మీరు జర్నలిస్తులు.. వారిని మీరే గుర్తించాలి | Rajnath Singh refuses to pinpoint blame about 'rumours' on son | Sakshi

మీరు జర్నలిస్తులు.. వారిని మీరే గుర్తించాలి

Published Thu, Aug 28 2014 4:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మీరు జర్నలిస్తులు.. వారిని మీరే గుర్తించాలి - Sakshi

మీరు జర్నలిస్తులు.. వారిని మీరే గుర్తించాలి

మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు.. నా కోడుకుపై రూమర్లు సృష్టిస్తున్న వారిని మీరే పట్టుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు

లక్నో: మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు.. నా కోడుకుపై రూమర్లు సృష్టిస్తున్న వారిని మీరే పట్టుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు. తన కుమారుడిపై రూమర్లు సృష్టిస్తున్న వారేవరో తనకు తెలియదని.. వారి గురించి తాను ఆలోచించడం లేదని ఓ ప్రశ్నకు రాజ్ నాథ్ స్పందించారు. 
 
తన కుటుంబ సభ్యుల దుష్ప్రవర్తన ఉన్నట్టు రుజువైనట్లయితే తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. రాజ్ నాథ్ కుమారుడు పంకజ్ ప్రవర్తనపై ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement