Top Stories
ప్రధాన వార్తలు

సింహాచలం ఘటన: బాబూ.. ఇదేం వక్రబుద్ధి.. భక్తుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం ప్రమాద బాధితులకు పరిహారంలోనూ సీఎం చంద్రబాబు తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. బాధితులకు పరిహారం సింహాచలం దేవస్థానం నుంచి చెల్లించారను. చనిపోయిన ఒక్కొక్కరికి 25 లక్షలు, గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం అందించగా, మొత్తంగా కోటి 78 లక్షల రూపాయలు దేవస్థానం నుంచి చెల్లింపు చేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దేవాలయ అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను బాధితులకు ఇవ్వడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహార విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సిన పరిహారాన్ని సింహాచలం దేవస్థానం నుంచి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సింహాచలం ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. చివరికి సింహాచలం ప్రమాదంపై ఉద్యోగులే బలయ్యారు. కూటమి ప్రజా ప్రతినిధులందరూ సేఫ్‌గా బయటపడ్డారు.ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, కూటమి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. ఈవో సహా మరో ఆరుగురు ఇంజనీరింగ్ సిబ్బందిపై వేటు వేయడానికి నిర్ణియించింది. ఇంజనీరింగ్ సిబ్బందిలో కాంట్రాక్ట్ ఉద్యోగిపైన చర్యలకు సిద్ధమైంది. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు కోవడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. కూటమి నాయకులను తప్పించి అధికారులను బలి పశువుల చేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే కమిటీ నివేదిక ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
ఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు కొనసాగుతున్నాయి. వరుసగా 12వ రోజు కాల్పుల విరమణ ఒప్పందం పాకిస్తాన్ ఉల్లంఘించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కశ్మీర్లో 8 సెక్టార్లలో పాక్ సైన్యం సోమవారం విచ్చలవిడి కాల్పులకు దిగింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కవ్వింపుల చర్యలకు దీటుగా బదులిచ్చినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతి చర్యల్లో భాగంగా సింధూ జల ఒప్పందాన్ని పక్కన పెడుతూ ఏప్రిల్ 24న కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆ వెంటనే నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం ఆగడాలు మొదలయ్యాయి.యుద్ధ సన్నద్ధత కోసం సరిహద్దు రాష్ట్రాలలో రేపు మాక్ డ్రిల్ చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లడక్ రాష్ట్రాలకు సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని సరిహద్దు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం . సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలని అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.కాగా, సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించిన పాకిస్తాన్ జాతీయుడిని అరెస్ట్ చేసినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అతడి నుంచి పాక్ కరెన్సీని, గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు.గుజ్రన్ వాలాకు చెందిన మహ్మద్ హుస్నైన్‌గా గుర్తించిన అతడు ప్రస్తుతం పంజాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. పహల్గాం ఘటన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చ రిల్లిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది.

కుంభకోణం కనికట్టు.. బాబే మద్యం సామ్రాట్టు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలుపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన ట్రేడ్‌మార్కు డైవర్షన్ కుట్రకు మరింత పదును పెడుతుండగా... అందుకు ఎల్లో మీడియా కోరస్ పాడుతూ కుట్ర కథను రక్తి కట్టించేందుకు యతి్నస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతున్న పరిణామాలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో అభూత కల్పనలు చేరుస్తూ.. కస్టడీలో చెప్పని అంశాలను చెప్పినట్లుగా చిత్రీకరిస్తూ ఎల్లోమీడియా ద్వారా దు్రష్పచారానికి తెగబడుతున్నారు. అసలు జరగని స్కామ్‌లో కుట్రపూరితంగా ఇరికించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అధికారంలోకి వచి్చనప్పటి నుంచి దీన్ని వైఎస్సార్ సీపీకి ఆపాదించేందుకు శతవిధాలా ప్రయతి్నస్తున్న టీడీపీ కూటమి సర్కారు కక్షగట్టి బెదిరిస్తూ అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ అక్రమ కేసు దర్యాప్తును మొదట సీఐడీకి అప్పగించిన చంద్రబాబు సర్కారు.. మూడు నెలలు విచారణ అనంతరం సీఐడీ చేతులెత్తేయడంతో సిట్ ఏర్పాటుతో కొత్త పన్నాగానికి తెరతీసింది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. సిట్ వేధింపులపై డిస్టిలరీల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారిని ఇంటి వద్దే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. రిమాండ్ రిపోర్టుల పేరుతో అభూత కల్పనలు సృష్టించడం, కస్టడీలో చెప్పని విషయాలను చెప్పినట్లుగా ఎల్లో మీడియాకు లీకులివ్వడం సిట్ బరితెగింపునకు పరాకాష్ట. ఏది నిజం ?ఓవైపు కొత్త డిస్టిలరీలకు పచ్చజెండా ఊపి.. తమవారికే దుకాణాలు కట్టబెట్టి.. బెల్టు షాపులకు గేట్లెత్తి.. ఇలా మద్యంలో అన్నివిధాల అడ్డగోలు దోపిడీ దందాకు దన్నుగా నిలుస్తూ.. మరోవైపు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వీరంగం వేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. దీనికోసం వీర విధేయ అధికారులతో సిట్ వేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది. రిమాండ్ రిపోర్టుల పేరుతో కట్టు కథలు అల్లుతోంది.మద్యం దందాకు మార్గాలుగా ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. బెల్ట్ దుకాణాలు తొలగించింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. కొత్తగా ఒక్క డిస్టిలరీకి, మద్యం బ్రాండ్లకు అనుమతినివ్వని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే. మద్యం అమ్మకాలను తగ్గించి దశలవారీ మద్యం నియంత్రణ విధానాన్నిసమర్థంగా అమలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మరి మద్యం అమ్మకాలు తగ్గిస్తే కమీషన్లు ఎందుకు ఇస్తారు... ఇవ్వరు కదా అన్నది ఎవర్ని అడిగినా ఠక్కున చెప్పే సమాధానమే. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేయడం కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రేనన్నది సుస్పష్టం. అందుకే పాలుకు పాలు నీళ్లకు నీళ్లుగా ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రభుత్వ మద్యం విధానాలపై సహేతుక విశ్లేషణ ఇదీ...కుంభకోణం కాదు ఇదీ అసలు కోణం ఎవరి పాలనలో ఏం జరిగిందో నిగ్గు తేల్చేదే ఈ కథనంసిండికేటు కడితే స్కామా? ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా?2014–19 మధ్యన, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల సిండికేట్ నెలకొంది. తమ పార్టీ నేతలకే దుకాణాల లైసెన్సులు కేటాయించారు. మద్యంలో లంచాలు తీసుకోవాలి అని అనుకుంటేనే ప్రైవేటు దుకాణాలు కేటాయిస్తారు. ఇక అప్పుడూ ఇప్పుడూ భారీగా అమ్మకాల టార్గెట్ ఉండనే ఉంది. 2014–19 మధ్యన చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజును తగ్గించారు. ఈ సమయంలో ప్రభుత్వ హయాంలో 4,380 ప్రైవేటు దుకాణాలు, వీటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4,380 పర్మిట్ రూమ్‌లు ఉండేవి. నాడు 43 వేల బెల్ట్ దుకాణాలు కూడా నడిచాయి. గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటు మద్యం సిండికేట్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. టీడీపీ కూటమి నేతలకే 3,394 దుకాణాలను కేటాయించింది. 55 వేల నుంచి 60 వేల బెల్ట్ దుకాణాల ద్వారా మద్యం ఏరులై పారిస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 2,934 దుకాణాల ద్వారా అమ్మకాలు సాగించింది. నిర్దిష్ట వేళలతో అమ్మకాలను కూడా కట్టడి చేసింది. పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. బెల్టు షాపులు అనే మాటే లేకుండా చేసి దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట వేసింది.రూ.120ది నాసిరకమా? రూ.99 నాసిరకమావైఎస్సార్‌సీపీ ప్రభుత్వలో క్వార్టర్ బాటిల్‌కు రూ.120 కనీస ధరగా ఉంటేనే నాసిరకం మద్యం అని టీడీపీ దుష్ప్రచారం చేసింది. అందుకోసం చెన్నైకు చెందిన ఓ ల్యాబ్ పేరుతో తప్పుడు నివేదికను ప్రచారంలోకి తెచ్చింది. కానీ, అలాంటి నివేదికను తాము ఇవ్వలేదని ఆ ల్యాబ్ ఖండించింది. ఇక ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలో రూ.99కే క్వార్టర్ బాటిల్ విక్రయిస్తున్నారు.క్వార్టర్ రూ.99కే వచ్చేది నాసిరకం మద్యమా? రూ.120కి అమ్మేది నాసిరకం మద్యమా??వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నడిపితే స్కాం అంటున్నారు..? మరి నాడు, నేడు రాష్ట్రమంతా టీడీపీ నాయకులు సిండికేటు కట్టి దుకాణాలు నడిపిస్తున్నారు. టీడీపీ నేతలకు దుకాణాలు, బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌ల తలుపులు బార్లా తెరిచిన చంద్రబాబు పాలనలో స్కాంలకు అవకాశం ఉందా? ఇవేవీ లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కుంభకోణానికి ఆస్కారం ఉందా?అమ్మకాలు తగ్గిస్తే కమీషన్లు వస్తాయా? పెరిగితే వస్తాయా??మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే అంతగా కమీషన్లు వస్తాయి. అదే టీడీపీ విధానంగానూ మారింది. అందుకనే 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం మద్యం విక్రయాలను విపరీతంగా ప్రోత్సహించింది. 2019 తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను తగ్గించింది. దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. ధరలను షాక్ కొట్టేలా పెంచి మద్యపానాన్ని నిరుత్సాహపరిచింది.మరి ఎవరి హయాంలో స్కాంలకు అవకాశం ఉంటుంది. లావాదేవీలు పెరిగి.. డబ్బు చేతులు మారే చంద్రబాబు ప్రభుత్వంలోనే కదా?పాపాల పుట్టలు డిస్టిలరీలు పుట్టింది ఎవరి పాలనలో...?మద్యం విధానంలో అవినీతి, దోపిడీ అంతా డిస్టిలరీల మసుగులోనే సాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే గతంలో అనుమతినిచ్చింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. ఇక టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, దివంగత డీకే ఆదికేశవులు కుటుంబాలకే డిస్టిలరీలు కేటాయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు.కాగా, డిస్టిలరీలకు మద్యం తయారీ కోసం లైసెన్సులు జారీ చేసి.. బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లు ఎంప్యానెల్ జాబితాలో 14 డిస్టిలరీలను చేర్చింది చంద్రబాబు ప్రభుత్వమే.డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలవే అయితే అవినీతికి పాల్పడిందీ వారే అవుతారు కదా..? మరి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసే కదా??బెల్టు షాపులు లేకుండా చేస్తే స్కాం ఎలా?అసలు డిస్టిలరీలు ఎప్పుడు కమీషన్లు ఇస్తాయన్నది కీలకం. మద్యం అమ్మకాలు పెరిగినకొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. కాబట్టి విక్రయాలు పెంచితే ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014–19లో మద్యం అమ్మకాలు భారీగా సాగగా... అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019–24లో అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వ పెద్దలకే అన్నది సుస్పష్టం.ఊరూపేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టింది ఎవరు?మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న మరో మాట ఊరూపేరూ లేని బ్రాండ్లు. అసలు ఇలాంటి బ్రాండ్లను ప్రవేశపెట్టడమే దోపిడీకి కారణమైతే ఆ అవినీతి పాపం కచ్చితంగా చంద్రబాబుదే. ఎందుకంటే 2014–19 మధ్యన రాష్ట్రంలో ఎన్నడూ వినిపించని దాదాపు 200 బ్రాండ్లను తెచ్చారు చంద్రబాబు. అందులో కొన్నిటి పేర్లు... ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, లెజెండ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ, హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా, రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్, బీరా 91, టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్.తమవారికి దోచించి ఎవరు?2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొన్నారు. సి–టెల్ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి మరీ దందా సాగించారు. ఆ విషయాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ నివేదికే వెల్లడించింది కూడా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. లోపభూ యిష్టమైన సి–టెల్‌సాఫ్ట్‌వేర్‌ను తొలగించింది. సగటున ప్రతి డిస్టిలరీకీ 5 శాతం నుంచి 10% ఆర్డర్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరించింది.సగంపైగా మద్యం కొనుగోలు జరిగిన చంద్రబాబు జమానాలో అవినీతి ఉంటుందా..? అందరికీ ఆర్డర్లు వచ్చేలా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవినీతి చోటుచేసుకుంటుందా??‘ప్రివిలేజ్’గా సిండికేట్‌తో ఖజానాకు గండి కొట్టింది ఎవరు?మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఆ ఫీజును గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేస్తే ఖజానాకు గండి పడుతుంది. సీఎం హోదాలో నోట్ ఫైళ్లపై సంతకాల సాక్షిగా ఆ నిర్వాకం చంద్రబాబుదే. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ 2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ పన్నును రద్దు చేశారు చంద్రబాబు. తద్వారా టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించారు. ఇలా నాలుగేళ్లలోనే రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క చీకటి జీవోను కూడా జారీ చేయనేలేదు.ఈ లెక్కన ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టింది ఎవరు? తమవారికి అడ్డగోలుగా దోచిపెట్టింది ఎవరు? ఎవరిపై కేసు నమోదు చేయాలి??నాడు... కుంభకోణం బహిర్గతంనేడు.. లేని కుంభకోణం ఉన్నట్టు చూపే కుతంత్రం2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో కుంభకోణానికి తెగించారు. డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బార్లు, బెల్ట్ దుకాణాలు, ప్రివిలేజ్ ఫీజు మాఫీ.. ఇలా అన్నీ అందులో భాగమే. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కూడా దీనిని స్పష్టం చేసింది. 2023లో కేసు నమోదు చేసిన సీఐడీ పూర్తి ఆధారాలతో అవినీతి నిగ్గు తేల్చి చంద్రబాబు ముఠాపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగనే లేదు. కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. బెల్ట్ దుకాణాలు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఇలా అవినీతికి కారణమయ్యే అన్ని మూలాలను సమూలంగా రూపుమాపారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రే .చట్టాన్ని సిట్ ఉల్లంఘిస్తోంది!?డిస్టిలరీల నుంచి కమీషన్లు వసూలు చేశారు అంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతోంది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతగా వేధిస్తున్నా డిస్టిలరీల ప్రతినిధులు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరిని సిట్ అధికారులు కిడ్నాప్ చేసి మరీ తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని పోలీసు శైలిలో హింసించారు. దానిపై డిస్టిలరీల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్ కుట్ర బయటపడింది. రెడ్‌బుక్ కక్ష సాధింపుతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసుతో వేధిస్తోందన్నది స్పష్టమైంది.విచారణ పేరుతో సిట్ అధికారులు తమను వేధిస్తున్నారంటూ, బలవంతంగా విజయవాడ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారని, వయో వృద్ధులమైన తాము శారీరకంగా తీవ్ర అవస్థలు పడుతున్నామని డిస్టలరీల ప్రతినిధులు హైకోర్టులో మొర పెట్టుకున్నారు. వీరి పిటిషన్లపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. సిట్ అధికారులకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. డిస్టిలరీల ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన అనంతరం వారి నివాసాలలోనే విచారించాలని ఆదేశించింది.నిజంగా స్కాం జరిగితే బెదిరింపులు ఎందుకు?బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్, అనూష తదితరులను సిట్ రోజుల తరబడి వేధించి, బాధించి అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించింది. డిస్టిలరీల ప్రతినిధులను బెంబేలెత్తించి లొంగదీసుకుంది. ఇక కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరుతో సిట్ అధికారులే వాంగ్మూలం రాసేసుకున్నారు. దానిపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. ఇతర నిందితులు, సాక్షులు చెప్పని విషయాలను కూడా చెప్పినట్టు సిట్ అబద్దపు వాంగ్మూలాలు నమోదు చేస్తోంది.అసలు జరగని మద్యం కుంభకోణంలో.. పొలిటికల్ బాస్‌ల ఆదేశాలకు అనుగుణంగా సిట్ పనిచేస్తోందా? నిజంగానే స్కాం జరిగితే ఈ వేధింపులు ఎందుకు? అంటే కేసులో బలం లేదు కాబట్టే టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచార కుట్రలకు పాల్పడుతోంది.ఏది స్కాం..? ఎందుకిస్తారు లంచాలు?⇒ మద్యం అమ్మకాలు కోట్ల కేసుల కొద్దీ పెరిగింది టీడీపీ హయాంలోనే..! –మరి మద్యాన్ని ఎక్కువగా అమ్మించినందుకు వారికే కదా లంచాలు రావాల్సింది? వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు పడిపోయాయి (పట్టిక చూడండి). మరి విక్రయాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా?⇒ టీడీపీ గత ప్రభుత్వంలో, ప్రస్తుతం కూడా మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. ..అవి కూడా టీడీపీవారికి సంబంధించినవే. బెల్టు షాపులూ ఊరూరా వెలిశాయి.⇒ మరి..ప్రైవేటుగా మద్యం విక్రయిస్తే స్కాంకు అవకాశం ఉంటుందా..? లేక నేరుగా ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే స్కాం జరుగుతుందా?⇒ తెల్లవారుతూనే తూగేలా చేస్తూ.. అర్ధరాత్రి దాకా ఎక్కువ సమయం అమ్మకాలు సాగించేలా చూస్తే లంచాలు ఇస్తారా?⇒ విక్రయ వేళలను కుదించేసి, అమ్మకాలను పరిమితం చేస్తే లంచాలు ఇస్తారా?⇒ ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకాణాలను పెంచితే లంచాలకు అవకాశం ఉంటుందా? వాటికి తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా..? మరి దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా?.. బెల్టు షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ ఎంపిక చేసుకున్న 4–5 డిస్టిలరీలకు మాత్రమే ఆర్డర్లలో 53 శాతం వరకు ఇస్తే లంచాలు ఇస్తారా? మద్యంపై తక్కువ ట్సాక్స్‌తో ఎక్కువ అమ్మకాలు చేసేలా మేలు చేస్తే లంచాలు వస్తాయా?⇒ మరి..అన్ని డిస్టిలరీలకు సమానంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014–19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? ట్యాక్స్‌లు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా?⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక శాతం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? ⇒ లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు ఇస్తారా..?మద్యం వ్యవహారంలో ఎక్కడైనా అక్రమం ఎలా జరుగుతుంది?..ఎడాపెడా డిస్టిలరీలకు అనుమతులిచ్చే విధానపరమైన లోపాలతోనే! ..అమ్మకాల్లో ఎప్పుడైనా అవకతవకలకు ఎలా ఆస్కారం ఏర్పడుతుంది?..తమవారికే షాపులు దక్కేలా ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటేనే!అందులోనూ నిలువు దోపిడీ ఎలా చోటుచేసుకుంటుంది?...ఊరూరా బెల్టు షాపులతో ప్రజలను మత్తులో ఊగేలా చేస్తేనే!ఎవరైనా అధర్మంగా జేబులు నింపుకొనేందుకు ఎలా వీలు కలుగుతుంది?...సాక్షాత్తు ముఖ్య స్థానాల్లో ఉన్నవారే అవినీతికి తెగిస్తేనే!మరి ఇవన్నీ జరిగింది ఎవరి హయాంలో..? చంద్రబాబు ప్రభుత్వంలోనా.. వైఎస్సార్సీపీ హయాంలోనా?

మితవాదానికి మరో ఓటమి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గమనించుకుంటున్నారో లేదో గానీ ప్రపంచంలో ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఆయన చర్చనీయాంశం అవుతున్నారు. గెలుపోటముల్ని ప్రభావితం చేస్తున్నారు. ఇటీవల కెనడా ఎన్నికల్లో ట్రంప్ పట్ల మెతకగా వ్యవహరించిన కన్సర్వేటివ్‌లు ఓటమిపాలై, ఊహించని రీతిలో అధికార లిబరల్ పార్టీ గెలుపొందింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అదే జరిగింది. అచ్చం ట్రంప్ విధానాలనే అనుకరిస్తూ ఆస్ట్రేలియా ఎన్నికల్లో తిరుగులేని గెలుపు సాధించాలనుకున్న విపక్ష కన్సర్వేటివ్ పార్టీ అపజయాన్ని మూటకట్టుకోవటమే కాదు... ఆ పార్టీ గెలిస్తే ప్రధాని అవుతారనుకున్న నాయకుడు పీటర్ డటన్ సైతం ఓటమి పాలయ్యారు. 2004 తర్వాత వరసగా రెండోసారి కూడా అధికారం నిలబెట్టుకున్న పార్టీగా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ చరిత్ర సృష్టించింది. ఇక సింగపూర్‌లో ఎప్పటిలా పద్నాలుగోసారి సైతం అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) తిరిగి అధికారంలోకి రావటం వింతేమీ కాదుగానీ... ఆ పార్టీ నేత, ప్రధాని లారెన్స్ వాంగ్ ప్రచారసభల్లో ట్రంప్‌పై రణభేరి మోగించారు. అమెరికా విధించిన సుంకా లకు ప్రతీకార సుంకాలుంటాయని ప్రకటించారు. అసలు అమెరికాకు సింగపూర్ నుంచి ఎగుమతులు చేసేదే లేదని స్పష్టం చేశారు. 97 స్థానాలున్న సభలో ఆ పార్టీ 87 స్థానాలు గెల్చుకోవటం గతంలో కూడా జరిగినా ఈసారి వోటు శాతాన్ని సైతం 66.57కి పెంచుకుని చరిత్ర సృష్టించింది. ఇక రుమేనియాలో మాత్రం ట్రంప్‌ను తలకెత్తుకున్న తీవ్ర మితవాదపక్షం అలయెన్స్ ఫర్ ది యూనిటీ ఆఫ్ రుమేనియన్స్ (ఏయూఆర్) నాయకుడు జార్జి సైమన్ తొలి రౌండ్లో గెలుపొందారు. ఈ నెల 18న జరగబోయే రెండో రౌండ్ ఎన్నికల్లో సైతం ఆయనదే విజయమన్న అంచనాలున్నాయి. వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగబోయే నార్వేలో కూడా ట్రంప్ ప్రభావం కనబడుతోంది. అక్కడి అధి కార లేబర్ పార్టీకి ఓటమి తప్పదని జనవరిలో వివిధ సర్వేలు ప్రకటించగా, ఆ మరుసటి నెలకల్లా అంతా మారిపోయింది. ఇప్పుడు లేబర్ పార్టీయే గెలుపుగుర్రంగా కనబడుతోంది.కరోనా దాపురించినప్పటి నుంచీ ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా మూడేళ్లుగా ఆ దేశంలో ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతింది. ద్రవ్యోల్బణం పెరిగింది. దాన్ని తగ్గించటానికి ఆస్ట్రేలియా రిజర్వ్‌బ్యాంక్ 13 సార్లు వడ్డీరేట్లు పెంచింది. ఫలితం లేకపోగా అధిక ధరల కారణంగా కొనుగోళ్లు ఆగిపోయి గృహనిర్మాణ రంగం పడకేసింది. వీటన్నిటి వల్ల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఇవన్నీ చూసి తదుపరి ఎన్నికల్లో తమదే విజయమని కన్సర్వే టివ్ పార్టీ కలలుగంది. అమెరికాలో ట్రంప్‌కు పెరుగుతున్న మద్దతు చూసి అదే తరహా ప్రకటనలు చేసి ఆ పార్టీ నాయకుడు డటన్ మొదట్లో వోటర్ల మెప్పు పొందినమాట వాస్తవం. ప్రభుత్వ రంగంలో 40,000 ఉద్యోగాలు రద్దుచేస్తామని, వలసల విషయంలో కఠినంగా వుంటామని, ఉదార వాద విధానాలైన భిన్నత్వం, అందరినీ కలుపుకొనిపోవటం వగైరాలకు కాలం చెల్లిందని ఆయన పదే పదే ప్రకటించారు. ఆస్ట్రేలియా మొదటి నుంచీ అమెరికా మిత్ర దేశమే. అయినా ట్రంప్ ఏమాత్రం కనికరించలేదు. అందరితోపాటు ఆస్ట్రేలియాపైనా భారీయెత్తున సుంకాలు పెంచుతా మని ప్రకటించారు. ఇవింకా అమల్లోకి రాకపోయినా అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం కారణంగా అసలే అంతంతమాత్రంగా వున్న ఆర్థిక వ్యవస్థ మరింత అనిశ్చితిలోకి పోయింది. ఈ దశలో డటన్ తనకు ట్రంప్‌తో వున్న వ్యక్తిగత సాన్నిహిత్యం వల్ల ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థను సునాయాసంగా గట్టెక్కిస్తానని హామీ ఇచ్చారు. కానీ ట్రంప్ దూకుడు కారణంగా స్టాక్ మార్కెట్లన్నీ బోల్తా కొట్టడంతో డటన్‌కు దిక్కుతోచలేదు. దాంతో ట్రంప్ ప్రస్తావన మానుకున్నారు. కానీ అప్పటికే జరగా ల్సిన నష్టం జరిగిపోయింది. జనం లేబర్ పార్టీకే వోటేయాలన్న నిర్ణయానికొచ్చారు. సింగపూర్ సైతం ఆర్థిక అస్థిరతలో కొట్టుమిట్టాడుతోంది. అసలే వాణిజ్యం దెబ్బతిని వుండగా ట్రంప్ అధిక సుంకాల ప్రకటన మరింత దెబ్బ తీసింది. ఆస్ట్రేలియా మాదిరే ఆ దేశంలోనూ పౌరులకు సొంతిళ్లు సమకూర్చుకోవటం సమస్యగా మారింది. పెరిగిన ద్రవ్యోల్బణం, ఆర్థికమాంద్యం, ఉద్యో గాలు కోల్పోతామన్న భయాందోళనలు ప్రజల్ని వణికిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంచనాల కన్నా జీడీపీ చాలా తగ్గి 3.8 శాతానికొచ్చింది. వచ్చే త్రైమాసికంలో అది 2 శాతం మించక పోవచ్చు. ట్రంప్ సుంకాల బెదిరింపు సరేసరి. అందుకే ఈ అనిశ్చితిలో పాలకపక్షాన్నే మరోసారి గెలిపించటం ఉత్తమమన్న నిర్ణయానికొచ్చారు. కనుకనే పీఏపీ వోట్ల శాతం 61.2 నుంచి 65.67కి పెరి గింది. సింగపూర్ ఎన్నికల్ని విదేశీ మదుపుదార్లు, అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల ప్రభుత్వాలు శ్రద్ధగా గమనించాయి. ఈ అయిదేళ్లూ సింగపూర్ ఎదుర్కొన్న సమస్యలు అలాంటివి మరి.ఏతావతా ఇప్పటికి ఒక్క రుమేనియా మినహాయించి ట్రంప్‌ను చూసి వాతలు పెట్టుకుంటున్న నాయకులంతా ఊహించని ఓటమితో ఖంగుతింటున్నారు. నిరుడంతా మితవాద పక్షాలు ఎక్కడి కక్కడ విజయం సాధించగా, ప్రస్తుతం ఆ పక్షాలకు ఎదురుగాలి వీస్తోంది. అయితే గెలిచిన పక్షాలు చుట్టుముడుతున్న ఆర్థిక సంక్షోభాలకు ఎదురీదటం, జనం మెప్పు పొందటం అంత సులభమేమీ కాదు. ప్రపంచంతోపాటే మనమూ అని ఈ సంక్షోభాల్ని సరిపెట్టుకునే పరిస్థితుల్లో వారు లేరు. కనుక సమస్యలకు దీటైన పరిష్కారాలు కనుగొనటానికి గద్దెనెక్కిన నాయకులు ప్రయత్నించాల్సి వుంది. వారి మాటెలావున్నా ప్రపంచమంతటా తన కారణంగా మితవాద పక్షాలు బోల్తా కొట్టడాన్ని చూసైనా ట్రంప్ తన విధానాలను మార్చుకుంటారా, లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. సంఘంలో గౌరవమర్యాదలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.నవమి ప.12.03 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: మఖ రా.6.58 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ఉ.6.31 నుండి 8.11 వరకు, తదుపరి రా.3.25 నుండి 5.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.49 నుండి 11.33 వరకు, అమృత ఘడియలు: సా.4.02 నుండి 6.10 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.36, సూర్యాస్తమయం: 6.17. మేషం....నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.వృషభం...సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు. స్వల్ప అనారోగ్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.మిథునం.....కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.కర్కాటకం...వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. దైవచింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.సింహం....పనులు సాఫీగా సాగుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.కన్య....పనులలో జాప్యం. దైవదర్శనాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.తుల....పనులు అనుకున్న రీతిలో పూర్తి. అందరిలోనూ మీమాటే నెగ్గుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.వృశ్చికం....పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.ధనుస్సు.......మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ప్రయాణాలలో స్వల్ప మార్పులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.మకరం.....ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. స్వల్ప రుగ్మతలు. ప్రయాణాలు వాయిదా. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించవు.కుంభం...వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.మీనం....కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

