సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సాక్షిలో ‘సర్కార్ సర్జరీ.. సూపర్’ అనే శీర్షికతో ప్రచురితమైన వార్త క్లిప్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖాన సూపర్ అనే స్థాయికి రావడం గర్వకారణమని కొనియాడారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద1539 కిడ్నీ, 51 కాలేయ మార్పిడి సర్జరీలు జరిగినట్లు తెలిపారు. హార్ట్ ట్రాన్స్‌ప్లంట్ జరగడం.. స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లంట్ సెంటర్ ఏర్పాటు అదే విధంగా బేరియాట్రిక్ సర్జరీలు కూడా చేయడం అభనందనీయమన్నారు. ఇందుకు కృషి చేస్తున్న మంత్రి హరీష్‌రావు, వైద్య బృందానికి అభినందనలు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖాన సూపర్ అనే స్థాయికి రావడం గర్వకారణం 👏
— KTR (@KTRBRS) March 12, 2023
1539 కిడ్నీ, 51 లివర్, హార్ట్ Transplants జరగడం, State Organ Transplant Centre ఏర్పాటు అదే విధంగా Bariatric surgeries కూడా చెయ్యడం… https://t.co/NBDNQAmVJI pic.twitter.com/S9MClqz6X9
Comments
Please login to add a commentAdd a comment