NATCO
-
ఉచితంగా కోవిడ్ మందులిస్తాం
సాక్షి,అమరావతి: కోవిడ్ –19 చికిత్సలో వాడే మందులను నాట్కో ట్రస్టు తరఫున ఉచితంగా అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నాట్కో ఫార్మా లిమిటెడ్ ఓ లేఖ రాసింది. చికిత్సలో వాడే బారిసిటినిబ్–4 ఎంజీ (బారినట్) టాబ్లెట్లు ఇవ్వనున్నట్టు ఆ లేఖలో పేర్కొంది. సుమారు లక్ష మంది కోవిడ్ పేషెంట్లకు ఈ టాబ్లెట్లు సరఫరా చేస్తామని తెలిపింది. రూ.4 కోట్ల 20 లక్షల ఖరీదు చేసే టాబ్లెట్లను ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు ఇస్తామని పేర్కొంది. విడతల వారీగా మెడిసిన్ సరఫరా చేయనున్నట్లు నాట్కో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ వి.సి. నన్నపనేని స్పష్టం చేశారు. -
నాట్కో మధ్యంతర డివిడెండు రూ.7
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా కంపెనీ నాట్కో 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.7 రెండవ మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం క్రితంతో పోలిస్తే 11.5 శాతం అధికమై రూ.217 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.685 కోట్ల నుంచి రూ.573 కోట్లకు పడిపోయింది. ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ.1,454 కోట్ల టర్నోవరుపై రూ.395 కోట్ల నికరలాభం నమోదైంది. మంగళవారం బీఎస్ఈలో నాట్కో ఫార్మా షేరు ధర ఒక దశలో ఇంట్రా డేలో 8 శాతం వరకూ నష్టపోయి రూ.841ని తాకింది. ఫలితాల నేపథ్యంలో రికవరీ జరిగి ఒకదశలో లాభపడింది కూడా. చివరకు 1 శాతం నష్టంతో రూ.904 వద్ద క్లోజయింది. -
నాట్కో, అలెంబిక్లకు లైన్ క్లియర్
పేటెంట్ ఔషధాలను ఎగుమతి చేయొచ్చు: ఢిల్లీ హైకోర్టు తీర్పు న్యూఢిల్లీ: ప్రముఖ ఔషధ కంపెనీలు నాట్కో, అలెంబిక్ కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. జర్మన్ ఔషధ కంపెనీ బేయర్స్కు చెందిన రెండు పేటెంట్ ఔషధాలను ఈ సంస్థలు తయారు చేసి క్లినికల్ పరీక్షల కోసం, విదేశీ నియంత్రణ సంస్థల ఆమోదం కోసం ఎగుమతి చేసేందుకు కోర్టు అనుమతిస్తూ హైకోర్టు బుధ వారం తీర్పు జారీ చేసింది. దేశీయ జనరిక్ ఔషధ తయారీ దారులు పేటెంట్ రక్షణలో ఉన్న ఔషధాలను నియంత్రణ సంస్థల ఆమోదం కోసం, క్లినికల్ పరీక్షల కోసం వాటిని తయారు చేసి, విక్రయించి, ఎగుమతి చేసే ప్రాథమిక హక్కును కలిగి ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇందుకు పేటెంట్స్ చట్టంలోని సెక్షన్ 107ఏ వీలు కల్పిస్తోందని కోర్టు ఉదహరించింది. ఈ ప్రాథమిక హక్కుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి) రక్షణ కూడా కల్పిస్తోందని... చట్టం చెబితే తప్ప ఔషధ విక్రయాలను అడ్డుకోలేరని జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా స్పష్టం చేశారు. కాగా, ఔషధాలకున్న పేటెంట్ హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని, సెక్షన్ 107ఏలో పేర్కొన్న మేరకు మినహా ఇతర అవసరాలకు పేటెంట్ రక్షణలో ఉన్న వాటిని ఎగుమతి చేయరాదని నాట్కో, అలెంబిక్ కంపెనీలను కోర్టు ఆదేశించింది. పేటెంట్ ఉల్లంఘన కాదు... బేయర్స్ కేన్సర్ ఔషధమైన సోరాఫెనిబ్ను నెక్సావర్ పేరుతో మార్కెట్ చేస్తోంది. దీనికి పేటెంట్ రక్షణ ఉంది. దీనికి జనరిక్ వెర్షన్ అయిన సోర్ఫెనట్ను నాట్కో ఎగుమతి చేసింది. అలాగే, బేయర్స్కు చెందిన రక్తాన్ని పలుచన చేసే రివరోక్సాబాన్ జనరిక్ రూపాన్ని అలెంబిక్ కంపెనీ ఎగుమతి చేసింది. దీంతో నాట్కో, అలెంబిక్ పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ బేయర్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ 107 సెక్షన్ఏలో పేర్కొన్న అవసరాలకు పేటెంట్ ఔషధాలను ఎగుమతి చేయడం ఉల్లంఘనకు పాల్పడినట్టు కాదని, దీన్ని అడ్డకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, పేటెంట్ ఔషధాన్ని నియంత్రణ సంస్థల అవసరాల కోసమంటూ ఎగుమతి చేసేం దుకు ఒక్కసారి అనుమతిస్తే, ఆ అవసరాలకే వాటిని వినియోగించేలా కోర్టు హామీ ఇవ్వలేదని బేయర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని కూడా కోర్టు తిరస్కరించింది. -
నాట్కో ’క్యాన్సర్’ ఔషధానికి ఎఫ్‌డీఏ ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెండామస్టీన్ హైడ్రోక్లోరైడ్ పౌడర్ జనరిక్ వెర్షన్ తయారీకి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతులు లభిం చినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. తీవ్రమైన లింఫోసైటిక్ ల్యూకేమియా తదితర క్యాన్సర్స్ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్లలో ఈ పౌడర్ వినియోగిస్తారు. దీంతో 2019 నవంబర్ 1 లేదా అంతకన్నా ముందే ఈ ఔషధాన్ని అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది. మార్కెటింగ్ భాగస్వామి బ్రెకెన్రిడ్జ్ ఫార్మాస్యూటికల్తో కలిసి దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు నాట్కో వివరించింది. ప్రస్తుతం ట్రెయాండా పేరుతో సెఫలాన్ సంస్థ (2011లో టెవా దీన్ని కొనుగోలు చేసింది) దీన్ని అమెరికా మార్కెట్లో విక్రయిస్తోంది. నవంబర్‌తో ముగిసిన పన్నెండు నెలల కాలంలో ఈ ఔషధ విక్రయాలు సుమారు 133 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎఫ్‌డీఏ అనుమతులతో శుక్రవారం బీఎస్ఈలో నాట్కో ఫార్మా షేరు ధర దాదాపు నాలుగు శాతం పెరుగుదలతో రూ. 624 వద్ద ముగిసింది. -
నాట్కో ఔషధానికి ఎఫ్‌డీఏ ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బుడెసొనైడ్ ఔషధ జనరిక్ వెర్షన్ అమ్మకాలకు అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతులు లభించినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. పెరిగో ఫార్మా ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని ఎంటోకోర్ట్ పేరిట విక్రరుుస్తోంది. జీర్ణవ్యవస్థ సమస్యల సంబంధిత క్రోన్స వ్యాధి చికిత్సలో ఎంటోకోర్ట్ ఈసీ (3 మి.గ్రా. మోతాదు)ని ఉపయోగిస్తారని నాట్కో వివరించింది. తమ మార్కెటింగ్ భాగస్వామి అల్వోజెన్తో కలిసి దీన్ని తక్షణం అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ఎంటోకోర్ట్ ఈసీ క్యాప్సూల్స్, సంబంధిత ఇతర జనరిక్ వెర్షన్స అమ్మకాలు అమెరికాలో వార్షికంగా సుమారు 370 మిలియన్ డాలర్ల మేర ఉన్నట్లు అంచనా. గురువారం బీఎస్ఈలో నాట్కో షేరు స్వల్పంగా పెరిగి రూ. 590 వద్ద ముగిసింది. -
నాట్కో షేర్లు విభజన
షేరు విభజన తర్వాత తొలిసారిగా గురువారం జరిగిన ట్రేడింగ్‌లో నాట్కో ఫార్మా షేరు పరుగులు తీసింది. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేరును రెండు రూపాయలుగా విభజించిన సంగతి తెలిసిందే. విభజన తర్వాత రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేర్లు గురువారం ట్రేడయ్యాయి. క్రితం ముగింపు రూ. 2,575గా ఉన్న షేరు విభజన తర్వాత రూ. 519 వద్ద నమోదయ్యింది. ఆ తర్వాత ఒకానొక దశలో 16% పెరిగి రూ. 596 వరకు పెరిగింది. చివరకు 6 శాతం లాభంతో రూ. 544 వద్ద ముగిసింది.