రాష్ట్రపతి కాకముందే ఏపీజే అబ్దుల్ కలాం భారతరత్నంగా గుర్తింపు పొందారని, ఆయన ఎల్లప్పుడూ సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండేవారని...
న్యూఢిల్లీ: రాష్ట్రపతి కాకముందే ఏపీజే అబ్దుల్ కలాం భారతరత్నంగా గుర్తింపు పొందారని, ఆయన ఎల్లప్పుడూ సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండేవారని, కలాం జీవితం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ప్రజా రాష్ట్రపతిగా నిలిచిన కలాం జ్ఞాపకార్థం ఆయన జన్మించిన రామేశ్వరంలో స్మారకం నిర్మిస్తామని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 84వ జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో డీఆర్‌డీవో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. డీఆర్‌డీవో భవన్‌లో కలాం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.
‘ఏ సెలబ్రేషన్ ఆఫ్ డాక్టర్ కలాం లైఫ్’ పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మోదీ ప్రారంభించారు. కలాం స్మారకార్థం రూపొందించిన పోస్టల్ స్టాంప్‌ను కూడా ప్రధాని ఆవిష్కరించారు.