ప్రతి ఎంపీ ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి | Narendra Modi exhorts parliamentarians to adopt a village | Sakshi
Sakshi News home page

ప్రతి ఎంపీ ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి

Published Sat, Oct 11 2014 1:51 PM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పధకాన్ని ప్రారంభించారు. ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన'  పధకాన్ని ప్రారంభించారు.  ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  2016 కల్లా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలని,  పార్లమెంట్‌ సభ్యులు ఈ బాధ్యత తీసుకోవాలని ఆకాంక్షించారు. తాను కూడా వారణాసి నియోజకవర్గంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి ఎంపీ గ్రామాభివృద్ధిని బాధ్యతగా తీసుకోవాలని మోడీ సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement