Top Stories
ప్రధాన వార్తలు

రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
ములుగు, సాక్షి: తెలంగాణలో సరిహద్దులో మంగళవారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలో(Karreguttalu) భారీగా మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగగా.. ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు మావోయిస్టులు ప్రతి కాల్పులకు దిగడంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలోకి వస్తోంది. అయితే.. కర్రెగుట్టల దండకారణ్యం వైపు రావొద్దంటూ ఆ మధ్య మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాన్ని ములుగు పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఖండించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. సుమారు రెండు వేల మంది భద్రతా బలగాలతో కర్రెగుట్టలను రౌండప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా.. హిడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన బలగాలు సోమవారం అర్ధరాత్రి నుంచే కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.కర్రెగుట్టకు సమీపంలో గల పెనుగోలు, కొంగాల, అరుణాచల పురం, బొల్లారం గ్రామాలు, అలాగే.. వెంకటాపురం మండలంలో గల సరిహద్దు గ్రామాలు, పెంక వాగు, మల్లాపురం, కర్రెవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు కలిపాక, సీతారాంపురం గ్రామాల్లో, కర్రెగుట్ట పైన ఉన్న పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల , జెల్ల గ్రామాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఒక్క క్లిక్‌తో..
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్‌తో https://education.sakshi.com/ ఫలితాలు తెలుసుకోవచ్చు.క్లిక్ చేయండి👉 ఇంటర్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్ క్లిక్ చేయండి👉 ఇంటర్ సెకండ్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్‌క్లిక్ చేయండి👉 ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్‌క్లిక్ చేయండి👉 సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్‌తెలంగాణలో ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలు రాసిన వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా.. 5 లక్షలకు మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. మూల్యాంకనం పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలు విడుదల చేయబోతున్నారు. సప్లిమెంటరీ తేదీలను కూడా ఫలితాల వెంటే ప్రకటించనున్నారు.

ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు(Om Prakash Case) దర్యాప్తులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. గూగుల్‌లో వెతికి మరీ భర్త ఓం ప్రకాశ్‌ను పల్లవి(Wife Pallavi) హతమార్చినట్లు వెల్లడైంది. అంతేకాదు తన భర్త తనపై విష ప్రయోగం చేశాడని.. ఆయన పెట్టే హింస భరించలేకే హత్య చేశానని ఆమె పోలీసుల ఎదుట చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తున్నాయి. హత్యకు ఐదు రోజుల ముందు నుంచి పల్లవి గూగుల్‌లో విపరీతంగా వెతుకుతూ వస్తోంది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడోనని వెతికిందామె. చివరకు మెడ దగ్గరి నరాలను దెబ్బ తీస్తే చనిపోతారని నిర్ధారించుకుని హత్య చేసింది. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాల నేపథ్యంలో తన భర్త, కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను పల్లవి హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే..ఓం ప్రకాశ్ కొడుకు కార్తీక్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆమె.. భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఊహించుకుంటూ వస్తోంది. ఈలోపు ఆస్తి తగదాలు కూడా మొదలు కాగా.. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటూ కుటుంబ వాట్సాప్ గ్రూపుల్లో కొన్నిరోజులుగా ఆమె సందేశాలు ఉంచుతూ వస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం ఓం ప్రకాశ్ భోజనం చేస్తున్న సమయంలో పల్లవి భర్త ఓం ప్రకాశ్ కళ్లలో కారం కొట్టింది. ఆపై కాళ్లు చేతులు కట్టేసి విచక్షణరహితంగా పొడిచి హత్య చేసింది. భర్త ప్రాణం పోతుండగానే పోలీసులకు ఆమె సమాచారం అందించింది. పోలీసులు వచ్చి చూసే సరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉండగా.. ఆమె రిలాక్స్‌గా ఓ కుర్చీలో కూర్చుని ఉంది. హత్య అనంతరం.. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్‌లో సందేశం ఉంచిన ఆమె.. ఓ మాజీ అధికారికి తానొక మృగాన్ని చంపినట్లు సందేశం కూడా పంపినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఈ హత్య తన సోదరి కృతి పాత్ర కూడా ఉండొచ్చని ఓం ప్రకాశ్ తనయుడు కార్తీక్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ కేసులో పల్లవిని ప్రాథమిక నిందితురాలిగా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

చంద్రబాబు.. మరీ ఇంతగానా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు విన్నా.. చదివినా రక్తపోటు, మధుమేహం గ్యారెంటీ అనిపిస్తోంది. కించపరచాలన్న ఉద్దేశం కాదు కానీ.. ఇటీవలి కాలంలో ఆయన అబద్ధాలకు, అతిశయోక్తులకు అంతు లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ విషయంలో ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు. స్వోత్కర్ష వరకూ ఓకే గానీ.. మితిమీరితే అవే ఎబ్బెట్టుగా మారతాయి.కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం మూడు మతాలను వాడుకుంటున్నట్లు ఆరోపించారు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. కూటమి సర్కారు పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏనాడైనా జగన్ మతపరమైన అంశాలు మాట్లాడారా? లేదే! కానీ జగన్ ఫోబియాతో బాధపడుతున్న చంద్రబాబు మాత్రం ప్రతిదానికీ మాజీ సీఎంపై అభాండాలు వేసేస్తున్నారు. ఈ తీరు చూసి ఆయన కేబినెట్ మంత్రులే విస్తుపోతున్నట్లు కథనాలు వచ్చాయి. జగన్‌ను ఎందుకు విమర్శించడం లేదు.. అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారని ఒక మంత్రి వాపోయారట.తిరుమల గోవుల మరణాలపై భూమన కరుణాకర రెడ్డి వెలుగులోకి తీసుకు వచ్చిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదని సీఎం అన్నారట. టీటీడీ ఛైర్మన్, ఈవో, సీఎం తలా ఒక్కోలా మాట్లాడుతూంటే వాటిల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకుని తాము మాట్లాడాలని ఒక మంత్రి తన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. గోవులేవీ చనిపోలేదని సీఎం చెబుతూంటే.. వృద్ధాప్యంతో 23 ఆవులు మరణించాయని టీటీడీ ఛైర్మన్, 43 ఆవులు చనిపోయాయని ఈవో చెబుతున్నారని దీన్నిబట్టి చూస్తే సీఎం అబద్ధమాడినట్లే కదా అని మంత్రులు కొందరు ఉన్నట్లు తెలుస్తోంది.జగన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డితో అబద్ధాలు చెప్పించారని చంద్రబాబు ఆరోపిస్తూన్నారు. భూమన ఎవరైనా చెబితే మాట్లాడే వ్యక్తేనా? తను నమ్మితే, ఆధారాలు ఉంటేనే మాట్లాడతారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అందువల్లే ఆయన ధైర్యంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన సవాల్‌ను స్వీకరించి తన ఆరోపణలను రుజువు చేయడానికి సిద్దమయ్యారు. పల్లా అసలు తిరుపతి రాకుండా ముఖం చాటేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు గోశాల వద్దకు వెళ్లి హడావుడి చేసి భూమన రావడం లేదని వ్యాఖ్యానించారు. తీరా చూస్తే భూమనను పోలీసులు అడ్డుకోవడం, గృహ నిర్భంధం చేయడం అందరు చూశారు.టీడీపీ నిస్సిగ్గుగా డబుల్ గేమ్ ఆడిన విషయం బహిర్గతమైంది. భూమన తిరుమల గోవుల, లేగ దూడల మరణాల గురించి ఆధార సహితంగా బయటి ప్రపంచానికి తెలియ చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు అసలు గోవుల మరణాలు జరగలేదని అబద్దం చెప్పారన్నది చాలామంది భావన. దానిని టీటీడీ చైర్మన్, ఈవోలే నిర్థారించారు. దాంతో ఏమి చేయాలో పాలుపోని స్థితి చంద్రబాబుకు ఏర్పడింది. అయినా టీడీపీలో అందరూ తన వాదననే ప్రచారం చేయాలన్నది సీఎం ఉద్దేశం కావచ్చు. ఇలాంటివి విన్నా, చదివినా ఎవరికైనా రక్తపోటు రాకుండా ఉంటుందా?. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర అని ఆయన అంటున్నారు.అసలు అలాంటి ఆలోచనలు చేయడంలో చంద్రబాబుకు ఉన్నంత సమర్ధత మరెవరికైనా ఉంటుందా అన్నది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్‌పై ఒక పచ్చి అబద్దాన్ని ప్రచారం చేశారే. వెంకటేశ్వర స్వామి తన ఇంటి దైవం అని చెప్పుకుంటూనే, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి తీరని అపచారం చేశారే! పోనీ అది నిజమని ఇంతవరకు ఎక్కడైనా రుజువు చేశారా? ఈ విషయంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచామన్న కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారే?. నిజంగా దైవ భక్తి ఉన్నవారెవరైనా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా?. పవన్ కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే పిచ్చి ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకున్నారే! లడ్డూ వివాదాన్ని ఎలాగొలా జగన్‌కు అంటగట్టాలని విశ్వయత్నం చేశారే. కాని విఫలమయ్యారే. ఆ తర్వాత అయినా చేసిన పాపం కడుక్కోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే లేదే !జగన్ టైమ్‌లో ఏ చిన్న విషయం దొరికినా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద ఆలయ రథం దగ్దమైతే బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు రచ్చ చేశారు. అయితే జగన్ సీబీఐ విచారణకు ఓకే చేస్తే కేంద్రం ఎందుకు సిద్దపడలేదు? రికార్డు సమయంలో కొత్త రథాన్ని తయారు చేయించిన జగన్ మతాల మధ్య ద్వేషం పెంచుతారంటే ఎవరైనా నమ్ముతారా? కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలే ఆలయాలపై దాడులు చేస్తే, దానిని కప్పిపుచ్చి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఆ రోజుల్లో కూటమి పార్టీలు ఎంత ప్రయత్నించి తెలియనిది కాదు. తన హయాంలో విజయవాడ తదితర చోట్ల నలభై గుడులను పడగొట్టిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే హిందూ మతోద్దారకుడిగా ప్రచారం చేసుకున్నారు.జగన్‌పైనే కాకుండా, ఆనాటి డీజీపీపై కూడా క్రిస్టియన్ మత ముద్ర వేసి ప్రజలలో ద్వేషం పెంచడానికి యత్నించారా? లేదా? తిరుమలలో ఏ చిన్న ఘటన జరిగినా జగన్ పై నెట్టేయడమే పనిగా పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు తిరుమలలో మద్యం అమ్ముతున్నా, బిర్యానీలు తెచ్చుకుంటున్నా, చెప్పులు వేసుకుని గుడి వరకు వెళుతున్నా, ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక చర్చిపై హిందూ మత రాతలు కనిపించాయి. వెంటనే హోం మంత్రి దానిని వైసీపీపై ఆరోపించారు. తీరా చూస్తే ఇద్దరు పాస్టర్ ల మధ్య గొడవలలో ఆ పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి దీనికి చంద్రబాబు ఏమి బదులు ఇస్తారు? ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో ఇలా మతపరమైన వివాదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. చంద్రబాబు చేతిలోకి టీడీపీ వచ్చాక అధికారం కోసం ఎలాంటి ద్వేషాన్ని అయినా రెచ్చగొట్డడానికి వెనుకాడరన్న అభియోగాలు ఉన్నాయి.వక్ఫ్ బిల్లుపై జగన్ రాజకీయం చేస్తున్నారట. ఇది విన్నవారికి ఏమనిపిస్తుంది? వైసీపీ అంత స్పష్టంగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించినా, పచ్చి అసత్యాలను ప్రచారం చేయడానికి టీడీపీ ఏ మాత్రం సిగ్గుపడడం లేదని అనిపించదా? తాజాగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది కదా? అసలు వక్ఫ్ చట్టంపై చంద్రబాబు, పవన్‌ల వైఖరి ఏమిటి అన్నది ఇంతవరకు చెప్పారా? ఒకప్పుడు ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ముస్లింలను బతకనివ్వడని, తలాఖ్ చట్టం తెచ్చారని ఆరోపించిన చంద్రబాబు బతిమలాడుకుని మరీ బీజేపీతో ఎలా జతకట్టారు? పోనీ ఇప్పుడు వక్ప్ చట్టాన్ని ఏపీలో అమలు చేయబోమని చెప్పగలరా? లేదా సుప్రీం కోర్టు విచారణలో ఇంప్లీడ్ అవ్వగలరా? అటు బీజేపీకి మద్దతు ఇవ్వాలి. ఇటు ముస్లింలను మోసమో, మాయో చేయాలని ప్రయత్నించడం చంద్రబాబుకే చెల్లుతుంది. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏపీ సీఎం చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని విమర్శించారు.ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై కూడా వైసీపీ మీద ఆయన ఆరోపణలు చేశారు. ఈ పాస్టర్ మృతిపై క్రైస్తవ సమాజానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండా ప్రభుత్వం ఎందుకు దబాయించే యత్నం చేస్తున్నదీ ఎవరికి అర్థం కాదు. దీనిపై ఒక రిటైర్డ్ ఐఎఎస్‌తో సహా పలువురు వేస్తున్న ప్రశ్నలకు పోలీసు అధికారులు జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. సీసీటీవీ దృశ్యాలపై కొందరు తమ అనుమానాలను తెలియచేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. జగన్ కాని, వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశం జోలికి వెళ్లకపోయినా, తాను ఇబ్బంది పడినప్పుడల్లా జగన్ పై తోసేసి కథ నడిపించాలన్నది చంద్రబాబు వ్యూహం.జగన్ టైమ్‌లో ఒక డాక్టర్ మద్యం మత్తులో రోడ్డుపై నానా యాగీ చేస్తే అక్కడ ఉన్న పోలీసు కానిస్టేబుల్ అతని రెక్కలు కట్టి పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. అంతే! అదేదో జగనే దగ్గరుండి చేయించినట్లుగా దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలో మాత్రం తాను చెప్పిందే రైటు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. కులపరమైన, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఢిల్లీలో కూర్చుని టీవీలలో లైవ్ లో మాట్లాడిన ఒక నేతకు ఇదే చంద్రబాబు పెద్ద పదవి ఇచ్చారే!నిజానికి మతపరమైన అంశాలకు ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత మంచిది. కాని ఒకప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని, మత తత్వ పార్టీ అని ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని, ఎదుటివారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ఏమనిపిస్తుంది. హేతుబద్దంగా ఆలోచించేవారికి ఎవరికైనా చంద్రబాబు ఇలాంటి నీతులు చెబుతున్నప్పుడు వినాలంటే బీపీ రాకుండా ఉంటుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన చోటు
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి గానూ విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డుకు ఎంపికయ్యాడు. గతేడాది ఫార్మాట్లకతీతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ బుమ్రాకు ఈ గౌరవం దక్కింది. 2024లో బుమ్రా మూడు ఫార్మాట్లలో 86 వికెట్లు (21 మ్యాచ్‌ల్లో 13 సగటున) తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. గతేడాది బుమ్రా టెస్ట్‌ల్లో విశేషంగా రాణించి అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫలితంగా అతను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, బీసీసీఐ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు గెలుచుకున్నాడు.గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా భారత్‌కు టైటిల్‌ను అందించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుతో పాటు రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.దిగ్గజాల సరసన చోటుతాజాగా విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు గెలవడంతో బుమ్రా భారత దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. గతంలో విరాట్ కోహ్లి, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ అవార్డును గెలుచుకున్నారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 3 సార్లు ఈ అవార్డును గెలువగా.. సెహ్వాగ్ 2, సచిన్ ఓసారి ఈ అవార్డును దక్కించుకున్నారు.విజ్డెన్ వుమెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు విషయానికొస్తే.. 2024 సంవత్సరానికి గానూ ఈ అవార్డును భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన దక్కించకుంది. మంధన గతేడాది మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణించి, రికార్డు స్థాయిలో 1659 పరుగులు చేసింది. మహిళల క్రికెట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. గతేడాది మంధన నాలుగు వన్డే శతకాలు, ఓ టెస్ట్ సెంచరీ సాధించింది.పూరన్‌కు లీడింగ్ టీ20 ప్లేయర్ అవార్డుపొట్టి క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్‌కు విజ్డెన్ మెన్స్ లీడింగ్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు లభించింది. పూరన్ గతేడాది పొట్టి ఫార్మాట్లో 21 మ్యాచ్‌లు ఆడి 142.22 స్ట్రయిక్‌రేట్‌తో 464 పరుగులు చేశాడు.