చిరంజీవితో సినిమా.. భారీగా డిమాండ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్!
సినీ పరిశ్రమలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న హీరోయిన్లే ఎక్కువ. కానీ ఈ రోజుల్లో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చి ఎండింగే లేదంటున్న హీరోయిన్లు ఉండడం విశేషమే. అలాంటి అతి తక్కువ మంది కథానాయికల్లో నయనతార ఒకరు. వరుసగా విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్‌కు ఒకటి రెండు ఫ్లాప్‌లు ఎదురైతే కేరీర్ తలకిందులవుతుంది. అలాంటిది నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయింది.ఆ మధ్య ఈమె నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం అన్నపూరిణి నిరాశ పరిచింది. ఇటీవల కథానాయకిగా నటించిన టెస్ట్ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించలేక పోయింది. మరో పక్క పెళ్లి, భర్త, ఇద్దరు కవల పిల్లలు అంటూ సంసార జీవితం. అయినా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అయితే ఈమె తొలి సారిగా బాలీవుడ్లో షారుఖ్‌ఖాన్‌తో జంటగా నటించిన జవాన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ఆ చిత్రానికి రూ.12 కోట్లు వరకూ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.అయితే తమిళ చిత్రాలకు అంత మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారా అంటే సందేహమే. అలాంటిది తాజాగా ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఏకంగా రూ.18 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. తెలుగులో చిరంజీవికి జంటగా ఒక భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని.. అందులో నటించడానికి నయనతార రూ.18 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆ చిత్ర నిర్మాతల వర్గం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇదే కనుక నిజం అయితే దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనతార పేరు నిలిచిపోతుంది. ఇకపోతే ఈమె ఇంతకు ముందు చిరంజీవితో సైరా, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

రే(హీ)టెక్కిన 'కరెంట్ కుంభకోణం'
సాక్షి, అమరావతి: అసలే చీకటి ఒప్పందం.. ఆపై అడ్డగోలు సమర్థన! విద్యుత్తు చట్టం 2003 సెక్షన్ 108 పేరుతో ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని బెదిరించి చీకటి ఒప్పందానికి సర్కారు ఆమోద ముద్ర!! యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై అడ్డంగా దొరికిపోవడంతో కూటమి సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ నుంచి కారుచౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకుంటే రూ.లక్ష కోట్ల భారమంటూ కూటమి నేతలు, దాని అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. ఇప్పుడు ఏకంగా యూనిట్ రూ.4.60 చొప్పున కొనేందుకు సిద్ధమై అది చాలా గొప్ప పని అంటూ నిస్సిగ్గుగా సమర్ధించుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. యాక్సిస్ పవన–సౌర హైబ్రీడ్ ప్రాజెక్టు నుంచి 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఏపీఎస్పీడీసీఎల్ పాతికేళ్ల పాటు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు పీపీఏ చేసుకోవడం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందాలను రద్దు చేయగా, నాడు ఏపీఈఆర్సీ సైతం తిరస్కరించిన ఒప్పందాన్ని కూటమి సర్కారు మళ్లీ తెరపైకి తెచ్చి 108 సెక్షన్ పేరుతో బెదిరించి ఆమోదింపచేసుకుంది. ఈ అడ్డగోలు ఒప్పందాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. యాక్సిస్‌తో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్షాలు, మేధావులు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ చార్జీల బాదుడును రద్దు చేయాలని, యాక్సిస్ తదితర బడా కంపెనీలతో కుదుర్చుకున్న అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సోమవారం ప్రజాభేరి కార్యక్రమంలో సంతకాలను సేకరించారు. తక్కువ ధరకే రిలయన్స్ ‘బీబీబీ’.. యాక్సిస్ ఎనర్జీతో అధిక ధరకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమరి్ధంచుకునేందుకు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రయతి్నంచారు. అది హైబ్రీడ్ పైలట్ ప్రాజెక్టు అని.. బండ్లింగ్, బ్యాలెన్సింగ్, బ్యాంకింగ్ (బీబీబీ) విధానంలో ఏర్పాటవుతున్న తొలి ప్రాజెక్టు కాబట్టి ఆ మేరకు ధర కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ సెకీ నిర్వహించిన వేలంలో 930 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పి యూనిట్ రూ.3.53 చొప్పున అందించేందుకు రిలయన్స్ పవర్ ముందుకొచి్చంది. ఇదే బీబీబీ విధానంలో రోజూ నాలుగు గంటల పాటు పీక్ అవర్స్‌లో విద్యుత్‌ను ఇస్తామని రిలయన్స్ చెప్పింది. అయినప్పటికీ తక్కువ ధరకు అందించే రిలయన్స్‌ను కాదని యూనిట్ రూ.4.60కి యాక్సిస్ నుంచే తీసుకోవడానికి కారణం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ‘సెకీ’ విద్యుత్‌పై ‘ఎల్లో’ మీడియా దు్రష్పచారం.. రైతులకు పగటి పూట 9 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు కేంద్ర సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కారుచౌకగా యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేసేలా గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ప్రతిపాదన సెకీ నుంచే వచి్చంది. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పిచింది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు దు్రష్పచారానికి పాల్పడ్డాయి. ఈ కుట్రలన్నిటినీ ఏపీఈఆర్సీ పటాపంచలు చేసింది. సెకీతో ఒప్పందం సక్రమమేనని మండలి తేల్చి చెప్పింది. ఇప్పుడు యాక్సిస్‌కు భారీ ధర చెల్లిస్తూ టీడీపీ కూటమి సర్కారు చేసుకున్న ఒప్పందంపై ఎల్లో మీడియా కిమ్మనకపోవడం గమనార్హం.

MI Vs GT: సమఉజ్జీల సమరం
ముంబై: ఐపీఎల్ 18వ సీజన్లో వరుస విజయాలతో విజృంభిస్తున్న ముంబై ఇండియన్స్ జుట్టు గుజరాత్ టైటాన్స్‌తో పోరుకు సిద్ధమైంది. ఆరంభంలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లోనే నెగ్గిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు చేరువైంది. మరోవైపు 10 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లతో ఉన్న గుజరాత్ కూడా ‘ప్లే ఆఫ్స్’ బెర్తు ఖరారు చేసుకోవాలని తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో సమ ఉజ్జీల మధ్య మంగళవారం వాంఖడే వేదికగా కీలక పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. అయితే ఆలస్యంగా రేసులోకి వచి్చన ఐదుసార్లు చాంపియన్ ముంబై... గత ఆరు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం ముంబైకి కొండంత బలం కాగా... రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా సూర్యకుమార్ 67.86 సగటుతో 475 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. తిలక్ వర్మ, విల్ జాక్స్, నమన్ ధీర్‌తో ముంబై బ్యాటింగ్ బలంగా ఉండగా... బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, కరణ్ శర్మ కీలకం కానున్నారు. ఈ సీజన్లో పాండ్యా బౌలింగ్‌లో 13 వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తో 157 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. సాంట్నర్ అందుబాటులో లేకుంటే అతడి స్థానంలో కార్బిన్ బాష్ బరిలోకి దిగొచ్చు. మరోవైపు గుజరాత్ కూడా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. టాప్–3 ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ భీకర ఫామ్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్ 50.40 సగటుతో 504 పరుగులు చేయగా... జోస్ బట్లర్ 78.33 సగటుతో 470, గిల్ 51.67 సగటుతో 465 పరుగులు చేశారు. ఈ సీజన్లో గుజరాత్ జైత్రయాత్రకు ఈ ముగ్గురే ప్రధాన కారణం కాగా... వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా రూపంలో టైటాన్స్‌కు నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. నిషేధం అనంతరం రబడ తిరిగి అందుబాటులోకి రాగా... ఈ మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడా లేదా చూడాలి. బౌలింగ్‌లో ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, సాయి కిషోర్, రషీద్ ఖాన్ కీలకం కానున్నారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రసిధ్ కృష్ణ 19 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా... సిరాజ్ 14, సాయి కిషోర్ 12 వికెట్లు తీశారు. తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హార్దిక్ (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, నమన్ ధీర్, కార్బిన్ బాష్/సాంట్నర్, దీపక్, బౌల్ట్, బుమ్రా, కరణ్ శర్మ. గుజరాత్ టైటాన్స్: గిల్ (కెపె్టన్), సాయి సుదర్శన్, బట్లర్, సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కోట్జీ, సాయి కిషోర్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్, ఇషాంత్ శర్మ/రబడ.

ఆర్బీఐ ఖజానాలో పసిడి మెరుపులు
ముంబై: పసిడిపై ఆర్బీఐ మోజు కొనసాగుతూనే ఉంది. గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 25 టన్నుల పసిడిని ఆర్బీఐ కొనుగోలు చేయగా.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 57 టన్నుల బంగారాన్ని అదనంగా సమకూర్చుకుంది. దీంతో ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు మార్చి నాటికి 879.59 టన్నులకు చేరినట్టు అధికారిక డేటా తెలియజేస్తోంది. ఈ కాలంలో పసిడి ధరలు 30 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. గత ఏడేళ్లలోనే ఆర్బీఐ అత్యధికంగా పసిడిని గత ఆర్థిక సంవత్సరంలోనే కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిపోయిన తరుణంలో సురక్షిత సాధనమైన బంగారానికి ఆర్బీఐ ప్రాధాన్యం పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఆర్బీఐ పసిడి నిల్వల్లో 512 టన్నులు స్థానిక ఖజానాల్లో ఉంటే, 348.62 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద, మరో 18.98 టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆర్బీఐ తన బంగారం నిల్వల్లో కొంత మొత్తాన్ని స్థానిక ఖజానాలకు మళ్లించడం గమనార్హం. 2024 మార్చి నాటికి స్థానిక నిల్వలు 408 టన్నులే కాగా, గత సెప్టెంబర్ నాటికి 510.46 టన్నులకు పెంచుకుంది. ఫారెక్స్ నిల్వల్లో 11.70 శాతం.. ఇక విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్) బంగారం వాటా 2024 మార్చి నాటికి 9.32% కాగా, 2025 మార్చి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ఇక 2024 సెప్టెంబర్ నాటికి 706 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉంటే, ఈ ఏడాది మార్చి నాటికి 668.33 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇవి 10.5 నెలల దిగుమతుల అవసరాలకు సరిపోతాయి.

ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రోజు నేను అమెరికాలో ఉన్నాను. సాధారణంగా నేను టెలివిజన్ వార్తలు చూడను, కానీ ఈ మారణహోమం మాతృభూమిలో జరుగుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఉండవలసి వచ్చింది. మూడు దశాబ్దాలుగా నా రిపోర్టింగ్ బీట్ కూడా ఇదే. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న 26 మంది కశ్మీర్ పర్యాటకులను ఘోరంగా చంపిన ఘటనపై ఆదుర్దాతో నేను హోటల్లో టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికలు వెతికాను.‘ఘర్షణ’గా మాత్రమే చూపారు!నిజానికి ఈ అనాగరిక దాడి జరిగిన రోజు అమెరికా ఉపాధ్య క్షుడు జె.డి. వాన్ ్స భారతదేశంలోనే ఉన్నారు కాబట్టి దాడిపై అమెరి కన్ మీడియా ఆసక్తి చూపించాల్సి ఉంది. పైగా, ఉగ్రవాదులు తమ ప్రణాళికను వాన్ ్స రాకకు ముందే ముగించారు. వారి ఆ కార్యా చరణను 25 ఏళ్ల నాటి పూర్వఘటన నుండి తీసుకున్నారు. 2000లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఢిల్లీలో అడుగు పెట్టినప్పుడు కశ్మీర్ లోయలోని చిట్టిసింగ్‌పురా గ్రామంలో 36 మంది సిక్కులను ఉగ్రవాదులు ఊచకోత కోశారు. అప్పటిలాగే ఇప్పుడు కూడా, కశ్మీర్ సమస్యపై మరింతగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ఉగ్ర వాదుల లక్ష్యం. కానీ ఆ సమయంలోనే జరిగిన ఒక ప్రముఖ ఘటన కారణంగా భారత్‌లో ఉగ్రదాడిపై అమెరికా దృష్టి దాదాపుగా కను మరుగై పోయింది. ఆశ్చర్యకరంగా, అమెరికా నెట్‌వర్క్‌లలో అందు బాటులో ఉన్నదంతా పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం గురించి గంటల తరబడి కార్యక్రమాలు మాత్రమే. కొన్ని వార్తా పత్రికలలో ఉగ్రదాడిపై నివేదికలు లోపలి పేజీలలో క్లుప్తంగా ఉన్నాయి. ఈ దాడి ఘటనను అమెరికన్ మీడియా దాదాపుగా ఒక సాధారణ భద్రతకు సంబంధించిన ‘ఘర్షణ’గా మాత్రమే చూపింది.పశ్చిమాన లోపించిన ప్రస్తావననేను భారతదేశానికి తిరిగి రావాలని త్వరపడుతున్నాను. జరి గిన దాడి భారత్ నుండి తీవ్రమైన సైనిక ప్రతిస్పందనకు దారి తీయవచ్చని, నేను కలిసిన వారికి వివరించాను. ఇది యుద్ధ చర్య అని నొక్కి చెప్పాను. భారతదేశం తదనుగుణంగానే స్పందించవచ్చునని కూడా అనుకున్నాను. నేను ఇలా చెబుతున్నప్పుడు చాలామంది సహోద్యోగులు, స్నేహితులు నన్ను ప్రశ్నార్థకంగానే చూశారు. వారు చూస్తుండే టీవీ, ప్రింట్ లేదా డిజిటల్ మీడియాలలో పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావన చూడలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ప్రతిదాడి స్వభావం, లక్ష్యం, ప్రతిస్పందన సమయం’పై నిర్ణయం తీసుకోవడానికి సాయుధ దళాలకు ‘పూర్తి స్వేచ్ఛ’ ఇచ్చేశారు. దీంతో, భీతిల్లిపోయిన పాక్, తదుపరి 24–36 గంటల్లోనే భారత్ దాడి జరగవచ్చని ప్రకటించేంతవరకు వెళ్లింది. ఒక పాకిస్థాన్ మంత్రి బహిరంగంగానే బెదిరింపు ప్రకటన చేశారు. ‘‘అణ్వాయుధా లను అలంకరణ కోసం తయారు చేయలేదు’’ అని కఠినంగా అన్నారు. ‘సాయుధ దాడి..’ అని రాశారు! ఇప్పటికైనా ప్రపంచ మీడియా అంతా ఈ దాడికి సంబంధించిన భౌగోళిక రాజకీయ ఫలితం గురించి ఆలోచిస్తుందని మీరు అనుకుంటారు కదా! కానీ అలాంటిదేమీ లేదు. ఉగ్రదాడిపై కవరేజ్ నామ మాత్రంగానే ఉంది. ఇంకా దారుణంగా, ప్రారంభ రోజుల్లో ప్రచురి తమైన కొన్ని వార్తా నివేదికలను చూస్తే, పాశ్చాత్య వార్తాపత్రికల లోపలి పేజీలలో ఈ దాడి ఘటనపై ఉపయోగించిన భాష వారి స్వంత కథను వినిపించింది. అదేమిటంటే – జరిగిన దాడి ఘటనకు ‘ఉగ్రవాదం’ అనే పదాన్ని ఉపయోగించడానికి తీవ్రంగా నిరాకరించడం! దానికి బదులుగా, సాయుధులు, తీవ్రవాదులు వంటి మూస పోత పదాలతో ఎప్పటిలాగే వర్ణించారు.సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు గుంపులోని పురుషులను ఒక్కొక్కరిగా చంపేశారు, కానీ వారు హిందువులా లేదా ముస్లింలా అని అడిగిన తర్వాత మాత్రమే చంపారని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాదులతో పోరాడి వారి తుపాకీని లాక్కోవడా నికి ప్రయత్నించిన స్థానిక కశ్మీరీపై కూడా తూటాలు గుప్పించారు.ఇది ‘ఉగ్రవాదం’ అనిపించలేదా?!లష్కరే తోయిబాకి నీడలాగా ఉన్న ‘ది రెసిస్టెన్ ్స ఫ్రంట్’ ఈ దాడికి తక్షణ బాధ్యత వహించింది. తరువాత, పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరగడంతో వారు సైబర్ హ్యాక్ ద్వారా ఈ ప్రకటన జరిగిందని మాట మార్చారు! లష్కర్ తోయిబా ఇంతకు మునుపే అమెరికా అధికారికంగా విడుదల చేసిన ఉగ్రవాద సంస్థల జాబితాకెక్కింది. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడిలో ఆరుగురు అమెరికన్లు మరణించారు. పాకిస్థాన్‌లో దాక్కున్న ప్రదేశం నుండి ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా బయటకు తీసుకెళ్తే అమెరికన్లు ఎలా భావిస్తారు? దీన్ని కూడా వారు సాయుధుల చర్య గానే వర్ణిస్తారా?చివరికి ఇప్పుడు భారతదేశం ‘చర్యకు ప్రతి చర్య’ సూత్రం ప్రాతిపదికన ప్రతీకార చర్యకు సిద్ధమవుతుండగా, పశ్చిమ దేశాలు స్పందించడం ప్రారంభించాయి. వాషింగ్టన్ నుండి కొన్ని ప్రకటనలు సంఘీభావం ప్రకటించాయి. పహల్గామ్ ఘటనకు కారణమైన ఉగ్ర వాదులను శిక్షించడంలో భారత్‌కు పాకిస్థాన్ సహకరించాలని వాన్ ్స కోరుతూనే, భారతదేశం ‘పెద్ద ప్రాంతీయ సంఘర్షణ’కు దారితీయని విధంగా స్పందిస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.భారతదేశ సైనిక పరమైన చర్యల ఎంపికలకు అమెరికన్లు అడ్డంకులు కల్పించే అవకాశం లేదు. కానీ 2023 అక్టోబర్ 7 తర్వాత ఏ అమెరికన్ రాజకీయ నాయకుడూ ఇజ్రాయెల్‌తో ఇలా (ఉద్రిక్తతలు తలెత్తకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని) చెప్పి ఉండక పోవచ్చు. యెమెన్ లోని హౌతీలపై తాము నిరంతరం బాంబు దాడి చేస్తూ మరొకవైపు భారతదేశం సైనిక సంయమనం పాటించాలని అమెరికా నేతలు కోరటాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పటికీ వారి తీరులో భారీ ద్వంద్వ వైఖరి ఉందనే చెప్పాలి.కశ్మీర్ లోపల... కశ్మీర్ వెలుపలా.!పహల్గామ్ ఉగ్రవాద దాడి స్థానికంగా జరిగిన ‘భద్రతా సంఘ టన‘ కాదనీ; అది భారత్, పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఏదో ఒక రకమైన ‘వివాదానికి’ సంబంధించిన మరొక అభివ్యక్తి కాదని ప్రపంచం ఇంకా అర్థం చేసుకోనే లేదు. కశ్మీర్‌లోనూ, కశ్మీర్ వెలుపల కూడా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటోందని 26/11 ముంబై దాడులు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈసారి మాత్రం ఒక నమూనా మార్పు జరిగింది. భారతదేశం పాకిస్థాన్ యుద్ధం అంచున ఉన్నాయి. కానీ ఈ సంఘర్షణ... అది తలెత్తిన రోజు నుండే పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య ప్రభుత్వాల దృష్టి నుంచి తప్పిపోయింది. ఉగ్రదాడి గురించి వారు తప్పుగా నివేదించారు, తప్పుగా అర్థం చేసుకున్నారు.బర్ఖా దత్‌వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత్రి
సింహాచలం ఘటన: బాబూ.. ఇదేం వక్రబుద్ధి.. భక్తుల ఆగ్రహం
చిరంజీవితో సినిమా.. భారీగా డిమాండ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్!
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
తొలి ‘జన్యుసవరణ’ వరి!
పురుషులకు సరోగసి హక్కు ఉండద్దా !
చిన్నలోపం కూడా ఉండొద్దు
అందం.. సామాజిక బంధం
MI Vs GT: సమఉజ్జీల సమరం
కోర్టుకే అబద్ధాలు చెబుతారా?
స్వచ్ఛందంగా వెళ్లిపోతే వెయ్యి డాలర్లు
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
నా కొడుకును సంపేయండి
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
బంగారం భారీగా పడిపోతుంది!
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
ఇంట్లో పాముల కలకలం
3 నిమిషాలకో మరణం
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
పాక్ నడ్డి విరిగేలా..
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
ఒకే ఇల్లు.. ఒకే వంట
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ముష్కర మూకలకు ముచ్చెమటలు
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
సింహాచలం ఘటన: బాబూ.. ఇదేం వక్రబుద్ధి.. భక్తుల ఆగ్రహం
చిరంజీవితో సినిమా.. భారీగా డిమాండ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్!
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
తొలి ‘జన్యుసవరణ’ వరి!
పురుషులకు సరోగసి హక్కు ఉండద్దా !
చిన్నలోపం కూడా ఉండొద్దు
అందం.. సామాజిక బంధం
MI Vs GT: సమఉజ్జీల సమరం
కోర్టుకే అబద్ధాలు చెబుతారా?
స్వచ్ఛందంగా వెళ్లిపోతే వెయ్యి డాలర్లు
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
నా కొడుకును సంపేయండి
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
బంగారం భారీగా పడిపోతుంది!
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
ఇంట్లో పాముల కలకలం
3 నిమిషాలకో మరణం
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
పాక్ నడ్డి విరిగేలా..
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
ఒకే ఇల్లు.. ఒకే వంట
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ముష్కర మూకలకు ముచ్చెమటలు
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
సినిమా

ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా 15కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు యాడ్ అయింది. అస్సలు ఇంగ్లీష్ పదాలే వాడకుండా తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుందని ఇప్పుడు చూద్దాం?అందరూ కొత్తవాళ్లతో తీసిన సినిమా 'కాలమే కరిగింది?'. మార్చి 21న ఈ తెలుగు మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ మూవీలో సారీ, థ్యాంక్స్ తప్ప మరే ఇంగ్లీష్ పదాలు ఉపయోగించలేకపోవడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) కథంతా స్కూల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు ఎంచుకున్న లవ్‌స్టోరీ పాయింట్ కొత్తదేమి కాదు. కానీ అప్పటి ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని కవితాత్మకంగా సరికొత్తగా చూపించారు. స్కూల్ డేస్ లోని బాల్యప్రేమను మధురంగా మలిచారు. ఇప్పుడీ చిత్రం మే 09 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.'కాలమే కరిగింది?' విషయానికొస్తే.. ఫణి (వినయ్ కుమార్-అరవింద్) బాగా చదువుకుని జీవితంలో సెటిల్ అయ్యింటాడు. తొలి ప్రేమ గుర్తొచ్చి ప్రియురాలు బిందు (శ్రావణి-నోమిన తార) కోసం సొంతూరు వెళ్తాడు. అసలు బిందు ఎక్కడ ఉంది? ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఫణికి బిందు కలిసిందా లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ్మ జీవితాంతం నన్ను..: రష్మీ)

సిల్క్ డ్రస్సులో తమన్నా.. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తుపట్టారా?
జిమ్ లో తెగ కష్టపడుతున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్హిట్ 3 సక్సెస్.. అందరికీ థ్యాంక్స్ చెప్పిన శ్రీనిధి శెట్టిసిల్క్ డ్రస్సుల్లో సెగలు రేపుతున్న తమన్నా భాటియావంటింట్లో టీ పెట్టి, పకోడీ చేసేసిన రాశి సింగ్'భజరంగీ భాయ్ జాన్' బాలనటి హర్షాలీ మెహతా ఇప్పుడిలాసైడ్ తిరిగి నవ్వుతో మాయలో పడేస్తున్న ఆషికా రంగనాథ్ఎండలో రుహానీ శర్మ స్టైలిష్ పోజులు View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Raashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కోసం చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం గురించి పలు పాత విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయింది..? చిరు, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఎంత..? బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది..? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలు సోషల్‌మీడియాలో కనిపిస్తున్నాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 35 ఏళ్ల తర్వాత ఈ మూవీని రీ–రిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న 2డీతో పాటు 3డీ వెర్షన్లోనూ విడుదల కానుంది.‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్ వండర్ వెనక చాలామంది ఛాంపియన్స్ ఉన్నారు. ఇళయరాజా అందించి ట్యూన్స్, దర్శకుడు రాఘవేంద్ర రావు విజన్, డీఓపీ విన్సెంట్, అద్భుతమైన సెట్స్‌తో మైమరపింపజేసిన ఆర్ట్ డైరెక్టర్ చలం.. పాటలు, మాటలతో మెస్మరైజ్ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు ఇలా ఎందరో ఈ సినిమాకు పనిచేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్ స్టోన్ , ఓ హిస్టారికల్ ల్యాండ్ మార్క్‌గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కోసం రూ. 2 కోట్లు ఖర్చు అయిందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి.మే 9న రీ-రిలీజ కానున్న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాను మీరు చూస్తే రూ. 2 కోట్లతో ఇంతటి రిచ్ సినిమాను నిర్మించారా అంటూ ఆశ్చర్యపోతారు. ఇప్పట్లో అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం కనీసం రూ. 200 కోట్లు పైగానే ఖర్చు చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా విడుదల సమయంలో భారీ వర్షాల వల్ల మొదటి వారం కలెక్షన్స్ పెద్దగా లేవు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ప్రింట్స్ పెరిగాయి. ఎక్కడ చూసిన కూడా థియేటర్స్ నిండిపోయాయి. అలా ఏకంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 15 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు గాను చిరంజీవి రూ. 25 లక్షలు, శ్రీదేవి రూ. 20 లక్షలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి.

