
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్( కోవిడ్ 19)పై వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఆయన జన ఔషధీ కేంద్రాల యజమానులు, ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన(పీఎంబీజేపీ) లబ్ధిదారులతో సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..కరోనా వైరస్‌పై వస్తున్న పుకార్లను నమ్మొద్దని, డాక్టర్ల సలహాలు పాటించాలని ప్రజలను కోరారు. షేక్ హ్యాండ్ బదులు నమస్తే పెట్టాలని సూచించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం నమస్తే పెట్టడం అలవాటు చేసుకుంటోందని అన్నారు.
భాగోద్వేగానికి లోనైన మోదీ
లబ్దిదారులతో మాట్లాడే క్రమంలో ప్రధాని మోదీ భాగోద్వేగానికి లోనయ్యారు. పక్షవాతానికి లోనై.. జన ఔషధి పథకం ద్వారా లబ్ది పొందిన దీపా షా అనే ఓ మహిళ మాట్లాడిన మాటలు విని మోదీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. సరిగా మాట్లాడలేకపోయిన తాను.. తన రోగాన్ని సరిచేసుకునేందుకు ఎంతో ఖర్చయ్యే పరిస్థితి ఎదుర్కొన్నాననీ, ఐతే... జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ రేటుకే మందులు కొనుక్కొని సమస్య నుంచీ బయటపడినట్లు మోదీకి వివరించారు.
‘ 2011లో నాకు పక్షవాతం వచ్చింది. దీంతో సరిగా మాట్లాడలేకపోయాను. వైద్యం ఖర్చులు భారీగా అయ్యేవి. అయితే జన ఔషధి పథకం ద్వారా నాకు పెద్ద ఉపశమనం లభించింది. జన జౌషధ కేంద్రాల ద్వారా తక్కువ రేటుకే మందులు కొనుక్కోగలుగుతున్నాను. రూ. 5000 విలువల చేసే మందులు.. రూ.1500 లకే లభిస్తున్నాయి. వైద్యం ఖర్చులు తగ్గడంతో కడుపు నిండా తినగలుగుతున్నాను. ఈ పథకంగా తెచ్చిన మోదీకి కృతజ్ఞతలు. నేను దేవున్ని ప్రత్యేక్షంగా చూడలేదు. మీలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు’ అంటూ దీపా కనీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన మోదీ భాగోద్వేగానికి లోనయ్యారు. కొన్ని క్షణాల పాటు తలను కిందకు దించి దుఃఖాన్ని దిగమింగుకొని ఆమె మాటలు శ్రద్ధగా విన్నారు.
#WATCH Prime Minister Narendra Modi gets emotional after Pradhan Mantri Bhartiya Janaushadi Pariyojana beneficiary Deepa Shah breaks down during interaction with PM. pic.twitter.com/Ihs2kRvkaI
— ANI (@ANI) March 7, 2020