న్యూ ట్రెండ్.. ఆక్వా వర్కౌట్స్ : ప్రయోజనాలెన్నో!
పొద్దున్నే లేచి వ్యాయామం కోసం జిమ్‌కి వెళదామని ట్రాక్ సూట్, షూ ధరించేలోగానే చెమట్లతో తడిపేసే సీజన్ ఇది. అందుకే నగరవాసులు నీటి అడుగునే జిమ్దగీకి జై కొడుతున్నారు. చల్లని నీటిలో ఓ వైపు శరీరాన్ని చల్లబరుస్తూ.. మరోవైపు వ్యాయామాలు చేస్తూ సేదతీరుతున్నారు. ముంబై, బెంగళూర్ తదితర నగరాలతో పాటు భాగ్యనగరిలో కూడా ఆక్వా వర్కవుట్స్‌కి ఫిదా అవుతోంది నగర యువత. – సాక్షి, సిటీబ్యూరోపింగ్ జాక్‌లు, ఆర్మ్ లిఫ్ట్‌లు, లెగ్ కిక్స్, లెగ్ షూట్స్ ఇవన్నీ.. రోజూ జిమ్‌లో చేసేవే కదా అనుకోవచ్చు. అయితే అవన్నీ ఇప్పుడు నీటిలోనూ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు అనుసరిస్తున్న ఆక్వా వర్కౌట్లు/హైడ్రో ఎక్సర్సైజ్లు నగరంలోనూ ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. సిటీలో ఏప్రిల్, మే నెలల్లో ఆక్వా సంబంధిత వ్యాయామాలకు డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక కొత్తఎత్తయిన భవనాల్లోనూ, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ అందుబాటులో ఉన్న పూల్స్‌లో ఈ వ్యాయామాల సందడి కనిపిస్తోంది. ‘ఇది సాధారణ వ్యాయామాల మాదిరిగానే ఉంటుంది. కాకపోతే నీటిలో ఉన్నప్పుడు కాళ్లూ, చేతుల కదలికలకు పరికరాల కదలికను జోడించడం సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో క్యాలరీలను బాగా ఖర్చు చేయడంలో ఇది సహాయపడుతుంది. నీటిలో సౌకర్యవంతంగా ఉన్నంత వరకూ (ఇది పూల్స్‌లో ఎక్కువ లోతులేని వైపు ఉంటుంది) ఈ ఫార్మాట్ అన్ని వయసుల వారికీ పని చేస్తుంది అని చెబుతున్నారు ఆక్వా ఫిట్ ఇన్స్ట్రక్టర్ కవితారెడ్డి. చదవండి : 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీవ్యాయామాలెన్నో.. ఆక్వా ఎరోబిక్స్ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు సిటీలో క్యాలరీలను బర్న్ చేసి రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడే అనేక నీటి ఆధారిత వ్యాయామాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఆక్వాటిక్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఆక్వా జుంబా, హెచ్ఐఐటీ, తబాటా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఆక్వా యోగా, కిక్–బాక్సింగ్ వంటి అనేక రకాలైన వర్కవుట్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘డంబెల్స్, నూడుల్స్, ఆక్వా బాక్సింగ్ గ్లోవ్స్, రెసిస్టెన్స్ ట్యూబింగ్, వాటర్ వాకింగ్, ఆక్వా థ్రెడ్మిల్స్, వాటర్ బైక్‌లు ఇంకా ఎన్నో.. పరికరాలతో చేసేందుకు ఆక్వా వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయోజనాలెన్నో.. నీటి అడుగున వ్యాయామాలు బరువు తగ్గడానికి, కండరాలను టోన్ చేయడానికి, శక్తిని పెంచడానికీ సహాయపడతాయని అధ్యయనాలు నిరూపించాయి. తక్కువ అలసటతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. ఆర్థరైటిస్ రోగులకు ఇవి ఉత్తమమైనవి. అంతేకాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఆక్వా వర్కౌట్లు గర్భిణులకు కూడా మంచిదని చెబుతున్నారు కవిత. ఈ వ్యాయామం వల్ల కీళ్లకు కూడా మేలైన రక్షణ ఉంటుంది. అందుకే సాధారణంగా గాయం నుంచి కోలుకునే క్రమంలో తరచూ హైడ్రో థెరపీని ఉపయోగిస్తారు. కార్డియో–ఇన్‌టెన్సివ్‌గా ఉంటాయి, గాలి కంటే నీరు 13 రెట్లు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి నీటి వ్యాయామాలు మరింత పటిష్టంగా ఉంటాయి. నేలమీది వ్యాయామం కంటే ఎక్కువ నిరోధకతను అందిస్తాయి. ఇది ఒక గంటలో 500–1,200 క్యాలరీలు బర్న్ చేయగలదు. నీటిలో ఉన్నప్పుడు శరీర బరువులో 10 శాతం మాత్రమే బరువు కలిగి ఉంటారు. కాబట్టి కీళ్ళు అన్లోడ్ చేయబడినట్లు అనిపిస్తుంది. నేల మీద మనం చేసే వ్యాయామాల్లో తప్పుడు కదలికల వల్ల లిగ్మెంట్స్ చిరిగిపోవడానికి /ఒత్తిడికి / బెణుకు లేదా పగుళ్లకు కారణమవుతుంది. నీటిలో వ్యాయామాల వల్ల గాయం అయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చికిత్స కోసం నీటి వ్యాయామాలు సిఫార్సు చేస్తారు. ఇది చురుకుదనం, వెయిట్‌లాస్ కోసం ప్రభావవంతంగా ఉంటాయి. కాలుతో త్రిభుజం ఆకారంలో ఉండే డెగేజ్ పాస్ వంటివి ఇందులో ఉన్నాయి. పూల్‌లో నీటి సాంద్రత కాలుని ఎక్కువ దూరం కదపడానికి సహాయపడుతుంది. చదవండి : వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!కొన్ని సూచనలు మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం స్విమ్మింగ్ క్యాప్ ధరించడం ద్వారా చర్మం, జుట్టుకు క్లోరిన్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే కళ్లను రక్షించడానికి నీళ్లు కంట్లో కలిగించే చికాకును నివారించడానికి గాగుల్స్ ధరించాలి.నిదానంగా వ్యాయామం ప్రారంభించి కొంచెం కొంచెంగా తీవ్రతను పెంచాలి. శ్వాసను ఎక్కువసేపు బిగబట్టుకోవద్దు. నీటి అడుగున కఠినమైన విన్యాసాలు చేయవద్దు. నైపుణ్యం, స్థాయి, సామర్థ్యానికి తగిన వ్యాయామాలు మాత్రమే చేయాలి.సరైన శిక్షణ పర్యవేక్షణలో ఉంటే తప్ప అధునాతన వర్కవుట్స్ ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అనుభవం లేకుంటే డైవింగ్ లేదా ఫ్లిప్ చేయడం మంచిదికాదు. అన్ని సీజన్స్‌లోనూ ఆరోగ్యకరమే.. ఈ వర్కవుట్ కేవలం వేసవిలో మాత్రమే కాదు అన్ని కాలాల్లోనూ ప్రయోజనకరం. బెంగళూరులో ఉన్నప్పుడు వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారంగా ఎంచుకున్న ఈ వ్యాయామం నగరానికి వచి్చన తర్వాత నాకు పూర్తి స్థాయి ప్రొఫెషన్‌గా మారింది. దీని కోసం సింగపూర్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఏరోబిక్ అండ్ ఫిట్నెస్ (ఫిసా) కోర్సును చేశాను. ప్రస్తుతం నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న స్ట్రోక్స్‌తో పార్ట్నర్గా ఆక్వా వర్కవుట్స్‌లో సిటిజనులకు శిక్షణ అందిస్తున్నాను. ఈ వ్యాయామాల లాభాలపై అవగాహన మరింత పెరిగితే అది మరింతమందికి మేలు కలిగిస్తుంది. – కవితారెడ్డి, ఆక్వా ఫిట్ శిక్షకురాలు

ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్
బెంగళూరు: ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బెంగళూరులో తమపై కొందరు దాడి చేశారని వింగ్ కమాండర్ షీలాదిత్యా బోస్, ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. తొలుత బోస్ దాడికి దిగినట్లుగా కన్పిస్తున్న సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి ధ్రువీకరించారు కూడా.భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ బోస్ సంచలన ఆరోపణలకు దిగారు. కారులో వెళ్తున్న తమను కొందరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అడ్డగించి దాడి చేశారని ఆరోపించారు. ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత కూడా.. పోలీసులకు ఈ విషయం చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో బోస్ ముఖం, మెడ నిండా రక్తం కనిపించింది. పక్కనే ఆయన భార్య కారు నడుపుతూ కనిపించింది. ఈ వ్యవహారం ‘కన్నడిగ వర్సెస్ నాన్ కన్నడిగ’గా మారింది. అయితే వీడియో ఆధారంగా విచారణ జరిపిన ఈస్ట్ జోన్ డీసీపీ దేవ్‌రాజ్ షాకింగ్ విషయం తెలియజేశారు. తొలుత బోస్ వాళ్లపై దాడికి దిగారని తెలియజేశారు. అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించిన నిందితుడు కూడా బోస్పై ఫిర్యాదు చేశారని అన్నారు. అయితే పరస్పర దాడికి కారణాలు పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే తెలియజేస్తామన్నారు. బోస్, మధుమిత వీడియోలో.. ‘‘కారులో వెళ్తున్న మమ్మల్ని మా వెనకే బైక్‌పై వచ్చిన వ్యక్తులు అడ్డగించారు. మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. మా కారుపై ఉన్న డీఆర్డీఓ స్టిక్కర్‌ను చూశారు. నా భార్యను తిట్టడంతో తట్టుకోలేకపోయాను. దాంతో నేను కారు నుంచి బయటకు రావడంతో.. ఒక వ్యక్తి కీతో నా ముఖంపై కొట్టాడు. దాంతో నా ముఖమంతా రక్తం కారింది. మిమ్మల్ని రక్షించే వ్యక్తులతో మీరు ఇలాగేనా వ్యవహరించేదని’’ నేను గట్టిగా మాట్లాడాను. కానీ ఆశ్చర్యంగా ఇంకా చాలా మంది వ్యక్తులు వచ్చి, మమ్మల్ని దూషించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి రాయి తీసుకొని, కారు అద్దాలను, నా తలను పగలగొట్టాలని ప్రయత్నించాడు. అదీ నా పరిస్థితి. వెంటనే అప్రమత్తమైన నా భార్య నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఫిర్యాదు చేద్దామని వెళ్తే అక్కడ ఎలాంటి స్పందనా రాలేదు. కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు ఆశ్చర్యంగా ఉన్నాయి.’’ అంటూ ఆ భార్యాభర్తలు వీడియోలో వ్యాఖ్యానించారు.#BREAKINGWing commander assault case in #BengaluruCCTV tells a different story.. Wing Commander Shiladitya Bose seen brutally assaulting the biker at Tin Factory JunctionDespite locals stepping in to stop the violence, the officer can be seen continuing the attack...blowing… pic.twitter.com/ovMg9g4xcS— Nabila Jamal (@nabilajamal_) April 21, 2025

టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్ బట్టబయలు చేసిన కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునేందుకు కేశినేని చిన్ని ప్రయత్నం చేశారంటూ ‘ఉర్సా’ వెనుక డీల్‌ను మాజీ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ ఎంపీ కేశినేని బినామీదే "ఉర్సా" అంటూ ట్వీట్ చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌లు భాగస్వాములు. 21 సెంచరీ ఇన్వెస్టమెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూళ్లు చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్, కోట్లు వసూళ్లు చేసి జనాన్ని మోసం చేశారు’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా తలిపారు."ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే కంపెనీకి విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దురుద్దేశం ఉన్నట్టు పేర్కొన్న నాని.. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పడలో 56.36 ఎకరాలు.. మొత్తం 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయని.. ఈ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తమ బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని నాని ఆరోపించారు.‘‘ఉర్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్టర్ అయ్యింది. వీరికి ఎటువంటి అనుభవం లేదు. ప్రాజెక్ట్ చేయగల సామర్థ్యం కూడా లేదు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ చిన్ని ఇంజినీరింగ్ క్లాస్మేట్. అబ్బూరి సతీష్ ఎంపీ చిన్ని బిజినెస్ భాగస్వామి కూడా. ఇద్దరు కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రజల నుండి కోట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన నేపథ్యం ఉంది. ఈ భూమి కేటాయింపు వెనుక చిన్ని తన ఎంపీ పదవి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పరపతిని ఉపయోగించారు’’ అని నాని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊరూపేరు లేని 'ఉర్సా'చిన్ని సాండ్ మైనింగ్, ఫ్లై ఆష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కలిసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయన్న కేశినేని నాని.. ఉర్సా క్లస్టర్స్‌కు ఇచ్చిన భూ కేటాయింపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ యజమానులు, డబ్బు మూలాలు, రాజకీయ కనెక్షన్లపై సంపూర్ణ దర్యాప్తు చేయాలన్నారు. ప్రభుత్వ భూమిని "పెట్టుబడుల" పేరుతో దోచుకునే ఈ ప్రయత్నాన్ని ఆపాలంటూ చంద్రబాబుకు కేశినేని నాని ఫిర్యాదు చేశారు.Respected @ncbn garu,I would like to begin by sincerely appreciating your bold and visionary step in allotting land to Tata Consultancy Services (TCS) in Visakhapatnam. Such initiatives will pave the way for real investments, job creation, and the upliftment of Andhra Pradesh’s… pic.twitter.com/pJMQeSGgNi— Kesineni Nani (@kesineni_nani) April 22, 2025

మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. గతవారంలో రెండు రోజులపాటు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూపులపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థల ప్రాజెక్టులకు మహేష్ ప్రచార కర్తగా వ్యవహరించారు. వీటి ప్రచారానికి గానూ ఆయన భారీగా పారితోషకం అందుకున్నట్లు సమాచారం. ఇక సాయి సూర్య డెవలపర్స్‌కు చేసిన ప్రచారానికిగానూ రూ.5.9 కోట్లు మహేష్ అందుకున్నారు. ఈ ప్రమోషన్ కింద రూ.2.5 కోట్ల నగదు, రూ.3.4 కోట్లు చెక్ రూపంలో ఆయన అందుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. తొలుత 27వ తేదీన ఆయన్ని విచారణకు ఈడీ నోటీసులు పంపింది. అయితే.. ఆరోజు ఆదివారం ఉన్న నేపథ్యంలో ఆ మరుసటిరోజు (28వ తేదీన) ఉదయం 11గం. విచారణకు రావాలని కోరింది. సంబంధిత గ్రూపులతో జరిగిన లావాదేవీలపై ఈడీ ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది.

గూగుల్ ఆధిపత్యానికి చెక్: ఇక అంతా యూజర్ ఇష్టం..
గూగుల్, ఆండ్రాయిడ్ టీవీ కేసు ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. భారతదేశ స్మార్ట్ టీవీ మార్కెట్లో టెక్ దిగ్గజం 'గూగుల్' అనుసరిస్తున్న విధానాలు సరికాదని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (CCI) ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్మార్ట్ టీవీలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను గూగుల్ ప్లే స్టోర్‌లో డిఫాల్ట్‌గా అందించడాన్ని ఇకపై కొనసాగించమని కంపెనీ స్పష్టం చేసింది. సీసి ఆదేశాల మేరకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.ఇండియా స్మార్ట్ టీవీ రంగంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. యాంటీ కాంపిటీటివ్ పద్ధతులు అవలంబిస్తోందని, మార్కెట్లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోందని సీసీఐ ఆరోపించింది. గూగుల్‌కు ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లో ఒకటైన భారతదేశంలో.. స్మార్ట్ టీవీల కోసం గూగుల్ రూపొందించిన 'టెలివిజన్ యాప్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్' కింద, తమ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్ & ఇతర అప్లికేషన్లను ముందస్తుగా ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' దర్యాప్తులో గుర్తించింది.గూగుల్, ఆల్ఫాబెట్‌లపై ఇద్దరు భారతీయ యాంటీట్రస్ట్ న్యాయవాదులు కేసు దాఖలు చేశారు, దీని తర్వాత CCI ఈ విషయంలో దర్యాప్తుకు ఆదేశించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టమ్‌లను లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం సవరించిన వాటిని అభివృద్ధి చేయాలనుకునే చిన్న సంస్థలకు.. గూగుల్ అడ్డంకులను సృష్టించే పద్దతులను అవలంబిస్తున్నట్లు విచారణలో తెలిసింది.సీసీఐ ఆదేశాల మేరకు.. గూగుల్ కంపెనీ ఒక సెటిల్మెంట్ అప్లికేషన్ దాఖలు చేయడానికి అంగీకరించింది. దీని ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం ప్లే స్టోర్, ప్లే సర్వీసులను ఒకే ప్యాకేజీగా కాకుండా.. విడిగా లైసెన్స్ ఇచ్చేందుకు గూగుల్ ప్రతిపాదించింది. కొత్త ఒప్పందం ప్రకారం, ప్రీ-ఇన్స్టాలేషన్ కోసం ఉచితంగా అందించబడుతున్న గూగుల్ ప్లే స్టోర్, ప్లే సర్వీసులకు ఇకపై లైసెన్స్ ఫీజు వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది.భారతదేశంలో ఆండ్రాయిడ్ టీవీలను విక్రయించే అన్ని భాగస్వాములకు ఓ లేఖ పంపించాలని గూగుల్‌ను సీసీఐ ఆదేశించింది. ఇకపై వారు గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను ఖచ్చితంగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాబట్టి తమకు నచ్చిన ఏదైనా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడుకునే స్వేచ్ఛ ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేయాలని సూచించింది.గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్, ప్లే స్టోర్‌ను ఇష్టపడే వినియోగదారులు ఇకపై టీవీ కొనుగోలు చేసే ముందు.. తాము ఎంచుకున్న మోడల్లో ఏవి ఇన్స్టాల్ అయి ఉన్నాయో రిటైలర్లు లేదా బ్రాండ్లను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇకపై ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లు, యాప్ స్టోర్లు కూడా స్మార్ట్ టీవీ తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది.ప్రస్తుతానికి అన్ని అప్లికేషన్ స్టోర్లలో అన్ని యాప్‌లు అందుబాటులో లేవు. గూగుల్ ప్లే స్టోర్, అమెజాన్ యాప్ స్టోర్ వంటివి టీవీ వినియోగదారుల కోసం విస్తృత శ్రేణి యాప్‌లను అందిస్తున్నాయి. అనేక ప్రధాన యాప్ డెవలపర్లు కూడా ప్రధానంగా యాపిల్, గూగుల్, అమెజాన్ స్టోర్లకు సేవలు అందిస్తున్నారు.కొత్త ఒప్పందం ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ టీవీ భాగస్వాములు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఎంచుకోవడమే కాకుండా, తమ టీవీలలో ఏ గూగుల్ యాప్‌లను డిఫాల్ట్‌గా ఉంచాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం స్మార్ట్ టీవీలకే పరిమితమైంది. భవిష్యత్తులో దీనిని ఇతర పరికరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని సీసీఐ తెలిపింది. ఈ కేసు సెటిల్మెంట్ కింద గూగుల్ 2.38 మిలియన్ డాలర్లు లేదా రూ. 20 కోట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
KKR VS GT: చరిత్ర సృష్టించిన గిల్, సాయి సుదర్శన్ జోడీ
విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారు: అంబటి
స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కేసు నమోదు చేయడం లేదు
క్రేజీ.. కరెన్సీ నెంబర్లు : ఫ్యాన్సీ కరెన్సీ నంబర్ల గురించి తెలుసా?
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన చోటు
రేషన్ కార్డులేక.. బియ్యం అందక..
న్యూ ట్రెండ్.. ఆక్వా వర్కౌట్స్ : ప్రయోజనాలెన్నో!
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
ఎంత తవ్వినా ఆ కంపెనీ ఆనవాళ్లు కనపడడం లేద్సార్!!
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్‌పై విమర్శలు
ఈ రాశి వారికి అనుకోని ధనలాభం.. వ్యాపార వృద్ధి
శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
'ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న'
నాకెందుకో బైడెన్ కూడా వలసదారుడేమోనని అనిపిస్తోంది సార్!
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్‌పై పరుచూరి రివ్యూ
బెట్టింగ్ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
ఏపీలో టెన్త్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్
మద్యం మసి పూసి.. సిట్ పోలీసుల ‘కసి’
అమెరికా సంబంధమా.. అసలే వద్దు!
నాకెందుకో... తెలియని ప్రజలకు తెలిసేటట్లు చేస్తున్నామేమోననిపిస్తుంది..!
మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక
PSL 2025: హెయిర్ డ్రైయర్, ట్రిమ్మర్.. షాహీన్ అఫ్రిదికి ఖరీదైన బహుమతి
ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై కూటమి కక్ష సాధింపు
సీఎస్కే స్టార్ ఓపెనర్ ఇంట తీవ్ర విషాదం..
జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్ కళ్లముందే యువతి ప్రాణం తీసింది!
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్’కే ఇది సాధ్యం!
టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్ బట్టబయలు చేసిన కేశినేని నాని
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
చట్టం అంటే లెక్క లేదా?: హైకోర్టు
ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ..
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
IPL 2025: రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్.. ఇక కష్టమే మరి?
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
ట్రంప్ యాక్షన్.. హార్వర్డ్ యూనివర్సిటీ రియాక్షన్
సన్నీ డియోల్ జాట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సెంచరీ!
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
ఇంటి కలహం.. అంతు చూసింది
కూకట్‌పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..
ఆ ఊరి పేరు ఐ.ఐ.టి. విలేజ్
నా పని నన్ను చేసుకోనివ్వండి -ట్రంప్
ఇండియా విధానం సరైనదేనా?
బ్లాక్‌మెయిల్‌కు బలైన ప్రతిభా కుసుమం
జాన్వీ కపూర్‌కు స్టార్ హీరో స్కూటీ పాఠాలు.. బిగ్‌బాస్ దివి స్టన్నింగ్ అవుట్‌ఫిట్!
ఏంటి గిల్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?
‘మీ నాన్నను చంపినట్లే నిన్నూ..’
‘జైల్లో ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఆస్వాదించండి’
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
గూగుల్ ఆధిపత్యానికి చెక్: ఇక అంతా యూజర్ ఇష్టం..
మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత.. లోకేష్‌కు చెప్పినా లాభం లేదని..
IPL 2025: తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్న స్టార్లు వీరే..!
తారాస్థాయికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు
హైకోర్టులో హెచ్‌సీఏకు ఎదురు దెబ్బ..
నేడు పార్టీ పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం
ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్
సప్పగా సాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్.. చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు..!
ఓటీటీకి వచ్చేస్తోన్న మ్యాడ్ స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
IPL 2025: అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతున్న గుజరాత్
'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
ఓటీటీ/ థియేటర్లో 20 సినిమాలు.. వీకెండ్లో వేసవి వినోదం
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
ఛావా మరో క్రేజీ రికార్డ్.. పుష్ప-2 సరసన చేరిన బాలీవుడ్ మూవీ!
చితక్కొట్టిన శుబ్‌మన్.. కేకేఆర్‌పై గుజరాత్ గ్రాండ్ విక్టరీ
GT Vs KKR: గుజరాత్ గర్జన
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
హైదరాబాద్‌లో జపాన్ కంపెనీ తయారీ కేంద్రం
ఒప్పో కొత్త ఫోన్.. గంటలోపే ఫుల్ చార్జింగ్
చంద్రబాబు.. మరీ ఇంతగానా?
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
పోప్ వారసుని ఎన్నిక ఇలా...
సిరి మా 'లక్ష'మి.. పసిడి పరుగే పరుగు..!
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
Telangana: నేడు ఇంటర్ ఫలితాలు
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
రూ.లక్షకు చేరిన బంగారం ధర.. ఆల్ టైం హై
తల్లిదండ్రులయిన నటుడు విష్ణు విశాల్, జ్వాలా గుత్తా
Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఒక్క క్లిక్‌తో..
కళ్లలో కారం చల్లి.. కత్తితో పొడిచి
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
MI VS CSK: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఈసారి ‘మహా’ వంతు!
ఖనిజాలు బంద్
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
మీ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్.. అక్కడే ఎందుకు?.. డైరెక్టర్‌కు ఆసక్తికర ప్రశ్న
హైదరాబాద్‌లో చిన్న ఆయుధాల తయారీ కేంద్రం
వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్
ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
ఇక మైనర్లే బ్యాంక్ ఖాతాలు నిర్వహించుకోవచ్చు: ఆర్బీఐ
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
కాజల్ సీన్లు లేపేశారు.. అందుకే సినిమా డిజాస్టర్!
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
KKR VS GT: చరిత్ర సృష్టించిన గిల్, సాయి సుదర్శన్ జోడీ
విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారు: అంబటి
స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కేసు నమోదు చేయడం లేదు
క్రేజీ.. కరెన్సీ నెంబర్లు : ఫ్యాన్సీ కరెన్సీ నంబర్ల గురించి తెలుసా?
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన చోటు
రేషన్ కార్డులేక.. బియ్యం అందక..
న్యూ ట్రెండ్.. ఆక్వా వర్కౌట్స్ : ప్రయోజనాలెన్నో!
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
ఎంత తవ్వినా ఆ కంపెనీ ఆనవాళ్లు కనపడడం లేద్సార్!!
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్‌పై విమర్శలు
ఈ రాశి వారికి అనుకోని ధనలాభం.. వ్యాపార వృద్ధి
శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
'ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న'
నాకెందుకో బైడెన్ కూడా వలసదారుడేమోనని అనిపిస్తోంది సార్!
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్‌పై పరుచూరి రివ్యూ
బెట్టింగ్ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
ఏపీలో టెన్త్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్
మద్యం మసి పూసి.. సిట్ పోలీసుల ‘కసి’
అమెరికా సంబంధమా.. అసలే వద్దు!
నాకెందుకో... తెలియని ప్రజలకు తెలిసేటట్లు చేస్తున్నామేమోననిపిస్తుంది..!
మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక
PSL 2025: హెయిర్ డ్రైయర్, ట్రిమ్మర్.. షాహీన్ అఫ్రిదికి ఖరీదైన బహుమతి
ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై కూటమి కక్ష సాధింపు
సీఎస్కే స్టార్ ఓపెనర్ ఇంట తీవ్ర విషాదం..
జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్ కళ్లముందే యువతి ప్రాణం తీసింది!
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్’కే ఇది సాధ్యం!
టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్ బట్టబయలు చేసిన కేశినేని నాని
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
చట్టం అంటే లెక్క లేదా?: హైకోర్టు
ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ..
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
IPL 2025: రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్.. ఇక కష్టమే మరి?
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
ట్రంప్ యాక్షన్.. హార్వర్డ్ యూనివర్సిటీ రియాక్షన్
సన్నీ డియోల్ జాట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సెంచరీ!
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
ఇంటి కలహం.. అంతు చూసింది
కూకట్‌పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..
ఆ ఊరి పేరు ఐ.ఐ.టి. విలేజ్
నా పని నన్ను చేసుకోనివ్వండి -ట్రంప్
ఇండియా విధానం సరైనదేనా?
బ్లాక్‌మెయిల్‌కు బలైన ప్రతిభా కుసుమం
జాన్వీ కపూర్‌కు స్టార్ హీరో స్కూటీ పాఠాలు.. బిగ్‌బాస్ దివి స్టన్నింగ్ అవుట్‌ఫిట్!
ఏంటి గిల్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?
‘మీ నాన్నను చంపినట్లే నిన్నూ..’
‘జైల్లో ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఆస్వాదించండి’
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
గూగుల్ ఆధిపత్యానికి చెక్: ఇక అంతా యూజర్ ఇష్టం..
మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత.. లోకేష్‌కు చెప్పినా లాభం లేదని..
IPL 2025: తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్న స్టార్లు వీరే..!
తారాస్థాయికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు
హైకోర్టులో హెచ్‌సీఏకు ఎదురు దెబ్బ..
నేడు పార్టీ పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం
ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్
సప్పగా సాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్.. చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు..!
ఓటీటీకి వచ్చేస్తోన్న మ్యాడ్ స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
IPL 2025: అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతున్న గుజరాత్
'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
ఓటీటీ/ థియేటర్లో 20 సినిమాలు.. వీకెండ్లో వేసవి వినోదం
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
ఛావా మరో క్రేజీ రికార్డ్.. పుష్ప-2 సరసన చేరిన బాలీవుడ్ మూవీ!
చితక్కొట్టిన శుబ్‌మన్.. కేకేఆర్‌పై గుజరాత్ గ్రాండ్ విక్టరీ
GT Vs KKR: గుజరాత్ గర్జన
వివాహేతర సంబంధం.. వాట్సప్ స్టేటస్‌లో ప్రియురాలి ఫొటో..
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
హైదరాబాద్‌లో జపాన్ కంపెనీ తయారీ కేంద్రం
ఒప్పో కొత్త ఫోన్.. గంటలోపే ఫుల్ చార్జింగ్
చంద్రబాబు.. మరీ ఇంతగానా?
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
పోప్ వారసుని ఎన్నిక ఇలా...
సిరి మా 'లక్ష'మి.. పసిడి పరుగే పరుగు..!
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
Telangana: నేడు ఇంటర్ ఫలితాలు
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
రూ.లక్షకు చేరిన బంగారం ధర.. ఆల్ టైం హై
తల్లిదండ్రులయిన నటుడు విష్ణు విశాల్, జ్వాలా గుత్తా
Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఒక్క క్లిక్‌తో..
కళ్లలో కారం చల్లి.. కత్తితో పొడిచి
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
MI VS CSK: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఈసారి ‘మహా’ వంతు!
ఖనిజాలు బంద్
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
మీ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్.. అక్కడే ఎందుకు?.. డైరెక్టర్‌కు ఆసక్తికర ప్రశ్న
హైదరాబాద్‌లో చిన్న ఆయుధాల తయారీ కేంద్రం
వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్
ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
ఇక మైనర్లే బ్యాంక్ ఖాతాలు నిర్వహించుకోవచ్చు: ఆర్బీఐ
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
కాజల్ సీన్లు లేపేశారు.. అందుకే సినిమా డిజాస్టర్!
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
సినిమా

తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
కోలీవుడ్ నటుడు సూరి హీరోగా నటిస్తున్న పలు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం మామన్ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు మండాడి మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎల్రెడ్ కుమార్ తన ఆర్ఎస్.ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. కాగా ఆయన శిష్యుడు, సెల్షి చిత్రం ఫేమ్ మణిమారన్ పుగళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి మహిమా నంబియార్ నాయకిగా నటిస్తుంది. అదేవిధంగా మండాడి చిత్రం ద్వారా తెలుగు నటుడు సుహాస్ ముఖ్య పాత్రతో కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, ఎస్ఆర్.కదీర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు సూరి మాట్లాడుతూ.. తాను హీరోగా నటిస్తున్న మండాడి చిత్రం ప్రారంభ కార్యక్రమాన్నే ఇంత బ్రహ్మండంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు అన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం దర్శకుడు వెట్రిమారన్‌నే అన్నారు. తాను ఏమీ లేకుండా వచ్చాననీ, ఇప్పుడు శక్తికి మించే సంపాదించినట్లు చెప్పారు. అందువల్ల ఇకపై నచ్చిన చిత్రాలు చేస్తే చాలన్నారు. సర్వైవల్ అవ్వడానికి భగవంతుడి భాగ్యంతో కళామతల్లి చూసుకుంటుందన్నారు. ఇప్పటి వరకు సంపాదించింది చాలు.. ఇకనుంచి తన విజయానికి కారణమైన అభిమానులకు తనవంతుగా సాయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానని ఆయన అన్నారు.

ముంబైలో రావణుడు
ముంబైలో ల్యాండ్ అయ్యారు హీరో యశ్. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలోని రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్మణుడిగా రవి దుబే, హనుమంతుడు పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లారు యశ్. ఈ షెడ్యూల్లో యశ్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే జరుగుతుందని, రణ్‌బీర్ కపూర్ పాల్గొనరని సమాచారం. ఇక ‘రామాయణ’ తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సారంగపాణి జాతకంతో ఆ లోటు తీరింది: శివలెంక కృష్ణప్రసాద్
‘‘సారంగపాణి జాతకం’ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, లవ్... ఇలా అన్ని రకాల అంశాలుంటాయి. ఇంద్రగంటికథ చెప్పినప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను. థియేటర్లో అందరూ హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. జంధ్యాలగారితో పూర్తి స్థాయిలో ఓ వినోదాత్మక చిత్రం నిర్మించాలనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు ఇంద్రగంటిగారితో చేసిన ఈ వినోదాత్మక చిత్రంతో ఆ లోటు తీరిపోయింది. కొన్ని చిత్రాలు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి.అలా ఈ సినిమా కూడా చాలా కాలం పాటు గుర్తుంటుంది’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా శివ లెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ–‘‘జెంటిల్‌మ్యాన్, సమ్మోహనం’ వంటి చిత్రాల తర్వాత ఇంద్రగంటిగారు,నా కాంబోలో ‘సారంగపాణి జాతకం’తో హ్యాట్రిక్ హిట్ సాధించనున్నాం. ఫ్యామిలీతో పాటుగా యూత్ ని కూడా మా చిత్రం మెప్పిస్తుంది.‘కోర్ట్’ మూవీలో సీరియస్‌గా కనిపించిన ప్రియదర్శి మా సినిమాలో నవ్విస్తారు. ‘వెన్నెల’ కిశోర్, వైవా హర్ష, వీకే నరేశ్, అవసరాల శ్రీనివాస్ పాత్రలు నవ్విస్తాయి. జంధ్యాలగారి కామెడీ, ఈవీవీ సత్యనారాయణగారి స్టైల్, ఇంద్రగంటి మార్క్‌తో ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తీశాం. అప్పట్లో మేం ఒక హీరోతో చేసిన తర్వాత ఇంకో హీరోతో సినిమాను ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగైదు ప్రాజెక్టులని లైన్ లో పెడుతున్నారు.కాంబినేషన్స్ చుట్టూ తిరుగుతూ కథల గురించి పట్టించుకోవడం లేదు. నాకు సినిమాల పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంటుంది. అందుకే నా మార్క్ కనిపించాలని కోరుకుంటున్నాను. నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను. ‘యశోద’ చిత్ర దర్శకులు హరి–హరీష్ చెప్పిన రెండు కథలు, అలాగే పవన్ సాధినేని చెప్పిన కథ నాకు నచ్చాయి. మోహనకృష్ణ ఇంద్రగంటిగారితో ఇంకో సినిమా కూడా చేయబోతున్నాను’’ అన్నారు.

జాన్వీ కపూర్‌కు స్టార్ హీరో స్కూటీ పాఠాలు.. బిగ్‌బాస్ దివి స్టన్నింగ్ అవుట్‌ఫిట్!
జాన్వీ కపూర్‌కు స్కూటీ నేర్పిస్తోన్న స్టార్ హీరో..అమ్మకు బర్త్ డే విషెస్ చెప్పిన మీనాక్షి చౌదరి..స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో బిగ్‌బాస్ దివి పోజులు..డీసెంట్ లుక్‌లో నాసామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్...బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)
న్యూస్ పాడ్‌కాస్ట్

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం
క్రీడలు

GT Vs KKR: గుజరాత్ గర్జన
కోల్‌కతా: గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతులెత్తేసింది. దీంతో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో టైటాన్స్ 39 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (55 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. బట్లర్ (23 బంతుల్లో 41 నాటౌట్; 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో రసెల్, వైభవ్, హర్షిత్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ అజింక్య రహానే (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. ఆ ఇద్దరు బాదేశారిలా... గుజరాత్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ముందుగా సాయి సుదర్శన్ బౌండరీతో బాదుడు మొదలు పెట్టాడు. మూడో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. కాస్త ఆలస్యమైనా... గిల్ ఐదో ఓవర్లో రెండు వరుస బౌండరీలతో దూకుడు షురూ చేశాడు. టైటాన్స్ పవర్‌ప్లే స్కోరు 45/0. అలీ వేసిన ఏడో ఓవర్లో గిల్ 6, 4, 4లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. క్రమం తప్పకుండా ఫోర్లు బాదేయడంతో సగం ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 89/0 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్లోనే గిల్ 34 బంతుల్లో, సుదర్శన్ 33 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 100 దాటింది. ఎట్టకేలకు సుదర్శన్‌ను అవుట్ చేసిన రసెల్ కోల్‌కతాకు ఊరటనిచ్చాడు. అయితే బట్లర్ రాకతో దంచుడులో ఏ మార్పులేకపోయింది. ఆఖర్లో గిల్, రాహుల్ తెవాటియా (0) వికెట్లు పడినా కూడా భారీస్కోరు సాధ్యమైంది. కెప్టెన్ ఒంటరి పోరాటం పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నైట్‌రైడర్స్ పవర్‌ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. సిరాజ్ తొలి ఓవర్లోనే రహా్మనుల్లా గుర్బాజ్ (1) పెవిలియన్ చేరగా, కెప్టెన్ రహానేతో అడపాదడపా షాట్లతో స్కోరును నడిపిస్తున్న సునీల్ నరైన్ (17)ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. వెంకటేశ్ అయ్యర్ (14) మెప్పించలేకపోయాడు. బాధ్యతగా ఆడిన రహానే 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, అదేస్కోరు వద్ద వాషింగ్టన్ సుందర్ అతన్ని అవుట్ చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రసెల్ (15 బంతుత్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) స్టంపౌట్ కావడంతో కోల్‌కతా లక్ష్యానికి దూరమైంది. రఘువంశీ (13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు అలరించాడు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 52; శుబ్‌మన్ గిల్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ 90; బట్లర్ (నాటౌట్) 41; తెవాటియా (సి) రమణ్‌దీప్ (బి) హర్షిత్ రాణా 0; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–114, 2–172, 3–177. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–44–1, మొయిన్ అలీ 3–0–27–0, హర్షిత్ రాణా 4–0–45–1, వరుణ్ చక్రవర్తి 4–0–33–0, నరైన్ 4–0–36–0, రసెల్ 1–0–13–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 1; నరైన్ (సి) తెవాటియా (బి) రషీద్ 17; రహానే (స్టంప్డ్) బట్లర్ (బి) సుందర్ 50; వెంకటేశ్ (సి) సుందర్ (బి) సాయి కిషోర్ 14; రింకూ సింగ్ (సి) గిల్ (బి) ఇషాంత్ 17; రసెల్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 21; రమణ్‌దీప్ (సి అండ్ బి) ప్రసిధ్ కృష్ణ 1; మొయిన్ అలీ (సి) షారుఖ్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; రఘువంశీ (నాటౌట్) 27; హర్షిత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–2, 2–43, 3–84, 4–91, 5–118, 6–119, 7–119, 8–151. బౌలింగ్: సిరాజ్ 4–0–32–1, ఇషాంత్ 2–0–18–1, ప్రసిధ్ కృష్ణ 4–0–25–2, రషీద్ ఖాన్ 4–0–25–2, సుందర్ 3–0–36–1, సాయి కిషోర్ 3–0–19–1.

చితక్కొట్టిన శుబ్‌మన్.. కేకేఆర్‌పై గుజరాత్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని గుజరాత్ అందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగల్గింది.కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే(50)టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో రఘువన్షి(27) పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ట తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, సుందర్, ఇషాంత్ శర్మ సాయికిషోర్ చెరో వికెట్ పడగొట్టారు.చితక్కొట్టిన శుబ్‌మన్..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ బ్యాటింగ్‌తో ఈడెన్‌లో బౌండరీలు వర్షం కురిపించాడు. 55 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. గిల్‌తో పాటు సాయిసుదర్శన్(52), బట్లర్(41) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలా వికెట్ సాధించారు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.

హైకోర్టులో హెచ్‌సీఏకు ఎదురు దెబ్బ..
తెలంగాణ హైకోర్టులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. హెచ్‌సీఏలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హైకోర్టులో ఇటీవలే పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవద్దని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌కు ఆర్డర్స్ జారీ చేసింది. స్టాఫ్ జీతాలు మినహా ఎలాంటి ఆర్థికపరమైన చర్యలు తీసుకోరాదంటూ హెచ్‌సీఎకు హైకోర్టు సూచించింది.

సీఎస్కే స్టార్ ఓపెనర్ ఇంట తీవ్ర విషాదం..
న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి డెంటాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సీఎస్కే అధికారికంగా ధ్రువీకరించింది. "ఈ క్లిష్ట సమయంలో కాన్వే కుటుంబానికి మద్దతుగా ఉంటాము. డెంటాన్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని సీఎస్కే యాజమాన్యం ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా కాన్వే తండ్రి మృతికి సంతాపంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లు ధరించి మైదానంలో దిగారు. కాగా కాన్వే ఇప్పటికే న్యూజిలాండ్‌కు చేరుకున్నాడు. అతడు ఈ ఏడాది ఐపీఎల్లో చివరగా ఏప్రిల్ 11న సీఎస్కే తరపున ఆడాడు.దక్షిణాఫ్రికాకు చెందిన డెంటాన్ కాన్వే కుటంబం.. డెవాన్ కాన్వే చిన్నతనంలో న్యూజిలాండ్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలోనే కాన్వే దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా ప్రదర్శన చేసి కివీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతి తక్కువ కాలంలోనే బ్లాక్‌క్యాప్స్ జట్టులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్-2025లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన డెవాన్.. 27.03 స్ట్రైక్ రేట్‌తో 94 పరుగులు చేశాడు. కాన్వే తిరిగి రావడంపై మాత్రం సీఎస్కే ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ ఏడాది సీజన్లో సీఎస్కే దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. చెన్నై జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.
బిజినెస్

