TS RTC
-
Hyderabad: మగాళ్లూ.. బస్సెక్కరూ!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ప్రయాణం బెంబేలెత్తిస్తోంది. సిటీ బస్సుల్లో పయనించేందుకు పురుష ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. ‘మహాలక్ష్మి’ రాకతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు మహిళలతో కళకళలాడుతున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో సిటీ బస్సుల్లో ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు బస్సుల్లో మూడొంతుల మగ ప్రయాణికులతో కనిపించే రద్దీ ఇప్పుడు మహిళలతో నిండుగా పరుగులు తీస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. కానీ ప్రభుత్వం రీయింబర్స్ రూపంలో చెల్లిస్తుండడంతో ఆరీ్టసీకి నగదు రూపంలో వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే మగ ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్న పంథాలో ముందుకు వెళ్తోంది. ప్రతి డిపోలో రోజుకు రూ.లక్ష అదనపు ఆదాయమే లక్ష్యంగా కండక్టర్లు, డ్రైవర్లను కార్యోన్ముఖులను చేస్తోంది. యాజమాన్యం ఒత్తిడి కారణంగా అదనపు ఆర్జన కోసం కండక్టర్లు, డ్రైవర్లు రూ.లక్ష లక్ష్యంగా’ మగప్రయాణికుల వేటలో పడ్డారు. ప్రధాన బస్టాపుల్లో బస్సుల కోసం ఎదురు చూసే మగ ప్రయాణికులను ‘బస్సెక్కండి ప్లీజ్’ అంటూ ఆహ్వానించడం ఆసక్తికరమైన పరిణామం. మూడొంతుల ప్రయాణికులు మహిళలే.. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోల పరిధిలో ప్రతిరోజూ సుమారు 2,800 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 1,800కు పైగా ఉంటాయి. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ బస్సుల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీంతో అన్ని వర్గాల ప్రయాణికులు ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా ఉదయం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, అధ్యాపకులు, వ్యాపారులు తదితర వర్గాలతో బస్సుల్లో రద్దీ ఉంటుంది. సాయంత్రం తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలోనూ బస్సులు కిక్కిరిసి ఉంటాయి. మరోవైపు మహిళా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సాధారణ ప్రయాణికుల సీట్లు సైతం వారితోనే నిండిపోతున్నాయి. చివరకు మొదటి ప్రవేశ ద్వారం ఫుట్‌బోర్డు సైతం మహిళలతో కిటకిటలాడుతోంది. – సిటీ బస్సుల్లో ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 22 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. వారిలో 15 లక్షల మందికి పైగా మహిళలే ఉన్నట్లు అంచనా. కేవలం 7 లక్షల మంది మగవారు ఉన్నారు. మహాలక్ష్మి పథకానికి ముందు ఉన్న ప్రయాణికుల లెక్కలు ఇప్పుడు పూర్తిగా తారుమారయ్యాయి. ‘కొన్నిసార్లు బస్సుల్లో నిల్చోవడం కూడా కష్టంగా ఉంటోంది. బస్సెక్కి దిగే వరకు సర్కస్ ఫీట్లు చేసినట్లవుతుంది.’ అని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ తెలిపారు. ప్రతిరోజూ అమీర్‌పేట్ వరకు రాకపోకలు సాగించడం కష్టంగా మారిందన్నారు. సొంత వాహనాల వినియోగం.. మరోవైపు ఆర్టీసీ అధికారుల అంచనాల మేరకు మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చన తర్వాత పెరిగిన మహిళా ప్రయాణికుల రద్దీతో మగవారు సొంత వాహనాల వినియోగం వైపు మళ్లారు. ద్విచక్ర వాహనాల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్న ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో ‘జెంట్స్ స్పెషల్’ బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేపట్టారు. కానీ దీనిపై వ్యతిరేకత రావడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సీట్లపై ‘స్త్రీలకు మాత్రమే’ అని కనిపించే వాటి సంఖ్యను తగ్గించారు. పలు మార్గాల్లో మెట్రో లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు.రూ.లక్ష లక్ష్యం ఎందుకంటే..‘మొదటి నుంచి సిటీ ఆరీ్టసీకి నష్టాలే. ఇప్పడు ‘మహాలక్ష్మి’ పథకానికి ప్రభుత్వమే నిధులను అందజేస్తోంది. రోజువారీ అవసరాలు, బస్సుల నిర్వహణ, సిబ్బందికి ప్రోత్సాహకాలు వంటివి అందజేసేందుకు నగదు అవసరం. అందుకే ప్రతి డిపోలో రోజుకు ఒక రూ.లక్ష అదనంగా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా గతంలో ఉన్న విధంగా పురుష ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటే టికెట్లపై ఆశించిన స్థాయిలో ఆదాయం లభించేది. కానీ ఇప్పుడు వారి సంఖ్య తగ్గడంతో ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వారి సంఖ్యను పెంచుకొనేందుకు ప్రయతి్నస్తున్నట్లు చెప్పారు. కండక్టర్లు, డ్రైవర్లపై తీవ్ర ఒత్తిడి.. ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ఉచిత ప్రయాణసదుపాయం అభినందనీయమే. కానీ ప్రయాణికుల రద్దీ వల్ల బస్సులు నడపడం కష్టంగా మారింది. ఈ సమయంలో మగ ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు టార్గెట్లు విధిస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడి మధ్య పని చేయడం వల్ల వారిలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. – ఇ.వెంకన్న, ఆర్టీసీ కారి్మక సంఘాల జేఏసీ చైర్మన్ -
మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: మెహిదీపట్నం నుంచి కందవాడకు బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు మెహిదీపట్నం–కందవాడ (592) రూట్లో మూడు ట్రిప్పులు ప్రతిరోజు రాకపోకలు సాగించనున్నాయి. ఈ బస్సులు నానల్‌నగర్, లంగర్‌హౌస్, టీకే బ్రిడ్జి, బండ్లగూడ, ఆరెమైసమ్మ, తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, గోల్డెన్‌ఫామ్స్, మల్కాపురం, పుల్లుట్ట, కేసారం, చేవెళ్ల మీదుగా కందవాడకు రాకపోకలు సాగిస్తాయి. మెహిదీపట్నం నుంచి ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1.30, సాయంత్రం 3.55 గంటలకు బయలుదేరుతాయి. అలాగే కందవాడ నుంచి ఉదయం 9.25 గంటలకు, మధ్యాహ్నం 2.45, సాయంత్రం 5.10 గంటలకు తిరిగి మెహిదీపట్నంకు బయలుదేరుతాయి. -
జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి విధుల్లో ఆ తరహా వస్త్రధారణ కూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.డ్రైవర్లు, కండక్టర్లకు ’ఖాకీ’.. మిగిలిన వాళ్లు ఇష్టమొచ్చినట్టుగా!ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తారు.. బస్టాపులు, బస్టాండ్లలో ఉండే సూపర్వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో ఉంటారు.. కానీ, డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో ఉండే అధికారులకు యూనిఫాం అంటూ లేదు. డ్రెస్ కోడ్ కూడా లేకపోవటంతో ఇంతకాలం క్యాజువల్ వస్త్రధారణ తో విధులకు హాజరవుతున్నారు. దీన్ని పెద్దగా పట్టించుకునేవారు లేకపోవటంతో, రంగురంగుల డ్రెస్సులు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్డులు ధరించి వస్తున్నారు.కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. తాజాగా దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన తరచూ అధికారులతో గూగుల్ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో డిపో స్థాయి సిబ్బందితో కూడా ఆన్లైన్ సమావేశాల్లో ముచ్చటిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టుల్లో కనిపిస్తున్నారు. ఇది ఆయనకు చికాకు తెప్పించింది.ఫార్మల్ డ్రెస్సుల్లోనే రావాలని ఆదేశాలుదేశంలోనే పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే విషయాన్ని ఆయన ఈడీ ‘అడ్మిన్) దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తాజాగా ఈడీ (అడ్మిన్) లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సంస్థకు ఉన్న పేరు, డిపో కార్యాలయాల గౌరవానికి వారి డ్రెస్సింగ్ భంగంగా ఉందంటూ ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ఇక నుంచి గౌరవప్రదంగా ఉండే ఫార్మల్ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.యూనిఫాంలో కనిపించని స్పష్టతఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫాంలో కనిపిస్తారు. కొన్ని బస్సుల్లో నీలి రంగు యూనిఫాం ఉంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించింది. ఆర్టీసీలో అతిపెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో సిబ్బంది యూనిఫాంపై ప్రస్తావించారు. మహిళా కండక్టర్లకు యాప్రాన్ అందజేస్తామని చెప్పి.. ఆ యాప్రాన్ ఏ రంగులో ఉండాలో నిర్ధారించేందుకు ఓ కమిటీ వేశారు.రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత, మెరూన్ రంగులో ఉండే యాప్రాన్‌ను సిఫారసు చేశారు. ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్రం కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ యాప్రాన్ కూడా కనిపించటం లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు యూనిఫాం కూడా కొన్నేళ్లపాటు సరఫరా కాలేదు. వారికి ఖాకీ బదులు మరో రంగు ఇవ్వాలన్న అంశం కూడా తెరమరుగైంది. -
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
టీఎస్ ఆర్టీసీకి రూ.21.72 కోట్లు టోకరా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెల్లించాల్సిన రూ.21.72 కోట్లు చెల్లించకుండా మోసం చేసిన కేసులో యాడ్ ఏజెన్సీ నిర్వాహకుడు వి.సునీల్‌ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల్లోని యాడ్ స్పేస్‌ను వినియోగించుకున్న అతను టీఎస్ ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం ఎగవేసినట్లు టీమ్–5 ఏసీపీ బి.బాబురావు తెలిపారు. చింతల్ ప్రాంతానికి చెందిన సునీల్ తన భార్య మృదులతో కలిసి గో రూరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం టెండర్ల ద్వారా టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లకు చెందిన యాడ్ స్పేస్‌ను పొందాడు. దీనిని వివిధ సంస్థల ప్రకటనల కోసం అద్దెకు ఇచ్చే ఇతగాడు భారీ మొత్తం ఆర్జించాడు. ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సునీల్ ప్రతి నెలా రూ.40 లక్షల చొప్పున సంస్థకు చెల్లించాల్సి ఉంది. దీనికి ష్యూరిటీగా ముందుగానే రూ.3 కోట్లు ఆర్టీసీ వద్ద డిపాజిట్ చేశాడు. తొలినాళ్లల్లో నామమాత్రపు చెల్లింపులు చేసిన సునీల్ ఆపై మొండికేశాడు. కోవిడ్, లాక్డౌన్ తదితరాల వల్ల ఆశించిన ఆదాయం రాలేదని, కొన్ని బస్సులు తిరగకపోవడంతో యాడ్స్ తగ్గాయని ఆర్టీసీ అధికారులకు చెప్పుకొచ్చాడు. 2021లో రూ.కోటి విలువైన చెక్కులు ఇచ్చినా బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయి. దీనిపై ఆర్టీసీ అధికారులు సునీల్‌ను సంప్రదించి వివరణ కోరడంతో పాటు చెక్‌బౌన్స్ కేసు వేస్తామని స్పష్టం చేశారు. ఆ సమయంలో రెండు రీజియన్ల అధికారులకు లేఖలు రాసిన సునీల్ చెక్బౌన్స్పై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవద్దని, త్వరలోనే ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం ఇచ్చేస్తానంటూ హామీ ఇచ్చాడు. సంస్థకు నగదు జమ కావాలనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు సైతం ఈ మేరకు అవకాశం ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఆర్టీసీ అధికారులను సునీల్ బేఖాతరు చేయడం మొదలెట్టాడు. ప్రకటనల ద్వారా అతడు మాత్రం ఆదాయం ఆర్జిస్తూ ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.21.72 కోట్లు ఎగ్గొట్టాడు. దీంతో అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం సునీల్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
17, 18 తేదీల్లో ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి వస్తుండటంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపో తున్నాయి. రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. బుధ,గురువారాల్లో రికార్డు స్థాయిలో 101 శాతాన్ని మించి ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదైంది. ఈ రెండు రోజుల్లో టీఎస్ఆర్టీసీకి రూ.45.1 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు 33.93 లక్షల కి.మీ.మేర తిరిగి 48.94 లక్షలమంది ప్రయాణికులను గమ్యం చేర్చాయి. ఆ రోజు 101.62 శాతం ఓఆర్‌తో రూ.22.45 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక 18వ తేదీన 34.18 లక్షల కి.మీ.మేర బస్సులు తిరిగ్గా 50.60 లక్షలమంది ప్రయాణికులు గమ్యం చేరారు. 101.92 శాతం ఓఆర్ నమోదైంది. ఇప్పటివరకు ఇదే గరిష్ట శాతం కావటం విశేషం. ఆ రోజు రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక రోజులో ఇంత ఆదాయం నమోదు కావటం కూడా ఇదే తొలిసారి కాగా, గతేడాది జనవరి నెలలో 17వ తేదీనాటికి సమకూరిన ఆదాయం కంటే ఈసారి రూ.92 కోట్లు ఎక్కువ నమోదు కావటం విశేషం. -
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి...ఇంకా ఇతర అప్డేట్స్
-
Telangana: మహిళా ప్రయాణికులకు బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ దృష్ట్యా మహిళా ప్రయాణికులకు ముందస్తు సూచన. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుంది. పాన్ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలి. 'ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు. కావున ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలి. ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకుని ఆర్టీసీకి సహకరించాలి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. -
ఇది లేడీస్ సీటు లేవండి అన్నందుకు.. మమ్మల్నే కొట్టారు!
యాదగిరిగుట్ట: ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత మహిళలు తమ కుటుంబ సభ్యులతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అధికంగా వస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం సికింద్రాబాద్‌కు చెందిన బండి నాని, మౌనిక దంపతులు తమ పిల్లలతో కలిసి యాదాద్రీశుడి దర్శనానికి ఉదయం వచ్చారు. శ్రీస్వామివారిని దర్శించుకొని సాయంత్రం 5గంటల సమయంలో తిరిగి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ వద్దకు వచ్చారు. సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సులో నాని తన భార్య మౌనిక, పిల్లలతో కలిసి ఎక్కారు. ఇందులో మహిళల సీట్లలో పురుషులు కూర్చోవడంతో.. ఇది లేడిస్ సీటు.. మా పిల్లలు, భార్య కూర్చుంటుందని కొద్దిగా లేవండి అని ప్రయాణికులను కోరాడు. ఈ సమయంలో మహిళల సీటులో కూర్చున్న పురుషులు నానితో వాగ్వాదానికి దిగారు. ఆరుగురు ప్రయాణికులు నానితో పాటు ఆయన భార్య మౌనికలను తీవ్రంగా కొట్టారు. బస్సును డ్రైవర్, కండక్టర్ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిలిపి, కానిస్టేబుల్‌ను తీసుకువచ్చి గాయపడిన నాని, మౌనికలను సముదాయించారు. తనను కొట్టిన వ్యక్తులపై కేసు పెట్టమంటే.. తమనే దింపేసి వెళ్లిపోయారని నాని, మౌనిక వాపోయారు. ముఖానికి గాయమైన నానిని తన భార్య మౌనిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. -
TSRTC: జనవరి 5 నుంచి సమ్మెకు వెళ్తాం..
మంచిర్యాలఅర్బన్: సుదీర్ఘ కాలం తర్వాత ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5నుంచి సమ్మెకు అద్దె బస్సుల నిర్వాహకుల నిర్ణయంతో బస్సులు నిలిచిపోనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 9న మహలక్ష్మి పథకం ప్రవేశపెట్టింది. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించడంతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రెట్టింపైంది. 50శాతం నిండని బస్సుల్లో 75శాతం నుంచి 80 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఏ బస్సుల్లో చూసినా పరిమితికి మించి 110 నుంచి 120 మంది ప్రయాణం చేస్తున్నారు. నిబంధనల మేరకు పల్లె వెలుగు బస్సుల్లో 56, ఎక్స్ప్రెస్ల్లో 51మంది ప్రయాణికులకే మాత్రం బీమాను యజమానులు చెల్లిస్తూ వస్తున్నారు. అంతకు మించి ప్రయాణికులు పెరిగినా బీమా వర్తించదని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే నష్టపరిహారం బాధ్యత ఎవరిదనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సులపై అదనపు భారం పడి.. వేగం తగ్గిపోతుందని బస్సుల యజమానులు వాపోతున్నారు. ఈ నెల 5నుంచి ఆర్టీసీలో సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. 309 బస్సులకు బ్రేక్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 606 బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర వేస్తున్నారు. ఇందులో 303 అద్దె బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆదిలాబాద్‌లో 60, మంచిర్యాలలో 69, నిర్మల్‌లో 77, భైంసాలో 49, ఆసిఫాబాద్‌లో 31, ఉట్నూర్‌లో 23 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఈ లెక్కన సంస్థ పరిధిలో నడిచే బస్సుల్లో సగం అద్దె బస్సులే అన్నమాట. మహలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత బస్సులు సరిపోవడం లేదు. కొన్ని రూట్లలో ఏ బస్సులో చూసినా రద్దీ తగ్గడం లేదు. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని కొత్త బస్సులు రావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో ఆర్టీసీలో అద్దె బస్సులు సగానికి పైగా సమ్మెకు వెళ్తే పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది. సమ్మె నోటీసు.. తమ డిమాండ్లు పరిష్కరించాలని అద్దెబస్సుల యజమానులు సమ్మెకు దిగుతున్నారు. ఇప్పటికే అద్దె బస్సుల యజమానుల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల డిపో మేనేజర్ రవీంద్రనాథ్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉండడంతో ఇబ్బందులు తప్పేలా లేదు. ఆర్టీసీలో సగం బస్సులు అద్దె బస్సులే కావడంతో సమ్మెకు వెళ్తే ఎలా అనేదానిపై చర్చ సాగుతోంది. మొత్తం బస్సులు తిప్పితేనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. అలాంటిది సగం బస్సులు నిలిచిపోతే ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
Telangana: ప్రయాణికులకు ప్రైవేట్ బస్సులే శరణ్యమా?
సాక్షి,హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊరుకెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న నగరవాసులకు బస్సులు, రైళ్లలో ప్రయాణం అసాధ్యంగా మారింది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లతో పాటు సంక్రాంతి సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ 150 నుంచి 250 దాటి కనిపిస్తోంది. కొన్ని రైళ్లలో బుకింగ్‌కు కూడా అవకాశం లేకుండా నో రూమ్ దర్శనమిస్తోంది. ఈ పరిస్థితుల్లో లక్షలాది మంది ప్రయాణికులు ఆర్టీసీ వైపు చూస్తున్నారు. కానీ.. సాధారణంగా జనవరి మొదట్లోనే ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ కార్యాచరణ చేపడుతుంది. సొంత ఊళ్లకు వెళ్లేందుకు నగరవాసులు ముందస్తుగా రిజర్వేషన్లు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచి్చన తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సీ వంద శాతానికి పెరిగింది. కొన్ని రూట్లలో ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికుల రద్దీ మేరకు డీలక్స్ బస్సులను ఏర్పాటు చేయాల్సివస్తోంది. దీంతో సంక్రాంతికి ప్రత్యేకంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయడం ఆర్టీసీకి సవాల్‌గా మారింది. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే లగ్జరీ, డీలక్స్ వంటి బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్ బస్సులను రద్దీ ప్రాంతాలకు మళ్లిస్తారు. కానీ మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చనప్పటి నుంచి పల్లెవెలుగు బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ రద్దీ పెరిగింది. ప్రతిరోజు 88 శాతం నుంచి 100 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా ఈ బస్సులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం కష్టమే. ఏటా 25 లక్షల మందికిపైగా ప్రయాణం.. సొంత ఊళ్లలో సంక్రాంతి వేడుకల కోసం నగరం నుంచి ప్రతి ఏటా సుమారు 25 లక్షల మందికి పైగా బయలుదేరి వెళ్తుంటారు. పిల్లలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన వెంటనే ప్రయాణాలు మొదలవుతాయి. జనవరి రెండో వారంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. ఇందుకనుగుణంగా ఆర్టీసీ సుమారు 4,500 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని దూరప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి.మరోవైపు ఏపీఎస్‌ఆరీ్టసీ కూడా అదనపు బస్సులను అందుబాటులోకి తెస్తుంది. ప్రత్యేక బస్సుల కోసం ఆర్టీసీ అధికారులు వివిధ జిల్లాల్లోని డిపోల నుంచి అందుబాటులో ఉన్న బస్సులను సేకరిస్తారు. ముఖ్యంగా మహిళల ప్రయాణాలు మరింత పెరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ జిల్లాలకు అదనపు ట్రిప్పులు వేయడం కూడా సవాల్‌గా మారవచ్చని ఒక అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. “ఒకవేళ సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని బస్సులను ఏపీలోని వివిధ ప్రాంతాలకు అదనంగా మళ్లిస్తే తెలంగాణ ప్రయాణికులకు బస్సుల కొరత ఏర్పడవచ్చు. కానీ సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడపలేకపోతే పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవాల్సివస్తోంది’ అని వివరించారు. తెలంగాణ ఆర్టీసీ ఇటీవల 50 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చింది. మరో 30 బస్సులు త్వరలో రానున్నాయి. వీటిలో డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని తదితర కేటగిరీలకు చెందిన బస్సులు ఉన్నాయి. ఈ బస్సులను సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, ఏలూరు, చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు నడిపే అవకాశం ఉంది. కానీ రద్దీ తీవ్రత దృష్ట్యా అదనపు బస్సుల ఏర్పాటు ఈ సారి సవాల్‌గానే మారనుంది. ప్రైవేట్ బస్సుల దోపిడీ... ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులపై నిలువు దోపిడీకి పాల్పడే ప్రైవేట్ బస్సులు ఈసారి మరింత రెచి్చపోయే అవకాశం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు రూ.910 వరకు చార్జీ ఉంటే సంక్రాంతి సందర్భంగా రూ.1600కు పైగా వసూలు చేస్తారు. అలాగే విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, చిత్తూరు, కడప, తిరుపతి తదితర ప్రాంతాలకు కూడా చార్జీలను రెట్టింపు చేస్తారు. ఈ సారి ప్రయాణికుల రద్దీ మేరకు ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేయలేకపోతే ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపైన ఆధారపడాల్సివస్తోంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా చార్జీలను పెంచే అవకాశం ఉందని కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన వినయ్ అనే ప్రయాణికుడు అభిప్రాయపడ్డారు. -
జనగామ బరిలో నేనే ఉంటా
జనగామ: తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడానికి కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ముత్తిరెడ్డి.. కార్యక్రమం అనంతరం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని, ఆ మేరకే ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. అంతకుముందు ఆయన హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్య త లు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవుళ్ల చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఫైల్‌పై తొలి సంతకం చేశారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ పురోగతికి కృషి చేస్తానన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎండీగా ఉంటూ సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారని, తాను కూడా సంస్థ ఉద్యోగుల్లో ఒకడిగా వ్యవహరిస్తూ సంస్థ బాగుకు యత్నిస్తానని తెలిపారు. అనంతరం ఎండీ సజ్జనార్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ శుభవార్త
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. “బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ని సంప్రదించాలి.” టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని #TSRTC నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 21, 2023 -
హైదరాబాదీలకు మరో గుడ్‌న్యూస్.. టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
హైదరాబాద్: గండిమైసమ్మ నుంచి హైటెక్ సిటీకి వెళ్లేందుకు మియాపూర్ వరకు వచ్చి అక్కడి నుంచి మరో బస్సు మారాలి. ఈసీఐల్ నుంచి షామీర్‌పేట్‌కు వెళ్లే ప్రయాణికులు సుచిత్ర వద్ద మరో బస్సెక్కాలి. ప్రతి రోజు వేలాది మంది రాకపోకలు సాగించే ఈ రూట్లలో రెండు బస్సులు మారాల్సి రావడంతో ప్రయాణికులు సిటీ బస్సులకు ప్రత్యామ్నాయంగా ఆటోలను ఎంపిక చేసుకుంటున్నారు. ఒక్క ఈ రెండు మార్గాల్లోనే కాదు.. నగరంలోని అనేక రూట్లలో నేరుగా బస్సు సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆర్టీసీ అధ్యయనంలో వెల్లడైంది. ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేవిధంగా ఆర్టీసీ అధికారులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే కొన్ని రూట్లను పొడిగించి ఈ తరహా బస్సులను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా మరిన్ని రూట్లపైన దృష్టి సారించారు. ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, హౌస్‌కీపింగ్ సిబ్బంది, ఔటర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూట్ల పొడిగింపును చేపట్టినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. సాఫీగా ప్రయాణం.. ► జగద్గిరిగుట్ట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రతి రోజు వందలాది మంది హౌస్‌కీపింగ్ సిబ్బంది ఐటీ సంస్థల్లో పని చేసేందుకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వైపు ప్రయాణం చేస్తారు. కానీ ఈ ప్రయాణికులంతా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వద్ద బస్సులు మారాల్సి ఉంటుంది. ఇందుకోసం రోడ్డు దాటాలి. ఇది చాలా మంది మహిళా ప్రయాణికులకు ఎంతో ఇబ్బందిగా ఉన్నట్లు ఆర్టీసీ గుర్తించింది. జగద్గిరిగుట్ట నుంచి నేరుగా ఐటీ కారిడార్లకు చేరుకొనేలా బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టారు. ► ఈసీఐఎల్ నుంచి మేడ్చల్, షామీర్పేట్లకు వెళ్లేందుకు గతంలో రెండు బస్సులు మారాల్సి ఉంది. దీంతో ఈసీఐల్ నుంచి రెండు వైపులా నేరుగా వెళ్లేందుకు బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే బస్సులు ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెహిదీపట్నం చౌరస్తాలో మలుపు తిప్పుకోవడం ఎంతో కష్టంగా మారింది. మరోవైపు మెహిదీపట్నం నుంచి మంచిరేవుల వైపు వెళ్లేవారు రెండు బస్సులు మారాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉప్పల్–మెహిదీపట్నం (113ఎం) బస్సులను కొన్నింటిని మంచిరేవుల వరకు పొడిగించారు. ఈ బస్సులు బోడుప్పల్ కాలనీ నుంచి మంచిరేవుల (113/120ఎం) వరకు నేరుగా రాకపోకలు సాగిస్తాయి. బోడుప్పల్ నుంచి నేరుగా నానల్‌నగర్, షేక్‌పేట్, పుప్పాలగూడ, మంచిరేవుల వరకు వెళ్లే ప్రయాణికులు ఈ బస్సులను వినియోగించుకోవచ్చు. ► లింగంపల్లి నుంచి నల్లగండ్ల మీదుగా క్యూసిటీ వరకు మరో కొత్త రూట్‌ను సైతం ఎంపిక చేశారు. మేడ్చల్ వైపు నుంచి ప్రతి రోజు వందలాది మంది ప్రయాణికులు మెహిదీపట్నం వరకు ప్రయాణం చేస్తున్నారు. కానీ.. సికింద్రాబాద్‌లో దిగి మెహిదీపట్నం బస్సెక్కాల్సి ఉంటుంది. పద్మవ్యూహాన్ని తలపించే సికింద్రాబాద్ ట్రాఫిక్ వలయాన్ని దాటుకొని బస్సెక్కేందుకు ప్రయాణికులు చాలా కష్టపడాల్సివస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు మేడ్చల్ నుంచి బేగంపేట్ మీదుగా మెహిదీపట్నానికి డైరెక్ట్ బస్సును ప్రవేశపెట్టారు. ఔటర్‌కు అందుబాటులో.. ► శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు ఇటు ఘట్కేసర్ నుంచి మేడ్చల్ వరకు ఔటర్‌కు ఆనుకొని ఉన్న కాలనీలను, గ్రామీణ ప్రాంతాలను కనెక్ట్ చేసేవిధంగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ► సర్వీస్‌రోడ్డు మార్గాల్లో సిటీ బస్సులను అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులకు నిరాటంకమైన రవాణా సదుపాయం లభించనుంది. ‘ఉబెర్. ఓలా వంటి సదుపాయాల వల్ల చాలా వరకు ప్రయాణికులు నేరుగా గమ్యానికి చేరుకొనేందుకే మొగ్గు చూపుతున్నారు. మారిన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని ఒక అధికారి వివరించారు. స్కూల్ వేళలకు అనుగుణంగా 2 వేల ట్రిప్పులు ఈ నెల 12వ తేదీ సోమవారం నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యార్థుల డిమాండ్ మేరకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. పిల్లలు ఉదయం స్కూళ్లకు వెళ్లేందుకు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు వీలుగా బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. సికింద్రాబాద్ రీజియన్‌లో ప్రతి రోజు సుమారు వెయ్యి ట్రిప్పులను అదనంగా నడపనున్నారు. హైదరాబాద్ రీజియన్‌లోనూ మరో వెయ్యి ట్రిప్పులను నడుపుతారు. ఉద యం 7 నుంచి 9 గంటల వరక తిరిగి మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. -
Hyderabad: ఆర్టీసీ బంపర్ ఆఫర్
హైదరాబాద్: ఆర్టీసీ టి–24 టికెట్లపై మరో రాయితీని ప్రకటించింది. గ్రేటర్లో రాకపోకలు సాగించేందుకు ఇప్పటి వరకు రూ.100 ఉన్న టి–24 టికెట్ ధరలను రూ.90కు తగ్గించింది. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు టికెట్లు రూ.80కే లభిస్తాయి. వారికి 20 శాతం రాయితీ వర్తించనుంది. వయసు ధ్రువీకరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డును బస్ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుంది. గురువారం నుంచే ఈ రాయితీలు అమల్లోకి రానున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. టి–24 టికెట్లపై సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికై నా ప్రయాణించవచ్చు. మొదట్లో ఆ టికెట్ ధర రూ.120 వరకు ఉండేది. ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు రూ. 100కి తగ్గించారు. తాజాగా సాధారణ ప్రయాణికులకు టి–24 టికెట్ ధరను రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి తగ్గిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎండాకాలంలో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ రాయితీని కల్పిస్తున్నట్లు ఎండీ తెలిపారు. ఈ టికెట్లకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందని, ప్రతి రోజు సగటున 25 వేల వరకు అమ్ముడవుతున్నాయని పేర్కొన్నారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం రూ.50కే లభించే టి–6 (ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు) టికెట్లకు కూడా మంచి ఆదరణ ఉందన్నారు. -
శబరిమలకి ఆర్టీసీ సర్వీసులు.. ప్రతీ బస్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణం
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రతీ ఒక్క అవకాశాన్ని గరిష్టంగా వినియోగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే కార్తీక మాసం ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఆర్టీసీ తాజాగా అయ్యప్ప స్వాముల కోసం శబరిమలకి బస్సు సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది. శబరికి బస్సులు కార్తీక మాసం రావడంతో పల్లె పట్నం తేడా లేకుండా అయ్యప్పమాల ధరించిన వారే కనిపిస్తున్నారు. స్వామి శరణం మాట ప్రతీ చోట ధ్వనిస్తోంది. ఎక్కువ మంది భక్తులు అయ్యప్ప మాల విరణమ కోసం శబరిమలకి వెళ్తుంటారు. ఇలా వేళ్లే వారు ఇప్పటి వరకు ఎక్కువగా ప్రైవేటు వెహికల్స్‌నే ఆశ్రయిస్తున్నారను. కాగా అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఐదుగురికి ఫ్రీ శబరిమలకి వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్ చేసుకుంటే అదే బస్సులో మరో ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఈ మేరకు వరంగల్ 1 డిపో తరఫున ట్విట్టర్లో ప్రచారం కూడా మొదలు పెట్టారు. బుక్ చేసుకున్న బస్సులో అయ్యప్ప భక్తులతో పాటు ఇద్దరు వంట మనుషులు, ఒక అటెండర్, పదేళ్లలోపు ఇద్దరు మునికంట స్వాములకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అంటోంది. మొత్తంగా మూడు ఫుల్ టిక్కెట్లు, రెండు ఆఫ్ టిక్కెట్లకు ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. శబరిమల వెళ్లే భక్తులకు వరంగల్ 1 డిపో నుండి ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఇవ్వబడును. వివరాలకు డిపోమేనేజర్ ని సంప్రదించగలరు. #choosetsrtc #shabarimala #rtchirebuses @tsrtcmdoffice @TSRTCHQ pic.twitter.com/dQusTBiyde — Depot Manager WL1 (@dmwgl1) November 16, 2021 ఛార్జీలు ఇలా శబరిమలైకి వెళ్లే భక్తులు అయ్యప్ప దర్శనంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తుంటారు. ఈ టూర్‌కి అనుగుణంగా ఆర్టీసీ కిలోమీటర్ల వంతున ఛార్జీలు నిర్ణయించింది. వీటితో పాటు ప్రతీ గంటకు రూ.300ల వంతున వెయిటింగ్ ఛార్జీ్ కూడా ఉంటుంది. గంటకు సగటున 30 కిలోమీటర్ల వంతున ప్రయాణ సమయాన్ని లెక్కిస్తున్నారు. ఆర్టీసీ శబరిమలై బస్సుల ఛార్జీలు ఇలా ఉన్నాయి. - 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సులకు కిలోమీటరుకు రూ.48.96 - 40 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటరుకు రూ.47.20 - 48 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటరుకు రూ.56.64 - 49 సీట్లు ఉన్న ఆర్టీసీ బస్సులకు కిలోమీటరుకు రూ.52.49 చదవండి:ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ప్రిన్స్ మహేశ్.. అదిరింది సార్! -
అల్లు అర్జున్‌కి షాకిచ్చిన సజ్జనార్, లీగల్ నోటీసులు జారీ
-
అల్లు అర్జున్‌కి షాకిచ్చిన సజ్జనార్, లీగల్ నోటీసులు జారీ
TSRTC Sends Legal Notice to Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ ఆర్టీసీ లీగల్ నోటీసులు ఇచ్చింది. అల్లు అర్జున్ రాపిడో ప్రకటపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ర్యాపిడో ప్రకటన ఉందంటూ అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులు పంపారు. ఈ మేరకు సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు. ‘అల్లు అర్జున్ నటించిన ప్రకటనపై అభ్యంతరాలు వస్తున్నాయి. యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది. చదవండి: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్ ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని వారు ఖండిస్తున్నారు. టీఎస్ ఆర్టీసీని కించపర్చడాన్ని సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలి. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది... అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు ఇచ్చింది. బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నాం’ అని సజ్జనార్ తెలిపారు. -
‘ఆర్టీసీ’ డ్రైవింగ్ స్కూల్
జగిత్యాలటౌన్: ఉద్యోగం లేని యువతకు ఉపాధిమార్గం చూపుతోంది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ. ఇదే క్రమంలో నష్టాల్లో కొనసాగుతున్న సంస్థకు ఆదాయాన్ని సాధించేలా వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కార్గోబస్సులతో మంచి లాభాన్ని గడిస్తున్న సంస్థ.. ‘ఆర్టీసీ’ డ్రైవింగ్ స్కూళ్లను ప్రారంభించింది. సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా నిలుస్తున్న ఆర్టీసీ.. డ్రైవింగ్‌లో యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా జగిత్యాల డిపోలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మూడో బ్యాచ్ శిక్షణ పొందుతోంది. తొలి శిక్షణకేంద్రం జగిత్యాలలో.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక డిపోలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. నిరుద్యోగ యువతకు ఆర్టీసీలోని సీనియర్ డ్రైవర్లతో నెలరోజుల పాటు బస్సు డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి, స్వయం ఉపాధి సాధించేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోనే తొలి ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణకేంద్రాన్ని జగిత్యాల డిపో ఆధ్వర్యంలో జనవరి 17న రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ప్రస్తుతం మూడో బ్యాచ్ శిక్షణ పొందుతోంది. కరీంనగర్–2 డిపో ఆధ్వర్యంలోనూ ఫిబ్రవరి 2 నుంచి శిక్షణ ఇస్తున్నారు. ఫీజు రూ.15,600.. బ్యాచ్‌కు 16మంది డ్రైవింగ్‌పై ఆసక్తి ఉన్న వారు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో నెలకో బ్యాచ్ చొప్పున 16మందిని ఎంపికచేసి 30రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఇందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15,600 ఫీజుగా వసూలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తే ప్రభుత్వమే పూర్తిఫీజు భరిస్తుందని జగిత్యాల డిపో మేనేజరు జగదీశ్ వివరించారు. నెలరోజుల పాటు శిక్షణ ఒక్కోబ్యాచ్‌కు నాలుగువారాల పాటు డ్రైవింగ్ శిక్షణ ఇస్తారు. కేవలం డ్రైవింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు. మొదటి ఐదురోజులు బస్సు విడిభాగాలపై, కండీషన్ గుర్తింపు, బ్రేక్‌డౌన్ అయిన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఆర్టీసీ మెకానికల్ ఇంజినీర్, బ్రేక్ ఇన్స్పెక్టర్, డ్రైవింగ్ శిక్షకులతో థియరీ క్లాసులు చెబుతారు. అనంతరం 25రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారు. బ్యాచ్‌లో 16మంది ఉంటే.. ఒక్కొక్కరికి అరగంట పాటు స్టీరింగ్ కేటాయిస్తారు. ఉపాధికి అవకాశం.. 30రోజుల శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఆర్టీసీ సంస్థ నుంచి ధ్రువీకరణ పత్రం ఇస్తారు. భవిష్యత్‌లో సంస్థలో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ పడినప్పుడు ప్రాధాన్యం కల్పిస్తారు. సింగరేణి, కోర్టు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో డ్రైవర్ ఉద్యోగాలు సాధించేందుకు ఈ శిక్షణ, ధ్రువీకరణ పత్రం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఎక్కువగా యువత గల్ఫ్ వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకుంటే.. విదేశాల్లో సైతం మంచి ఉపాధి లభిస్తుందని జగిత్యాల డిపో మేనేజర్ జగదీశ్ తెలిపారు.శిక్షణకు ప్రత్యేక బస్సు..అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచారు. శిక్షణ బస్సులకు డ్యూయల్ స్టీరింగ్, సీట్లు ఏర్పాటు చేశారు. ఇద్దరి వద్ద క్లచ్, బ్రేక్, ఎక్స్‌లేటర్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులను ఒకవైపు కూర్చోబెట్టి.. మరోవైపు శిక్షకులు మెలకువలు నేర్పిస్తారు. రద్దీరోడ్లు, ఖాళీరోడ్లు, నైట్ డ్రైవింగ్, జిగ్‌జాగ్ ట్రాఫిక్ ప్రాంతాలతో పాటు ఘాట్‌రోడ్లపై శిక్షణ ఇస్తారు. డ్రైవింగ్ అంటే ఇష్టం ఆర్టీసీ సంస్థ ఇచ్చే డ్రైవింగ్ సర్టిఫికెట్తో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిసి ట్రైనింగ్‌లో జాయిన్ అయ్యాను. రోజు క్లాస్లులకు హాజరవుతున్నా. థియరీ క్లాసులు పూర్తయ్యాయి. రోడ్డుమీద బస్సు నడుపుతున్నా. ముందు శిక్షకుడి సహాయంతో నడిపాను, ప్రస్తుతం సొంతగా నడపగలుగుతున్నా. – బి. వెంకటేశ్, ల్యాగలమర్రి ఉపాధికి భరోసా మాది గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామం. డ్రైవింగ్‌నే ఉపాధిగా ఎంచుకుని శిక్షణకు వస్తున్నా. ఆర్టీసీలో డ్రైవింగ్‌తో పూర్తిస్థాయిలో బస్సు నడపడం నేర్చుకున్నాను. డ్రైవింగ్‌తో ఉపాధి పొందగలుగుతానని విశ్వాసం కలిగింది. – జయాకర్, లొత్తునూర్ ప్రొఫెషనల్‌గా తయారు చేస్తున్నాం ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఆర్టీసీ ట్రైనింగ్‌లో ప్రొఫెషనల్ డ్రైవర్లను తయారు చేస్తున్నాం. పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగ, ఉపాధి పొందేలా తీర్చిదిద్దుతున్నాం. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ సైతం ఇస్తున్నాం. – జగదీశ్, జగిత్యాల డిపో మేనేజర్ -
రెండోవారం గడుస్తున్నా ఇంకా అందని జీతాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఫిబ్రవరి రెండోవారం గడుస్తున్నా ఇంకా జీతాలు అందలేదు. గత నెల 12న వేతనం చేతికి అందింది. ఈ నెల మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద జీతాల కోసం రూ.20 కోట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కావాల్సిన మిగతా రూ.100 కోట్లు ఆర్థిక శాఖ నుంచి రావాల్సి ఉంది. బడ్జెట్లో ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించిన మొత్తంలోంచి జీతాలకు నిధులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి ఆ నిధులు ఆర్థిక శాఖ నుంచి ఇంకా అందలేదని తెలుస్తోంది. ఇప్పటికే వాటిని విడుదల చేయాల్సిందిగా అధికారులు ఆర్థిక శాఖను కోరారు. గతంతో పోలిస్తే ఇటీవల ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో కొంత మెరుగుపడింది. రోజు వారీ ఆదాయం రూ.12 కోట్లను దాటింది. రోజువారీ టికెట్ ఆదాయం పెరిగినందున ఖర్చులు పోను రూ.20 కోట్లను ఆర్టీసీ జీతాల పద్దుకు సిద్ధం చేసుకుంది. గత నెల ఇలాగే కొంతే డబ్బు ఉండటంతో.. ఉన్నంత మేర కొంతమందికి జీతాలు చెల్లించి, మిగతావారికి ప్రభుత్వం నుంచి డబ్బు వచ్చాక చెల్లించారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. ఈసారి అలా కాకుండా అందరికీ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు. కావాల్సినన్ని డబ్బులు లేక రెండోవారంలో కూడా చెల్లించలేదు. సోమవారం నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు యత్నిస్తున్నారు. గత 11 రోజుల్లో ఆర్టీసీకి రూ.118 కోట్ల ఆదాయం సమకూరినా.. ఉద్యోగులకు రెండోవారం నాటికి జీతాలు చెల్లించకపోవటం దారుణమని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు విమర్శించారు. వేతన సవరణ చేయాలి.. మరోవైపు ఆర్టీసీలో కార్మిక సంఘాల ఆందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. వేతన సవరణ విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ కొద్ది రోజులుగా సంఘాలు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇటీవలే టీఎంయూ, ఈయూ సమావేశాలు పెట్టి విమర్శలు గుప్పించాయి. తాజాగా దీనిపై చర్చించేందుకు టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈనెల 20న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తుందని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంచందర్, వీఎస్‌రావు తెలిపారు. అలాగే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 22న కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి తెలిపారు. కార్మిక సంఘాలకు మళ్లీ ఆర్టీసీలో అవకాశం కల్పిస్తూ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో 26న చలో బస్‌భవన్ చేపడుతున్నట్టు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంతు తెలిపారు. చదవండి: మొదటి జీతం.. పేదలకు అంకితం సింగరేణిలో భారీగా ఉద్యోగాలు! -
డీలక్స్ బస్సుకు సెలవు!
సాక్షి, హైదరాబాద్ : డీలక్స్ బస్సు.. పుష్ బ్యాక్ సీట్లు, నల్ల అద్దాలు, ప్రత్యేక రంగు, ఎక్స్‌ప్రెస్ కంటే వేగం, నాన్‌స్టాప్ సర్వీసు.. ఆర్టీసీలో ఈ కేటగిరీ బస్సులకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే త్వరలో ఈ కేటగిరీ బస్సులు అదృశ్యం కాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వీసుల్లో ఆ కేటగిరీ బస్సులను తొలగించాలని ఆర్టీసీ భావిస్తోంది. కొత్తగా కొనే బస్సుల్లో ఇకపై డీలక్స్ కేటగిరీవి ఉండబోవు. ఇప్పటికే ఉన్న బస్సులను ఇతర కేటగిరీలకు మార్పు చేయబోతున్నారు. సూపర్ లగ్జరీలకు ప్రాధాన్యం.. ఆర్టీసీలో సూపర్ లగ్జరీ బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యమైన పట్టణాలను హైదరాబాద్‌తో అనుసంధానించేవాటిలో ఇవి ప్రధానమైనవి. హైదరాబాద్‌లో బయలుదేరిన తర్వాత నేరుగా గమ్యం చేరే నాన్‌స్టాప్‌లు ఇవి. అతి ముఖ్యమైన చోట్ల తప్ప దాదాపు అన్ని మార్గాల్లో ఇవి నాన్‌స్టాప్‌లుగా తిరుగుతున్నాయి. వీటి వేగం కూడా ఎక్కువే. దీంతో ప్రయాణికులు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కొన్ని నాన్‌స్టాప్‌లుగా ఉండగా, మిగతావి ముఖ్యమైన స్టాప్ (స్టేజీ)లలో ఆగుతాయి. వీటి చార్జీ కొంచెం తక్కువగా ఉంటుంది. మొత్తం ఆర్టీసీ బస్సుల్లో పల్లెవెలుగు తర్వాత ఎక్కువగా ఉండేవి ఈ ఎక్స్‌ప్రెస్ సర్సీసులే. ఇక సూపర్ లగ్జరీ– ఎక్స్‌ప్రెస్ సర్వీసుల మధ్య ఉన్న కేటగిరీనే డీలక్స్ బస్సులు. వీటిల్లో సూపర్ లగ్జరీ తరహాలో పుష్ బ్యాక్ సీట్లు ఉంటాయి. అలాగే వీటి వేగం ఇంచుమించు సూపర్ లగ్జరీతో సమానం. అయితే టికెట్ చార్జీ దానికంటే కొంచెం తక్కువ. ఇవన్నీ నాన్‌స్టాప్ సర్వీసులే. ఇవి కూడా కండక్టర్ ఉండని సర్వీసులు. వెరసి సూపర్ లగ్జరీకి దీనికి పెద్దగా తేడా లేదు. దీంతో ఈ కేటగిరీని ఇక తొలగించాలని ఆర్టీసీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రయాణికుల్లో కన్ఫ్యూజన్ లేకుండా ఇకపై సూపర్ లగ్జరీ – ఆ తర్వాత దానితో పోలికల్లో తేడా ఉండే ఎక్స్‌ప్రెస్ కేటగిరీనే ఉంటుంది. ప్రస్తుతం చూసేందుకు ఎక్స్‌ప్రెస్‌కు డీలక్స్‌కు మధ్య తేడా అతి స్వల్పం. ఎక్స్‌ప్రెస్ సర్వీసుగా భావించి ఎక్కి టికెట్ తీసుకునేప్పుడు చార్జీ ఎక్కువగా ఉందని ప్రయాణికులు గొడవ పెట్టుకుంటున్న సందర్భాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో డీలక్స్ వల్ల ప్రత్యేకంగా ప్రయోజనం లేదని భావిస్తున్న ఆరీ్టసీ, ఈ కేటగిరీకి సెలవు చెప్పాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనివల్ల ప్రయాణికుల్లో అయోమయం తొలగిపోవటంతోపాటు ఆరీ్టసీకి ఆదాయం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. నాన్‌స్టాప్, బ్యాక్ పుష్ సీట్లు కోరుకునే డీలక్స్ ప్రయాణికులు సూపర్ లగ్జరీకి మళ్లుతారనేది ఆర్టీసీ ఆలోచన. గతంలో సెమీ లగ్జరీ.. ఆ తర్వాత డీలక్స్.. రెండు దశాబ్దాల క్రితం ఆర్టీసులో సెమీ లగ్జరీ కేటగిరీ ఉండేది. అప్పట్లో అదే టాప్ కేటగిరీ బస్సు. ఆ తర్వాత దాన్ని హైటెక్ సర్వీసుగా మార్చారు. ఆ సమయంలోనే డీలక్స్ సర్వీసును చేర్చారు. తర్వాత హైటెక్ సర్వీసు పేరును సూపర్ లగ్జరీగా మార్చారు. అంతకుముందు సూపర్ డీలక్స్ పేరుతో కొంతకాలం నడిచి మధ్యలో ఆగిపోయి.. తిరిగి డీలక్స్ పేరుతో అది కొనసాగింది. ఇప్పుడు దానికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఆర్టీసులో వెన్నెల స్లీపర్ సర్వీసు తర్వాత గరుడ ప్లస్, గరుడ.. పేరుతో ప్రీమియర్ కేటగిరీలున్నాయి. వీటిల్లో వోల్వో, స్కానియా, బెంజ్‌లాంటి బహుళజాతి కంపెనీల బస్సులు ఉంటాయి. ఇందులో గరుడ ప్లస్ మల్టీ యాక్సల్ మోడల్ బస్సులతో నడుస్తుంది. కుదుపులు తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత రా«జధాని ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, పల్లెవెలుగు మినీ ఉన్నాయి. దీంతో కేటగిరీలు ఎక్కువ కావడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారని ఆర్టీసీ అధికారులంటున్నారు. ఈ క్రమంలో డీలక్స్ సర్వీసులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
ఏపీఎస్ ఆర్టీసీ క్లారిటీ: ప్రతిష్టంభన వీడినట్లేనా!
సాక్షి, అమరావతి : లాక్డౌన్ సమయం నాటి నుంచి తెలంగాణ ఆర్టీసీ-ఏపీఎస్ ఆర్టీసీ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన వీడినట్లే కనిపిస్తోంది. ఇరు రాష్ట్రల అధికారుల మధ్య ఇప్పటికే పలు విడతలుగా సాగిన భేటీల్లో కీలక అంశాలపై చర్చించగా.. వీటిపై ఏపీఎస్ ఆర్టీసీ తుది నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ అధికారులు కోరిన ప్రతిపాదనలకు తాము సానుకూలంగా ఉన్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు శుక్రవారం ప్రకటించారు. ఏపీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నా1.6 లక్షల కిమీలకు తగ్గామని పేర్కొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ తాజా నిర్ణయంతో ప్రయాణికులకూ ఇబ్బందులు తప్పవన్నారు. టీఎస్ అభ్యంతరాల కారణంగా నష్టం ఉన్నప్పటికీ సర్వీసులను నడపాలనే ఉద్దేశంతో తాము వెనక్కి తగ్గామని కృష్ణబాబు స్పష్టం చేశారు. వాళ్లు కోరినట్లు రూట్ వైస్ క్లారిటీ కూడా ఇచ్చామని.. ఫైనల్ ప్రపోజల్స్ కూడా గత వారమే పంపామని తెలిపారు. అయినప్పటికీ టీఎస్ ఆర్టీసీ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వడంలేదని, వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ బస్సులు తిరిగే కి.మీ. 2.64 లక్షలు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఏపీ భూభాగంలో తిరిగే కి.మీ. 1.61 లక్షలు మాత్రమే. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ సర్వీసులను తగ్గించుకోవాలని టీఎస్ ఆర్టసీ కోరుతోంది. దీనిపైనే గత రెండు నెలలుగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చులు సాగుతున్నాయి. తాజా ఏపీ లేఖతో సమస్యను వీడినట్లే తెలుస్తోంది. ఈ నెల 21న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సమాన కిలోమీటర్ల ప్రాతిపదికన అంగీకారం తెలుపుతూ 1.61 లక్షల కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు తిప్పుదామని ప్రతిపాదించింది. దీని మేరకే ఏపీఎస్ఆర్టీసీ అంగీకారం తెలుపుతూ లేఖ పంపింది. అయితే దసర పండుగ నేపథ్యంలో తెలంగాణ సైతం వీలైనంత త్వరగా స్పందించే అవకాశం ఉంది. ఇరు యాజమాన్యాల అంగీకారంతో పండగ నాటికి అంతరాష్ట్రాల సర్వీసులు ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. (దసరా టూర్‌కు ‘ఆర్టీసీల’ బ్రేక్!) ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవా.. దసర పండగ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల నడుమ సర్వీసులు ప్రారంభంకాకపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి తర్వాత ఘనంగా జరుపుకొనే వేడుక. ఈ పండుగ వేళ హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు ఏడెనిమిది లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారు. పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి వారి ప్రయాణాలు మొదలవుతాయి. ఆర్టీసీకి కూడా దసరా సీజన్ కలెక్షన్లు కురిపిస్తుంది. పెద్దెత్తున ఆదాయం వస్తుంది. ఈ సమయంలో చార్జీలు అధికారికంగా 50 శాతం పెంచినా ప్రజలు దాన్ని అంతగా పట్టించుకోరు. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదరకపోవడంతో బస్సులు సరిహద్దులు దాటడం లేదు. రెండు నెలలుగా అధికారులు కుస్తీ పడుతున్నా సయోధ్య కుదరలేదు. మరోవైపు కోవిడ్ నిబంధనలతో రైళ్లు కూడా తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి. వాటిల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. దీంతో విధిలేక ప్రజలు ప్రైవేటు బస్సుల కోసం పరుగుపెట్టాల్సి వస్తోంది. దొరికిందే అదునుగా వారు టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆర్టీసీ చార్జీ రూ.290 ఉంటే.. ప్రైవేట్‌లో రూ.700కు నుంచి 1000 వరకు వసూలు చేస్తున్నారు. వారి దోపిడికి అడ్డుకట్ట వేయాలంటే ఇరు రాష్ట్రాల సర్వీసులు ప్రారంభించక తప్పదు. -
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం శుభవార్తను అందించింది. దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 3000ల ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు అందుబాటులో ఉండనున్నట్లు టీఎస్ ఆర్టీసీ సోమవారం నాటి ప్రకటనలో తెలిపింది. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, ఎస్సార్ నగర్ అమీర్ పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్ పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడవునున్నాయి. పండగ రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. (అదనంగా మరో 900 ప్రత్యేక రైళ్లు) -
మరోమారు చర్చలు.. బస్సులు నడిచేనా?
కరోనా లాక్డౌన్లు ముగిశాయి. దాదాపు అన్నిటికీ కేంద్ర సర్కార్ లాకులెత్తింది. నిబంధనలకు లోబడి ప్రజా రవాణా చేసుకోచ్చని తెలిపింది. ప్యాసెంజర్ రైళ్లు మినహా, ప్రత్యేక, మెట్రో రైలు సేవలు అందుబాటులోకొచ్చాయి. అన్ని రాష్ట్రాల మధ్య బస్సులు తిరుగుతున్నాయి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునురద్ధరణ ప్రక్రియ మాత్రం ముందుకు కదలడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య ఈ విషయమై చర్చలు జరిగినప్పటకీ ఎటుంటి పురోగతి లేదు. బస్సు సర్వీసులు మీరే ఎక్కువ నడపాలి, అంటే మీరే తక్కువ నడపాలి అనే రెండు రాష్ట్రాల పంచాయితీ నడుమ ప్రైవేటు బస్సులు లబ్ది పొందుతున్నాయి. హైదరాబాద్‌లోని బస్ భవన్లో నేడు మరోమారు రెండు తెలుగు రాష్ట్రాల ఈడీల సమావేశం జరుగనుంది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాదనలు ఇలా... ఆంధ్రప్రదేశ్ వాదన తమ రాష్ట్రంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నడిపే విషయంలో తెలంగాణ ఆర్టీసీ మొండికేస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రాలతో అంతర్రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణకు సిద్ధమైన టీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్‌తో ఒప్పందానికి మాత్రం ససేమిరా అంటోంది. లాక్‌డౌన్‌కు ముందు కర్ణాటక, మహారాష్ట్రకు తిప్పుతున్న బస్సుల్ని కిలోమీటర్ల ప్రకారం నడిపేందుకు టీఎస్ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కిలోమీటర్లు ప్రాతిపదికన బస్సులు తిప్పే అంశంపై తమ భూభాగంలో ఏపీఎస్ ఆర్టీసీ లక్షా10 వేల కిలోమీటర్ల మేర తగ్గించుకోవాలని తెలంగాణ పట్టుబడుతోంది. తాము 50 వేల కిలోమీటర్లు తగ్గిస్తామని, టీఎస్ఆర్టీసీని 50 వేల కిలోమీటర్లు పెంచుకోవచ్చని సూచిస్తూ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు లేఖలు రాసినా స్పందించడంలేదు. మిగిలిన రూట్లలో బస్సుల్ని పెంచకుండా హైదరాబాద్–విజయవాడ రూట్లో పెంచుతామనడం సరికాదు. టీఎస్ఆర్టీసీ తీరు వల్ల ప్రైవేటు బస్సులు పెరిగాయి. ఆపరేటర్లు ఒకే పర్మిట్‌తో రెండు వైపులా బస్సుల్ని తిప్పుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం భారీ ఆదాయం కోల్పోతుంది. గతంలో ప్రైవేటు బస్సుల వల్ల రూ.వెయ్యి కోట్లు ఆదాయం కోల్పోతున్నామన్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు ప్రైవేటు బస్సులు పెరిగినా.. తెలంగాణ ఆదాయం కోల్పోతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థకావడం లేదు. (చదవండి: అద్దె మాఫీ!) తెలంగాణ వాదన రూట్లవారీగా రెండు రాష్ర్టాలు సమాన కిలోమీటర్లు బస్సులు నడపాలని తెలంగాణ ప్రతిపాదించింది. రూట్లవారీగా కొన్ని ప్రతిపాదనలను ఏపీ అధికారులకు ఇచ్చింది. వాటిపై అధ్యయనం చేశాక ఎగ్జిక్యూటివ్ అధికారుల స్థాయిలో మరోసారి భేటీ అవుతాం. తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడున్న దానికంటే 50 శాతం మేర కిలోమీటర్లు పెంచుకుంటే.. తాము 52 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. ఒప్పందం జరిగేవరకు 70 వేల కిలోమీటర్ల మేర రెండు రాష్ర్టాలు నడుపుదామని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. ఒప్పందం పూర్తయితేనే బాగుంటుందని తెలంగాణ అధికారులు స్పష్టంచేశారు. రెండు రాష్ర్టాల అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. (చదవండి: కొత్త ప్రాజెక్టులను అపెక్స్ ఆపమంది..!) అయితే, దసరా పండుగ సమీపిస్తుండటంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థల మధ్య ఈ దఫా జరుగుతున్న చర్చలు ఫలప్రదమవుతాయని ప్రయాణికులు ఆకాంక్షిస్తున్నారు. -
వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులే..
సాక్షి, హైదరాబాద్: థామస్ రెడ్డి వెంట ఉన్న వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులేనని టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వద్ధామరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పదవి కాంక్షతోనే థామస్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ రాజీనామా చేస్తామని చెప్పిన వారంతా డిపోల్లో పని చేసే వ్యక్తులేనని, ఒక్కరు కూడా టీఎంయూలో ఉన్న నేతలు లేరన్నారు. తనకు ఇవాళ రాజీనామా చేస్తామని చెప్పిన వాళ్లలో ఇప్పుడు ఫోన్ చేసి యూనియన్‌లో కొనసాగుతామని చెప్పారని ఆయన తెలిపారు. తాను రాజకీయ పదవులు ఆశించనని స్పష్టం చేశారు. ఇప్పటికే కార్మిక సంఘ యూనియన్‌లో ఉంటూ రాజకీయాల్లో పోటీ చేయకూడదని ఆయన తెలిపారు. -
రోడెక్కిన సిటీ బస్సులు
-
రోడెక్కిన సిటీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆరునెలల తర్వాత హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి సిటీ బస్సులు రోడెక్కాయి. మొత్తం బస్సుల్లో 25 శాతమే తిప్పనున్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయి సిటీ బస్సుల రవాణా గురించి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో పావు వంతు బస్సులు తిప్పటమే ఉత్తమమంటూ ఆర్టీసీ ఎండీ ఇచ్చిన నివేదిక మేరకే సీఎం అనుమతి ఇచ్చారు. శుక్రవారం ఉదయం షిఫ్ట్ నుంచి బస్సులు తిరుగుతున్నాయి. వారం, పది రోజుల తర్వాత పరిస్థితి సానుకూలంగా కనిపిస్తే, 50 శాతం బస్సులను అనుమతించనున్నట్టు సమాచారం. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా అంతర్రాష్ట్ర బస్సులను పునరుద్ధరించేందుకు సీఎం అనుమతించారు. ఈ సర్వీసులు కూడా శుక్రవారం నుంచే ప్రారంభమవుతాయి. ముఖ్యమైన ఆంధ్ర–తెలంగాణ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో కదలిక రాలేదు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే జిల్లా సర్వీసులు తిరుగుతుండగా, బుధవారం హైదరాబాద్ శివారు గ్రామాలకు మఫిసిల్ సర్వీసులు మొదలయ్యాయి. ప్రధాన రూట్లలో ఎక్కువ.. ప్రభుత్వ నిర్ణయం మేరకు హైదరాబాద్ నగరంలో తొలుత దాదాపు 625 బస్సులు తిప్పుతున్నారు. అయితే ఇందులో రద్దీ ఎక్కువగా ఉండే ముఖ్యమైన రూట్లలోనే ఎక్కువ సర్వీసులు తిప్పనున్నారు. కీలకమైన ఎయిర్‌పోర్టు రూట్‌తోపాటు పటాన్చెరు–చార్మినార్, పటాన్చెరు–హయత్‌నగర్, ఉప్పల్–లింగంపల్లి, గచ్చిబౌలి–దిల్‌సుఖ్‌నగర్‌తోపాటు చార్మినార్, జూపార్కు, ఎల్బీనగర్, చింతల్, బీహెచ్ఈఎల్, కూకట్పల్లి తదితర ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు ఉంటాయని తెలుస్తోంది. ఇందులోనూ ఎక్స్‌ప్రెస్ బస్సులే ఎక్కువగా తిరిగే అవకాశం ఉంది. -
గుడ్‌న్యూస్: గ్రేటర్లో రోడ్డెక్కనున్న బస్సులు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ బస్సులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి (శుక్రవారం) గ్రేటర్లో బస్సులను నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం బస్సులను తిప్పేందుకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాక్డౌన్ మార్గదర్శకాలను పాటిస్తూ.. 25 శాతం సర్వీసులు నడపాలని నిర్ణయించారు. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఆరు నెలల తరువాత నగరంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. దీనిపై మరికాసేపట్లో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అలాగే మార్చి ఉంచి నిలిచిపోయిన మహారాష్ట్ర, కర్ణాటక బస్సులు కూడా నడిపేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ మేరకు రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఏపీ సర్వీసులపై మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. (జీతాలు ఇచ్చేదెట్లా?) -
గ్రేటర్లో ఆర్టీసీ బస్సులు నడపండి
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్, లాక్డౌన్ కారణాల వల్ల హైదరాబాద్ సిటీలో ఆర్టీసీ బస్సులు మూతపడ్డాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. జిల్లాల్లో కేసుల సంఖ్య కొంత మేర తగ్గడం, ప్రజా రవాణకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడంతో రాజధాని నుంచి జిల్లా సర్వీసులను ప్రభుత్వం గతంలో ప్రారంభించింది. అయితే గ్రేటర్లో కరోనా విజృంభణ అదుపులోకి రాకపోవడం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేపోయింది. ఈ క్రమంలోనే గతవారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, కోలుకునే వారిసంఖ్య పెరగడంతో గ్రేటర్లో ఆర్టీసీ సర్వీసులను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ పరిధిలో బస్సులను నడపాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. గురువారం ప్రగతి భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్ నిర్వహించిన భేటీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మెట్రో సేవలు సైతం ఇప్పటికే ప్రారంభం అయ్యాయని, ఇక ఆర్టీసీని కూడా రోడ్డు ఎక్కించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై రానున్న రెండు రోజుల్లో కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. (జీతాలు ఇచ్చేదెట్లా?) శివారు గ్రామాలకు బస్సులు మరోవైపు చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్న ఆర్టీసీ రోజువారీ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో నగరానికి సమీపంలో ఉన్న ఊళ్లకు తిప్పే బస్సులను బుధవారం తిరిగి ప్రారంభించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండే రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ డిపోల్లో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేకపోవటంతో జిల్లా సర్వీసులను తిప్పుతున్న సంగతి తెలిసిందే. నగరానికి చేరువగా ఉన్న గ్రామాలకు సిటీ డిపోల నుంచి తిరిగే బస్సులను కూడా జిల్లా సర్వీసులుగానే పరిగణిస్తూ బుధవారం ఉదయం నుంచి తిప్పటం ప్రారంభించారు. నగరంలోని 18డిపోల నుంచి 230 సర్వీసులు ప్రారంభించారు. నగరానికి 50 నుంచి 60 కి.మీ. పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు ఇవి తిరుగుతాయి. వీటి రూపంలో రోజుకు రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జిల్లా సర్వీసుల ద్వారా వస్తున్న రూ.4 కోట్ల రోజువారీ ఆదాయానికి ఇది తోడై కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక సిటీ బస్సులు నడపాలా వద్దా అన్న నిర్ణయం ముఖ్యమంత్రి పరిధిలో ఉంది. ఆయన ఆదేశం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. (ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బొంతు రామ్మోహన్..!) -
జీతాలు ఇచ్చేదెట్లా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. వచ్చేనెల ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మార్చిలో బ్యాంకు నుంచి తెచ్చిన రూ.600 కోట్ల అప్పు నుంచి ఇంతకాలం ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తూ వచ్చారు. గత నెలతో ఆ డబ్బులు పూర్తిగా ఖర్చయ్యాయి. వచ్చే నెల జీతాలకు డబ్బుల్లేవు. మూడు రోజుల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. జీతాలకు డబ్బు సర్దుబాటు చేయాల్సిందిగా ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆర్థిక శాఖ అధికారులను కోరారు. ఇందుకు వారు నిరాకరించారు. తమ వద్ద ప్రస్తుతానికి అంత వెసులుబాటు లేదని, డబ్బు కావాలంటే సీఎంతోనే మాట్లాడుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయాలపై దృష్టి సారించాలని, ఇలా ప్రతినెలా ఆర్థిక శాఖను డబ్బు అడగటం సరికాదని పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో ఎండీ సునీల్‌శర్మ అధికారులతో సమావేశమై ఆదాయాన్ని పెంచే మార్గాలపై చర్చించారు. మరోవైపు కేంద్రం బ్యాంకు అప్పులపై విధించిన మారటోరియం గడువు పూర్తి కావటంతో బ్యాంకులకు పెద్ద మొత్తంలో ఆర్టీసీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. అవి చెల్లించని పక్షంలో నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ (ఎన్పీఏ)గా ఆర్టీసీకి రిమార్క్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు మూడు నెలలుగా బిల్లుల కోసం తిరుగుతున్న అద్దె బస్సు యజమానులు మూడు రోజుల క్రితం బస్‌భవన్‌ను ముట్టడించారు. డబ్బులు చెల్లిం చని పక్షంలో వారు న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆర్టీసీ సహకార పొదుపు సంఘం (సీసీఎస్) సంస్థ వాడుకున్న తమ డబ్బు కోసం హైకోర్టులో కోర్టు ధిక్కార కేసు దాఖలు చేసింది. వచ్చేనెల 5న కోర్టుకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగటంతో ఆర్టీసీకి దిక్కుతోచడం లేదు. శివారు గ్రామాలకు బస్సులు చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్న ఆర్టీసీ రోజువారీ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో నగరానికి సమీపంలో ఉన్న ఊళ్లకు తిప్పే బస్సులను బుధవారం తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేకపోవటంతో జిల్లా సర్వీసులను తిప్పుతున్న సంగతి తెలిసిందే. నగరానికి చేరువగా ఉన్న గ్రామాలకు సిటీ డిపోల నుంచి తిరిగే బస్సులను కూడా జిల్లా సర్వీసులుగానే పరిగణిస్తూ బుధవారం ఉదయం నుంచి తిప్పటం ప్రారంభించారు. నగరంలోని 18డిపోల నుంచి 230 సర్వీసులు ప్రారంభించారు. నగరానికి 50 నుంచి 60 కి.మీ. పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు ఇవి తిరుగుతాయి. సిటీలో తిరగవు. వీటి రూపంలో రోజుకు రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జిల్లా సర్వీసుల ద్వారా వస్తున్న రూ.4 కోట్ల రోజువారీ ఆదాయానికి ఇది తోడై కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక సిటీ బస్సులు నడపాలా వద్దా అన్న నిర్ణయం ముఖ్యమంత్రి పరిధిలో ఉంది. ఆయన ఆదేశం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. -
వైద్య శాఖ అనుమతి రాగానే రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. లాక్డౌన్ 4.0లో భాగంగా ప్రజా రవాణాపై ఆంక్షలు ఎత్తేయడంతో సిటీ బస్‌లు తిప్పేందుకు వైద్య ఆరోగ్య శాఖను ఏపీఎస్ ఆర్టీసీ సంప్రదించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం సిటీ సర్వీసులు నడుపుతామని అందులో పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అనుమతి రాగానే విజయవాడ, విశాఖలో సిటీ సర్వీసులు మొదలు కానున్నాయి. మిగిలిన బస్ సర్వీసులు కూడా 50 శాతం వరకు తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. కాగా, గత నెలలో రోజుకు 8 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని తిప్పిన ఆర్టీసీ.. గత వారం నుంచి రోజుకు 12 లక్షల కిలోమీటర్ల వరకు నడుపుతోంది. ఇక సర్వీసుల్ని 2,200 నుంచి 2,746కు పెంచింది. హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సులు ► అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలలకు పైగా ఖాళీగా ఉన్న ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. ► రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు తిప్పుతున్నారు. ఏపీలోని ప్రధాన ప్రాంతాల నుంచి శనివారం రాత్రి ఇవి ప్రారంభమయ్యాయి. 150 ప్రైవేటు బస్సులకు ఆన్లైన్లో టికెట్ రిజర్వేషన్ విధానాన్ని ఆపరేటర్లు మొదలుపెట్టారు. ► మరోవైపు హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు గానూ అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ దీనిపై తెలంగాణ సర్కార్ ఇంకా స్పందించలేదు. ► సర్వీసుల పెంపునకు టీఎస్ ఆర్టీసీ ససేమిరా అంటోంది. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో తిప్పే కిలోమీటర్లు తగ్గించాలని.. తాము ఎట్టి పరిస్థితిలోనూ ఏపీ భూ భాగంలో కిలోమీటర్లు పెంచబోమని టీఎస్ ఆర్టీసీ తెగేసి చెబుతోంది. -
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
సాక్షి, ఖమ్మం : తెలంగాణ ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తల్లాడ మండలం మెట్టుపల్లి గ్రామ సమీపంలో సత్తుపల్లి నుంచి సుమారు 30 మంది ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా బస్సు డ్రైవర్ క్యాబిన్ ఇరుక్కుపోయాడు. ప్రమాదం గమనించిన దగ్గరలోని గ్రామస్తులు అక్కడకు చేరుకొని డ్రైవర్ని బయటకు తీశారు. అనంతరం 108 ద్వారా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ పరిస్థిత కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదం బ్రిడ్జిపై జరగటం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. -
కీలక భేటీ వాయిదా.. బస్సు ప్రయాణికులకు నిరాశ
సాక్షి, హైదరాబాద్ : అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడంతో ఇక వచ్చే వారం నుంచి బస్సుల్లో ప్రయాణించొచ్చని భావించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైంది. బుధవారం జరగాల్సిన కీలక భేటీ వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల భేటీని వాయిదా వేస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ ప్రబలిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించిన తరువాత అంతరాష్ట్ర బస్సు సర్వీస్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే సడలింపుల్లో భాగంగా బస్సులను తిప్పడానికి రెండు రాష్ట్రాలు సన్నద్ధం అయ్యాయి. ఈ మేరకు గత వారం విజయవాడలో సమావేశమైన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. మరోసారి చర్చించుకొని ఫైనల్ చేసుకోవాలని అప్పుడే అనుకున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 24న ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడింది. ఈ వారంలో భేటీ అయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఇప్పట్లో తిరిగి ప్రారంభం కావడం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర బస్సులను నడపడానికి సీఎం కేసీఆర్ అంగీకరించపోవచ్చని భావిస్తున్నారు. కాగా, తెలంగాణలో జిల్లాల్లో ఇప్పటికే బస్సులు తిరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో... సిటీలో బస్సులను, మెట్రో రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఐతే... రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపినా సమస్యేమీ ఉండదనే అభిప్రాయం ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి వస్తుండటంతో... సర్కారు ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
-
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రేటర్లో బస్సులు నడిపించాలా? వద్దా? అనే అంశంపై చర్చించనున్నారు. కాగా, ప్రభుత్వం సడలింపులివ్వడంతో హైదరాబాద్ మినహా జిల్లాల్లో బస్సులు తిరుగుతున్న విషయం తెలిసిందే. -
టీఎస్ ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ
సాక్షి, దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి స్టేజ్ వద్ద టీఎస్ ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ నుండి ఉట్నూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు- ఇసుక లోడ్‌తో కరీంనగర్ వైపు వెళుతున్న టిప్పర్ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఎనిమిదిమంది గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో అతన్ని బయట తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. -
కర్ఫ్యూ నుంచి ఆర్టీసీకి మినహాయింపు
-
సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులకు నో..
సాక్షి, హైదరాబాద్ : కర్ఫ్యూ నిబంధనల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి మినహాయింపునిచ్చింది. ఫలితంగా రాత్రి ఏడు నుంచి ఉదయం ఏడు వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయాల్లో కూడా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఇది వెంటనే అమల్లోకి రానుంది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచన మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెనువెంటనే దీనిపై సాధారణ పరిపాలన విభాగం నుంచి ఉత్తర్వు వెలువడింది. (ఈ నెలా జీతాల కోత! ) లాక్డౌన్ తర్వాత ఈ నెల 19 నుంచి రాష్ట్రంలో ప్రజా రవాణాను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోసిటీ బస్సులు, అంతర్ రాష్ట్ర సర్వీసులు మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే.. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటున్న నేపథ్యంలో, ఆ సమయాల్లో మాత్రం బస్సులు తిరగరాదని, కర్ఫ్యూ వేళలకు పూర్వమే గమ్యం చేరుకోవాలని అప్పట్లో సీఎం చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇటు బస్సులు ప్రారంభమైనా.. కరోనా భయంతో జనం వాటిల్లో ప్రయాణించేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దీంతో ఆర్టీసీకి టికెట్ రూపంలో ఆదాయం బాగా పడిపోయింది. బస్సులు తిరిగి ప్రారంభమయ్యాక తొలి రోజు కేవలం రూ.65 లక్షల ఆదాయం మాత్రమే రాగా, ఆ తర్వాత మూడ్రోజులకు అది రూ.2 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం సగటున నిత్యం రూ.2 కోట్లు మాత్రమే సమకూరుతోంది. ('దయచేసి మమ్మల్ని క్షోభ పెట్టకండి') లాక్‌డౌన్‌కు పూర్వం ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.12 కోట్లుగా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్లో అది రూ.15 కోట్లుగా ఉంటుంది. అంతా ఆదాయమున్నా.. సంస్థను సరిగా నడపలేని పరిస్థితి ఉండగా ఇప్పుడు కేవలం రూ.2 కోట్లకు ఆదాయం పడిపోవటంతో సంస్థ తీవ్రంగా కలవరపడుతోంది. చాలామంది రాత్రి వేళ ప్రయాణానికి మొగ్గు చూపుతారు. కర్ఫ్యూ నేపథ్యంలో ఆ అవకాశం లేకపోవటంతో అలాంటి వారు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో జనం పగటి వేళ బస్సెక్కేందుకు జంకుతున్నారు. ఈ విషయాలను మంత్రి పువ్వాడ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి వేళ ప్రయాణాలకు అనుమతినిస్తే ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. దీనికి సీఎం సమ్మతించారు. ఇమ్లీబన్లోకి బస్సులు.. ప్రస్తుతం జిల్లా బస్సులు హైదరాబాద్‌లోకి రావటం లేదు. సిటీలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున నగరంలోకి వాటి రాక సరికాదని అప్పట్లో నిర్ణయించారు. కరీంనగర్ రూట్ నుంచి వచ్చే బస్సులు మాత్రం జూబ్లీ బస్‌స్టేషన్‌లోకి వస్తున్నాయి. మిగతా మార్గాల్లో వచ్చేవి నగరం వెలుపలే నిలిపేస్తున్నారు. తాజాగా అన్ని బస్సులు సిటీలోకి వచ్చేందుకు అనుమతించారు. ఇమ్లీబన్ వరకు అన్ని బస్సులు వస్తాయి. కర్ఫ్యూ వేళ బస్సు దిగి ఇళ్లకు వెళ్లేవారు టికెట్ చూపితే పోలీసులు అనుమతిస్తారు. వారి కోసం ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు కూడా కర్ఫ్యూ వేళ బస్టాండ్ల నుంచి తిరిగేందుకు కూడా పచ్చజెండా ఊపారు. కొత్త మార్పులు గురువారం నుంచే అమల్లోకి వస్తాయి. సిటీలో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సిటీ బస్సులకు మాత్రం అనుమతినివ్వలేదు. నిజానికి గురువారం నుంచే కొన్ని మార్గాల్లో సిటీ సర్వీసులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. సిద్ధంగా ఉండాల్సిందిగా డీఎంలకు సూచించారు. సీఎం అనుమతి రాగానే ప్రారంభించాలనుకున్నారు. కానీ, కేసుల తీవ్రత దృష్ట్యా మరో పది, పదిహేను రోజులు వేచి చూడాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఇటు అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా అనుమతి నిరాకరించారు. -
యూఎస్‌లో మా ఆవిడ,ఇక్కడ నేను..