'ఆదిపురుష్'-కొడుక్కి క్షమాపణ.. మాట మార్చేసిన సైఫ్
ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'.. థియేటర్లలో రిలీజై ఓటీటీలోకి వచ్చినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇదంతా రెండేళ్ల కిందటి ముచ్చట. మళ్లీ కొన్నిరోజుల క్రితం నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తన సినిమా ఫ్లాప్ కాదని దర్శకుడు ఓం రౌత్ వాదించడం, ఈ మూవీలో నటించినందుకు కొడుక్కి సారీ చెప్పానని సైఫ్ అలీ ఖాన్ అనడం పెద్ద చర్చకు దారితీసింది.కొడుకు తైమూర్‌కు 'ఆదిపురుష్' సినిమా చూపించానని, అతడిలో ఏ స్పందన లేకపోయేసరికి సారీ చెప్పానని సైఫ్ అన్నాడు. ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమా గురించి మళ్లీ మళ్లీ ఎందుకు ఇలా అంటున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ నటుడు మాట మార్చేశాడు. (ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ్మ జీవితాంతం నన్ను..: రష్మీ) 'నేను ఆదిపురుష్ మూవీలో విలన్ గా నటించాను. అందులో కేకలు వేస్తూ అందరితో యుద్ధం చేస్తుంటాను. అది చూసి ఈసారి ఇలాంటి సినిమాలో హీరోగా చేయమని అన్నాడు. దీంతో ఓకే చెప్పాను. విలన్ గా నటించినందుకు సారీ చెప్పాను. నేను పనిచేసిన అన్ని చిత్రాల్ని గౌరవిస్తాను. ఆదిపురుష్ ని కూడా అలానే చూస్తాను' అని సైఫ్ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.ఆదిపురుష్ లో సైఫ్ రావణుడి పాత్ర చేశాడు. అయితే ఇతడి పాత్ర వేషధారణ నుంచి ట్రోలింగ్ మొదలైంది. తర్వాత లంకని గ్రాఫిక్స్ లో దారుణంగా చూపించడం, గబ్బిలాల్లాంటి పక్షులతో ఫైటింగ్.. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడికి చిరాకు తెప్పించాయి. దీంతో ఆదిపురుష్.. ఫెయిలైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు సౌతాఫ్రికా కీలక నిర్ణయం
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి 15 వరకు జరగనున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రెండో సారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఆసీస్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా సైతం తొలిసారి ట్రోఫీ ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఫైనల్‌కు ముందు జింబాబ్వేతో సౌతాఫ్రికా నాలుగు రోజుల టెస్టు ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే ఆఖరి వారంలో ఈ మ్యాచ్ జరిగే అవకాశముంది. అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నహాకాల్లో భాగంగా ప్రోటీస్ జట్టు జూన్ 3న ససెక్స్‌తో కూడా తలపడనుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. గ్రూపు స్టేజి ముగిసిన తర్వాత కొంతమంది సఫారీ ఆటగాళ్లు నేరుగా ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. మిగిలిన ప్లేయర్లు మే 25న ఐపీఎల్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా జట్టులో చేరనున్నారు. ఈ ఫైనల్‌కు ముందు మరో గుడ్ న్యూస్ సౌతాఫ్రికాకు అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.అతడు తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. తొలుత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రబాడ దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు నిషేదం ఎత్తేయడంతో సౌతాఫ్రికా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.చదవండి: వయసుతో పనేంటి?.. అతడు మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు: వరుణ్ చక్రవర్తి

అతడు ఇంకో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు: వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ (Andre Russel)పై ఆ జట్టు బౌలర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ప్రశంసలు కురిపించాడు. ఇప్పట్లో అతడు రిటైర్ కాబోడని.. కనీసం మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు కేకేఆర్ రసెల్‌ను రూ. 12 కోట్లకు అతడిని రిటైన్ చేసుకుంది.అయితే, తాజా ఎడిషన్ ఆరంభం నుంచి ఈ జమైకన్ స్టార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గత ఏడు ఇన్నింగ్స్‌లో కేవలం డెబ్బై రెండు పరుగులే చేశాడు. అయితే, ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మాత్రం రసెల్ దుమ్ములేపాడు.PC: BCCI25 బంతుల్లోనే 57ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రసెల్ 25 బంతుల్లోనే 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇక రసెల్ ఇన్నింగ్స్ కారణంగా 200కు పైగా స్కోరు సాధించిన కేకేఆర్ రాజస్తాన్‌పై జయభేరి మోగించింది.ఇంకో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడుఇక రసెల్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కలిపి 129 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గత మ్యాచ్‌లలో బ్యాటర్‌గా విఫలమైనప్పటికీ ఆ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. బౌలర్‌గా ఎనిమిది వికెట్లు తీయగలిగాడు. కాగా ఫామ్‌లేమి, వయసు దృష్ట్యా ఐపీఎల్-2025 తర్వాత రసెల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై గెలుపు అనంతరం కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ విషయంపై స్పందించాడు. ‘‘ఇంకో రెండు మూడు సైకిళ్ల పాటు అతడు ఐపీఎల్లో ఆడాలని భావిస్తున్నాడు. అంటే.. ఇంకో ఐదారేళ్లన్న మాట. అతడు ఫిట్‌గా ఉన్నాడు. బాగున్నాడు.వయసుతో పనేంటి?అలాంటపుడు వయసుతో పనేంటి? జట్టు ప్రయోజనాల కోసం తన వంతు కృషి చేసినంత కాలం ఓ ఆటగాడు ఆడుతూనే ఉంటాడు. ఫ్రాంఛైజీ క్రికెట్ యాజమాన్యాలు ఇలాగే ఆలోచిస్తాయి. ఇలాంటి ఆలోచనా విధానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు’’ అని వరుణ్ చక్రవర్తి తెలిపాడు. కాగా రసెల్ స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ చితక్కొట్టగలడని ఈ సందర్భంగా వరుణ్ స్పష్టం చేశాడు. కాగా 37 ఏళ్ల రసెల్ 2014 నుంచి కోల్‌కతాతోనే కొనసాగుతున్నాడు.కాగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్ రాజస్తాన్‌పై ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. ఇప్పటికి ఈ సీజన్లో రహానే సేన ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఐదు గెలిచి.. పట్టికలో ఆరోస్థానంలో ఉంది.ఐపీఎల్ 2025: కోల్‌కతా వర్సెస్ రాజస్తాన్👉కోల్‌కతా స్కోరు: 206/4 (20)👉రాజస్తాన్ స్కోరు: 205/8 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌పై కేకేఆర్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆండ్రీ రసెల్.చదవండి: ఏం ఆడుతున్నార్రా బాబూ! గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే.. 𝙍𝙪𝙨𝙨𝙚𝙡𝙡 𝙈𝙖𝙣𝙞𝙖 𝙖𝙩 𝙀𝙙𝙚𝙣 𝙂𝙖𝙧𝙙𝙚𝙣𝙨 💪Display of brute force from #KKR's very own Andre Russell 💥Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @Russell12A pic.twitter.com/YfXiU3dF6h— IndianPremierLeague (@IPL) May 4, 2025

IPL 2025: వర్షం కారణంగా ఎస్ఆర్హెచ్- ఢిల్లీ మ్యాచ్ రద్దు
IPL 2025 SRH vs DC Live Updates: వర్షం కారణంగా ఎస్ఆర్హెచ్- ఢిల్లీ మ్యాచ్ రద్దుఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్బుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ రైజర్స్ బౌలర్లు దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం ఖాయమని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ బ్యాటింగ్ అనంతరం భారీ వర్షం కురిసింది. దీంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి మైదానం సిద్దం చేసేందుకు దాదాపు గంటకుపైగా సమయం పట్టే సూచనలు కన్పించాయి. దీంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఈ క్రమంలో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 13 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్దానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలన్న హైదరాబాద్ ఆశలు మాత్రం ఆడియాశలు అయ్యాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి ఇంటిముఖం పట్టింది. వర్షం ఆటంకం..రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ అనంతరం వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇంకా మొదలు కాలేదు.ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే?ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 7 వికెట్ల నష్టానికి ఢిల్లీ 133 పరుగులు చేసింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీని స్టబ్స్(41 నాటౌట్), ఆశుతోష్ శర్మ(41) ఆదుకున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు, ఉనద్కట్, హర్షల్ పటేల్, మలింగ తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 105/617 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో అశుతోష్ శర్మ(30), స్టబ్స్(26) ఉన్నారు.ఢిల్లీ ఆరో వికెట్ డౌన్..62 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన విప్రజ్ నిగమ్.. రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో స్టబ్స్(15), ఆశుతోష్(0) ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్..సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్ప్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో వికెట్‌గా అక్షర్, ఐదో వికెట్‌గా కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. కమ్మిన్స్ మూడు, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు.కమ్మిన్స్ ఆన్ ఫైర్.. కష్టాల్లో ఢిల్లీఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నిప్పులు చేరుగుతున్నాడు. అతడి బౌలింగ్ దాటికి ఢిల్లీ 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో వికెట్‌గా అభిషేక్ పోరెల్ ఔటయ్యాడు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన డుప్లెసిస్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(8), రాహుల్(3) ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అదిలోనే భారీ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో తొలి బంతికే ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. సన్‌రైజర్స్ తుది జట్టులోకి అభినవ్ మనోహర్, సచిన్ బేబి వచ్చారు. మరోవైపు ఢిల్లీ జట్టులోకి నటరాజన్ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్

IPL 2025: సీఎస్కే జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు..
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. వరుస ఓటములతో మరో మూడు మ్యాచ్‌లు మిగిలూండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమించింది. అయితే మిగిలిన మూడు మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ పరువు కాపాడుకోవాలని సీఎస్కే భావిస్తోంది.సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో మే 7న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల అన్క్యాప్డ్ వికెట్ కీపర్-బ్యాటర్ వన్ష్ బేడీ చీలమండ గాయం కారణంగా మిగిలిన సీజన్‌కు దూరమయ్యాడు. అతడి స్దానంలో బరోడా బ్యాటర్ ఉర్విల్ పటేల్‌ను చెన్నై తమ జట్టులోకి తీసుకుంది. "ఎడమ చీలమండ గాయం కారణంగా టోర్నమెంట్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు వన్ష్ బేడీ దూరమయ్యాడు. అతడి స్దానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఉర్విల్ పటేల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది" అని ఐపీఎల్ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.26 ఏళ్ల ఉర్విల్ పటేల్‌కు టీ20 క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించాడు. త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి పటేల్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డును ఉర్విల్ బద్దలు కొట్టాడు. అదే టోర్నీలో ఉత్తరాఖండ్‌పై కూడా 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే ఉర్విల్ పటేల్‌తో సీఎస్కే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఉర్విల్.. 47 టీ20 మ్యాచ్‌లు ఆడి 170 స్ట్రైక్ రేట్‌తో 1162 పరుగులు చేశాడు.
బిజినెస్

30 మందికి మాత్రమే ఈ కారు: ధర ఎంతో తెలుసా?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'జీప్'.. ఇండియన్ మార్కెట్లో రాంగ్లర్ కొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ విల్లీస్ '41 స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 73.24 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కొత్త ఎడిషన్ భారత సైన్యానికి గుర్తుగా స్పెషల్ కలర్ పొందింది.కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 30 యూనిట్లకు మాత్రమే పరిమితం. అంటే ఈ కారును 30 మంది కస్టమర్లు మాత్రమే కొనుకోలు చేయగలరు. జీప్ రాంగ్లర్ టాప్ స్పెక్ రూబికాన్ వేరియంట్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. 1941 అనే డెకాల్ హుడ్‌పై ఉండటం చూడవచ్చు. ఈ కారు ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!కొత్త స్పెషల్ ఎడిషన్ రాంగ్లర్‌లో పవర్డ్ సైడ్ స్టెప్, కొత్త ఇంటీరియర్ గ్రాబ్ హ్యాండిల్స్, వెదర్ ఫ్లోర్ మ్యాట్లు, ఫ్రంట్ అండ్ రియర్ డాష్‌క్యామ్‌లు కూడా ఉన్నాయి. డిజైన్ కొంత కొత్తగా అనిపించినప్పటికీ.. అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి అదే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 270 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.

ఎయిర్టెల్, టాటా చర్చలకు చెక్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా గ్రూప్ మధ్య డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) బిజినెస్ విలీనానికి చెక్ పడింది. విలీన చర్చలను విరమించుకున్నట్లు ఎయిర్టెల్ తాజాగా వెల్లడించింది.చర్చలలో రెండువైపులా సంతృప్తికర ఫలితాలను సాధించకపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపింది. డీటీహెచ్ బిజినెస్‌ల విలీనానికి టాటా గ్రూప్ డీటీహెచ్ విభాగం టాటా ప్లేతో అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా చర్చిస్తున్నట్లు 2025 ఫిబ్రవరి 26న ఎయిర్టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో రెండు సంస్థలూ సరైన పరిష్కారాన్ని సాధించలేకపోవడంతో చర్చలు విరమించుకున్నట్లు వివరించింది.

పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు
దిగ్గజ ఇన్వెస్టర్ & బెర్క్‌షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వారెన్ బఫెట్.. ఇటీవల తన వాటాదారుల ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక లోటుకు సంబందించిన విషయాలను హైలెట్ చేస్తూ.. పెట్టుబడిదారులు కేవలం యూఎస్ డాలర్ మీద మాత్రమే కాకుండా, ఇతర కరెన్సీలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.అమెరికాలో ఆర్థిక లోటు సమస్య ఎప్పటి నుంచో పరిష్కారం లేకుండా ఉంది. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో నిర్ణయించలేకపోతున్నామని బఫెట్ అన్నారు. మనం చాలా కాలంగా భరించలేని ఆర్థిక లోటుతో పనిచేస్తున్నాము. ఇది ప్రస్తుతం నియంత్రించలేని స్థాయికి చేరిందని వెల్లడించారు.యూఎస్ డాలర్ పతనావస్థలో ఉంది. ఒక దేశంగా మనకు ఎప్పుడూ చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఇది మాత్రం మనమే తెచ్చుకున్న సమస్య. అమెరికా ఆర్ధిక విధానాలు, వాణిజ్య విధానం వంటివన్నీ డాలర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని బఫెట్ వివరించారు.సీఈఓగా వారెన్ బఫెట్ పదవీ విరమణశనివారం (2025 మే 3) జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్ బఫెట్' కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కీలక ప్రకటన: గెలిచినోళ్లకు రూ.5 లక్షల ప్రైజ్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 294.85 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో.. 80,796.84 వద్ద, నిఫ్టీ 114.45 పాయింట్లు లేదా 0.47 శాతం లాభంతో 24,461.15 వద్ద నిలిచింది.టాప్ గెయినర్స్ జాబితాలో అషిమా, యూనివర్సల్ కేబుల్స్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ఆర్ఆర్ కాబెల్ వంటి కంపెనీలు చేరగా.. జీ-టెక్ జైన్ఎక్స్ ఎడ్యుకేషన్, కేసాల్వ్స్ ఇండియా, లోటస్ ఐ కేర్ హాస్పిటల్, వీ-మార్ట్ రిటైల్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).
ఫ్యామిలీ