సిరి మా 'లక్ష'మి.. పసిడి పరుగే పరుగు..!
న్యూఢిల్లీ: అందరికీ ప్రియమైన బంగారం దేశంలోని సామాన్యులను మాత్రం బెంబేలెత్తించేలా పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78 వేలు పలికిన 10 గ్రాముల 24 క్యారట్ల ధర తాజాగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ మొదలవుతున్న వేళ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కలుపుకుని ఏకంగా రూ.లక్ష మార్కును దాటేసింది. సోమవారం బెంగళూరు బులియన్ మార్కెట్లో రూ. 1,02,000గా పసిడి ధర నమోదైంది. ఇక ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1,650 పెరిగి రూ. 99,800 మార్క్‌ను తాకగా హైదరాబాద్‌లో అటు ఇటుగా రూ. 1,00,100కు చేరుకుంది. మరోవైపు 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ఢిల్లీలో రూ. 1,600 పెరిగి రూ. 99,300 వద్ద నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ బలహీనపడటం, చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం బంగారం కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 26 శాతం ర్యాలీ చేసింది. 10 గ్రాములకు రూ. 20,850 పెరిగింది. మరోవైపు వెండి కిలో రూ. 500 పెరిగి రూ. 98,500 మార్క్‌ను చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ (31.1 గ్రాములు)కు 101 డాలర్ల వరకు ఎగసి 3,430 డాలర్లకు చేరుకుంది. 2006 వరకు నాలుగు అంకెల స్థాయికే పరిమితమైన బంగారం ధర.. 2007 నుంచి అయిదు అంకెల స్థాయిలోకి అడుగుపెట్టింది. ఏటా ధర వృద్ధి చెందుతూ 2012లో రూ.31 వేలకు చేరినప్పటికీ.. ఆ తరువాత పసిడి ధర ఒడిదుడుకులకు లోనై తిరోగమనం చెందింది. ఇక 2016 నుంచి ఏటా దూకుడు కొనసాగించింది.ఎంసీఎక్స్‌లోనూ రికార్డులు..మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్) లోనూ బంగారం రూ. 98 వేల రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల జూన్ నెల కాంట్రాక్టు ధర రూ. 2,111 పెరగడంతో (2.22%).. ఆల్‌టైమ్ గరిష్టం రూ. 97,365 నమోదైంది. ఆగస్ట్ నెల కాంట్రాక్టు సైతం రూ. 2,104 పెరిగి రూ. 98,000కు, అక్టోబర్ కాంట్రాక్టు రూ. 2,617 పెరిగి రూ. 98,000కు చేరడం గమనార్హం.బంగారం అంటే సంపద. కుటుంబానికి ఆర్థిక భరోసా. అభివృద్ధికి సూచిక.కష్టకాలంలో తోడుంటుందన్న ఓ నమ్మకం. సామాన్యుడైనా, సంపన్నుడైనా తన కష్టార్జితంలో ఎంతో కొంత బంగారం రూపంలో పొదుపు చేసుకోవడం, పెట్టుబడిగా దాచుకోవడం అనాదిగా వస్తోంది. ఆడపిల్ల ఇంట్లో ఉందంటే బిడ్డ భవిష్యత్, పెళ్లి కోసం బంగారం కూడబెట్టడం భారతీయ కుటుంబాల్లో తొలి ప్రాధాన్యత. అంతేనా.. పండగైనా, వేడుకైనా నలుగురిలో ఆభరణాలు జిగేల్‌మనాల్సిందే. స్థాయిని చూపించుకోవడానికీ ఒక సాధనమైంది. తరతరాలుగా కుటుంబంలో భాగమైన ఈ పుత్తడి ఇప్పుడు అందనంత దూరం పరుగెడుతోంది. బంగారం ఇప్పుడు ప్రియమైంది. అందరూ ఊహించినట్టుగానే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర పన్నులు కలుపుకొని రూ.లక్ష దాటింది.ఈ పరుగు ఇప్పట్లో ఆగదంటోంది బులియన్ మార్కెట్. పరిస్థితులూ ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు ధరలు అమాంతం పెరగడంతో భారతీయ వినియోగ దారులు వివాహాలు, ఇతర శుభకార్యాలకు గతంతో పోలిస్తే ఆచితూచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు బంగారు వర్తకులు చెబుతున్నారు. అయితే ఆభరణాలతో పోలిస్తే బంగారు కడ్డీలు, నాణేల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. - నూగూరి మహేందర్ ఎందుకీ పరిస్థితి?ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అంతర్జాతీయ పరిణామాలు బంగారానికి చుట్టుకున్నాయి. డాలర్ విలువ పడిపోవడం, అమెరికా–చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరి ఆర్థిక మాంద్యం భయాలు రేకెత్తించడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అమెరికా డాలర్ విలువ తగ్గింది. అమెరికా ట్రెజరీలు భారీగా అమ్ముడుపోతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, బంగారం ఆధారిత ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుదల కూడా 2025లో పుత్తడి ర్యాలీకి మద్దతిచ్చాయి.గరిష్టాలూ గరిష్టమే..పసిడి 2024లో 40కిపైగా సందర్భాల్లో ఆల్‌టైమ్ హై ధర నమోదు చేసింది. 2025లో 23 సార్లు గరిష్టాలను తాకింది. దీంతో గరిష్టాలు గరిష్ట స్థాయిలో నమోదు కావడం విశేషం. ఔన్స్ ధర 2,650 డాలర్లతో 2025 సంవత్సరం ప్రారంభమైంది. సంప్రదాయ పరిణామాలకు విరుద్ధంగా 2024లో డాలర్ ఇండెక్స్ పెరిగి ఈక్విటీ మార్కెట్లు బాగా పనిచేసినప్పటికీ బంగారం ధర దాదాపు 28% అధికం కావడం గమనార్హం. అమెరికా డాలర్, భారత రూపాయి, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, యూరో, బ్రిటిష్ పౌండ్, కెనడియన్ డాలర్, ఆ్రస్టేలియన్ డాలర్ సహా అన్ని ప్రధాన కరెన్సీలలో బంగారం ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. అంతర్జాతీయంగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం ధర 2025 మార్చి 14న 3,000 డాలర్లు తాకి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఔన్స్ పసిడి రేటు 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు పట్టింది. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది. వినియోగంలో మనం ఎక్కడంటే..⇒ 2024 నాటికి భారతీయుల వద్ద పుత్తడి నిల్వలు – 25,000 టన్నులు ⇒ ప్రపంచ మొత్తం పరిమాణంలో భారతీయుల వద్ద ఉన్న పసిడి – 11.56 శాతం ⇒ యూఎస్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉంది. రూపాయి బలపడటంతో ఉపశమనమే..డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఫిబ్రవరి 10న రూ.87.95 తాకి ఆల్ టైమ్ గరిష్టం నమోదు చేసింది. రూపాయి అదే స్థాయిలో ఉన్నా, మరింత బలహీనపడ్డా భారత్‌లో ఈపాటికే గోల్డ్ రేట్ రూ.లక్ష దాటేది. కొద్ది రోజులుగా డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి బలపడుతుండటం కాస్త ఉపశమనం కలిగించే అంశం. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.85.38గా నమోదైంది. ఇక 2025 జనవరి 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78 వేలకు అటుఇటుగా పలికింది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ధర రూ.18.75 మాత్రమే.ప్రత్యామ్నాయం వైపు కొనుగోలుదారుల చూపు..సంప్రదాయంగా భారతీయ కొనుగోలుదారులు పెట్టుబడికి విలువ, ఆకట్టుకునేలా ఉండేలా 22 క్యారెట్లతో తయారైన బంగారు ఆభరణాలను ఇష్టపడతారు. అయితే పెరుగుతున్న ధరలు వారిని ప్రత్యామ్నాయాలను అన్వేషించేలా చేశాయి. ఆకర్షించే రూపు, సరసమైన ధర రెండింటినీ అందించే క్లిష్ట, తేలికైన డిజైన్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో 18, 14 క్యారట్ల ఆభరణాలు ఇప్పుడు ప్రజాదరణ పొందుతున్నాయి. తక్కువ బరువుతో సంప్రదాయ డిజైన్లను ఆభరణాల తయారీదారులు రూపొందించడానికి తయారీ సాంకేతికతలో వచి్చన పురోగతి వీలు కల్పించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. 22 క్యారెట్లతో తయారు చేసిన ఆభరణాల్లో 91.67% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 18 క్యారెట్లు అయితే 75% స్వచ్ఛమైన బంగారం, 25% ఇతర లోహాలు ఉంటాయి. 22 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 18 క్యారెట్లతో తయారైన ఆభరణం ధర దాదాపు ఐదో వంతు తక్కువగా ఉంటుంది. తక్కువ ధర, ఎక్కువ మన్నిక కారణంగా 18 క్యారెట్ల ఆభరణాలకు డిమాండ్ క్రమంగా ఊపందుకుంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా రెండేళ్ల క్రితం కేవలం 5–7% ఉండగా ఇప్పుడు 15% కంటే ఎక్కువగా పెరిగిందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెల్లడించింది.ఆభరణాల్లో మనమే ఫస్ట్..భారత్‌లో ఏటా 10 లక్షలకుగా వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లకే ఏటా 300–400 టన్నుల పసిడి అమ్ముడవుతుందని కళ్యాణ్ జువెల్లర్స్ అంటోంది. దీపావళి, అక్షయ తృతీయ వంటి శుభదినాల్లో హిందువులు పసిడిని కొనుక్కుంటున్నారు. చైనాలోనూ అంతే. పెళ్లిళ్లు, బిడ్డ పుట్టిన నెలరోజులకు జరిపే వేడుక, ఇతర ముఖ్య సందర్భాల్లో ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. చైనాలో అత్యధికులు టియోచు సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం వరుడి కుటుంబం వధువు కోసం నెక్లెస్, గాజులు, చెవి కమ్మలు, ఉంగరాన్ని కొనుగోలు చేస్తారు. చైనాను మించి ప్రపంచంలో అత్యధికంగా 2024లో భారతీయ వినియోగదార్లు 560 టన్నుల ఆభరణాలను అందుకున్నారు. 510 టన్నులతో చైనా రెండవ స్థానంలో ఉంది. గత ఏడాది భారతీయులు 240 టన్నుల గోల్డ్ బార్స్, కాయిన్స్‌ను కొనుగోలు చేస్తే చైనా వాసుల విషయంలో ఇది 345 టన్నులు ఉంది.పెట్టుబడిగా బంగారం..సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లను మినహాయిస్తే ప్రపంచ పసిడి డిమాండ్‌లో ఇండోనేసియా, వియత్నాం సహా ఆసియా వాటా ఏకంగా 64.5 శాతానికి చేరుకుంది. అయితే పెట్టుబడి స్వేచ్ఛ సూచికలో ఆసియా దేశాలు ప్రధానంగా భారత్, చైనా పేలవంగా ఉన్నాయి. భారతీయ కుటుంబాల్లో 6 శాతం కంటే తక్కువ సంపద ఈక్విటీల్లో, 15 శాతం బంగారంలో పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో చైనీయులు బంగారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఏటా 1–2 శాతం వడ్డీ ఇచ్చే డిపాజిట్లకు బదులు చైనీయులు చిన్నమొత్తంలో పసిడిని దక్కించుకుంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ బాటలో పెట్టుబడిగా ముడి బంగారాన్ని కొంటున్నారు. ఎగుమతులు డీలా..భారత్ నుంచి 2024–25లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 11.72 శాతం క్షీణించి రూ. 2,43,390 కోట్లకు చేరాయి. అలాగే దిగుమతులు 11.96 శాతం తగ్గి రూ.1,67,384 కోట్లుగా ఉన్నాయి. యూఎస్, చైనా మార్కెట్లు నిదానించడం, ప్రపంచంలో పలు ప్రాంతాల్లో యుద్ధాలు, రష్యా తవ్విన వజ్రాలపై ఆంక్షలు, చవకగా లభించే ల్యాబ్ తయారీ వజ్రాలు వెరసి రెండేళ్లుగా దేశం నుంచి ఎగుమతులు తగ్గడానికి కారణం అయ్యాయి. విదేశాలకు సరఫరా అయిన రత్నాలు, ఆభరణాల్లో యూఎస్ వాటా ఏకంగా 30.4 శాతం ఉంది. అయితే అమెరికా భారీ సుంకాలను ప్రకటించిన తర్వాత ఎగుమతుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో అతిపెద్ద మార్కెట్‌ను ప్రభావితం చేసే కొత్త సుంకాలు.. డైమండ్ కటింగ్, ఆభరణాల తయారీలో ప్రపంచంలో ముందంజలో ఉన్న భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని అడ్డుకుంటాయని భావిస్తున్నారు.ఎస్‌జీబీల మాటేమిటి?భారత్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకం (ఎస్జీబీ) 2015 నవంబర్‌లో ప్రారంభం అయింది. పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్ బాండ్స్ జారీ అయ్యాయి. ప్రస్తుత ధరల వద్ద బకాయి ఉన్న సావరిన్ గోల్డ్ బాండ్లను రిడీమ్ చేయాలంటే ప్రభుత్వం సుమారు రూ. 1.3 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 7 విడతల బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించింది. 8వ విడతకు ముందస్తు రిడెమ్షన్ కూడా ఆఫర్ చేసింది. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది. పెరుగుతున్న బాధ్యతను సమతౌల్యం చేయడానికి ప్రభుత్వం గోల్డ్ రిజర్వ్ ఫండ్ (జీఆర్ఎఫ్)ను సృష్టించింది. 2023–24లో ఈ నిధిలో రూ. 3,552 కోట్లు జమ చేసింది. దీన్ని 2024–25 సవరించిన బడ్జెట్లో రూ. 28,605 కోట్లకు పెంచింది. గోల్డ్ బాండ్స్ కింద ఇన్వెస్టర్లకు 2024–25 చివరి నాటికి చెల్లించాల్సిన మొత్తం రూ. 85,000 కోట్లకు చేరుకుంటుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. పసిడి దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం లేకపోగా దూసుకుపోతున్న పుత్తడి ధరలతో ఖజానాపై ఆర్థిక భారం పడింది. దీంతో పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అందం, గుర్తింపు వ్యక్తీకరణ..రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత జీడీపీకి 7% సమకూరుస్తోంది. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ మార్కెట్ విలువ దేశంలో సుమారు రూ.6,82,960–7,25,645 కోట్లు ఉంది. 2035 నాటికి ఇది రూ.19,20,825 కోట్లకు చేరుకుంటుందని అంచనా. సంప్రదాయికంగా ఆభరణాలు ఒక పెట్టుబడి. ఇప్పుడు ఇది అందం, గుర్తింపు వ్యక్తీకరణ. ఈ మార్పు అన్ని వయసుల వారికీ వర్తిస్తుంది. భిన్న డిజైన్లు కోరుకుంటున్నప్పటికీ యువ వినియోగదారులు ఆభరణాలపట్ల మొగ్గు చూపుతున్నారు. - సందీప్ కోహ్లీ సీఈవో, ఇంద్రియ, ఆదిత్య బిర్లా జువెలరీ బంగారం ధర పెరుగుదలకు నిపుణులు చెబుతున్న కారణాలు....: వాణిజ్య సుంకాలు :..సుంకాల కారణంగా ప్రపంచమార్కెట్లు తీవ్ర అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ ప్రకటించిన 90 రోజుల విరామం, ఆ తర్వాత ఏవైనా పరిణామాలు బంగారాన్ని సురక్షిత స్వర్గధామంగా ఆకర్షణీయంగా ఉంచుతాయి. అమెరికా–చైనాప్రతీకార చర్యలు ఇప్పటికే స్వల్పకాలంలో డిమాండ్‌ను పెంచుతున్నాయి...: సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోళ్లు :..కేంద్ర బ్యాంకులు దశాబ్దాలుగా స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మూడేళ్లలో ఇవి ఏటా 1,000 టన్నులకుపైగా సమకూర్చుకున్నాయి. మార్చి 2025లో వరుసగా 5వ నెలలోనూ చైనా బలమైన బంగారం కొనుగోళ్లను నివేదించింది...: స్టాగ్ఫ్లేషన్ ఆందోళనలు :..తాజా యూఎస్ ఫెడ్ పాలసీ మినిట్స్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్టాగ్ఫ్లేషన్ వైపు మళ్లవచ్చనే ఆందోళనలను సూచిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధి, అధిక నిరుద్యోగితను స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం మెరుగైన పనితీరు కనబరుస్తుంది...: చైనా ఈటీఎఫ్ పెట్టుబడులు :..చైనా గోల్డ్ ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయిలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025లోనూ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 2024 నుంచి అంతర్జాతీయంగా ఈటీఎఫ్ పెట్టుబడులు పెరుగుతున్నాయి...: ఫెడ్ రేటు కోతలు :..యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 2025లో మరో రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది బంగారం ధరల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది. ..: స్థిరమైన పనితీరు :..2000 నుంచి 2025 వరకు బంగారం రెండుసార్లు మినహా అన్ని సందర్భాల్లోనూ అనుకూల రాబడిని అందించింది...: భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు :..రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ పతనం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ అశాంతి వరకు భౌగోళిక రాజకీయ అనిశ్చితి బంగారం డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి...: కరెన్సీ హెచ్చుతగ్గులు :..డాలర్ సూచిక మూడేళ్ల కనిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. స్విస్ ఫ్రాంక్, జపనీస్ యెన్, యూరోలతో పోలిస్తే తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ కరెన్సీలలో బంగారం చౌకగా మారింది...: పెరుగుతున్న రుణ స్థాయిలు :..2024 నవంబర్‌లో యూఎస్ జాతీయ రుణం రికార్డు స్థాయిలో 36 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఈ రుణాన్ని ఎలా నిర్వహిస్తారనే దానిపై పెరుగుతున్న ఆందోళనలతో బంగారం సహజ హెడ్జ్‌గా మారింది. ప్రపంచ రుణం కూడా పెరిగింది. ..: మార్కెట్ అస్థిరత :..2025లో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అస్థిరత పెరిగింది. పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలు దెబ్బతిన్నాయి.వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక అనిశి్చతులు, డాలర్ బలహీనపడడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు మద్దతునిచ్చాయి. ఈ ఏడాది బంగారం ఇప్పటికే 25 శాతానికి పైగా పెరిగింది. ఏప్రిల్ 2 సుంకాలపై ప్రకటన తర్వాత నుంచి చూసినా 6 శాతం పెరిగింది.- సతీష్ కోటక్ మహీంద్రా ఏఎంసీ ఫండ్ మేనేజర్ ఈటీఎఫ్ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల డిమాండ్ పెరిగింది.భారత్‌లో రానున్న పండుగల సీజన్‌నుదృష్టిలో పెట్టుకుని చూస్తే బంగారానికి అదనపు మద్దతు లభించనుంది. సుంకాలకు సంబంధించి అనిశ్చితి, యూఎస్ డాలర్ బలహీనత, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతుండడం బంగారం ధరల ర్యాలీకి తోడ్పడుతోంది. – జేఎం ఫైనాన్షియల్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్

హైదరాబాద్‌లో చిన్న ఆయుధాల తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్ టెలీ తాజాగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం యూఏఈకి చెందిన చిన్న ఆయుధాల తయారీ సంస్థ, ఎడ్జ్ గ్రూప్‌లో భాగమైన క్యారకల్‌తో జట్టు కట్టింది. రెండు సంస్థల మధ్య కుదిరిన లైసెన్సింగ్ ఒప్పందం కింద క్యారకల్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నినాదం కింద ఈ ప్లాంటులో సీఏఆర్ 816 క్లోజ్–క్వార్టర్స్ అసాల్ట్ బ్యాటిల్ రైఫిల్, సీఏఆర్ 817 అసాల్ట్ రైఫిల్ మొదలైనవి ఉత్పత్తి చేస్తారు. వీటిని భారత సాయుధ బలగాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌లు, రాష్ట్రాల పోలీస్ ఫోర్స్‌లు, ఎస్పీజీ మొదలైన రక్షణ రంగ విభాగాలకు సరఫరా చేయడంతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి కూడా చేస్తారు. రక్షణ బలగాల పట్ల తమ నిబద్ధతకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్‌పై నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని ఐకామ్ ఎండీ సుమంత్ పాతూరు తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగ సహకారానికి సంబంధించి సాంకేతిక బదిలీ ఒప్పందం కీలక మైలురాయిలాంటిదని క్యారకల్ సీఈవో హమద్ అల్అమెరి పేర్కొన్నారు.

స్మార్ట్ఫోన్లు, పీసీల తయారీ కేంద్రంగా భారత్
ముంబై: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం భారత్‌కు అనూకూలంగా మారుతోంది. అంతర్జాతీయ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌ట్యాబ్‌లు/వ్యక్తిగత కంప్యూటర్ (పీసీలు) సంస్థలు తమ ఉత్పత్తి కర్మాగారాలను చైనా నుంచి భారత్‌కు తరలించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం అగ్రరాజ్యల మధ్య సుంకాల విధింపులు, ప్రతీకార టారిఫ్‌ల ఉద్రికత్తలు కొనసాగితే.., అంతర్జాతీయ స్మార్ట్ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో డ్రాగన్ దేశపు వాటా 2026 నాటికి 55 శాతానికి పడిపోయే వీలుంది. గత సంవత్సరం(2024) ఈ వాటా 64 శాతంగా ఉంది. ఇదే సమయంలో భారత్ నుంచి ముఖ్యంగా అమెరికాకు యాపిల్, శాంసంగ్ ఎగుమతులు జోరందుకోనున్నాయి. అంతర్జాతీయ స్మార్ట్ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో భారత్ వాటా 2026 నాటికి 25–28 శాతానికి చేరొవచ్చు. కాగా గత సంవత్సరంలో ఈ వాటా 18 శాతంగా ఉంది. → అంతర్జాతీయంగా ఐఫోన్ల ఉత్పత్తి విలువలో భారత్ ఎగుమతుల వాటా ప్రస్తుతం 20 శాతంగా ఉంది. ఇది 2025–26 కల్లా 25 శాతానికి, 2026–27 నాటికి 35 శాతానికి చేరుతుందని కౌంటర్‌పాయింట్ అంచనా వేస్తోంది. → ల్యాప్‌ట్యాబ్‌లు/ పీసీల మొత్తం తయారీలో చైనా వాటా 2026 నాటికి 68–70 శాతానికి దిగివచ్చే అవకాశం ఉంది. 2024లో ఈ వాటా 75 శాతంగా ఉంది. అంతర్జాతీయ ల్యాప్‌ట్యాబ్‌ల ఉత్పత్తిలో భారత్ వాటా 2026 నాటికి ఏడు శాతానికి చేరుకోవచ్చు. 2024లో భారత్ వాటా కేవలం నాలుగు శాతంగా ఉంది. ‘‘ల్యాప్‌ట్యాబ్‌లు, పీపీలు చైనా నుంచే అధికంగా దిగుమతి అవుతున్నాయి. వాణిజ్య వార్ నేపథ్యంలో హెచ్‌పీ, డెల్ ఇతర సంస్థలు తమ ఉత్పత్తి స్థావరాలు చైనా నుంచి భారత్‌కు మారిస్తే అంతర్జాతీయంగా దేశీయ మార్కెట్ వాటా పెరగడమే కాకుండా ఎగుమతులు సైతం గణనీయంగా పెరుగుతాయి. భారత్ సైతం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఐటీ హార్డ్‌వేర్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం ‘మేక్ ఇన్ ఇండియా’ ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం’ వంటి పథకాలు ప్రవేశపెట్టింది’’ అని ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) సభ్యుడొకరు తెలిపారు. అంత సులువేం కాదు: చైనా నుంచి తయారీ కర్మాగారాలను భారత్‌కు తరలించడం అంత సులువు కాదని కాన్లేస్ నివేదిక చెబుతోంది. డెల్ సంస్థ ల్యాప్‌ట్యాబ్‌ల ఉత్పత్తి 79% చైనాలో ఉండగా, మిగిలినదంతా వియత్నాంలో ఉంది. కాన్లేస్ రిపోర్ట్ ప్రకారం 2026 నాటికి డెల్ తన తయారీ సామర్థ్యాన్ని సగానికిపైగా వియత్నాంకు తరలించనుంది. లెనివో సైతం వియత్నాంను ప్రత్యమ్నాయ దేశంగా చూస్తోంది. చైనాలో 85% తయారీ సామర్థ్యం ఉన్న హెచ్‌పీ.. 2026 కల్లా మెక్సికో, తైవాన్ దేశాలకు 45% మార్చనుంది.