సాక్షి, సిటీబ్యూరో: మహమ్మారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ బుధవారం నాటికి సరిగ్గా నెల రోజులకు చేరుకొంది. కరోనా ఉధృతి దృష్ట్యా మే 7వ తేదీ వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఆ తరువాతైనా కరోనా తగ్గుముఖం పడుతుందా...లాక్డౌన్ తొలగిపోతుందా అనేది సందిగ్ధమే. కానీ ఈ నెల రోజులుగా బస్సులు, రైళ్లు, విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బహుశా చరిత్రలోనే అతి పెద్ద ప్రజారవాణా నెట్వర్క్ స్తంభించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షలాది మంది ప్రయాణికులు ఇళ్లకే పరిమితమయ్యారు. తప్పనిసరి ప్రయాణాలు, టూర్లు, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం చేయవలసిన అన్ని రకాల ప్రయాణాలు నిలిచిపోయాయి. సొంత ఊళ్లకు వెళ్లలేక. దూరప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులను చేరుకొనేందుకు అవకాశం లేక ఇళ్లల్లోనే ఉండి విలవిలలాడుతున్నవాళ్లు, వివిధ కారణాల వల్ల కుటంబసభ్యులు చెల్లాచెదురుగా ఒక్కొక్కరు ఒక్కో చోట ఉండాల్సి వస్తోంది. నిలిచిపోయిన సిటీ బస్సులు... గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలకు చెందిన 3000 బస్సులు డిపోలకే పరిమితమాయ్యాయి. ప్రతి రోజూ సుమారు 30 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తారు. ఈ నెల రోజులుగా గ్రేటర్ ఆర్టీసీ సుమారు రూ.100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఉద్యోగ,వ్యాపార అవసరాల కోసం పిల్లలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు సిటీ బస్సులే అందుబాటులో ఉన్నాయి. బస్సులు నిలిచిపోడం వల్ల చాలామంది ఇల్లు వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తప్పనిసరి అవసరాల కోసం సొంత వాహనాలపైన రాకపోకలు సాగించేవాళ్లు ఉన్నప్పటికీ బస్సులు లేకపోవడం వల్ల నగరంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లలేకపోతున్నట్లు పలువురు వాపోతున్నారు. ఇల్లు దాటి బయటకు రాలేదు ప్రతి రోజు మల్కాజిగిరి నుంచి సికింద్రాబాద్, ఎస్ఆర్ నగర్, బేగంపేట్ వైపు ఏదో ఒక పనిపైన వెళ్లేవాళ్లం. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. లాక్డౌన్ సమయంలో మాస్కులు, ఆహారం,నిత్యావసరాలు వంటివి అందజేస్తున్నాం. కానీ బస్సులు లేవు కదా ఎక్కువ మందిని చేరుకోవడం సాధ్యం కావడం లేదు.– సుధ, మల్కాజిగిరి మొట్టమొదటిసారి ఆగిన ఫ్లైట్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2008లో విమాన సర్వీసులు ప్రారంభమైన తరువాత మొట్టమొదటిసారి లాక్డౌన్ కారణంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు బ్రేక్ పడింది. ప్రతి రోజు 400 కు పైగా విమానాలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. 60 వేల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రయాణికులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నెల రోజుల్లో సుమారు 18 లక్షల మంది ప్రయాణాలు స్తంభించాయి. యూఎస్‌లో మా ఆవిడ,ఇక్కడ నేను మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది. కూతురు డెలివరీ దృష్ట్యా మా భార్య కామేశ్వరి అక్కడకు వెళ్లింది. ప్రస్తుతం నేను ఒక్కడినే ఇక్కడ ఉంటున్నాను. ఈ నెలలో నేను కూడా అక్కడకు వెళ్లవలసింది. మే నెలలో ఇద్దరం తిరిగి హైదరాబాద్ రావాలనుకొన్నాం. లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారో ఏమో టెన్షన్‌గా ఉంది. రామచందర్‌రావు, మల్కాజిగిరి చరిత్రలో ఇది రెండోసారి.. దేశవ్యాప్తంగా రైళ్లు నిలచిపోవడం ఇది రెండోసారి. ఎమర్జెన్సీ కాలంలో జాతీయ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు రైళ్లను నిలిపివేశాయి.కానీ చాలా స్వల్ప కాలం. ఇప్పుడు నెల రోజులుగా ఎక్కడి రైళ్లు అక్కడే ఆగాయి. ఆ రకంగా ఇంత సుదీర్ఘకాలం రైళ్లు నిలిచిపోవడం ఇదే మొదటిసారి. దక్షిణమధ్య రైల్వేలో ప్రతి రోజు 600 కు పైగా రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. హైదరాబాద్ నుంచే 200 రైళ్లు దేశవ్యాప్తంగా రవాణా నెట్వర్క్ కలిగి ఉన్నాయి. 2లక్షల మందికి పైగా సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. మరో 121 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రతి రోజు 1.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. రైళ్లు నిలిచిపోవడం వల్ల ఈ నెల రోజుల్లో రూ.300 కోట్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత నెలలోనే రాజమండ్రికివెళ్లాల్సింది మార్చి 23న రాజమండ్రికివెళ్లవలసి ఉండింది. జనతా కర్ఫ్యూ తరువాత మరుసటి రోజు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ అదేరోజు లాక్డౌన్ అనౌన్స్ చేశారు. దీంతో ఇంటికే పరిమితమయ్యాం. బయటకు వెళ్లలేని పరిస్థితి. చూస్తుంటే అప్పుడే నెల రోజులు గడిచిందా అనిపిస్తోంది.– కవిత, సికింద్రాబాద్ -
బస్సు పాస్‌లపై ఇదేం ద్వంద్వ వైఖరి?
సాక్షి, హైదరాబాద్: ఘట్కేసర్ సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌లో రంజిత్ విద్యనభ్యసిస్తున్నాడు. ప్రతిరోజూ మారేడుపల్లి నుంచి సిటీబస్సులో కాలేజీకి వెళ్లి వస్తుంటాడు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు తన బస్సుపాస్ చెల్లుబాటయ్యేలా రూ.990 చెల్లించి రెన్యూవల్ చేసుకున్నాడు. కానీ లాక్డౌన్ కారణంగా అన్ని సేవలూ నిలిచిపోయినట్లుగానే సిటీ బస్సులకు సైతం బ్రేక్ పడింది. దీంతో అతడు పాస్ కోసం డబ్బులు చెల్లించినప్పటికీ ఆర్టీసీ సేవలను వినియోగించుకోలేకపోయాడు. ఇది అతడికి ఆర్థికంగా నష్టమే. ఇలా ఇతడొక్కడే కాదు గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు 3.5 లక్షల మంది బస్సుపాస్ వినియోగదారులు లాక్డౌన్ కారణంగా సుమారు రూ.15 కోట్ల మేర నష్టపోవాల్సివస్తోంది. సాధారణంగా అనూహ్యమైన పరిస్థితుల్లో సేవలు స్తంభించినప్పుడు బస్సుపాస్‌ల చెల్లుబాటు గడువును పొడిగించే ఆర్టీసీ.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో లక్షలాది మంది వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ‘లాక్డౌన్ కారణంగా అన్ని వర్గాల ప్రజలు నష్టపోయినట్లుగానే బస్సుపాస్ వినియోగదారులు సైతం నష్టపోవాల్సివస్తోంది’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. ఇదేం ద్వంద్వ వైఖరి? సాధారణంగా ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత తాము వెళ్లాల్సిన గమ్యస్థానం వరకు టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తారు. కానీ రెగ్యులర్‌గా రాకపోకలుసాగించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వివిధ వర్గాల ప్రయాణికులు ఒక నెల రోజుల ప్రయాణం కోసం ముందుగానే డబ్బులు చెల్లించి నెలవారీ పాస్‌లను కొనుగోలు చేస్తారు. తాము చెల్లించిన గడువు మేరకు ఆర్టీసీ సేవలందజేస్తుందనే నమ్మకంతోనే ప్రయాణికులు ముందే డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ అనూహ్యమైన పరిస్థితుల్లో ఆర్టీసీ సేవలు స్తంభించినప్పుడు ప్రయాణికులు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వడమో లేక సేవలు అందజేయలేని రోజులకు అనుగుణంగా పాస్‌ల కాలపరిమితిని పెంచడమో చేయాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులు నడపలేకపోయినా, ఆర్టీసీ స్వతహాగా బస్సులను నిలిపివేసినా ఇలాంటి పొడిగింపు సదుపాయాన్ని అందజేస్తారు. కానీ లాక్డౌన్ కాలానికి మాత్రం ఇది వర్తించకపోవచ్చని ఆర్టీసీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితర వర్గాల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ సుమారు 9 రకాల పాస్‌లను అందజేస్తోంది. వీటిలో విద్యార్థులకు రాయితీపై లభించే నెలవారీ పాస్‌లు, 3 నెలల పాస్‌లు, రూట్‌పాస్‌లు, సబర్బన్, మఫిసిల్ పాస్‌లు వంటి వివిధ రకాల పాస్‌లు ఉంటాయి. అలాగే ఉద్యోగుల కోసం ఎన్జీఓ పాస్‌లు ఇస్తారు. ఇక ఎలాంటి రాయితీ సదుపాయం లేని వారు తమ అవసరాల మేరకు రూ.890 చెల్లించి ఆర్డినరీ పాస్, రూ.990తో ఎక్స్‌ప్రెస్ పాస్ తీసుకుంటారు. ఏసీ బస్సు పాస్ ధర రూ.2000 వరకు ఉంటుంది. ఐటీ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఎక్కువగా ఏసీ పాస్‌లను వినియోగిస్తారు. ఇలా గ్రేటర్ పరిధిలో సుమారు 3.5 లక్షల మంది వినియోగదారులు ప్రతి నెలా రూ.15 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. కానీ లాక్డౌన్ కారణంగా వారు చెల్లించిన డబ్బులకు సేవలు లభించకపోవడమే కాకుండా కాలపరిమితి పొడిగింపుపై కూడా ఎలాంటి గ్యారంటీ లభించకపోవడం గమనార్హం. (బాయ్‌ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాలి... అనుమతివ్వండి) -
‘సమ్మె’లో కుమ్మేశారు!
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పుడు బస్సుల్లో టిక్కెట్ తీసుకొనే బాధ్యత ప్రయాణికుడిదే కావడం వల్ల కండక్టర్లకు కొద్దిగా ఊరట లభించింది. కానీ గతంలో లెక్కల్లో ఒక్క రూపాయి తేడా వచ్చినా..ఉద్యోగంఊడిపోవలసిందే. ప్రతినిత్యం ఎంతోమంది కండక్టర్లు అభద్రతతో పనిచేసేవారు. కానీ అలాంటి ఆర్టీసీలో కొందరు అధికారులే తమ చేతివాటాన్ని ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆర్టీసీ ఆడిట్ విభాగం చేపట్టిన గణాంకాల్లో నగరంలోని పలు డిపోల్లో లక్షలాదిరూపాయలు లెక్కల్లో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సమ్మె కాలంలో డిపో స్థాయి అధికారులే అక్రమాలకు పాల్పడి ఉండవచ్చుననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె మొదలైన కొద్ది రోజుల పాటు ఎలాంటి టిక్కెట్లులేకుండానే బస్సులుసడిపారు. ఆ తరువాత ప్రింటెడ్ టిక్కెట్లు ముద్రించినప్పటికీ వాటిపైన వచ్చిన ఆదాయాన్ని పూర్తిస్థాయిలో జమ చేయకుండా కొందరు డిపోమేనేజర్లు తమ జేబుల్లోవేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అద్దె బస్సుల యజమానులు సైతం ఆర్టీసీ డిపోల్లో ట్యాంకుల కొద్దీ డీజిల్ నింపుకొని ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా తమకు నచ్చిన రూట్లలో బస్సులు నడుపుకొన్నారు. వచ్చిన సొమ్మును ఆర్టీసీకి అద్దె చెల్లించకుండానే ఎగురేసుకెళ్లారు. తీవ్ర నష్టాల్లో కూరుకొనిపోయి ఉన్న ఆర్టీసీలో కొంతకాలంగా ప్రక్షాళన పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆడిట్ విభాగం చేపట్టిన డిపోస్థాయి తనిఖీల్లో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ‘ఆర్టీసీలో అవినీతి, అక్రమాలకు తావు లేదు. ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది. కానీ సమ్మె కాలంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది.’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రూ.లక్షల్లోనే కాజేశారు.... నగర శివార్లోని ఒక డిపోలో రూ.5 లక్షలు తక్కువ ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు బస్సులు నడిపే మరో డిపోలోనూ సుమారు రూ.7 లక్షల వరకు సొమ్ముకు సరైన లెక్కలు లేవు. అలాగే నగరంలోని మరో కీలకమైన డిపోలోనూ ఇదే పరిస్థితి. సుమారు 56 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మె కాలంలో బస్సులు నడపడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ డిపో స్థాయి నిర్వహణ కొరవడింది. ప్రింటెడ్ టిక్కెట్లపైన లెక్కాపత్రం లేకుండాపోయింది. ఏ రోజుకు ఆ రోజు నడిపిన బస్సులు, వాటిపైన వచ్చిన ఆదాయం పైన కూడా జవాబుదారీతనం లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఇప్పుడు ఆడిటింగ్‌లో తలలు పట్టుకుంటున్నారు. నిజానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు నగరంలోని అన్ని డిపోల్లో ప్రతి రోజు 1500 నుంచి 2000కు పైగా బస్సులు నడిచాయి. ప్రయాణికులు సైతం ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. ఆ సమయంలో అక్రమాలకు పాల్పడకుండా తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లపైన పోలీసులు, ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించడం సత్ఫలితాలను ఇచ్చింది. కానీ సాధారణ రోజుల్లో ప్రతిరోజు కనీసం రూ.కోటి ఆదాయం వచ్చే ఆర్టీసీలో సమ్మె రోజుల్లో రూ.25 లక్షల కంటే ఎక్కువ రాలేదు. నిజానికి అద్దె బస్సుల యజమానుల నుంచి రావలసిన సొమ్ము రాకపోవడం కూడా ఇందుకు కారణమే. అదే సమయంలో కొందరు అధికారుల చేతివాటం కూడా అక్రమాల పర్వానికి ఆజ్యం పోసినట్లయిందనే ఆరోపణలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. నిద్రపోయిన నిఘా వ్యవస్థ... ఆర్టీసీ స్వీయ నిఘా వ్యవస్థ విజిలెన్స్ విభాగంసమ్మె కాలంలో నిస్తేజంగా ఉండడం కూడా ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ అధికారులు డిపోలపైన సరైన నిఘా ఉంచకపోవడం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో పట్టించుకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా మారింది. సాధారణంగా విజిలెన్స్ విభాగం ఇచ్చే నివేదికల ఆధారంగా ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు చేపడుతారు. కానీ సమ్మె కాలంలో అలాంటి పారదర్శకమైన వ్యవస్థ ఏ స్థాయిలోనూ పని చేయకపోవడం గమనార్హం. -
ఆర్టీసీపై ‘రెఫరల్’ భారం
సాక్షి, హైదరాబాద్ : అసలే రకరకాల సమస్యలతో కొట్టుమిట్టా డుతూ నష్టాల బాటలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)పై సొంత ఆసుపత్రి మరింత ఆర్థిక భారం మోపుతోంది. సరైన వసతులు లేకపోవడం, స్పెషలిస్టు వైద్యులు కరువవడం, ఆపరేషన్లు చేసే వెసులుబాటు లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఓ మోస్తరు వైద్యానికి కూడా ప్రైవేటు ఆసుపత్రులవైపు చూడాల్సి వస్తోంది. ఫలితంగా రెఫరల్ ఆసుపత్రులకు భారీగా బిల్లులు చెల్లించాల్సి రావడం ఆర్టీసీని బెంబేలెత్తిస్తోంది. వేసవిలో సిబ్బంది కోసం బస్టాండ్లలో మజ్జిగ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఆర్టీసీ... ప్రతి సంవత్సరం ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 30 కోట్ల కంటే ఎక్కువ మొత్తం రెఫరల్ బిల్లులు చెల్లిస్తోంది. అందులో కనీసం ఏటా రూ. 10 కోట్లు సొంత ఆసుపత్రి అభివృద్ధికి వెచ్చించి ఉంటే ఈపాటికి అది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరహాలో అభివృద్ధి చెంది ఉండేదని సొంత ఉద్యోగులు వాపోతున్నారు. ఇదీ సంగతి.... ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం కోసం హైదరాబాద్‌లోని తార్నాకలో ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైతే చికిత్స చేసి మందులు ఇచ్చేందుకు స్థానికంగా డిస్పెన్సరీలు ఉన్నా పెద్ద సమస్యలు వస్తే తార్నాకలోని ఆసుపత్రికే వస్తుంటారు. వైద్యులు వారి సమస్యలు గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఈ ఆసుపత్రి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. కొన్ని రకాల సమస్యలకు సంబంధించి ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులు లేరు. అలాగే ఆయా సమస్యలకు సంబంధించి నిర్వహించాల్సిన ఆపరేషన్ల కోసం వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఇటీవలి కాలంలో మందులకూ కొరత ఏర్పడ్డా ఇప్పుడిప్పుడే ఆ సమస్య పరిష్కారమవుతోంది. వెరసి చిన్నచిన్న చికిత్సలు మాత్రమే ఆసుపత్రిలో అందిస్తున్నారు. కాస్త పెద్ద సమస్యతో వచ్చే వారిని వెంటనే రెఫరల్ ఆసుపత్రులకు పంపేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సంస్థకు ఏటా ఈ రెఫరల్ ఆసుపత్రుల బిల్లు తడిసి మోపెడవుతోంది. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించలేకపోతున్న ఆర్టీసీ... రెఫరల్ ఆసుపత్రుల బిల్లులకు మాత్రం సగటున ప్రతి సంవత్సరం రూ. 30 కోట్లకుపైగా చెల్లించాల్సి వస్తోంది. ఈ మొత్తంలో సగం కంటే తక్కువ నిధులను ఆసుపత్రి అభివృద్ధికి ఖర్చు చేస్తే ఈపాటికి ముఖ్యమైన చికిత్సలకు సంబంధించి పరికరాలు, ఇతర వసతులు సమకూరి ఉండేవన్న వాదన సొంత ఉద్యోగుల నుంచే వినిపిస్తోంది. ఒక్కో సంవత్సరం కనీసం రూ.10 కోట్లు ఖర్చు చేసినా.. అన్ని ముఖ్యమైన పరికరాలు సమకూరి ఉండేవన్నది వారి మాట. మూడేళ్ల రెఫరల్ బిల్లు రూ. 105 కోట్లు... 2015–16లో ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న రోగులకు అందించిన మందుల ఖర్చు రూ. 9.14 కోట్లు అవగా ప్రస్తుత ఉద్యోగుల రెఫరల్ వ్యయం రూ. 28.45 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల రెఫరల్ వ్యయం రూ. 5 కోట్లు అయింది. గడచిన మూడేళ్లలో సొంత ఆసుపత్రిలో చికిత్స చేసి మందులు ఇచ్చినందుకు రూ. 32 కోట్లు ఖర్చవగా రెఫరల్ ఆసుపత్రులకు చెల్లించిన బిల్లు మాత్రం రూ. 105 కోట్ల వరకు అయింది. చేతిలో చాలినన్ని నిధుల్లేక కొన్నేళ్లుగా కొత్త బస్సులు కొనడాన్ని నిలిపివేసిన ఆర్టీసీ... గత్యంతరం లేని స్థితిలో ఈ బిల్లుల భారాన్ని మాత్రం మోయాల్సి వస్తోంది. ప్రభుత్వ వైద్యుల సేవలు వాడుకునే అవకాశం ఉన్నా... ఆర్టీసీలో దాదాపు 51 వేల మంది పనిచేస్తున్నారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు కలిపి 2 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇంతమందికి వైద్యం అందించే ప్రధాన ఆసుపత్రి అయినందున ఇక్కడ అన్ని విభాగాలకు చెందిన వైద్యులు, చికిత్సకు అవసరమైన పరికరాలు ఉండాలి. అయితే సాధారణ వైద్యులు మాత్రమే ఉండటంతో గుండె, కిడ్నీ, ఆర్థో సహా ఇతర పెద్ద సమస్యలతో వచ్చే వారిని నేరుగా రెఫరల్ ఆసుపత్రులకు పంపుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రిల్లో ఉన్న స్పెషలిస్టు వైద్యుల్లో కొందరిని గుర్తించి విడతలవారీగా ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యం అందించేలా చేసే అవకాశం ఉన్నా అధికారులు అలా చేయడం లేదు. అలాగే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన వైద్యులను గౌరవ భృతిపై పిలిపించే ఒప్పందం ఉన్నా అది కూడా సరిగా అమలు కావడం లేదు. దీంతో స్కానింగ్, ఎమ్మారైలకు కూడా వేరే చోటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ వసతులు, స్పెషలిస్టు డాక్టర్లు లేనందున ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం కంటే ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేయించుకొనేందుకే ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కొత్తగా ఆర్టీసీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో రెఫరల్ జాబితాను విడుదల చేసింది. అందులో మూడు మాత్రమే పెద్ద ఆసుపత్రులు ఉండటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తార్నాక ఆసుపత్రిలో అన్ని విభాగాలకు పూర్తిస్థాయి వసతులు, స్పెషలిస్టు వైద్యులు లేనందున రెఫరల్ ఆసుపత్రుల జాబితాలో సన్‌షైన్, కిమ్స్, గ్లోబుల్, యశోద, అపోలో, ఉషా ముళ్లపూడి, కామినేని లాంటి ఆసుపత్రులను కూడా చేర్చాలి’అని ఆర్టీసీ బోర్డు మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో కోరారు. సొంత ఆసుపత్రిపై నమ్మకం లేక ఇలాంటి డిమాండ్లు తరచూ వినిపిస్తున్నాయి. 2015–16 2016–17 2017–18 2018–19 (అంకెలు రూ. కోట్లలో) మందుల ఖర్చు 9.14 5.91 17.15 8.95 ప్రైవేట్ రెఫరల్ వ్యయం 33.51 38.20 35.21 31.69 -
ఉద్యోగ భద్రత ఏది?
