
సాక్షి, గుంటూరు : నగరంలోని కింగ్ హోటల్ సెంటర్ శివారు నుంచి ప్రజాసంకల్పయాత్ర 128వ రోజును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అక్కడి నుంచి బుడంపాడు చేరుకుని ప్రజలతో మమేకం అవుతారు. అనంతరం సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కళాశాల, నారాకోడూరుల మీదుగా వేజెండ్ల వరకూ పాదయాత్ర కొనసాగుతుంది.
కాగా, ద్విగ్విజయంగా కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో దారి పొడవునా ప్రజలు వైఎస్ జగన్‌తో తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. తమను ఆదుకుని భవిష్యత్‌పై భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.