
ఉదయ్ కిరణ్ మృతిపై వీడిన మిస్టరీ
సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది.
సుదీర్ఘకాలం తరువాత ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఉదయ్‌కిరణ్ మరణానికి గల కారణాలు కూడా వెల్లడయ్యాయి. చిత్ర పరిశ్రమలో ఎదగలేకపోతున్నాననే మానసిక ఒత్తిడిలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని దర్యాప్తులో తేలింది. గతంలో కూడా రెండుమూడ్లు సార్లు ఆత్మహత్యకు యత్నించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అనుమానాస్పద మృతి కేసును త్వరలో ఆత్మహత్య కేసుగా మార్చి మూసి వేసే అవకాశాలు ఉన్నాయి.