సాక్షి, సిటీబ్యూరో: ‘ఆర్టీసీ ఉద్యోగమంటే జీవి తాంతం ప్రశాంతంగా బతుకొచ్చుననే భరోసా ఉండేది. రిటైర్మెంట్ గడువు దగ్గర పడిందంటే... అయ్యో అప్పుడే ఆర్టీసీని వదిలి వెళ్లాల్సి వస్తుందా అని ఆందోళనకు గురయ్యేవాళ్లం. కానీ ఇప్పుడు ఎప్పుడు రిటైర్మెంట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఏ రోజు ఎలాంటి వేధింపులను ఎదుర్కోవలసి వస్తుందో తెలియని అభద్రతతో పని చేయాల్సి వస్తుంది. ఆర్టీసీ కార్మికుల ‘సంక్షేమం’ ఇలా ఉంటుందనుకోలేదు....’’ ముషీరాబాద్–2 డిపోకు చెందిన ఒక సీనియర్ కండక్టర్ ఆవేదన ఇది. అధికారులు వేధింపుల కారణంగా డ్యూటీ చేయాలంటేనే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు. గ్రీవెన్స్‌సెల్ బాక్సులో వేసి ఫిర్యాదుల పరిష్కారానికి ఎలాంటి చర్యలు లేవని చెప్పాడు. కేవలం 20 కిలోమీటర్లు తక్కువ నడిపారనే కారణంతో అదే డిపోకు చెందిన 12 మంది కండక్టర్, డ్రైవర్లను ముషీరాబాద్–2 నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) డిపోకు బదిలీ చేయడంపై కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఒక్క డిపోలోనే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోల్లో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, తదితర సిబ్బందిపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. డిపోస్థాయిలో ఏర్పాటు చేసిన కార్మికుల సంక్షేమ కమిటీలు అలంకారప్రాయంగా మిగిలాయి. ఫిర్యాదుల పెట్టెలోనే ‘సంక్షేమం’.... ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. 55 రోజుల సమ్మె అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి డిపో స్థాయిలో మేనేజర్, ఒక చీఫ్ ఇన్స్పెక్టర్, ఒక మెకానికల్ ఫోర్స్మెన్, మరో ఇద్దరు డ్రైవర్, కండక్టర్లతో కమిటీలను ఏర్పాటు చేశారు. డిపోల్లో పని చేసే కార్మికుల ఫిర్యాదులను స్వీకరించేందుకు గ్రీవెన్స్సెల్గా ఇది పని చేయవలసి ఉంది. డిపో కమిటీల స్థాయి వెల్ఫేర్ కమిటీల్లో పరిష్కారం కాని సమస్యలను రీజనల్ మేనేజర్ స్థాయిలో పరిష్కరిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించవలసి ఉంది. నగరంలోని 29 డిపోల్లో వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ ఏ ఒక్క డిపోలోనూ తమ ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదని కండక్టర్లు, డ్రైవర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.‘‘ డబుల్ డ్యూటీలు వేస్తున్నారు. అదనపు జీతం ఇవ్వడం లేదు. సీనియారిటీని లెక్కలోకి తీసుకోవడం లేదు. డిపోమేనేజర్ను కలిసి సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశంలేదు’ ఉప్పల్ డిపోకు చెందిన ఒక డ్రైవర్ విస్మయం వ్యక్తం చేశారు. బస్సులు తగ్గించి పని భారం పెంచారు... గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలున్నాయి. గ్రేటర్లో సుమారు 1000 బస్సులను రద్దు చేశారు. వాటిలో కొన్నింటిని కార్గోలుగా మా ర్చారు. అకస్మాత్తుగా 10 వేల ట్రిప్పులకు పైగా తగ్గాయి. ఇక మిగిలిన 2500 బస్సులే ఆదాయ మార్గంగా మారాయి. దీంతో గతంలో ఉన్న 7.5 గంటల పని విధానం అటకెక్కింది. కండక్టర్లు, డ్రైవర్లపైన పని భారం పెరిగింది. ‘ఇప్పుడు రోజుకు 9 గంటలు పని చేస్తున్నాం, అయినా ఏదో ఒక రోజు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఒకటి, రెండు ట్రిప్పులు రద్దయితే ఇంక్రిమెంట్లను వాయిదా వేస్తున్నారు.’ అని ముషీరాబాద్–1 డిపోకు చెందిన కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక బస్సుకు రూ.4500 ఎర్నింగ్స్ టార్గెట్‌గా ఉంటే ఏదో ఒక రోజు రూ.3500 వచ్చిందంటే చాలు ఆ రోజు కండక్టర్, డ్రైవర్‌కు మూడినట్లే...’అని కంటోన్మెంట్ డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు తెలిపారు. కేఎంపీఎల్ తగ్గినా డ్రైవర్లపైన వేధింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు... బస్సుల సంఖ్యను తగ్గించి, ట్రిప్పులు కుదించి సిబ్బందిపై ఒత్తిడిని తీవ్రతరం చేసినప్పటికీ నగరంలో ప్రయాణికులకు సరైన రవాణా సదుపాయాన్ని అందజేయడంలో ఆర్టీసీ దారుణంగా విఫలమవుతోంది. నగర శివార్లకు, కాలనీలకు బస్సులు భారీగా తగ్గాయి. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు అనేక ప్రాంతాల నుంచి రైళ్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లకు చేరుకుంటాయి. కానీ ఆ సమయంలో సిటీ బస్సులు డిమాండ్‌కు తగిన విధంగా అందుబాటులో ఉండడం లేదు. ఉదయం 6.30 తరువాత మాత్రమే బస్సులు డిపో నుంచి బయటకు వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు క్యాబ్‌లు, ఆటోలను, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. -
హమ్మయ్య.. ‘పరపతి’ దక్కింది
సాక్షి, హైదరాబాద్ : పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇళ్ల నిర్మాణం తదితరాల కోసం కొంతకాలంగా గుట్టలుగా పేరుకుపోయిన ఆర్టీసీ ఉద్యోగుల దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం లభించబోతోంది. తమ జీతాల నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేసి ఏర్పాటు చేసుకున్న నిధిని ఆర్టీసీ సొంత అవసరాలకు వాడేసుకోవటంతో ఈ సమస్య వచ్చి పడింది. తిరిగి దాన్ని చెల్లించే పరిస్థితి లేకపోవటంతో సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఉద్యోగుల దరఖాస్తులు పేరుకుపోవడంతో రుణాలు రాక వారి కుటుంబాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు బ్యాంకు నుంచి రుణం పొంది ఆ బకాయిలను తీర్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అవి రాగానే ఉద్యోగుల దరఖాస్తులు కొలిక్కిరానున్నాయి. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేక ఉద్యోగుల సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను వాడేసుకుంటూ వచ్చింది. అలా ఏకంగా రూ.560 కోట్లు వినియోగించుకోవటంతో ఆ నిధి కాస్తా ఖాళీ అయింది.దీంతోపాటు ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్)కు సంబంధించి కూడా దాదాపు రూ.800 కోట్లు వాడేసుకుంది. దీనిపై ఇటీవల హైకోర్టు కూడా తీవ్రంగా పరిగణించింది. వాడేసుకున్న భవిష్య నిధి మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఈ రెండు బకాయిలను వెంటనే చెల్లించాల్సిన పరిస్థితి ఆర్టీసీ ముందుంది. కానీ చేతిలో నిధులు లేక బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు రూ.1400 కోట్లు బ్యాంకు రుణాలు పేరుకుపోయి ఉన్నాయి. వాటి వడ్డీ కూడా కొంతకాలంగా సరిగ్గా చెల్లించటం లేదు. బ్యాంకు రుణాలు సహా ఇతర అప్పులకు గాను సాలీనా రూ.180 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఉంది. అదీ చెల్లించటం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ రుణం అంటే బ్యాంకులు స్పందించడం లేదు. ఇటీవల ఆర్టీసీ బస్సుల చార్జీలు పెంచటంతో ఒక్కసారిగా ఆదాయం పెరిగింది. కొన్ని పొదుపు చర్యలతో ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా ఆదాయం అదనంగా పెరిగినట్టయింది. ఈ నేపథ్యంలో ‘పరపతి’పెరగటంతో బ్యాంకులు అప్పులు ఇస్తాయన్న నమ్మకం ఆర్టీసీకి కలిగింది. గతంలో రూ.600 కోట్ల అప్పు కోసం ప్రభుత్వ పూచీకత్తు కావాలంటూ చేసిన ప్రతిపాదన పెండింగులో ఉండటంతో, దాన్ని మరోసారి ప్రభుత్వం ముందుంచింది. కానీ దానికి స్పందన రాలేదు. బుధవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ ఈడీలు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. సమావేశానంతరం మంత్రి సీఎం కేసీఆర్ కార్యాలయానికి వెళ్లి ఈ విషయంపై చర్చించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటంతో మరో రెండుమూడు రోజుల్లో రూ.600 కోట్ల పూచీకత్తు లోన్‌కు సంబంధించి ఉత్తర్వు విడుదల కాబోతోంది. ఆ వెంటనే రుణం పొంది æ సీసీఎస్, పీఎఫ్ బకాయిలను ఆ మేరకు తీర్చాలని నిర్ణయించారు. వారంలో ఉద్యోగ భద్రత విధివిధానాలు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించి ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లో విధివిధానాలను రూపొందించాలని మంత్రి అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బస్సుల్లో ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే కండక్టర్లను సస్పెండ్ చేసే విధానం కొనసాగుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన ఉంది. చిన్నచిన్న ప్రమాదాలకు కూడా డ్రైవర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటాన్నీ వారు తప్పు పడుతున్నారు. ఈ రెండు విషయాల్లో వారిలో ఉద్యోగ భద్రత ఉండేలా చూడనున్నారు. టికెట్ తీసుకునే బాధ్యత ఇక ప్రయాణికులదే. తీసుకోకుంటే వారిపైనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు రానున్నాయి. కండక్టర్లు, డ్రైవర్లపై క్రమశిక్షణ చర్యల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై త్వరలో స్పష్టత రానుంది. ఇక డిపోల్లో ఉద్యోగులను వేధిస్తున్నారంటూ అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నందున వీటిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగులతో స్నేహభావంతో మెలిగి సంస్థ పురోగతి కోసం యత్నించాలని ఆయన ఆదేశించారు. ఇక నుంచి ప్రతి మంగళవారం ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలు, ఇతర అత్యవసర సెలవుల విషయంలో మానవతాధృక్పథంతో స్పందించాలన్నారు. బస్సుల్లో సిబ్బంది ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రత్యేక సందర్భాల్లో వారిని విధిగా విష్ చేయాలని ఎండీ సునీల్‌శర్మ పేర్కొన్నారు. సిటీ బస్టాపులు, కూడళ్లలో బస్సుల వివరాలు తెలిపే ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ఈడీలు పురుషోత్తం, వినోద్, టీవీరావు, యాదగిరి, వెంకటేశ్వరరావు, ఎఫ్ఏ రమేశ్, ఎస్ఎల్ఓ శ్రీలత, సీపీఎం సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పట్నవాసుల పల్లెబాట
సాక్షి, సిటీబ్యూరో: మహానగరం పల్లెబాట పట్టింది. అంబరాల సంక్రాంతి సంబరాల కోసం నగరం సొంత ఊరుకు తరలివెళ్లింది. స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వరుసగా సెలవులు రావడంతో నగర ప్రజలు భారీ సంఖ్యలో ఊళ్లకు బయలుదేరారు. పండుగ ప్రయాణాల దృష్ట్యా గత వారం రోజులుగా రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడాయి. కార్లు, బైక్‌లు వంటి సొంత వాహనాలపైన కూడా జనం పెద్ద ఎత్తున వెళ్లారు. సంక్రాంతి సందర్భంగా వివిధ మార్గాల్లో సుమారు 25 లక్షల మంది ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్లారు. దీంతో నగరంలోని ప్రధాన రహదారులపైన వాహనాల రద్దీ తగ్గింది. రోడ్లు ఖాళీగా కనిపించాయి. రైళ్లల్లో రిజర్వేషన్లు లభించకపోవడంతో చాలా మంది దూరప్రాంతాలకు సైతం ప్యాసింజర్ రైళ్లల్లో అతికష్టంగా బయలుదేరారు. రైళ్లపై ఆశలు వదులుకున్న వాళ్లు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. కానీ దూరప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్సులపై 50 శాతం చొప్పున ఆర్టీసీ అదనపు వసూళ్లకు పాల్పడింది. తెలంగాణ జిల్లాలకు వెళ్లే బస్సుల్లో 10 శాతం నుంచి 20 శాతం వరకు చార్జీలు పెంచారు. ప్రైవేట్ బస్సులు మరో అడుగు ముందేసి డబుల్ చార్జీలు వసూలు చేశాయి. పైగా ఒక ట్రావెల్స్‌కు, మరో ట్రావెల్స్‌కు మధ్య పొంతన లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగాయి. దీంతో చాలా మందికి పండుగ ప్రయాణం కష్టతరంగా మారింది. పిల్లలు, పెద్దలు, మహిళలు మరింత ఇబ్బందికి గురయ్యారు. సంక్రాంతి వేడుకలను సొంత ఊళ్లో చేసుకోవాలనుకున్న తమ కోరిక కోసం నగర వాసులు రవాణా చార్జీల రూపంలో భారీ మూల్యాన్నే చెల్లించుకోవలసి వచ్చింది. విజయవాడ, విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి వివిధ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. రోజువారి బయలుదేరే 85 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాకుండా, వివిధ ప్రాంతాల మధ్య సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో పలు ప్రధాన రైళ్లకు బోగీలను పెంచారు. అయినప్పటికీ ప్రయాణికుల డిమాండ్‌ను ఈ రైళ్లు భర్తీ చేయలేకపోయాయి. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలు సాగించే 3500 బస్సులకు అదనంగా 4503 బస్సులను సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. రైళ్లు, ఆర్టీసీ బస్సులు కాకుండా సుమారు వెయ్యి ప్రైవేట్ బస్సులు బయలుదేరాయి. మరో లక్షకు పైగా కార్లలో సైతం ప్రజలు తమ సొంత ఊళ్లకు బయలుదేరారు. నగరానికీ తరలి వచ్చారు.... హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన నగరవాసులే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ, వివిధ ప్రాంతాల్లోనూ స్థిరపడ్డ నగరవాసులు సైతంహైదరాబాద్కు తరలివచ్చారు. నగరంలోని పలుచోట్ల సంక్రాంతి సందడి నెలకొంది. పెరేడ్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన స్వీట్స్, కైట్స్ ఫెస్టివల్‌కు లక్షల సంఖ్యలో నగరవాసులు తరలి రావడం విశేషం. జాతీయ, అంతర్జాతీయ మిఠాయిలు, పతంగులతో ఈ వేడుకలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఉప్పల్, హైటెక్‌సిటీ శిల్పారామాల్లోనూ సంక్రాంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇదీ లెక్క .... ♦ వారం రోజుల నుంచే పండుగ ప్రయాణాలు మొదలైనప్పటికీ ఎక్కువ మంది 10,11,12,13 తేదీలలో బయలుదేరి వెళ్లారు. పిల్లలకు లభించిన సెలవులను బట్టి ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. పైగా ఈ నాలుగు రోజుల్లోనే ప్రయాణికుల రద్దీ భారీగా కనిపించింది. ప్రతి రోజు రైళ్లలో రోజుకు 2 లక్షల చొప్పున 4 రోజుల్లో 8 లక్షల మంది బయలుదేరారు. ♦ 3500 రోజువారీ బస్సులతో పాటు, ఆర్టీసీ మరో 4503 బస్సులు ప్రత్యేకంగా నడిపింది. నాలుగు రోజులలో సుమారు 10 లక్షల మందికి పైగా ప్రయాణికులు బయలుదేరారు. ♦ వెయ్యి ప్రైవేట్ బస్సుల్లో రోజుకు 40 వేల మంది చొప్పున ఈ నాలుగు రోజుల్లో 1.6 లక్షల మంది వెళ్లారు. ♦ ఇవి కాకుండా సుమారు 80 వేల నుంచి లక్షకు పైగా కార్లు నగరం నుంచి సొంత ఊళ్లకు బయలుదేరి ఉంటాయని అంచనా.వీటిలో ఈ నాలుగు రోజుల్లో మరో 5 లక్షల మంది సొంత ఊళ్లకు బయలుదేరారు. అలాగే తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చాలామంది సొంత బైక్‌లపైన బయలుదేరి వెళ్లారు. అలా 50 వేల మందికి పైగా వెళ్లినట్లు అంచనా. ♦ మొత్తంగా సంక్రాంతి సందర్భంగా సుమారు 25 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు బయలుదేరినట్లు అంచనా. -
ఆర్టీసీలో తగ్గనున్న 2,080 బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో భారీగా బస్సుల సంఖ్య తగ్గుతోంది. హైదరాబాద్‌లో నష్టాలు ఎక్కువగా వస్తున్నాయన్న ఉద్దేశంతో దాదాపు 800 బస్సులను తగ్గించిన అధికారులు.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు తిరుగుతున్న 1,280 బస్సులను కూడా ఉపసంహరించబోతున్నారు. వెరసి 2,080 బస్సులు తగ్గిపోతున్నాయి. ఇది మొత్తంగా రాష్ట్రంపైనే తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 గ్రామాలకు బస్సులు వెళ్లటం లేదు. తాజా నిర్ణయంతో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. అద్దె బస్సులు వస్తుండటంతో.. సొంత బస్సుల నిర్వహణను తీవ్ర భారంగా భావిస్తున్న ఆర్టీసీ క్రమంగా వాటిని తగ్గించుకోవాలని నిర్ణయించింది. వాటి స్థానంలో వీలైనన్ని అద్దె బస్సులను ప్రవేశపెట్టే దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2,100 అద్దె బస్సులు ఉండగా, వీటికి అదనంగా మరో పక్షం రోజుల్లో 1,334 బస్సులు రాబోతున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే టెండరు ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నెలాఖరుకు అవి రోడ్డెక్కబోతున్నాయి. కొత్తగా వస్తున్న అద్దె బస్సుల సంఖ్యతో సమంగా సొంత బస్సులను ఉపసంహరించుకోవాలని అధికారులు నిర్ణయించారు. కొత్తగా నగరంలో 54 అద్దె బస్సులు చేరనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 800 బస్సులను తగ్గించినందున కొత్తగా ఇక తగ్గించాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. ఇక నగరం వెలుపల 1,280 అద్దె బస్సులు కొత్తగా వస్తున్నందున, అంతే సంఖ్యలో సొంత బస్సులను ఉపసంహరించుకోబోతున్నారు. వాటిల్లో ఎక్కువ బస్సులు బాగా పాతవే. వాటిని తొలగించి ఆ స్థానంలో కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. అందుకే అద్దె బస్సులు తీసుకుంటోంది. మారుమూల గ్రామాలకు కష్టమే... రాష్ట్రవ్యాప్తంగా 800 గ్రామాలకు బస్సు వసతి లేకుండా పోయింది. కొత్త బస్సులు కొని వాటిల్లో కొన్ని ఊళ్లకు నడపాలని గతంలో ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు కొత్త బస్సులు కొనే పరిస్థితి లేకపోవటంతో చేతులెత్తేయాల్సి వస్తోంది. అదనంగా అద్దె బస్సులు వస్తున్నా, అంతే సంఖ్యలో సొంత బస్సులను తగ్గిస్తున్నందున అదనంగా ఒక్క ఊరికి కూడా బస్సు తిప్పే పరిస్థితి ఉండదు. అద్దె బస్సుల నిర్వాహకులు మారుమూల ఊళ్లకు బస్సులు తిప్పేందుకు ఆసక్తి చూపరు. లాభాలు వచ్చే రూట్లలోనే వారు తిప్పుతారు. వెరసి దూరంగా ఉండే ఊళ్లపై దుష్ప్రభావం తప్పేలా కనిపించటం లేదు. హైదరాబాద్‌ను గ్యాస్‌చాంబర్‌గా మార్చొద్దు.. నగరంలో భారీ సంఖ్యలో బస్సులను తగ్గించటం వల్ల సొంత వాహనాల వినియోగం విపరీతంగా పెరిగి కాలుష్యం తీవ్రమవుతుందని, ఇది ఢిల్లీ తరహాలో నగరం గ్యాస్‌చాంబర్‌గా మారేందుకు దోహదం చేస్తుందని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ట్రాఫిక్ చిక్కులు జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయని హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణా వాహనాల సంఖ్య తగ్గించకూడదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. షెడ్యూల్స్ మార్చటం వల్ల సమస్యకు పరిష్కారం: అధికారులు ఏయే ఊళ్లకు బస్సుల్లేవో ఎప్పటికప్పుడు గుర్తించి హేతుబద్ధీకరించటం ద్వారా షెడ్యూల్స్‌లో మార్పుచేర్పులు చేసి ఆయా ప్రాంతాలకు నడుపుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఓఆర్ ఉండే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. ఇప్పుడు కూడా అద్దె బస్సులు రాగానే అదే తరహా కసరత్తు చేసి కొత్తగా కొన్ని ఊళ్లకు బస్సులు తిప్పుతామంటున్నారు. -
మేడారం జాతరకు 4 వేల బస్సులు
ములుగు/మేడారం: మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని 51 ప్రాంతా ల నుంచి 4 వేల బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) యాదగిరి చెప్పారు. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం హరిత హోటల్లో శనివారం ఇంజనీరింగ్ ఈడీ వినోద్‌కుమార్, గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లుతో కలసి విలేకరులతో మాట్లాడారు. జాతర మొదలయ్యే ఫిబ్రవరి 2 నుంచి 9వరకు సేవలు అందిస్తామని, 23 లక్షల మందిని తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మేడారం విధుల్లో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది 12,500 మంది పాల్గొంటారని, 59 ఎకరాల్లో బస్టాండ్, 39 క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సర్వేలెన్స్ కెమెరాలను బిగించి కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. జాతర సమయంలో ప్రస్తుతం ఉన్న చార్జీలకు 50% అదనంగా వసూలు చేయనున్న ట్లు వివరించారు. ప్రతి శని, ఆది, సోమవారాల్లో భక్తుల డిమాండ్ మేరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని, త్వరలో స్టేషన్ల వారీగా బస్సు చార్జీల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. అంతకు ముందు మేడారంలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. -
సిటీ ఏసీ బస్సు చార్జీల తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగర ప్రయాణికుల కు ‘చల్లటి’ ప్రయాణాన్ని అందించేందుకు ప్రారం భించిన ఏసీ మెట్రో లగ్జరీ బస్సుల చార్జీలను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే వాటి టికెట్ ధరలను ఎంతమేర తగ్గించాలనే విషయంలో అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తుది ఆమోదం కోసం ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మకు పంపారు. ఆయ న ఆమోదం రాగానే కొత్త చార్జీలు అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి సిటీ ప్రయాణికులకు కొత్త సంవత్సరం కానుకగా అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నగరంలో ఈ కేటగిరీకి సంబంధించి 80 బస్సులు తిరుగుతున్నాయి. వాటిని వోల్వో కంపెనీ నుంచి ఐదేళ్ల కింద కొనుగోలు చేశారు. ఉప్పల్ నుంచి వేవ్‌రాక్, లింగంపల్లి నుంచి ఎల్బీనగర్, లింగంపల్లి నుంచి దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ నుంచి విమానాశ్రయం, సికింద్రాబాద్ నుంచి ఎల్బీనగర్.. ఇలా తిప్పుతున్నారు. ఎంత తగ్గిస్తారో..?! ఏసీ బస్సుల్లో ప్రస్తుతం లింగంపల్లి నుంచి ఎల్బీనగర్కు టికెట్ చార్జీ రూ.110గా ఉంది. అదే లింగంపల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు రూ.80గా ఉంది. ఉప్పల్ నుంచి వేవ్‌రాక్‌కు కూడా అంతే వసూలు చేస్తున్నారు. మెట్రో రైలు కంటే ఇది చాలా ఎక్కువ. దీంతో బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. ఇప్పుడు రూ.110గా ఉన్న టికెట్ ధరను రూ.75కు, రూ.80గా ఉన్న చార్జీని రూ.50కి తగ్గించబోతున్నట్లు సమాచారం. కనిష్ట టికెట్ ధర రూ.20 అలాగే కొనసాగిస్తూ, మూడు స్టాప్ల తర్వాత చార్జీలను సవరించనున్నట్లు సమాచారం. దీంతో కొన్ని స్టాపులకు మెట్రో డీలక్స్ బస్సు సర్వీసు కంటే రూ.5 చార్జీ మాత్రమే ఎక్కువగా ఉండబోతోంది. దీంతో ప్రయాణికులు ఈ బస్సుల వైపు మళ్లే అవకాశం ఉంటుందనేది ఆర్టీసీ ఆలోచన. -
టికెట్ లేకుంటే రూ.500 జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి గరిష్టంగా రూ.500 జరిమానా విధించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గతంలో బస్సుల్లో టికెట్లేని ప్ర యాణికులు దొరికితే కండక్టర్లపై కూడా బాధ్యతారాహిత్యం పేరుతో క్రమశిక్షణ చర్యలు తీసుకునేవారు. ఇది తమ ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉం దని, దాన్ని తొలగించాలని చాలా కాలంగా కండక్టర్లు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు టికెట్ లేకుంటే పూర్తి బాధ్యత ప్రయాణికులపైనే ఉండనుంది. అయితే డబ్బులు వసూలు చేసి టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో మాత్రం కండక్టర్లను బా ధ్యులను చేయనున్నారు. -
మార్పు మంచికే..!
