ఫిబ్రవరి 18 తర్వాతే తెలంగాణ బిల్లు: న్యాయశాఖ
15వ లోకసభ ముగియడానికి మూడు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 18 తేదిన తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు న్యాయశాఖ ఏర్పాట్లు చేస్తోందని పీటిఐ కథనంలో పేర్కోంది.
న్యూఢిల్లీ: 15వ లోకసభ ముగియడానికి మూడు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 18 తేదిన తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు న్యాయశాఖ ఏర్పాట్లు చేస్తోందని పీటిఐ కథనంలో పేర్కోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజ్యాంగ సవరణ అక్కర్లేదు అని కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
పార్లమెంట్ లో సాధారణ మెజార్టీ ద్వారా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని న్యాయశాఖ లోకసభ సెక్రటేరియట్ కు బుధవారం ఉదయం వెల్లడించింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 3, 4(2) ప్రతిపాదకగా తీసుకోవాలని న్యాయశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సాధారణ తీర్మానం మాత్రమే అవసరమని కేంద్ర కేబినెట్ కు ఇదివరకే మంత్రుల బృందం తెలిపిందని లోకసభ సెక్రెటేరియట్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే తెలంగాణలో శాసన మండలికి మాత్రం మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం లేదు న్యాయశాఖ తెలిపింది.
అయితే ప్రస్తుత రాష్ట్ర విభజనకు 29వ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి రాజ్యాంగ సవరణలు అక్కర్లేదని ఓప్రశ్నకు న్యాయశాఖ అధికారులు జవాబిచ్చారు. ఈ నేపథ్యంలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ 2013-14 ను ఆమోదించిన తర్వాతనే ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 15 లోకసభ ముగింపుకు మూడు రోజుల ముందు మాత్రమే తెలంగాణ బిల్లు సభలో ప్రవేశపెట్టే పరిస్థితుల కనిపిస్తున్నాయని పీటీఐ కథనంలో వెల్లడించింది.