అమెరికాతో ఒప్పందంపై చురుగ్గా చర్చలు
శాన్ఫ్రాన్సిస్కో: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికాతో చర్చలు చురుగ్గా సాగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సెప్టెంబర్–అక్టోబర్ నాటికి తొలి దశకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. భారత్ సహా పలు దేశాలపై అమెరికా భారీగా ప్రతీకార టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాలు బీటీఏపై కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చర్చలను రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు, సెమీకండక్టర్లు, రెన్యువబుల్ ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేథ మొదలైన వాటిల్లో పురోగమిస్తున్న భారత్.. భవిష్యత్తులో ఆయా రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆమె చెప్పారు.
ఫ్యామిలీ

Pet lovers ఆహారం పెట్టేముందు ఆలోచించండి?! ఈ చట్టం తెలుసా?
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఆవులు, కుక్కలు, పిల్లులతో పాటు విభిన్న రకాల పక్షులు వంటి మూగ జీవాలకు కొదవలేదు. అయితే వాటి సహజ జీవనాన్ని కొనసాగించడానికి అనువైన, అవసరమైన పర్యావరణ వ్యవస్థ లేదనేది వాస్తవ సత్యం. ఈ నేపథ్యంలో ఇలాంటి మూగజీవాలకు నగరవాసులు ఆహారం పెట్టడం అనేది సాధారణ అంశంగా మారింది. దయతో నగర పౌరులు వీధి కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి జీవులకు ఆహారం పెడుతున్నారు. ఇది మానవీయతకు నిదర్శనం అయినప్పటికీ చట్ట పరంగా, పర్యావరణ పరంగా కొన్ని పరిమితులు, నిబంధనలూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ అంశానికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ అంశాలపైన నగరవాసులు దృష్టి కేంద్రీకరించారు. – సాక్షి, సిటీబ్యూరో మూగ జీవాల పట్ల కనికరంగా ఉండడం అనేది సాటి ప్రాణిగా, మనుషులుగా మన బాధ్యత. ఇందులో భాగంగా వీధిలో నివసించే జంతువులు.. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి జీవులు నిరాశ్రయంగా, ఆకలితో అలమటిస్తుంటాయి. నగరంలోని ఇలాంటి ప్రాణులకు నగరవాసులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు ఆహారం అందించడం అతి సహజంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఐతే కుక్కలకు అన్నం పెట్టడం, పక్షులకు గింజలు, నీళ్లు పెట్టడం కూడా తరచూ కనిపించే దృశ్యం. అయితే నగరం, శివారు ప్రాంతాలు అటవీ ప్రాంతాలతో కలసిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలో నగరంలో సాధారణ సాధు జంతువులతో పాటు పలు సందర్భాల్లో వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. ఇలా అన్ని జంతువులకూ ఆహారం అందించడంలో చట్టపరంగా కొన్ని నిబంధనలు, పరిమితులు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.చట్టం ఏం చెబుతోంది.. మూగ జీవాలను కాపాడేందుకు భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూరిటీ టు యానిమల్ (పీసీఏ) యాక్ట్ – 1960 అమలులో ఉంది. ఈ యాక్ట్ ప్రకారం జీవాలకు ఉద్దేశపూర్వకంగా హాని చేయడం నేరం. కానీ జీవాలకు ఆహారం పెట్టే విషయంలో ప్రత్యేకంగా నిషేధం లేదు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే, స్థానిక మున్సిపల్ చట్టాలు, గృహ సంఘాలు నిబంధనలు విధించవచ్చు. ఏ జీవాలకు ఆహారం వేయవచ్చు? సాధారణంగా మనుషులతో మమేకమై జీవనం కొనసాగిస్తున్న వీధి కుక్కలు, పిల్లులు వంటి జీవాలకు ప్రజలు ఆహారం అందించవచ్చు. అయితే అది బహిరంగ ప్రదేశాల్లో కాకుండా, నివాస ప్రాంగణాల్లో ఇవ్వడం మంచిది. అనవసరంగా రోడ్లపై జంతువులు గుమిగూడడం వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో అధికంగా ఉండే ట్రాఫిక్‌కు ఇది అంతరాయంగా మారుతుంది. నగరంలో ఎక్కువ సంఖ్యలో ఉండే పక్షులకు నీళ్లు, గింజలు వంటివి పెట్టవచ్చు. కాని అది ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర, అపరిశుభ్ర ప్రాంతాల్లో ఉండకూడదు. ఆవులు, ఇతర జంతువుకు ఆహారం పెట్టే వారు రోడ్ల పైన కాకుండా సురక్షిత ప్రాతాల్లో పెట్టడం మంచిదని, అంతేకాకుండా ఆ జీవులు తినే ఆహారాన్ని మాత్రమే అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.వన్యప్రాణుల పట్ల జాగ్రత్త.. నగరంలో అరుదుగా కనిపించినా, అటవీ ప్రాంతానికి శివార్లలో నివసించేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జింకలు, పులులు, ఎలుగుబంట్లు వంటి అటవీ జంతువులకు ఆహారం ఇవ్వడం అటవీ చట్టం ప్రకారం నేరం. అడవి జంతువులకు ఆహారం అందించడం, వాటిని ఆకర్షించేలా చేయడం, వాటి సహజ జీవన విధానాన్ని భంగపెట్టేలా చేయడం చట్టవిరుద్ధం. వీటిని ఉపేక్షిస్తే చట్టరిత్యా కఠిన చర్యలకు, శిక్షలకు గురికాక తప్పదు. అధిక సంఖ్యలో తారసపడే కోతుల వంటి వన్య ప్రాణులకు ఆహారం అందించకూడదు. దీని వల్ల అవి సహాజంగా ఆహారాన్ని సేకరించడం క్రమంగా కోల్పోవడమే కాకుండా సులభంగా లభించే ఆహారం కోసం జనావాసాల్లోకి వలసపడతాయి. ప్రమాదకరమైన విషసర్పాల వంటి ఇతర ప్రాణులకు ఆహారం ఇవ్వకూడదు. ముఖ్యంగా ప్రమాదకర వన్యప్రాణులను ఏ విధంగా ఆకర్షించినా వాటికి, మనుషులకు శ్రేయస్కరం కాదు. భద్రతకు భంగం కలగకుండా.. మూగజీవాల పట్ల మానవీయతతో ఉండటం, వాటి సంరక్షణకు మన వంతు బాధ్యతను అందించడం మంచి విషయమే.. కానీ మానవీయత పేరుతో మనం జంతువులకు ఆహారం పెడితే, అది ఇతరుల హక్కులను, భద్రతను హరించేలా ఉండకూడదు. చట్టాన్నీ, సమాజాన్నీ గౌరవిస్తూ, జంతు సంక్షేమం పట్ల మన బాధ్యతను సమతుల్యంగా నిర్వహించాలని నిబంధలను సూచిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు, గృహ సంఘాల నిబంధనలు పాటిస్తూ.. మనుషుల ప్రేమను, కనికరాన్ని సమర్థవంతంగా చాటుకోవాలని జంతు ప్రేమికులు నినదిస్తున్నారు.

The Earth Day 2025 : పుడమితల్లిని రక్షించుకుందాం!
పర్యావరణ పరిరక్షణకు మద్దతును ప్రదర్శించడానికి జరిగే వార్షిక కార్యక్రమాన్ని ‘ధరిత్రీ దినోత్సవం’ (ఎర్త్ డే) అంటున్నాం. ఈనాడు పర్యావరణ ఉద్యమాలకు మద్దతు ఇవ్వడానికీ, పర్యావరణ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికీ ప్రపంచవ్యాప్తంగా 1970 ఏప్రిల్ 22 నుండి ఈ ఉత్సవాన్ని జరుపుకొంటున్నారు. ఈ 55వ వార్షిక దినోత్సవానికి ఎంపిక చేసిన విషయం ‘మన శక్తి–మన గ్రహం’. ఈ సంద ర్భంగా ‘భూమి మొదట – మిగిలినవన్నీ తరువాత’ అనీ, ‘ప్రపంచ వ్యాప్తంగా ఆలోచించి స్థానికంగా వ్యవహరించండి’ అనీ పిలుపు ఇస్తు న్నారు. అంతేకాదు ‘పరిశుభ్రమైన భూమి – ప్రకాశవంతమైన భవి ష్యత్’ అని గుర్తు చేస్తున్నారు.భూమి ఉపరితలం 70 శాతం నీరు, 30 శాతం భూమి మాత్రమే కలిగి ఉంది. మహా సముద్రాలు, నదులు, సరస్సులు, హిమనీ నదాలు, సముద్రాల వంటివి ముఖ్యమైన నీటివనరులు. పర్వతాలు, కొండలు, పీఠ భూములు, మైదానాలు వంటివి ముఖ్యమైన భూరూపాలు. నీటిలో కానీ, నేలపై కానీ మానవునితో సహా వృక్షాలు, జంతువులు, కీటకాలు వంటి జీవులు లెక్కకు మించి జీవిస్తున్నాయి. భూమిని కాపాడుకోకపోతేఇందులో కొన్ని అదృశ్యం అయిపోయే ప్రమాదం ఉంది. శిలాజ ఇంధనాలు మాత్రమే మన గ్రహానికి శక్తి నివ్వగలవనే అబద్ధాన్ని సంవత్సరాలుగా కొన్ని శక్తులు మనకు చెబుతూనే ఉన్నాయి. కానీ శిలాజ ఇంధనాలు ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గా రాలకు ప్రధాన వనరులు. ఇవి గ్లోబల్ వార్మింగ్‌కు ప్రత్యక్షంగా దోహదం చేస్తాయి. ఫలితంగా శ్వాసకోశ సమస్యల నుండి కేన్సర్ వరకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.గ్రీన్ హౌస్ ఎఫెక్ట్బొగ్గు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటి శిలాజ ఇంధనాలుమండినపుడు కార్బన్ డై ఆక్సైడ్ పుడుతుంది. పూర్తిగా మండనిఇంధనం నుండి వచ్చే పొగలో కూడా కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. కుళ్లిన పదార్థాల నుండి, చెత్త గుట్టల నుండి, వరి పంట నుండి మీథేన్ వాయువు వెలువడుతుంది. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి కలిసి సూర్యుని నుండి వచ్చిన వేడిని గ్రహించి బయటకు పోనీ యకుండా పట్టేస్తాయి. మానవులతో సహా జంతువులు, పక్షులు శ్వాస క్రియలో భాగంగా ఆక్సిజన్ వాడుకుని కార్బన్ డై ఆక్సైడ్‌ను వదిలి వేస్తాయి. మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్,క్లోరో ఫ్లోరో కార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి కొన్ని రకాల వాయువులు పరారుణ కిరణాలను పీల్చుకుని ఇముడ్చుకుంటాయి. ఫలితంగా వేడిమి పెరిగి ప్రపంచ వాతావరణంలో మార్పులు వస్తు న్నాయి. దీనినే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. మనకు శక్తి అవసరం. దానిని పొందడానికి మన గ్రహం యొక్క వనరులను పూర్తిగా వినియోగించుకోవాలి. శిలాజ ఇంధనాలు పరిమితమైనవి. ఎప్పటికైనా అయిపోయేవే. పునరుత్పాదక ఇంధ నాలపై ఇప్పటికే దృష్టి సారించారు. పునరుత్పాదక శక్తి అనేది గేమ్–ఛేంజర్. ఇది చౌకైనదే కాక స్థిరమైన విద్యుత్‌ను అందిస్తుంది. దీని వలన వాతావరణ మార్పులు ఉండవు. మానవ ఆరోగ్యానికి ఏ విధమైన హానీ ఉండదు. సౌర, పవన, జల, భూ ఉష్ణం, అలలు వంటివి పునరుత్పాదక శక్తులు. ఈ వనరులు ఎప్పటికీ తరిగిపోవు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే ఇంధన ఉత్పత్తి మూడు రెట్లు పెరగాలని ఆశిస్తున్నారు. ఈ లక్ష్య సాధనకై సమష్టి కృషి అవసరం. ఆస్ట్రేలియాలోని ఇళ్ళలో మూడింట ఒక వంతు ఇప్పటికే సౌర శక్తిని ఉపయోగిస్తున్నారు. ఐస్లాండ్, నార్వే, ఇథియోపియాలు ఎక్కువగా శక్తిని పునరుత్పాదక వనరుల నుంచేపొందుతున్నాయి. ఉరుగ్వే పునరుత్పాదక వనరుల నుండి 98 శాతం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. డెన్మార్క్ పవన టర్బైన్ల ద్వారా 50 శాతంకంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటోంది. ఈ విషయంలో ఆఫ్రికాలో కెన్యా అగ్రగామిగా ఉంది. దాని విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు సగం భూ ఉష్ణ శక్తి ద్వారా లభిస్తోంది. మన దేశంలో కూడా సౌర శక్తి వినియోగం బాగా పెరుగుతోంది. తమిళనాడు, రాజస్థాన్, మహా రాష్ట్ర్టలలో పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సౌర ఫలకాలు, పవన టర్బైనులు నిర్మించడానికి కాడ్మియం, రాగి, వెండి ఎంతో అవసరం. ఈ సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తలుతీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు.డా.సి.వి. సర్వేశ్వర శర్మ పాపులర్ సైన్స్ విషయాల రచయిత(నేడు 55వ ‘ధరిత్రీ దినోత్సవం)

Kamala Sohonie భారతీయ తొలి మహిళా డాక్టరేట్
తొమ్మిది దశాబ్దాల క్రితం ఓ యువతి విజ్ఞాన శాస్త్రంలో ఎంఎస్సీ చేయడం కోసం ఒక పోరాటమే చేయాల్సివచ్చింది. ఆవిడ పోరాడింది చిన్న వ్యక్తితో కాదు. నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్‌తో! ఆ యువతి కమలా సోహానీ Kamala Sohonie). ఈవిడే సైన్సు విభాగంలో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళ! బొంబాయిలో 1911 జూన్ 18న జన్మించారు కమలా భాగ వత్. బొంబాయి ప్రెసిడెన్సీ కళాశాల నుంచి రసా యన శాస్త్రంలో బీఎస్సీ పట్టా పొందారు. తర్వాత సీవీ రామన్ డైరెక్టర్‌గా ఉన్న టాటా సైన్స్ ఇన్స్టిట్యూట్ (నేడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగ ళూరు)లో ఎమ్మెస్సీ చదవాలని ప్రయ త్నించారు. ఆ రోజుల్లో ఉన్నత చదు వుకు మహిళలు అర్హులు కాదని భారతీయ సమాజం భావించేది. సీవీ రామన్ కూడా దాన్నే నమ్మి ఆమెకు ప్రవేశాన్ని నిరాకరించారు. అయితే ఆ నిర్ణయాన్ని స్వీకరించక, గాంధీజీ ఆదర్శాలను బలంగా నమ్మిన కమలా భాగవత్ సత్యాగ్రహం చేయాలని నిర్ణయించుకున్నారు. తొలుత రామన్ మహాశ యుడు కమల పట్టుదలను గమనించ లేకపోయారు. ఆమె మౌనంగా రోజుల తరబడి నిరసన తెలపడంతో రామన్ దిగిరాక తప్పలేదు. చివరకు ప్రవేశ మిచ్చారు. అయితే కొన్ని నిబంధనలతో! అది కూడా రెగ్యులర్ విద్యార్థిగా తీసుకోలేదు. ఒక సంవత్సరం పాటు ప్రొబేషనరీగా చేరవలసి వచ్చింది. ‘అవసరమైతేనే రాత్రింబవళ్ళు కష్టపడాలి. ప్రయోగశాల వాతావరణాన్ని పాడు చేయకూడదు’– ఇలాంటివి ఆ అధ్వాన్నపు నిబంధనలు! అయితే లక్ష్యసాధన కోసం ఓర్చుకుని కష్టపడి 1936లో ఎమ్మెస్సీ డిగ్రీ పొందారు. పాలు, పప్పు, చిక్కుళ్ళలో ప్రొటీన్ల గురించి కమల శోధించి ఎమ్మెస్సీ పట్టా కోసం సిద్ధాంత గ్రంథం రాశారు.దీంతో రామన్ మహిళాశక్తిని గుర్తించి ఆ సంవత్సరం నుంచే విద్యార్థినులకు అవకాశం కల్పించడంప్రారంభించారు. అలా కమల విజ్ఞాన శాస్త్రాల అధ్య యనానికి సంబంధించి మహిళలకు తొలి దారి దీపమయ్యారు. పీహెచ్డీ కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరారు. తన 16 నెలల పరిశోధనలో ‘సైటోక్రోమ్ సి’ అనే ఎంజైమ్ ఉందనీ, అన్ని మొక్కల కణాలలో జరిగే ఆక్సీకరణలో దీని పాత్ర ఉంటు న్నదనీ కనుగొన్నారు. తన పరిశోధనా ఫలితాలను కేవలం 40 పుటలు ఉన్న సిద్ధాంత గ్రంథంగా కేంబ్రిడ్జి యూని వర్సిటీకి సమర్పించి పీహెచ్డీ పట్టా పొందారు. విజ్ఞానశాస్త్ర రంగంలో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళగా కమల అవతరించారు.ఇండియా వచ్చి వివిధ ఉద్యోగాలు చేస్తున్న సమయంలో ఎం.వి. సోహా నీతో 1947లో వివాహం జరిగింది. అప్పటి నుంచి కమలా భాగవత్‌పేరు కమలా సోహానీగా మారింది. ఆమె చేసిన పరిశోధనలు భారతీయ సమాజానికి చాలా విలువైనవి. పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు, తాటి బెల్లం, నీరా లేదా ఈత కల్లు, తాటి మొలాసిస్, బియ్యప్పిండి మొదలైన వాటి పోషక విలువలకు సంబంధించి ఆమె చేసిన పరిశోధనలు తిరుగు లేనివి.ఎనభయ్యారేళ్ళ వయసులో న్యూఢిల్లీలో తనను గౌరవించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో 1998 జూన్ 28న ఆమె హఠాత్తుగా మరణించడం ఆమె జీవన యాత్రకు ఆశ్చర్యకరమైన ముగింపు!– డా.నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి

ఆధ్యాత్మికథ : ధర్మనిష్ఠ
అది ఒక గురుకులం. ఒక శిష్యుడికి శిక్షణ పూర్తయింది. గురువుగారు అతన్ని పిలిచి ‘‘నాయనా! ఇక నీ శిక్షణ పూర్తయింది. నీవిక వెళ్లి, గృహస్థాశ్రమం స్వీకరించి, నీ విద్యలన్నిటినీ లోకకల్యాణానికి ఉపయోగించు.’’ అని చెప్పాడు.. ఆ శిష్యుడు చాలా పేదవాడు. అయినప్పటికీ, గురువుగారికి ఎంతో కొంత దక్షిణ చెల్లించా లనుకుని గురువుగారిని అడిగాడు దక్షిణ ఏమి కావాలని. అతని గురించి తెలిసిన గురువుగారు ‘‘నాకేమీ వద్దు’’ అని చెప్పారు. అయినా సరే, వదలకుండా పదే పదే అడుగుతుండడంతో విసిగిపోయిన గురువు ‘‘నీకు నేను 14 విద్యలను నేర్పాను. ఒక్కో విద్యకూ లక్ష బంగారు నాణాల చొప్పున పద్నాలుగు లక్షల బంగారు నాణాలు చెల్లించు’’ అని చెప్పాడు.గురుదక్షిణ చెల్లించాలన్న సంకల్పమే తప్ప దానిని ఎలా సమకూర్చుకోవాలో తెలియని ఆ శిష్యుడు కౌత్సుడు. అయితే, రాజు తండ్రి వంటి వాడు కాబట్టి రాజునే అడుగుదామనుకుని నేరుగా రాజు వద్దకు వెళ్లాడు. ఆ రాజు రఘువు. మహాపరాక్రమవంతుడు, ధర్మనిష్టాగరిష్ఠుడు. ఆడిన మాట తప్పనివాడు. కౌత్సుడు ఆయన వద్దకు వెళ్లడానికి ముందురోజే ఆయన విశ్వజీ అనే యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ నియమంగా తనకున్న సర్వస్వాన్నీ దానం చేశాడు. కౌత్సుడు వెళ్లేసరికి ఆయన మట్టిపిడతలతోనే సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అది గమనించిన కౌత్సుడు ఏమీ అడగకుండానే వెనుదిరగబోతుండగా, రఘుమహారాజు అతన్ని ఉండమన్నట్లుగా సైగ చేసి, సంధ్యావందనం ముగియగానే ఏం కావాలని అడిగాడు. గురుదక్షిణ చెల్లించడానికి తనకు 14 లక్షల బంగారు నాణాలు కావాలన్నాడు కౌత్సుడు. ఎవరినీ ఖాళీ చేతులతో పంపకూడదన్న నియమం కలవాడైన ఆ రాజు ‘‘అలాగే ఇస్తాను కానీ, ప్రస్తుతానికి లేవు కాబట్టి రేపు ఉదయం వచ్చి తీసుకు వెళ్లు’’ అని చెప్పాడు. సరేనంటూ సంతోషంగా సెలవు తీసుకున్నాడు కౌత్సుడు. తన వద్ద ధనం లేదు కాబట్టి, ఏం చేయాలో తగిన తరుణోపాయం చెప్పమని గురువైన వశిష్ఠుని అడిగాడు రఘుమహారాజు. ‘‘రాజా! నీకు కావలసిన ధనాన్ని సమకూర్చగల సమర్థుడు ఇంద్రుడొక్కడే. కాబట్టి వెంటనే ఇంద్రుని మీద దండెత్తడమే ఉత్తమం’’అని సలహా ఇచ్చాడు వశిష్టుడు. గురువు సలహా మేరకు వెంటనే ఇంద్రుని మీద యుద్ధం చేస్తున్నట్లుగా భేరీలు మోగించాడు రఘువు. ఆ భేరీ నాదాలు అయోధ్యా నగరం నుంచి వస్తున్నాయని తెలుసుకున్న ఇంద్రుడు వెంటనే ధర్మపరాయణుడు, పరాక్రమవంతుడు అయిన రఘుమహారాజుకు కోపం తెప్పించడం కంటే ఆయనతో సంధి చేసుకోవడమే మేలని, దిక్పాలకులను ఆదేశించి, ఆ రాజ్యమంతటా బంగారు వర్షం కురిపించాడు. కొద్దిసేపటిలోనే కోశాగారమంతా నిండి, రాజ్యమంతటా బంగారు నాణాలతో నిండిపోయింది. దాంతో వెంటనే ఇంద్రునిపై యుద్ధం విరమిస్తున్నట్లు ప్రకటించి రఘుమహారాజు, కౌత్సుడిని పిలిపించి, నీవడిగిన ధనం కోశాగారంలో ఉంది తీసుకు పొమ్మని చెప్పాడు. తనకు కావలసిన దానికన్నా ఎక్కువ ధనం ఉందని తెలుసుకున్న కౌత్సుడు తనకు కావలసినంత మాత్రమే తీసుకుని వెళ్లి, గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మిగిలిన ధనమంతటినీ ఇంద్రుడికి తిరిగి పంపించేశాడు రఘువు. అంతటి ధర్మాత్ముడైన రఘు వంశంలో పుట్టిన వాడు కాబట్టే రాముడికి ఆయన గుణాలన్నీ అలవడ్డాయి. – డి.వి.ఆర్.
ఫొటోలు


'రచ్చ' మూవీలో నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో చూశారా (ఫోటోలు)


ఏపీలో ఎండలు, వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి (ఫొటోలు)


భారత పర్యటనలో ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)


ప్రకాశం జిల్లా : కన్నుల పండువగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం (ఫొటోలు)


ఆపన్నుల పక్షపాతి.. పోప్ ఫ్రాన్సిస్ అరుదైన చిత్రాలు


టాలీవుడ్ నటి అభినయ గ్రాండ్ రిసెప్షన్.. హాజరైన ప్రముఖ సినీతారలు (ఫోటోలు)


గ్రాండ్‌గా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుక (ఫోటోలు)


టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తల్లి బర్త్ డే.. స్పెషల్ విషెస్ తెలిపిన ముద్దుగుమ్మ (ఫోటోలు)


తిరుమల శ్రీవారి సేవలో గోపీచంద్ మలినేని, తమన్, అశ్విన్ బాబు (ఫోటోలు)


అందానికి మించి అద్భుతమైన మనసు, ఎవరీ సాహసి! (ఫోటోలు)
అంతర్జాతీయం

పుట్టి.. మళ్లీ కడుపులోకి వెళ్లి.. మళ్లీ పుట్టి
బ్రిటన్‌లో రాఫర్టీ ఇసాక్ అనే పిల్లాడు రెండు సార్లు పుట్టాడు. ఒకసారి జన్మించిన పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాక ముదిమి వయసులో చనిపోతే తర్వాత జన్మలో కదా పుట్టేది అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఈ పిల్లాడు ‘సాంకేతికంగా’రెండుసార్లు జన్మించాడు. తల్లికి క్యాన్సర్ కణుతులు పెరిగి క్యాన్సర్ రెండో స్టేజీకి చేరుకున్నాక తప్పనిసరి పరిస్థితుల్లో అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. అప్పటికి పిల్లాడు ఇంకా 20 వారాల వయసులో గర్భస్త పిండంగా గర్భాశయంలోనే ఉన్నాడు. ఆలస్యం చేస్తే పిల్లాడు బతుకుతాడేమోగాని క్యాన్సర్ ముదిరి తల్లి ప్రాణాలు వదలడం ఖాయం. ఈ పరిస్థితుల్లో అత్యంత నిష్ణాతుడైన డాక్టర్ సాల్మనీ మజిద్ తన 15 మంది వైద్య బృందంతో కలసి చాలా సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి అటు తల్లిని, ఇటు గర్భస్థ శిశువును సంరక్షించాడు. అరుదైన ఆపరేషన్ బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్ట్ ప్రాంతానికి చెందిన లూసీ ఇసాక్ వృత్తిరీత్యా టీచర్. 32 ఏళ్ల లూసీ గత ఏడాది గర్భందాల్చింది. గర్భిణి కావడంతో సాధారణ అ్రల్టాసౌండ్ పరీక్ష చేయించడంతో అనూహ్యంగా ఓవరీ క్యాన్సర్ బారిన పడ్డట్లు తేలింది. గర్భంతో ఉన్న కారణంగా కీహోల్ తరహాలో శస్త్రచికత్స చేయడం కుదరలేదు. అలాగని గర్భాన్ని తొలగించలేని పరిస్థితి. దాంతో పిండాన్ని ప్రసవం తరహాలో అలాగే బయటకు తీసుకొచ్చి బయట క్షేమంగా పక్కనే పెట్టి తల్లిని శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా జాన్ రాడ్‌క్లిఫ్ ఆస్పత్రిలో వైద్యుల బృందం రంగంలోకి దిగి గర్భస్త పిండాన్ని బయటకు తీశారు. తల్లి శరీరంతో అనుసంధానమైన రక్తనాళాలు, కణజాలం జోలికి వెళ్లలేదు. వెచ్చగా పొత్తికడుపులో ఉండాల్సిన పిండం బయటి వాతావరణంలో మనగలగడం అసాధ్యం. అందుకే వెచ్చని ‘సలీన్’బ్యాగ్‌లో పెట్టారు. దాదాపు ఐదు గంటలపాటు కష్టపడి తల్లి ఓవరీ క్యాన్సర్ కణాలను వైద్యులు తొలగించారు. బ్యాగులో పిండం ఆరోగ్యపరిస్థితిని ఇద్దరు వైద్యుల బృందం అనుక్షణం గమనించింది. ప్రతి 20 నిమిషాలకొకసారి బ్యాగును మార్చారు. ఈలోపు ఆపరేషన్‌ను పూర్తిచేసి గర్భాశయాన్ని మళ్లీ తల్లి పొత్తికడుపులో పెట్టి కుట్లేశారు. ఇలా ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఈ ఏడాది జనవరిలో నిండు గర్భిణిగా మళ్లీ ఆస్పత్రికి వచ్చిన లూసీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పిల్లాడు పుట్టినప్పుడు 2.86 కేజీల బరువున్నాడు. ఇలా రెండు సార్లు పుట్టిన పిల్లాడిగా రాఫర్టీ అరుదైన ఘనత సాధించాడు. ఆపరేషన్ చేసిన వైద్యుడు సాల్మనీ మజిద్‌ను పిల్లాడి తల్లిదండ్రులు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ‘‘మూడేళ్ల క్రితం నాకు మూత్రపిండ మారి్పడి శస్త్రచికిత్స జరిగింది. అలా నాకు అది పునర్జన్మ. క్యాన్సర్ బారిన పడి కూడా కోలుకుని నా భార్య లూసీ పునర్జన్మ ఎత్తింది. ప్రసవానికి ముందే పుట్టి మళ్లీ తల్లికడుపులోకి వెళ్లి మరోసారి పుట్టి నా కుమారుడు కూడా పునర్జన్మ ఎత్తాడు’’అని పిల్లాడి తండ్రి ఆడమ్ ఆనందంగా చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్

Rakhaldas Banerjee: ఆయనకింకా ఆ క్రెడిట్ దక్కలేదు!
భారతదేశంలో 5,300 సంవత్సరాలకు పూర్వమే గొప్ప నాగరికత వషిల్లింది. అదే సింధూలోయ నాగరికత లేదా హరప్పా నాగరికత. ప్రణాళికాబద్ధమైన వీధులు, ఇళ్లు, మురుగు నీటి వ్యవస్థతో ఈ నాగరికత ఇప్పటి ఆధునిక నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేది. 1990వ దశకం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో సింధూలోయ నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. భూమి పొరల కింద శతాబ్దాలుగా కప్పబడి ఉన్న శిథిలాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అవిశ్రాంతమైన తవ్వకాలతో ఈ గొప్ప నాగరికతను నేటి తరానికి పరిచయం చేశారు. ఈ మహాయజ్ఞం వెనుక ఉన్నది ఎవరో తెలుసా? భారతీయుడైన రఖల్దాస్ బెనర్జీ. కానీ, మొత్తం క్రెడిట్ కొట్టేసింది మాత్రం అప్పటి భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) చీఫ్, బ్రిటిష్ జాతీయుడైన జాన్ మార్షల్. సింధూలోయ నాగరికతను బయటపెట్టింది జాన్ మార్షల్ అని బ్రిటిష్ ప్రభుత్వం లోకాన్ని నమ్మించింది. పాఠ్య పుస్తకాల్లోనూ అదే చేర్చారు. ఇప్పటికీ పిల్లలు అదే చదువుకుంటున్నారు. కానీ, వాస్తవం అది కాదని చరిత్రకారులు, పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. అసలైన కథానాయకుడు రఖల్దాస్ బెనర్జీ అనామకంగా ఉండిపోవడానికి కారణం ఏమిటి? అసలు ఆయనెవరు? ఆ మహా మనిషిని మనం ఎందుకు మర్చిపోయాం? చిన్నప్పుడే చరిత్రపై ఆసక్తి పురావస్తు పరిశోధకుడైన రఖల్దాస్ బెనర్జీ 1885లో పశ్చిమ బెంగాల్లో ఓ సంపన్న కుటుంబంలో జని్మంచారు. బహరాంపూర్ పట్టణంలో పెరిగారు. ఆ మధ్య యుగాల నాటి కట్టడాలు అధికంగా ఉండేవి. ఆయన వాటిని చూస్తూ ప్రాచీన నాగరికతలు, చరిత్రపై ఆసక్తి పెంచుకున్నారు. కాలేజీలో చేరి చరిత్రను అధ్యయనం చేశారు. మధ్యయుగ భారతదేశ చరిత్రపై వ్యాసం రాసే బాధ్యత అప్పగించగా, అందుకోసం స్వయంగా పరిశోధన ప్రారంభించారు. పొరుగు రాష్ట్రం వెళ్లి అక్కడి శిల్పాలు, రాతపత్రులను పరిశీలించారు. దాంతో చరిత్ర, నాగరికతలపై ఆసక్తి మరింత పెరిగింది. 1910లో ఏఎస్ఐలో ఎక్సవేషన్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. చురుకైన వ్యక్తి కావడంతో తక్కువకాలంలోనే సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు స్థాయికి ఎదిగారు. 1917లో విధుల్లో భాగంగా పశ్చి మ భారతదేశానికి చేరుకున్నారు. 1919లో సింధూ ప్రాంతంలోని మొహెంజోదారోలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్‌తో లర్కానాలో జిల్లాలో ఉంది. ఇప్పటికైనా గుర్తింపు దక్కేనా? సింధూలోయలో ప్రాచీన నగరాన్ని తవ్వకాల్లో బయటకు తెచ్చిన ఘనత నిశ్చయంగా రఖల్దాస్ బెనర్జీదే. అందుకోసం ఆయన ఎంతగానో కష్టపడ్డారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్నారు. కానీ, ఒక భారతీయుడికి ఆ పేరు ప్రఖ్యాతలు దక్కడం బ్రిటిష్ ప్రభుత్వానికి ఇష్టం లేకపోయింది. ఆయనపై ఎన్నో అభియోగాలు మోపింది. అంతేకాకుండా రఖల్దాస్ది ధిక్కరించే తత్వం. తనపై ఎవరైనా పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేవారు కాదు. ఈ లక్షణమే ఆయనను బ్రిటిష్ అధికారులకు విరోధిగా మార్చింది. నిధులు దురి్వనియోగం చేశారని, అవినీతికి పాల్పడ్డారని రఖల్దాస్పై నిందలు మోపారు. అరుదైన శిల్పాలు, పెయింటింగ్‌లు దొంగిలించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో చోరీకి గురైన ఒక బుద్ధిస్టు దేవత విగ్రహం కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అవమానాలు భరించలేక ఆయన 1927లో ఏఎస్ఐలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ, ఆయనపై వచ్చిన అభియోగాలను తర్వాత కోర్టులు కొట్టివేశాయి. ఉపాధి కోసం రఖల్దాస్ 1928లో బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1930లో మరణించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 45 ఏళ్లు. గొప్ప చరిత్రను వెలికితీసిన రఖల్దాస్కు చివరకు చరిత్రలో స్థానం లేకుండాపోవడం ఒక వైచిత్రి. ఇప్పటి తరానికి ఆయనెవరో తెలియదు. సింధూలోయలో ప్రాచీన నగరా>న్ని సందర్శించేవారికి కూడా ఆయన గొప్పతనం ఏమిటో తెలిసే అవకాశం లేదు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం స్పందించాలని, రఖల్దాస్ బెనర్జీకి తగిన గుర్తింపు ఇవ్వాలని చరిత్రకారులు కోరుతున్నారు. 5,300 ఏళ్ల నాటి నగరం మొహెంజోదారో అంటే సింధీ భాషలో మృతిచెందిన మనిషి దిబ్బ అని అర్థం. ఇదే చోట రఖల్దాస్ బెనర్జీ తవ్వకాలు ప్రారంభించారు. తొలుత బౌద్ధ స్తూపాలు, నాణేలు, ముద్రలు, కుండలు, ఇతర కళాకృతులు లభించాయి. మరిన్ని ఆధారాల కోసం 1922, 1923లో తవ్వకాలు ఊపందుకున్నాయి. ప్రాచీన సింధూలోయ నాగరికత బయటపడింది. కాల్చిన ఇటుకలతో నిర్మించిన అప్పటి భవనాలు, నీటి తొట్టెలు, స్నానపు గదులు, రహదారులు వెలుగులోకి వచ్చాయి. ఇది 5,300 ఏళ్ల క్రితం నాటిదని తేల్చారు. సింధూనది లోయ 3.86 లక్షల చదరపు మైళ్ల మేర విస్తరించి ఉండేది. ఈశాన్య అఫ్గానిస్తాన్ నుంచి వాయువ్య భారత్ దాకా గొప్ప రాజ్యం వర్థిల్లింది. తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వరదల కారణంగా చాలావరకు తుడిచిపెట్టుకుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్

డొనాల్డ్ ట్రంప్‌పై ప్రజాగ్రహం
వాషింగ్టన్: అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మారుస్తానంటూ రెండోసారి అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అమెరికన్లకు ఎంతమాత్రం నచ్చడం లేదు. ట్రంప్ తీరును మెజార్టీ జనం తప్పుపడుతున్నారు. అమెరికాను నాశనం చేయొద్దని కోరుతున్నారు. అమెరికాలో రాచరికం లేదు, ట్రంప్ రాజు కాదు అంటూ జనం గొంతెత్తి నినదిస్తుండడం గమనార్హం. ట్రంప్‌కు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జనం వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వైట్‌హౌస్ ఎదుట, టెస్లా కార్యాలయాల వద్ద, నగరాల్లోని ప్రధాన సెంటర్లలో జనం పెద్ద ఎత్తున గుమికూడారు. ట్రంప్ వ్యవహార శైలిపై ఆగ్రహం వెళ్లగక్కారు. చాలాచోట్ల ర్యాలీలు జరిగా యి. ఈ నిరసన ఉద్యమం ‘50501’గా పేరు పొందింది. ‘50 నిరసనలు, 50 రాష్ట్రాలు, ఒక ఉద్యమం’ అనేదే దీని అర్థం. సరిగ్గా 250 ఏళ్ల క్రితం అమె రికాలో ఇదే రోజు విప్లవ యుద్ధం ఆరంభమైంది. బ్రెగో గార్సియాను వెనక్కి రప్పించాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు విధించడానికి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించడానికి డిపార్ట్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) పేరిట ట్రంప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ పట్ల అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శనివారం నాటి ప్రజాందోళనల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఎల్‌సాల్వెడార్ దేశానికి చెందిన బ్రెగో గార్సియా అనే వ్యక్తిని ప్రభుత్వం ఇటీవల బలవంతంగా స్వదేశానికి పంపించింది. ఈ ఉదంతాన్ని అమెరికన్లు తప్పుపట్టారు. గార్సియాను తిరిగి అమెరికాకు రప్పించాలని డిమాండ్ చేశారు. ట్రంప్‌ను ఎల్‌సాల్వెడార్‌కు తరిమేయాలంటూ కొందరు తేల్చిచెప్పారు. ప్రజల నిరసనలు చాలావరకు శాంతియుతంగానే జరిగాయి. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తెలియరాలేదు. ‘నో కింగ్స్’ అని రాసి ఉన్న ప్లకార్డులు జనం ప్రదర్శించారు. ట్రంప్ రాచరిక పోకడలు ప్రదర్శిస్తున్నారంటూ పరోక్షంగా మండిపడ్డారు. ట్రంప్ పనితీరుకు 45 శాతం సానుకూలత మొదటి త్రైమాసికంలో ట్రంప్ పనితీరు పట్ల ఇటీవల నిర్వహించిన గ్యాలప్ సర్వేలో 45 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. తొలిసారిగా ఆయన అధ్యక్షుడైనప్పుడు తొలి త్రైమాసికంలో ఆయన పనితీరుకు 41 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అంటే ఈసారి ప్రజాదరణ కొంత పెరిగినట్లు స్పష్టమవుతోంది. కానీ, 1952 నుంచి 2020 దాకా అధ్యక్షులుగా పనిచేసిన నేతల తొలి త్రైమాసికం పనితీరుకు సగటున 60 శాతం జనామోదం లభించింది. అంటే వారితో పోలిస్తే ట్రంప్ వెనుకబడే ఉన్నారు. ఆయన జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు అప్రూవల్ రేటింగ్ 47 శాతంగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. అది ఇప్పుడు 43 శాతానికి పడిపోయింది.