సాక్షి, హైదరాబాద్: ఓ 25 రోజుల క్రితం.. అసలు ఆర్టీసీ మనుగడ ఏంటన్న పరిస్థితి. సంస్థ ఉంటుం దా లేదా అన్న అనుమానం. మోయలేని నష్టాలు, భరించలేని అప్పులు.. ఆర్టీసీని దెబ్బతీశాయి. అలాంటి ఆర్థిక సంక్షోభంతోనే రికార్డుస్థాయి సమ్మె జరిగేలా చేసింది. కానీ... సమ్మెకు పూర్వం ఆర్టీసీలో పరిస్థితి, ప్రస్తుత స్థితిలో ఎంతో తేడా. పని ప్రారంభించిన ఈ 25 రోజుల్లో ప్రత్యక్షమైన వాతావరణానికి గత స్థితికి పొంతనే లేదు. ఇటు కార్మికుల్లో, అటు అధికారుల ప్రవర్తనలో కొట్టొచ్చే తేడా.. వెరసి ఆర్టీసీ స్వరూపాన్నే మార్చే సంకేతాలిస్తున్నాయి. ఆర్టీసీ ఉండదేమో అనుకున్న స్థితిలో ఆందోళనకు గురైన సిబ్బంది, అధికారులు... సంస్థ కొనసాగటంతో ఊరట చెంది కొత్త ఉత్సాహంతో సవాల్‌గా స్వీకరించి పని ప్రారంభించమే దీనికి కారణం. సమ్మె ముగిసిన వారంలోపే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు డిపోకు ఐదుగురు చొప్పున సిబ్బందితో ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశం ఆ జోష్‌ను మరింత పెంచింది. వారి సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడు వరాల జల్లు కురిపించటమే కాకుండా, అధికారులు–కార్మికులు అన్న తేడా లేకుండా అంతా కలిసి సుహృద్భావ వాతావరణంలో పనిచేయాలంటూ చేసిన సూచనలు మంచి మార్పును తెచ్చాయి. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెరిగిన చార్జీలు తెచ్చే అదనపు ఆదాయం కంటే.... ఇరుపక్షాల్లో వచ్చిన మార్పు వల్ల మనస్ఫూర్తిగా పనిచేసే తత్వం పెరిగి సంస్థ పురోగతిలో కనిపిస్తున్న బూస్టప్ పెద్దది. ఈ 25 రోజుల్లో మారిన పరిస్థితిపై అధికారులు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇలా... గైర్హాజరీ అప్పుడు ఇప్పుడు 10 % 03% సమ్మెకు పూర్వం చాలా డిపోల్లో చెప్పా పెట్టకుండా సిబ్బంది గైర్హాజరవటం ఉం డేది. డ్యూటీ బుక్కైన తర్వాత కొందరు కండక్టర్లు, డ్రైవర్లు ఉన్నఫళంగా విధులకు గైర్హాజరయ్యేవారు. వేరే సిబ్బందిని కేటాయించే వీలు లేక కొన్ని సర్వీసులు డిపోలకే పరిమతమయ్యేవి. సగటున పది శాతం మంది సిబ్బంది ఈ జాబితాలో ఉండేవారు. ఫలితంగా ప్రయాణికులకు, ఆదాయం పరంగా ఆర్టీసీకి ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు తీరు మారింది. ఆరోగ్య సమస్యలతో మినహా ఈ తరహా గైర్హాజరీ 3 శాతానికి తగ్గిపోయింది. పంక్చువాలిటీ: అప్పుడు ఇప్పుడు 88% 95% ప్రతి బస్సుకు సమయం ఉంటుంది. దాని ఆధారంగా సిబ్బంది డ్యూటీ సమయాలు షెడ్యూల్ అవుతాయి. కానీ మొత్తం సిబ్బందిలో సగటున 12 శాతం మంది దీన్ని పాటించేవారు కాదు. సరిగ్గా బస్సు బయలుదేరేవేళకు వచ్చేవారు. బస్సు సిద్ధం చేసుకుని భద్రత పరమైన వ్యవహారాలు చూసుకుని బస్సు హ్యాండ్ ఓవర్ చేసుకునే డ్యూటీ టేకింగ్ ఓవర్‌కు 20 నిమిషాల సమయం అవసరం. దీంతో బస్సు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చేది. దీనివల్ల అన్ని పాయింట్లకు బస్సు ఆలస్యంగా వెళేంది. ఇప్పుడు సగటున 5 శాతం మంది తప్ప మిగతావారంతా రావాల్సిన సమయానికి కనీసం ఐదు నిమిషాలు ముందే ఉంటున్నారు. పద్ధతిగా బస్సు అప్పుడు ఇప్పుడు 60% 95% బస్సు ఏ ప్రాంతానికి వెళ్తుందో తెలియాలంటే ముందు, వెనక బోర్డు ఉండాలి. తర్వాత సీట్లు, ఫ్లోర్ చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉండాలి. ఇదంతా డ్రైవర్, కండక్టర్లపై ఆధారపడి ఉంటుంది. గతంలో దాదాపు 40 శాతం మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. అందుకే చాలా బస్సులు దుమ్ముకొట్టుకుపోయి ఉండటం, బస్సుల్లో ఊరిపేరుతో ఉండే బోర్డుల మార్పు పంక్చువల్‌గా లేకపోవటం, వెనకవైపు బోర్డులు ఏర్పాటు చేయకపోవటంలాంటి ఫిర్యాదులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వందలో ఐదు తప్ప అన్నీ పద్ధతిగా తిరుగుతున్నాయి. స్వచ్ఛంద ట్రిప్పుల రద్దు అప్పుడు ఇప్పుడు 8% 0.2% 8 గంటల డ్యూటీ విషయంలో సిబ్బంది పట్టింపుగా ఉంటారు. రకరకాల కారణాలతో చివరి ట్రిప్పు ఆలస్యంగా మారినప్పుడు కొందరు మధ్యలోనే దాన్ని మళ్లించి డిపోకు వచ్చేవారు. ఇలా బస్సులు తిరగాల్సిన మొత్తం కిలోమీటర్లలో నిత్యం సగటున 8 శాతం కోతపడేది. ఇప్పుడు అది కేవలం 2 శాతంగా ఉంటోంది. సిబ్బంది– అధికారుల మధ్య సత్సంబంధాలు అప్పుడు ఇప్పుడు 80% 90% కార్మిక సంఘాల ఎన్నికలు విషయంలో తప్ప కొత్త సమస్యలు పెద్ద గా లేవు. దీంతో గతంతో పోలిస్తే సంబంధాలు మెరుగుపడ్డాయి. తొలి పక్షం రోజులు మరింత మెరుగ్గా ఉంది. గత వారం రోజులుగా కొన్ని డిపోల్లో స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అప్పుడు ఇప్పుడు 20% 5% ప్రయాణికులున్నా బస్సు ఆపకపోవటం, టికెట్ల జారీ, చిల్లర ఇచ్చే విషయం, ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించటం... గతంలో ప్రతి డిపోలో సగటున నిత్యం మూడు నుంచి నాలుగు ఫిర్యాదులు ప్రయాణికుల నుంచి అందేవి. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ ఉన్నతాధికారులకూ ఫిర్యాదులు వచ్చేవి. 20 శాతం మందిపై ఈ తరహా ఫిర్యాదులుండేవి. ఇప్పుడవి 5 శాతానికి పడిపోయాయి. ఇప్పుడు చెయ్యెత్తినా బస్సు ఆపుతున్నారు. -
‘ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయారు’
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అశ్వత్థామరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఎన్ఎంయూ జిల్లా నాయకుడు రవి నాయక్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయాడని ఆరోపించారు. 52 రోజుల పాటు సమ్మె పేరుతో కార్మికుల జీవితాలతో చేలగాటమాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అశ్వత్థామరెడ్డి నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైన రవినాయక్.. సోమవారం సాయంత్రం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మరోవైపు ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నామని, మంగళవారం ఉదయం నుంచి ఉద్యోగులందరూ విధుల్లో పాల్గొనాలని జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మిక సంఘాల ప్రకటనపై స్పందించిన యాజమాన్యం.. వారిని విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేసి.. ఇప్పుడు వచ్చి విధుల్లో చేరతామంటే కుదరదని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు డిపోల వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని కార్మికులకు సూచించారు. దీంతో ఉదయం 6.00 నుంచే అన్ని డిపోల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్టీసీ సమ్మె: హాఫ్ సెంచరీ నాటౌట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె.. కొన్ని రోజులుగా హాట్ టాపిక్. ఆర్టీసీ చరిత్రలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద సమ్మె ఇదే. 50 రోజులకు చేరుకుని ఇంకా ‘నాట్ ఔట్’ అంటోంది. 49,300 మంది కార్మికులతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో పార్లమెంట్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. కొలిక్కి వచ్చినట్టే వచ్చి ముగింపు దొరక్క ఇంకా కొన‘సాగుతోంది’. సకల జనుల సమ్మె తర్వాత తెలంగాణలో సంచలనానికి కేంద్రబిందువు అయింది. ఇప్పుడు బంతి ముఖ్యమంత్రి కోర్టులో ఉంది. ఆయన నిర్ణయం కోసం యావత్తు రాష్ట్రం ఎదురుచూస్తోంది. వేతన సవరణ కాలపరిమితి ముగిసిన తర్వాత, తదుపరి కొత్త వేతనాల కోసం కార్మిక సంఘాలు ప్రభుత్వానికి నివేదించడం, కాలయాపన చేస్తే సమ్మె పేరుతో హెచ్చరించటం సాధారణమే. కానీ ఈసారి పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇందుకు ‘దసరా’ ముహూర్తం మూల కారణమైంది. రోజురోజుకు ఉధృతమవుతూ కార్మికులు పట్టుదలతో ముందుకు సాగినా, అనూహ్య పరిణామాలతో కార్మిక సంఘాల జేఏసీ పట్టు సడలించింది. జేఏసీ నోట సమ్మె విరమణ మాట ప్రభుత్వం దిగొచ్చేదాకా సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ తొలుత తెగేసి చెప్పింది. దీనికి కార్మిక లోకం బాసటగా నిలిచింది. అందుకే మూడు పర్యాయాలు విధుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసినా, కార్మికులు మెట్టు దిగలేదు. సకల జనుల సమ్మె సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని ఆర్టీసీ కార్మికులు 62 రోజుల పాటు నిర్వహించిన సమ్మె ఏపీఎస్ ఆర్టీసీ పరిధిలో అతిపెద్దదిగా చరిత్ర సృష్టించింది. దాన్ని మించి తమ సమ్మె సాగుతుందని ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కార్మిక నేతలు పలు సందర్భాల్లో ప్రకటించారు. ఆ దిశగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. కానీ. అనూహ్యంగా ఈ కేసు కార్మిక శాఖ పరిధిలోకి రావటంతో సమ్మె విరమణకు జేఏసీ మొగ్గు చూపాల్సి వచ్చింది. సమ్మె చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకమా అని తేల్చాల్సింది కార్మిక న్యాయస్థానమే అని హైకోర్టు ఐదు రోజుల క్రితం తేల్చి చెప్పింది. దీంతో కేసు హైకోర్టు నుంచి కార్మిక శాఖ పరిధిలోకి వచ్చింది. ఇది తేలే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో కార్మికుల్లో పునరాలోచన మొదలైంది. అంతకాలం సమ్మె చేస్తూ పోతే, కుటుంబ పోషణ ఎలా అన్న సంశయం రావడంతో సమ్మె విషయంలో జేఏసీపై ఒత్తిడి పెరిగింది. దీంతో విరమణ మాటను జేఏసీ బయటపెట్టింది. 30 మంది మృత్యువాత సమ్మె మొదలైన తర్వాత దాదాపు 30 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇందులో నలుగురు ఆత్మహత్యలు చేసుకోగా, మిగిలిన వారు గుండెపోటుతో మరణించారు. సమ్మెతో బస్సులు సరిగా తిరగక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డా, ఆర్టీసీ పరిరక్షణ పేరుతో కార్మికులు చేస్తున్న ఆందోళనలకు కొన్ని ప్రాంతాల్లో ప్రజలూ మద్దతు తెలిపారు. కానీ, రెండు నెలలుగా జీతాలు అందక, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన కార్మికులు, తిరిగి విధుల్లో చేరే అవకాశం ఉంటుందో లేదోనన్న వ్యధకు లోనయ్యారు. కార్మికులు గుండెపోటుతో చనిపోవటానికి ఈ ఆందోళనే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలా చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని తాజాగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. వారికి ఆర్థిక సాయం చేయడానికంటూ కొంతమంది విరాళాల సేకరణ కూడా ప్రారంభించారు. ప్రైవేటుకు బాటలు టీఎస్ఆర్టీసీలో అనూహ్య పరిణామం. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ ప్రపంచంలోనే ఉన్నత రవాణా సంస్థగా వెలుగొందింది. ఇందుకు గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి విడిపడిన తెలంగాణ ఆర్టీసీలో ఇప్పుడు ప్రైవేటుకు చోటు దక్కబోతోంది. సగం ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశలో ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చే ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో తొలిసారి ప్రైవేటు స్టేజీ క్యారియర్ పర్మిట్లతో బస్సులు తిరిగేందుకు రంగం సిద్ధమైంది. -
ఆర్టీసీ సమ్మె: ట్విస్ట్ ఇచ్చిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్: కార్మికులను బేషరుతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెనే విరమించే ప్రసక్తేలేదని, సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మె విరమణకు తాము సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. సమ్మెకు కొనసాగింపుగా శనివారం అన్ని డిపోల వద్ద సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తమను ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కార్మికులు ఎవరూ డిపోల వద్దకు వెళ్లవద్దని ఆయన కోరారు. సమ్మెపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ శనివారం మరోసారిభేటీ అవుతుందని, దీనిలో భవిషత్తు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్మికుల వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం రాలేదని, సమ్మెకు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. (చదవండి: ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే) కాగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రస్తుతం కార్మిక కోర్టులో విచారణజరుగుతోన్న విషయం తెలిసిందే. కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో సమ్మెను విరమించాలని జేఏసీ ఇటీవల నిర్ణయించింది. బేషరుతుగా కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని కోరింది. కానీ కార్మికుల విజ్ఞప్తికి ప్రభుత్వనుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా ఉద్యోగాల్లో చేరేందుకు అనేక మంది కార్మికులు గురువారం ఉదయం నుంచి డిపోల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే వారి చేరికపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకుఎవరిని ఉద్యోగాల్లో చేర్చుకోవద్దని డిపో మేనేజర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. -
ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే
సాక్షి, హైదరాబాద్: కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకుంటారా? లేక ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనేది ఆసక్తికరంగా మరాంది. రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని జేఏసీ ప్రతిపాదించింది. దీంతో విధుల్లో చేరతామంటూ గురువారం రాష్ట్రంలోని వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా డిపోల వద్ద ఇదే పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని, విధుల్లో చేరేందుకు సిద్ధమంటూ లేఖలు ఇచ్చినా కూడా తీసుకోవద్దని డిపో మేనేజర్లకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని మేనేజర్లు వారికి చెప్పి పంపించేస్తున్నారు. మరోవైపు ఆర్టీసిని నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలని, అంత శక్తి ప్రభుత్వ వద్ద లేదని సీఎం చేసిన వ్యాఖ్యలు కార్మికుల్లో కలవరం రేపుతున్నాయి. దీంతో వారి ఆశలన్నీ సీఎం తీసుకునే నిర్ణయంపైనే ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తూ ఆర్టీసీ రూట్లను కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ కొనసాగనుంది. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంగా సమ్మె విరమణ ప్రతిపాదనపై చర్చించి తన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సమ్మెకు సంబంధించిన అంశం కార్మిక న్యాయస్థానంలోనే తేల్చాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, అది తేలిన తర్వాతే వారిని విధుల్లోకి చేర్చుకునే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..!
సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం ఊబిలోకి నెట్టి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు యూనియన్ ప్రయత్నిస్తుందని, అందుకు విపక్షాలతో చేతులు కలిపి కుట్రకు పాల్పడుతోందని టీఎస్ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ ఆరోపించారు. ఒక పక్క యాజమాన్యంతో చర్చలు జరుగుతుండగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్లాయని, తిరిగి విధుల్లో చేరేందుకు వారంతా ముందుకు వచ్చిన విధుల్లోకి చేర్చుకునేలా నిర్ణయం తీసుకోవడం కూడా కష్టమేనని హైకోర్టుకు తేల్చి చెప్పారు. ఈ మేరకు టీఎస్‌ఆరీ్టసీ ఇన్చార్జి ఎండీ హోదాలో శనివారం ఆయన హైకోర్టులో స్పెషల్ అడిషినల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీ సిబ్బంది కోసం కాకుండా ప్రతిపక్ష రాజకీయపారీ్టల కోసం ఆర్టీసీ యూనియన్ అడుగులు వేస్తోందన్నారు. ఆర్టీసీ ఉనికినే దెబ్బతీస్తుంటే యాజమాన్యం చేతులు కట్టుకుని కూర్చోబోదని చెప్పారు. యూనియన్‌లో కొందరి తప్పిదాల వల్ల ప్రజలు, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ సంస్థ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. యూనియన్ మొండిగా వ్యవహరించిందని, బెదిరింపులకు దిగే క్రమంలోనే దసరాకు ముందు సమ్మెలోకి దిగారని చెప్పారు. ఆర్టీసీ కారి్మకులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం ఆరు వారాలు లేదా 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, కన్సిలియేషన్ జరుగుతుంటే సమ్మెలోకి వెళ్లడం అదే చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం సమ్మె చట్ట వ్యతి రేకం అవుతుందన్నారు. చట్ట వ్యతిరేకంగా సమ్మెలోకి వెళితే నెల రోజులపాటు జైలు శిక్షతోపాటు జరిమానాలను విధించేందుకు వీలుందన్నారు. డిమాండ్లను పరిష్కరించే పరిస్థితి లేదు.. యూనియన్ డిమాండ్లను పరిష్కరించే పరిస్థితుల్లో ఆర్టీసీ కార్పొరేషన్ లేదన్నారు. అగ్గి రాజేసి చలి కాచుకునే ధిక్కార ధోరణి/ క్రమశిక్షణారాహిత్యాలను ఉపేక్షించబోమని గట్టిగా నొక్కి చెప్పారు. సమ్మె పాశుపతాస్త్రం లాంటిదని, అయినదానికీ కానిదానికీ దానిని ప్రయోగించకూడదని, సమ్మె హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా లేదన్నారు. ప్రజా సరీ్వసుల్లోని సిబ్బంది సమ్మె చేస్తామని నోటీసు ఇవ్వడమే చట్ట విరుద్ధమని, 40 రోజుల సమ్మె వల్ల ఆర్టీసీ పరిస్థితే కాకుండా వ్యాపార, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో మొండిగా వ్యవహరించిన యూనియన్ ఆ డిమాం డ్‌ను ప్రస్తుతానికి పక్కకు పెట్టిందన్నారు. యూనియన్ మొండి వైఖరిని అనుసరించిందనడానికి ఇదే పెద్ద నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ విలీనం డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ప్రభుత్వా న్ని అస్థిరపరిచే అవకాశాలు లేకపోలేదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. యూనియన్ సమ్మె వల్ల ఉన్న నిల్వ నిధులు కాస్తా ఖర్చు అవుతున్నాయని, నష్టాల నుంచి భారీ నష్టాల ఊబిలోకి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు. పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నష్టాల్లో ఉన్నప్పటికీ ఆర్టీసీ సిబ్బందికి 44% జీతాల పెంపు, 16% మధ్యంతర భృతి ఇచ్చామని చెప్పారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు సత్వరమే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బస్సు రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు: సీఎస్ ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి హైకోర్టుకు తెలియజేశారు. క్యాబినెట్ నిర్ణయ ప్రక్రియ పూర్తి కాలేదని, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేలోగా ఆ నిర్ణయంలో మార్పుచేర్పులకు ఆస్కారం ఉంటుందన్నారు. జీవో వచ్చాకే క్యాబినెట్ నిర్ణయానికి పూర్తి సార్థకత వస్తుందన్నారు. ఈలోగా క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదని రాజ్యాంగంలోని 166(1) అధికరణం స్పష్టం చేస్తోందన్నారు. రవాణా చట్టం కూడా అదే స్పష్టం చేస్తోందన్నారు. బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాబినెట్ తీర్మానం నోట్‌ఫైల్స్‌లో భాగమని, సచివాలయం బయట ఉన్న వాళ్లకు ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. క్యాబినెట్ నిర్ణయం తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్ వెలువరించాలని, ఆ తర్వాత జీవో జారీ చేస్తేనే క్యాబినెట్ అమల్లోకి వస్తుందని, అప్పటి వరకూ ఆ నిర్ణయాన్ని సవాల్ చేయడం చెల్లదని, పిల్‌ను డిస్మిస్ చేయాలని ఆయన హైకోర్టును కోరారు. -
ఉద్రిక్తం: జేఏసీ నేతల హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల జేఏసీ శనివారం తలపెట్టిన బస్‌రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. కార్మికులు కార్యక్రమానికి పోలీసు శాఖ నుంచి అనుమతులు రాలేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని బీఎన్‌రెడ్డి నగర్లో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. మరోనేత రాజిరెడ్డి సైతం గృహ నిర్బంధం చేశారు. నేతల ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు వారి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరకుంటున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే బస్‌రోకోకు ఎలాంటి అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగానే పలువురు నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్‌ల పరంపర కొనసాగుతోంది. దీనిపై సిటీ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. నగరంలోని బస్ భవన్‌తో పాటు డిపోల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఇది శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపులుగా ఏర్పడి ఆందోళన చేయొద్దని, బస్సుల రాకపోకలు అడ్డుకుంటే ఉపేక్షించబోమన్నారు. నగరంలో ఇలాంటి చర్యల వల్ల విద్య, వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగుతాయని, నిబంధనలు పాటించాలని సూచించారు. -
సమ్మె ఎఫెక్ట్ : పీకల్లోతుకు ఆర్టీసీ
సాక్షి, సిటీబ్యూరో: కార్మికుల సుదీర్ఘమైన సమ్మెతో గ్రేటర్ ఆర్టీసీ కుదేలైంది. పీకల్లోతు నష్టాల్లోకి మునుగుతోంది. నిరవధిక సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ప్రైవేట్ సిబ్బందిని నియమించుకున్నారు. కానీ 50 శాతం బస్సులను కూడా నడపలేని పరిస్థితి నెలకొంది. దీంతో గడిచిన 40 రోజులుగా గ్రేటర్ ఆర్టీసీ భారీ నష్టాలను చవి చూస్తోంది. సాధారణంగానే ప్రతి రోజు రూ.కోటి చొప్పున నష్టాలు చోటుచేసుకొనేవి. రోజుకు రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తే నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.3.5 కోట్ల వరకు ఉండేవి. ప్రస్తుతం సమ్మె రోజుల్లో అది రెట్టింపైంది. సిబ్బంది జీతభత్యాలు, విడిభాగాల కొనుగోళ్లు, తదితర నిర్వహణ వ్యయం తగ్గినప్పటికి సిటీలో తిరిగే బస్సుల సంఖ్య, ట్రిప్పులు, కిలోమీటర్లు సగానికి పైగా పడిపోవడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. సమ్మె ప్రారంభించిన తొలి 10 రోజుల్లో రోజుకు రూ.20 లక్షలు కూడా ఆర్జించలేకపోయారు. రోజుకు 500 నుంచి 700 వరకు బస్సులు నడిచేవి. ఇప్పుడు బస్సుల సంఖ్య 1300 నుంచి 1500 వరకు చేరుకుంది. ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు అందుబాటులోకి రావడంతో బస్సుల సంఖ్యను కొంత మేరకు పెంచారు. కానీ గ్రేటర్ ఆర్టీసీ జోన్‌లోని 29 డిపోల్లో ఉన్న మొత్తం 3750 బస్సుల్లో ఇవి 50 శాతం లోపే ఉన్నాయి. పైగా సాయంత్రం 7 దాటిన తరువాత బస్సులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ట్రిప్పుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. సాధారణ రోజుల్లో 42 వేల ట్రిప్పులు తిరిగిన సిటీ బస్సులు ఇప్పుడు రోజుకు 20 వేల ట్రిప్పుల కంటే దాటడం లేదని, డిపోల్లో మెకానిక్‌లు లేక కొరవడిన బస్సుల మెయింటెనెన్స్, సూపర్వైజర్లు, చీఫ్ ఇన్స్పెక్టర్లు వంటి వ్యవస్థాగతమైన నిర్వహణ లేకపోవడం వల్ల బస్సులను నడుపలేకపోతున్నట్లు ఆర్టీసీ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం ఆదాయం పైన కాకుండా కేవలం ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించేందుకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘అప్పట్లో రూ.2.5 కోట్లు లభిస్తే ఇప్పుడు కోటి రూపాయలు కూడా రావడం లేదు. ప్రైవేట్ సిబ్బందే అయినా కండక్టర్లు, డ్రైవర్లకు టార్గెట్లు ఇస్తున్నాం. రూట్ల వారీగా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు చర్యలు చేపట్టాం. కానీ బస్సుల సంఖ్య, ట్రిప్పుల సంఖ్య పెరిగితే తప్ప ఆదాయం పెరగడం సాధ్యం కాదు.’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతంలో రోజుకు రూ.కోటి చొప్పున నష్టాలు వస్తే ఇప్పుడు రూ.కోటిన్నరకు పైగా నష్టమే. ఈ లెక్కన గత 40 రోజులలో గ్రేటర్ ఆర్టీసీ నష్టాలు సుమారు రూ.60 కోట్లకు పైగా నమోదైనట్లు అంచనా. పడిపోయిన ఆక్యుపెన్సీ.... మరోవైపు బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా దారుణంగా పడిపోయింది. ఉదయం, సాయంత్రం మాత్రమే సిటీ బస్సుల్లో రద్దీ కనిపిస్తుంది. అరకొరగా తిరగడం వల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో పయనిస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో బస్సులు లేకపోవడం వల్ల, సిబ్బంది కొరత కారణంగా ట్రిప్పులు తగ్గడంతో ఆక్యుపెన్సీ తగ్గింది. సాధారణ రోజుల్లో 68 శాతం ఆక్యుపెన్సీ ఉంటే ఇప్పుడు 45 శాతం వరకు మాత్రమే నమోదవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. సిటీ బస్సులు నడపడంలో పెద్దగా అనుభవం లేని ప్రైవేట్ డ్రైవర్ల వల్ల డీజిల్ వినియోగం పెరిగింది. గతంలో ఒక లీటర్‌పైన 4.5 కిలోమీటర్ల చొప్పున నడిచిన ఆర్డినరీ బస్సులు ఇప్పుడు 3 కిలోమీటర్లకు తగ్గినట్లు అంచనా. సమ్మెకు ముందుకు నగరంలోని 3750 బస్సులు ప్రతి రోజు 9.5 లక్షల కిలోమీటర్లు తిరిగితే ఇప్పుడు 4 లక్షల కిలోమీటర్లు కూడా తిరగడం లేదు. పెరిగిన బ్రేక్‌డౌన్స్... డిపోల్లో మెకానిక్‌లు ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే బయటకు వెళ్లేవి. ప్రతి 15 రోజులకు ఒకసారి బస్సులను పూర్తిగా తనిఖీ చేసి సామరŠాధ్యన్ని పెంచేవారు. అవసరమైన విడిభాగాలను ఏర్పాటు చేసి బస్సులు బ్రేక్డౌన్లకు గురికాకుండా చర్యలు తీసుకొనే సమర్ధవంతమైన యంత్రాంగం ఆర్టీసీకి ఉంది. ఇప్పుడు ఆ సిబ్బంది అంతా సమ్మెలో ఉండడం వల్ల బస్సుల నిర్వహణ కొరవడింది. మెకానిక్‌లు లేకపోవడంతో బ్రేక్‌డౌన్స్ పెరిగాయి. చెడిపోయిన బస్సులు డిపోలకే పరిమితమవుతున్నాయి. సమ్మె ఇలాగే కొనసాగితే ఆర్టీసీకి మరింత అపారమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనసాగుతున్న సమ్మె... ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అన్ని డిపోలు, బస్స్టేషన్ల వద్ద కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరాహార దీక్షలు, ధర్నాలు, బైఠాయింపులు, నిరసన సభలు, తదితర రూపాల్లో కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. -
సాహస ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో సిటీ బస్సుల సర్వీసుల కొరత ఎంత తీవ్రంగా ఉందో ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. ఉదయం ఎన్నో ప్రయాసలకోర్చి కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు తిరిగి ఇళ్లకు చేరేందుకు సరైన రవాణా సదుపాయం అందుబాటులో ఉండడంలేదు.తిరుగుతున్న అరకొర బస్సుల్లో చోటు దొరక్క విద్యార్థినులు ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతూ ప్రయాణం చేస్తుంటే.. విద్యార్థులు బస్సు వెనుక వేలాడుతూప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.ఈ సంఘటన మంగళవారం సాయంత్రం దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీనగర్ వెళుతున్న బస్సులో కనిపించింది. -
ఆర్టీసీ సమ్మె: కేంద్రం అనుమతి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారని, కార్మికులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని తాము ఖండిస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. మంగళవారం జేఏసీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘చర్చల ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం ప్రకారం చేసేది కాదు. 31శాతం కేంద్ర వాటా ఉంది. సంస్థను మార్చాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఎలాంటి మార్పు చేయలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. చట్టం ద్వారా కార్మికులకు రక్షణ ఉంటుంది. ఎవరూ భయపడవద్దు. ఏ ఒక్క కార్మికుడు జాయిన్ అవ్వడం లేదు. జాయిన్ అయిన వారు వెనక్కి వస్తున్నారు’ అని అన్నారు. భైన్సాలో తాత్కాలిక ఉద్యోగులు డీఎంపై దాడి చేయడాన్ని జేఏసీ నేతలు ఖండించారు. ఇంతమంది కార్మికులు చనిపోతే ప్రభుత్వం తరఫున కనీసం సానుభూతి చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో తాము ఈ ఘటనను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి అనుచరుడు ఒకరు సిబ్బందిని తీసుకొని వెళ్ళి డిపో వద్ద దింపడం సిగ్గు చేటని విమర్శించారు. సమ్మెకు మద్దతుగా 7న పెన్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థి సంఘాలతో మాట్లాడుతామని, చలో ట్యాంక్ బండ్ విజయవంతం చేయమని కొరతామని జేఏసీ నేతలు వెల్లడించారు. -
చర్చలు జరిపితే సమ్మె విరమిస్తాం: జేఏసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరిపితే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. సీఎం డెడ్‌లైన్ విధించినా ఎవరూ విధుల్లో చేరరని, చర్చలు జరిపితేనే సమ్మెను విరమిస్తామని అన్నారు. అలాగే సమ్మె కొనసాగించాలని 97 డిపోల కార్మికులు అభిప్రాయపడ్డట్లు ఆయన వెల్లడించారు. కార్మికులపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మంగళవారం అన్ని డిపోల ఎదుట మానవహారాలు చేపడుతున్నట్లు తెలిపారు. సమ్మెపై సీఎం సమీక్ష.. మరోవైపు ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష చేపట్టారు. సీఎం పిలుపుమేరకు రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రగతిభవన్ కు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరిక, తాజా పరిణామాలపై వీరు చర్చిస్తున్నారు. అలాగే ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి లేఖ రాయలన్న ఆలోచనలో కూడా సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా 31 శాతం ఉండటంతో వారి అభిప్రాయం కూడా తెలుసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. -
విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పోలీసుల భరోసా..
