నిర్వాహకులు దీనిని ఆసరాగా చేసుకుని కొందరితో హాజరుపట్టికలో సంతకాలు చేయించి బయట పనులకు వినియోగించుకుంటున్నారు. ప్రతినెలా పదుల సంఖ్యలో సిబ్బంది వేతనాలను మిగుల్చుకుంటున్నారు. ♦నిబంధనల ప్రకారం శానిటేషన్ సిబ్బందికి నెలకు రూ.9,400 వేతనం ఇవ్వాలి. కా>నీ చాలాచోట్ల రూ.8 వేలు, కొన్నిచోట్ల అయితే రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండటంతో పారిశుధ్య సిబ్బంది పనిపై శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ♦కొత్తగా మెడికల్ కళాశాలలు ప్రారంభమైన చోట.. వాటికి అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్య సిబ్బంది సంఖ్య పెంచలేదు. దానితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలాఖరులోగా నోటిఫికేషన్ వేసి టెండర్ ఆహ్వానిస్తామని అధికారులు చెప్తున్నారు. చాలా చోట్ల ఇదే దుస్థితి.. ♦ఖమ్మం జిల్లాలో 400 పడకల ప్రభుత్వాస్పత్రిలో 80 మందే శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. అందులోనూ కొందరే విధుల్లో ఉంటున్న పరిస్థితి. ఊడవడం, తుడవడం వంటివి ఒకరిద్దరే.. అదీ తూతూమంత్రంగా ముగిస్తున్నారని రోగుల బంధువులు చెప్తున్నారు. టాయిలెట్ల క్లీనింగ్ దారుణమని, బ్లీచింగ్ పౌడర్ కూడా సరిగా చల్లడం లేదని మండిపడుతున్నారు. ♦మెదక్ జిల్లాలోని వంద పడకల ఆస్పత్రిలో మూడు విడతల్లో కలిపి కేవలం 15 మంది పారిశుధ్య కార్మికులే ఉన్నారు. వీక్లీ ఆఫ్‌లు, సెలవులు పోగా.. రోజూ పనిచేసేది ముగ్గురు, నలుగురే. దీనితో పారిశుధ్యం కొరవడింది. ఆస్పత్రి ఆవరణలో మార్చురీ పక్కన చెత్తాచెదారం నిండిపోయింది. జనగామ జిల్లా ఆస్పత్రిలో ఫ్లోర్‌ను తుడుస్తున్న శానిటేషన్ వర్కర్ ఇతను. ఆస్పత్రిలో 17 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. వార్డులను రోజూ మూడుసార్లు శుభ్రం చేయాల్సి ఉండగా.. రెండుసార్లే క్లీన్ చేస్తున్నారు. సోప్ ఆయిల్, హైపోక్లోరైడ్, యాసిడ్, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటివి నాసిరకంగా ఉన్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో 170 మంది పారిశుధ్య సిబ్బందికిగాను 112 మంది మాత్రమే ఉన్నారు. దానితో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇక మంచిర్యాల ఆస్పత్రి 200 పడకలకు అప్‌గ్రేడ్ అయినా.. 40 మందే శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ చూసినా వ్యర్థాలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. దుర్వాసన వస్తున్నా పట్టించుకోవట్లేదు కాలుకు గాయమవడంతో చికిత్స కోసం భువనగిరి జిల్లా ఆస్పత్రికి వచ్చాను. రెండు రోజులుగా వార్డులో ఉంటున్నాను. మరుగుదొడ్డి నుంచి దుర్వాసన వస్తోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. –నర్సింహ, రామచంద్రపురం, భువనగిరి -
పేపర్ రహిత వైద్యం.. ఏపీకి ప్రథమ స్థానం
సాక్షి, అమరావతి: ప్రజలకు ఆరోగ్య రికార్డుల మోత బరువు తగ్గించే దిశగా రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులు పేపర్ రహిత సేవల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) కార్యక్రమంలో భాగంగా దేశంలో ఎక్కడికి వెళ్లినా పేపర్ రహిత వైద్య సేవలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా ప్రతి పౌరుడికీ 14 అంకెల డిజిటల్ ఆరోగ్య ఐడీ నంబర్ ఇస్తున్నారు. ఓపీ, ఐపీ స్లిప్పులు, వైద్య పరీక్షల ఫలితాలు, చికిత్సకు సంబంధించిన ఫైళ్లు వంటివి కంప్యూటరీకరించి పేపర్ రహిత సేవలు అందించడానికి వీలుగా ఈ–హాస్పిటల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యకలాపాల అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో మన రాష్ట్రం నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,90,25,469 మందికి డిజిటల్ ఐడీలు సృష్టించారు. అదే విధంగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నుంచి బోధనాసుపత్రి వరకూ 14,368 ఆసుపత్రులు రిజిస్టర్ చేశారు. 7,345 మంది ప్రభుత్వ వైద్యులు రిజిస్టర్ అయ్యారు. పౌరులు, ఆసుపత్రులు, వైద్యులు మూడు విభాగాల రిజిస్ట్రేషన్‌లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలవడం గమనార్హం. 5.44 లక్షల ఓపీలు నమోదు ఏబీడీఎం ఈ–హాస్పిటల్ కార్యక్రమంలో భాగంగా గత ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పేపర్ రహిత సేవలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 1,03,740 ఓపీలు నమోదయ్యాయి. అదే విధంగా 100కు పైగా పడకలున్న ఏరియా, జిల్లా, బోధనాసుపత్రులు కలిపి 54 చోట్లలో గత మార్చి నుంచి ఈ–హాస్పిటల్ సేవలు మొదలుపెట్టారు. కొన్ని ఆసుపత్రులోŠల్ అన్ని విభాగాల్లోనూ, మరికొన్ని చోట్ల పరిమిత విభాగాల్లో ఈ–హాస్పిటల్ సేవలు రోగులకు అందుతున్నాయి. ఇప్పటి వరకూ 4.41 లక్షల ఓపీలు నమోదయ్యాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రులు కలిపి మొత్తంగా 5.44 లక్షల ఓపీలు నమోదయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ–హాస్పిటల్స్‌గా మార్చడానికి ఇప్పటికే వైద్యులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాల వారీగా నోడల్ అధికారులను సైతం నియమించారు. పైలట్ ప్రాజెక్టుకు రాష్ట్రం ఎంపిక ఏబీడీఎం కార్యక్రమాల్లో రాష్ట్రం చురుగ్గా ముందుకు వెళ్తున్న క్రమంలో నర్సింగ్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి పైలట్‌గా ఏపీని కేంద్రం ఎంపిక చేసింది. దీంతో దేశంలోనే మొదటగా రాష్ట్రంలో ఏబీడీఎంలో నర్సుల రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభంకానుంది. పారామెడికల్ సిబ్బంది రిజిస్ట్రేషన్‌కు సిఫార్సు ఏబీడీఎం కార్యకలాపాల్లో వేగంగా ముందుకు వెళ్తున్నాం. నర్సుల రిజిస్ట్రేషన్ మన దగ్గరే తొలుత ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. రోగుల వైద్య పరీక్షల ఫలితాలను ఆన్లైన్లో పారామెడికల్ సిబ్బంది నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నర్సులతో పాటు పారామెడికల్ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేపడతామని సిఫార్సు చేశాం. వచ్చే నెలలో నర్సులు, పారామెడికల్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తాం. – నవీన్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ -
ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైద్యం మరింత మెరుగ్గా అందించేందుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని టీచింగ్ హాస్పటల్స్ మొదలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకూ అన్నింటిలోనూ సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,968 ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో 8,260 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో టెండర్లను ఆహ్వానించారు. టెండర్ల గడువు ఈ నెల 18తో ముగియనుంది. సాంకేతిక, ఫైనాన్స్ బిడ్ల అనంతరం అర్హత కలిగిన సంస్థకు పనులను అప్పగించనున్నారు. కాంట్రాక్టును దక్కించుకున్న 2 నెలల్లోగా పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో టీచింగ్ ఆస్పత్రిలో 20 కెమెరాలు రాష్ట్రవ్యాప్తంగా 20 టీచింగ్ ఆస్పత్రులు, 17 జిల్లా ఆస్పత్రులు, 48 ఏరియా ఆస్పత్రులు, 178 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ), 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), 560 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యుపీహెచ్సీ)లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులోనూ ఒక్కో టీచింగ్ ఆస్పత్రిలో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుండగా.. జిల్లా ఆస్పత్రులలో 16, ఏరియా ఆస్పత్రిలో 8 చొప్పున బిగించనున్నారు. ఇక పీహెచ్సీలో 4, యుపీహెచ్‌సీలో 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 8,260 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. నిబంధనలు ఇవీ.! ► టెండర్ దక్కించుకున్న రెండు నెలల్లోగా పని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ► ఇక సీసీ కెమెరా రికార్డింగ్ బ్యాకప్ నెల రోజుల పాటు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ► పనులు దక్కించుకున్న సంస్థ రెండేళ్ల పాటు నిర్వహణను చేపట్టాలని నిబంధన విధించారు. ► సీసీ కెమెరాల నిర్వహణలో ఏదైనా సమస్య వస్తే 24 గంటల్లోగా పరిష్కరించాలి. ఒకవేళ 24 గంటల్లోగా సమస్యను పరిష్కరించకపోతే పెనాల్టీ కూడా విధించనున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య యజ్ఞం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైద్య, ఆరోగ్య రంగంలో 39,000 పోస్టుల భర్తీని చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు ఆధునికీకరణ, వైద్య ఆరోగ్య రంగంలో నాడు – నేడు ద్వారా మెరుగైన వసతుల కల్పనకు రూ.16 వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు చెప్పారు. దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం తదితర రంగాల్లో వ్యవస్థలను మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకమన్నారు. వైద్య, ఆరోగ్య రంగంపై సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్‌ను ఈ సందర్భంగా పరిశీలించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి విడదల రజిని ఆరోగ్యశ్రీ సేవలపై బోర్డులు విలేజ్, వార్డు క్లినిక్స్ దగ్గర నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ నాడు– నేడు కింద పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీలో ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.5,200 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు. గత సర్కారు బకాయి పెట్టిన రూ.680 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా అధికారంలోకి రాగానే చెల్లించామన్నారు. రోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు శస్త్ర చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వెళ్లే సమయంలో ఆరోగ్య ఆసరా ద్వారా డబ్బులు కూడా ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. మరింత సులువుగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలను పొందేలా సూచనలతో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీలో అవసరం మేరకు ప్రొసీజర్లను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. యజ్ఞంలా పనిచేద్దాం.. రాష్ట్రంలో వైద్య సేవలను బలోపేతం చేసేందుకు కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులను నెలకొల్పుతున్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలున్న మందులు ఇస్తున్నామన్నారు. భారీ మార్పులను ఆశించి అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుని విద్య, వైద్యం సహా కీలక రంగాలపై అత్యంత శ్రద్ధ వహిస్తూ అనుభవం, సమర్థత ఉన్న అధికారులను ఆయా శాఖలకు కేటాయించామన్నారు. ముఖ్యమంత్రిగా తాను నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పని చేయాలని సూచించారు. శాఖాధిపతులు, సిబ్బంది దీన్ని చాలెంజ్‌గా స్వీకరించి ఆశించిన మార్పుల సాధనకు కృషి చేయాలన్నారు. మే నెలాఖరుకు పోస్టుల భర్తీ పూర్తి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సమీక్షలో ముఖ్యమంత్రి ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించేందుకు పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నామని, వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదని సూచించారు. ప్రజలకు కచ్చితంగా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేలా గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందుకనే ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించామన్నారు. నిర్మాణాల్లో ఎక్కడా రాజీపడొద్దు ఆస్పత్రుల్లో నాడు– నేడు పనులు, విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్ నిర్మాణం, కొత్త పీహెచ్‌సీలు, మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. వసతులు, సౌకర్యాలకు సంబంధించి ఎక్కడా లోటు రాకూడదన్నారు. జోరుగా 6 కొత్త మెడికల్ కాలేజీల పనులు పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, గిరిజన ప్రాంతాల్లో స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణాల ప్రగతి గురించి సమీక్షలో అధికారులు వివరించారు. 16 కొత్త మెడికల్ కాలేజీల్లో 6 చోట్ల జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయని చెప్పారు. పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, విజయనగరం, అమలాపురం మెడికల్ కాలేజీల నిర్మాణాల ప్రగతిని తెలియచేశారు. మిగిలిన చోట్ల మే 15 నాటికల్లా మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. కేంద్రం నుంచి అనుమతులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పరిశుభ్రతకు పెద్దపీట ఆస్పత్రుల్లో సౌకర్యాలు, సదుపాయాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణ పరిశుభ్రంగా ఉందా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలన్నారు. టాయిలెట్ల దగ్గర నుంచి ప్రతి విభాగం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాజిటివ్ కేసులు ఐదే రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కేసులు కేవలం ఐదు మాత్రమే ఉన్నాయని, డైలీ యాక్టివిటీ రేటు 0.13 శాతానికి పడిపోయిందని అధికారులు తెలిపారు. 4,30,81,428 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైనట్లు వెల్లడించారు. 15 – 17 ఏళ్ల వారికి వంద శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. 12 – 14 ఏళ్ల వారికి మొదటిడోసు 94.47 శాతం వ్యాక్సిన్లు ఇచ్చారు. సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్ చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ, ఎండీ డి.మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య మిత్రలకూ ప్రోత్సాహకాలు ప్రతిభ ఆధారంగా వలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో ఆదేశించారు. దీనిద్వారా ఆరోగ్య మిత్రల సేవలను గుర్తించినట్లు అవుతుందన్నారు. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి నగదు ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. -
ఆకస్మిక తనిఖీలు చేస్తా: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. సమయపాలన పాటించని, విధినిర్వహణలో అలసత్వం వ హించే వైద్యులు, ఉద్యోగులపట్ల కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్ని విభా గాల్లో ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు పెంచాలని సూచించా రు. శనివారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రసూతి, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ సహా అన్ని విభాగాల్లో ఆరోగ్యశ్రీ కింద మరింత ఎక్కువగా వైద్య సేవలు అందించాలన్నారు. సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలు ఎక్కువ జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈఎన్టీ, డెర్మటాలజీ సేవలను మరింత మెరుగుపర్చి, సమీప గ్రామాల్లో ఈఎన్టీ క్యాంపులు ఏర్పాటు చేసి సేవలు అందించాలని సూచించారు. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున జిల్లా స్థాయిలోనే అత్యవసర సేవలు అందించేలా చూడాలని, అనవసరంగా హైదరాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేయవద్దన్నారు. అత్యవసర సేవలు అన్ని వేళలా అందించేందుకు వీలుగా అనస్థీషియా విభాగం క్రియాశీలకంగా ఉండాలని, వారానికి ఒక విభాగం వారీగా సూపరింటెండెంట్లు సమీక్షలు నిర్వహించాలన్నారు. పీడియాట్రిక్ విభాగంలోనూ ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు పెరగాలని చెప్పారు. -
పల్లెల్లో ఆరోగ్య భాగ్యం.. ప్రజల చెంతకే సర్కారీ వైద్యం
►నాడు: ప్రభుత్వాస్పత్రి అంటే చిన్నచూపు.. ప్రజలకు ఏదైనా జబ్బు వస్తే పెద్దాసుపత్రికి వెళ్లాల్సిందే. పెద్ద రోగమొస్తే పేదలు ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే.. ఆపరేషన్ చేయించుకోవాలంటే అప్పు కోసం పరుగు తీయాల్సిన పరిస్థితి. ప్రభుత్వాస్పత్రికి వెళదామంటే గ్రామం నుంచి కిలోమీటర్ల మేర ప్రయాణించాలి. తీరా వెళ్లినా అక్కడ వైద్య సేవలు అందేవి కావు. ►నేడు: పేదలకు ఆరోగ్య భాగ్యాన్ని అందించేలా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అమలు చేస్తోంది. పల్లెల్లో డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, పట్టణాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటుచేసి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసింది. ఆయా క్లినిక్స్‌లో 12 రకాల వైద్యసేవలు అందుతున్నాయి. ఆపరేషన్ అవసరమైతే ఆరోగ్యశ్రీ భరోసాగా నిలుస్తోంది. ఆపరేషన్ అనంతరం కూడా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. ఏలూరు టౌన్(ఏలూరు జిల్లా: రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్‌సీలను అభివృద్ధి చేయడంతో పాటు అధునాతన పరికరాలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు వైద్య నిపుణులు, సిబ్బందిని నియమిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టపర్చడంతో పాటు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న వారికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా చేయూత అందిస్తున్నారు. చదవండి: AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు నాలుగు గదులతో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లకు అనుబంధంగా ప్రతి గ్రామంలో డాక్టర్ వైఎ స్సార్ విలేజ్ క్లినిక్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. సమీప పీహెచ్సీ వైద్యుడి పర్యవేక్షణలో బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సింగ్ సిబ్బంది, ఒక ఏఎన్ఎం, సచివాలయం పరిధిలో ఆరోగ్య కార్యకర్త క్లినిక్‌లో అందుబాటులో ఉంటారు. ఇక్కడ అన్నిరకాల మందులు అందించేందుకు చర్యలు చేపట్టారు. విలేజ్ క్లినిక్‌లో వెయిటింగ్ రూమ్, ఓపీ రూమ్, కట్లు కట్టే గది, పరీక్షలకు మరో గదిని ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 60 పీహెచ్‌సీలు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు 938 విలేజ్ క్లినిక్‌లు మంజూరయ్యాయి. వీటిలో ఏలూరు జిల్లాలో 375 ఉండగా కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని 159తో కలిసి మొత్తం 534కు చేరాయి. ఉమ్మడి జిల్లాలో 152 విలేజ్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రూరల్ పీహెచ్‌సీలు 94 ఉండగా ఏలూరు జిల్లాలో 43, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని పీహెచ్‌సీలు 17తో కలిపి ఆ సంఖ్య 60కు చేరింది. ఉమ్మడి జిల్లాలో అర్బన్ పీహెచ్‌సీలు 34 ఉండగా, ఏలూరు జిల్లాకు 12, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లోని 2 పీహెచ్‌సీలతో కలిపి 14 ఉన్నాయి. మెరుగైన సేవలు గ్రామాల్లో పేదలకు నాణ్యమైన మెరుగైన సేవ లు అందించేందుకు ప్ర భుత్వం విలేజ్ క్లినిక్స్ ఏర్పాటుచేస్తోంది. కేంద్రాలకు భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 104 సంచార వైద్యశాలలతో గ్రామాల్లో వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు అందిస్తున్నాం. పీహెచ్‌సీలను బలోపేతం చేస్తున్నాం. విలేజ్, అర్బన్ క్లినిక్స్ తో వైద్య సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరువకానున్నాయి. – డాక్టర్ బి.రవి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి -
ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే వైద్యులు ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై నియమ నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ‘నాడు–నేడు’ కింద పెద్ద ఎత్తున నిధులను వెచ్చించి కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించడంతోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని నియమించింది. నాణ్యమైన మందులను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రభుత్వ డాక్టర్లు సర్కారు ఆసుపత్రుల్లో కంటే ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్న ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ప్రజలు భావిస్తుండటం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది. ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారిస్తారని, తద్వారా ప్రజారోగ్యానికి పూర్తి భరోసా కల్పించవచ్చని మంత్రివర్గం అభిప్రాయపడింది. గురువారం వెలగపూడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్, అధికారులు సమర్థంగా నిర్వహించారని అభినందిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. 2021–22 ఆర్థ్ధిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్ సున్నావడ్డీ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు. రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ► కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు చేసిన స్వల్ప సవరణలకు మంత్రివర్గం ఆమోదం. ► కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలతో కొత్తపేట రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల, తొండూరు, వీరపునాయనిపల్లె మండలాలతో పులివెందుల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు. వైఎస్సార్ కడప జిల్లాలో 36 మండలాల నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం కొత్తగా పులివెందుల డివిజన్ ఏర్పాటు. ► 12 పోలీసు సబ్డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. జెడ్పీలు పూర్తి కాలం యథాతథం ► ఇప్పుడున్న జిల్లా పరిషత్‌లను మిగిలిన కాలానికి యథాతథంగా కొనసాగిస్తూ పంచాయతీరాజ్ చట్టం ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం. ► చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో కొత్తగా ఏర్పాటయ్యే అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. ► చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మిల్లెట్ మిషన్ (2022–23 నుంచి 2026–27 వరకు)కు ఆమోదం. ► ఐచ్ఛికంగా వచ్చిన ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో దాదాపు 253 పోస్టులు ఇచ్చేందుకు ఆమోదం. 23 ప్రిన్సిపాల్, 31 టీచింగ్, 199 నాన్‌టీచింగ్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. ► ప్రకాశం జిల్లా దర్శిలో నూతన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ► శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్. ► పీఆర్సీకి సంబంధించి ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం. ► సర్వే, సెటిల్మెంట్స్, భూ రికార్డుల విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు ఆమోదం. హెల్త్ హబ్స్‌కు భూములు ► రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటులో భాగంగా కాకినాడ అర్బన్ మండలం సూర్యారావుపేటలో మల్టీ/సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి ఏర్పాటుకు 5 ఎకరాల భూమి కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం. ► కర్నూలు జిల్లా కల్లూరులో అత్యాధునిక ఆసుపత్రి కోసం 5 ఎకరాల భూమి కేటాయింపు. ► విజయనగరం మండలం సంతపేటలో 4.5 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద ఏపీఐఐసీ ద్వారా కేటాయింపు. ► అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ గ్రామంలో 4 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద ఏర్పాటయ్యే ఆసుపత్రికి కేటాయింపు. ► శ్రీకాకుళం మండలం పాత్రుని వలసలో 4.32 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద ఏర్పాటయ్యే అత్యాధునిక ఆసుపత్రికి కేటాయింపు. పలు సంస్థలకు భూ కేటాయింపులు ► ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కు హోటల్, కన్వెన్షన్ సెంటర్ కోసం రాజమహేంద్రవరం అర్బన్‌లో 6 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. ► కర్నూలు జిల్లా బేతంచర్లలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి 100 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్. ► కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు 15.31 ఎకరాల భూమి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. ► ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు హుకుంపేట మండలం గడుగుపల్లిలో 5.10 ఎకరాల భూమి కేటాయింపు. ► అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కడమలకుంట, రాగులపాడుల్లో 15 ఎకరాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కేటాయింపు. విండ్ టర్బైన్ జనరేటర్లను నెలకొల్పనున్న ఐఓసీఎల్. ► కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో ఆగ్రో కెమికల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ విస్తరణకు 10.06 ఎకరాలు కేటాయింపు. ► కాకినాడ జిల్లా జగ్గంపేటలో బస్‌స్టేషన్ నిర్మాణానికి 1.57 ఎకరాల భూమి ఆర్టీసీకి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం. ► రంపచోడవరం మండలం పెద గడ్డాడలో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపు. ► నిజాంపట్నం మండలం దిండిలో పరిసవారిపాలెంలో 280 ఎకరాలు మత్స్యశాఖకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం. ఈ భూమిలో మడ్క్రాప్ హేచరీస్ ప్రాజెక్ట్‌ను మత్స్యశాఖ చేపట్టనుంది. ► కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కు కోసం 82.34 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► ముత్తుకూరు మండలం ఈపూరు సమీపంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి 84.29 ఎకరాల కేటాయింపు. ► గూడూరులో ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ కోసం 0.89 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. ► నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాన్పూరులో 5.05 ఎకరాల భూమిని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూరుకు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. -
