విద్యుత్ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ : విద్యుత్ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ నెల 5న వరంగల్ భూపాలపల్లిలో 600 మోగావాట్ల యూనిట్ ప్రారంభం అవుతుందని, ఏప్రిల్ నాటికి జైపూర్ నుంచి మరో 1200 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుందన్నారు. 2016 చివరికి 4,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పని చేయాలని, 2018 నాటికి 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ పేర్కొన్నారు.