గచ్చిబౌలి: ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పూర్తి రక్షణ కల్పిస్తామని సైబరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉంటే తాము పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. అందుకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చారు. విధుల్లో చేరే ఆర్టీసీ ఉద్యోగులపై బెదిరింపులు, భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో చేరే వారిని ఎవరైనా ఉద్ధేశపూర్వకంగా అడ్డగించినా ఘెరావ్ చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. డయల్ 100, వాట్సాప్ నెంబర్ 949061744లలో ఫిర్యాదు చేయవచ్చన్నారు.– కమిషనర్ వీ.సీ.సజ్జనార్ భయపెడితే క్రిమినల్ కేసులు నేరేడ్మెట్: విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులకు పోలీసు భద్రత కల్పిస్తామని రాచకొండ కమిషనర్ æమహేష్ భగవత్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పిలుపు నేపథ్యంలో కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల్లో ఎవరైనా నిర్భయంగా విధుల్లో చేరవచ్చన్నారు. విధుల్లో చేరే కార్మికులను ఎవరైనా భయపెట్టినా, ఇబ్బందులకు గురి చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిచారు.ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల విధులకు ఆటంకం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం చట్టప్రకారం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని సీపీ పేర్కొన్నారు.–రాచకొండ సీపీ, మహేష్‌భగవత్ అన్ని డిపోల వద్ద బందోబస్తు.. ముఖ్యమంత్రి పిలుపు మేరకు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న ఆర్టీసీ సిబ్బందికి అవసరమైన పూర్తి భద్ర త కల్పిస్తాం. అది మా బాధ్యతగా భావిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రతి డిపో వద్ద అవసరమైన బందోబస్తు ఉంటుంది. విధులను అడ్డుకోవడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆస్తులకు నష్టం కలిగించినా, ఉద్యోగులను అడ్డుకున్నా అరెస్టు చేస్తాం. –అంజనీకుమార్,నగర పోలీసు కమిషనర్ -
డేట్ 5.. డ్యూటీకి డెడ్‌లైన్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో పనిచేస్తున్న 49 వేల మంది కార్మికుల పొట్టకొట్టి నష్ట పరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించిన నాయకుడిగా, సోదరుడిగా చెప్తున్నా.. యూనియన్ల మాయలో పడి బతుకులు ఆగం చేసుకోవద్దు. మీ కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నెల ఐదో తేదీ మంగళవారం రాత్రి 12 గంటల్లోగా విధుల్లో చేరండి.. కుటుంబాలను కాపాడుకోండి. ఉద్యోగాలకు రక్షణ ఉంటుంది. యూనియన్ల మాయలో పడకుండా కార్మికులు ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మంచి అవకాశం చేజార్చుకోవద్దు. మీకు రక్షణ ఉంటుంది’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. అవకాశం ఇవ్వకపోతే తమ తప్పు అని, ఇచ్చినా వినియోగించుకోకపోతే వాళ్ల తప్పు అని వ్యాఖ్యానించారు. కార్మికులు తమ కుటుంబాలు, జీవితాలను రోడ్డున వేయొద్దని.. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విధుల్లో చేరకుంటే మధ్యప్రదేశ్ తరహాలో తెలంగాణ ఆర్టీసీ రహిత రాష్ట్రమవుతుందని స్పష్టంచేశారు. నవంబర్ ఐదో తేదీ అర్ధరాత్రి లోగా కార్మికులు విధుల్లో చేరని పక్షంలో అన్ని రూట్లను ప్రైవేటుపరం చేస్తామని స్పష్టంచేశారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో ఐదు గంటల పాటు జరిగిన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాలకు చెందిన చిరుద్యోగులను ఆదుకున్న చరిత్ర మాది. ఆర్టీసీ కార్మికులకు కూడా నాలుగేళ్లలో 15శాతం ఫిట్మెంట్తో కలుపుకుని 67శాతం వేతనాలు పెంచాం. ప్రతీ ఒక్కరు గౌరవప్రదంగా బతకాలి. ఎవరి కడుపూ కొట్టకూడదు అనే ఉద్దేశంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఏఓలు తదితరుల జీతాలు పెంచాం. చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆపడం, రైతుల ఆత్మహత్యలు లేకుండా చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం’ అని కేసీఆర్ తెలిపారు. సమ్మె అర్థరహితం... ‘ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అర్దరహితం, దురహంకారపూరితం, అంతు లేని కోరికలతో జరుగుతున్న సమ్మె. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశంపై కూలంకషంగా చర్చించి.. విలీనం అసాధ్యమని నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో పాటు 5,100 ఆర్టీసీ బస్సులను ప్రైవేటు రంగానికి ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. అందువల్ల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆర్టీసీలో ప్రస్తుతం 10,400 సర్వీసులు ఉండగా, ఇందులో 2,100 అద్దె బస్సులు ఉన్నాయి. మిగిలిన 8,300 బస్సుల్లో 2,609 బస్సుల కాలం చెల్లి.. ఉపయోగంలో లేవు. రాబోయే 3, 4 నెలల్లో మరో నాలుగైదు వందల బస్సులు కూడా కాలం చెల్లేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొని, నడిపే సామర్ద్యం ఆర్టీసీకి లేనందున మొత్తంగా 5,100 బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తాం. ఇప్పటికే ఉన్న 2,100 అద్దె బస్సులు ఇక ఆర్టీసీలో ఉండవు. ప్రజా రవాణాలో లెవల్ ప్లేయింగ్ ఉండటంతో పాటు, బ్లాక్‌మెయిల్‌కు లొంగకుండా, రాష్ట్రం, రాజధాని ప్రతిష్ట దెబ్బతినకుండా చూస్తాం. యాజమాన్యం అదుపాజ్ఞలో పనిచేస్తే మంచి లాభాలు వస్తాయి. లాభాలు వచ్చే రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తామనే అపోహలు వద్దు. పల్లెవెలుగు రూట్లను ప్రైవేటుపరం చేస్తాం. లాభదాయం కాని రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగిస్తాం. ప్రైవేటుకు అప్పగించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. తద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ప్రైవేటు ఆపరేటర్లు కూడా సిద్దంగా ఉన్నారు. పండుగలు, పరీక్షల సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా, నగరాల్లో అభివృద్ది జరిగే క్రమంలో రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కార్మికులు ఐదో తేదీ అర్దరాత్రి లోగా విధుల్లో చేరకుంటే ఆరు, ఏడు తేదీల్లో ఆర్టీసీ భవిష్యత్తు నిర్ణయిస్తాం. ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన లేదు’ అని సీఎం స్పష్టం చేశారు. శనివారం కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు ఈటల రాజేందర్, పువ్వాడ అజయ్‌కుమార్ ప్రభుత్వ, ప్రైవేటు నడుమ లెవల్ ప్లేయింగ్ ‘ప్రభుత్వ, ప్రైవేటు ఆపరేటర్ల నడుమ లెవల్ ప్లేయింగ్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేసిన 2019 మోటారు వెహికిల్ సవరణ చట్టం ఈ ఏడాది నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం నిబంధనల మేరకు 5,100 బస్సులను ప్రైవేటుపరం చేస్తున్నాం. తద్వారా ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రైవేటీకరణపై ఎలాంటి అనుమానాలు వద్దు. ఆరోగ్యకరమైన పోటీ, విస్తృత సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే ఈ నిర్ణయం. ప్రైవేటు బస్సులు ప్రభుత్వ నియంత్రణలో నడిచేలా రెగ్యులేటరీ కమిటీ వేస్తాం. ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు పెంచకుండా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పర్యవేక్షణ ఉంటుంది. జర్నలిస్టులు, విద్యార్థులతో సహా అన్ని వర్గాలకు ఇచ్చే బస్సు పాసులు వంద శాతం చెల్లుబాటవుతాయి. ప్రజలు బాధపడకుండా యథావిధిగా కొనసాగిస్తాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అదే బాట లో మరో 91 చిన్న, పెద్దా ప్రభుత్వ కార్పోరేషన్లు అదే డిమాండును పెడతాయి. కోర్టులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తాయి. అందుకే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కేసీఆర్ తెలిపారు. బీజేపీ ఎంపీలు క్షమాపణలు చెప్పాలి... ‘బీజేపీకి ఈ రాష్ట్రంలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ప్రజల పక్షాన వారిని ప్రశ్నిస్తున్నా. కేంద్రంలో మోటారు వాహన సవరణ చట్టం ఆమోదించినపుడు లోక్‌సభలో మీరు ఉన్నారు కదా. అక్కడ అనుకూలంగా ఓటు వేసి ఇక్కడ డ్రామాలు చేస్తున్నారా. నితిన్ గడ్కరీ పార్లమెంటులో బిల్లు పెట్టినపుడు మీరు అంత పవిత్రులైతే నిరసన తెలపాలి కదా. నైతికత ఉందా.. మీ ప్రభుత్వం చేసిన చట్టంలో భాగస్వాములై ఇక్కడ వీరంగం వేస్తున్నారా? శవాలు మీద పేలాలు ఏరుకునే రకం.. చీప్ పొలిటికల్ టాక్టిక్స్’ అంటూ బీజేపీ ఎంపీల తీరుపై సీఎం మండిపడ్డారు. ‘కార్మికులను రెచ్చగొడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు ఉమాభారతి, బాబూలాల్ గౌర్ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసిన సమాచారం మా దగ్గర ఉంది. ఆర్టీసీ కార్మికుల విషయంలో బీజేపీ ఎంపీలు చేసిన దుర్మార్గాలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్లాట్ఫారం స్పీచ్‌లు ఎన్నైనా కొట్టొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఆర్టీసీని విలీనం చేసిందా. మాకు నోరు లేదా.. మేం మాట్లాడలేమా? ఆత్మహత్యలకు మీరే కారకులై ఎవరిని బదనాం చేస్తారు. మీరే నేరస్తులు’ అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘యూనియన్లు, ప్రతిపక్ష నాయకులే హంతకులు.. పనిచేసి బతికేవాళ్లను సమ్మెకు ఎంకరేజ్ చేసిన వాళ్లే హంతకులు.. బాధ్యత వహించాల్సింది వంద శాతం వాళ్లే. యూనియన్లు పెట్టిన పనికిమాలిన డిమాండ్ల వల్లే ఈ గతి. కార్మికులు బతకాలి. కార్పొరేషన్లను బతికించాలి. ఎటు తీసుకుపోతున్నారో సోయి ఉండాలి. 67 శాతం పెంచినా, 4,700 తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినా.. ఇవేం డిమాండ్లు.. అర్దం ఉందా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘సమ్మె చట్ట విరుద్దమని కార్మిక శాఖ ప్రకటించిన నేపథ్యంలో యజమానికి, కార్మికులకు ఉండే సంబంధాలు తెగిపోయినట్లే. సంస్థ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. దీంతో 49వేల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి. అయినా ఆర్టీసీ కారి్మకుల శ్రేయస్సు, సంస్థ మనుగడ దృష్టిలో పెట్టుకోకుండా ఇంకో ఆరు రోజులు అంటూ తొమ్మిదో తేదీ వరకు ఆర్టీసీ కారి్మక సంఘాలు కార్యాచరణ ప్రకటించడం అర్దరహితం’ అని విమర్శించారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం.. ‘రవాణా శాఖ రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూలులో ఉంది. ఆర్టీసీ విషయంలో ఏపీ, తెలంగాణ నడుమ కొంత వివాదం ఉంది. వివాదాస్పద విషయాలను పెండింగులో పెట్టి.. ఎవరి కార్పొరేషన్ వాళ్లు నడుపుకొనేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానిని రెండు ప్రభుత్వాలు నోటిఫై చేశాయి. ఇప్పుడున్నది తెలంగాణ ఆర్టీసీ.. ఆర్టీసీలో తెలంగాణకు 31శాతం వాటా ఉంది. ఆ మేరకు నష్టాలకు సంబంధించిన డబ్బు ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతాం. ఐదేళ్లలో ఎదురైన నష్టాలను పంచుకోమని అడుగుతాం. చేతులు కడుక్కుంటారా, డబ్బులు ఇస్తారా చూస్తాం. ఏపీలో ఆర్టీసీ విలీనం.. ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విలీనం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ రైతుబంధు, రైతు బీమా ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన విధానాలు ఉంటాయి. పాలసీ నిర్ణయాల మీద ప్రభుత్వాన్ని ఎవరూ డిక్టేట్ చేయలేరు. కేబినెట్ నిర్ణయం చెబుతున్నాం. అర్దం చేసుకోలేక పోతే వాళ్ల కర్మ. నేను కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కష్టం, నష్టం రానీయం. కులం, మతం, జాతి ఆధారంగా అన్ని వర్గాల శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తు, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. అందు కే 2014లో 63 మందిని గెలిపించగా, 2018లో మాకు మూడింట రెండొంతుల మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జడ్పీలకుగాను అన్ని చోట్లా మా పార్టీ వారినే గెలిపించారు. హుజూర్‌నగర్‌లో మా పార్టీ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజారిటితో గెలిపించి ప్రజలు మా మీద విశ్వాసం ఉంచారు. ఈ తరుణంలో మేం ఏ నిర్ణ యం చేసినా రాష్ట్రం, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. దేశంలో అత్యంత తీవ్ర ఆర్దిక మాంద్యం ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం అలాం టి పరిస్థితి లేకుండా చూస్తున్నాం. ఐదేళ్లలో 21% వృద్ధిరేటుతో ఉన్న తెలంగాణలో ఆర్ధికమాంద్యం మూలంగా వృద్ధిరేటు 5శాతానికి పడిపోయినా.. ఆర్దిక పరిస్థితి నెగటివ్‌లో మాత్రం లేదు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ గడపకూ మేలు చేకూరేలా కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల మూలంగా వలసలు లేని రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తున్నాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైకోర్టుకు ఆ అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తంచేసిన విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ బదులిచ్చారు. తప్పుడు సమాచారంతో అఫిడవిట్ జారీ చేశారని హైకోర్టు.. ఆర్టీసీ ఎండీపై మండిపడిందని వచి్చన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘కోర్టు అలా అనలేదు. అనజాలదు. అనడానికి కోర్టుకు కూడా అధికారం ఉండదు. ఎట్ట అంటదండీ. మేం ఫైల్ చేసిన అఫిడవిట్ మీద మాట్లాడాల.. అవతల పక్క అడ్వొకేట్ (ఆర్టీసీ జేఏసీ న్యాయవాది) ఏదో అంటడు. కానీ, కోర్టు అనలేదు. ఆయనెవరో అడ్వొకేట్ తప్పుడు మాటలు మాట్లాడిండు. ఏదో డాక్యుమెంట్ పట్టుకొచ్చి మాట్లాడిండు. అది అంతర్గత డాక్యుమెంట్. మంత్రికిచి్చన ప్రజెంటేషన్ డాక్యుమెంట్ అది. దానిమీద ఏమైనా సంతకం ఉంటదా అండి. హైకోర్టు అంటలేదు. అది ఎవడో అడ్వొకేట్ అంటుండు’ అని కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఉప ఎన్నికలు జరిగిన హుజూర్‌నగర్‌కు రూ.100 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆర్టీసీ కారి్మకుల జీతాలు ఇవ్వడానికి రూ.47 కోట్లు లేవా? అని హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుబట్టారు. ‘అలా కామెంట్ చేయడానికి హైకోర్టుకు కూడా అధికారం లేదు. ప్రభుత్వం కదా డబ్బులిచ్చేది.. ఒక హుజూర్‌నగర్‌కే ఇస్తాదండి? మేము పాలకు కూడా రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నం.. రూ.2 వేలు పింఛన్ ఇస్తున్నం.. రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నం.. వికలాంగులకు రూ.3 వేలు పింఛన్ ఇస్తున్నం. చాలా ఇస్తుంటం.. చాలా ఇస్తం.. ప్రభుత్వం ఒకటి ఇస్తదా? నువ్వు గాడ ఎట్ల ఇచ్చినవ్.. ఈడ ఎట్ల ఇచ్చినవ్.. అలా ఉంటదానండి లెక్క? ఆ పని మాది కదా’ అని కేసీఆర్ ప్రశ్నించారు. విలేకరిపై ఆగ్రహం.. ‘ఎంత ఘోరమైన ఆరోపణ చేస్తున్నావు. ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నావు’ అని ఓ పత్రికా విలేకరిపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మీ దగ్గరి వాళ్లకే అప్పగించడానికి ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయని ప్రశ్నిం చగా, ‘అట్లా ఇస్తామా? మా అంత పారదర్శకంగా ఎవరూ ఉండరు’ అని కేసీఆర్ బదులిచ్చారు. సీఎం ఏకపాత్రాభినయం: రేవంత్ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ఏకపాత్రాభినయం చేశారని, ఆయన మాటల్లో అడుగడుగునా అహంకారం, అధికార మదం కొట్టొచ్చినట్లు కనిపించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్‌ది బెదిరింపు ధోరణి: బీజేపీ చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ శనివారం కేబినెట్ భేటీ అనంతరం చేసిన ప్రకటనలు బెదిరింపు ధోరణితో ఉన్నాయని బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ప్రకటన విడుదల చేశారు. చర్చించి స్పందిస్తాం : ఆర్టీసీ కార్మికులు సాక్షి, హైదరాబాద్: సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈనెల ఐదో తేదీలోగా విధుల్లో చేరాలని, లేని పక్షంలో వారికి ఆరీ్టసీతో సంబంధాలు పోయినట్టేనన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వాఖ్యల నేపథ్యంలో కారి్మక సంఘాల జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణితో మాట్లాడినా కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని, ఆ బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదని కోకన్వీనర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం సమావేశం తర్వాత కారి్మకులకు సూచనలు చేస్తామని వెల్లడించారు. ఎవరూ విధుల్లో చేరరు ముఖ్యమంత్రి పెట్టిన డెడ్‌లైన్‌ను కార్మికులెవరూ పట్టించుకోరని కారిక సంఘాల జేఏసీ–1 కన్వీనర్ హనుమంతు పేర్కొన్నారు. గతంలో ఇలాగే చెప్పినా ఒక్కరు కూడా చలించని విషయాన్ని గుర్తించాలన్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకుంటే విధుల్లో చేరి ప్రయోజనం ఏమిటని, అసలు ఇన్ని రోజులు దీక్షగా నిర్వహించిన సమ్మెకు ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. తాము ఆర్టీసీ పరరక్షణ కోసమే సమ్మె చేపట్టామని, సంఘాల నేతల ప్రయోజనాల కోసం కాదని స్పష్టంచేశారు. ఉన్న రూట్లను ప్రైవేటీకరించి ఇక ఆర్టీసీ లేకుండా చేసే కుట్రకు ఆమోదం తెలుపుతూ కారి్మకులు విధుల్లో ఎలా చేరతారన్నారు. ఐదేళ్లలో 67 శాతం జీతాలు పెంచామన్న సీఎం మాట కూడా అబద్ధమేనని, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రకటించిన ఐఆర్ కలిపే తెలంగాణ ప్రభుత్వం తొలి వేతన సవరణ చేసిందని, వాస్తవంగా తెలంగాణ వచ్చాక పెరిగిన జీతాలు 33 శాతమేనని పేర్కొన్నారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిందేమీ లేదు: జీహెచ్ఎంసీ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి జీహెచ్ఎంసీ చెల్లించాల్సింది ఏమీ లేదని మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. శనివారం జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశానికి హాజరైన ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఎంత ఇవ్వాలో, ఎంత ఇచ్చారో స్పష్టత నివ్వాలని కోరారు. జీహెచ్ఎంసీ నుంచి రూ.1,400 కోట్లకు పైగా రావాల్సి ఉందని చెబుతున్నారన్నారు. ఈ అంశంపై చర్చకు మేయర్ బదులిస్తూ.. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఇవ్వాల్సింది ఏమీ లేదన్నారు. నిధులివ్వాలనేది మాండేటరీ (తప్పనిసరి) కాదన్నారు. -
అమిత్ షా వద్దకు ఆర్టీసీ పంచాయతి
-
అమిత్ షా వద్దకు ఆర్టీసీ పంచాయితి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. విద్యానగర్‌లోని ఎంప్లాయిస్ యూనియన్‌లో ఆర్టీసీ జేఏసీ, విపక్ష నేతలతో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలువనున్నట్లు తెలిపారు. కార్మికులపై టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయనతో చర్చిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి ఈనెల 4 లేదా 5వ తేదీలలో అమిత్ షాతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ విభజనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న అది చెల్లుబాటు కాదని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. రూట్లను వేరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అలాగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. భవిష్యత్తు కార్యచరణ ప్రకటన.. 3న అన్ని డిపోల వద్ద, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం 4న రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర దీక్ష 5న సడక్ బంద్ రహదారుల దిగ్బంధం 6న రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు నిరసన 7న ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్ష 8న ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమాలు 9న ట్యాంక్ బండ్ పై దీక్ష, నిరసన కార్యక్రమాలు -
సమ్మెలోనే ఆర్టీసీ డ్రైవర్ పదవీ విరమణ
కోదాడ అర్బన్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా ప్రభుత్వం దిగిరావడం లేదు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తాము సమ్మె కొనసాగిస్తామని, ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గేది లేదని ఆర్టీసీ జేఎసీ నాయకులు పేర్కొన్నారు. కోదాడ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ నారాయణ గురువారం పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు కార్పొరేషన్ తరఫున అన్ని బెన్ఫిట్స్ ఇస్తూ సత్కరించాల్సి ఉండగా ప్రభుత్వ విధానంతో సమ్మెలో కార్మికులు ఉండటంతో కార్మికులే ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరితో పదవీ విరమణ పొందుతున్న కార్మికులు తీవ్ర మనోవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులను గారడీ మాటలతో అందలం ఎక్కించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఆ కార్మికులను పాతాళానికి తొక్కేయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ముఖ్యమంత్రి ఎన్ని కుయుక్తులు పన్నినా కార్మికులు డిమాండ్లు సాధించుకొనేందుకు ముందుకు పోతారే తప్ప వెనక్కు తగ్గరన్నారు. పదవీ విరమణ పొందిన నారాయణకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా యూనియన్లు చర్యలు తీసుకుంటాయని వారు తెలిపారు. డ్రైవర్ నారాయణ మాట్లాడుతూ కార్మికులు అనుభవిస్తున్న గడ్డు కాలంలో పదవీ మిరణ పొందడం దురదృష్ణకరంగా భావిస్తున్నానని, ఆర్టీసీ పరిరక్షణకు జరుగుతున్న ఉద్యమంలో కార్మికులతో కలిసి ముందుకుసాగుతానన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఎసీ సూర్యాపేట నాయకుడు ఎస్ఎస్ గౌడ్, కోదాడ నాయకులు సైదులు, రాజశేఖర్, డ్రైవర్లు, కండక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో ‘ప్రైవేట్’ పరుగులు!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాలో సింహభాగంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్లో సమూలమార్పులు చోటుచేసుకోనున్నాయా? ఆర్టీసీ ముఖచిత్రం మారనుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకవైపు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రైవేట్ దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఇప్పటికే అద్దె బస్సులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రైవేట్ బస్సుల అనుమతులపైనా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే ఆర్టీసీలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సుల సంఖ్య పెరిగి ఆర్టీసీ బస్సుల సంఖ్య చాలా వరకు తగ్గిపోనుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా 50 శాతం ఆర్టీసీ బస్సులు ఉంటే మిగతా 30 శాతం అద్దె బస్సులు, మరో 20 శాతం ప్రైవేట్ బస్సులు ప్రజారవాణా రంగంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఆర్టీసీలో కొత్త బస్సులు కొనలేని స్థితి. చాలా వరకు డొక్కు బస్సులే ఉన్నాయి. దశలవారీగా ఈ డొక్కు బస్సులను తొలగిస్తే ఆర్టీసీలో 1000 బస్సులు కూడా మిగలకపోవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 3,550 బస్సులతో ప్రతి రోజు 32 లక్షల మందికి రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ చాలా వరకు తగ్గనుంది. అద్దె బస్సులకు ఆహ్వానం.. నగరంలో ప్రస్తుతం 375 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు ఆర్టీసీలో భాగంగానే కొనసాగుతున్నాయి. కిలోమీటర్‌కు కొంత మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లిస్తూ ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ అద్దె బస్సులను వినియోగిస్తోంది. వీటి సంఖ్యను 375 నుంచి 1133కు పెంచేందుకు కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు 60 బస్సులకు దరఖాస్తులు వచ్చాయి. నిర్దేశించిన 1133 అద్దె బస్సులను క్రమంగా భర్తీ చేసేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. దీంతో ప్రస్తుతం కొన్ని రూట్లకే పరిమితమైన అద్దె బస్సులు నగరంలోని మరిన్ని రూట్లకు విస్తరించనున్నాయి. ఈ బస్సుల నిర్వహణ పూర్తిగా ఆర్టీసీ పరిధిలోనే ఉంటుంది. అద్దె బస్సులకు డ్రైవర్లను వాటి యజమానులు ఏర్పాటు చేస్తే కండక్టర్లను మాత్రం ఆర్టీసీయే ఏర్పాటు చేస్తుంది. శివార్లకు ప్రైవేట్ సేవలు... నగరంలోని ప్రధాన ప్రాంతాలకు ఆర్టీసీ సొంత బస్సులతో పాటు, అద్దె బస్సులను నడుపుతూ నగర శివారుల్లోని కాలనీలు, గ్రామాలకు మాత్రం ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. 20 శాతం చొప్పున 752 ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఒకవైపు కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం ప్రైవేట్ బస్సుల ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టింది. ప్రైవేట్ బస్సులు తప్పనిసరైతే ప్రస్తుతం ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్న 32 లక్షల మంది ప్రయాణికుల్లో సుమారు 10 లక్షల మందికి పైగా ప్రైవేట్ బస్సులపైన ఆధారపడాల్సివస్తోంది. ఆర్టీసీలోని అన్ని రకాల బస్‌పాస్‌లన ు ప్రైవేట్ బస్సుల్లోనూ అనుమతించనున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో ఎలాంటి విధానాలు అమలవుతాయో తెలియదు. మరికొంత కాలంవేచి చూడాల్సిందే. -
అనగనగా ఆర్టీసీ.. తల్లిపై ప్రేమతో
ప్రజారవాణాలో అతి ముఖ్యమైన ఆర్టీసీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. నిజాం రైల్వేస్‌లో భాగంగా ‘రోడ్ ట్రాన్స్‌పోర్టు డివిజన్’ (ఆర్టీడీ) పేరుతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1932లో ప్రగతి చక్రం ప్రస్థానం ప్రారంభమైంది. 22 బస్సులు, 166 మంది సిబ్బందితో తొలుత పరుగులు పెట్టింది. ఆ తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ప్రజా రవాణా రంగంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. అయితే ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం వివిధ సందర్భాల్లో సమ్మెకు దిగిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి చేస్తున్న సమ్మె... ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్దదిగా మారనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కార్మికులు 27 రోజులు సమ్మె చేయగా... ఇప్పుడు చేపట్టిన సమ్మెకు ఇప్పటికే 25 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ...ఒక సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ప్రజా రవాణా సంస్థ. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఆర్టీసీలో కార్మికులు చేపట్టిన సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఇరువై ఐదు రోజులు గడిచినప్పటికీ అనిశ్చితి తొలగిపోవడంలేదు. దీంతో ఇప్పటి వరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలలో ఇదే అతిపెద్ద సమ్మెగా మారుతోంది. ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన కాలంలో రోడ్డు రవాణా విభాగం (ఆర్టీడీ)గా నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్‌లో ఒక విభాగంగా మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగింది. ప్రజా రవాణా రంగంలోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. నిజానికి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ కాలంలోనే రైల్వే రంగానికి బలమైన పునాదులు ఏర్పడ్డాయి. ఉస్మాన్ అలీఖాన్ సమయంలో రవాణా రంగం బాగా విస్తరించుకుంది. రైల్వే, ఆర్టీసీ, విమానయాన సేవలతో నిజాం రవాణా వ్యవస్థ సుసంపన్నమైంది. గౌలిగూడ బస్‌స్టేషన్ ఇదే అతి పెద్ద సమ్మె... ♦ ఆర్టీసీలో తరచుగా సమ్మెలు జరుగుతూనే ఉన్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు చివరి అస్త్రంగా సమ్మెను సంధిస్తున్నాయి. జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ బకాయిల చెల్లింపు, ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణాను అరికట్టడం, రన్నింగ్ టైమ్ పెంచడం వంటి డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఇప్పటి వరకు అనేక సార్లు సమ్మెకు దిగారు. ♦ సమస్యల పరిష్కారం కోసం 2000 సంవత్సరంలో కార్మికులు 14 రోజుల పాటు సమ్మె చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యాయి. అప్పట్లో సమ్మె జనజీవితంపైన ప్రభావం చూపింది. ప్రైవేట్ రవాణా సదుపాయాలు తక్కువగా ఉండడం, ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీపైనే ఆధారపడడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ♦ మోటారు వాహన పన్ను రద్దుతో పాటు, ఆర్టీసీ అభివృద్ధికి నిధుల కేటాయింపు, తదితర డిమాండ్లతో 2003లో మరోసారి కార్మికులు సమ్మెకు దిగారు. అప్పట్లో సమ్మె ఉధృతంగా సాగింది. 24 రోజుల పాటు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సమ్మెను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించింది. చివరకు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ♦ ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లో సకల జనుల సమ్మెలో భాగంగా 2011 అక్టోబర్ నెలలో కార్మికులు 27 రోజుల పాటు సమ్మె చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కార్మికులు ముందంజలో నిలిచారు. సర్వీసులన్నీ స్తంభించాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ♦ కానీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలలో మాత్రం ప్రస్తుతంకొనసాగుతున్నదే అతి పెద్ద సమ్మెగా నిలిచింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితిలో ఇప్పటికే 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన ఈ సమ్మెకు కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు. ♦ ఈ సమ్మెతో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రైవేట్ సిబ్బంది సహాయంతో పాక్షికంగా బస్సులు నడుపుతునప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ♦ మరోవైపు సమ్మె కారణంగా ఆర్టీసీ సైతం కోట్లాది రూపాయల నష్టాన్ని చవి చూస్తోంది. సాధారణ రోజుల్లో 3750 బస్సులతో, 42 వేల ట్రిప్పులు నడిచే సిటీ బస్సుల్లో ప్రతి రోజు 32 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం 1000 నుంచి 1500 బస్సులు మాత్రం రోడ్డెక్కుతున్నాయి. నిజాం కాలం నాటి బస్ టికెట్ ఇదీ చరిత్ర...... బ్రిటీష్ పాలిత ప్రాంతాలకు ధీటుగా హైదరాబాద్ స్టేట్‌లో రవాణా సదుపాయాలు విస్తరించుకున్నాయి. విశాలమైన రహదారుల నిర్మాణం జరిగింది. హైదరాబాద్ నగరంలో అప్పటి వరకు కేవలం సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితమైన మోటారు వాహన సదుపాయం క్రమంగా సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్–హైదరాబాద్ నగరాల మధ్య రవాణా సదుపాయాలు పెరిగాయి. ఆ రోజుల్లో ఇదే ప్రధానమైన మార్గం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి హుస్సేన్‌సాగర్ చెరువు కట్ట మీదుగా ఆబిడ్స్, కోఠీ మార్గంలో బస్సులు తిరిగేవి. 1879లో ఆవిర్భవించిన నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే సంస్థ తొలిసారిగా సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రైల్వే సేవలను ప్రారంభించింది. ఈ నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేస్‌లో ఒక విభాగంగానే 1932లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ’నిజాం స్టేట్ రైల్వేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డివిజన్’ను ఏర్పాటు చేశారు.ఇలా హైదరాబాద్ రాజ్యంలో రోడ్డు రవాణా వ్యవస్థ ప్రారంభమైంది. 22 బస్సులు, 166 మంది సిబ్బందితో ఆర్టీసీ ప్రస్థానం మొదలైంది.ఈ బస్సులను స్కాట్లాండ్ ఆటోమొబైల్ సంస్థ అల్బైనో తయారు చేసింది. అప్పటి వరకు ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో ఈ బస్సులను రూపొందించారు. 1932లో తొలిసారి బస్సుల ప్రారంభం... అమ్మ ప్రేమకు గుర్తుగా... నిజాం కాలంలో బస్సు నంబర్ ప్లేట్‌పై హైదరాబాద్ స్టేట్‌ను సూచించేలా హెచ్‌వై తరువాత ’జడ్’ ఉండేది. ఉదాహరణకు ’హెచ్‌వై జడ్ 223.’ అనే నెంబర్‌తో బస్సులు కనిపించేవి. ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి మీద ప్రేమతో ఆర్టీసీ బస్సల నెంబర్ప్లేట్లపైన ’జడ్’ అనే అక్షరాన్ని చేర్చారు. మొదట ఆయన తన తల్లి అమాత్ జహరున్నీసా బేగం పేరు మీద రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్‌ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ప్రభుత్వ సంస్థకు ఓ వ్యక్తి పేరు పెట్టడం తగదని మంత్రులు సూచించడంతో బస్సు నెంబర్లలో తన తల్లిపేరు కలిసి వచ్చేలా ఆమె పేరులోని ’జడ్’ (జహరున్నీసా) అనే అల్ఫాబెటిక్ను చేర్చారు. ఈ సంప్రదాయం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ఆర్టీసీ ప్రారంభమైన 1958 నుంచి కూడా బస్సుల రిజిస్ట్రేషన్లపై ’జడ్’ అనే అక్షరం వచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2014లో ఆర్టీసీ విభజన తర్వాత కూడా ఈ సంప్రదాయం స్థిరంగా ఉంది. ఆర్టీఏలో పోలీసు వాహనాలకు ’ పీ’ సిరీస్‌తో, రవాణా వాహనాలకు ’టీ’ సీరిస్ నెంబర్లతో, ఆర్టీసీ బస్సులకు ’జడ్’ సిరీస్‌తో నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. -
కేంద్రం పరిష్కరించాలి..
