
ఫైల్ ఫోటో
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జమ్మూ కశ్మీర్ బారాముల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఈ అప్రకటిత కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భారత భద్రతా దళనికి చెందిన ఇద్దరు సైనికులు శనివారం మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో సైనికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం బారాములల్లా జిల్లా రాంపూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ.. భారత భద్రతా సైనికులపై కాల్పులు జరిపిందని కల్నల్ రాజేష్ కలియా తెలిపారు. అంతకు ముందు ఏప్రీల్ 30న పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఆయుధాలతో అప్రకటిత కాల్పుల విరమణ ఉల్లంఘన ప్రారంభించిందని ఆయన వెల్లడించారు.