
కొత్తపల్లి(కరీంనగర్) : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో కారు పరుగుడెతోందని దప్పుతో దరువేసారు. టీఆర్‌ఎస్ అత్యధిక మెజారిటీ విజయం సాధిస్తుందని దండోరా వేస్తూ ప్రచారం నిర్వహించారు.
గంగులకు బాసటగా... టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలుపు కోసం ఆయన సతీమణి రజిత, కుమారు డు హరిహరన్‌సాయి, కూతురు జాహ్నవి, అన్న కుమారుడు ప్రదీప్ నగరంలోని పలు డివిజన్లలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.