Fear & Emotions : భయానికి మూలం
మన దుఃఖాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఒక నీటిబుడగను సృష్టించుకుని మనమే అందులో చిక్కుకుంటున్నాం. శరీరము–మనస్సులే నేను అనే భ్రమను కల్పించుకుని సుఖదుఃఖాల చట్రంలో చిక్కుకునిపోయాం. నీవు శుద్ధచైతన్యంగా ఉన్నప్పుడు దుఃఖమనేదే లేదు. కేవలం సచ్చిదానందమే ఉంది. మనమే నమ్మకాలను కల్పించుకొని భయమని, దుఃఖమని, కుంగుబాటని వేదన చెందుతున్నాం. కొన్ని జన్మల నుంచి నమ్మకాలను బలపరచుకుంటూ వస్తున్నాం. నేను శరీరము–మనస్సు అని నమ్ముతున్నాం. నిజానికి నీవు వ్యక్తివి కావు. ఈ వ్యక్తికి మూలం ఏది? ఆత్మనే మూలం. అది అనందనిలయం. మరి దుఃఖం ఎందుకు వచ్చింది అంటే నీవు ఆత్మవని మరచి వ్యక్తిని అని నమ్ముతున్నావు గనుక. చైతన్యానికి ద్వంద్వాలు లేవు. చైతన్యం భిన్నత్వాన్ని అనుభవించటానికి ఒక రూపంలో వ్యక్తమయ్యింది. దానికి నేను అనేది అవసరం. అక్కడ ఎరుక మాత్రమే ఉండాలి. కానీ నేను శరీరం అనే నమ్మకాన్ని కల్పించుకొని తన నిజతత్వాన్ని మరచిపోయింది. సుఖదుఃఖాల్లో కూరుకుపోయింది. ఆలోచనలు, భావోద్వేగాలు, గుర్తింపు, నమ్మకాలు, ఇష్టాఇష్టాలు వంటి వాటితో వ్యక్తి మొదలైనాడు. నిజానికి ఆ చూసేవాడు వ్యక్తే కాదు. వాడికి దుఃఖం, భయం అనేవే లేవు. అది కేవలం సాక్షీ చైతన్యం. కానీ మనం చూసేవాడు, చూడబడేది అనే ఇద్దరుగా తయారైనాము. చూసేవాడు చైతన్యం, చూడబడేది శరీరం–మనస్సు. నేనే శరీరమనే భ్రమ కల్పించుకొని, శరీర అనుభవాలతో కలిసిపోయి రాగద్వేషాలను కల్పించుకొని, భయం, దుఃఖం, కోపం, ద్వేషం అనేవి ఊహించుకుంటున్నాం. నిజమైన నిన్ను ఎవరైనా భయపెట్టగలరా? కేవలం నీ నమ్మకం వల్లనే భయపడుతున్నావు. ఎక్కడికి పారిపోగలవు నీవు? శరీరం–మనస్సులకు మూలమే నీవు. నీవే అనంత చైతన్యం. నిన్ను ఏ సమస్య ఐనా, ఏ రోగమైనా ఏమీ చేయలేదు. శరీరానుభవాలను సాక్షిగా గమనిస్తూ ఉండు. సదా నీ నిజతత్వం పట్ల ఎరుకతో ఉండు. నీవు అనంత శక్తిమంతుడివి. నిత్యం సచ్చిదానందంలో ఉండాలి. (దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు)వ్యక్తిగా ఒక చిన్న పరిధినే నేను అనుకున్నప్పుడే భయం, దుఃఖం ఉంటాయి. అప్పుడే నీకు అభద్రత ఉంటుంది. తోడుకావాలి, కుటుంబం కావాలి, స్నేహితులు కావాలి అని కోరుకుంటావు. ఇదంతా భయం వల్లనే. నీవు చైతన్యంగా ఉన్నప్పుడు నీకు ఏమీ అవసరం లేదు. నీవు సంపూర్ణ భద్రతలోనే ఉంటావు. నీకు అవసరమైనవి సమకూరుతూ ఉంటాయి. నేను కర్తను కాను, కర్మను కాను, క్రియను కాను అనే భావనలో ఉండాలి. సాక్షిగా ఉండాలి. నీ ముందున్న జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తూ అత్మతత్వంలో ఉండేటప్పుడు నీలో నిరాశ, నిస్పహ, బాధ, విసుగు లాంటివి ఎలా ఉంటాయి? భిన్నత్వాన్ని అనుభవించటానికే చైతన్యం శరీరరూ΄ాన్ని సంతరించుకుంది. ఆ శరీరమే నేను అనుకోవడం నీ భ్రమ. భిన్నత్వాన్ని యథాతథంగా సాక్షీభావంతో సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉండాలి.– స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు

రెండు వేల ఏళ్ల నాటి గ్రామం..! ఒకప్పుడూ..
కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నందివడ్డెమాన్. తెలంగాణలో వర్ధమానపురానికి 2 వేల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికీ ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం. కాగా నాటి జైనమత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైనమత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరు మీద ఈ గ్రామానికి వర్ధమానపురం అనే పేరు వచ్చింది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నందివర్ధమానపురంగా పేరొందింది. ఇది కాల క్రమేనా నందివడ్డెమాన్‌గా మారింది. గ్రామం చుట్టూ ఎటు చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. ఇందులో ప్రధానంగా కాళిమాత, శివగౌరమ్మ, త్రిమూర్తులు, వీరభద్రస్వామి, నందీశ్వర, శనేశ్వరుడు, చెన్నకేశవస్వామి తదితర ఆలయాలు ఉన్నాయి.2000లో శనేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠాపన జేష్ట్యాదేవి సమేత శనేశ్వరస్వామిని కొలిస్తే ఏల నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని తొలగుతుంది.. ఈ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు ఉమ్మడి పాలమూరు పరిధిలోని బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా శనేశ్వరుడిని కొలుస్తున్నారు. రాష్ట్రంలోనే ఏకైక శనేశ్వర ఆలయం కావడంతో ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం పూజలతోపాటు ప్రత్యేకంగా శని త్రయోదశి రోజు భక్తులు వేలల్లో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని పూజలు జరుపుతారు.నందివడ్డెమాన్‌లో వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఉన్న నంది, వీరభద్రస్వామి విగ్రహాలను 1976లో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ పాండే పిల్లలమర్రికి తరలించే ప్రయత్నం చేయగా గ్రామానికి చెందిన కొందరు పెద్దలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నిలిపివేశారు. అనంతరం 1999 జనవరి 26న విగ్రహ పునఃప్రతిష్ఠ చేశారు. ఆ సమయంలో 11 రోజుల పాటు రుద్రయాగం చేసిన అర్చకులకు పక్షి రూపంలో ఒక చెట్టు వేరు కనిపించి పూర్ణాహుతి జరిగాక శనేశ్వర విగ్రహం ప్రతిష్టించాలని కలలో చెప్పడంతో విగ్రహ ప్రతిష్ఠకు పూనుకున్నారు. నందనవనం సుబ్బారాయుడు అనే శిల్పి ఆలగడ్డ నుంచి ఒక శిలను తెప్పించి ఏడున్నర రోజులపాటు శ్రమించి జేష్ట్యాదేవి విగ్రహాన్ని చెక్కారు. అనంతరం ఏప్రిల్ 17, 2000లో ఏడున్నర లక్షల శని మంత్రాలతో విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. కాకిపై కొలువై ఉన్న శనేశ్వరస్వామి విగ్రహం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది.మహిళలు సైతం పూజలు చేయొచ్చు.. శనేశ్వరుడికి అతీ ప్రీతికరమైన నల్లటి వ్రస్తాలు ధరించి ఇక్కడ పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లేడు, జమ్మి ఆకు, నువ్వుల నూనెలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. గుడి ఆవరణలో స్నానం చేసి నల్ల వస్త్రాలు ధరించి.. విగ్రహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి.. స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకించి.. ఆ తైలాన్ని తలకు రుద్దుకుని మరోమారు స్నానం చేస్తారు. అనంతరం అక్కడే ఉన్న నంది శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జేష్ట్యాదేవి సమేతంగా శనేశ్వరుడు కొలువుదీరినందున మహిళలు సైతం ఈ పూజల్లో పాల్గొనవచ్చు.ఇలా చేరుకోవచ్చు.. హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే భక్తులు బిజినేపల్లి మండల కేంద్రానికి చేరుకుని.. అక్కడి నుంచి వడ్డెమాన్‌కు రావాల్సి ఉంటుంది. బిజినేపల్లి నుంచి వడ్డెమాన్‌కు వెళ్లే మార్గంలో ముందుకు ఎదురయ్యే కమాన్ (ఆర్చి) నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే శనేశ్వరుడి ఆలయం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 122 కిలోమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ శనేశ్వరుడి ఆలయం ఉంటుంది.గోన గన్నారెడ్డిది ఈ ప్రాంతమే.. కాకతీయుల సామంత రాజు గోనగన్నారెడ్డి ఈ ప్రాంతానికి చెందినవాడే. గోన బుద్దారెడ్డి తర్వాత వర్ధమానపురం రాజ పగ్గాలు చేపట్టిన గోన గన్నారెడ్డి రుద్రమదేవికి కుడిభుజంగా ఉండి సమస్త కాకతీయ రాజ్యాలను రక్షించిన యోధుడిగా చెప్పుకుంటారు. భక్తుల నమ్మకం.. జేష్ట్యాదేవీ సమేత శనేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ఇక్కడ ఏల నాటి శని తొలగి.. అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భక్తుల నమ్మకం. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రియమైన నల్లటి దుస్తులతో అభిషేకం చేయడం వల్ల అన్ని దోశాలు తొలగిపోతాయి. – శాంతికుమార్, అర్చకులు, శనేశ్వరస్వామి ఆలయం(చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర)

మిస్ వరల్డ్‌తో మోక్షం.!
బంజారాహిల్స్: ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిటీ ముస్తాబవుతోంది. మే 7 నుంచి 31 వరకు హైటెక్స్‌లో జరిగే పోటీల కోసం సుందరాంగులు నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరాన్ని సుందరీకరించే దిశలో వివిధ శాఖలు సమన్వయంతో ముందుకుసాగుతున్నాయి. ముఖ్యంగా అందగత్తెలు రాకపోకలు సాగించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన ట్రాన్స్ఫార్మర్లు, వేలాడుతున్న వైర్లు, తుప్పుబట్టిన కరెంటు స్తంభాల తొలగింపు, మరమ్మతులు చేస్తోంది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సబ్స్టేషన్ల పరిధిలో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, లైన్మెన్లు, సిబ్బంది ఆదివారం మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఈనెల 18న సుందరాంగులు రానున్న నేపథ్యంలో ఈ రోడ్డులో శిథిలావస్థకు చేరిన 12 ట్రాన్స్ఫార్మర్లను మార్చారు. తుప్పుబట్టిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి వేశారు. వేలాడుతున్న కేబుల్ వైర్లను సరిజేశారు. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేస్తున్న సుందరాంగులు తమ షెడ్యూల్లో భాగంగా వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. అలాగే పోటీలు జరిగే హైటెక్స్‌కు కూడా ఈ ప్రాంతాల నుంచే వెళ్తారు. ఇక్కడ ఉన్న స్టార్ హోటళ్లలోనే వారంతా బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు గత వారం రోజులుగా సుందరాంగులు రాకపోకలు సాగించే, పర్యటించే ప్రాంతాలను సర్వే చేశారు. రోడ్డు మార్గంలో వెళ్లే క్రమంలో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు శిథిలావస్థకు చేరాయో వాటిని గుర్తించారు. ఓవైపు ఒరిగిన ట్రాన్స్ఫార్మర్ల జాబితాను తయారు చేశారు. దీని ఆధారంగానే ఆదివారం నుంచి మరమ్మతులు చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. టీజీఎస్పీడీసీఎల్ ఫిలింనగర్ సబ్‌స్టేషన్ ఏఈ పవిత్ర పర్యవేక్షణలో 30 మంది సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు అన్ని సబ్స్టేషన్ల పరిధిలోనూ పనులు చేస్తున్నారు. ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

