
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో సిటీ బస్సుల సర్వీసుల కొరత ఎంత తీవ్రంగా ఉందో ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. ఉదయం ఎన్నో ప్రయాసలకోర్చి కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు తిరిగి ఇళ్లకు చేరేందుకు సరైన రవాణా సదుపాయం అందుబాటులో ఉండడంలేదు.తిరుగుతున్న అరకొర బస్సుల్లో చోటు దొరక్క విద్యార్థినులు ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతూ ప్రయాణం చేస్తుంటే.. విద్యార్థులు బస్సు వెనుక వేలాడుతూప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.ఈ సంఘటన మంగళవారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్‌బీనగర్ వెళుతున్న బస్సులో కనిపించింది.