షేరు విభజన తర్వాత తొలిసారిగా గురువారం జరిగిన ట్రేడింగ్‌లో నాట్కో ఫార్మా షేరు పరుగులు తీసింది.
షేరు విభజన తర్వాత తొలిసారిగా గురువారం జరిగిన ట్రేడింగ్‌లో నాట్కో ఫార్మా షేరు పరుగులు తీసింది. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేరును రెండు రూపాయలుగా విభజించిన సంగతి తెలిసిందే. విభజన తర్వాత రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేర్లు గురువారం ట్రేడయ్యాయి. క్రితం ముగింపు రూ. 2,575గా ఉన్న షేరు విభజన తర్వాత రూ. 519 వద్ద నమోదయ్యింది. ఆ తర్వాత ఒకానొక దశలో 16% పెరిగి రూ. 596 వరకు పెరిగింది. చివరకు 6 శాతం లాభంతో రూ. 544 వద్ద ముగిసింది.