సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయో మెడికల్‌ఇంజనీర్లను నియమించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. కొత్త పోస్టుల మంజూరుపై దృష్టి సారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఎంజీఎం సహా పెద్దాస్పత్రులకు ఒక్కో బయో మెడికల్ ఇంజనీర్ ఉండేలా చూడాలని భావిస్తోంది. రెండు జిల్లాలకు కలిపి ఒక అధికారిని నియమించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో భర్తీ చేసే అవకాశముంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, అనుమతి రాగానే భర్తీ చేస్తామని ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
30 వేల రకాల పరికరాలు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో థర్మామీటర్ మొదలుకొని ఎక్స్‌రే, ఈసీజీ, సీటీ స్కాన్, 2డీ ఎకో, టీఎంటీ, అల్ట్రా సౌండ్ మెషీన్, ఆక్సిజన్ పైప్‌లైన్ వ్యవస్థ వంటివి అనేకం ఉంటాయి. ఆపరేషన్ థియేటర్, ఐసీయూల నిర్వహణ ఎంతో కీలకమైనవి. చిన్నా పెద్దా కలుపుకొని దాదాపు 30 వేల రకాల వైద్య పరికరాలు ఉంటాయి. రూ.వందల కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తే, చిన్న మరమ్మతు కారణంగా వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించినా, వారు వచ్చి బాగుచేసే సరికి రోజులు గడుస్తున్నాయి. కొన్నిసార్లు నెలలు గడిచినా మరమ్మతులకు నోచుకోవట్లేదు. కొన్ని పరికరాలు తుక్కుగా మారుతున్నాయి. ఆయా మెషీన్లకు సంబంధించి పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో రోగులకు సక్రమంగా వైద్యం అందట్లేదు. అల్ట్రా సౌండ్ లేదనో, 2డీ ఎకో లేదనో చెప్పి రోగులను పైస్థాయి ఆస్పత్రులకు పంపుతున్నారు.
మరమ్మతుల ఆలస్యానికి చెక్..
రాష్ట్ర మౌలిక సేవలు, వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ద్వారా వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అందుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తారు. వైద్య పరికరాల నాణ్యతను పరీక్షించడం, వాటిని మరమ్మతుల్లో కీలకపాత్ర పోషించే బయో మెడికల్ ఇంజినీర్లు ముగ్గురే ఉన్నారు. వైద్య పరికరాలు చెడిపోతే కంపెనీ టెక్నీషియన్లు వచ్చి బాగు చేస్తారు. పరికరాల నిర్వహణకు సంబంధించి నిర్ణీత సమయం గడిచాక కంపెనీలకు వాటి మరమ్మతుతో సంబంధం ఉండదు. అలాంటి పరికరాలను థర్డ్ పార్టీకి చెందిన టెక్నీషియన్లు వచ్చి మరమ్మతు చేయాలి. అవి పాడైనట్లు బయో మెడికల్ ఇంజినీర్లు గుర్తించాలి. వీరు చాలా తక్కువ సంఖ్యలో ఉండటంతో రోజుల తరబడి ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో బయో మెడికల్ ఇంజినీర్లను నియమిస్తే తక్షణమే గుర్తించి కంపెనీ టెక్నీషియన్లను పిలిపిస్తారు. తద్వారా వైద్య పరికరాల నిర్వహణ, మరమ్మతుల్లో ఆలస్యానికి చెక్ పడనుంది.
పైస్థాయి ఆస్పత్రులకు పంపుతున్నారు.
మరమ్మతుల ఆలస్యానికి చెక్..: రాష్ట్ర మౌలిక సేవలు, వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అందుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తారు. వైద్య పరికరాల నాణ్యత పరీక్షించడం, మరమ్మతుల్లో కీలక పాత్ర పోషించే బయో మెడికల్ ఇంజనీర్లు ముగ్గురే ఉన్నారు. వైద్య పరికరాలు పాడైతే కంపెనీ టెక్నీషియన్లు వచ్చి బాగు చేస్తారు. పరికరాల నిర్వహణకు సంబంధించి నిర్ణీత సమయం గడిచాక కంపెనీలకు వాటి మరమ్మతుతో సంబంధం ఉండ దు. వాటిని థర్డ్ పార్టీ టెక్నీషియన్లు మరమ్మతు చేయాలి. అవి పాడైనట్లు బయో మెడికల్ ఇంజనీర్లు గుర్తించాలి. వీరు చాలా తక్కువ సంఖ్యలో ఉండటంతో రోజుల తరబడి ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో బయో మెడికల్ ఇంజనీర్లను నియమిస్తే తక్షణమే గుర్తించి కంపెనీ టెక్నీషియన్లను పిలిపిస్తారు. తద్వారా వైద్య పరికరాల నిర్వహణ, మరమ్మతుల్లో ఆలస్యానికి చెక్ పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment