
సాక్షి, నర్సారావుపేట : ‘అనగనగనగా.. ఒక దొంగ ఉన్నాడు. అతను దొంగతనానికి వెళ్లి.. అడ్డగోలుగా తప్పుడు పనులు చేస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ప్రజలు, వ్యవస్థలు ఆ దొంగను ప్రశ్నించాయి. దానికి ఆ దొంగ.. ‘నన్ను అరెస్టు చేస్తే..పోయేది మన ఊరి పరువే’నని అన్నాడట. అంతేకాదు.. ‘నన్ను అరెస్టుచేస్తే.. మన ఊరిని, మన ప్రజల్ని బలహీన పర్చినట్టు అవుతుందని’ అని చెప్పాడట. ఈ మాటలు వింటే అచ్చం చంద్రబాబు మాటలు వింటున్నట్టు గుర్తుకు రావడం లేదు. తనను బలహీనపరిస్తే.. రాష్ట్రాన్ని బలహీనపర్చినట్టు అంటూ చంద్రబాబు బుకాయిస్తున్నారు. తనను బలహీన పరిస్తే.. తెలుగు ప్రజలను బలహీనపర్చినట్టు ఆయన చెప్పుకొస్తున్నారు. తప్పు చేసినా చంద్రబాబును ఎవరూ దండించకూడదంటూ ఇంత అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు’ అంటూ చంద్రబాబు నిజస్వరూపాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. తప్పులు, మోసాలు, అన్యాయాలు, అవినీతి నిస్సిగ్గుగా చేస్తున్న చంద్రబాబు.. తనను బలహీనపరిస్తే.. రాష్ట్రం బలహీనపడినట్టు బూటకపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ఈ మాదిరిగా తప్పులు, మోసాలు, అన్యాయాలు, అవినీతి చేయమని ఏ ప్రజలు చెప్పారు నీకు చంద్రబాబూ’ అని ఆయన నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
- అయ్యా చంద్రబాబూ.. ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టుమని ఏ ప్రజలు చెప్పారు నీకు?
- హోదాకు బదులు అబద్ధపు, మోసపు ప్యాకేజీ తీసుకోవాలని ఏ ప్రజలు చెప్పారు నీకు?
- తెలుగువారిని ఆత్మగౌరవాన్ని అమ్మేయమని చెప్పి.. ఏ ప్రజలు చెప్పారు నీకు?
- అయ్యా చంద్రబాబూ.. ఓట్లకోసం, పదవుల కోసం అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి.. అడ్డంగా దొరికిపోమ్మని ఏ ప్రజలు చెప్పారు నీకు?
- రైతుల్ని పీడించి.. వారి భూముల్ని లాక్కోమని ఏ ప్రజలు చెప్పారు నీకు?
- అయ్యా చంద్రబాబూ.. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం మీ చేతుల్లోకి తీసుకోమ్మని ఏ ప్రజలు చెప్పారు ?
- ఇరిగేషన్ ప్రాజక్టుల్టలో అంచనాలు పెంచి అడ్డంగా దోచుకోమ్మని ఏ ప్రజలు చెప్పారు నీకు?
- అయ్యా చంద్రబాబూ.. ఇసుక నుంచి మట్టి దాక మట్టి నుంచి బొగ్గు దాకా.. మద్యం, రాజధాని భూములు, గుడిభూముల దాక మేయమని ఏ ప్రజలు చెప్పారు నీకు?
- 23మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని 20 కోట్లు, 30 కోట్లు అడ్డగోలుగా ఇస్తూ.. సంతలో పశువులను కొన్నట్టు కొనమని ఏ ప్రజలు చెప్పారు నీకు?
- అయ్యా చంద్రబాబూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించవద్దని చెప్పి ఏ ప్రజలు చెప్పారు నీకు?
- రుణమాఫీ పేరుతో రైతుల్ని, మహిళల్ని మోసం చేయమని ఏ ప్రజలు చెప్పారు నీకు?
- ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని చెప్పి.. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. ఆ తర్వాత మోసం చేయమని ఏ ప్రజలు చెప్పారు నీకు?
- ఫీజు రీయింబర్స్‌మెట్, ఆరోగ్యశ్రీ పథకాలను నీరుగార్చమని ఏ ప్రజలు చెప్పారు నీకు?
- ఎన్నికలప్పుడు బెల్టూ షాపులు తీసేస్తామని చెప్పి.. ఇప్పుడు మద్యం ఏరులై పారించమని ఏ ప్రజలు చెప్పారు నీకు?
- ఎవరు చెప్పారని చంద్రబాబు ఇవన్నీ చేశారు
- తన స్వార్థప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బాబు తాకట్టు పెట్టారు
- ఇలాంటి వ్యక్తిని మనం క్షమించకూడదు
- అబద్ధాలు, మోసం చేసేవారని బంగాళాఖాతంలో కలిపేయాలి
- అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత వస్తుంది
- విశ్వసనీయత రావాలంటే జగన్ ఒక్కడి వల్లే కాదు
- జగన్‌కు మీ అందరి తోడు కావాలి, ఆశీస్సులు కావాలి
- అప్పుడు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాసంక్షేమం కోసం నవరత్నాలను తీసుకొస్తాం
- నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్నినింపుతాం
- ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదవాలి
- ఇంజినీరింగ్ చదవాలంటే లక్షలు లక్షలు ఫీజులు ఉన్నాయి.
- ఉన్నత చదువులు చదివే పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లిస్తాం.
- విద్యార్థుల ఖర్చుల కోసం ఏటా రూ. 20వేల చొప్పున అందజేస్తాం.
- బడికి వెళ్లే పిల్లలకు ఏటా రూ. 15వేలు ఇస్తాం