ఉచితంగా కోవిడ్‌ మందులిస్తాం | Natco Pharma Ltd Letter To CM Jagan for Covid Drugs Free Distribution | Sakshi
Sakshi News home page

ఉచితంగా కోవిడ్‌ మందులిస్తాం

May 22 2021 6:12 AM | Updated on May 22 2021 6:12 AM

Natco Pharma Ltd Letter To CM Jagan for Covid Drugs Free Distribution - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,అమరావతి: కోవిడ్‌ –19 చికిత్సలో వాడే మందులను నాట్కో ట్రస్టు తరఫున ఉచితంగా అందిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నాట్కో ఫార్మా లిమిటెడ్‌ ఓ లేఖ రాసింది. చికిత్సలో వాడే బారిసిటినిబ్‌–4 ఎంజీ (బారినట్‌) టాబ్లెట్లు ఇవ్వనున్నట్టు ఆ లేఖలో పేర్కొంది.

సుమారు లక్ష మంది కోవిడ్‌ పేషెంట్లకు ఈ టాబ్లెట్లు సరఫరా చేస్తామని తెలిపింది. రూ.4 కోట్ల 20 లక్షల ఖరీదు చేసే టాబ్లెట్లను ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్లకు ఇస్తామని పేర్కొంది. విడతల వారీగా  మెడిసిన్‌ సరఫరా చేయనున్నట్లు నాట్కో ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ వి.సి. నన్నపనేని స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement