
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ (రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ) చైర్మన్ పదవికి ప్రొఫెసర్ కోదండరాం రాజీనామా చేయనున్నారు. శనివారం సాయంత్రం గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద చైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆయన తెలిపారు. మరో వైపు ఆదివారం సూరూర్‌నగర్ స్టేడియంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ జరుగనుంది.
ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను కోదండరాం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమరులను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. మార్పుకోసమే రాజకీయ పార్టీ స్థాపించినట్టు ఆయన స్పష్టం చేశారు. కాగా రేపు జరిగే ఆవిర్భావ సభలో కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్ష భాద్యతలను చేపట్టనున్నారు.