ఆస్పత్రులేనా?ఎలుకల ఘటనతోనైనా మార్పు వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్/అఫ్జల్‌గంజ్/గాంధీఆస్పత్రి: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగిపై ఎలుకల దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఏకంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని తీవ్రంగా గాయపర్చిన వైనం ప్రభుత్వాస్పత్రుల్లో డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. రోగుల భద్రతను ప్రశ్నార్థకంలో పడేసింది. అంతా బాగానే ఉందంటున్న వైద్యాధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపేలా చేసింది. ఈ నేపథ్యంలో నగరంలోని సర్కారు దవాఖానాలపై వైద్యశాఖ దృష్టి సారించాల్సిన ప్రాముఖ్యతను తెలియజెప్పింది. నగరంలోని ఆస్పత్రుల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉస్మానియాలో వానర విహారం.. నగరంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆస్పత్రిలో చాలా కాలంగా కోతుల సందడి కొనసాగుతోంది. అవుట్ పేషెంట్ రోగులు వేచి చూసే ప్రాంతాల దగ్గర నుంచి అనేక చోట్ల కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఇప్పటి వరకూ ఇవి ఎవరినీ తీవ్రంగా గాయపరిచిన ఘటన జరగనప్పటికీ, వీటి విషయంలో పలువురు రోగులు ఇబ్బందులు పతున్నారు. ఇదే ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్ విభాగంలో పిల్లులు వీర విహారం చేసేవి. రోగుల మంచాల కింద గందరగోళం సృష్టించేవి. ఇటీవల పాత ఇన్‌పేషెంట్ విభాగం మూసేశారు. అయినప్పటికీ అక్కడక్కడా పిల్లులు దర్శనమిస్తూనే ఉంటాయి. ఆస్పత్రి ప్రాంగణంలో కుక్కల హల్చల్ కూడా తక్కువేమీ కాదు. పేట్లబురుజులో బొద్దింకలు.. పాతబస్తీలోని పేట్ల బురుజులో ఉన్న ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎంతో కాలంగా ఈ ఆస్పత్రిలో బొద్దింకల బెడద తీవ్రంగా ఉన్నప్పటికీ..ఏ విధమైన నిర్మూలనా చర్యలు చేపట్టలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మూసీనది పక్కగానే ఉండడం వల్ల దోమలు సైతం విపరీతంగా ఉ న్నాయి. దీంతో రోగుల్లో ఆందోళన పెరుగుతోంది. తెలంగాణ వైద్యప్రదాయినీ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో శునకాలు, సెల్లార్‌లోని డైట్‌క్యాంటిన్ పరిసర ప్రాంతాల్లో ఎలుకలు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. ఆస్పత్రి ప్రాంగణంతోపాటు వార్డుల్లోనూ శునకాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రోగి సహాయకులతోపాటు వచ్చిన శునకాలకు సమృద్ధిగా ఆహారం దొరకడంతో ఆస్పత్రి ప్రధాన భవనం, ఓపీ, అత్యవసర, మార్చురీలతోపాటు గాంధీ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుని పదుల సంఖ్యలో తిష్టవేశాయి. పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద శునకాలు నిత్యం తిష్ట వేయడం గమనార్హం. రోగులు, వైద్యులకు ఆహారాన్ని అందించే సెల్లార్లో కొనసాగుతున్న డైట్‌క్యాంటిన్ పరిసర ప్రాంతాల్లో ఎలుకలు, పందికొక్కులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. పాలు, కూరగాయలు, పప్పులు వంటి ఆహార పదార్థాలపై తిరుగుతుంటాయి. ఆస్పత్రి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో సెల్లార్‌లోని బొరియలు, గుంతల్లో వందలాది ఎలుకలు, పందికొక్కులు నివసిస్తున్నాయి. (చదవండి: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్) -
ఇంటికి చేరే దాకా తల్లీబిడ్డకు శ్రీరామరక్ష
Thalli Bidda Express: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 500 ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను సిద్ధం చేసింది. శుక్రవారం విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించనున్నారు. సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 500 ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను సిద్ధం చేసింది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించనున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూనారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలనూ ప్రభుత్వం విస్తరించింది. అరకొరగా ఉన్న పాత వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. ఏటా సగటున 4 లక్షల మందికి ప్రయోజనం రాష్ట్ర వ్యాప్తంగా 1,057 ప్రభుత్వాస్పత్రుల్లో ఏడాదికి సగటున నాలుగు లక్షల దాకా ప్రసవాలు జరుగుతుంటాయి. నెలలు నిండిన గర్భిణులను కాన్పుకు ఇంటి నుంచి 108 వాహనంలో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేరుస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆయా ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య ఆధారంగా డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను కేటాయించారు. తల్లులకు సాయం అందించేందుకు వీలుగా కేంద్రీకృత 102 కాల్ సెంటర్ సేవలనూ మెరుగుపరిచారు. తల్లీబిడ్డను ఇంటికి తరలించేటప్పుడు ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల సమన్వయం కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతృ, శిశు సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలను యాప్‌కు అనుసంధానించి బాలింతలను క్షేమంగా ఇంటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటారు. బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక ఈ యాప్‌లో డ్రైవర్ ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. అలాగే ప్రసవానంతరం తల్లికి ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద వివిధ అవసరాల కోసం రూ.5 వేలు చెల్లిస్తోంది. -
సామాజిక అస్పృశ్యత నిర్మూలనే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదని, సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌తో కలిసి డ్రా ద్వారా ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దళితులు కూలీకి పరిమితం కావొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్య్రానికి ముందే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. నాడు అంబేడ్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని కొనియాడారు. దళితబంధు లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా, ఆ యూనిట్‌ను గ్రౌండ్ చేసేలా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. గతంలో నీటిపారుదలశాఖ టెండర్లలో ఎస్సీ, ఎస్టీలకు 21 శాతం కేటాయించామని, ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో దళితులకు 16 శాతం కేటాయిస్తున్నామని, వంద పడకలలోపు ఆసుపత్రులను ఒక కేటగిరీగా, వంద పడకలకు పైగా ఉన్న ఆసుపత్రులను మరో కేటగిరీగా విభజించామని వివరించారు. మొత్తం 56 ఆసుపత్రుల ఎంపిక పారదర్శకంగా చేశామని, వీటికి త్వరలో టెండర్లు పిలుస్తారని తెలిపారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండర్ల నిబంధనల్లోనూ మార్పులు చేశామని, ఒక్క టెండర్ వచ్చినా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించా మని చెప్పారు. మెడికల్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఎలా అమలు చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో భోజన చార్జీల పెంపు
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వివిధ వర్గాలకు అందజేసే భోజన చార్జీలను పెంచుతూ వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత చెల్లింపులను రెట్టింపు చేస్తూ ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఆదేశా లిచ్చారు. రోగులందరికీ, అలాగే గిరిజన రోగుల సహాయకులకు ప్రస్తుతం రూ.40 ఉండగా, దాన్ని రూ.80కి పెంచారు. టీబీ, మానసిక రోగులు, థెరపాటిక్ రోగులకు ప్రస్తుతం రూ.56 ఇస్తుండగా, దాన్ని రూ.112కి పెంచారు. ఇక డ్యూటీ డాక్టర్లకు రూ.80 నుంచి రూ.160కి పెంచారు. నాణ్యమైన భోజనాన్ని అందజేయాలన్న ఉద్దేశంతోనే ఈ మేరకు పెంచినట్లు రిజ్వీ పేర్కొన్నారు. -
AP: రూ.100 కోట్లతో ల్యాబ్‌లు బలోపేతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబొరేటరీ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేపట్టడానికి ఐఏఎస్ మాజీ అధికారి సుజాతారావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసింది. ప్రభుత్వ రంగంలో వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఐదేళ్లలో రూ.10వేల కోట్ల మేర ఖర్చుచేయాలని అప్పట్లో కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. చదవండి: బాబు.. ఏబీ.. ఓ పెగసస్ ఇప్పుడేమంటారు..? కానీ, ఈ కమిటీ సూచించిన దానికన్నా అదనంగా సర్కారు నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూ.వేల కోట్ల ఖర్చుచేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లోనే నిర్ధారణ పరీక్షలు (ఇన్‌హౌస్ ల్యాబొరేటరీ) ఏర్పాటుచేయాలని సుజాతారావు కమిటీ సిఫార్సు చేసింది. దీంతో ల్యాబొరేటరీలు ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపై వైద్యశాఖ ఓ కమిటీ వేసి, దాని సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటోంది. విలేజ్ క్లినిక్ నుంచి జిల్లా ఆసుపత్రి వరకూ.. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి జిల్లా ఆసుపత్రి వరకూ అన్ని ఆసుపత్రుల్లో ల్యాబ్‌లకు ఉపకరణాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేపడుతున్నారు. అయితే, మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తగ్గట్టుగా వనరులు అందుబాటులోకి తెస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో 14, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35, సీహెచ్‌సీలో 78, ఏరియా ఆస్పత్రుల్లో 80, జిల్లా ఆస్పత్రుల్లో 136 రకాల వైద్య పరీక్షలు చేయడానికి వీలుగా అవసరమైన ఉపకరణాలను ఏపీఎంఎస్ఐడీసీ సమకూరుస్తోంది. రసాయనాలు (రీఏజెంట్స్), డిస్టిలరీ వాటర్‌తో సహా అన్నింటినీ సరఫరా చేస్తున్నారు. నెలాఖరు నుంచి అందుబాటులోకి సేవలు సొంతంగా ల్యాబొరేటరీల నిర్వహణవల్ల వ్యయం తగ్గడంతో పాటు రోగులకు సేవలు మెరుగుపడతాయి. ఈ నెలాఖరుకు అన్ని ఆసుపత్రుల్లో సేవలు ప్రారంభించాలని చెప్పాం. గతంలో రీఏజెంట్స్ స్థానికంగా కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వాటిని కూడా సరఫరా చేస్తున్నాం. దీంతో అవి లేవు, ఇవి లేవు అని పరీక్షలకు బయటకు రిఫర్ చేయడానికి వీలుండదు. ప్రతి ఆసుపత్రిలో బోర్డు పెడతాం. ఫిర్యాదులు చేయడానికి వీలుగా ఫోన్ నెంబర్‌నూ ప్రదర్శిస్తాం. – కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ -
12–14 ఏళ్ల పిల్లలకు నేటి నుంచి టీకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు బుధవారం నుంచి కరోనా టీకా పంపిణీ చేయనున్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో టీకా వేస్తామని అధికారులు చెప్పారు. 14.90 లక్షల మంది పిల్లలకు టీకా వేయనున్నారు. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన ‘కార్బెవ్యాక్స్’ టీకాను పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుంది. తొలి డోసు వేసుకున్న 28 రోజుల అనంతరం రెండో డోసు వేస్తారు. టీకా వేయించుకోవడానికి కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్‌కు మంగళవారం నుంచి అవకాశం కల్పించారు. 15 – 18 ఏళ్లు నిండిన 97 శాతం మందికి టీకా రాష్ట్రంలో 15–18 ఏళ్ల పిల్లలకు రెండు డోసుల టీకా పంపిణీ 97 శాతం పూర్తయింది. గత జనవరిలో వీరికి టీకా కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రంలో 24.41 లక్షల మందికి టీకా వేయలన్నది లక్ష్యం కాగా, అంతకు మంచి 25.21 లక్షల మందికి తొలి డోసు పంపిణీ పూర్తి చేశారు. వీరిలో 24.33 లక్షల మందికి రెండో డోసు కూడా పూర్తయింది. ప్రభుత్వాస్పత్రుల్లోనూ రిజిస్ట్రేషన్ : ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి 2008 మార్చి 15 నుంచి 2010 మార్చి 15 మధ్య పుట్టిన పిల్లలందరూ ఇప్పుడు టీకాకు అర్హులు. ప్రభుత్వాస్పత్రుల్లోని టీకా కేంద్రాల వద్దే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 15.21 లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయి. 0.5 ఎంఎల్ చొప్పున వేస్తాం. 12 ఏళ్ల లోపు పిల్లలకు టీకా వేయం. టీకా పంపిణీపై జిల్లా వైద్యాధికారులకు మార్గదర్శకాలు ఇచ్చాం. -
కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం చేపట్టిన కేసీఆర్ కిట్ పథకంపై ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. 2014లో 30 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగ్గా 2021 నాటికి 22 శాతం పెరుగుదలతో 52 శాతానికి చేరాయని, ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. కేసీఆర్ కిట్లను ఇప్పటివరకు 13.30 లక్షల మందికి అందజేశామని, కిట్‌లో 16 రకాల వస్తువులు ఇస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. ప్రసవం అయిన తల్లీ బిడ్డల ను అమ్మ ఒడి వాహనాల ద్వారా ఇళ్లకు పంపిస్తున్నామని, అందుకోసం 300కు పైగా వాహనాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఇక మాతృత్వ మరణాల రేటు దేశవ్యాప్త సరాసరి ఎంఎంఆర్ 113 ఉండగా, రాష్ట్రంలో 92 నుంచి 63కు తగ్గిందన్నారు. దేశవ్యాప్త శిశు మరణాల రేటు(ఐఎంఆర్) సరాసరి 42 ఉండగా, తెలంగాణలో 39 నుంచి 23కు తగ్గిందన్నారు. -
Andhra Pradesh: మా ఆస్పత్రి మారింది
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి మంచి రోజులొచ్చాయి. ప్రభుత్వ వైద్య రంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మౌలిక వసతులకు ఏ కొరతా లేకుండా నాడు–నేడు కింద ఆస్పత్రులు సకల హంగులతో రూపు మార్చుకుంటున్నాయి. ప్రాథమిక ఆరోగ్య రంగం బలోపేతం అయిందని ఏ మారుమూల గ్రామంలోకి వెళ్లి.. ఏ పీహెచ్‌సీని చూసినా ఇట్టే తెలుస్తోంది. ఇది వరకు ఆయా గ్రామాల్లోని ఆస్పత్రులు ఎప్పుడు తెరుచుకునేవో.. ఎప్పుడు వైద్యుడుంటాడో ఎవరికీ తెలిసేది కాదు. వైద్యుడి సంగతి అటుంచితే కనీసం నర్సు కూడా అందుబాటులో లేని దుస్థితి ఇప్పుడు సమూలంగా మారిపోయింది. ఆరోగ్య పరంగా ఏ చిన్న సమస్య వచ్చినా నిమిషాల వ్యవధిలో వైద్యం అందుతోందని గ్రామీణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన ఎస్.శిరీషది మధ్యతరగతి కుటుంబం. ఇటీవల ఇంటి వద్ద ఆడుకుంటుండగా శిరీష కుమారుడిని కుక్క కరిచింది. పిల్లవాడికి ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించడానికి వచ్చారు. వైద్య సిబ్బంది వేగంగా వివరాలు నమోదు చేసుకుని టీకా వేశారు. 15 నిమిషాల్లో వైద్య ప్రక్రియ ముగించారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీలో వైద్య సేవలపై ఆమెను ప్రశ్నించగా.. ‘ఈ మధ్యే మా ఆస్పత్రి మారింది. కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఆస్పత్రి లోపలంతా అపరిశుభ్ర వాతావరణం ఉండేది. రోగులు కూర్చోడానికి వీలుండదు. తాగునీరు, మరుగుదొడ్లు కూడా ఉండేవి కాదు. సిబ్బంది కొరత ఉండేది. చిన్న చిన్న జబ్బులకు, వైద్య పరీక్షలకు కంకిపాడు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేసే వారు. అక్కడికి వెళ్లినా లాభం ఉండేది కాదు. దీంతో 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి వ్యయ ప్రయాసల కోర్చి విజయవాడకు వెళ్లే వాళ్లం. కుక్క కరిచి ఎవరైనా వస్తే ఇక్కడ టీకాలు ఉండేవి కావు. ఇక్కడి నుంచి కంకిపాడుకు వెళితే.. అక్కడా కొన్ని సార్లు టీకాలు ఉండవు. దీంతో విజయవాడకు వెళ్లక తప్పేది కాదు. కానీ ప్రస్తుతం ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేశారు. తగినన్ని మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సమస్యలకు బయటకు వెళ్లే అవస్థ తప్పింది’ అని శిరీష సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్సీలో గతంలో కేవలం ఒకే ఒక్క నర్సు తప్ప ఎవరూ ఉండే వారు కాదని.. ఒంట్లో బాగోలేదని చూపించుకోవడానికి ఆస్పత్రికి వచ్చిన కె.శ్యామ్ చెప్పాడు. ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం కింద ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేసిందన్నాడు. ఇప్పుడు ముగ్గురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్‌వో/ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది ఉన్నారన్నాడు. ‘గతంలో డాక్టర్లు వేళకు వచ్చే వారు కాదు. వచ్చినప్పుడు కొద్దిసేపు ఉండి వెళ్లిపోయేవారు. దీంతో వైద్యం కోసం వచ్చిన వాళ్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఈ కష్టాలు పడలేక కంకిపాడు, విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. చాలా మంది ఆర్ఎంపీల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడా బాధలన్నీ తప్పాయి’ అని తెలిపాడు. – సాక్షి, అమరావతి అనూహ్య రీతిలో వసతుల కల్పన ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ సహా 12 మంది స్టాఫ్ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం భారీగా నియామకాలు చేపట్టింది. కృష్ణా జిల్లా ఉప్పులూరు పీహెచ్‌సీనే తీసుకుంటే ఇద్దరు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీ అయ్యాయి. అన్ని వసతులు కల్పించారు. దీంతో ఓపీ (ఔట్ పేషెంట్) సంఖ్య పెరిగింది. త్వరలో దీనికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్‌క్వాస్) గుర్తింపు రానుంది. యూపీహెచ్‌సీల్లోనూ ఉత్తమ వైద్యం గతంలో 259 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) ఉండేవి. ప్రస్తుతం ఈ కేంద్రాలకు అదనంగా మరో 301 కేంద్రాలు.. మొత్తంగా 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి సొంతంగా భవనం ఉండేలా చర్యలు తీసుకుంటోంది. నాడు–నేడులో భాగంగా కొత్త భవనాలు, మరమ్మతుల కోసం రూ.399.2 కోట్లు ఖర్చు చేస్తోంది. 499 మంది వైద్యులను ఇప్పటికే నియమించారు. ఇతర సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రస్తుతం 10 పడకలతో ఇన్ పేషెంట్ విభాగం అందుబాటులోకి వచ్చింది. పీహెచ్‌సీల తరహాలోనే యూపీహెచ్‌సీల్లోనూ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, మందులు, వైద్య పరీక్షలకు కొరత లేకుండా చర్యలు తీసుకుంది. కాగా, రూ.16,255 కోట్ల భారీ నిధులతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన.. 16 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణం, 5 గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు మరికొన్ని ఆస్పత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.663 కోట్లతో నాడు–నేడు పీహెచ్‌సీల బలోపేతానికి ప్రస్తుత ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.663 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,145 పీహెచ్‌సీలు ఉండగా, 1,125 ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు చేపడుతున్నారు. 977 పీహెచ్‌సీలకు మరమ్మతులు, 148 పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్సీలలో మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్‌లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యధిక పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ – కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటుంది) గుర్తింపు ఉన్న రాష్ట్రంగా ఏపీ సత్తా చాటింది. 320 పీహెచ్‌సీలకు ఈ గుర్తింపుతో ఏపీ తొలి స్థానంలో, 191తో గుజరాత్ రెండో స్థానంలో, 134తో కేరళ మూడో స్థానంలో ఉంది. అందుబాటులో స్పెషలిస్ట్ వైద్యం ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం స్పెషలిస్ట్ వైద్య సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 9 స్పెషాలిటీల్లో 1,278 మంది వైద్యులను నియమిస్తోంది. వీరు వారంలో ఆరు రోజుల పాటు రోజుకు రెండు పీహెచ్‌సీలకు వెళ్లి స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 276 పోస్టులు భర్తీ అయ్యాయి. ‘నాడు–నేడు’తో మార్పులు ఇలా.. ► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. ఆస్పత్రిలో వసతులు/గదులకు సంబంధించిన సైన్ బోర్డులు ఏర్పాటయ్యాయి. ► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సర్టిఫికెట్లు ఉన్నాయి. రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి. ప్రతి 3–4 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. ► గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యవసర మందులు అందుబాటులో ఉండేవి కాదు. ప్రస్తుతం 240 రకాల ఎసెన్షియల్ మందులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంటున్నాయి. ► చాలా ఆస్పత్రుల్లో గతంలో ఒకే వైద్యుడు ఉండేవాడు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులను తప్పనిసరి చేసింది. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే 645 మంది డాక్టర్లు, 1,113 నర్సులు, 403 ల్యాబ్ టెక్నీషియన్లు సహా 2,964 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 264 డాక్టర్, 1,269 ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తోంది. నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ► గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనివేళలు ఉండేవి. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకరు ఓపీ చూస్తారు. రాత్రి 8 గంటల తర్వాత అత్యవసర సేవల్లో భాగంగా ఫోన్ చేస్తే ఆస్పత్రికి వస్తారు. ► వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు మందుల సరఫరా, వైద్య పరీక్షల శ్యాంపిల్స్ సేకరించి పీహెచ్‌సీలకు తరలించడం కోసం ప్రతి పీహెచ్‌సీకి ఒక స్కూటీని త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు. ► మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 176 కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్నఓగిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ఈ ఫొటోలో కనిపిస్తున్న గిరిజనుడు మల్లూరి రాముకు 65 ఏళ్లు. విజయనగరం జిల్లా పార్వతీపురం వాసి. రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. వృద్ధాప్యంలో అంత దూరం ప్రయాణించడం ప్రయాసే. రాము తరహాలో మరెవ్వరూ ఇబ్బంది పడకూడదని రాష్ట్రంలో ఐదు గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు ప్రభుత్వం పూనుకుంది. రూ. 246 కోట్లతో శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని ప్రకాశం జిల్లా దోర్నాలల్లో ఈ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో ఉండే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్యులు, సిబ్బంది కోసం క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నారు. ఇబ్బందులు ఉండవు మా ప్రాంతంలోనే అన్ని వసతులతో ఆస్పత్రులు అందుబాటులోకి రాబోతుండటం శుభ పరిణామం. తద్వారా రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య పరిస్థితుల్లో సరైన సమయంలో మెరుగైన వైద్యం అందక సంభవించే మరణాలు తగ్గుతాయి. – కొవ్వాసి నారాయణ, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి జిల్లా వేగంగా పూర్తి చేస్తాం రాష్ట్రంలో ఐదు చోట్ల గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు పనులు అవార్డ్ చేశాం. వాళ్లు పనులు ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, ఎండీ ఏపీ రోల్ మోడల్ అవ్వాలన్నదే లక్ష్యం ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వైద్య రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. నాడు–నేడు కింద ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అత్యధిక ఎన్‌క్వాస్ గుర్తింపు కలిగిన పీహెచ్‌సీలతో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. దేశానికి ఏపీ రోల్ మోడల్ అవ్వాలన్న సీఎం లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాం. – ఆళ్ల నాని, ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు మా ఊళ్లోనే మంచి వైద్యం నాకు 70 ఏళ్లు. మా గ్రామంలోనే పీహెచ్సీ ఉంది. గతంలో ఇక్కడ సేవలు సరిగా లేనందున ఉయ్యూరులో ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు వెళ్లే వాడిని. డాక్టర్ ఫీజు, మందులు కలిపి రూ.500 అయ్యేది. ఇప్పుడు మా ఊళ్లోనే ప్రభుత్వ ఆస్పత్రి బాగుండటంతో మంచి వైద్య సేవలు అందుతున్నాయి. క్రమం తప్పకుండా ఇక్కడికే వచ్చి, మధుమేహం, ఇతర వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకువెళ్తున్నాను. వైద్యులు, సిబ్బంది బాగా చూస్తున్నారు. – బి.కోటేశ్వరరావు, చినఓగిరాల, కృష్ణా జిల్లా ఇదివరకు ఆర్ఎంపీ వైద్యమే గతి గతంలో మా ఊరికి సమీపంలోని రాకోడు పీహెచ్సీలో వైద్యుడు అందుబాటులో ఉండేవాడు కాదు. దీంతో పెద్దాస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లలేక ఊర్లోనే ఆర్ఎంపీతో చూపించుకునే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఇద్దరు వైద్యులను నియమించారు. ఎప్పుడూ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారు. ఆస్పత్రికి వెళితే ప్రేమగా పలకరిస్తూ వైద్యం చేస్తున్నారు. – పి.అప్పలనాయుడు, పెదవేమలి, విజయనగరం -
సీఎం జగన్ చొరవతో తంబళ్ళపల్లికి మహర్ధశ
-
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాజ్యమేలుతోన్న నిర్లక్ష్యం
-
వైద్యపరీక్షల్లో జాప్యానికి ‘రిపేర్’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్య పరికరాల మరమ్మతుల్లో జాప్యాన్ని నివారించేందుకు వైద్యారోగ్యశాఖ కొత్త విధానం తీసుకొచ్చింది. పరికరాలన్నింటినీ 4 కేటగిరీ లుగా విభజించి, ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో మరమ్మతుల నిర్వహణను పర్యవేక్షించనుంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనితో ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలకు త్వరగా మరమ్మతులు పూర్తయి.. వైద్య పరీక్షలకు ఇబ్బందులు తప్పనున్నాయి. నాలుగు కేటగిరీలుగా చేసి.. కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. రూ.5 లక్షలకుపైన విలువ ఉండి వ్యారంటీ కలిగి ఉన్నవి, సమగ్ర వార్షి క నిర్వహణ ఒప్పందం ఇంకా ప్రారంభంకాని పరికరాలను ఏ కేటగిరీగా.. రూ.5 లక్షలకుపైగా విలువ ఉండి కంపెనీ మెయింటెనెన్స్ అవసరమున్నవి, వ్యారంటీ పీరియడ్ తర్వాత నిర్వహణ ఒప్పందం చేసుకోవాల్సిన పరికరాలను బీ కేటగిరీగా.. రూ.5 లక్షలకుపైగా విలువ ఉండి ఏడేళ్లు దాటిన పరికరాలు, వ్యారంటీ సహా ఒప్పందం పూర్తయినా ఇంకా పనిచేస్తున్న పరికరాలను సీ కేటగిరీగా.. రూ.5 లక్షల కన్నా తక్కువ విలువైన పరికరాలను డీ కేటగిరీలో చేర్చారు. ఇందులో ఏ, బీ, సీ కేటగిరీ పరికరాల నిర్వహణ బాధ్యతను టీఎస్‌ఎంఎస్‌ఎస్‌ఐడీసీకి అప్పగించారు. డీ కేటగిరీలోని పరికరాల నిర్వహణను ఆయా ఆస్పత్రులు చూసుకుంటాయి. ప్రత్యేక వ్యవస్థ, సాఫ్ట్వేర్ వైద్య పరికరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు టీఎస్‌ఎంఎస్‌ఎస్‌ఐడీసీలో ప్రోగ్రామ్ మేనేజెంట్ యూనిట్ (పీఎంయూ) పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. నిర్వహణ కోసం టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ ఆధ్వర్యంలో మెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఈఎంఐఎస్) పేరుతో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల సూపరింటెండెంట్లు వైద్య పరికరాలకు అవసరమైన మరమ్మతుల ప్రతిపాదనలను ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో పంపుతారు. వాటిని టీఎస్‌ఎంఎస్‌ఎస్‌ఐడీసీ పరిశీలించి, మరమ్మతులు చేయిస్తుంది. ఇందులో సీ కేటగిరీలోని పరికరాల మరమ్మతుల ధరలను ఖరారు చేసేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ మెంబర్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ, డీఎంఈ, టీవీవీపీ కమిషనర్, వైద్యారోగ్యశాఖ సాంకేతిక సలహాదారు సభ్యులుగా ఉంటారు. ఏటా ఒక్కోబెడ్‌కు పీహెచ్‌సీలకు రూ.వెయ్యి, సీహెచ్‌సీలకు రూ.1,500, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రూ.2 వేలు, బోధన, స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.2,500 చొప్పున నిధులు విడుదల చేస్తారు. -