ఊ(రి)ట బావులు : అంతుచిక్కని రహస్యాలు?
ఒకప్పుడు మంచి నీరు కావాలంటే బావికి వెళ్లాల్సిందే. తెల్లారితే చాలు గ్రామాలు, చిన్నపాటి పట్టణాల్లో కావిడి భుజాన వేసుకుని, చేతిలో చేద పట్టుకుని వీధుల నిండా జనం కనిపించేవారు. ఊరంతటికీ మంచినీటి బావి ఒకటుండేది. అక్కడకు వెళ్లే అందరూ మంచినీరు తెచ్చుకునే వారు. బావి లేని ఊరుండేది కాదు. రానురానూ బోర్లు, మంచినీటి పథకాలు అందుబాటులోకి వచ్చాక చాలా వరకూ బావులు కనుమరుగైపోయాయి. మంచినీటి మాట అటుంచితే కనీసం వాడుకలో కూడా లేకుండా పోయాయి. బావులు అంటే ఏమిటో భావితరాలకు తెలియని రీతిలో కనుమరుగయ్యాయి. కానీ చరిత్రలో తాము ఉన్నామంటూ కొన్ని బావులు మాత్రం ఇప్పటికీ ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. ఒక్కో బావి చుట్టూ ఒ క్కో విశ్వాసం పెనవేసుకుపోయింది. దీంతో ఆ బావుల్లో నమ్మకాల ఊట ఇప్పటికీ ఊరుతూనే ఉంది. అలాంటి బావులివి..గో.. - పిఠాపురంబొటన బావి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతి క్షేత్రంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయంలో ఉంది. సుమారు 9 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణమంతా ఈ బావి నీటితోనే చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆలయానికి ఆగ్నేయ మూలలో చతురస్రాకారంలో ఈ బావి ఉంది. చుట్టూ రాళ్లు పేర్చి చేసిన ఈ నేలబావి నిర్మాణం వింత గొలుపుతుంది. ఈ బావి నీటితోనే ఆలయంలోని మూలవిరాట్టుకు అభిషేకాలు నిర్వహిస్తూంటారు. ఈ బావిలోని నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం వంటి కోరికలు తీరుతాయని పలువు రు విశ్వసిస్తారు. కార్తిక మాసంలో ఈ బావి నీటితో స్నానం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. కార్తిక పౌర్ణమి నాడయితే మరింత ప్రాశస్త్యమని చెబుతారు. అది కూడా అర్చకులతో నీరు తోడించుకుని స్నానం చేస్తూంటారు. చైత్రం, శ్రావణం, ధనుర్మాసాల్లో భక్తులే స్వయంగా స్నానం చేస్తారు. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బావి నీటిని సీసాల్లో నింపి, తీర్థంలా తమతో తీసుకుని వెళ్లి, మామూలు నీటితో కలిపి స్నానం చేస్తారు. ఎంత వర్షాభావ పరిస్థితులున్నా ఎప్పుడూ ఈ బావి ఎండిన ఆనవాళ్లు లేవని స్థానికులు చెబుతారు. ఎంత నీరు తోడినా ఈ బావి ఎప్పుడూ నిండుకుండలా కళకళలాడుతూంటుంది.ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుగొల్లగుంట నుయ్యి కాకినాడ జిల్లాలో మండల కేంద్రమైన ఉప్పాడ కొత్తపల్లిలో ఈ బావి పూర్వం నుంచీ పేరెన్నికగన్నది. గతంలో కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, వాకతిప్ప గ్రామాలకు ఇదే మంచినీటి బావి. ఈ మూడు గ్రామాల ప్రజలు ఈ బావి నుంచే మంచినీరు తెచ్చుకునే వారు. వందల ఏళ్ల నాటి ఈ బావి నుంచే పిఠాపురం మహారాజా వారి సంస్థానానికి గుర్రపు బగ్గీలపై మంచినీరు తీసుకెళ్లేవారని పెద్దలు చెబుతారు. సముద్ర తీరం దగ్గరలో ఉన్న ఈ గ్రామాల్లో ఎక్కడ తవ్వినా ఉప్పు నీరే పడగా ఈ బావిలో మాత్రమే మంచినీరు.. అదీ కొబ్బరి నీళ్లలా ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలందరూ దీనినే మంచినీటికి ఉపయోగించే వారు. ఎంతమంది ఎన్ని నీళ్లు తోడుకున్నా ఈ బావి ఎప్పుడూ ఎండిపోకపోవడం విశేషంగా చెబుతారు. ఎన్ని రకాల మంచినీటి పథకాలు వచ్చినా ఇప్పటికీ కొందరు ఈ బావి నీటినే తాగుతూంటారు.కవలల బావి తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డిగుంట గ్రామంలోని బావి కవల పిల్లల బావిగా పేరొందింది. ఈ బావి నీరు తాగితే కవల పిల్లలు పుడతారనే నమ్మకం పలువురిలో బలంగా ఉంది. ఈ గ్రామంలో ఏకంగా 110 మందికి పైగా కవల పిల్లలు పుట్టడమే దీనికి నిదర్శనమని చెబుతారు. ఈ గ్రామంలో ఆరు నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ల వరకూ కవలలున్నారు. గతంలో మూర్తి అనే ఒక ఉపాధ్యాయుడు గ్రామంలో జనాభా లెక్కల కోసం రాగా ఎక్కువగా కవల పిల్లలుండటం చూసి ఆశ్చర్యపోయారు. కొన్నాళ్లకు ఆయన అదే గ్రామానికి ఉపాధ్యాయుడిగా వచ్చి, అక్కడే నివాసం ఉన్నారు. కొద్ది రోజులకు ఆయనకు కూడా కవల పిల్లలు పుట్టారు. దీంతో, ఆ గ్రామంలోని బావి నీరు తాగడంతో కవల పిల్లలు పుడుతున్నారని అందరికీ చెప్పడంతో అప్పటి నుంచీ ఇది కవల పిల్లల బావిగా పేరొందింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమంతా ఈ బావి పేరు మార్మోగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం జనం వచ్చి ఈ బావి నీటిని తీసుకెళ్తున్నారంటే ఎంతగా పేరొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కవలలు ఎక్కువగా ఉండడం వల్లే తమ ఊరికి గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.నిండు కుండలా.. సామర్లకోటలోని మాండవ్య నారాయణస్వామి వారి ఆలయంలో ఉన్న పురాతన బావి ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. మామూలు బావుల్లో వేసవిలో నీరు అడుగంటుతూంటుంది. కనీసం నీరు తగ్గుతుంది. కానీ ఈ బావిలో నీరు ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.బావి నీరు వల్లే కవలలు మా గ్రామంలోని బావి నీరు తాగడం వల్లే కవలలు పుడుతున్నారన్నది మా నమ్మకం. ఎక్కువ మంది కవలలు ఒకే గ్రామంలో పుట్టడం అరుదుగా ఉంటుంది. అలా మా గ్రామంలో వంద మందికి పైగా కవలలు పుట్టారంటే దీనికి కారణం మా గ్రామంలోని బావి నీరేనని అందరూ నమ్ముతున్నారు. మాకు కవలలే పుట్టారు. గతంలో చాలా మంది నమ్మేవారు కాదు. కానీ, ఈ బావి నీరు తీసుకెళ్లిన దూర ప్రాంతాల వాళ్లకు కూడా కవలలు జన్మించినట్లు చెబుతూండటంతో అందరూ ఈ విషయం నమ్మి తీరుతున్నారు. – అడబాల రామదాసు, కవల పిల్లల తండ్రి, దొడ్డిగుంట, రంగంపేట మండలంకోరికలు తీర్చే బావిగా నానుడి మా ఊరి గుడిలోని బొటన బావి నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. అలా కోరికలు తీరిన వారు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడకు దర్శనానికి వచ్చేవారు తప్పకుండా ఈ బావి నీటితో స్నానం చేయడం లేదా తాగడం చేస్తారు. తమతో పాటు నీటిని తీసుకెళతారు. ఈ బావి నీటిని స్వామి వారి తీర్థంగా భావిస్తారు. అంత పవిత్రంగా చూస్తారు. కోరిన కోర్కెలు తీరాక వచ్చి, స్వామి వారికి తులాభారాలు ఇస్తూంటారు. – కూనపురెడ్డి కోదండ రామయ్య, తిరుపతి, పెద్దాపురం మండలంఅపోహే.. ఇదిలా జరుగుతుందని మానసికంగా అపోహపడటం తప్ప బావి నీరు తాగడం వల్ల కవల పిల్లలు పుట్టడం, సంతానం కలగడం వంటివి ఉండవు. సంతాన ఉత్పత్తి జన్యుపరంగా జరుగుతుంది. మానసికంగా ఒక నమ్మకం కలిగించుకుంటారు తప్ప వాటి వల్ల ఎలాంటి సంతానం కలిగే అవకాశం శాస్త్రీయంగా లేదు. – డాక్టర్ కాటన్, మానసిక వైద్యుడు, జీజీహెచ్, కాకినాడచదవండి: Yoga: ఎమోషషన్స్‌ను బ్యాలెన్స్ చేసే యోగాసనం ఏదో తెలుసా?బావి నీటి వల్ల కాదు కవలలు పుట్టడం, సంతానం కలగడం వంటివి భార్యాభర్తల మధ్య జన్యుపరంగా జరిగేవే. బావి నీటి వల్ల కాదు. అలాగైతే పూర్వం అన్ని గ్రామాల్లో బావులుండేవి. అందరికీ కవలలు పుట్టాలి కదా! ఇదంతా ఒక నమ్మకం మాత్రమే. ఎక్కువగా ఆడపిల్ల ఇంట్లో కవలలు పుట్టిన వారు ఉంటే ఆ కుటుంబంలో మిగిలిన వారికి కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. దొడ్డిగుంటలో ఇదే జరిగి ఉండవచ్చు. కేవలం రెండు అండాలు విడుదలవ్వడం వల్ల మాత్రమే కవలలు జన్మిస్తూంటారు. అంతే తప్ప బావి నీరు తాగడం వల్ల మాత్రం కాదు. – డాక్టర్ అనిత, గైనకాలజిస్టు, పిఠాపురం
ఫొటోలు
అంతర్జాతీయం

ఐరాసలో నేడు పాక్-భారత్ పంచాయితీ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. భద్రతా మండలి(UN Security Council)లో భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించబోతున్నారు. తద్వారా.. అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాల తమ తమ వాదనలు వినిపించే అవకాశం దక్కింది.ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలిగొన్నారు. ఇది పాక్‌పనేనని నిర్ధారించుకున్న భారత్.. అన్ని రకాల ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో.. పాక్ కూడా కౌంటర్ ఆంక్షలు విధిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్ సింధు జలాలను నిలిపివేయడాన్ని ‘‘యుద్ధం’’గానే పాక్ భావిస్తోంది.ఈ క్రమంలో ఈ పరిణామాలపై ఆదివారం పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు స్పందించారు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తూ తమను(పాక్)ను ఇబ్బంది పెడుతోందని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని అన్నారు. మరీ ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ అక్రమంగా వ్యవహరిస్తోందని, ఈ విషయాలన్ని భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తుతామని అన్నారాయన.మరోవైపు.. భద్రతా మండలి పహల్గాం దాడిని ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశానికి ముందు మండలి ప్రతినిధులు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామని.. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన చెందుతున్నామని అన్నారు.

అంతుచిక్కని బంగారం రహస్యం.. పుత్తడి పుట్టిందెక్కడ?
బంగారం. ఈ పేరు వింటేనే భారతీయులు మైమరిచిపోతారు. మనోళ్ల బంగారం మోజు దెబ్బకు పదిగ్రాముల పుత్తడి ధర ఏకంగా రూ.లక్ష మార్కు దాటేయడం తెల్సిందే. పసిడి అంటే సామాన్యులతో పాటు శాస్త్రవేత్తలకు సైతం ప్రత్యేక ఆసక్తి. పుత్తడి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు వాళ్లు తెగ ఆసక్తి చూపిస్తారు. ‘‘స్వర్ణం మూలాలెక్కడున్నాయి? బంగారు లోహం భూమ్మీదకు ఎలా వచ్చింది?’’ అన్న ప్రశ్నలు శాస్త్రజు్ఞలను ఎప్పటినుంచో తొలుస్తున్నాయి. పేలిపోయిన నక్షత్రాల నుంచి బంగారం ఉద్భవించిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూట్రాన్ నక్షత్రాలే పుత్తడికి పుట్టిల్లు అని సరికొత్త అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రం తాజాగా ‘ది ఆస్ట్రో ఫిజిక్స్ జర్నల్ లెటర్స్’లో ప్రచురితమైంది. దాదాపు 1,380 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్‌బ్యాంగ్ వల్ల విశ్వం ఆవిర్భవించిందన్నది శాస్త్రవేత్తల సిద్ధాంతం. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో అత్యంత తేలికైన హైడ్రోజన్, హీలియం, అంతకంటే తక్కువ పరిమాణంలో లిథియం వంటి మూలకాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఆ సమయంలో పేలిన నక్షత్రాలు ఇనుము వంటి కాస్త బరువైన మూలకాలను విశ్వమంతటా వెదజల్లాయి. ఇనుము కంటే సాంద్రత ఎక్కువ ఉండే బంగారం ఎప్పుడు, ఎలా ఉద్భవించిందనే ప్రశ్నకు ‘మ్యాగ్నెటార్’ సరైన సమాధానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏమిటీ మ్యాగ్నెటార్లు? మనకు అతి సమీపంలోని నక్షత్రమైన సూర్యుడు అపారమైన శక్తిని వెలుతురు, ఉష్ణశక్తి రూపంలో నిరంతరం విశ్వంలోకి వెదజల్లుతూనే ఉంటాడు. ఇలా నక్షత్రం తనలోని అపారమైన శక్తినంతా వెదజల్లాక గురుత్వాకర్షణ బలాలను కోల్పోతుంది. దీంతో ఎర్రరంగుకు మారి తుదకు పేలిపోతుంది. దాన్ని సూపర్నోవా అంటారు. పేలిన నక్షత్రం న్యూట్రాన్ నక్షత్రంగా, లేదంటే బ్లాక్‌హోల్ (కృష్ణబిలం)గా రూపాంతరం చెందుతుంది. ఈ న్యూట్రాన్ నక్షత్ర ద్రవ్యరాశి అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో అది గురుత్వాకర్షణ శక్తిని తరంగాల రూపంలో విశ్వంలోకి వెదజల్లుతుంది. వాటితోపాటు ‘గామా’ కిరణాలను, అణు కేంద్రకాలను కూడా అతివేగంగా వెదజల్లుతుంది. దీన్ని ఆర్–ప్రాసెస్ అంటారు. బరువైన మూలకమైన బంగారం ఈ క్రమంలోనే జనించిందని అధ్యయనం విశ్లేషించింది. ‘‘విశ్వంలోని ప్రాథమిక అంశాల పుట్టుక నిజంగా నవ్వు తెప్పించే క్లిష్టతరమైన పజిల్ వంటిది. వాటి పుట్టుపూర్వోత్తరాలను మనం పూర్తిగా కనుక్కోలేం. రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొంటే బంగారం పుట్టిందని గతంలో భావించేవారు. కానీ అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటార్ (న్యూట్రాన్ నక్షత్రం) నుంచి కూడా బంగారం పుడుతోందని అధ్యయనంలో తేలింది’’ అని కొలంబియా వర్సిటీ ఫిజిక్స్ డాక్టోరల్ విద్యారి్థ, పరిశోధన ముఖ్య రచయిత అనిరుధ్ పటేల్ చెప్పారు. 20 ఏళ్ల సమాచారం... ‘‘2017లో రెండు నక్షత్రాలు ఢీకొనడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దాంతో అంతరిక్షంలో అలల్లా గురుత్వాకర్షణ తరంగాలు విస్తరించాయి. వీటితోపాటే గామా కిరణాలు పెద్దమొత్తంలో వెలువడ్డాయి. ఇలా ఢీకొనడాన్ని కిలోనోవాగా పేర్కొన్నారు. దాని ఫలితంగా బరువైన బంగారం, ప్లాటినం, లెడ్ ఏర్పడ్డాయి. అందుకే కిలోనోవాలను బంగారం కర్మాగారాలుగా చెబుతారు. మ్యాగ్నెటార్లు గామా కిరణాలను వెదజల్లినప్పుడే బంగారం పుట్టింది’’ అని లూసియానా స్టేట్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎరిక్ బర్న్స్ చెప్పారు.నక్షత్రకంపం! న్యూట్రాన్ నక్షత్రాల్లో అత్యంత కాంతిమయ నక్షత్రాలనే మ్యాగ్నెటార్లు అంటారు. కేవలం టీస్పూన్ సైజులో ఉండే మ్యాగ్నెటార్ ద్రవ్యరాశి కూడా ఏకంగా 100 కోట్ల భూగోళాలంత బరువుంటుంది! మ్యాగ్నెటార్ చుట్టూ అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ క్షేత్రం ఉంటుంది. బిగ్‌బ్యాంగ్ జరిగిన 20 కోట్ల ఏళ్లకే మ్యాగ్నెటార్లు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. భూమి అంతర్గత పొరల్లో సర్దుబాటు వల్ల భూకంపాలు వచి్చనట్టే నక్షత్రంలోనూ నక్షత్రకంపం పుడుతుంది. మాగ్నెటార్ అంతర్భాగంలోని ద్రవరూప పదార్థంలో సర్దుబాటు కారణంగా నక్షత్ర బాహ్యవలయాల్లో ‘స్టార్క్వేక్’లు వస్తాయట.– సాక్షి, నేషనల్ డెస్క్

నిరాఘాటంగా 15 గంటలు విలేకరుల సమావేశం
మాలే: మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు (46) సరికొత్త రికార్డు సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు! ఈ విషయంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. ముయిజ్జు విలేకరుల సమావేశం శనివారం ఉదయం పదింటికి ప్రారంభమైంది. 14 గంటల 54 నిమిషాలపాటు కొనసాగింది. కేవలం ప్రార్థనల కోసం మధ్యలో కాసేపు విరామం ఇచ్చారు. ‘‘దాదాపు 25 మంది విలేకరుల ప్రశ్నలకు ముయిజ్జు విరామం లేకుండా సమాధానాలిచ్చారు.15 గంటల పాటు మాట్లాడి ప్రపంచ రికార్డు నెలకొల్పారు’’ అని మాల్డీవ్స్ ప్రభుత్వం అదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2019 అక్టోబర్‌లో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ 14 గంటల పాటు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అదొక రికార్డుగా నిలిచిపోయింది. అంతకుముందు రికార్డు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషేంకో పేరిట ఉండేది. ఆయన ఏడు గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ముయిజు్టకు ముందు మాల్దీవ్స్ అధ్యక్షుడిగా చేసిన మొహమ్మద్ నషీద్ కూడా ఒక రికార్డు సృష్టించారు. 2009లో ఆయన ప్రపంచంలోనే తొలిసారి సముద్రం అడుగు భాగాన కేబినెట్ సమావేశం నిర్వహించారు! వాతావరణ మార్పులతో సముద్రమట్టం పెరిగిపోతోందని, ఫలితంగా తమ దేశం మునిగిపోయే ప్రమాదముందని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావడానికే ఈ సాహసానికి పూనుకున్నారు.