హైడ్రోజన్ బాంబ్‌ను పరీక్షించిన చైనా
బీజింగ్: రెండో ప్రపంచయుద్ధంలో రెండు అణుబాంబులను ప్రయోగించి యుద్ధంలో గెలవడంతోపాటు ఆనాటి నుంచి అగ్రరాజ్యం హోదాను కైవసం చేసుకున్న అమెరికా గురించి తెల్సిందే. అయితే ఇప్పుడు అలా అణుబాంబులను ప్రయోగిస్తే రేడియోధార్మికత ముప్పుతోపాటు అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొనే ఆస్కారముంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో రేడియోధార్మికత వెలువర్చని, అత్యంత వినాశనం సృష్టించే అధునాతన బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది. నాన్–న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్‌ను చైనా పరీక్షించిందని ‘సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. సుంకాల సమరంలో అమెరికాతో వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ చైనా తన సైనికసత్తాను చాటడం గమనార్హం. ఈ వివరాలు ‘ప్రోజెక్టైల్స్, రాకెట్స్, మిస్సైల్స్, గైడెన్స్’ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. శుద్ధ ఇంధన సాంకేతికతతో.. చైనా ప్రభుత్వ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్‌లోని ‘705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ ఈ రెండు కేజీల బరువైన హైడ్రోజన్ బాంబును తయారుచేసింది. అణుబాంబు మాదిరికాకుండా తక్కువ స్థలంలో ఎక్కువగా ఘన హైడ్రోజన్‌ను తనలో ఇముడ్చుకునే మెగ్నీషియం హైడ్రైడ్‌ను ఈ బాంబులో వాడారు. రేడియోధార్మికతను వెదజల్లకుండా వినాశనం సృష్టించే లక్ష్యంతో శుద్ధ సాంకేతికతతో ఈ హైడ్రోజన్ బాంబును సృష్టించారు. ఈ బాంబు పేలితే మెగ్నిషియం హైడ్రైడ్ పొడి చుట్టూతా పరిసరాల్లో పరుచుకుంటుంది. దాన్నుంచి హైడ్రోజన్ వాయువు ఉద్భవించి రెప్పపాటులో పేలుళ్లు సంభవిస్తాయి. ఇవి భయంకర ట్రైనైట్రోటోలిన్(టీఎన్టీ) బాంబు పేలినదానికంటే 15 రెట్లు అధిక వినాశనం కల్గిస్తాయి. ఈ పరిసరాల ఉష్ణోగ్రత కేవలం రెండు సెకన్లలోనే 1,000 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకుంటుంది. అంటే బాంబును ప్రయోగించిన చోట శత్రు దేశ ఆయుధాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వంతెనలు ఉంటే సెకన్లలోనే ధ్వంసమవడం, కాలి బూడిద కుప్పలుగా మారడం ఖాయం. బాంబు పేలినప్పుడు కేవలం రెండు మీటర్ల దూరంలో ఏకంగా 428.43 కిలోపాస్కల్ల పీడనం ఏర్పడిందని దీంతో ఊహించనంత వినాశనం జరుగుతుందని సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. నిశ్శబ్దంగా తయారీ ఈ ఏడాది తొలినాళ్ల నుంచే మెగీ్నషియం హైడ్రైడ్ తయారీని చైనా మొదలెట్టింది. షాన్జీ ప్రావిన్సులో 150 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారాన్ని ప్రారంభించింది. వాస్తవానికి రోజుకు కేవలం కొన్ని గ్రాముల మెగ్నిషియం హైడ్రైడ్‌ను మాత్రమే తయారుచేయగలం. అదికూడా అత్యంత జాగ్రత్తగా ల్యాబ్‌లలోనే తయారుచేయొచ్చు. కానీ చైనా భారీ స్థాయిలో ఉత్పత్తికి సిద్ధపడటం గమనార్హం.
జాతీయం

వాహనాలకు హారన్‌గా భారతీయ సంగీతం
న్యూఢిల్లీ: వాహనాలకు హారన్‌గా భారతీయ సంగీత ధ్వనులు మాత్రమే వచ్చేలా త్వరలో చట్టం తేవాలని యోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. నవభారత్ టైమ్స్ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటైన కార్యక్రమంలో గడ్కారీ ప్రసంగించారు. అన్ని రకాల వాహనాలకు కూడా భారతీయ సంగీత ధ్వనులే హారన్‌గా ఉంటాయని, వీటిని వినడం ఆహ్లాదకరంగా కూడా ఉంటుందన్నారు. సంగీత పరికరాలైన ఫ్లూట్, తబలా, వయోలిన్, హార్మోనియం ధ్వనులు ఇందులో ఉంటాయన్నారు. దేశంలో మొత్తం వాయు కాలుష్యం రవాణా రంగం వాటా 40 శాతం వరకు ఉంటుందని చెప్పారు. మన ఆటోమోబైల్ మార్కెట్ అమెరికా, చైనాల తర్వాత జపాన్ను వెనక్కి నెట్టిసి మూడో స్థానంలో నిలిచామన్నారు. 2014లో భారత ఆటోమోబైల్ రంగం విలువ రూ.14 లక్షల కోట్లు కాగా నేడది రూ.22 లక్షల కోట్లకు చేరిందన్నారు. కార్లు, ద్విచక్ర వాహనాల ఎగుమతి వల్లే దేశానికి ఎక్కువ ఆదాయం వస్తోందని వెల్లడించారు.

సిరి మా 'లక్ష'మి.. పసిడి పరుగే పరుగు..!
న్యూఢిల్లీ: అందరికీ ప్రియమైన బంగారం దేశంలోని సామాన్యులను మాత్రం బెంబేలెత్తించేలా పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78 వేలు పలికిన 10 గ్రాముల 24 క్యారట్ల ధర తాజాగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ మొదలవుతున్న వేళ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కలుపుకుని ఏకంగా రూ.లక్ష మార్కును దాటేసింది. సోమవారం బెంగళూరు బులియన్ మార్కెట్లో రూ. 1,02,000గా పసిడి ధర నమోదైంది. ఇక ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1,650 పెరిగి రూ. 99,800 మార్క్‌ను తాకగా హైదరాబాద్‌లో అటు ఇటుగా రూ. 1,00,100కు చేరుకుంది. మరోవైపు 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ఢిల్లీలో రూ. 1,600 పెరిగి రూ. 99,300 వద్ద నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ బలహీనపడటం, చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం బంగారం కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 26 శాతం ర్యాలీ చేసింది. 10 గ్రాములకు రూ. 20,850 పెరిగింది. మరోవైపు వెండి కిలో రూ. 500 పెరిగి రూ. 98,500 మార్క్‌ను చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ (31.1 గ్రాములు)కు 101 డాలర్ల వరకు ఎగసి 3,430 డాలర్లకు చేరుకుంది. 2006 వరకు నాలుగు అంకెల స్థాయికే పరిమితమైన బంగారం ధర.. 2007 నుంచి అయిదు అంకెల స్థాయిలోకి అడుగుపెట్టింది. ఏటా ధర వృద్ధి చెందుతూ 2012లో రూ.31 వేలకు చేరినప్పటికీ.. ఆ తరువాత పసిడి ధర ఒడిదుడుకులకు లోనై తిరోగమనం చెందింది. ఇక 2016 నుంచి ఏటా దూకుడు కొనసాగించింది.ఎంసీఎక్స్‌లోనూ రికార్డులు..మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్) లోనూ బంగారం రూ. 98 వేల రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల జూన్ నెల కాంట్రాక్టు ధర రూ. 2,111 పెరగడంతో (2.22%).. ఆల్‌టైమ్ గరిష్టం రూ. 97,365 నమోదైంది. ఆగస్ట్ నెల కాంట్రాక్టు సైతం రూ. 2,104 పెరిగి రూ. 98,000కు, అక్టోబర్ కాంట్రాక్టు రూ. 2,617 పెరిగి రూ. 98,000కు చేరడం గమనార్హం.బంగారం అంటే సంపద. కుటుంబానికి ఆర్థిక భరోసా. అభివృద్ధికి సూచిక.కష్టకాలంలో తోడుంటుందన్న ఓ నమ్మకం. సామాన్యుడైనా, సంపన్నుడైనా తన కష్టార్జితంలో ఎంతో కొంత బంగారం రూపంలో పొదుపు చేసుకోవడం, పెట్టుబడిగా దాచుకోవడం అనాదిగా వస్తోంది. ఆడపిల్ల ఇంట్లో ఉందంటే బిడ్డ భవిష్యత్, పెళ్లి కోసం బంగారం కూడబెట్టడం భారతీయ కుటుంబాల్లో తొలి ప్రాధాన్యత. అంతేనా.. పండగైనా, వేడుకైనా నలుగురిలో ఆభరణాలు జిగేల్‌మనాల్సిందే. స్థాయిని చూపించుకోవడానికీ ఒక సాధనమైంది. తరతరాలుగా కుటుంబంలో భాగమైన ఈ పుత్తడి ఇప్పుడు అందనంత దూరం పరుగెడుతోంది. బంగారం ఇప్పుడు ప్రియమైంది. అందరూ ఊహించినట్టుగానే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర పన్నులు కలుపుకొని రూ.లక్ష దాటింది.ఈ పరుగు ఇప్పట్లో ఆగదంటోంది బులియన్ మార్కెట్. పరిస్థితులూ ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు ధరలు అమాంతం పెరగడంతో భారతీయ వినియోగ దారులు వివాహాలు, ఇతర శుభకార్యాలకు గతంతో పోలిస్తే ఆచితూచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు బంగారు వర్తకులు చెబుతున్నారు. అయితే ఆభరణాలతో పోలిస్తే బంగారు కడ్డీలు, నాణేల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. - నూగూరి మహేందర్ ఎందుకీ పరిస్థితి?ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అంతర్జాతీయ పరిణామాలు బంగారానికి చుట్టుకున్నాయి. డాలర్ విలువ పడిపోవడం, అమెరికా–చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరి ఆర్థిక మాంద్యం భయాలు రేకెత్తించడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అమెరికా డాలర్ విలువ తగ్గింది. అమెరికా ట్రెజరీలు భారీగా అమ్ముడుపోతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, బంగారం ఆధారిత ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుదల కూడా 2025లో పుత్తడి ర్యాలీకి మద్దతిచ్చాయి.గరిష్టాలూ గరిష్టమే..పసిడి 2024లో 40కిపైగా సందర్భాల్లో ఆల్‌టైమ్ హై ధర నమోదు చేసింది. 2025లో 23 సార్లు గరిష్టాలను తాకింది. దీంతో గరిష్టాలు గరిష్ట స్థాయిలో నమోదు కావడం విశేషం. ఔన్స్ ధర 2,650 డాలర్లతో 2025 సంవత్సరం ప్రారంభమైంది. సంప్రదాయ పరిణామాలకు విరుద్ధంగా 2024లో డాలర్ ఇండెక్స్ పెరిగి ఈక్విటీ మార్కెట్లు బాగా పనిచేసినప్పటికీ బంగారం ధర దాదాపు 28% అధికం కావడం గమనార్హం. అమెరికా డాలర్, భారత రూపాయి, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, యూరో, బ్రిటిష్ పౌండ్, కెనడియన్ డాలర్, ఆ్రస్టేలియన్ డాలర్ సహా అన్ని ప్రధాన కరెన్సీలలో బంగారం ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. అంతర్జాతీయంగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం ధర 2025 మార్చి 14న 3,000 డాలర్లు తాకి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఔన్స్ పసిడి రేటు 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు పట్టింది. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది. వినియోగంలో మనం ఎక్కడంటే..⇒ 2024 నాటికి భారతీయుల వద్ద పుత్తడి నిల్వలు – 25,000 టన్నులు ⇒ ప్రపంచ మొత్తం పరిమాణంలో భారతీయుల వద్ద ఉన్న పసిడి – 11.56 శాతం ⇒ యూఎస్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉంది. రూపాయి బలపడటంతో ఉపశమనమే..డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఫిబ్రవరి 10న రూ.87.95 తాకి ఆల్ టైమ్ గరిష్టం నమోదు చేసింది. రూపాయి అదే స్థాయిలో ఉన్నా, మరింత బలహీనపడ్డా భారత్‌లో ఈపాటికే గోల్డ్ రేట్ రూ.లక్ష దాటేది. కొద్ది రోజులుగా డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి బలపడుతుండటం కాస్త ఉపశమనం కలిగించే అంశం. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.85.38గా నమోదైంది. ఇక 2025 జనవరి 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78 వేలకు అటుఇటుగా పలికింది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ధర రూ.18.75 మాత్రమే.ప్రత్యామ్నాయం వైపు కొనుగోలుదారుల చూపు..సంప్రదాయంగా భారతీయ కొనుగోలుదారులు పెట్టుబడికి విలువ, ఆకట్టుకునేలా ఉండేలా 22 క్యారెట్లతో తయారైన బంగారు ఆభరణాలను ఇష్టపడతారు. అయితే పెరుగుతున్న ధరలు వారిని ప్రత్యామ్నాయాలను అన్వేషించేలా చేశాయి. ఆకర్షించే రూపు, సరసమైన ధర రెండింటినీ అందించే క్లిష్ట, తేలికైన డిజైన్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో 18, 14 క్యారట్ల ఆభరణాలు ఇప్పుడు ప్రజాదరణ పొందుతున్నాయి. తక్కువ బరువుతో సంప్రదాయ డిజైన్లను ఆభరణాల తయారీదారులు రూపొందించడానికి తయారీ సాంకేతికతలో వచి్చన పురోగతి వీలు కల్పించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. 22 క్యారెట్లతో తయారు చేసిన ఆభరణాల్లో 91.67% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 18 క్యారెట్లు అయితే 75% స్వచ్ఛమైన బంగారం, 25% ఇతర లోహాలు ఉంటాయి. 22 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 18 క్యారెట్లతో తయారైన ఆభరణం ధర దాదాపు ఐదో వంతు తక్కువగా ఉంటుంది. తక్కువ ధర, ఎక్కువ మన్నిక కారణంగా 18 క్యారెట్ల ఆభరణాలకు డిమాండ్ క్రమంగా ఊపందుకుంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా రెండేళ్ల క్రితం కేవలం 5–7% ఉండగా ఇప్పుడు 15% కంటే ఎక్కువగా పెరిగిందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెల్లడించింది.ఆభరణాల్లో మనమే ఫస్ట్..భారత్‌లో ఏటా 10 లక్షలకుగా వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లకే ఏటా 300–400 టన్నుల పసిడి అమ్ముడవుతుందని కళ్యాణ్ జువెల్లర్స్ అంటోంది. దీపావళి, అక్షయ తృతీయ వంటి శుభదినాల్లో హిందువులు పసిడిని కొనుక్కుంటున్నారు. చైనాలోనూ అంతే. పెళ్లిళ్లు, బిడ్డ పుట్టిన నెలరోజులకు జరిపే వేడుక, ఇతర ముఖ్య సందర్భాల్లో ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. చైనాలో అత్యధికులు టియోచు సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం వరుడి కుటుంబం వధువు కోసం నెక్లెస్, గాజులు, చెవి కమ్మలు, ఉంగరాన్ని కొనుగోలు చేస్తారు. చైనాను మించి ప్రపంచంలో అత్యధికంగా 2024లో భారతీయ వినియోగదార్లు 560 టన్నుల ఆభరణాలను అందుకున్నారు. 510 టన్నులతో చైనా రెండవ స్థానంలో ఉంది. గత ఏడాది భారతీయులు 240 టన్నుల గోల్డ్ బార్స్, కాయిన్స్‌ను కొనుగోలు చేస్తే చైనా వాసుల విషయంలో ఇది 345 టన్నులు ఉంది.పెట్టుబడిగా బంగారం..సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లను మినహాయిస్తే ప్రపంచ పసిడి డిమాండ్‌లో ఇండోనేసియా, వియత్నాం సహా ఆసియా వాటా ఏకంగా 64.5 శాతానికి చేరుకుంది. అయితే పెట్టుబడి స్వేచ్ఛ సూచికలో ఆసియా దేశాలు ప్రధానంగా భారత్, చైనా పేలవంగా ఉన్నాయి. భారతీయ కుటుంబాల్లో 6 శాతం కంటే తక్కువ సంపద ఈక్విటీల్లో, 15 శాతం బంగారంలో పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో చైనీయులు బంగారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఏటా 1–2 శాతం వడ్డీ ఇచ్చే డిపాజిట్లకు బదులు చైనీయులు చిన్నమొత్తంలో పసిడిని దక్కించుకుంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ బాటలో పెట్టుబడిగా ముడి బంగారాన్ని కొంటున్నారు. ఎగుమతులు డీలా..భారత్ నుంచి 2024–25లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 11.72 శాతం క్షీణించి రూ. 2,43,390 కోట్లకు చేరాయి. అలాగే దిగుమతులు 11.96 శాతం తగ్గి రూ.1,67,384 కోట్లుగా ఉన్నాయి. యూఎస్, చైనా మార్కెట్లు నిదానించడం, ప్రపంచంలో పలు ప్రాంతాల్లో యుద్ధాలు, రష్యా తవ్విన వజ్రాలపై ఆంక్షలు, చవకగా లభించే ల్యాబ్ తయారీ వజ్రాలు వెరసి రెండేళ్లుగా దేశం నుంచి ఎగుమతులు తగ్గడానికి కారణం అయ్యాయి. విదేశాలకు సరఫరా అయిన రత్నాలు, ఆభరణాల్లో యూఎస్ వాటా ఏకంగా 30.4 శాతం ఉంది. అయితే అమెరికా భారీ సుంకాలను ప్రకటించిన తర్వాత ఎగుమతుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో అతిపెద్ద మార్కెట్‌ను ప్రభావితం చేసే కొత్త సుంకాలు.. డైమండ్ కటింగ్, ఆభరణాల తయారీలో ప్రపంచంలో ముందంజలో ఉన్న భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని అడ్డుకుంటాయని భావిస్తున్నారు.ఎస్‌జీబీల మాటేమిటి?భారత్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకం (ఎస్జీబీ) 2015 నవంబర్‌లో ప్రారంభం అయింది. పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్ బాండ్స్ జారీ అయ్యాయి. ప్రస్తుత ధరల వద్ద బకాయి ఉన్న సావరిన్ గోల్డ్ బాండ్లను రిడీమ్ చేయాలంటే ప్రభుత్వం సుమారు రూ. 1.3 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 7 విడతల బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించింది. 8వ విడతకు ముందస్తు రిడెమ్షన్ కూడా ఆఫర్ చేసింది. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది. పెరుగుతున్న బాధ్యతను సమతౌల్యం చేయడానికి ప్రభుత్వం గోల్డ్ రిజర్వ్ ఫండ్ (జీఆర్ఎఫ్)ను సృష్టించింది. 2023–24లో ఈ నిధిలో రూ. 3,552 కోట్లు జమ చేసింది. దీన్ని 2024–25 సవరించిన బడ్జెట్లో రూ. 28,605 కోట్లకు పెంచింది. గోల్డ్ బాండ్స్ కింద ఇన్వెస్టర్లకు 2024–25 చివరి నాటికి చెల్లించాల్సిన మొత్తం రూ. 85,000 కోట్లకు చేరుకుంటుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. పసిడి దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం లేకపోగా దూసుకుపోతున్న పుత్తడి ధరలతో ఖజానాపై ఆర్థిక భారం పడింది. దీంతో పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అందం, గుర్తింపు వ్యక్తీకరణ..రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత జీడీపీకి 7% సమకూరుస్తోంది. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ మార్కెట్ విలువ దేశంలో సుమారు రూ.6,82,960–7,25,645 కోట్లు ఉంది. 2035 నాటికి ఇది రూ.19,20,825 కోట్లకు చేరుకుంటుందని అంచనా. సంప్రదాయికంగా ఆభరణాలు ఒక పెట్టుబడి. ఇప్పుడు ఇది అందం, గుర్తింపు వ్యక్తీకరణ. ఈ మార్పు అన్ని వయసుల వారికీ వర్తిస్తుంది. భిన్న డిజైన్లు కోరుకుంటున్నప్పటికీ యువ వినియోగదారులు ఆభరణాలపట్ల మొగ్గు చూపుతున్నారు. - సందీప్ కోహ్లీ సీఈవో, ఇంద్రియ, ఆదిత్య బిర్లా జువెలరీ బంగారం ధర పెరుగుదలకు నిపుణులు చెబుతున్న కారణాలు....: వాణిజ్య సుంకాలు :..సుంకాల కారణంగా ప్రపంచమార్కెట్లు తీవ్ర అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ ప్రకటించిన 90 రోజుల విరామం, ఆ తర్వాత ఏవైనా పరిణామాలు బంగారాన్ని సురక్షిత స్వర్గధామంగా ఆకర్షణీయంగా ఉంచుతాయి. అమెరికా–చైనాప్రతీకార చర్యలు ఇప్పటికే స్వల్పకాలంలో డిమాండ్‌ను పెంచుతున్నాయి...: సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోళ్లు :..కేంద్ర బ్యాంకులు దశాబ్దాలుగా స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మూడేళ్లలో ఇవి ఏటా 1,000 టన్నులకుపైగా సమకూర్చుకున్నాయి. మార్చి 2025లో వరుసగా 5వ నెలలోనూ చైనా బలమైన బంగారం కొనుగోళ్లను నివేదించింది...: స్టాగ్ఫ్లేషన్ ఆందోళనలు :..తాజా యూఎస్ ఫెడ్ పాలసీ మినిట్స్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్టాగ్ఫ్లేషన్ వైపు మళ్లవచ్చనే ఆందోళనలను సూచిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధి, అధిక నిరుద్యోగితను స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం మెరుగైన పనితీరు కనబరుస్తుంది...: చైనా ఈటీఎఫ్ పెట్టుబడులు :..చైనా గోల్డ్ ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయిలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025లోనూ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 2024 నుంచి అంతర్జాతీయంగా ఈటీఎఫ్ పెట్టుబడులు పెరుగుతున్నాయి...: ఫెడ్ రేటు కోతలు :..యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 2025లో మరో రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది బంగారం ధరల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది. ..: స్థిరమైన పనితీరు :..2000 నుంచి 2025 వరకు బంగారం రెండుసార్లు మినహా అన్ని సందర్భాల్లోనూ అనుకూల రాబడిని అందించింది...: భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు :..రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ పతనం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ అశాంతి వరకు భౌగోళిక రాజకీయ అనిశ్చితి బంగారం డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి...: కరెన్సీ హెచ్చుతగ్గులు :..డాలర్ సూచిక మూడేళ్ల కనిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. స్విస్ ఫ్రాంక్, జపనీస్ యెన్, యూరోలతో పోలిస్తే తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ కరెన్సీలలో బంగారం చౌకగా మారింది...: పెరుగుతున్న రుణ స్థాయిలు :..2024 నవంబర్‌లో యూఎస్ జాతీయ రుణం రికార్డు స్థాయిలో 36 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఈ రుణాన్ని ఎలా నిర్వహిస్తారనే దానిపై పెరుగుతున్న ఆందోళనలతో బంగారం సహజ హెడ్జ్‌గా మారింది. ప్రపంచ రుణం కూడా పెరిగింది. ..: మార్కెట్ అస్థిరత :..2025లో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అస్థిరత పెరిగింది. పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలు దెబ్బతిన్నాయి.వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక అనిశి్చతులు, డాలర్ బలహీనపడడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు మద్దతునిచ్చాయి. ఈ ఏడాది బంగారం ఇప్పటికే 25 శాతానికి పైగా పెరిగింది. ఏప్రిల్ 2 సుంకాలపై ప్రకటన తర్వాత నుంచి చూసినా 6 శాతం పెరిగింది.- సతీష్ కోటక్ మహీంద్రా ఏఎంసీ ఫండ్ మేనేజర్ ఈటీఎఫ్ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల డిమాండ్ పెరిగింది.భారత్‌లో రానున్న పండుగల సీజన్‌నుదృష్టిలో పెట్టుకుని చూస్తే బంగారానికి అదనపు మద్దతు లభించనుంది. సుంకాలకు సంబంధించి అనిశ్చితి, యూఎస్ డాలర్ బలహీనత, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతుండడం బంగారం ధరల ర్యాలీకి తోడ్పడుతోంది. – జేఎం ఫైనాన్షియల్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్

