నంద్యాల ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు తెలుగుదేశం పార్టీ కుయుక్తులు పన్నుతోందని ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు తెలుగుదేశం పార్టీ కుయుక్తులు పన్నుతోందని ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ కుట్రలను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణశాఖ ప్రధాన కార్యదర్శి శివకుమార్ సోమవారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలసి విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాలలో తమ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయాలని టీడీపీ కుట్రపన్నుతోందని తెలిపారు. దీనివల్ల ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనకుండా చేయడమే అధికార పార్టీ ఎత్తుగడని చెప్పారు.