‘మీరు ఒక్క క్షిపణి దాడి చేశారు.. ఇక మేమేంటో చూపిస్తాం’
టెల్ అవీవ్: తమ దేశంపై హౌతీ రెబల్స్ చేసిన క్షిపణ దాడికి అంతకుమించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాము ఏంటో చూపిస్తామంటూ హౌతీ తిరుగుబాటుదారులను ఉద్దేశించి ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు. ‘ మీరు ఒక క్షిపణి దాడిని మాపై ప్రయోగించారు. దానికి ప్రతీకారం ఎలా ఉంటుందో ఇక నుంచి చూస్తారు. మీరు చేసిన దాడుల కంటే ఏడు రెట్లు అధికంగా మా దాడి ఉంటుంది. గాజాలో ఉన్న పాలస్తీయుల పట్ల సానుభూతి నాటకంతో డ్రామాలు చేస్తున్నారు. మేము గతంలో మీపై యుద్ధం చేశాం. భవిష్యత్ లో కూడా చేస్తూనే ఉంటాం. మీలాగ ఒక్క దాడి కాదు. క్షిపణుల వర్షం కురిపిస్తాం. యూఎస్ తో సమన్వయం చేసకుంటూ ముందుకెళ్తాం. మేము, యూఎస్ కలిసి మిమ్మల్ని అంతమొందిస్తాం’ అని మాట్లాడిన వీడియో ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు ఇజ్రాయిల్ ప్రధాని.צפו בעדכון חשוב ממני אליכם >> pic.twitter.com/hLLodqVnPz— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) May 4, 2025 కాగా, హౌతీ తిరుగుబాటు దారుటు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సైల్‌తో విరుచుకుపడ్డారు. ఆదివారం. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పైకి క్షిపణితో ఎటాక్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలకు గురయ్యారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. మిస్సైల్ ధాటికి 25 మీటర్ల లోతైన భారీ గొయ్యి ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయిల్‌కి ఉన్న శక్తివంతమైన నాలుగు అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకుని క్షిపణి దాడి జరగడం సంచలనం కలిగిస్తోంది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో పడకుండా అడ్డగించిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. ఒక్కసారిగా మిస్సైల్ దాడి జరగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు వెల్లడించారు.
జాతీయం

Mock drills: భారత్‌లో మాక్ డ్రిల్.. 1971భారత్-పాక్ యుద్ధ సమయంలో
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. అదే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌ను బుధవారం (మే7న) నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. సోమవారం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కేంద్రం రాష్ట్రాలకు ఈ ఆదేశాలు చేయడం గమనార్హం.అయితే, మాక్ డ్రిల్ నిర్వహించాలని భారత్ - పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లకు కేంద్రం హోం శాఖ సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. Ministry of Home Affairs has asked several states to conduct mock drills for effective civil defence on 7th May.Following measures will be undertaken1.Operationalization of Air Raid Warning Sirens2. Training of civilians, students, etc, on the civil defence aspects to… pic.twitter.com/DDvkZQZw3A— DD News (@DDNewslive) May 5, 2025శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహణ ఉంటుంది. వీటితో పాటు క్రాష్ బ్లాక్ అవుట్ రిహార్సల్స్, కీలకమైన సంస్థల ముందస్తు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, తరలింపు చర్యల సన్నద్ధత ఉండనుంది. గత ఆదివారం ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల పాటు బ్లాక్ ఔట్ రిహార్సల్స్ జరిగాయి. బ్లాక్ ఔట్ రిహార్సల్స్ భాగంగా రాత్రి 9 నుంచి 9:30 వరకు అన్ని లైట్లు, వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు.

రక్షణశాఖ డేటాను పాక్ హ్యాక్ చేసిందా?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లు మరోసారి భారత్ ను టార్గెట్ చేస్తూ హ్యాకింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న తరుణంలో పాక్ హ్యాకర్లు ఒక ప్రకటన చేశారు. తాము భారత రక్షణశాఖ సైట్లను లక్ష్యంగా చేసుకుని డేటాను హ్యాక్ చేసినట్లు స్పష్టం చేశారు.మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌కు చెందిన సున్నితమైన డేటాను అపహరించినట్లు పాకిస్తాన్ సైబర్స్ ఫోర్స్ అనే హ్యాండిల్ పోస్ట్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సైబర్ దాడుల ద్వారా భద్రతా సిబ్బంది లాగిన్ పాస్వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు రాబట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.కొన్ని రోజులుగా పాకిస్తాన్ నుంచి హ్యాకింగ్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దాడులను గుర్తించడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు అప్రమత్తంగా ఉంటున్నారు. , ఇలాంటి దాడులను నివారించడానికి మరిన్ని భద్రతా చర్యలను పెంచుతున్నామని చెప్పారు. అయితే తమ వెబ్ సైట్ లో డేటాను పాక్ హ్యాక్ చేసినట్లు వార్తలను నోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఖండించింది. అందులో వాస్తవం లేదని పేర్కొంది.

ఎవరీ బీజేపీ లీడర్?..భద్రతా దళాలతో మంచులో రన్నింగ్! వీడియో వైరల్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ.. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు భద్రతా సిబ్బందితో మంచులో పరుగెడుతూ దాని వెనుక బ్యాక్ గ్రౌండ్లో ఓ బాలీవుడ్ సాంగ్ ప్లే అవుతున్న వీడియో ఇప్పుడు విశేషంగా వార్తల్లో నిలిచింది.ఎవరీ బీజేపీ లీడర్?రవీందర్ రైనా.. బీజేపీలో సీనియర్ నాయకుడు. జమ్మూ కశ్మీర్ బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే ఈయన. అయితే ఎప్పుడు వార్తల్లో పెద్దగా కనిపించని రవీందర్ రైనా.. ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచారు. ఒక బృదం భద్రతా బలగాల్ని వెంట బెట్టుకుని ఆయన కూడా మంచులో పరుగెడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది వైరల్ గా మారింది.#JaiHind 🇮🇳🔥🔥🔥 pic.twitter.com/vH4XYKkrpI— Ravinder Raina (@RavinderRaina) May 4, 2025 మండిపడ్డ కాంగ్రెస్‌దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భద్రతా బలగాల్ని ఈ తరహాలో ఉపయోగించుకుంటారా అంటూ మండిపడింది. ఈ వీడియోపై సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినాతే ధ్వజమెత్తారు. పహల్గామ్ దాడి తర్వాత దేశం అంతా తీవ్ర శోకంలో ఉంటే ఇలా చేయడం సమంజసం కాదంటూ విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కొంతమంది తన కుమారుల్ని కోల్పోగా, మరికొంతమంది తల్లిదండ్రుల్ని, పలువురు భర్తల్ని కోల్పోయారు. మరి ఈయన అయితే మంచి రిథమ్ లో ఉన్నారు. రీల్స్ షూటింగ్ చేసుకుంటున్నారు. భద్రతా సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన చర్య’ అంటూ మండి పడ్డారు.

అప్పు ఇవ్వొద్దు,పాక్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్..
ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్ చేస్తోంది భారత్. ఇప్పటికే ఐఎంఎఫ్ తలుపు తట్టిన ప్రధాని మోదీ సర్కార్ తాజాగా, ఇటలీలో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (adb)ను సంప్రదించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌కు రుణాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఏడీబీ వార్షిక సమావేశం కోసం ఇటలీకి వెళ్లిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంక్ చీఫ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పాకిస్తాన్‌కు ఇస్తున్న ఏడీబీ రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదేశానికి అప్పిస్తే.. ఆ సొమ్ము మొత్తం ఉగ్ర సంస్థల ఖాతాల్లోకి వెళుతోందని వివరించారు. ఏడీబీ చీఫ్‌తో పాటు, ఇటలీ ఆర్థిక మంత్రి జియాన్కార్లో గియోర్గెట్టితో కూడా ప్రత్యేక సమావేశమయ్యారు. పాకిస్తాన్‌కు ఇచ్చే నిధుల విషయంలో పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. Union Minister for Finance and Corporate Affairs Smt. @nsitharaman is received by Ambassador Ms. Vani Rao and Consul General Shri Lavanya Kumar after her arrival at the Milan Malpensa Airport, Italy. The Union Finance Minister will participate in the 58th #ADBAnnualMeeting… pic.twitter.com/w63TIRpLQb— Ministry of Finance (@FinMinIndia) May 4, 2025 కాగా, మే 4 నుండి 7 వరకు జరగనున్న ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) గవర్నర్ల బోర్డు 58వ వార్షిక సమావేశంలో సీతారామన్ ఇటాలి మిలాన్‌లో పర్యటిస్తున్నారు. గవర్నర్ల బోర్డు వార్షిక సమావేశానికి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

పాముకాటుకు వివాహిత మృతి
కడెం(మంచిర్యాల): పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దూర్‌కు చెందిన నేరెళ్ల రజిత (35), దాసు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంటి డబ్బుల భారంతో గత కొన్నినెలలుగా పెద్దూర్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పరిసరాల్లో రజిత తోటకూర తెంపుతుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కడెంలో ప్రథమ చికిత్స చేయించి, నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్దమృతదేహం వద్ద రోదిస్తున్న కూతురు కూతుళ్ల రోదన అందరిని కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు వివాహం నిశ్చయం కాగా, అంతలోనే తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయ లు అలముకున్నాయి. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు.

ప్రియురాలి చేతిలో ట్రావెల్ ఏజెంట్ హత్య
అన్నానగర్(తమిళనాడు): మద్యం, మాంసంలో నిద్రమాత్రలు కలిపి దుబాయ్ ట్రావెల్స్ సీఈఓను హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుక్కుడి కి చెందిన త్యాగరాజన్(69) ఇతను కోయంబత్తూరు వచ్చి ఖతీమా నగర్లో నివశించే సమయంలో గోమతి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. గోమతికి నీల, శారద అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2016లో శారదతో గొడవపడిన ఆమె భర్త గుణవేల్ను హత్య చేసి త్యాగరాజన్ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్‌పై వచ్చాడు. ఈ క్రమంలో శారద పని నిమిత్తం దుబాయ్ వెళ్లింది. ఆ సమయంలో తిరువారూరు జిల్లాకు చెందిన ట్రావెల్ ఏజెంట్ సిగమణి(47)తో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. శారదకు, సిగమణికి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దాంట్లో సమస్య వచ్చింది. దీంతో శారద కోవైకి తిరిగి వచ్చింది. శారదను శాంతింపజేసేందుకు సిగమణి 21న కోయంబత్తూరుకు వచ్చాడు. అతనిని శారద తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో త్యాగరాజన్ నెల్లైకి చెందిన ప్రముఖ రౌడీ పశుపతిపాండియన్ సహచరుడు పుదియవన్ కోయంబత్తూరుకు ఆహ్వానించారు. ఆ తర్వాత 22వ తేదీ రాత్రి మద్యం, మాంసంలో 30కి పైగా నిద్ర, నొప్పి నివారణ మాత్రలు కలిపి సిగమణిని హత్య చేశారు. అనంతరం సిగమణి మృతదేహాన్ని త్యాగరాజన్, శారద, పుదియవన్ కారులో తీసుకెళ్లి కరూర్ పొన్నమరావతి పక్కన పడేసి, పారిపోయారు. మిగిలిన ఇద్దరు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. దీనిపై సిగమణి భార్య ప్రియా(69) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబత్తూరు బీలమేడు పోలీసులు విచారణ చేపట్టారు. త్యాగరాజన్(69), ఇతని వివాహేతర ప్రియురాలు గోమతి (53), ఆమె కూతుళ్లు నీల (33), శారద (35), కోడలు స్వాతి (26), పుదియవన్(48) సిగమణిని హత్య చేసినట్లు తేలింది. ఆదివారం శారదతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

భర్త వివాహేతర సంబంధం.. గుండెపోటుతో భార్య మృతి..!
ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్‌తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అనిల్ హైదరాబాద్‌లోని పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్ యత్నంచాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్‌పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.

ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క..!
వెంగళరావునగర్(హైదరాబాద్): తాను పెంచుకుంటున్న శునకమే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన డి.పవన్‌కుమార్ (37) తన స్నేహితుడు సందీప్‌తో కలిసి పదేళ్లుగా మధురానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గదిలో నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్క కూడా ఉంది. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారితో తలుపు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా పవన్ విగతజీవిగా కనిపించాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది. కుక్క అతడి మర్మాంగాలను గాయపర్చడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పవన్‌కుమార్‌కు గతంలో వివాహమైంది. భార్యతో విడాకులు కావడంతో నగరంలో ఉంటున్నాడు. స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.