సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద ఉన్న రైల్లో బాంబు పేలి ఒక యువతి మరణించి 24 గంటలు గడిచిందో, లేదో.. చెన్నై పోలీసులకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు ఎక్కువైపోయి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద ఉన్న రైల్లో బాంబు పేలి ఒక యువతి మరణించి 24 గంటలు గడిచిందో, లేదో.. చెన్నై పోలీసులకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు ఎక్కువైపోయి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎంతగా హెచ్చరించినా ఈ ఫోన్లు మాత్రం ఆగడంలేదు.
నగరంలోని ఓ పెద్ద షాపింగ్ మాల్, ఓ విద్యాసంస్థ, ఓ శివారు రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. దీంతో వెంటనే భద్రతా విభాగం అధికారులు హుటాహుటిన వెళ్లి అక్కడ పూర్తిస్థాయిలో తనిఖీ చేసినా, బాంబులు మాత్రం దొరకలేదని నగర పోలీసు కమిషనర్ జేకే త్రిపాఠీ తెలిపారు.