దేశంలోనే మేటిగా మన పీహెచ్‌సీలు
సాక్షి, అమరావతి: ‘ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి. వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, శానిటేషన్, రోగులకు కల్పించే సదుపాయాల్లో లోటు ఉండకూదడు. ప్రభుత్వ ఆస్పత్రిలో అడుగు పెట్టగానే.. కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చామా అన్న భావన ప్రజలకు కలగాలి. అందుకు తగ్గట్టుగా ఉన్నత ప్రమాణాలు ఉండాలి’ అని వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షల్లో అధికారులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. కేవలం మాటలు చెప్పడమే కాదు.. ఆ మాటలను క్షేత్ర స్థాయిలో ఆచరింపజేయడంలో సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. దీంతో మన రాష్ట్రంలోని వైద్య రంగానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 2016లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాస్) కార్యక్రమం కింద అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ ఆస్పత్రులకు గుర్తింపు ఇస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అత్యధిక పీహెచ్‌సీలు ఎన్‌క్వాస్ గుర్తింపు పొందటం ద్వారా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. 320 పీహెచ్‌సీలకు.. రాష్ట్రంలో 1,145 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికి 320 పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్ గుర్తింపు లభించటంతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ ఉంది. 191 పీహెచ్‌సీలతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 1,280 పీహెచ్‌సీలకు గుర్తింపు ఉండగా.. వీటిలో 25 శాతం ఆస్పత్రులు మన రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. గుర్తింపు ప్రక్రియ ఇలా.. పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), జిల్లా ఆస్పత్రి (డీహెచ్)లకు ఎన్‌క్వాస్ గుర్తింపు ఇస్తారు. ఆస్పత్రిని బట్టి గుర్తింపు లభించడానికి ప్రమాణాలు మారుతుంటాయి. పీహెచ్‌సీల్లో 6 డిపార్ట్మెంట్లలో 1,600 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏరియా, సీహెచ్‌సీ, డీహెచ్‌లలో 18 డిపార్ట్మెంట్లలో, 6,625 అంశాలను పరిశీలిస్తారు. సంబంధిత ఆస్పత్రికి ఎన్‌క్వాస్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చి ఆస్పత్రుల్లో పర్యటించి ప్రమాణాలన్నింటినీ పరిశీలించిన అనంతరం గుర్తింపు ఇస్తుంది. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నొస్టిక్స్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రోగులకు సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని మార్కులు కేటాయిస్తారు. నాడు–నేడుతో.. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం చేపడుతోంది. ఇందులో భాగంగా రూ.663 కోట్లతో 977 పీహెచ్‌సీలకు మరమ్మతులు, 148 పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్‌సీల్లో నాడు–నేడు కింద మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్‌లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద పీహెచ్‌సీల్లో ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతుల కల్పన నేపథ్యంలోనే దేశంలోనే అత్యధిక పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్ గుర్తింపు కలిగిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలవగలిగింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్బులిస్తేనే సేవలు
-
ఆసుపత్రిలో అవినీతి
-
వ్యాక్సినేషన్లో ఏపీ దూకుడు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కోవిడ్ వ్యాక్సినేషన్లో ఏపీ దూసుకుపోతోంది. ఈ విషయం కేంద్రం విడుదల చేసిన తాజా ఆర్థిక సర్వేలో కూడా వెల్లడైంది. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఏపీలో 75.7 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపింది. అలాగే తొలి డోసు వ్యాక్సినేషన్ ఏపీలో లక్ష్యానికి మించి(100.4 శాతం మంది) పూర్తయ్యిందని వెల్లడించింది. తద్వారా దేశంలోనే టాప్‌లో నిలిచిందని పేర్కొంది. ఇక తెలంగాణలో 68.7 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయని ఆర్థిక సర్వేలో కేంద్రం తెలిపింది. దేశ జనాభాలో48.3 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని పేర్కొంది. మరోవైపు ప్రజలను కోవిడ్ బారి నుంచి కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన మౌలిక వసతులు, ఆక్సిజన్ ప్లాంట్లు, బెడ్లు, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తోంది. 2019 నాటికి రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేదు. కానీ ప్రస్తుతం 13 జిల్లాల్లో రూ.45 కోట్ల వ్యయంతో 14 వైరాలజీ ల్యాబ్‌లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఏపీలో 90 శాతం మందికి ఆర్టీపీసీఆర్ విధానంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి రికార్డు సృష్టించారు. అలాగే 143 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చి ప్రజలను సంరక్షించేందుకు కృషి చేస్తోంది. -
AP: పుష్కలంగా ప్రాణవాయువు
సాక్షి, అమరావతి: కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరత కారణంగా రాష్ట్రంలో ఎదురైన ఇబ్బందులు తిరిగి కోవిడ్ మూడో దశలో తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాణవాయువుకు కొరతలేకుండా ఉండేలా ‘జగనన్న ప్రాణవాయువు’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 50, అంతకన్నా ఎక్కువ పడకలున్న ప్రతి ప్రభుత్వాసుపత్రిలో గాలి నుంచి మెడికల్ ఆక్సిజన్ తయారుచేసే ప్రెజర్ స్వింగ్ అడ్సార్పషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ఏర్పాటుచేసింది. ఈ ప్లాంట్లను సీఎం వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. 124 ఆసుపత్రుల్లో 144 ప్లాంట్లు రాష్ట్రవ్యాప్తంగా 124 సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల్లో 144 పీఎస్ఏ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం రూ.189.5 కోట్లు వెచ్చించింది. ఇవి నిమిషానికి 500, వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 124 ఆస్పత్రుల్లో నిమిషానికి 93,600 లీటర్ల (లీటర్స్ పర్ మినిట్–ఎల్పీఎం) ఆక్సిజన్ ఉత్పత్తి అవ్వనుంది. మరోవైపు.. పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కరోనా మూడో దశ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఆ వివరాలు.. ► రూ.90.07 కోట్లతో 24,419 పడకలకు ఆక్సిజన్ పైప్లైన్ల ఏర్పాటు. ► 35 ఆసుపత్రుల్లో రూ.15 కోట్లతో 399 కిలోలీటర్ల సామర్థ్యంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) ట్యాంకర్ల ఏర్పాటు. ► మరో 39 ఆస్పత్రుల్లో రూ.16.3 కోట్లతో 390 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఎల్ఎంఓ ట్యాంకర్లను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం. ► ఆక్సిజన్ సరఫరా, నిల్వ చేయడానికి 20 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన 25 కంటైనర్లు రూ.15.25కోట్లతో కొనుగోలు. ► 23,971 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 26,746 డీ టైప్ సిలిండర్ల కొనుగోలు. ► రూ.6.22 కోట్లతో 13 జిల్లాల్లో 20 వీఆర్డీఎల్ ల్యాబ్‌ల ఏర్పాటు. ► రూ.21.93 కోట్లతో సివిల్, ఎలక్ట్రికల్ పనులు నిర్వహణ. ► రూ.297.36 కోట్లతో మెడికల్, ల్యాబ్ ఎక్విప్మెంట్, కోవిడ్ కిట్స్ కొనుగోలు. అన్ని వసతులూ సమకూర్చాం కరోనా మూడో దశ వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు సమకూర్చాం. కరోనా చికిత్సకు అవసరమైన ఎనిమిది రకాల మందుల స్టాక్ సరిపడా ఉంది. నేడు పీఎస్ఏ ప్లాంట్లను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. – మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీ వీసీ, ఎండీ -
పరికరాలు గబ్బు..నిర్లక్ష్యమే జబ్బు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన కొనుగోలు చేసిన వైద్య పరికరాలు మూలన పడుతున్నాయి. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఖరీదైన పరికరాలను ఇస్తుంటే వాటిని వినియోగంలోకి తేవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ప్రభుత్వంతోపాటు దాతలు సైతం వైద్యపరికరాలు అందించారు. అయితే ఎన్ని రూ.కోట్లు ఖర్చుచేసినా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వైద్య పరికరాలను ఆస్పత్రి సిబ్బంది మూలన పడేసి కమీషన్ల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేస్తుండటంతో ప్రజలు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. సూర్యాపేటలో మూసి ఉన్న సీటీ స్కాన్ గది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితోపాటు హుజురాబాద్, జమ్మికుంట, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, గోదావరిఖనిలో ప్రధాన ఆసుపత్రులు ఉన్నాయి. నిరుపేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.3 లక్షల విలువైన ఏబీజీ మిషన్‌ను మూలన పడవేయగా, ఎంపీ బండి సంజయ్‌కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా అనెస్థీషియా వర్క్‌స్టేషన్ మిషన్‌తోపాటు 3 వెంటిలేటర్లు, సీ–పాప్ మిషన్, సీటీజీ మిషన్, రెండు ఫెటల్ డాప్లర్స్, హిస్ట్రోస్కోప్ విత్ హైడ్రోజెట్, ఐదు ఇన్ఫ్యూజన్ పంప్స్, రెండు అల్ట్రాసౌండ్ మిషన్లను అందజేశారు. సుమారు రూ.50 లక్షల విలువైన పరికరాలను ఐదు నెలలైనా వినియోగంలోకి రాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాసుపత్రికి అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ గత రెండేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ. 1.20 కోట్ల విలువైన పరికరాలు అందజేసింది. జిల్లా ఆసుపత్రిలో ఆర్థో, జనరల్, ఈఎన్టీ, పల్మనాలజీ, ఆప్‌తో విభాగాలకు చెందిన సర్జన్లు లేకపోవడంతో విలువైన పరికరాలను పక్కన పెట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని మార్చురీలో ఉన్న రెండు డెడ్‌బాడీ ఫ్రీజర్లు సాంకేతిక సమస్యలతో మూలకు పడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయోగ్నోస్టిక్లో అడ్వాన్స్ బయోకెమికల్ ఎనలైజర్, పాథా లజీ ఎనలైజర్, సెల్ కౌంటర్, యూరిన్ ఎనలైజర్, 2డీ ఎకో, సీబీపీ, యూరియా క్రియోటిన్, లివర్ ఫంక్షన్ మెషీన్ అందుబాటులోకి తెచ్చారు. దీంట్లో 2డీ ఎకో మిషన్ ఆపరేటింగ్ చేయడానికి కార్డియాలజిస్ట్తోపాటు టెక్నీషియన్ లేకపోవడంతో వాడకంలో లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రిలో రూ.కోటికిపైనే వెచ్చించి ఆరు నెలల క్రితం సీటీ స్కానర్‌ను తెచ్చారు. ఒకట్రెండు నెలల పాటు పనిచేసిన ఈ స్కానర్ ఇప్పుడు మూలనపడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లేట్లెట్ పరికరాల యంత్రం రెండేళ్లయినా వినియోగంలోకి తేలేదు. దీనికి సంబంధించి కెమికల్ అందుబాటులో లేకపోవడంతో వినియోగించడం లేదని ఆస్పత్రి అధికారులు తెలిపారు. రూ.2.80 లక్షలతో కొనుగోలు చేసిన ఈ యంత్రంతో వివిధ రక్తపరీక్షలు కూడా చేయొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగాం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించారు. జనగామ డయాగ్నొస్టిక్ కేంద్రంలో మొత్తం 57 రకాల టెస్టులకుగాను, 33 రకాల టెస్టులే చేస్తున్నారు. ఎలక్ట్రోలైట్స్, డెంగీ, వైడల్ టెస్టులు అందుబాటులో లేవు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి భురాన్పురం సర్పంచ్ మచ్చా శ్రీనివాసరావు రూ.15 లక్షల విలువైన ఎక్స్‌రే యంత్రం ఇచ్చినప్పటికీ టెక్నీషియన్ లేకపోవడంతో ఉదయం 9 గంటలకు మొక్కుబడిగా తీసి తర్వాత మూసివేస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ బాక్స్ నిర్వాహణ మరిచారు. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లో సేవలు అరకొరగానే అందుతున్నాయి. కేసులను మాత్రమే రెఫర్ చేస్తున్నాం కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి రోజూ రోడ్డు ప్రమాదాల కేసులతోపాటు ఇతర రిస్క్ కేసులూ వస్తుంటాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి పేషెంట్లు వస్తుంటారు. ప్రమాదాల్లో బాడీ క్రష్ అయిన హైరిస్క్ కేసులను మాత్రమే పెద్దాసుపత్రులకు రెఫర్ చేస్తున్నాం. మిగతా కేసులకు ఇక్కడే వైద్యం అందిస్తున్నాం. ఎలాంటి నిర్లక్ష్యం లేదు. -
అత్యవసర వైద్యం మిథ్య..ఆపదొస్తే ఆగమే!
దేశవ్యాప్తంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం సంకట స్థితిలో ఉంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు మొదలు గుండెజబ్బులు, ఇతర అత్యవసర వైద్యం కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రులకు వచ్చే బాధితులకు సకాలంలో చికిత్స అందట్లేదు. నిపుణుల కొరత, మౌలిక వసతుల లేమి, సాంకేతిక పరికరాల్లో లోపాలు ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిణామం తీవ్ర ఆందోళనకరం. – నివేదికలో ఢిల్లీ ఎయిమ్స్ రోడ్డు ప్రమాదాల వల్ల అత్యధిక మెడికో లీగల్ కేసులు నమోదవుతున్న దేశంలోని జిల్లా ఆస్పత్రుల్లో కరీంనగర్ జిల్లా ఆస్పత్రిది ప్రథమ స్థానం. 300కుపైగా పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో క్షతగాత్రులకు అత్యవసరంగా రక్తం అందించేందుకు ప్రత్యేక రక్తనిధి కేంద్రం లేదు. అదే సమయంలో అత్యవసర విభాగానికి ప్రత్యేక బ్లడ్ బ్యాంకులు ఉన్న దేశంలోని ఐదు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో హైదరాబాద్ జిల్లా కింగ్‌కోఠి ఆస్పత్రి ఒకటి. ఈ ఆస్పత్రిలో అతితక్కువ సమయంలోనే బాధితులకు రక్తం ఎక్కిస్తున్నారు. – ఎయిమ్స్ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అత్యవసర వైద్యం అంతంత మాత్రంగానే అందుతోందని ఢిల్లీ ఎయిమ్స్ అధ్యయనం తేల్చిచెప్పింది. ప్రమాదాల బారినపడి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే బాధితులకు అత్యవసర చికిత్సలు అందుతున్న తీరును విశ్లేషించగా ఈ వాస్తవం బయటపడిందని వెల్లడిం చింది. 29 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాం తాలకు చెందిన 34 జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులను ఎంపిక చేసుకొని ఆయా ఆస్పత్రుల్లోని వైద్య సదుపాయాలు, పాటిస్తున్న ప్రమాణాలు, నెలకొన్న లోపాలు, అందుకుగల కారణాలపై ఢిల్లీ ఎయిమ్స్ అత్యవసర విభాగం ఇటీవల అధ్యయనం చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కరీంనగర్ జిల్లా ఆస్పత్రితోపాటు హైదరాబాద్ జిల్లా కింగ్‌కోఠి ఆస్పత్రిని ఇందుకోసం ఎంపిక చేసుకుంది. ‘ఎమర్జెన్సీ అండ్ ఇంజురీ కేర్ ఎట్ డిస్ట్రిక్ట్ హాస్పిట ల్స్ ఇన్ ఇండియా’ పేరిట చేపట్టిన ఈ అధ్యయన నివేదికను నీతి ఆయోగ్‌కు సమర్పించగా ఆ సంస్థ దాన్ని తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఎమర్జెన్సీ కేసుల్లో ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో 19% నుంచి 24% నమోదవుతున్నాయి. ఎమర్జెన్సీ సర్వీసు కోసం వచ్చే బాధితుల్లో 70% పెద్దలు ఉంటుండగా 30% మంది పిల్లలు ఉంటున్నారు. పరిశీలనలో బయటపడ్డ లోపాలివి... ►ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఆస్పత్రి బెడ్ సామర్థ్యంలో కనీసం మూడో వంతు బెడ్లు కేటాయించాలి. కానీ చాలా చోట్ల ఎమర్జెన్సీ బెడ్ల సంఖ్య 2–3 శాతం మించడం లేదు. ►ఎమర్జెన్సీ విభాగాల్లో నిర్ణీత సిబ్బంది, నిపుణులు ఉండాలన్న నిబంధనను పలు ఆస్పత్రులు పాటించడం లేదు. ► పీడియాట్రిక్ ఎమర్జెన్సీ విభాగాల్లో 96% పరికరాలు లేవు. అత్యవసర సర్జరీలు చేయాల్సిన చోట 41 శాతం వరకే వసతులున్నాయి. ► 24/7 వైద్య సేవలు అందించే ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగికి సగటున 205 నిమిషాల్లో సేవలు కల్పిస్తున్నారు. ఈ జాప్యంతో మరణాలు సంభవిస్తున్నాయి. ► దాదాపు 88 శాతం ప్రధాన ఆస్పత్రుల్లో అంబులెన్స్ సర్వీసులు ఉన్నప్పటికీ వాటిల్లో పనిచేస్తున్న నిపుణులు కేవలం 3 శాతమే ఉండటంతో దాని ప్రభావం అత్యవసర సేవలపై పడుతోంది. ► 90 శాతం అంబులెన్స్‌ల్లో సరైన పరికరాలు, ఆక్సిజన్ సౌకర్యం లేవు. తీవ్ర రోడ్డు ప్రమాదాలకు గురై అత్యవసర సేవలు అందించే క్రమంలో అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వాటిలో బ్రతుకుతున్నది కేవలం 1.5 శాతమే. ►దేశంలో సగటున రోజుకు 1,374 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే వాటిలో 30 శాతం బాధితులు మరణిస్తున్నారు. ► ప్రతి ప్రధాన ఆస్పత్రిలో రక్త నిధి కేంద్రాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉండగా... అత్యవసర వైద్య విభాగానికి ప్రత్యేక రక్త నిధిని నిర్వహించాలనే నిబంధన ఉంది. అయితే 50శాతం ప్రధాన ఆస్పత్రుల్లోనే రక్త నిధి కేంద్రాలు ఉన్నాయి. ఇందులోనూ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కు ప్రత్యేక బ్లడ్ బ్యాంకులు లేనివే ఎక్కువగా ఉన్నాయి. జనరల్ విభాగాల్లో రక్త నిధి కేంద్రాల నుంచి రక్తంతీసుకొచ్చి బాధితుడి శరీరంలోకి ప్రవేశపెట్టేందుకు ఎక్కువ సమయం పట్టడంతో కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ► ప్రధాన ఆస్పత్రుల్లో పోలీస్ నిఘా లోపభూయిష్టంగా మారింది. దీంతో సగటున 47% వైద్యులు, సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న వారి శాతం కనిష్టంగా 23% నుంచి గరిష్టంగా 67% ఉంది. ►ప్రస్తుతం నమోదవుతున్న మరణాల్లో అత్యధికంగా జీవనశైలి వ్యాధికి సంబంధించినవి 62 శాతం ఉండగా సంక్రమిత వ్యాధులతో జరిగే మరణాలు 28 శాతం, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సేవలందక జరిగే మరణాలు 10 శాతం ఉన్నాయి. ప్రధాన సూచనలు హృద్రోగులకు ‘స్టెమి’తో అత్యవసర చికిత్స చేస్తున్నాం.. గుండెపోటు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్టెమీ’ (ఎస్టీ–ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) పేరిట దాదాపు అన్ని బోధనాస్పత్రుల్లో అమలు చేస్తున్న కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. హృద్రోగులకు అత్యవసర చికిత్సలో భాగంగా టెలీ–ఈసీజీ పరికరం ద్వారా గుండె పనితీరు తెలుసుకుంటాం. ఇందులో ఉన్న సాంకేతికత వల్ల ఈసీజీ ఫలితం వైద్య శాఖ ప్రధాన కార్యాలయానికి సైతం క్షణాల్లో వెళ్తుంది. అవసరమైన రోగికి రూ.40వేల నుంచి రూ.70వేల విలువ కలిగిన ఇంజక్షన్‌ను ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తోంది. క్షణాల్లో రోగికి దాన్ని ఇస్తుండటంతో మరణాలు తగ్గుతున్నాయి. అయితే ఇతర అత్యవసర సేవలు అందించేందుకు మొబైల్ ఎమర్జెన్సీ సేవలను మెరుగ్గా అమలు చేయాలి.– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అత్యవసర సేవలను ఇటీవలే పునరుద్ధరించాం మా ఆస్పత్రికి అత్యవసర చికిత్స కోసం రోజుకు సగటున 10 మంది బాధితులు వస్తున్నారు. సాధ్యమైనంత వరకు వాళ్లందరికీ ఇక్కడే సత్వర వైద్యసేవలు అందిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా ఇప్పటివరకు ఉన్న మా ఆస్పత్రిలో ఇటీవలే అత్యవసర సేవల విభాగాన్ని పునరుద్ధరించాం. – డాక్టర్ రాజేంద్రనాథ్, కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ప్రభుత్వ వైద్యంపై భరోసా.. ఆచరణలో చూపుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): నాటి ఐటీడీఏ పీఓ, నేటి ఖమ్మం జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తదితర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. చిన్నపాటి జ్వరమొస్తేనే కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మెరుగైన వైద్యం అందుతుందని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లోనూ నిరూపిస్తున్నారు. తమ సతీమణులకు వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించడంపై అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే ఇప్పటికీ చాలా మందిలో తెలియని అపనమ్మకం, రిస్క్ చేస్తున్నామా అనే ఆందోళన వెంటాడుతుంటాయి. అందుకే అప్పు చేసైనా సరే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయాన ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు జరిగేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యంపై చిన్నచూపు చూస్తున్న ప్రజల్లో అపోహలు తొలగించేలా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కృషి చేస్తుండడం విశేషం. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసి ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్‌గా వీ.పీ. గౌతమ్ 2019 అక్టోబర్ 28న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తన సతీమణికి ప్రసవం చేయించారు. అలాగే, 2020 ఆగస్టు 27న ఎస్పీ సునీ ల్‌దత్ కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించారు. తాజాగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సైతం తన సతీమణి మాధవికి బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రస వం చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందాలంటూ చెబు తున్న మాటలను ఆచరణలో చూపించిన యువ అధికారులు ‘భేష్’ అనిపించుకున్నారు. ఖమ్మం అదనపు కలెక్టర్ కూడా.. ఖమ్మం అదనపు కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి స్నేహలత మొగిలి విధులు నిర్వర్తిస్తుండగా, ఆమె భర్త, ఐపీఎస్ అధికారి శబరీష్ భద్రాద్రి జిల్లా మణుగూరు ఏఎస్పీగా ఉన్నారు. ఈమేరకు స్నేహలత గతనెల 22న ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. ఆ మరుసటి రోజు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆస్పత్రికి వెళ్లి స్నేహలత శబరీష్ దంపతులను అభినందించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రత్యేకం ఏజెన్సీలో నిత్యం వందలాది మంది రోగులకు వైద్య సేవలను అందించే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి జిల్లాకే తలమానికంగా ఉంది. భద్రాచలం చుట్టు పక్కల ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సేవలందించటంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ముందంజలోనే నిలుస్తోంది. అత్యధికంగా సాధారణ ప్రసవాలు చేస్తుండడంతో పాటు నవజాత శిశువులు, ఇతరత్రా సేవలను అందించడానికి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. అదేవిధంగా నాలుగు మార్లు కాయకల్ప అవార్డు సొంతం చేసుకున్న ఘనత ఈ ఆస్పత్రి సొంతం. అలాంటి ఏరియా ఆస్పత్రిలో తమ కుటుంబీకులకు వైద్యం చేయించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా కల్పించటానికి యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కృషి చేస్తున్నారు. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసిన వీరపాండియన్ తల్లిదండ్రులు ఇదే ఆస్పత్రిలో వైద్య సేవలను పొందేవారు. ఇవన్నీ పక్కన పెడితే భద్రాద్రి రామయ్య సన్నిధిలో కుమార్తె లేదా కుమారుడు పుట్టాలనే ఆకాంక్ష కూడా పలువురు తల్లిదండ్రులను ఈ ఆస్పత్రికి నడిపిస్తోందని చెబుతారు. కార్పొరేట్ సౌకర్యాలు ఉన్నాయ్..వినియోగించుకోండి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రా ద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. తన సతీమణికి మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పురిటి నొప్పులు రాగా, భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, ఆస్పత్రి పర్యవేక్షకులు రామకృష్ణ పర్యవేక్షణలో వైద్యులు భార్గవి, దేవిక, నర్సులు కళ్యాణి, రాజ్యలక్ష్మి ప్రసవం చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో వసతులు, నిపుణులైన వైద్య సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. దీంతో తన సతీమణికి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవం చేయించినట్లు కలెక్టర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో వెల్లడించారు. -
ప్రధాన ఆస్పత్రుల వద్ద రోగుల సహాయకులకు వసతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులతో పాటు వచ్చే సహాయకులకు వసతి కల్పించేందుకు ఆస్పత్రుల పరిసర ప్రాంతాల్లో తగిన ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులతోపాటు వస్తున్న సహాయకులు సరైన వసతి, సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు శనివారం సీఎస్ సోమేశ్‌కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దసరా పండుగ నుంచే వసతి కేంద్రాలను ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే ఈ కేంద్రాల్లో హరేకృష్ణ మిషన్ ఫౌండేషన్ సహకారంతో సబ్సిడీపై అల్పాహారం, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిల్లో తాగునీరు, శానిటేషన్‌తోపాటు మహిళా అటెండెంట్లకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, హరేకృష్ణ మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ సీఈఓ కౌంతేయ దాస్, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎం.డి. చంద్రశేఖర్, వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
AP: ప్రసవానికి ప్రభుత్వాస్పత్రికొస్తే రూ.11 వేలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.. ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్నవారికి కేంద్రం భాగస్వామ్యంతో రూ.11 వేలు అందిస్తోంది. ఉచిత వైద్యసేవలు, మందులు, ఆహారం, రవాణాకు ఈ రూ.11 వేలు అదనం కావడం విశేషం. ఈ మొత్తాన్ని కూడా నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాలని ఆదేశించింది. ప్రభుత్వాస్పత్రులకు వస్తే అందే ప్రయోజనాలను వివరంగా చెప్పాలని సూచించింది. రవాణా నుంచి వైద్యసేవలన్నీ ఉచితంగానే.. ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు రవాణా నుంచి మందుల వరకు అన్నీ ఉచితమే. గర్భిణికి పురిటినొప్పులు రాగానే 108కు ఫోన్ చేస్తే ఆస్పత్రికి తీసుకెళతారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. 372 పీహెచ్‌సీల్లో జీరో డెలివరీలు రాష్ట్రంలో 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా 372 పీహెచ్‌సీల్లో ఒక్క ప్రసవం కూడా జరగడం లేదు. ఇందులో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 52 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో కూడా సాధారణ ప్రసవాలు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ యోచిస్తోంది. ఇప్పటికే ఇద్దరు వైద్యాధికారులు, ముగ్గురు నర్సులు, లేబర్ రూమ్‌కు కావాల్సిన వసతులు అన్నీ పీహెచ్‌సీల్లో సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 40 శాతం మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిని భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వాస్పత్రులకు వస్తే లాభాలెన్నో.. ► గర్భిణి దశలోనే ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరీక్షలకు వస్తే స్టాఫ్ నర్స్, పీహెచ్ఎన్, ఎంపీహెచ్ఎస్, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తారు. ► సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తారు. సిజేరియన్ అవసరమైతే బాధ్యతగా చేస్తారు. ► ప్రసవం సమయంలో రక్తం అవసరమైతే ప్రభుత్వమే సమకూరుస్తుంది. ► బాలింతకు ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు ఉచితంగా పోషకాహారం అందిస్తారు. ► చిన్నారులకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తారు. ► ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి ఉచితంగా చేర్చుతారు. ► బిడ్డ పుట్టగానే ఆధార్ నమోదు చేస్తారు.. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. బాలింతలకు భారీగా ఆసరా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆసరా ఇస్తోంది. సాధారణ ప్రసవానికి రూ.5 వేలు, సిజేరియన్ ప్రసవానికి రూ.3 వేలు ఇస్తోంది. తల్లి కోలుకునే సమయంలో ఈ మొత్తం వారికి ఎంతో భరోసానిస్తోంది. దీనికి తోడు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, జననీ సురక్ష యోజనల కింద మరికొంత సొమ్ము సమకూరుతోంది. -
AP: ఉత్తమ నిర్వహణతో నాణ్యమైన వైద్యం
ఒక్కో టీచింగ్ ఆస్పత్రికి ప్రత్యేకంగా డిప్యూటీ డైరెక్టర్, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు.. ఒక్కో జిల్లా, ఏరియా ఆస్పత్రులకు వేర్వేరుగా డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ బిల్డింగ్, వైద్య పరికరాలు, సౌకర్యాలు.. బయో మెడికల్ నిర్వహణ, క్యాంటిన్, లాండ్రి, సెక్యూరిటీ.. విభాగాల్లో 1,150 మంది నిష్ణాతుల నియామకానికి కసరత్తు ఏటా నిర్వహణకు రూ.41.3 కోట్లు రాష్ట్రంలోని టీచింగ్, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో వివిధ విభాగాల్లో అపార నైపుణ్యం ఉన్న వైద్యులు.. 24 గంటలూ సేవకు సిద్ధంగా ఉండే నర్సింగ్ సిబ్బంది.. అవసరమైన మేరకు వెనువెంటనే అన్ని పరీక్షలు చేసే ల్యాబ్ విభాగం.. ఇతరత్రా ఏ అవసరం పడినా అందుబాటులో ఉండే ఇతర విభాగాల సిబ్బంది దాదాపు పూర్తి స్థాయిలో ఉన్నారు. అధునాతన పరికరాలు వచ్చి చేరుతున్నాయి. మందులకూ కొరత లేదు. అయితే వచ్చిన సమస్యల్లా నిర్వహణ లోపం. ప్రస్తుతం ఈ రోగాన్ని కుదిర్చి.. రోగులకు సకల సౌకర్యాల మధ్య అత్యుత్తమ వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా విభాగాల నిర్వహణ నిపుణులను నియమించడం ద్వారా అందరూ సమన్వయంతో పనిచేసే చక్కటి వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తున్నారు. సాక్షి, అమరావతి: రూ.వేల కోట్లు వెచ్చించి ఒక పక్క ‘నాడు–నేడు’తో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు సమూలంగా మార్పుచేసి.. నాణ్యమైన వైద్య సేవలందించడంతో పాటు మరోపక్క ఆస్పత్రుల నిర్వహణ అత్యుత్తమంగా ఉండేలా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం సీఎం ఆదేశాల మేరకు ఎయిమ్స్, అపోలో తదితర వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను అధికారులు అధ్యయనం చేశారు. పాదయాత్రలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ లోపాలను స్వయంగా గమనించిన వైఎస్ జగన్.. సూక్ష్మ స్థాయిలో ఆలోచన చేసి, అత్యుత్తమంగా ఆస్పత్రులను నిర్వహించడం ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) రూపొందించాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా బెడ్లు, బాత్రూమ్లు, ఆహారం, వైద్య పరికరాలు, బిల్డింగ్, పారిశుధ్యం, సెక్యూరిటీ, లాండ్రీ వంటి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసుల నిర్వహణతో పాటు బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అధికారుల నియామకానికి అధికారులు కసరత్తు చేశారు. వివిధ విభాగాల నిర్వహణకు నిష్ణాతుల నియామకం అత్యుత్తమ నిర్వహణలో భాగంగా టీచింగ్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు.. అని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఏరియా ఆస్పత్రుల నిర్వహణ సిబ్బందే అవసరమైనప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలకు వెళ్లి సేవలందించేలా అధికారులు మ్యాపింగ్ చేశారు. ఒక్కో టీచింగ్ ఆస్పత్రి నిర్వహణ కోసం ప్రత్యేకంగా డిప్యూటీ డైరెక్టర్‌తో పాటు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లను, ఒక్కో జిల్లా ఆస్పత్రి నిర్వహణ కోసం డిప్యూటీ డైరెక్టర్‌తో పాటు ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను, ఒక్కో ఏరియా ఆస్పత్రి నిర్వహణ కోసం డిప్యూటీ డైరెక్టర్‌తో పాటు ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను నియమించాలని ప్రతిపాదించారు. వీరి పరిధిలో బిల్డింగ్ సర్వీసు, బిల్డింగ్ మౌలిక సదుపాయాలు–పరికరాలు, మెడికల్ ఎక్విప్మెంట్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసు, బయో మెడికల్ నిర్వహణ, లాండ్రీ, క్యాంటీన్, సెక్యూరిటీ రంగాల వారీగా అర్హతగల నిష్ణాతులను నియమించాలని చెప్పారు. ఆయా రంగాల్లో నియమించిన వారికి అవసరమైన నైపుణ్యం కోసం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను అత్యుత్తమంగా ఎప్పటికీ నాణ్యత, పరిశుభ్రంగా ఉండేలా చూసేందుకు 1,150 మంది అవసరం అవుతారని అధికారులు లెక్క తేల్చారు. ఇందుకోసం ఏడాదికి రూ.41.3 కోట్లు వ్యయం కానుంది. టీచింగ్ ఆస్పత్రుల నిర్వహణ ఇలా.. డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో బయో మెడికల్ ఇంజనీర్, ఇద్దరు టెక్నీషియన్లు, ఒక సివిల్ ఇంజనీర్, ఇద్దరు ప్లంబర్లు, ఇద్దరు ఆక్సిజన్ పైప్లైన్లు నిర్వహించే వారు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, ముగ్గురు ఎలక్ట్రీషియన్లు, ఒక ఎస్టీపీ/ఈటీపీ, ఒక ఫైర్ ఫైటింగ్ సిబ్బంది, ఇద్దరు జనరల్ డ్యూటీ టెక్నీషియన్లు ఉంటారు. మరో అసిస్టెంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో నలుగురు ఫెసిలిటీ మేనేజర్ల పర్యవేక్షణలో పారిశుధ్యం, సెక్యూరిటీ, పెస్ట్, లాండ్రీ, బయో వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ ఉంటుంది. జిల్లా ఆస్పత్రుల నిర్వహణ ఇలా.. డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక బయో మెడికల్ ఇంజనీర్, ఒక టెక్నీషియన్, ఒక సివిల్ ఇంజనీర్, ఒక ప్లంబర్, ఆక్సిజన్ పైప్‌లైన్ నిర్వహణ సిబ్బంది ఒకరు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇద్దరు ఎలక్ట్రీషియన్లు, ఒక ఎస్టీపీ/ఈటీపీ, ఒక ఫైర్ ఫైటింగ్ సిబ్బంది, ఒక ఐటీ అసిస్టెంట్, ఇద్దరు జనరల్ డ్యూటీ టెక్నీషియన్లు, ఇద్దరు ఫెసిలిటీ మేనేజర్ల పర్యవేక్షణలో పారిశుధ్యం, సెక్యూరిటీ, పెస్ట్, లాండ్రీ, బయో వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ ఉంటుంది. ఏరియా, సీహెచ్‌సీ ఆస్పత్రుల నిర్వహణ ఇలా డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక బయో మెడికల్ ఇంజనీర్, ఒక టెక్నీషియన్, ఒక సివిల్ ఇంజనీర్, ఒక ప్లంబర్, ఆక్సిజన్ పైప్‌లైన్ నిర్వహణ సిబ్బంది ఒకరు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక ఫైర్ ఫైటింగ్ సిబ్బంది, ఒక ఐటీ అసిస్టెంట్, ఒక జనరల్ డ్యూటీ టెక్నీషియన్, ఒక ఫెసిలిటీ మేనేజర్ పర్యవేక్షణలో పారిశుధ్యం, సెక్యూరిటీ, పెస్ట్, లాండ్రీ, బయో వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ ఉంటుంది. నిర్వహణపై పర్యవేక్షణ సీఎం ఆదేశాల మేరకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను అధ్యయనం చేశాం. తద్వారా ఇంకా మెరుగ్గా ప్రభుత్వ ఆస్పత్రులను అత్యుత్తమంగా నిర్వహించి, నాణ్యమైన వైద్యం అందించేందుకు విధానాలను రూపొందించాం. బెడ్లు, బాత్రూమ్లు, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత.. ఇలా అన్నీ బావుండాలన్నది సీఎం ఉద్దేశం. ఇందుకు మానవ వనరుల్లో నైపుణ్యతను పెంచేందుకు అవసరమైన శిక్షణ ఇస్తాం. ఆ తర్వాత నిర్వహణ పర్యవేక్షణపై కూడా దృష్టి పెడతాం. – డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ -
వీడుతున్న ‘మసక’ తెరలు
సాక్షి, అమరావతి: కళ్లు మసకబారడం, కంటి శుక్లాలతో చూడటానికి ఇబ్బందులు పడ్డ అవ్వాతాతల కష్టాలకు ప్రభుత్వం చరమగీతం పలికింది. 60 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అద్దాలు కూడా ఉచితంగా ఇస్తోంది. దీంతో ఇన్నాళ్లూ మసక మసక కంటిచూపుతో బాధపడ్డ అవ్వాతాతలు ఇప్పుడు ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడ్డారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం అవ్వాతాతలకు చేస్తున్న కంటి పరీక్షల సంఖ్య 12.19 లక్షలు దాటింది. ఇందులో 6.85 లక్షల మందికి పైగా కళ్లద్దాలు అవసరమని వైద్యులు తేల్చారు. అంటే.. 56 శాతం మందికి పైగా కళ్లద్దాలు అవసరం. వీరికి దశల వారీగా ప్రభుత్వం కళ్లద్దాలు ఉచితంగా అందిస్తోంది. అలాగే కంటి శుక్లాలతో బాధపడ్డవారికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించడంతో బాధితులకు పెద్ద సమస్య నుంచి విముక్తి లభించింది. పరీక్షలు చేసిన 12.19 లక్షల మందిలో 1.09 లక్షల మందికి కేటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని గుర్తించగా ఇప్పటికే 91 శాతం మందికి సర్జరీలు పూర్తి చేశారు. ఇంత పెద్ద ఎత్తున కంటి వైద్య పరీక్షలు చేస్తున్న రాష్ట్రం దేశంలోనే లేకపోవడం గమనార్హం. 297 మండలాల్లో పరీక్షలు పూర్తి సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలో 297 మండలాల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు పూర్తయ్యాయి. మరో 370 మండలాల్లో కొనసాగుతోంది. రోజుకు 50 కేసులకుపైగా పరీక్షలు చేసే బృందాలు 33 పనిచేస్తున్నాయి. అలాగే 25 నుంచి 50 వరకు చేసే బృందాలు 195, 10 నుంచి 25 వరకు చేసే బృందాలు 129, పది మంది కంటే తక్కువగా చేసే బృందాలు 21 విధులు నిర్వహిస్తున్నాయి. కంటి వైద్యులు, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లు మొత్తం కలిపి 370 బృందాలు పనిచేస్తున్నాయి. ఇవి వారానికి సగటున 55 వేల మందికి పైగా పరీక్షలు చేస్తున్నాయి. 99 వేల మందికిపైగా సర్జరీ పూర్తి రాష్ట్రవ్యాప్తంగా కంటిశుక్లాలతో సరిగా చూపులేక బాధపడుతున్న అవ్వాతాతల్లో ఇప్పటివరకు 99,752 మందికి కేటరాక్ట్ సర్జరీలు పూర్తి చేశారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12,898 మందికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఇందులో 11,700 సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 54 వేలకుపైగా ఎన్జీవో ఆస్పత్రుల్లో, 33 వేలకు పైగా ప్రైవేటు ఆస్పత్రుల్లో (ఆరోగ్యశ్రీ కింద) చేశారు. దీనికంటే ముందే తొలి దశలో అన్ని స్కూళ్లలో 66 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంకా ఎక్కువ చేయాలి.. ప్రస్తుతం చేస్తున్న వాటికంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయాలని సూచించాం. ఇప్పటికే ప్రభుత్వ వైద్యులకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో అత్యాధునిక వైద్యానికి సంబంధించిన శిక్షణ ఇప్పించాం. కంటి సర్జరీలకు అవసరమైన వైద్య ఉపకరణాలన్నీ అందుబాటులో ఉన్నాయి. బోధనాస్పత్రుల్లో ఆపరేషన్లు ఎక్కువగా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – డా.హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటివెలుగు -
TS: కేంద్రం తోడ్పాటు.. ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్ ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైద్య వ్యవస్థలు ఆగమాగమయ్యాయి. రెండో వేవ్ అయితే జనం జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనా డెల్టా వేరియంట్ పంజా విసరడంతో లక్షలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఆక్సిజన్ దొరక్క, శ్వాస ఆడక నానాయాతన పడ్డారు. ఆక్సిజన్ సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయినవారూ ఎందరో! ఇలాంటి నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేదిశగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. లిక్విడ్ ఆక్సిజన్‌ను తెప్పించి రోగులకు అందించడం కంటే.. అక్కడికక్కడే ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పీఎస్ఏ)’ ఆక్సిజన్ ప్లాంట్లను.. రాష్ట్రవ్యాప్తంగా ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లో నెలకొల్పుతోంది. తొలిదశ కింద ఇప్పటికే ఐదు ప్లాంట్ల నిర్మాణం పూర్తయింది. రెండో ఫేజ్‌లో 45 ప్లాంట్ల నిర్మాణం చేపట్టగా.. 39 ప్లాంట్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. మిగతావాటి పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. అన్నింటి నిర్మాణం పూర్తయ్యాక.. వచ్చే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్యారోగ్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7,670 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని.. త్వరలో ఈ సంఖ్య భారీగా పెరగనుందని పేర్కొన్నాయి. వేల సంఖ్యలో బెడ్లకు.. నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లు కలిపి 50 ఆస్పత్రుల్లో 27,792 పడకలకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. వీటిన్నింటిలో కలిపి మొత్తం గా నిమిషానికి 67,100 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు తెలిపారు. ఇవేగాకుండా మరో 33 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక.. సాధారణ వైద్య సేవలతోపాటు అత్యవసర చికిత్సలకు ఆ క్సిజన్ కొరత ఉండబోదని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య రంగంలో ఇది కీలకమైన అడుగు అని అన్నారు. ఇప్పటిదాకా బయటి నుంచి తెచ్చి.. ►ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్ రెండు పద్ధతుల ద్వారా సరఫరా అవుతోంది. ►ఒక పద్ధతి ప్రకారం ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసి వాటి ద్వారా రోగులకు అందజేస్తున్నారు. వివిధ కంపెనీల నుంచి ఈ సిలిండర్లను కొనుగోలు చేస్తారు. ఖాళీ అయినకొద్దీ రీఫిల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కరోనా సమయం నుంచి డిమాండ్ పెరగడంతో ఈ సిలిండర్ల కొరత ఏర్పడింది. అడ్డగోలు రేట్లకు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ►లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా సరఫరా చేయడం రెండోది. పెద్ద పెద్ద కంపెనీల నుంచి నేరుగా టన్నుల కొద్దీ లిక్విడ్ ఆక్సిజన్‌ను కొనుగోలు చేస్తారు. ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసుకునే భారీ ట్యాంకుల్లో దానిని నింపి.. పైపులైన్ల ద్వారా వార్డుల్లో పేషెంట్లకు అందిస్తారు. అయితే ఈ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా సక్రమంగా లేకపోవడం, జాప్యం, లీకేజీలు వంటి సమస్యలతో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ►ప్రస్తుతం చాలా వరకు ప్రైవేట్ ఆస్పత్రులు సిలిండర్ల ద్వారానే ఆక్సిజన్‌ను రోగులకు అందిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పి సరఫరా చేస్తున్నారు. ఇక ముందు నేరుగా.. నేరుగా గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ‘పీఎస్ఏ’ప్లాంట్లను ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్లు గాలిని ప్రాసెస్ చేసి 94 శాతం నుంచి 96 శాతం వరకు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని పైపుల ద్వారా వార్డులకు, బెడ్స్‌కు అనుసంధానం చేసి.. రోగులకు అందజేస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. వాటి పక్కనే పీఎస్ఏ ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. రెండింటినీ అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు ఏ ఆక్సిజన్ అందుబాటులో ఉంటే.. దానిని వాడుకునే వీలు కలుగనుంది. ఈ ఏర్పాటుతో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడబోదని అధికారులు అంటున్నారు. గతంలో లాగా ఆక్సిజన్‌ను కొనాల్సిన అవసరం ఉండదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్తున్నారు. -
ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ చికిత్సల కింద ప్రభుత్వ ఆస్పత్రులకు అందుతున్న నిధులు గణనీయంగా పెరుగుతున్నాయి. చక్కటి మౌలిక వసతులు, వైద్య సిబ్బంది సేవలు మెరుగ్గా అందుబాటులోకి రావడం వల్ల ఎక్కువ మంది రోగులు ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ కేర్ ఆస్పత్రులైన వైద్య విధాన పరిషత్ పరిధిలోని సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు పెరగడం మంచి పరిణామంగా పేర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017లో వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులకు రూ.16.10 కోట్ల మేర ఆరోగ్యశ్రీ నిధులు అందగా 2020లో రూ.35.78 కోట్లు విడుదలయ్యాయి. 100 శాతానికిపైగా నిధుల పెరుగుదల కనిపించింది. నాడు నేడు పనులు పూర్తయితే.. ప్రస్తుతం సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో నాడు – నేడు ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కొత్త భవనాల నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ పూర్తయితే ఆరోగ్యశ్రీ చికిత్సలు మరిన్ని జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 60 శాతం ఆరోగ్యశ్రీ నిధులు ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళుతున్నాయి. అదే ప్రభుత్వ పరిధిలో అన్ని ఆస్పత్రుల అభివృద్ధి జరిగితే ఆ మేరకు నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకే అందే అవకాశం ఉంది. క్రమంగా ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులను పెంపొందించి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉత్తమ చికిత్సలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. డాక్టర్ పోస్టుల భర్తీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీపై అధికారులు దృష్టి సారిం చిన విషయం తెలిసిందే. 2020లో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే 232 మంది వైద్యులను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. తిరిగి 2021లో 460 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టారు. తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లోనూ 196 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 12 మంది డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించనున్నట్లు ప్రకటించారు. ఇవీ చదవండి: 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు రియా చక్రవర్తితో సంబంధమేంటి? -
రికార్డు స్థాయి నియామకాలు.. 27 నెలల్లో 14 వేల పోస్టుల భర్తీ
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రికి రావాలంటేనే రోగులు భయపడే పరిస్థితి. వైద్యుల కొరతతో రోగులకు సకాలంలో సరైన చికిత్స అందేది కాదు. నర్సులు నియామకాలు లేక సేవలు అరకొరగానే ఉండేవి. మందులుండేవి కావు. నిర్ధారణ పరీక్షలు జరిగేవి కావు. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలకు సరైన వైద్యం అందడానికి ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో 1,500 పోస్టులు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన 27 మాసాల్లోనే ఆరోగ్య శాఖలో సుమారు 14 వేల పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఆ శాఖలో ఇది అతిపెద్ద నియామక ప్రక్రియ అని అధికారులు చెబుతున్నారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు మెరుగవుతున్నాయి. వైద్యుల కొరత లేకుండా భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఒక్క బోధనాసుపత్రుల్లోనే 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేశారు. అంతేకాదు ఒక్కో ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఇద్దరు వైద్యులు ఉండాలనే లక్ష్యంతో 645 మంది ఎంబీబీఎస్ వైద్యులను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. వైద్యవిధానపరిషత్ పరిధిలోని సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులకు 232 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించారు. 1,499 మంది వైద్యులను ప్రభుత్వ పరిధిలో నియమించారు. గత ప్రభుత్వ హయాంలో ఆయుష్ డిస్పెన్సరీల్లో పనిచేసే సుమారు 800 మంది ఉద్యోగులను తొలగించారు. అప్పట్లో జాతీయ ఆరోగ్యమిషన్ ఆయుష్ వైద్యుల నియామకానికి అనుమతించినా రాష్ట్ర సర్కారు చొరవ చూపకపోవడంతో కొత్త ఉద్యోగాల భర్తీ ఊసే లేకపోయింది. మెరుగుపడిన నర్సింగ్ సేవలు గతంలో నర్సులు లేక, సేవలు అందక రోగులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం 4,683 మంది నర్సులను నియమించింది. ఇవి కాకుండా ఇప్పటివరకూ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లలో 1,818 మంది బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మిడ్‌లెవెల్ హెల్త్‌ప్రొవైడర్లుగా నియమించారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో నర్సింగ్ నియామకాలు జరగడంతో బోధనాసుపత్రుల నుంచి పీహెచ్‌సీల వరకూ సేవల్లో గణనీయ మార్పులు వచ్చాయి. 21 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియమించింది. త్వరలో పీహెచ్‌సీలకు నియామకాలు రాష్ట్రంలో ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీలు ఉన్నాయి. కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొత్తగా వచ్చే పీహెచ్‌సీలకు వైద్యులు, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది నియామకాన్ని త్వరలోనే చేపడతాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటాం. – డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సత్వరం పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వెంటనే పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సదుపాయాలను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు గదుల నిర్మాణాల ఆవశ్యకతను సమీక్షించి ఇప్పటికే పనులు ప్రారంభించిన వాటి పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్, పీడియాట్రిక్ ఐసీయూ పడకలను పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యాక్సినేషన్ కోసం మిగిలిన వారందరినీ గుర్తించేందుకు ప్రత్యేకంగా ‘‘మాప్ అప్ డ్రైవ్’’నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య, విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య పరికరాలకు ‘చికిత్స’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రులకు ఆధునిక వైద్య ఉపకరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా వంద రకాల పరికరాలను సర్జికల్ జాబితాలో చేర్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఏటా లక్షలాది శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. కొత్త కొత్త వైద్య పద్ధతులు వస్తున్న నేపథ్యంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి సమీక్ష నిర్వహించి ఆధునిక ఉపకరణాలను అందుబాటులోకి తీసుకురావాలి. కానీ 2014 తర్వాత అప్పటి ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు.. స్పెషాలిటీ వైద్యులు సర్జికల్ జాబితాపై కసరత్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా నిర్వహించిన సమీక్షలో శస్త్రచికిత్సలకు అవసరమైన 390 రకాల సర్జికల్ ఉపకరణాలతో జాబితా తయారు చేశారు. ఇందులో 100 రకాలు కొత్తగా చేర్చినవే. ప్రైవేటు ఆస్పత్రుల్లోని పరికరాల కంటే ఇవి అత్యుత్తమమైనవని వైద్యులు, అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చైనా నుంచి వచ్చిన నాసిరకం పరికరాలు వాడుతుంటారని వివరించారు. ప్రభుత్వ రేటు కాంట్రాక్టులో ఉన్నవన్నీ అమెరికా ఔషధ నియంత్రణతో పాటు డబ్ల్యూహెచ్‌వో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్నవేనని తెలిపారు. జనరల్ సర్జరీ, గ్యాస్ట్రిక్, ప్రసవాల్లో వాడే పరికరాల్లో ఆధునికమైనవి ఎక్కువగా వచ్చాయని చెప్పారు. గతంలో శస్త్రచికిత్సలు చేసేటప్పుడు శరీరంపై కోతలు ఎక్కువగా పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న గాటుతో చికిత్స చేసే ల్యాప్రోస్కోపిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి వైద్య ఉపకరణాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. రేటు ఎక్కువైతే పునఃసమీక్ష.. మొత్తం 390 రకాల పరికరాల్లో.. రేటు ఎక్కువగా ఉన్న వాటి విషయంలో పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. మొదటిసారిగా సర్జికల్ ఉపకరణాలను అన్ని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న స్పెషాలిటీ వైద్యుల అభిప్రాయాలు తీసుకుని మరీ నిర్ధారించారు. ఆధునిక వైద్య పరికరాలు గతంలోని రేటు కాంట్రాక్టులో లేకపోవడంతో.. ఆస్పత్రుల్లో లోకల్ పర్చేజీ కింద ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తే మరింత రేటు తగ్గుతుందని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు. ఏటా లక్షలాదిమంది సర్జరీ చేయించుకునేందుకు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారని, ఆధునిక వైద్యపరికరాలుంటే రక్తస్రావం తక్కువగా ఉండటం, త్వరగా గాయాలు మానడం, ఇన్ఫెక్షన్లు తగ్గడం వంటి ఉపయోగాలుంటాయని వైద్యులు చెప్పారు. అందరి అభిప్రాయాలతోనే.. ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుపై స్పెషాలిటీ వైద్యులు కసరత్తు చేశాకే నిర్ధారణకు వచ్చాం. బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యుల అభిప్రాయాలు తీసుకున్నాం. అందరి అభిప్రాయాల మేరకే ఉపకరణాల జాబితా తయారు చేశాం. సర్జికల్ బడ్జెట్ కొంత పెంచాల్సి ఉంది. దీని కోసం ప్రయత్నిస్తున్నాం. – డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు -
కాన్పు కోసం వస్తే కాసులు పిండేస్తున్నారు..
