
కేసీఆర్ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది ఆయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించింది. దాదాపు రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ ఆస్పత్రిలోనే ఉన్నారు. పరీక్షల అనంతరం ముఖ్యమంత్రి తిరిగి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. రిపోర్టులు వచ్చిన అనంతరం యశోద ఆసుపత్రి వైద్యలు వివరాలు చెప్పనున్నారు. కాగా, ఆయన వెంట సతీమణి శోభ, కూతురు కవిత, మనవడు హిమాన్ష్, మంత్రి తలసాని శ్రీనివాస్, శుభాష్ రెడ్డిలు కూడా ఆసుపత్రికి వచ్చారు.