‘జైల్లో ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఆస్వాదించండి’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన ఓ ప్రభుత్వ అధికారిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ‘జైల్లో ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఆస్వాదించండి..’ అని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కార అప్పీళ్లను కొట్టివేసేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించటాన్ని సవాల్ చేస్తూ ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఇదీ నేపథ్యం..2013 డిసెంబరు 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ నాడు తహసీల్దార్‌గా ఉన్న అధికారి 2014 జనవరిలో గుంటూరు జిల్లాలో గుడిసెలను బలవంతంగా తొలగించారంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి.. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆ అధికారికి రెండు నెలల జైలు శిక్ష విధించారు. దీనిపై జోక్యం చేసుకునేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించటాన్ని సవాల్ చేస్తూ ఆ అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.అధికారులు చట్టానికి అతీతులమని భావించొద్దు..మురికి వాడలను కూల్చివేయొద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి 80 మంది పోలీసులను తీసుకెళ్లారా? అని సుప్రీం కోర్టులో తాజా విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయస్థానం ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే తక్షణమే అరెస్టు చేస్తామని హెచ్చరించింది. “ఆయన ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? అమరావతి, విజయవాడ, తీహార్‌లో ఏదో ఒక జైలు ఎంపిక చేసుకొనేందుకు అవకాశం ఇస్తాం. అధికారులు తాము చట్టానికి అతీతులమని భావించరాదు.. ‘ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.‘చట్టాన్ని గౌరవించని వారికి ఎలాంటి మినహాయింపు లేదు. హైకోర్టు వారించినప్పటికీ మురికివాడలను ఎలా కూల్చివేశారు?’ అని జస్టిస్ గవాయ్ సదరు అధికారిని నిలదీశారు. కేవలం మందలించడం మాత్రమే కాకుండా హైకోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు సదరు అధికారిని డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి మళ్లీ తహసీల్దార్ స్థాయికి తగ్గించే విషయాన్ని తెలియచేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి సుప్రీం సూచించింది.సంబంధిత అధికారి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ డైరెక్టర్‌గా ఉన్న పిటిషనర్‌కు ఇద్దరు పిల్లలున్నారని, జైలులో ఉంటే ఉద్యోగం పోతుందని కోర్టుకు నివేదించారు. దీనిపై మండిపడ్డ జస్టిస్ గవాయ్ ధర్మాసనం... సదరు అధికారి కూలగొట్టిన ఇళ్లలో ఉంటున్న పిల్లల సంగతేమిటని ప్రశ్నించింది. ఆ అధికారి జైలులో ప్రభుత్వ ఆతిథ్యాన్ని పొందాలని లేదా కూల్చివేతలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు భారీగా పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం అప్పటి వరకు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.

వాణిజ్య బంధం బలోపేతంపైనే దృష్టి
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఆదేశాలతో అమెరికా ప్రభుత్వం భారత్‌పై సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ట్రంప్‌కు కుడిభుజం, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా హస్తనకు విచ్చేసిన వాన్స్ సోమవారం సాయంత్రం ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. సతీమణి ఉషా చిలుకూరి, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి 7, లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని మోదీ అధికారిక నివాసానికి వాన్స్ విచ్చేశారు. అక్కడ వీళ్ల కుటుంబానికి మోదీ సాదర స్వాగతం పలికారు. స్వయంగా కారు దాకా వచ్చిన మోదీ.. వాన్స్ కారు దిగి దగ్గరకు రాగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వాన్స్ వెంట వచ్చిన కుమారులిద్దరినీ సరదాగా పలకరించారు. వారిని పరిచయం చేసుకున్నారు. కుమార్తె మీరాబెల్ను ఎత్తుకుని వచ్చిన ఉషా చిలుకూరితో మోదీ కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేశారు. తర్వాత చిన్నారులను చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. తొలుత వాన్స్ కుటుంసభ్యులందరికీ ఇంటి గార్డెన్‌ను మోదీ స్వయంగా చూపించారు. నెమళ్లు స్వేచ్ఛగా విహరిస్తున్న పచ్చికబయళ్లలో కుటుంబంతో కలిసి మోదీ కలియతిరిగారు. తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి గ్రూప్ ఫొటో దిగారు. తర్వాత నెమలి ఈకలను ముగ్గురు చిన్నారులకు ఇచ్చి వారితో ముచ్చటించారు. మీద కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. వాన్స్ చిన్నకుమారుడు వివేక్ మోదీ తరహా డ్రెస్, పెద్దబ్బాయి ఇవాన్ సూట్ ధరించారు. ఒప్పందం పురోగతిపై సంతృప్తితర్వాత మోదీ, వాన్స్‌లు విడిగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాలకు ప్రయోజనకారి అయిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఒప్పందం పురోగతిపై మోదీ, వాన్స్‌లు సంతృప్తి వ్యక్తంచేశారు. వీలైనంత త్వరగా ఒప్పందం ఓ కొలిక్కి వచ్చేలా చూడటంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికత రంగాల్లో మరింత సహకారంపైనా చర్చలు జరిపారు. త్వరలో భారత్‌లో పర్యటించాలని భావిస్తున్నందుకు ట్రంప్‌కు తన తరఫున కృతజ్ఞతలు తెలపాలని వాన్స్‌తో మోదీ చెప్పారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాల్లో పురోగతి సాధించంపై ఇరు దేశాల నేతలు సమగ్ర స్థాయిలో చర్చలు జరిపారని భేటీ ముగిశాక సోమవారం రాత్రి భారత్ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ ఫిబ్రవరిలో ట్రంప్‌తో భేటీ, ఫలవంతమైన చర్చల వివరాలను వాన్స్ వద్ద మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాటి చర్చలు ఇరు దేశాల మధ్య సహకారానికి బాటలు వేశాయి. అటు మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్‌కు, ఇటు వికసిత్ భారత్ 2047 సుసాధ్యానికి మార్గం సుగమం చేశాయి. ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి దోహదపడే దైపాక్షిక వాణిజ్యం ఒప్పందం(బీటీఏ) పురోగతిపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తంచేశారు. టారిఫ్‌లు, ఇరుదేశాల మార్కెట్లలోకి సులభంగా ప్రవేశించడం తదితర కీలకాంశాలు బీటీఏలు ఉండనున్నాయి. పరస్పర ప్రయోజనకర అంశాలతోపాటు అంతర్జాతీయ సమకాలీన అంశాలూ మోదీ, వాన్స్‌ల భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. సమస్యాత్మక అంతర్జాతీయ అంశాల్లో దౌత్యం, సంప్రతింపులే పరిష్కార మార్గాలని నేతలు భావించారు. భారత్‌లో ఉన్నన్ని రోజులు వాన్స్, ఉషా, వాళ్ల చిన్నారులు ఎంతో ఆహ్లాదంతో గడపాలని మోదీ ఆకాంక్షించారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాని ముఖ్య కార్యదర్శి శక్తికాంతదాస్ పాల్గొన్నారు. 12 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2013లో నాటి ఉపాధ్యక్ష హోదాలో జోబైడెన్ ఢిల్లీకి వచ్చారు.
ఎన్ఆర్ఐ

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
వరంగల్ క్రైం: ములుగు జిల్లా వెంకటాపూర్ (కె) మండల కేంద్రానికి చెందిన ‘చేయూత’స్వచ్ఛంద సంస్థ కార్యకర్త చేడం సాయి ప్రకాశ్(30)ను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సాయి ప్రకాశ్ ఈనెల 15న వెంకటాపూర్ నుంచి హనుమకొండకు తన బంధువులను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత తన ఆచూకీ తెలియకపోవడంతో ఈనెల 16, 17 తేదీల్లో వెతికిన అనంతరం 18న బంధువులు హనుమకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సాయిప్రకాశ్ హనుమకొండకు వచ్చిన ఆస్పత్రి, ఆ తరువాత వెళ్లిన దృశ్యాలను సీసీ టీవీ ఫుటేజీల ద్వారా పరిశీలించారు. తన ఫోన్ ద్వారా ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికి వివరాలు రాకపోవడంతో ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు కరీంనగర్లో హత్య చేసినట్లు తెలిసింది. దీంతో సాయి ప్రకాశ్‌కు ఎవరితో శతృత్వం ఉందనే కోణంలో విచారణ చేపట్టడంతో నిందితుల సమాచారం తెలిసినట్లు తెలిసింది. నిందితుల్లో కానిస్టేబుల్? సాయి ప్రకాశ్ హత్య సంఘటనలో పాల్గొన్న నిందితుల్లో ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. హనుమకొండలో సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసి కరీంనగర్లో హత్య చేసినట్లు గుర్తించారు. ఈ హత్యకు గతంలో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఓ కానిస్టేబుల్ ప్రధాన కారణమని తెలిసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో కలిసి ప్రకాష్‌ను సుపారీ గ్యాంగ్‌తో పిన్ని నిర్మల హత్య చేయించింది. కానిస్టేబుల్ వివాహేతర సంబంధం విషయంలో సాయి ప్రకాష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. దానిని మనస్సులో పెట్టుకుని సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు తెలిసింది.

Domalguda: నీటి సంపులో యువతి అస్తిపంజరం
కవాడిగూడ(హైదరాబాద్): లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్‌లోని నీటి సంపులో గుర్తుతెలియని యువతి అస్తిపంజరం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచి్చన ఈ ఘటన ఆదివారం దోమల గూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. డీఆర్ఆర్మిల్స్ 40 ఏళ్ల క్రితమే మూతపడింది. సెక్యురిటీ సిబ్బంది ఆదివారం సాయంత్రం మూత్ర విసర్జన కోసం పురాతన భవనం వైపు వెళ్లాడు. అనంతరం నీటి కోసం 3వ అంతస్తులో ఉన్న సంపు మూత తెరిచి చూడగా యువతి మృత దేహం కనిపించింది. దీంతో అతను వెంటనే దోమల గూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి సంపులో పడవేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మృత దేహం పూర్తిగా కుళ్లిపోవడంతో నీటి సంపును పగల గొట్టారు. క్లుస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు సదరు యువతిని ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తీసుకెళ్లలేని పరిస్థితి ఉండటంతో గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్ సిబ్బందిని రప్పించి సోమవారం మధ్యాహ్నం అక్కడే పోస్టు మార్టం నిర్వహించారు. దోమల గూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ నిరంజన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఫేస్‘బుక్కై’పోయాడు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో సుదీర్ఘ కాలం తర్వాత మరో కస్టమ్స్ ఫ్రాడ్ కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన నేరగాడు కస్టమ్స్ అధికారుల పేరు చెప్పి రూ.1.55 లక్షలు కాజేశాడు. దీనిపై బాధితుడి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి దాదాపు రెండు నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమెరికాలో ఉంటున్న సర్జన్ హెన్రీ రాబర్ట్ అంటూ ప్రొఫైల్ ఉండటంతో నగరవాసి యాక్సప్ట్ చేశాడు. ఆపై వాట్సాప్ కాల్స్ చేసిన రాబర్ట్ నగరవాసితో పరిచయం పెంచుకుని స్నేహం చేశాడు. తాను త్వరలోనే భారత్‌కు వస్తున్నానని, హైదరాబాద్ వచ్చి కలుస్తానని చెప్పాడు. పూర్తిగా నమ్మించేందుకు డమ్మీ ఫ్లైట్ టిక్కెట్స్ ఫొటోలను పంపాడు. కొన్ని రోజులకు బాధితుడికి కాల్ చేసిన రాబర్ట్ తాను ముంబై విమానాశ్రయంలో దిగానని, తన వద్ద లెక్కలు చెప్పని 1.2 లక్షల డాలర్లు ఉన్నాయని నమ్మించాడు. దీంతో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారన్న రాబర్ట్ పన్ను చెల్లించకపోతే నగదుతో పాటు తన లగేజీ సైతం జప్తు చేస్తారని చెప్పాడు. ఆపై ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారిగా మాట్లాడిన మరో వ్యక్తి రాబర్ట్ రూ.1.55 లక్షలు పన్ను చెల్లించాలని చెప్పాడు. తాను బయటకు వచ్చాక ఆ మొత్తం ఇచ్చేస్తాంటూ రాబర్ట్ చెప్పంతో నమ్మిన నగర వాసి ఆ మొత్తం వాళ్లు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశాడు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో నిందితుడి అరెస్టు... నగరానికి చెందిన బాధితుడి (68) నుంచి ఏళ్ల బాధితుడి నుంచి ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.52,29,500 కాజేసిన కేసులో ఓ నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్‌మీడియా ద్వారా బాధితుడికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు 5పైసా క్యాపిటల్ లిమిటెడ్, బార్క్లేస్, షాండా క్యాపిటల్ గ్రూప్ లిమిటెడ్‌ల్లో పెట్టుబడుల పేరు చెప్పారు. ఓ టెలిగ్రాం గ్రూపులో సభ్యుడిగా చేర్చి ప్రియా అగర్వాల్, గౌరవ్ ముంజాల్ పేర్లతో ఇరువురు సలహాలు సూచనలు ఇచ్చారు. తాము చెప్పినట్లు పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ నిండా ముంచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఘజియాబాద్‌కు చెందిన ప్రతీఖ్ శుక్లాను అరెస్టు చేశారు. అతడిపై దేశ వ్యాప్తంగా తొమ్మిది కేసులు ఉన్నట్లు గుర్తించారు.

Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
కాచిగూడ(హైదరాబాద్): వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో పారిశ్రామికవేత్త హేమ్రాజ్ (62), అతడి భార్య మీనా దుగ్గర్ (59) నివాసముంటున్నారు. కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే హేమరాజ్ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచి్చంది. దీంతో అతను స్నేహితుడి ఇంటికి వచ్చి తలుపు కొట్టడంతో మత్తులో ఉన్న హేమ్రాజ్ డోర్ తీశాడు. భార్య మీనా పూర్తిగా మత్తులోకి జారుకుంది. దీనిని గుర్తించిన అతను వారిని హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించాడు. ప్రస్తుతం హేమ్రాజ్ స్పృహలో ఉన్నాడని, అతని భార్య ఇంకా స్పృహలోకి రాలేదని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఈస్ట్‌జోన్ డీసీపీ, అడిషనల్ డీపీసీ, కాచిగూడ డిఐ, ఎస్ఐ పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. నాలుగు టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


YSRCP సోషల్ మీడియా కన్వీనర్ గోపిపై దాడి


మా జగనన్న నిర్ణయం వల్లే నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యావ్


ఊరూపేరు లేని ఉర్సా సంస్థకు 60 ఎకరాలు


జపాన్ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ


డెల్టా విమానం ఇంజిన్ లో ఎగసిపడిన మంటలు


Inter Results: నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల


కూటమి పాలనలో దళితులపై దాడులు


Tadepalli: టపాసుల మోత.. అభిమాన నాయకుడికి ఘనస్వాగతం


వెడ్డింగ్ ఈవెంట్స్ చేసేవాళ్లు అసలు గాయకులే కాదు : కీరవాణి


తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట రోడ్డు ప్రమాదం