కాన్పు కోసం వస్తే కాసులు పిండేస్తున్నారు.. ప్రసవం చేస్తే వేలకు వేలు గుంజేస్తున్నారు.. సొమ్ము ఇవ్వలేని నిరుపేదలను నీచంగా చూస్తున్నారు.. మాటలతోనే మనసును కుళ్లబొడుస్తున్నారు.. మానవత్వం మరిచి.. ఆమ్యామ్యాల కోసం అర్రులు చాస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో సిబ్బందే, రాబందులై ప్రజలను పీక్కుతింటున్నారు. చిత్తూరు రూరల్: చిత్తూరు నగరంలోని జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం అధిక సంఖ్యలో పేదలే వస్తుంటారు. సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడువాసులు కూడా ప్రసవం కోసం ఇక్కడికే వస్తుంటారు. రోజుకు సగటున 25 నుంచి 30 కేసులు డెలివరీ కోసం వస్తుంటాయి. వీరిని లక్ష్యంగా చేసుకుని కొందరు సిబ్బంది అదేపనిగా డబ్బులు దండుకుంటున్నారు. వసూళ్లు ఇలా.. ప్రసూతి విభాగంలో ఉదయం, రాత్రి, అత్యవసరమైతే మధ్యాహ్న వేళల్లో ప్రసవం కోసం ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఇక్కడ సిబ్బందిలో కొందరు బిడ్డను చూపించిన వెంటనే కాసులు అడుగుతున్నారు. అది కూడా రూ.1000 లేదా రూ.2000 అనుకుంటే పొరబాటే. ఏకంగా రూ.10 వేల నుంచి రూ.30వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణులు, తమిళనాడు వాసులను టార్గెట్ చేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆపరేషన్ అయిన వెంటనే బెడ్‌పైకి మార్చాలని, క్లీనింగ్ పేరు చెప్పి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారు. పురిటినొప్పులే నయం.. చిత్తూరు ఆస్పత్రికి ప్రసవానికొచ్చే వారికి పురిటినొప్పుల కంటే.. అక్కడ పనిచేసే సిబ్బంది తీరుతో పడే ఇబ్బందులే అధికం అంటే అతిశయోక్తి కాదేమో. వారు అడిగిన డబ్బులిస్తే పని చేస్తారు. లేకుంటే డబ్బు కోసం పీడిస్తారు. ఇచ్చే వరకు దుర్భాషలాడుతారు. ఆ మాత్రం డబ్బులు ఇవ్వలేనివాళ్లు ఎందుకొచ్చారంటూ.. తీవ్రంగా అవమానిస్తారు. డబ్బులిచ్చే వరకు జలగల్లా పట్టుకుంటారు. వారిని అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు. ►4 పలమనేరుకు చెందిన కోకిల(19) కాన్పు కోసం తమిళనాడులోని వేలూరులో అరుకంబడి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో గతవారం చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఇక్కడ ఆపరేషన్ చేయడంతో ఆడబిడ్డ జన్మించింది. అయితే బిడ్డను చేతిలో పెట్టగానే ఆస్పత్రి సిబ్బంది కోకిల తల్లిని రూ.20 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.10 వేలు గుంజేశారు. బిడ్డను ఏమైనా చేస్తారేమో అని భయపడి డబ్బు ఇచ్చామని బాధితురాలు కంటతడి పెట్టింది. ►4 తిరుత్తణికి చెందిన అనిత(25) ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రిలో చేరి, ఆదివారం డిశ్చార్జ్ అయ్యింది. ఆమె కుటుంబ సభ్యుల వద్ద కూడా సిబ్బంది రూ.10 వేలు లాగేశారు. అడిగినంత ఇస్తేనే.. మీ బిడ్డను బయటకు తెస్తాం అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ మాత్రం ఇవ్వలేని వారు మీకెందుకు బిడ్డలంటూ హేళన చేశారు. బాధితులు చేసేది లేక అప్పుచేసి.. వారికి అడిగినంతా ముట్టజెప్పారు. -
‘మూడో వేవ్’ నిరోధానికి ముందస్తు వ్యూహం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మూడో వేవ్ కరోనా వార్తల నేపథ్యంలో ముందస్తు వ్యూహం అమలు చేయనుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్లానింగ్ పేరుతో నిధులు కేటాయించనున్నాయి. ఏపీకి కేటాయించిన రూ.696 కోట్ల నిధుల్లో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించనున్నాయి. ఈ నిధులతో 14 జిల్లా ఆస్పత్రుల్లో, 12 బోధనాస్పత్రుల్లో పీడియాట్రిక్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం రూ.101.14 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఒక్కో పీడియాట్రిక్ కేర్ యూనిట్లో 42 పడకలుంటాయి. అలాగే రాష్ట్రంలోని మరో 28 ఏరియా ఆస్పత్రుల్లో 40 లెక్కన 1,120 ఐసీయూ పడకలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం రూ.188.72 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. గుంటూరు లేదా విజయవాడలో చిన్నపిల్లలకు సంబంధించి.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేస్తారు. దీనికోసం రూ.5 కోట్లు ఖర్చు చేస్తారు. పీహెచ్సీ నుంచి సీహెచ్‌సీ వరకు.. ► ప్రతి పీహెచ్‌సీలోనూ 6 పడకల నాన్ ఐసీయూ యూనిట్‌ను, ప్రతి సామాజిక ఆరోగ్యకేంద్రంలో 20 పడకల నాన్ ఐసీయూ యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం రూ.185 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ► 1,145 పీహెచ్‌సీల్లో, 208 సీహెచ్‌సీల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ► కోవిడ్ మేనేజ్మెంట్ నిర్వహణలో భాగంగా 14 చోట్ల 50 పడకలు లేదా 100 పడకల ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తారు. ► 100 పడకల ఆస్పత్రికి రూ.7.5 కోట్లు, 50 పడకల ఆస్పత్రికి రూ.3.5 కోట్లు ఖర్చవుతుంది. ► వీటిని శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ► ప్రతి ఆస్పత్రిలోనూ ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేస్తారు. ► రూ.8.38 కోట్ల వ్యయంతో హబ్స్ అండ్ స్పోక్స్ ద్వారా టెలీమెడిసిన్‌ను బలోపేతం చేస్తారు. ► ప్రతి ఆస్పత్రిలో అత్యవసర మందుల బఫర్ స్టాకు కోసం జిల్లాకు రూ.కోటి కేటాయిస్తారు. ► కోటి ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం రూ.50 కోట్లు కేటాయిస్తారు. ► కోవిడ్ సేవలకు గానూ 2,089 మంది పీజీ వైద్య విద్యార్థులు, 2,890 మంది ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు, 1,750 మంది ఎంబీబీఎస్ చదువుతున్న వారు, 2వేల మంది నర్సింగ్ విద్యార్థులను 4 నెలల కాలానికి ప్రాతిపదికన నియమిస్తారు. వీరికి వేతనాల కింద రూ.80.12 కోట్లు ఖర్చవుతుందని అంచనా. -
ప్రభుత్వాస్పత్రులకు బయో మెడికల్ ఇంజనీర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయో మెడికల్ఇంజనీర్లను నియమించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. కొత్త పోస్టుల మంజూరుపై దృష్టి సారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఎంజీఎం సహా పెద్దాస్పత్రులకు ఒక్కో బయో మెడికల్ ఇంజనీర్ ఉండేలా చూడాలని భావిస్తోంది. రెండు జిల్లాలకు కలిపి ఒక అధికారిని నియమించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో భర్తీ చేసే అవకాశముంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, అనుమతి రాగానే భర్తీ చేస్తామని ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 30 వేల రకాల పరికరాలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో థర్మామీటర్ మొదలుకొని ఎక్స్‌రే, ఈసీజీ, సీటీ స్కాన్, 2డీ ఎకో, టీఎంటీ, అల్ట్రా సౌండ్ మెషీన్, ఆక్సిజన్ పైప్‌లైన్ వ్యవస్థ వంటివి అనేకం ఉంటాయి. ఆపరేషన్ థియేటర్, ఐసీయూల నిర్వహణ ఎంతో కీలకమైనవి. చిన్నా పెద్దా కలుపుకొని దాదాపు 30 వేల రకాల వైద్య పరికరాలు ఉంటాయి. రూ.వందల కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తే, చిన్న మరమ్మతు కారణంగా వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించినా, వారు వచ్చి బాగుచేసే సరికి రోజులు గడుస్తున్నాయి. కొన్నిసార్లు నెలలు గడిచినా మరమ్మతులకు నోచుకోవట్లేదు. కొన్ని పరికరాలు తుక్కుగా మారుతున్నాయి. ఆయా మెషీన్లకు సంబంధించి పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో రోగులకు సక్రమంగా వైద్యం అందట్లేదు. అల్ట్రా సౌండ్ లేదనో, 2డీ ఎకో లేదనో చెప్పి రోగులను పైస్థాయి ఆస్పత్రులకు పంపుతున్నారు. మరమ్మతుల ఆలస్యానికి చెక్.. రాష్ట్ర మౌలిక సేవలు, వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ద్వారా వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అందుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తారు. వైద్య పరికరాల నాణ్యతను పరీక్షించడం, వాటిని మరమ్మతుల్లో కీలకపాత్ర పోషించే బయో మెడికల్ ఇంజినీర్లు ముగ్గురే ఉన్నారు. వైద్య పరికరాలు చెడిపోతే కంపెనీ టెక్నీషియన్లు వచ్చి బాగు చేస్తారు. పరికరాల నిర్వహణకు సంబంధించి నిర్ణీత సమయం గడిచాక కంపెనీలకు వాటి మరమ్మతుతో సంబంధం ఉండదు. అలాంటి పరికరాలను థర్డ్ పార్టీకి చెందిన టెక్నీషియన్లు వచ్చి మరమ్మతు చేయాలి. అవి పాడైనట్లు బయో మెడికల్ ఇంజినీర్లు గుర్తించాలి. వీరు చాలా తక్కువ సంఖ్యలో ఉండటంతో రోజుల తరబడి ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో బయో మెడికల్ ఇంజినీర్లను నియమిస్తే తక్షణమే గుర్తించి కంపెనీ టెక్నీషియన్లను పిలిపిస్తారు. తద్వారా వైద్య పరికరాల నిర్వహణ, మరమ్మతుల్లో ఆలస్యానికి చెక్ పడనుంది. పైస్థాయి ఆస్పత్రులకు పంపుతున్నారు. మరమ్మతుల ఆలస్యానికి చెక్..: రాష్ట్ర మౌలిక సేవలు, వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అందుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తారు. వైద్య పరికరాల నాణ్యత పరీక్షించడం, మరమ్మతుల్లో కీలక పాత్ర పోషించే బయో మెడికల్ ఇంజనీర్లు ముగ్గురే ఉన్నారు. వైద్య పరికరాలు పాడైతే కంపెనీ టెక్నీషియన్లు వచ్చి బాగు చేస్తారు. పరికరాల నిర్వహణకు సంబంధించి నిర్ణీత సమయం గడిచాక కంపెనీలకు వాటి మరమ్మతుతో సంబంధం ఉండ దు. వాటిని థర్డ్ పార్టీ టెక్నీషియన్లు మరమ్మతు చేయాలి. అవి పాడైనట్లు బయో మెడికల్ ఇంజనీర్లు గుర్తించాలి. వీరు చాలా తక్కువ సంఖ్యలో ఉండటంతో రోజుల తరబడి ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో బయో మెడికల్ ఇంజనీర్లను నియమిస్తే తక్షణమే గుర్తించి కంపెనీ టెక్నీషియన్లను పిలిపిస్తారు. తద్వారా వైద్య పరికరాల నిర్వహణ, మరమ్మతుల్లో ఆలస్యానికి చెక్ పడనుంది. -
ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలు, వైద్య పరికరాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, శానిటేషన్, రోగులకు అందించే ఆహారంపై శ్రద్ధ పెట్టాలని, వీటిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. కోవిడ్–19 నియంత్రణ, చికిత్స, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల్లో వసతులపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ కోసం పటిష్ట యంత్రాంగం ఉండాలన్నారు. ప్రభుత్వ, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలున్న మందులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. 21 రోజుల్లో కచ్చితంగా ఆరోగ్యశ్రీ, 104, 108 బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వాటి నిర్వహణకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని, రోగులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న 16 మెడికల్ కాలేజీలు, ఆధునీకరిస్తున్న 11 పాత వైద్య కళాశాలలు, హెల్త్ హబ్స్‌తో ఆరోగ్య రంగం మరింత బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హెల్త్ హబ్స్‌కు స్థలాలు.. ఆవాసాలకు దగ్గరగానే ఉండేలా చూడాలన్నారు. అప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని చెప్పారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా హెల్త్ హబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు. కోవిడ్ నియంత్రణ, చికిత్స, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల్లో వసతులపై క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెల్త్ హబ్స్‌లలో ఉత్తమ వైద్యం ► జిల్లాల్లో హెల్త్ హబ్స్‌పై గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏయే చికిత్సల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్న దానిపై వివరాలు వెల్లడించారు. క్యాన్సర్, గుండె జబ్బులు, చిన్న పిల్లల సర్జరీల కోసం అధికంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు. ► ఈ వ్యాధులకు ఇక్కడి హబ్స్‌లో వైద్య సేవలు అందేలా.. ఆ రకమైన స్పెషాల్టీ ఆస్పత్రుల ఏర్పాటుకు హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చేలా చూస్తున్నామని చెప్పారు. పాజిటివిటీ రేటు తగ్గుతోంది.. ► రాష్ట్రంలో కోవిడ్ కేసులు గణణీయంగా తగ్గుతున్నాయని, ఆరు జిల్లాల్లో ఐదు శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు సగటు 96.59 శాతం ఉంటే ఏపీలో 96.67 శాతం ఉందని తెలిపారు. సీఎంకు వారు ఇంకా ఏం చెప్పారంటే.. ► 50 వేల దిగువకు యాక్టివ్ కేసులు. పాజిటివిటీ రేటు 5.23 శాతం. కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు. ► ప్రైవేటు ఆస్పత్రుల్లో అక్యుపై అయిన పడకల్లో 76.51 శాతం రోగులకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స. ► 104కు గణనీయంగా తగ్గిన కాల్స్. జూన్ 25న కేవలం 1,021 కాల్స్ మాత్రమే వచ్చాయి. ► 3,148 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. ఇందులో 1,095 మందికి సర్జరీలు చేశారు. 237 మంది మరణించారు. 1,398 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోంది. ► రాష్ట్ర వ్యాప్తంగా 134 ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. 50 అంతకంటే ఎక్కువ పడకలున్న ఆస్పత్రుల్లో జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు. సెప్టెంబర్ నాటికి 97 ప్లాంట్లు ఏర్పాటవుతాయి. మిగిలిన 37 ప్లాంట్లు రానున్న మార్చి నాటికి పూర్తి చేస్తాం. ► ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
TS: కరోనా చికిత్స, టెస్ట్ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా రాష్టవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్ట్ ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కరోనా చికిత్సల ఛార్జీలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జీవో 40ని జారీ చేసింది. కోవిడ్ సోకి సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ.4 వేలు, ఐసీయూ గదిలో రోజుకు గరిష్టంగా రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ.9 వేలు, పీపీఈ కిట్ ధర రూ.273కి మించరాదని ఆస్పత్రుల ఛార్జిలను ఖారారు చేసింది. హెచ్ఆర్ సీటీ రూ.1995, డిజిటల్ ఎక్స్ రే రూ.1300, ఐఎల్6 రూ.1300 మాత్రమే ఛార్జ్ చేయాలని పేర్కొంది. అదే విధంగా డీ డైమర్ రూ.300, సీఆర్పీ రూ.500, ప్రొకాల్ సీతోసిన్ రూ.1400, ఫెరిటీన్ రూ.400, ఎల్డీహెచ్ రూ.140 ఛార్జీలను నిర్ణయించింది. సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.75, కనీసం రూ.2వేలుగా, ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.125, కనీసం రూ.3వేలుగా ధరలను ప్రభుత్వం ఖారారు చేసింది. చదవండి: CM KCR: హే సీటీలు గొట్టుడు గాదు.. నేనేమన్న యాక్టర్నా.. -
హెల్త్ హబ్‌ల కోసం భూముల గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రధాన నగరాల్లో 16 హెల్త్‌హబ్‌లు నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు స్థలాల కోసం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సీఎం జగన్‌కు ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చారు. అనంతపురంలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో 30 ఎకరాలు.. సుమారు రూ.24 కోట్లు అవుతుందని, అదే కాకినాడలో 30 ఎకరాలు రూ.27 కోట్లు అవుతుందని తేల్చారు. గుంటూరు జిల్లాలో ఒకచోట 16.54 ఎకరాలు, మరో చోట 22 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 20 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూములను గుర్తించారు. ఇక కర్నూలు జిల్లాలో ఒక చోట 58.44 ఎకరాలు, మరోచోట 52.45 ఎకరాల ప్రభుత్వ భూములు హెల్త్‌సిటీకి అనువుగా ఉన్నాయని నిర్ధారించారు. శ్రీకాకుళం జిల్లాలో 30 ఎకరాల ప్రైవేటు స్థలం గుర్తించగా.. దీని విలువ రూ.15 కోట్లు ఉంటుందని తేలడంతో మరో చోట 10 ఎకరాల ప్రభుత్వ భూమిని చూశారు. విశాఖలో 30 ఎకరాలు, విజయనగరంలో 74.80 ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకచోట 32 ఎకరాలు, మరోచోట 50 ఎకరాల ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఇవి రెండూ ఏలూరు కార్పొరేషన్‌కు సమీపంలో ఉన్నవే. పైన పేర్కొన్న అన్ని స్థలాలూ ఆయా జిల్లాల కార్పొరేషన్లకు అత్యంత సమీపంలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఒకటి, రెండు చోట్ల మినహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములే గుర్తించినట్లు తెలిపారు. -
ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికి 10 ఐసీయూ బెడ్లు
సాక్షి, అమరావతి : నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో నిర్మాణ్ సంస్థ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏపీలోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చి అత్యాధునికంగా తీర్చిదిద్దేదుoకు ప్రభుత్వం ఇప్పటికే నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజారోగ్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి మౌలిక వసతులను కల్పించడం ద్వారా సుస్థిర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారు. పేదలకు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందించేందుకు నిర్మాణ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్మాణ్ సంస్థ ఆపరేషన్స్ హెడ్ శ్రీకాంత్ నాథాముని, ఖోశ్లా వెంచర్స్ ఫౌండర్ వినోద్ ఖోశ్లా ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి ముఖ్యకారకులు. ఏపీ ప్రభుత్వం తరపున న ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్, ఉత్తర అమెరికా- రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇందులో భాగంగా దాతలను గుర్తించి, వారిని విరాళం అందించేలా ప్రోత్సహించనున్నారు. ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా ప్రతి ఐసీయూ యూనిట్ మీద సంబంధిత దాతల పేరు ఉంటుంది. ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం డా. అర్జా శ్రీకాంత్‌ను ముఖ్య అధికారిగా నియమించింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు.. ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగైన వైద్య సేవలందించేందుకు సిద్ధం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని జూన్ 5న మంత్రి కల్వకుంట్ల తారక్ రామారావు ప్రారంభించారు. పేదలకు ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాల్సిందిగా ప్రతి ఒక్కరికీ మా విన్నపం. ఇప్పటికి 22 ప్రభుత్వ వైద్యశాలలకు దాతలు ముందుకు వచ్చారు , ఇంకా విరాళం అందించేందుకు ఆసక్తి ఉన్న దాతలు ఈ క్రింది లింక్ ద్వారా తమ విరాళాన్ని అందించవచ్చు. -
ముందు మీ లాంగ్వేజ్ మార్చండి, నర్స్‌లకు వార్నింగ్
న్యూఢిల్లీ : నర్స్‌లు ట్రీట్మెంట్ తరువాత సంగతి ముందు మీరు మాట్లాడే లాంగ్వేజ్‌ను మార్చండి. మాట వినకపోతే మీపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ సర్క్యులర్ జారీ చేయడం కలకలం రేపుతోంది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన గోవింద్ బల్లాబ్ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మెర్)కు చెందిన నర్స్ లలో ఎక్కువ శాతం మంది మలయాళం భాష మాట్లాడుతున్నారు. దీనిపై పలువురు పేషెంట్లు ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పేషెంట్ల ఫిర్యాదుతో జీబీ పంత్ నర్స్ యూనియన్ అధ్యక్షుడు లిలాధర్ రామ్ చందాని నర్స్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో నర్స్ లు మలయాళంలో మాట్లాడుకుంటున్నారు. సిస్టర్లు ఏం మాట్లాడుకుంటున్నారో అర్ధం కాక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి నర్స్ లు ఇకపై హింది, ఇంగ్లీష్ భాషలు మాత్రమే మాట్లాడాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా లిలాధర్ మాట్లాడుతూ.. పేషెంట్ల ఫిర్యాదుల కారణంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అంతర్గతంగా, నర్సులు మరియు పరిపాలనలో ఎటువంటి సమస్య లేదు" అని అన్నారు. అయితే ఈ సర్క్యులర్ తో ఇతర నర్సింగ్ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా,మనదేశంలో వివిధ ఆసుపత్రులలో చాలా మంది నర్సులు కేరళకు చెందినవారు. వారి మాతృభాష మలయాళం. తమ మాతృభాష. మలయాళమని, మలయాళంలో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. చదవండి : ‘గూగుల్ చేసిన పనికి క్షమాపణ చెప్పాల్సిందే’ -
ఉచితంగా కోవిడ్ మందులిస్తాం
సాక్షి,అమరావతి: కోవిడ్ –19 చికిత్సలో వాడే మందులను నాట్కో ట్రస్టు తరఫున ఉచితంగా అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నాట్కో ఫార్మా లిమిటెడ్ ఓ లేఖ రాసింది. చికిత్సలో వాడే బారిసిటినిబ్–4 ఎంజీ (బారినట్) టాబ్లెట్లు ఇవ్వనున్నట్టు ఆ లేఖలో పేర్కొంది. సుమారు లక్ష మంది కోవిడ్ పేషెంట్లకు ఈ టాబ్లెట్లు సరఫరా చేస్తామని తెలిపింది. రూ.4 కోట్ల 20 లక్షల ఖరీదు చేసే టాబ్లెట్లను ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు ఇస్తామని పేర్కొంది. విడతల వారీగా మెడిసిన్ సరఫరా చేయనున్నట్లు నాట్కో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ వి.సి. నన్నపనేని స్పష్టం చేశారు. -
ఆక్సిజన్ సరఫరాపై నిత్యం పర్యవేక్షణ
సాక్షి, అమరావతి: వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను తీసుకురావడం, దాన్ని ఆస్పత్రులకు సరఫరా చేయడంపై ప్రతిక్షణం పర్యవేక్షణ చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో ఉన్న ప్లాంట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ నిర్వహణకు సీనియర్ ఐఏఎస్ అధికారులు కలికాల వలవన్, అనంతరాములు, ఏకే పరిడాను నియమించామని తెలిపారు. నేటి నుంచి రెండు వారాల పాటు ఈ అధికారులు ఆయా ప్లాంట్లలోనే ఉండి పర్యవేక్షిస్తారన్నారు. మంగళవారం ఆయన ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తే మొత్తం కేటాయింపులను రాష్ట్రానికి తెచ్చామన్నారు. ట్యాంకర్ జాప్యం కారణంగా తిరుపతిలో ఘటన జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని తెలిపారు. మృతి చెందిన వారికి సీఎం జగన్ రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారన్నారు. ప్రతిరోజూ ఆక్సిజన్ వినియోగం పెరుగుతోందని, దీనికి తగ్గట్టు కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని కోరుతున్నామని, సీఎం కూడా ప్రధానికి లేఖ రాశారని వివరించారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రస్తుతం మైలాన్ కంపెనీ నుంచి కొంటున్నామని, అవి కాకుండా మరో 50 వేల ఇంజక్షన్లు వేరే కంపెనీ నుంచి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22,395 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 104 కాల్ సెంటర్‌కు ఒక్కరోజులో 16వేలకు పైగా కాల్స్ వచ్చాయని చెప్పారు. హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న 9,796 మందికి ఫోన్ చేసి డాక్టర్లు సలహాలు ఇచ్చారని తెలిపారు. ఈ సంఖ్యను రోజుకు 15 వేలకు పెంచాలనే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ సెంటర్లకు 100 చొప్పున స్లిప్పులు ఇస్తున్నామని, దీనిపై కలెక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. -
కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఇందులో 7 ట్రైబల్ పీహెచ్‌సీలు కూడా ఉన్నాయన్నారు. ఒకే పీహెచ్సీ ఉన్న మండలంలో రెండోది కూడా ఉంటుందని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా పీహెచ్‌సీల భవన నిర్మాణాలకు రూ.346 కోట్లు, సిబ్బంది వేతనాలకు ఏటా రూ.165 కోట్లు రికరింగ్ వ్యయమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో భారీగా కరోనా టెస్టులు పెంచామని, డిశ్చార్జిల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. ప్రస్తుతం 6,319 ఐసీయూ పడకలుండగా.. 5,743 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. చాలా జిల్లాల్లో ఐసీయూ పడకలు ఖాళీగా లేవన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 21,898 ఇంజక్షన్లు ఉన్నాయని, మరో 12 వేలు మంగళవారం వచ్చాయని వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఒకే రోజు 14,030 ఇంజక్షన్లు ఇచ్చామన్నారు. గత 24 గంటల్లో 446 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామని తెలిపారు. మరో 3 ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసి అదనపు సరఫరాకు ఉపయోగిస్తామన్నారు. కాగా, 104 కాల్ సెంటర్‌కు ఒకేరోజు 16,856 కాల్స్ వచ్చాయన్నారు. రెండో డోస్ వారికే ప్రాధాన్యత రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు తక్కువగా ఉన్న కారణంగా రెండో డోసు తీసుకునేవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ నెల 15లోగా కేంద్రం నుంచి 9 లక్షల డోసుల టీకా వస్తుందని.. ముందుగా రెండో డోసు తీసుకునేవారికి జాప్యం కాకుండా చూస్తామని తెలిపారు. ప్రజా సంబంధాల్లో (ఆర్టీసీ, బ్యాంకు, మీడియా ఉద్యోగులు) ఉన్నవారికి రెండో ప్రాధాన్యతగా టీకా వేస్తామన్నారు. వీరిలోనూ 45 ఏళ్లు దాటినవారికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. -
కోవిడ్ చికిత్సకు 551 ఆస్పత్రులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం 551 ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు చికిత్సలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వీటిలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రభుత్వం కోవిడ్ చికిత్సకు అనుమతించిన ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయన్నారు. ఈ ఆస్పత్రుల్లో మొత్తం 43,498 బెడ్లు ఉన్నాయని చెప్పారు. ఈ బెడ్లలో శనివారం వరకు 32,301 బెడ్లు నిండాయని.. ఇంకా 11 వేలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆస్పత్రులను గుర్తించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించామన్నారు. కరోనా పరీక్షలు, అంబులెన్సు సౌకర్యం, ఆస్పత్రుల్లో పడకలు, వైద్య సేవలు, సందేహాలు, ఫిర్యాదులు ఇలా కరోనాకు సంబంధించిన సమస్త సమాచారం కోసం 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. బాధితులు ఫోన్ చేసిన మూడు గంటల్లోనే అధికారులు ఆస్పత్రిలో బెడ్ కేటాయించాలన్నారు. అయితే ప్రతి ఒక్కరికీ ఆస్పత్రిలో సేవలు అవసరం లేదన్నారు. ఇంటిలో లేదా కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలు పొందొచ్చన్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికే ఆస్పత్రుల్లో బెడ్లు కేటాయించి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. స్వల్ప లక్షణాలున్నవారికి కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో డిశ్చార్జి పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా కోలుకున్నవారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసి, వారి స్థానంలో వేరొకరికి అవకాశమిస్తున్నామన్నారు. కృష్ణా జిల్లాలో నిన్న ఒక్కరోజే 500 మంది డిశ్చార్జయ్యారన్నారు. ఇలా డిశ్చార్జి అయినవారు అవసరమనుకుంటే కోవిడ్ కేర్ సెంటర్లలో ఉండొచ్చని.. లేకుంటే ఇంటికి వెళ్లొచ్చన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ ఇంకేమన్నారంటే.. పరీక్షలు చేసిన తర్వాత రోజే ఫలితాలు రాష్ట్రమంతా మంగళవారం నుంచి కరోనా పరీక్షలు చేసిన తర్వాత రోజే ఫలితాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 24 గంటల్లోనే ఫలితాలు ఇస్తున్నారు. సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నాం. రోజు రోజుకూ కోవిడ్ కేర్ సెంటర్లకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నాటికి కోవిడ్ కేర్ సెంటర్లలో 8,709 మంది ఉన్నారు. రాబోయే రెండు మూడ్రోజుల్లో ఈ సంఖ్య 15 వేలకు చేరుకోవచ్చు. వీటిలో కరోనా టెస్టులు చేయడంతోపాటు అక్కడే ఫలితాలు కూడా ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడా ఆర్టీపీసీఆర్ పరీక్షలను ఆపలేదు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న శాంపిళ్ల ఫలితాలను రెండ్రోజుల్లో ఇవ్వాలని ఆదేశించాం. అంబులెన్సుల కొరత ఉన్నచోట వాటిని పెంచుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం. రోగులకు ఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు టెలీమెడిసిన్ కాల్ సెంటర్‌కు 2,668 మంది వైద్యులు నమోదు చేసుకున్నారు. హోం ఐసోలేషన్‌లో 88,898 మంది ఉన్నారు. వీరందరికీ వైద్యులు ఫోన్ చేసి ఆరోగ్య సమాచారంతోపాటు సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరోవైపు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు స్వయంగా ఇంటికెళ్లి కరోనా బాధితులను పరామర్శిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు అవసరమైన మేర రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల్లో 5,371 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు వినియోగించగా.. ఇంకా 27,615 ఇంకా అందుబాటులో ఉన్నాయి. 104 కాల్ సెంటర్‌కు ఒక్కరోజే 13,898 మంది ఫోన్ 104 కాల్ సెంటర్‌కు శనివారం ఒక్కరోజే 13,898 మంది ఫోన్ చేశారు. వారిలో 3,356 మంది పరీక్షల కోసం, 3,359 మంది వివిధ అంశాలపై సమాచారానికి, 304 మంది ఆస్పత్రుల్లో అడ్మిషన్ కోసం, 2,678 మంది పరీక్షల ఫలితాల కోసం ఫోన్ చేశారు. గత రెండు రోజుల కంటే శనివారం ఆక్సిజన్‌ను ఎక్కువగా సరఫరా చేశాం. గత 24 గంటల్లో 443 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను అందించాం. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆక్సిజన్ కేటాయింపులు మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. విజయవాడ నుంచి ఒడిశాలోని అంగుల్ ఆక్సిజన్ ప్లాంట్‌కు 2 ఖాళీ ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేశాం. 2 ట్యాంకర్ల ద్వారా 50 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి వస్తుంది. సోమవారం మళ్లీ ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేస్తాం. ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్రంలో 64 ట్యాంకర్లను వినియోగిస్తున్నాం. ఐయూసీఎల్ కంపెనీ కేటాయించిన రెండు సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వాహనాలు రావాల్సి ఉంది. వాటి వల్ల 20 నుంచి 25 టన్నుల సామర్థ్యం పెరిగే అవకాశముంది. వైద్య సిబ్బంది నియామకం అధికారం కలెక్టర్లకే.. జిల్లాల్లో అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నియామకాలు పూర్తవగా మరికొన్ని జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియామకాలను కూడా అదే రీతిలో చేపట్టాం. గత ఏడాది కాలంలో 9 వేల మందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుతున్న సేవలు, బాధితుల సమాచారం సేకరించడానికి ఆరోగ్యమిత్రలను, సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను వాడుకుంటున్నాం. -
కోవిడ్ కిట్ల నుంచి బెడ్లు దాకా.. 3 గంటల్లోనే..
104 కాల్‌సెంటర్ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆ నంబర్‌కు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలి. ఆస్పత్రికి వెళ్లడమా? క్వారంటైన్‌కు పంపడమా? హోం ఐసొలేషనా?.. ఏం చేయాలన్నది స్పష్టంగా చెప్పాలి. కోవిడ్‌కు సంబంధించిన అన్ని సమస్య లకు 104 నంబర్ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. ఆ స్థాయిలో కాల్ సెంటర్ పని చేయాలి. 104కి ఫోన్ చేసిన వెంటనే 3 గంటల్లోగా బెడ్‌తో సహా రోగులకు ఏది అవసరమో అది కేటాయించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. 104 కాల్సెంటర్లో తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలి. అన్ని వ్యవస్థలు 104తో అనుసంధానం కావాలి. – సీఎం వైఎస్ జగన్ 48 గంటల్లో నియామకాలు.. పడకల సామర్థ్యానికి తగినట్లుగా అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలి. ఎక్కడ ఖాళీలున్నా వెంటనే వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించండి. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ, నివారణకు సంబంధించి 104కి ఫోన్ చేసిన మూడు గంటల్లోగా కోవిడ్ కిట్ల నుంచి బెడ్స్ వరకు ఏదైనా సరే వెంటనే కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 104 కాల్‌సెంటర్ మరింత సమర్థంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి ఫ్లయింగ్ స్క్వాడ్లతో నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి 48 గంటల్లోగా నియామకాలను పూర్తి చేయాలన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని విజ్ఞప్తి చేశారు. ఏ కార్యక్రమంలోనూ 50 మందికి మించి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్‌పై పుకార్లు సృష్టించడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించడంతోపాటు అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలివీ.. కోవిడ్ ఆస్పత్రులు–బెడ్లు: కోవిడ్ చికిత్స కోసం అన్ని జిల్లాల్లో 355 ఆస్పత్రులను కలెక్టర్లు గుర్తించగా వాటిలో 28,377 బెడ్లున్నాయి. ప్రస్తుతం 17,901 బెడ్లు ఆక్యుపై అయ్యాయి. ఆ ఆస్పత్రులలో వైద్యం పూర్తిగా ఉచితం. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలి. కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జేసీలు పూర్తి దృష్టి సారించాలి.. జేసీలు (గ్రామ, వార్డు సచివాలయాలు – అభివృద్ధి) ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలి. ఆ అధికారి అదేపనిలో నిమగ్నం కావాలి. అప్పుడే అనుకున్న స్థాయిలో సేవలందించగలుగుతాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స అందించే ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జేసీ పర్యవేక్షించాలి. నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషధాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, హెల్ప్‌డెస్క్‌లు, ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అన్నది ప్రతి రోజూ చూడాలి. దాదాపు 355 కోవిడ్ ఆస్పత్రులు (ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్సకు అనుమతించిన ప్రైవేట్ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు) వద్ద నిరంతరం పర్యవేక్షణ జరగాలి. కోవిడ్ కేర్ సెంటర్లు (సీసీసీ).. జిల్లాలో తగినన్ని కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో 59 సీసీసీలు పని చేస్తుండగా 33,327 బెడ్లున్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషధాల లభ్యత, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, హెల్ప్ డెస్క్‌లు, ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు, రోగులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారా? లేదా? అన్నది ప్రతి కలెక్టర్ చూడాలి. ఎక్కడా బెడ్ల కొరత లేకుండా కలెక్టర్లు శ్రద్ధ చూపాలి. ఆక్సిజన్ సరఫరా.. ప్రస్తుతం రోజుకు 320 నుంచి 340 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ఇది ప్రస్తుతానికి సరిపోతోంది. ఆక్సిజన్ అవసరమైన వారికి తప్పనిసరిగా వెంటనే ఇవ్వాలి. ఆక్సిజన్ లెవెల్ 94 కంటే తక్కువ ఉంటే వెంటనే అందచేసేలా చర్యలు తీసుకోవాలి. నిరంతర తనిఖీలు.. జిల్లా స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి ఇన్ఛార్జ్లను నియమించాలి. జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా నిరంతర తనిఖీలు జరపాలి. అందులో ఔషధ నియంత్రణ విభాగం అధికారులు కూడా ఉంటారు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశాం. 50 మందికి మించి వద్దు.. ప్రజలు ఒకే చోట గుమికూడకుండా జాగ్రత్తలు పాటించాలి. పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉంది. జిమ్‌లు, పార్కుల్లో అందరూ ఒకేచోట చేరకుండా చూడాలి. ఎక్కడా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకూడదు. అదే సమయంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి. ఏ కార్యక్రమంలోనూ 50 మందికి మించి చేరకూడదు. వారి పట్ల కఠినంగా వ్యవహరించండి.. పుకార్లు, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించండి. అరెస్టు చేయండి. అలాంటి వారిని జైలుకు పంపే అధికారం కూడా మీకు (అధికార యంత్రాంగం) ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఈ విషయంలో అవసరమైతే ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలి. ప్రతి రోజూ అధికారిక బులెటిన్ ఇస్తారు. దాన్నే అందరూ తీసుకోవాలి. కోవిడ్ వల్ల ఇప్పటికే అందరూ భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని పుకార్లు సృష్టించి అసత్యాలు ప్రచారం చేస్తే, ప్రజల్లో ఆందోళన తీవ్రమవుతుంది. కాబట్టి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు. లాక్‌డౌన్‌తో ప్రజలకు నాలుగింతలు నష్టం.. కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు వచ్చే కొద్ది నెలలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి నష్టం కలిగితే సామాన్యుడికి నాలుగు రూపాయలు నష్టం వాటిల్లుతుంది. గత ఏడాది లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.20 వేల కోట్ల నష్టం జరిగితే ప్రజలకు దాదాపు రూ.80 వేల కోట్ల నష్టం జరిగింది. కోవిడ్‌తో కలసి జీవించక తప్పని పరిస్థితి.. దేశంలో ప్రస్తుతం నెలకు 7 కోట్ల వాక్సిన్ ఉత్పత్తి జరుగుతుండగా అందులో కోవాక్సిన్ కోటి డోస్‌లు తయారవుతున్నాయి. మిగతాది కోవిషీల్డ్. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో ఇప్పటివరకు 11.30 లక్షల మందికి రెండు డోసులు, దాదాపు 45.48 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. 18 – 45 ఏళ్ల వారికి కూడా వాక్సిన్ ఇస్తాం. అందరూ కోవిడ్‌తో కలసి జీవించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. అందరికీ టీకాల కార్యక్రమం పూర్తయ్యే వరకు కోవిడ్ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. – ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆక్సిజన్ కొరతపై కేంద్రానికి లేఖ
గుంటూరు వెస్ట్: రాష్ట్రంలో 390 టన్నుల ఆక్సిజన్ అవసరముండగా ప్రస్తుతం 360 టన్నులు అందుబాటులో ఉందని, డిమాండ్‌కు సరిపడా ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రానికి లేఖ రాశామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి, వైద్య సదుపాయం, తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం గుంటూరు కలెక్టరేట్లో హోంమంత్రి మేకతోటి సుచరిత, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాని విలేకరులతో మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో 30 శాతం ఆక్సిజన్ వృథా జరుగుతోందని, ఈ వృథా అరికట్టడంపై వైద్యారోగ్య శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదన్నారు. రాష్ట్రానికి 12 వేల డోస్‌ల ఇంజక్షన్లు వచ్చాయన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కొరత లేకుండా చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 40 పడకలున్న ఆసుపత్రులకు కోవిడ్ సెంటర్లుగా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. 85 శాతానికి పైగా పాజిటివ్ రోగులు హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారన్నారు. వారికి వైద్యులు నిరంతరం ఫోన్ ద్వారా సూచనలు, సలహాలు అందిస్తున్నారని చెప్పారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో స్వల్ప ఇబ్బందిని ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ భూతద్దంలో చూపిస్తూ కనీస సామాజిక స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రభుత్వం విధిస్తున్న కోవిడ్ నిబంధనలను అందరూ తప్పక పాటించాలని కోరారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా కోవిడ్ ప్రత్యేకాధికారి ఉషారాణి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, శాసన సభ్యులు మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరి పాల్గొన్నారు. -
లేనిది ఉన్నట్టు.. అంతా 'కనికట్టు'
సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో అసలు వైద్య పరికరాలే లేవు. అయినా రికార్డుల్లో మాత్రం ఉన్నట్టు చూపించారు. పాడవడంతో మూలన పడేసిన పరికరాలు పనిచేస్తున్నట్టు రికార్డుల్లో చూపించారు. పరికరాల వాస్తవ ధరకు.. రికార్డుల్లో చూపించిన ధరకు అసలు పొంతన లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో కొన్ని రోజులుగా సీఐడీ ప్రత్యేక బృందాలు చేస్తున్న తనిఖీల్లో వెలుగు చూస్తున్న నిజాలివి. చంద్రబాబు హయాంలో వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్ట్‌లో అడ్డగోలుగా సాగిన కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోదాలు మొదలుపెట్టింది. మొత్తం 1,315 ఆస్పత్రులు ఉండగా.. ఇప్పటివరకు 40 శాతం ఆసుపత్రుల్లో సోదాలు పూర్తయినట్టు సమాచారం. పాత తేదీలతో సంతకాలు చేసి.. టెలీ బయోమాటిక్ సర్వీసెస్ (టీబీఎస్) సంస్థకు బిల్లులు చెల్లించేందుకు అప్పటి ఉన్నతాధికారులు, నాయకులు తొక్కని అడ్డదారి అంటూ లేదు.అప్పటి ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా పనిచేసిన సీహెచ్.గోపీనాథ్, బయో మెడికల్ ఇంజనీర్ రోహిణి చెప్పినట్టు నడుచుకున్నామని కొంతమంది వైద్య సిబ్బంది చెబుతుండగా.. మరికొందరు అప్పటి ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మౌఖిక ఆదేశాల మేరకు ఆ తప్పులు చేశామని చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో పెద్ద చేపలు కీలక పాత్ర పోషించాయనే విషయం తెలుస్తోంది. టీసీఎస్ సంస్థ వైద్య పరికరాల నిర్వహణను సక్రమంగా చేయలేదు. అయినా సరే మొత్తం పరికరాల విలువలో 7.5 శాతం బిల్లులు పెట్టారు. దీనికి తొలుత బిల్లు చెల్లించారు. ఆ తర్వాత ఈ కేసు కోర్టుకు వెళ్లింది. ఆ వెంటనే బిల్లులపై వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లతో పాత తేదీలతో బిల్లులపై సంతకాలు చేయించారు. ఇప్పుడా సంతకాలే వారి మెడకు చుట్టుకున్నాయి. ఎందుకు సంతకాలు చేశారు, వైద్య పరికరాలను మరమ్మతు చేసినట్టు ఆధారాలున్నాయా అని అడిగితే.. తమకు తెలియదని, ఈ తేదీలతో సంతకాలు చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశించారని చెబుతున్నారు. ఏఎంసీ (వార్షిక నిర్వహణ) పరిధిలో ఉన్న వాటికీ ఎందుకు సంతకాలు చేశారని అడుగుతుంటే.. తమకు తెలియదని సమాధానమిస్తున్నారు. ఈ కుంభకోణం ఉన్నతాధికారులతో పాటు పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది మెడకు కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. కొనసాగిన తనిఖీలు విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితోపాటు రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో సీఐడీ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. ఇప్పటికే సేకరించిన ఆధారాలను దృష్టిలో పెట్టుకుని సీఐడీ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తోంది. తొలుత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు(జీజీహెచ్), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ)లలో సోదాలు కొనసాగుతున్నాయి. 13 జిల్లాల్లోనూ 42 ప్రత్యేక బృందాలు సేకరించిన వివరాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన అన్ని లెక్కల్ని తేల్చాకు మరింత దూకుడుగా దర్యాప్తు చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. -
ప్రభుత్వాస్పత్రులపై సీఐడీ దాడులు
సాక్షి, అమరావతి: వైద్య పరికరాల నిర్వహణ కుంభకోణాన్ని నిగ్గు తేల్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,315 ప్రభుత్వాస్పత్రులపై సీఐడీ శనివారం ఏకకాలంలో దాడులు చేసింది. సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ ఆదేశాల మేరకు 13 జిల్లాల్లో 42 ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయి సోదాల్లో పాల్గొన్నాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోదాలు చేపట్టిన సీఐడీ బృందాలు.. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాలెన్ని? వాస్తవంగా పని చేస్తున్నవి(వర్కింగ్ కండీషన్) ఎన్ని? వాటి మార్కెట్ ధర ఎంత? వారెంటీ ఎన్నేళ్లు ఉంది? ఏఏ సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు? ఆయా సంస్థలకు నిర్వహణ సేవల కోసం ఎంత మొత్తం చెల్లించారు? తదితర వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలతో ఓ నివేదిక రూపొందించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్టులో జరిగిన కుంభకోణంపై సెక్షన్ 420, 406, 477 కింద 07/2021 నంబర్‌తో సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు, కామినేని శ్రీనివాస్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ కీలక అధికారుల అండతో రూ.కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వ్యవహారంలో క్షేత్రస్థాయి ఆధారాలు సేకరించే దిశగా సీఐడీ ముందుకు వెళ్తోంది. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియా టెలీమాటిక్, బయో మెడికల్ సర్వీసెస్ సంస్థకు 2015లో ఏడాది కాలానికి టెండర్ ఖరారు చేసిన దగ్గర్నుంచి.. దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లు కొనసాగించడం దాకా అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలుండటంతో.. వాస్తవంగా పరికరాల వినియోగం గురించి సీఐడీ ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. వారంలోగా వాస్తవాలు నిగ్గు తేలుస్తాం వైద్య పరికరాల నిర్వహణ సేవల పేరుతో జరిగిన కుంభకోణంలో ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించాం. అసలు క్షేత్ర స్థాయిలో ఏం జరిగింది? అనే కోణంలో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నాం. పరికరాల విలువ ఎంత? పనిచేస్తున్నవి ఎన్ని? కాంట్రాక్టర్లకు ఎంత చెల్లించారు? అనే వివరాలను సేకరిస్తున్నాం. వారంలోగా వాస్తవాలు నిగ్గు తేలుస్తాం. అనంతరం దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ -
సెకండ్ వేవ్: సర్జరీలకు కరోనా బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపై ప్రభావం పడింది. గాంధీ, నిమ్స్, ఉస్మానియా జనరల్ హాస్పిటళ్లు సహా చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్జరీలకు బ్రేక్ పడింది. అత్యవసర ఆపరేషన్లు మినహా మిగతా అన్నింటినీ డాక్టర్లు వాయిదా వేస్తున్నారు. చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తున్న రోగుల నుంచి ఆపరేషన్ థియేటర్లలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వైరస్ సోకుతోంది. తాజాగా కోఠి ఈఎన్టీ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సర్జరీలను నిలిపేశారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో చేరిన బాధితులను కూడా కరోనా తీవ్రత తగ్గి, పరిస్థితులు మెరుగయ్యాక రావాల్సిందిగా చెప్పి పంపేస్తున్నారు. దీంతో డబ్బులు ఖర్చుపెట్టలేక సర్జరీల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్న పేద, మధ్యతరగతి రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్‌కు తాళం హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 650 నుంచి 700 మంది రోగులు వస్తుంటారు. ముక్కులో కండ పెరిగి శ్వాసకు ఇబ్బందికావడం, చెవి నుంచి చీము కారడం, వినికిడి లోపంతో బాధపడుతున్నవారికి, కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్సలు వంటి ఆపరేషన్లు.. రోజుకు సగటున 20 నుంచి 25 వరకు జరిగేవి. అయితే ఆపరేషన్ థియేటర్లో పనిచేసే అనస్థీషియన్, సిస్టర్లకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో బుధవారం నుంచి సర్జరీలు వాయిదా వేసి, ఆపరేషన్ థియేటర్లకు తాళం వేశారు. ఇప్పటికే చికిత్స కోసం ఆస్పత్రిలో ఎదురుచూస్తున్న వారికి.. వారం పది రోజుల తర్వాత రావాలంటూ డిశ్చార్జి చేసి ఇంటికి పంపేశారు. ఉస్మానియా, గాంధీలో 60 శాతానికి పడిపోయిన సర్జరీలు ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 11 ఆపరేషన్ థియేటర్లు ఉండగా.. వాటన్నింటిలో కలిపి రోజుకు సగటున వంద మైనర్, 25 మేజర్ ఆపరేషన్లు జరుగుతుంటాయి. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ప్రస్తుతం అత్యవసరమైనవి మినహా సాధారణ చికిత్సలను చేయడం లేదు. దీంతో ప్రస్తుతం రోజుకు 40లోపే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇక గాంధీ ఆస్పత్రిలో 28 ఆపరేషన్ థియేటర్లు ఉండగా.. చిన్నా పెద్దా అన్నీ కలిపి గతంలో రోజుకు సగటున 150 శస్త్రచికిత్సలు జరిగేవి. ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చడంతో గత మార్చి నుంచి డిసెంబర్ వరకు ఆపరేషన్ థియేటర్లను మొత్తంగా మూసేశారు. ప్రాక్టీస్‌కు దూరమవుతున్నామన్న వైద్య విద్యార్థుల ఆందోళనతో జనవరి తర్వాత పునరుద్ధరించారు. అయినా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు సహా ప్లాస్టిక్ సర్జరీలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రుల్లోనూ సర్జరీలు చేసేందుకు వైద్యులు విముఖత చూపుతున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కుటుంబ నియంత్రణ శిబిరాలు కూడా వాయిదా పడ్డాయి. నిలిచిన ట్రాన్స్ప్లాంటేషన్లు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొంతమేర అవయవ మార్పిడి చికిత్సలు జరుగుతున్నప్పటికీ...ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాగా తగ్గిపోయాయి. నిమ్స్ మూత్రపిండాల విభాగంలో గతంలో వారానికి నాలుగు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసేవారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఒకటి రెండే చేస్తున్నారు. కీలకమైన గుండె మారి్పడి, కాలేయ మార్పిడి చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ టెస్టులతోపాటు స్టెంట్ ప్రొసీజర్లు కూడా సగానికి పడిపోయాయి. ప్రస్తుతం జీవన్‌దాన్‌లో 8,633 మంది అవయవ మార్పిడి చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 4,383 మంది కిడ్నీ కోసం, 3,950 మంది కాలేయ మార్పిడి చికిత్సల కోసం వేచి ఉన్నారు. గతంలో బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి సేకరించిన అవయవాలే కాకుండా లైవ్ డోనర్ల (బంధువులు) నుంచి కూడా అవయవాలు తీసుకుని బాధితులకు అమర్చేవారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో దాతలు ముందుకు రావడం లేదని అంటున్నారు. అసలు గత ఏడాది కాలంగా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో ఒక్క గుండె, కాలేయ మార్పిడి చికిత్స కూడా జరగకపోవడం గమనార్హం. ఈ బాలుడి పేరు మణిదీప్. ముక్కు లో కండరాలు పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స కోసం తల్లిదండ్రులు బుధవారం హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలన్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆపరేషన్ థియేటర్లు (ఓటీ) మూసివేశామని.. ఫ్యూమిగేషన్ తర్వాత రీఓపెన్ చేసి, చికిత్స చేస్తామని చెప్పారు. ఆ బాలుడేమో నోటితోనే శ్వాస తీసుకోవాల్సి వస్తుండటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. వారం తర్వాత రమ్మన్నారు కన్నుకు, దవడకు మధ్య గాయమైంది. చర్మంతోపాటు కండరాలు దెబ్బతిన్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్తోమత లేక 15 రోజుల కింద గాంధీ ఆస్పత్రికి వచ్చా. వైద్యులు పరీక్షించి ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు. మందులు రాసి పంపారు. డాక్టర్లు చెప్పిన మేరకు బుధవారం మళ్లీ గాం«దీకి వచ్చాను. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని, మరో వారం తర్వాత వస్తే.. అప్పుడు సర్జరీ గురించి ఆలోచిస్తామని డాక్టర్లు చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. –వాజిద్, ఖమ్మం వైద్యులు కూడా భయపడుతున్నారు కరోనా శకం ముగిసిపోయిందని అంతా సంతోషపడ్తున్న సమయంలోనే సెకండ్ వేవ్ మొదలైంది. వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెందింది. ఏ స్ట్రెయిన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియక వైద్యులు సైతం భయపడుతున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లేందుకే వెనుకాడుతున్నారు. ఫలితంగా సర్జరీలు వాయిదా వేయాల్సి వస్తోంది. వ్యాక్సిన్‌పై అపోహలు వీడి అంతా టీకా వేయించుకోవాలి. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. విధిగా మాస్కు లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. వ్యక్తిగత శుభ్రతతోపాటు పౌష్టికాహారం తీసుకుని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. –డాక్టర్ రవిశంకర్, ఈఎన్టీ నిపుణుడు చదవండి: మమ్మల్ని ఏపీకి బదిలీ చేయండి కరోనా కేసులపై వైద్యశాఖ కీలక నిర్ణయం..! -
పల్లెల్లో ‘104’ పరుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘104’ సంచార వైద్యశాలలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మండలానికొక వాహనాన్ని ఏర్పాటుచేయడంతో వీటిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మారుమూల, అత్యంత మారుమూల ప్రాంతాల్లో రోజుకు సగటున 11,800 మందికి ఈ ‘104’లు ఔట్ పేషెంటు సేవలందిస్తున్నాయి. గతంలో ఈ వాహనాలు 292 మాత్రమే ఉండేవి. అవి కూడా శిథిలావస్థకు చేరినవే. కానీ, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మండలానికొకటి చొప్పున 656 వాహనాలు కొత్తగా వచ్చాయి. ఇవి క్రమం తప్పకుండా పల్లెలన్నిటినీ చుట్టి వస్తున్నాయి. చిన్నచిన్న వ్యాధులు మొదలుకుని దీర్ఘకాలిక జబ్బులతో కలిపి మొత్తం 20 రకాల సేవలను గడిచిన ఏడు నెలల్లో 24,83,817 మందికి అందించాయి. మందుల సంఖ్యను కూడా భారీగా పెంచారు. గతంలో పేరుకు 52 రకాల మందులు ఉన్నాయని చెప్పుకున్నా 30 రకాలు కూడా సరిగ్గా అందేవి కావు. కానీ, ఇప్పుడు నాణ్యమైన 74 రకాల మందులను రోగులకు వారివారి ఇంటి వద్దే ఇస్తుండడంతో బాధితులకు 104 సేవలపై మరింత నమ్మకం ఏర్పడింది. ఈ వాహనాలు రోగులకు సేవలందించడమే కాక వారి వివరాలను టెలీమెడిసిన్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు అనుసంధానంచేసి వారికి భవిష్యత్‌లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పీహెచ్సీ, సీహెచ్‌సీలకు లింకేజీ చేసి రెఫరల్ సిస్టంను మెరుగుపరిచారు. ప్రతి ఒక్కరి వివరాలను ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులో పొందుపరుస్తున్నారు. -
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు
కొత్త ఆస్పత్రుల నిర్మాణం ఎంత ముఖ్యమో, నిర్వహణా అంతే ముఖ్యం. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసి.. వైద్యులు లేరు, సిబ్బంది లేరు అంటే బావుండదు. వైద్యులు ఎంత మంది అవసరమో అందర్నీ తీసుకోండి. భవనాలు, వైద్య పరికరాలు, ఆహారం, ఆస్పత్రిలో వాతావరణం వీటి నిర్వహణ కోసం ఉత్తమ పద్ధతులను పాటించండి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో కూడా మెరుగైన పారిశుధ్యం, ప్రమాణాలు ఉండాలి. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలే ప్రామాణికంగా ఉండాలి. బోధన ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. పడకల మీద వేసే బెడ్షీట్ల దగ్గర నుంచి అన్ని విషయాల్లో అత్యుత్తమ నాణ్యత పాటించాలి. - సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా నిర్మించే వైద్య కళాశాలలు, ఇప్పటికే ఉన్న బోధనాస్పత్రుల్లో కార్పొరేట్‌కు దీటుగా ప్రమాణాలు ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఒక్క వైద్య రంగంలోనే రూ.16,270 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వాస్పత్రి లోపలికి వెళ్లగానే మంచి కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చామనిపించేలా చక్కటి వాతావరణం, బెడ్స్, పరికరాలు, ఇతర వసతులు ఉండాలన్నారు. నిర్మాణం ఒకెత్తు అయితే నిర్వహణ మరో ఎత్తు అని చెప్పారు. ఆస్పత్రుల్లో పరిపాలన, క్లినికల్ వ్యవహారాలు చూసేందుకు నైపుణ్యమున్న వారిని తీసుకోవాలని.. పరిపాలన, క్లినికల్ వ్యవహారాలు వేర్వేరుగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ప్రత్యేకంగా వేర్వేరుగా ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించాలని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య, విద్య రంగాల్లో నాడు–నేడు పనులను ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. నాడు–నేడు పనులకు ఎలాంటి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూసేకరణ, ఇతరత్రా ఎలాంటి సమస్యలైనా వస్తే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పేషెంటుకు ఇచ్చిన గది నుంచి పడక వరకు ఆస్పత్రి వాతావరణం బాగుండాలన్నారు. రోగులకు అందిస్తున్న భోజనం కూడా బావుండాలని, ఇందులో కచ్చితంగా మార్పు కనిపించాలని ఆదేశించారు. ఎక్కడా అపరిశుభ్రత అన్నది కనిపించకూడదని చెప్పారు. విలేజ్ క్లినిక్స్ నుంచి బోధనాస్పత్రుల వరకు ఇదే విధానాన్ని కొనసాగించాలని, ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను తయారు చేయాలని సీఎం సూచించారు. ఏ ఆస్పత్రిలోనూ పరికరాలు పని చేయలేదనే మాట వినిపించకూడదని, ఆస్పత్రుల నిర్వహణ ఎలా ఉండాలో స్కూళ్లలోనూ అలాగే ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. సెప్టెంబర్‌లోగా హెల్త్ క్లినిక్స్ పూర్తి చేయండి ► రాష్ట్రంలో మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. వీటిలో 1,426 క్లినిక్స్‌ను పునరుద్ధరిస్తున్నారు. వీటి పనులు సెప్టెంబర్‌లోగా పూర్తి చేయండి. ► వీటి నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలి. ప్రత్యేక పర్యవేక్షణతో సకాలంలో పనులు పూర్తి చేయాలి. అర్బన్ ప్రాంతాల్లో నిర్మించే పీహెచ్‌సీలు కూడా త్వరగా పూర్తి చేసే దిశగా కార్యాచరణ రూపొందించండి. ► పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం సహా కొత్త వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ, వాటి చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. మే 15కు మెడికల్ కాలేజీల టెండర్లు పూర్తి ► కొత్తగా నిర్మించనున్న అన్ని మెడికల్ కాలేజీలకు మే 15 నాటికి టెండర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఉన్న మెడికల్ కాలేజీల్లో కూడా అభివృద్ధి పనులకు ఏప్రిల్ నెలాఖరు కల్లా టెండర్లు ఖరారవుతాయన్నారు. ► కొత్త పీహెచ్‌సీల నిర్మాణానికి స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని, అక్టోబర్ నాటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త వాటి నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ► రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి, పాజిటివిటీపై సీఎంకు వివరించారు. 69 ఆస్పత్రుల్లో 9,625 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వైరస్ విస్తరణ మునుపటి అంత ఉధృతి లేకపోయినా అప్రమత్తంగానే ఉన్నామని తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పేదల ఆస్పత్రులకు కొత్త రూపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల వైద్యానికి మంచి రోజులు మొదలయ్యాయి. అన్ని జిల్లాల్లోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులను పకడ్బందీగా తీర్చిదిద్దడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ. 1,223 కోట్ల అంచనా వ్యయంతో కొన్ని చోట్ల కొత్త భవనాలు నిర్మిస్తుండగా, మరికొన్ని చోట్ల మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ మంది ఔట్‌పేషంటు సేవలు, ఇన్‌పేషంటు సేవలు అందిస్తున్నది వైద్య విధాన పరిషత్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు (కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్), ఏరియా ఆస్పత్రులే. ఇక్కడ ఏడాదికి సగటున 2.30 కోట్ల మంది వైద్యం అందుకుంటున్నారు. అందుకే అలాంటి ఆస్పత్రులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు నాడు నేడు కింద పెద్ద ఎత్తున పనులు చేపట్టింది. మొత్తం 165 పనులను 2022 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల పిల్లర్ల దశలో ఉండగా, కొన్నిచోట్ల మొదటి అంతస్తు స్లాబ్‌లు వేశారు. నెల్లూరు, కృష్ణా, వైఎస్సార్ జిల్లాల్లో పనుల వేగం మరింతగా పెరిగింది. ఈ పనులకు సంబంధించి నాబార్డ్ రుణ సాయం అందిస్తోంది. నిర్మాణాలు చేయడమే కాదు రెండు మూడు దశల్లో నాణ్యతా ప్రమాణాలు చూస్తున్నారు. దీనికోసం ప్రత్యేక బృందం పనిచేస్తోంది. నిర్ణీత సమయంలోనే పూర్తి ప్రస్తుతం కొనసాగుతున్న పనులు నిర్ణీత సమయానికే పూర్తవుతాయి. దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇవి అందుబాటులోకి వస్తే పేదలకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. – అనిల్‌కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాసుపత్రులు ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు నిర్మించడం సామాన్య విషయం కాదు. కొత్త భవనాలకు తగ్గట్టుగా వైద్యులను నియమించాం. నియోజకవర్గ స్థాయిలోనే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పరిధిలో వైద్యసేవలు అందుతాయి. – డా.యు.రామకృష్ణారావు, కమిషనర్, వైద్య విధాన పరిషత్ -
ప్రతి 5 నిమిషాలకు ఏడుగురి జననం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఐదు నిమిషాలకు ఏడుగురు శిశువులు కొత్త ప్రపంచానికి పరిచయమవుతున్నారు. అంటే నిమిషానికి 1.39 మంది పుడుతున్నట్టు లెక్క. సగటున రోజుకు 2,013 మంది జనాభా లెక్కల్లోకి ఎక్కుతున్నట్టు తాజా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే గడిచిన 10 నెలల్లో 6,03,977 మంది శిశువులు రాష్ట్రంలో జన్మించారు. వీళ్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జనన నమోదు పత్రాలు ఇచ్చారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో శిశువులు పుడుతున్నట్టు తేలింది. 6,03,977 ప్రసవాల్లో ఆస్పత్రుల్లో జరిగినవి 6,01,652. అంటే 99.85 శాతం మంది ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో పుట్టిన వారే. ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన వారు 2,44,876 మంది (40.70 శాతం) ఉన్నారు. మిగతా 59.30 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో జన్మించారు. 25 వేల మందికి పైగా బరువు తక్కువ 6,03,977 మంది శిశువుల్లో 25,451 మంది 2 కేజీలు.. అంతకంటే తక్కువ బరువుతో పుట్టినట్టు గణాంకాల్లో వెల్లడైంది. ఇలాంటి బరువు తక్కువ పిల్లలు కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. చాలా మంది తల్లులు ప్రసవం అయిన గంటలోగానే తల్లిపాలు బిడ్డకు పడుతున్నారు. మొత్తం ప్రసవాల్లో 97.68 శాతం మంది తల్లులు శిశువు పుట్టిన గంటలోపే పాలు పడుతున్నారు. దీనివల్ల బిడ్డకు అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 95.86 శాతం మంది తల్లులు తమ బిడ్డకు బీసీజీ, పోలియో, తట్టు తదితర వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నట్టు వెల్లడైంది. -
మందుల సరఫరాకు సొంత రవాణా
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రులకు మందులు సరఫరా చేసే రవాణా వ్యవస్థను ఇక ప్రభుత్వమే చేపడుతోంది. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులను ఏపీఎంఎస్ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) కొనుగోలు చేసి, జిల్లా కేంద్రాల్లో ఉన్న సీడీఎస్ (సెంట్రల్ డ్రగ్ స్టోర్)లకు చేరుస్తుంది. అక్కడి నుంచి బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరవేయాలి. ఇప్పటిదాకా ప్రైవేటు వాహనాల ద్వారానే రవాణా చేసేవారు. ఇకపై కొద్ది రోజుల్లో ఈ వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వమే సొంత వాహనాలతో ప్రతి ఆస్పత్రికి మందులను చేర వేయనుంది. నెలకు రూ.10 లక్షలు ఆదా కొన్ని ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మందుల సరఫరాకు వాహనాలు ఇచ్చాయి. ఈ వాహనాలతోనే మందులు సరఫరా చేయనున్నారు. జిల్లాకు అవసరాన్ని బట్టి రెండు నుంచి నాలుగు వాహనాలు మందుల సరఫరాకే పని చేస్తాయి. సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల నెలకు రూ.10 లక్షల లెక్కన ఏడాదికి రూ.1.20 కోట్లు ఆదా అవుతాయి. అంతేకాకుండా మందులను సకాలంలో చేర్చేందుకు అవకాశం ఉంది. గతంలో ప్రై వేటు రవాణా వ్యవస్థ ఉండటం వల్ల సెంట్రల్ డ్రగ్ స్టోర్ల నుంచి జిల్లా, తాలూకా, మండల స్థాయి ఆస్పత్రులకు మందులు చేర వేయడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ముందే రూట్ మ్యాప్ వేసుకుని ఏ జిల్లాలో వాహనాలు ఆ జిల్లాలో అవసరం మేరకు పని చేస్తాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ప్రతి రోజూ కొన్ని ఆస్పత్రులకు ముందే రూట్ మ్యాప్ నిర్ణయిస్తారు. దీని ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రులకు ఇండెంట్ మేరకు మందులు సకాలంలో వెళతాయి. పటిష్టంగా మందుల రవాణా వ్యవస్థ ఇన్నాళ్లూ ప్రైవేటు సంస్థ మందులు సరఫరా చేసేది. ఇప్పుడు ప్రభుత్వ పరిధిలోనే చేస్తున్నాం. దీంతో మందుల రవాణా వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు సకాలంలో పేద రోగులకు మందులు అందించే అవకాశం ఉంటుంది. గతంలో కంటే తక్కువ వ్యయంతోనూ ఈ రవాణా జరుగుతుంది. – విజయరామరాజు, ఎండీ, రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ -
సర్కారు ఆస్పత్రులు కళకళ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలను గత చంద్రబాబు సర్కారు గాలికొదిలేయగా, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేసింది. గత ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహించింది. ఇందులో భాగంగానే వేల సంఖ్యలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీకి చర్యలు తీసుకోలేదు. అయితే గతానికి భిన్నంగా సీఎం వైఎస్ జగన్.. ఇదివరకెన్నడూ లేని రీతిలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేవలం నాలుగు నెలల్లోనే మంజూరు చేసిన వైద్య సిబ్బంది పోస్టుల్లో 85.70 శాతం పోస్టులను భర్తీ చేశారు. వైద్య విద్య, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం విభాగాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7,844 పోస్టులు మంజూరు చేస్తే, ఇప్పటి వరకు 6,723 పోస్టులను భర్తీ చేశారు. మిగతా పోస్టులను మార్చి నెలాఖరులోగా భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. డైరెక్టర్ మెడికల్ విధ్య విభాగంలో 4,062 పోస్టులను మంజూరు చేస్తే.. ఇప్పటి వరకు 3,502 పోస్టులను భర్తీ చేశారు. ఏపీ వైద్య విధాన పరిషత్ విభాగంలో 1,676 పోస్టులు మంజూరు చేస్తే 1,448 పోస్టులను భర్తీ చేశారు. డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ విభాగంలో 2,486 పోస్టుల భర్తీకి అనుమతిస్తే ఇప్పటి వరకు 2,152 పోస్టులను భర్తీ చేశారు. ఒకే సారి వేలాది పోస్టులు భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టం అవుతోందని వైద్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నియామకాల్లో ఎన్హెచ్ఎం పరుగులు రాష్ట్రంలో ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్) నియామకాల విషయంలో పరుగులు పెడుతోంది. 2014–19 వరకు ఒక్క పోస్టు కూడా ఈ ప్రాజెక్టు నుంచి నోచుకోలేదు. అలాంటిది గత ఏడాది కాలంలో వేలాది పోస్టులను భర్తీ చేసి ఉద్యోగావకాశాలు కల్పించడమే కాక.. ప్రాథమిక ఆరోగ్యానికి చుక్కానిలా నిలిచింది. ప్రతి జిల్లాలో అవసరం మేరకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, భర్తీ ప్రక్రియనూ సకాలంలో పూర్తి చేసింది. మూడు మాసాల్లోనే 92.23 శాతం పోస్టులను భర్తీ చేసి రికార్డు సృష్టించింది. గత పదేళ్లలో ఎప్పుడూ ఇన్ని పోస్టులు భర్తీ చేసిన దాఖలాలు లేవు. మిగిలిన పోస్టులను కూడా మార్చి నాటికి భర్తీ చేసి, ప్రాథమిక ఆరోగ్యంలో మానవ వనరులను పుష్కలంగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉన్న ఉద్యోగాలకే నాడు ఎసరు ► తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే 2014–19 మధ్య కాలంలో జాతీయ హెల్త్ మిషన్ పరిధిలో ఆయుష్ విభాగంలో భారీగా మెడికల్ ఆఫీసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయకపోగా, ఉన్న ఉద్యోగాలనూ అప్పటి ప్రభుత్వం తొలగించింది. ► మెడికల్ ఆఫీసర్ల నియామకం చేపట్టక పోవడంతో 400కు పైగా ఆయుష్ డిస్పెన్సరీల్లో పని చేస్తున్న కాంపౌండర్లు, సహాయక సిబ్బంది మొత్తం 800 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. 2,647 పోస్టుల భర్తీ ► గత రెండు నెలల్లో జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో రకరకాల కేడర్లలో 2,869 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటి వరకు 2,647 పోస్టులను భర్తీ చేశారు. అంటే 92.23 శాతం భర్తీ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 222 పోస్టులను మార్చి నాటికి భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ► మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్యమే కాకుండా, పట్టణ ఆరోగ్యమూ ముఖ్యమేనని, పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు మెడికల్ ఆఫీసర్ల నియామకాలు చేపట్టారు. ► మొత్తం 499 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 368 మందికి నియామక పత్రాలు అందించగా, 329 మంది విధుల్లో చేరారు. మిగతా 170 పోస్టులకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల భర్తీ ప్రక్రియ మార్చి చివరి నాటికి పూర్తవుతుంది. -
గర్భంలోని శిశువు మాయం.. మహిళ ఆందోళన
సాక్షి, తిరుపతి : గర్భంలోని శిశువును మాయం చేశారంటూ ఓ మహిళ ఆరోపించడంతో తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కు చెందిన శశికళ అనే మహిళ ఇటీవల తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చారు. పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి ఆస్పత్రికి వచ్చిన ఆమె... వింత వాదనతో ఆస్పత్రి సిబ్బందిపై ఆరోపణలు చేశారు. కాన్పు కోసం వచ్చిన తనకు గర్భం రాలేదని అంటున్నారంటూ ఆస్పత్రి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. గర్భంలోని శిశువును మాయం చేశారంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు. మహిళ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రసూతి ఆసుపత్రి వైద్యులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడుపులో గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ మానసిక స్థితిపై వివరాలను సేకరిస్తున్నారు. -
పెద్ద పెద్ద గదులు.. చిన్న సమస్యలతో మచ్చ!
పేదోడికి జబ్బు చేస్తే.. చూసేది సర్కారీ దవాఖానావైపే.. దేవుడి లెక్క చేతులెత్తి దండం పెట్టేది.. ఆ డాక్టరు బాబుకే.. ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే పెద్ద పెద్ద భవనాలు.. పెద్ద పెద్ద గదులు.. కదా.. అయితే.. అక్కడుండే చిన్నచిన్న సమస్యలు.. అంతోటి పెద్ద పెద్ద ఆస్పత్రుల ప్రతిష్టకు మచ్చను తెచ్చిపెడుతున్నాయి.. వైద్యం కోసం వెళ్తే సామాన్యులకు కష్టాలను ‘కొని’ తెచ్చిపెడుతున్నాయి. ఒకచోట డాక్టర్ బాబు సరిగా రారు.. మరోచోట పరీక్షలు చేసే పరికరాలు పనిచేయవు.. ఇంకోచోట దూదికీ దిక్కులేదు.. కొద్దిపాటి నిధులు కేటాయించి.. కాస్త దృష్టిపెడితే.. సరిదిద్దగలిగే ఇలాంటి చిన్నచిన్న సమస్యలు ఎన్నో.. ఈ కొత్త ఏడాదిలో దానిపై దృష్టి పెడితే.. ప్రభుత్వ దవాఖానా ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం.. ఆ సమస్యలు వాటి వివరాలు ఏంటో ఓసారి చూద్దామా.. – సాక్షి, హైదరాబాద్ సూది మందు వేయాలి.. శ్రద్ధ కాస్తపెట్టాలి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి నిత్యం వేలాదిమంది రోగులు వస్తుంటారు. అక్కడ కరోనా, ఇతర వైద్యసేవ లు అందుతున్నాయి.ఇక్కడి రెండు సీటీ స్కాన్లలో ఒకటి పాడైపోయింది. ఉన్న ఒక్క ఎంఆర్ఐ మిషన్ కూడా పనిచేయడంలేదు. రోగులను పరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపిస్తున్నారు. అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్ల కోసం రూ.20 కోట్లలోపు ఖర్చు చేస్తే వేలాదిమంది రోగులకు ప్రయోజనం కలుగుతుంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి నిత్యం వేలాదిమంది రోగులు వస్తుంటారు. అక్కడ కరోనా, ఇతర వైద్యసేవ లు అందుతున్నాయి.ఇక్కడి రెండు సీటీ స్కాన్లలో ఒకటి పాడైపోయింది. ఉన్న ఒక్క ఎంఆర్ఐ మిషన్ కూడా పని చేయడంలేదు. రోగులను పరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపిస్తున్నారు. అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్ల కోసం రూ.20 కోట్లలోపు ఖర్చు చేస్తే వేలాదిమంది రోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఉస్మానియాలో పనిచేయని సీటీ స్కాన్ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో రెండు సీటీ స్కాన్లు ఉండగా, ఒకటి మరమ్మతుల్లో ఉంది. ఐసీయూల్లో ఉండే మల్టీ చానల్ మానిటర్లు పనిచేయడంలేదు. సీటీ స్కాన్‌ను మరమ్మతు చేయడానికి రూ.10 వేలు, మల్టీచానల్ మానిటర్ల కోసం రూ.లక్ష వరకు కేటాయిస్తే అవి అందుబాటులోకి వచ్చే అవకాశముందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఒకవేళ కొత్తవి కొనుగోలు చేసినా రూ. 2 కోట్లు ఖర్చుచేస్తే సరి. జిల్లా ఆసుపత్రుల్లో పెద్ద పరీక్షలకు దిక్కేది రాష్ట్రంలో అనేక జిల్లా ఆసుపత్రుల్లో కీలకమైన సీటీ స్కాన్, అ్రల్టాసౌండ్, 2డీ ఎకో వంటి వైద్య పరికరాలు అందుబాటులో లేవు. దీంతో ఆయా ఆసుపత్రులకు వచ్చే పేదరోగులు వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ లేబొరేటరీల్లో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ఒక్కో ఆసుపత్రి రూ.3 కోట్ల మేర ఖర్చు చేసినా వీటిని సమకూర్చుకోవచ్చు. 46 కొత్త ఆసుపత్రులు నిర్మించినా? రాష్ట్రంలో 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ) నిర్మించారు. వాటిని నిర్మించి దాదాపు ఏడాది కావొస్తోంది. కానీ, చిన్న, చిన్న పనులు, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఆయా కొత్త ఆసుపత్రులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఒక్కో ఆసుపత్రికి సరాసరి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.2.30 కోట్లు ఖర్చు చేస్తే ఇవి పూర్తిస్థాయి సేవలు అందిస్తాయి. మూడు నెలల మందులు వారానికే.. పీహెచ్సీ, సీహెచ్‌సీ మొదలు జిల్లాస్థాయి ఆసుపత్రులు, ఆపై ఆసుపత్రుల వరకు చాలా చోట్ల రోగులకు సరిపడా మందులు ఇవ్వడంలేదు. బీపీ, షుగర్, ఆస్తమా, పక్షవాతం, కీళ్ల నొప్పులు తదితర రోగాలకు నిత్యం వాడాల్సిన మందులను వారానికే ఇస్తున్నారు. వారం తర్వాత ఆయా మందులను రోగులు బయట కొంటున్నారు. నెల నుంచి మూడు నెలల వరకు మందులు ఇస్తే ఎటువంటి సమస్యా తలెత్తదు. ఆ మేరకు మందులను సర్దుబాటు చేయాలి. దీనికి బడ్జెట్‌తో సంబంధంలేదు. ఇలా చేస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదరణ పీహెచ్‌సీలు, ఇతర కొన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లు నిత్యం రావడంలేదన్న విమర్శలున్నాయి. రోజూ డాక్టర్ వస్తారన్న నమ్మకం కల్పిస్తే చాలు రోగులు ఓపీలో చూపించుకుంటారు. దీనికి కావాల్సింది పర్యవేక్షణ అనేక ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు ఏళ్లు, నెలల తరబడి మూలనపడి ఉంటున్నాయి. దాదాపు 20 శాతం వరకు మరమ్మతుల్లో ఉన్నాయి. వాటిని మరమ్మతు చేస్తే రోగులకు ఎంతో ప్రయోజనం. అందుకోసం కొన్ని ఆసుపత్రులకు కలిపి టెక్నీíÙయన్లను నియమించుకోవాలి. వాటికయ్యే ఖర్చు అత్యంత స్వల్పం అనేక ఆసుపత్రుల ప్రాంగణాల్లో పిచి్చమొక్కలు దర్మనమిస్తున్నాయి. మున్సిపల్, పంచాయతీ శాఖల సహకారంతో వాటిని తొలగించి ఉద్యాన శాఖ ద్వారా మంచి మొక్కలు పెంచితే ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పేషెంట్ కేర్ ప్రొవైడర్లు ఉండాలి. పరీక్షలు ఎక్కడ చేస్తారు? ఏ డాక్టర్ ఎక్కడ ఉంటారో తెలియజెప్పాలి. రిసెప్షన్ సెంటర్ ఉండాలి. తద్వారా రోగులకు గైడ్ చేయాలి. డాక్టర్లు చూసి మందులు రాసి వెళ్తారు. కానీ, రోగికి వచి్చన జబ్బుపై చర్చించి అవసరమైన సలహాలు ఇవ్వరు. ఈ పరిస్థితి మారాలి. -
ప్రసవాలకు ఏటా రూ.వెయ్యి కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులకు రూ.వెయ్యి కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. అనేక కుటుంబాలు భారమైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులకే మొగ్గు చూపుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని ఎక్కువ ప్రైవేటు ఆస్పత్రులు భారీగా సొమ్ము వసూలు చేస్తున్నాయి. ఎక్కువమందికి సిజేరియన్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడాదికి ఏడులక్షలకుపైగా ప్రసవాలు జరుగుతుండగా.. అందులో 40.68 శాతం ప్రసవాలు మాత్రమే ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు ఆస్పత్రుల్లోనే. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాల్లో సగటున ఒక్కోదానికి రూ.23,200 ఖర్చవుతున్నట్టు అంచనా. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లో 66 శాతం వరకు కోతల కాన్పులే. ప్రభుత్వాస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో సిజేరియన్ల శాతం చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలని సర్కారు కసరత్తు చేస్తోంది. మూడేళ్ల కిందట 30 శాతం మాత్రమే ఉండగా ఇప్పుడు 40.68 శాతానికి పెరిగింది. ప్రభుత్వాస్పత్రులకు ఎందుకు రావడం లేదు? ► ప్రభుత్వాస్పత్రుల్లో సకాలంలో డాక్టర్లు అందుబాటులో ఉండరు అనే భావన ఇంకా ఉంది. ► సరిగా చూడటం లేదని పేషెంట్లలో అనుమానాలున్నాయి. ► రాత్రిపూట ప్రైవేటుకు వెళ్లగానే ఫోన్‌చేస్తే డాక్టరు వచ్చి ప్రసవం చేస్తారని భావన ఉంది. ► పారిశుధ్యం నిర్వహణ సరిగా ఉండదనేది మెజారిటీ పేషెంట్ల అభిప్రాయం. ► గైనకాలజీ, మత్తు వైద్యులు, పిల్లల వైద్యులు అన్ని చోట్లా లేరు. ► నర్సులు, ఇతర సిబ్బంది పేషెంట్లను సరిగా పట్టించుకోవడం లేదనే భావన ఉంది. ప్రభుత్వాస్పత్రులకు వెళితే లాభాలేమిటి ? ► ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువగా సాధారణ ప్రసవానికే పెద్దపీట వేస్తారు. ► ప్రసవం అయిన వెంటనే బిడ్డకు బర్త్ రిజి్రస్టేషన్ చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థికసాయం అందుతుంది. ► రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. డిశ్చార్జి అయ్యేవరకు మందులతో సహా ఉచితమే. ► రవాణా భారం ఉండదు. ఫోన్ చేయగానే 108 వాహనం ఆస్పత్రికి చేరుస్తుంది. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఇంటిదగ్గర దించుతుంది. ► పుట్టగానే బిడ్డకు వ్యాధినిరోధక టీకాలన్నీ ఉచితంగానే వేస్తారు. ప్రతి ప్రసవం విషయంలోనూ అధికారుల బాధ్యత ఉంటుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ► వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చేయడం. ► సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ముగ్గురు వైద్యనిపుణుల బృందం ఉండేలా చూడటం. ► ప్రసవానికి వచ్చేవారిని గౌరవంగా చూసేలా సిబ్బందికి ఆదేశాలు. ► ఆస్పత్రుల్లో ప్రసూతి గదులను ఉన్నతీకరించడం. ► కొన్ని ఆస్పత్రుల్లో హెచ్‌డీయూ (హై డిపెండెన్సీ యూనిట్)ల ఏర్పాటు. ► ప్రసూతితో పాటు నవజాత శిశువులకు ప్రత్యేక గదుల ఏర్పాటు -
నేడు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జిల్లాకు మూడు చోట్ల చొప్పున 39 చోట్ల శనివారం కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్‌కు సన్నద్ధతలో లోటుపాట్లు పరిశీలించి సరిదిద్దుకోవడానికి డ్రై రన్ ఉపయోగ పడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమ నిర్వహణకు కార్యాచరణ ఏ విధంగా ఉండాలో అంచనా వేసేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించి రూపొందించిన వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్ కోవిన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో పరిశీలించనున్నట్లు తెలిపారు. డ్రై రన్లో వెలుగుచూసే అంశాలు, ఇతర వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖకు నివేదిక రూపంలో అందజేస్తామని భాస్కర్ వివరించారు. ఈ డ్రై రన్ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరించి, కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు అందజేస్తారు. రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఈ ప్రక్రియనంతా సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని అందిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రై రన్లో భాగంగా డిసెంబర్ 28న విజయవాడలోని ఐదు కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది ప్రోత్సాహకర ఫలితాలు ఇచ్చినట్లు భాస్కర్ తెలిపారు. వ్యాక్సిన్ రవాణా మొదలు, ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఫోన్ మెసేజ్‌లు పంపడం, వారు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేస్తున్నట్టుగానే మొత్తం ప్రక్రియ (డమ్మీ ప్రక్రియ) నిర్వహిస్తారు. అనంతరం వారిని అబ్జర్వేషన్లో కూడా ఉంచుతారు. శనివారం ఒక్కో జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ లేదా ప్రభుత్వ ఆస్పత్రిలో, ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో, ఒక ఎంపిక చేసిన బయటి ప్రదేశంలో.. ఇలా మూడు చోట్ల డ్రైరన్ నిర్వహించనున్నారు. డ్రై రన్ నిర్వహించే ప్రదేశాలు -
రోగం వచ్చిందా.. మూడు రోజులు ‘ఓపి’క పట్టు!
న్యూరో సంబంధిత సమస్యతో బాధపడుతున్న స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన జనార్దన్ చికిత్స కోసం ఉదయం ఏడు గంటలకు నిమ్స్ అవుట్ పేషెంట్ విభాగానికి చేరుకున్నాడు. ఎనిమిది గంటలకు ఓపీ కార్డు తీసుకుని న్యూరో ఓపీ విభాగంలోని వైద్యుడి వద్దకు చేరుకున్నాడు. పరీక్షించిన వైద్యుడు బ్రెయిన్ సీటీ సూచించాడు. వైద్యుడు రాసిన ఆ చీటీ తీసుకుని ఆస్పత్రిలోని డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లగా అప్పటికే అక్కడ పది మంది వెయింటింగ్‌లో ఉన్నారని, మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు రావాల్సిందిగా టెక్నీషియన్ సూచించారు. ఆ మేరకు రిజిస్ట్రర్‌లో పేరు నమోదు చేసుకుని పంపించాడు. మెడికల్ రిపోర్ట్ వస్తే కానీ మందులు రాయలేని పరిస్థితి. అలాగని తిరిగి ఇంటికి వెళ్లలేని దుస్థితి. చేసేది లేక ఆ రోజు రాత్రంతా ఎమర్జెన్సీ ముందు ఉన్న నైట్‌షెల్టర్‌లో నిరీక్షించి.. మరుసటి రోజు ఉదయాన్నే లేచి సిటీ స్కాన్ సెంటర్‌కు చేరుకున్నారు. తీరా స్కాన్ చేసిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే రిపోర్ట్ ఇస్తామని చెప్పడంతో చేసేది లేక మళ్లీ అక్కడే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు రిపోర్ట్ తీసుకుని ఓపీకి వెళ్తే..తీరా అక్కడ వైద్యుడు లేకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది ఒక్క జనార్దన్‌కు ఎదురైన చేదు అనుభవం మాత్రమే కాదు.. తలనొప్పి, నడుం నొప్పి, కీళ్లనొప్పులు, హృద్రోగ, కిడ్నీ, కాలేయ, ఉదరకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అనేక మంది రోగులకు నిమ్స్‌లో ఇదే అనుభవం ఎదురవుతోంది. సాక్షి, సిటీబ్యూరో/నిమ్స్: ప్రతిష్టాత్మక నిమ్స్‌లో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఓపీ చిట్టీల కోసం ఉదయం ఆరుగంటలకే క్యూ కట్టినా..డాక్టర్‌కు చూపించుకుని..మందులు తీసుకొని బయటకు వచ్చేటప్పటికి సాయంత్రం ఆరవుతోంది. ఒక్కోసారి టెస్టులు రాస్తే వైద్యానికి రెండు మూడు రోజులు పడుతోంది. 1500 పడకల సామర్థ్యం ఉన్న నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 1400–1600 మంది వస్తుంటారు. నగదు చెల్లింపు రోగులే కాకుండా ఆర్టీసీ, ఈఎస్ఐ, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఎక్కువగా వస్తుంటారు. ఉదయం 8 గంటలకు ఓపీ ప్రారంభమై 2.55 గంటలకు ముగుస్తుంది. బాధితుల నిష్పత్తికి తగినన్ని కౌంటర్లు లేక ఓపీ కార్డుల కోసం గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తుంది. తీవ్ర నిరీక్షణ తర్వాత ఓపీ కార్డు తీసుకుని కేటాయించిన వైద్యుడి గదికి చేరు కుంటే అప్పటికే అక్కడ భారీగా క్యూలైన్ ఉంటుంది. వైద్యులు పరీక్షించి రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాల్సిందిగా సూచిస్తున్నారు. ఒక్కో ల్యాబ్ ఒక్కో భవనంలో ఉండటంతో వీటి గుర్తింపు రోగులకు కష్టంగా మారుతుంది. అటు ఇటు తిరిగి డయాగ్నోస్టిక్‌కు చేరుకుంటే అక్కడ కూడా నిరీక్షణ తప్పడం లేదు. రిపోర్టుల జారీలోనూ తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. మెడికల్ రిపోర్టులు చూడకుండా మందులు రాసే పరిస్థితి లేకపోవడం, తీరా రిపోర్టు తీసుకుని వెళ్లే సమయానికి ఓపీలో వైద్యులు లేకపోవడంతో రెండు మూడు రోజులు ఆస్పత్రి ఆవరణలోనే నిరీక్షించాల్సి వస్తుంది. అప్పటికే రోగం మరింత ముదిరి ప్రాణాల మీదకు వస్తుంది. పైరవీ ఉంటేనే ఎమర్జెన్సీలో పడక కేటాయింపు వంద పడకల సామర్థ్యం ఉన్న అత్యవసర విభాగానికి రోజుకు సగటున 15–25 మంది వస్తుంటారు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, హృద్రోగులు, కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉంటారు. ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొంది తీరా ఆరోగ్య పరిస్థితి విషమించిన తర్వాత వెంటిలేటర్‌పై వస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, వెంటిలేటర్లు, వైద్య సిబ్బంది లేకపోవడంతో అడ్మిషన్ దొరకడం కష్టంగా మారుతోంది. ► ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న అధికారులతో ఫోన్ చేయించి ఒత్తిడి తెప్పిస్తే కానీ పడక దొరకని దుస్థితి. ► ఇదిలా ఉంటే అత్యవసర విభాగాల్లో 36 ట్రాలీలు ఉండగా, వీటిలో 15 రిపేరులో ఉన్నాయి. 26 వెంటిలేటర్లు ఉండగా వీటిలో 6 సాంకేతిక సమస్యలతో మూలకు పడ్డాయి. u ఒక వెంటిలేటర్‌కు ఒక స్టాఫ్ నర్సు అవసరం కాగా, గ్రౌండ్‌ఫ్లోర్‌లో 15 మంది ఉంటే, మొదటి అంతస్తులో తొమ్మిది మంది స్టాఫ్ నర్సులు మాత్రమే పని చేస్తున్నారు. ► అంతేకాదు కన్సల్టెంట్ డాక్టర్లు వార్డుకు వచ్చి రౌండ్స్ నిర్వహించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. ఫలితంగా అత్యవసర విభాగం నుంచి ఆయా వార్డులకు కేసులను తరలించడంలోనూ జాప్యం చోటు చేసుకుని పడకల సమస్య తలెత్తుతుంది. ► ఎమర్జెన్సీ విభాగంలో పడకల సంఖ్యతో పాటు స్టాఫ్ నర్సులు, డ్యూటీ మెడికల్ డాక్టర్ల సంఖ్యను పెంచడం ద్వారా కొంత వరకు సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైద్యుడు అభిప్రాయపడ్డారు. రెండు మూడు రోజులు అవుతోంది... నాణ్యమైన వైద్యం దొరుకుతుందనే నమ్మకంతో వచ్చా. కానీ ఇక్కడ ఓపీ కార్డు తీసుకోవడం మొదలు, వైద్యుడికి చూపించుకోవడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, మందులు రాయించుకుని వెళ్లడం ఇలా అన్ని చోట్ల ఆలస్యమవుతోంది. సాధారణ చికిత్సకూ రెండు మూడు రోజుల సమయం పడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లం రాత్రిపూట ఎక్కడ ఉండాలో తెలియక ఆస్పత్రి ఆవరణలోనే చలికి వణుకుతూ, తిండి తిప్పలు లేకుండా ఉన్నాం. – మల్లేష్, గజ్వేల్ ఇతర ఆస్పత్రులను డెవలప్ చేయాలి ప్రభుత్వం గతంలో జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కడుతామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో తెలంగాణ నలుమూలల నుంచి రోగులు ఇక్కడికే వస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, వైద్య సిబ్బంది లేక ఆస్పత్రిపై ఒత్తిడి పెరుగుతోంది. రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించలేని దుస్థితి. ఉస్మానియా, గాంధీ ఇతర ఆస్పత్రులను కూడా నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడం ద్వారానే రోగుల రద్దీ తగ్గుతుంది. ఖాళీలను భర్తీ చేసి, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వచ్చిన రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించే వెసులుబాటు కలుగుతుంది. – డాక్టర్ జి.శ్రీనివాస్, రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7,634 రెగ్యులర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేసి, పరోక్షంగా ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహిస్తే, ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో డాక్టర్లు, వైద్య సిబ్బందిని పెద్ద సంఖ్యలో నియమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ఏకంగా 7,634 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేశారు. జిల్లా స్థాయిలో డైరెక్టర్ మెడికల్ విద్య, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ కింద ఆస్పత్రుల్లో మొత్తం 7,590 రెగ్యులర్ పోస్టుల భర్తీకి అనుమతించగా ఇప్పటి వరకు 6,106 పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ మెడికల్ విద్య, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ కింద 2,120 పోస్టులు మంజూరు చేయగా ఇప్పటి వరకు 1,528 పోస్టులను భర్తీ చేశారు. మిగతా 592 పోస్టుల భర్తీ ప్రాసెస్‌లో ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. దీనిని బట్టి ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టం అవుతోందని వైద్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా స్థాయిలో మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.