పార్లమెంట్కు కొత్తగా ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ సభలో కొత్త సభ్యులతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
న్యూఢిల్లీ : పార్లమెంట్కు కొత్తగా ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ సభలో కొత్త సభ్యులతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రాజ్యసభలోనూ చైర్మన్ హమీద్ అన్సారీ ...సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
లోక్ సభలో రంజన్ బేన్ ధనుంజయ్ భట్, దివంగత కేంద్రమంత్రి గోపీనాధ్ ముండే కూతురు ప్రీతమ్ గోపీనాధ్ ముండే ప్రమాణం చేశారు.
మరోవైపు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మంత్రులను ప్రధాని మోదీ ..సభకు పరిచయం చేశారు. ఆ తర్వాత దివంగత సభ్యులు, హుద్ హుద్ మృతులకు ఉభయ సభలు సంతాపం తెలిపింది. అనంతరం పార్లమెంట్ రేపటికి వాయిదా పడింది. కాగా పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 23వరకూ కొనసాగనున్నాయి.