
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసలు మంత్రే కాదని, ఆయన ఒక బ్రోకర్ అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీనివాస్‌గౌడ్ చరిత్ర టైం వచ్చినప్పుడు బయటపెడతానని తెలిపారు. మంత్రులందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, కాంగ్రెస్‌ని విమర్శిస్తే సహించేది లేదని జగ్గారెడ్డి హెచ్చరించారు.