-
ఊసరవెల్లి రంగులు మార్చినట్లు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాము ఆర్టీసీకి ఎలాంటి బకాయి లేమని, బకాయిల కన్నా అదనంగా రూ.622 కోట్లు గత ఆరేళ్లలో చెల్లించామని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఆర్టీసీ కార్పొరేషన్‌కు బకా యిలు చెల్లించేశామని, 2014–15 సంవ త్సరం నుంచి ఇప్పటివరకు రూ.4,253.36 కోట్లు చెల్లించామని, ఇది బకాయిల కంటే అధికమని పేర్కొంది. జీహెచ్ఎంసీ కూడా రూ.1,492 కోట్ల బకాయిల్లో రూ.335 కోట్లు చెల్లించేసిందని, ప్రభుత్వం అద నంగా చెల్లించిన నేపథ్యంలో ఆర్టీసీకి జీహెచ్ఎంసీ కూడా చెల్లిం చాల్సినదేమీ లేదని వెల్ల డించింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, సమ్మెచేసే ఉద్యోగుల డిమాం డ్లలో న్యాయ బద్ధమైన వాటి పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా హిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘ వేంద్ర సింగ్ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. కేంద్రం పరిష్కరించాలి.. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అసలు ఆర్టీసీ విభజన జరగ లేదని, ఆస్తులు, అప్పులను తెలంగాణ, ఏపీలకు పంపకాల వంటి ఇతర సమస్య లను కేంద్రం పరిష్కరించాల్సి ఉందని, ఆర్టీసీలో 31 శాతం వాటా కేంద్రానికి కూడా ఉందని చెప్పింది. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ముందుగానే రీయింబర్స్మెంట్ చేస్తున్నట్లు ఆర్టీసీకి తెలిపారా.. ఇవ్వాల్సింది లేదని కూడా చెప్పారా లేదా అని ప్రశ్నించింది. పైగా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో కూడా ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల్లేవని చెప్పలేదని, బకాయి ఇవ్వాలన్న ఆర్టీసీ డిమాండ్‌ను ఖండించలేదని ధర్మాసనం ఎత్తిచూపింది. ముందుగానే డబ్బులు ఇచ్చేశామని ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నందున ఆర్టీసీకి బకాయిలు రావాల్సినవి ఉన్నాయో లేదో, ఉంటే ఎంత బకాయిలు ప్రభుత్వం నుంచి రావాలో తెలియజేయాలని ఆర్టీసీ ఎండీని కోర్టు ఆదేశించింది. నాలుగు ప్రధాన డిమాండ్లకు ఆర్టీసీ విభజన కాలేదు.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రకారం ఆర్టీసీ ఇప్పటికీ ఉమ్మడిగానే ఉందని, ఈ వ్యవహారం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని ఏజీ చెప్పారు. ‘జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 42 శాతం, ఏపీకి 58 శాతం బకాయిల్ని డబ్బు రూపంలో చెల్లించేందుకు అడ్డుంకులు ఏమున్నాయి. ఐదేళ్లుగా కేంద్రం వద్ద ఈ సమస్యను పరిష్కరించుకోకుండా ఏం చేస్తున్నారు’అని ధర్మాసనం ప్రశ్నించింది. సోమవారమే దీనిపై కేంద్రానికి లేఖ రాశామని ఏజీ జవాబు చెప్పారు. దీంతో ధర్మాసనం కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేసింది. ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉన్నందున కేంద్రం ఏం చేయదల్చిందో చెప్పాలని, ఏపీ పునర్విభజన చట్టంలోని 53వ సెక్షన్ ప్రకారం వీటి విషయంలో కేంద్ర వైఖరి తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 1న జరుపుతామని పేర్కొంది. ఆంకెలాట ఆడుతున్నట్లు ఉంది.. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లోని అంశాల్ని పరిశీలించిన ధర్మాసనం.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అంకెలాట ఆడుతున్నట్లు అనిపిస్తోందని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బకాయిలు చెల్లించామని చెబుతున్నారే గానీ, బకాయి ఏమీ లేదని చెప్పట్లేదని తప్పుపట్టింది. ఇందుకు ఏజీ బదులిస్తూ.. పూర్తి వివరాలిచ్చేందుకు రెండు రోజుల సమయం కావాలంటే హైకోర్టు ఇవ్వలేదని చెప్పారు. ‘ల్యాప్‌టాప్ క్లిక్ చేస్తే పూర్తి వివరాలు అందించే ఈ రోజుల్లో ఆర్టీసీకి ఎంత మేరకు బకాయిలు చెల్లించాలో చెప్పడానికి అంత సమయం ఎందుకు? రూ.4,253 కోట్లు చెల్లించామని చెబుతున్నారు. అందులో రూ.850 కోట్లు ఆర్టీసీ అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండటాన్ని కూడా డబ్బు ఇచ్చినట్లు ఎలా చెబుతారు? ఆర్టీసీకి అప్పు పుట్టేందుకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుంది. ఆ అప్పుపై వడ్డీలో కూడా ఒక్క రూపాయి ప్రభుత్వం చెల్లించదు. అలాంటప్పుడు గ్యారంటీగా ఉన్న మొత్తాన్ని కూడా ఆర్టీసీకి ఇచ్చామని ఎలా చెబుతారు? ఎప్పుడో డబ్బులిచ్చి 2018–19లో చెల్లించాల్సినవి కూడా ఇచ్చామని ఎలా చెబుతారు’అని హైకోర్టు ప్రశ్నలు సంధించింది. ప్రజాహితంతో అధికారులు వివరాలిచ్చారని ఏజీ చెప్పగానే.. ధర్మాసనం స్పందిస్తూ.. ‘వివరాలన్నీ వేగ్గా ఉన్నాయి. క్లిస్టర్ క్లియర్‌గా లేనేలేవు. సూటిగా చెప్పే ప్రయత్నమే కనబడలేదు’అంటూ వ్యాఖ్యానించింది. బడ్జెట్ లెక్కలు చెప్పండి ‘బడ్జెట్లో ఆర్టీసీకి 2013–2019 సంవత్సరాలకు ఎంత కేటాయించారు? తాజా బడ్జెట్ ఎంత.. ఇప్పటి వరకు ఎంత విడుదల చేశారు. ఇంకా ఎంత బడ్జెట్ విడుదల చేయాల్సి ఉందో తెలపండి. ఆర్టీసీ యూనియన్ల ప్రధాన 4 డిమాండ్ల పరిష్కారానికి అవసరమైన రూ.47 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందో లేదో కూడా స్పష్టం చేయాలి’అని కోర్టు పేర్కొనగా.. ఆర్థికమాంద్యం నేపథ్యంలో రూ.47 కోట్లు విడుదల చేసేందుకు సమయం కావాలని ఏజీ చెప్పారు. దీంతో ధర్మాసనం వెంటనే స్పందిస్తూ.. ‘ఇటీవల జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆ నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు రూ.47 కోట్లు ఇవ్వాలంటే ఆర్థిక మాంద్యమని చెబుతున్నారు. ఆర్టీసీ కూడా ప్రజల కోసమే పనిచేస్తోంది. విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలకే ఆదాయం సరిపోతోందని ప్రభుత్వం చెబుతోంది. మరి ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఆర్టీసీ లేదా? గిరిజనులు, మహిళలు, పిల్లలు, పేద, మధ్యతరగతి వారంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు’అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్టీసీకి బడ్జెట్లో కేటాయించిన రూ.550 కోట్లకు రూ.425 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని, మిగిలిన రూ.125 కోట్టు వచ్చే మార్చిలోగా విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏజీ చెప్పారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు.. పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలని పలుసార్లు కోరారు. సమ్మె చట్ట విరుద్ధమంటూనే, ఆర్టీసీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నారంటూ పరస్పర విరుద్ధంగా చెప్పడం ఊసర వెల్లి రంగులు మార్చినట్లుగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమ్మె విరమించాలని ఆదేశిస్తే కార్మికులు ఏం చేస్తారో.. సమ్మె చట్ట విరుద్ధమంటే ఏమవుతుందో కూడా ఆలోచించాలని హితవు పలికంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనపై ఆర్టీసీ వైఖరిని తెలిపేందుకు సోమవారం వరకు గడువు కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సెల్ శ్రీనివాసన్ అయ్యంగార్ కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించలేదు. కానుకకు జవాబుదారీ ఉంటుందా? ఆర్టీసీ బకాయిలు ముందుగానే చెల్లించేశామని ప్రభుత్వం చెప్పడంతో ఆ విషయాన్ని ముందుగానే కార్పొరేషన్‌కు చెప్పారా అని ప్రశ్నిస్తూ ‘మీకు నేను రూ.3 లక్షలు అప్పు ఉన్నాను. మీ కుమార్తె వివాహానికి నేను అప్పుతో కలిపి ప్రేమతో రూ.5 లక్షలు ఇచ్చాను. అప్పు పోను మిగిలిన రూ.2 లక్షలు కానుక అనుకుంటారు కదా? మరి ఆ రూ.2 లక్షలకు ఇప్పుడు మీరు జవాబుదారీ అని నేను అంటే ఎలా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన జవాబు రాలేదు. -
సంపూర్ణంగా ఆర్టీసీ సమ్మె..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోందని ఆ సంస్థ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులు, సర్వైజర్లు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్టీసీకి రూ.1099 కోట్లు రావాల్సి ఉందన్నారు. 2014 నుంచి రావాల్సిన రూ.1500 కోట్లు బకాయిలు ఎందుకు చెల్లించలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ చెల్లింపులపై అఫిడవిట్ వేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్మికులు ఎవ్వరూ అధైర్య పడొద్దని కోరారు. కాగా ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం వాడీవేడి వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరిగి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది. -
‘ఆర్టీసీ కార్మికుల సమ్మెకు గొప్ప విశిష్టత’
సాక్షి, సంగారెడ్డి: ఆర్టీసీ కార్మికులు 25 రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మెను చూస్తుంటే గర్వంగా ఉందని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సంగారెడ్డి బస్టాండ్‌లో మంగళవారం ఆర్టీసీ కార్మికులను కలిసి సంఘీభావం తెలిపిన ఆయన సమ్మెకు టీజేఎస్ తరఫున మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెకు గొప్ప విశిష్టత ఉందని అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్ సరూర్‌నగర్ గ్రౌండ్లో.. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే సకలజనుల భేరి సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమ్మెకు మద్దతిచ్చి ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించకపోతే ప్రైవేట్ బస్సులను నడిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులను బెదిరిస్తున్నారని కోదండరాం విమర్శించారు. సమ్మె ముందు ఆర్టీసీ 25 రోజుల ఆదాయం.. సమ్మెలో ఉన్నప్పుడు 25 రోజుల ఆదాయాన్ని కేసీఆర్ గమనించాలని అన్నారు. సీఎం కేసీఆర్‌కు పరిపాలన ఎలా చేయాలో చెప్పాల్సిన దుస్థితి వచ్చిందని కోదండరాం మండిపడ్డారు. ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు అనంతరం చర్చలకు పోతే.. 500 మంది పోలీసులను చుట్టూ పెట్టుకొని చర్చలు జరుపుతారా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ప్రత్యేక జీత భత్యాల కోసం సమ్మె చేయడం లేదని, న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. -
ఆర్టీసీ సమ్మె: హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేసిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్టీసీ అప్పులు పంపకాలు జరగలేదని కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర విభజన అనంతరం ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్.. ఆర్టీసీకి సంబంధించిన అంశాలు విభజన చట్టంలోని 9వ షెడ్యుల్‌లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీకి రూ. 4253 కోట్లు చెల్లించామని వివరించారు. దీనిపై ఘాటుగా స్పందించిన హైకోర్టు.. ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పామనలేదని, బకాయిలు ఎంత ఉన్నాయో స్పష్టంగా తెలపాలని ప్రశ్నించింది. రూ.4253 కోట్లు ఇస్తే.. బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. తమకు సమర్పించే నివేదికలో అధికారులు అతితెలివి ప్రదర్శిస్తున్నారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీకి కేటాయించిన నిధులను ఎలా క్యాటగిరి చేశారని, బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన నిధుల్లో డీ ఫాల్టర్ మీరే కదా అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు రూ. 47 కోట్లు వెంటనే ఇవ్వలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కొంత గడువు ఇస్తే ప్రయత్నిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వ వాదనతో ఏకీభవించని ధర్మాసనం.. ఉపఎన్నిక జరిగే చోట రూ.100 కోట్ల వరాలు ప్రకటించడంపై సెటైర్లు వేసింది. ప్రభుత్వానికి ఒక్క నియోజకవర్గం ప్రజలు ముఖ్యమా? లేక రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అని ప్రశ్నించింది. హుజూర్‌నగర్‌లో రూ.100 కోట్ల వరాలు ప్రకటించిన ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులు తొలగించడానికి రూ.47 కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే ఆర్టీసీలో మొత్తం ఎన్ని బస్సులున్నాయి? ఇప్పుడు ఎన్నిబస్సులు తిరుగుతున్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఇతర బలహీన వర్గాలు ప్రయాణం చెయ్యాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమ్మెపై ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తోందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజల ఇబ్బంది పడకుండా తగినన్ని బస్సులు ఏర్పాటు చేశామని చెప్తూనే బస్సులు లేక ఇబ్బంది పడతారని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారని కోర్టు గుర్తుచేసింది. ఆర్టీసీ ఎండీ కోర్టు విచారణకు ఒక్కసారైనా హాజరు అయ్యారా? అని ప్రశ్నించింది. 75 శాతం బస్సులు తిరుగుతున్నాయని ప్రభుత్వ కోర్టుకు తెలపగా.. ఇప్పటికీ మూడో వంతు బస్సులు నడవడం లేదని హైకోర్టు పేర్కొంది. ఇదిలావుండగా.. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరూర్ నగర్లో రేపు 2గంటల నుంచి 6 గంటల వరకు అనుమతి కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మె వలన కార్మికులు చనిపోయారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సరూర్ నగర్ సభ ద్వారా కార్మికులకు ఆత్మ స్టైర్యం కల్పించడం కోసం సభ ను ఏర్పాటు చేశామని వివరించారు. దీనిపై విచారించిన హైకోర్టు సరూర్ నగర్ లో కాకుండా ఎక్కడ అనుమతి ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై మంగళవారం సాయంత్రం లోపు తమ నిర్ణయాన్ని తెలపాలని ప్రభుత్వానికి గడువు విధించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
మూడు రోజుల్లో ముగింపే!
-
ఆర్టీసీని ఎవరూ రక్షించలేరు
-
ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్న ఆర్టీసీ భవిష్యత్తులో ఉండబోదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు పిచ్చిపంథాలో సమ్మె చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు. కార్మికుల భవిష్యత్తుతో యూనియన్లు నాయకులు ఆడుకుంటున్నారని విమర్శించారు. కార్మికులు తక్షణమే దిగిరావాలని లేదంటే ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తామని హెచ్చరించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా సీఎం కేసీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్టీసీ యూనియన్ల నాయకులే ఆర్టీసీని ముంచుతున్నారని ఆరోపించారు. యూనియన్ల చిల్లర రాజకీయాలతో ఆర్టీసీకి భారీ నష్టాలు తెచ్చిపెట్టారని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ఎవరు పడితే వారు గవర్నమెంట్లో కలపమంటే ఎలా? ఆర్టీసీ కార్మికుల ఎత్తుకున్నది పిచ్చిపంథా. అనవరమైన, అర్థపర్థంలేనటు వంటి పద్దతిని అవలంభించారు. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థపై నాకంటే ఎక్కువ అనుభవం లేదు. గతంలో మూడేళ్లు మంత్రిగా పనిచేశా. అప్పుడు ఆ సంస్థ 13కోట్ల 80లక్షల నష్టంలో ఉంది. నేనే కష్టపడి ఆ సంస్థను 14 కోట్ల లాభాల్లోకి తెచ్చా. నేను ముఖ్యమంత్రి అయ్యాక వైస్రాయి హోటల్లో ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించాను. వారికి సలహాలు ఇచ్చా. 44శాతం జీతాలు పెంచాం. ఎన్నికలకు కొద్దిరోజు ముందు 14 శాతం ఐఆర్ ఇచ్చా. మొత్తంగా 67శాతం జీతాం పెంచాం. చరిత్రంలోనే ఇలా ఎవరూ పెంచలేదు. ఇంత పెంచిన తర్వాత కూడా ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఎవరు పడితే వారు గవర్నమెంట్లో కలపమంటే ఎలా? వారి తర్వాత మిగతా 57 సంస్థలు కూడా ప్రభుత్వంలో కలపమంటే ఎలా? ఇదే కోర్టులు అప్పుడు మళ్లి మమ్మల్ని ప్రశ్నిస్తాయి. ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి. ఇదేనా రాజకీయం. బాధ్యతమైన ప్రతిపక్షాలు చేయాల్సిన పనేనా? సమ్మె ఎక్కడిది.. ఆర్టీసీయే ముగుస్తోంది ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ ప్రభుత్వంలో లేదు. 35 ఏళ్లు పాలించిన పశ్చిమ బెంగాల్లో సీపీఎం ఆర్టీసీని మూయలేదా? అక్కడ 200 బస్సులు మాత్రమే ప్రభుత్వానివి ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ ఆర్టీసీని మూయలేదా? వీళ్ల సమ్మె ఏం సమ్మె? అర్థం, ఆలోచన ఉండి చేసిన సమ్మెనా? ఏ ప్రభుత్వం వచ్చినా సమ్మె చేస్తారు. దిక్కుమాలిన యూనియన్ ఎన్నికల కోసం ఇలాంటి సమ్మెలు చేస్తారు. ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడిది.. ఆర్టీసీయే ముగుస్తుంది. ఈ రోజుకి 5వేల కోట్లు అప్పు ఉంది. ఒక నెల కిస్తీ కట్టకుంటే ఆర్టీసీ ముగుస్తుంది. ఫీఎఫ్ డబ్బులు కార్మికులకు ఇచ్చే దమ్ము ఆర్టీసీకి లేదు. నెలకు 100 కోట్ల నష్టం. ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని లాభాల్లో ఉంటే.. ఆర్టీసీ మాత్రం నష్టాల్లో ఉంటాయి. ఎందుకు అలా? ఇదేనా యూనియన్లు చేసే పని. అద్దెబస్సులు తొలగించండి అంటారు.. టైం ప్రకారం బస్సులు నడిపించాలి. ఆర్టీసీ ని ఎలా కాపాడుతారు. సందర్భం వస్తే ఓ గంట పనిచేస్తే ఏమవుతుంది. టైంప్రకారం పని దిగిపోతా అంటే ఎలా? ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు. గత ప్రభుత్వాలు 712 కోట్లు ఇస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం 4250కోట్లు విడుదల చేశాం. అది కాక ఓ చట్టం తీసుకొచ్చాం. దానిద్వారా 330 కోట్లు వచ్చాయి. ఏడాదికి 900 కోట్లుకు పైగా ఇచ్చాం. ఇంకేం ఇస్తారు? ఈ ఏడాది 550 కోట్లు పెట్టాం. 425 కోట్లు విడుదల చేశాం. ఇంకెన్ని ఇవ్వాలి? హైకోర్టు ఏం చేస్తది? సాధారణంగా పండగల సమయంలో డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఆర్టీసీకి బతుకమ్మ, దసరా చాలా ముఖ్యం. అటువంటి సమయంలో సమ్మెకు పోయారు. ఇదేనా పద్దతి. పలికిమాలిన డిమాండ్లను పెట్టారు. వారి డిమాండ్లపై కమిటీ వేశాం. సీఎస్ అధ్యక్షతన చర్చలు జరిపాం. అయినా వినలేదు. ఆర్టీసీ ప్రభుత్వం కలపాలన్నారు. కమిటీ కాదని సమ్మెకు పోయారు. ఇప్పుడు ఏమైంది. ఏం ఫలితం? సమ్మెకు ముందు ప్రభుత్వం 100 కోట్లు విడుదల చేశారు. వాటిలో 7 కోట్లు మాత్రమే ఇప్పుడు ఆర్టీసీ దగ్గర ఉన్నాయి. సమ్మె కారణంగా ప్రస్తుతం కూడా నష్టమే వస్తున్నాయి.సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలంటూ హైకోర్టులో కేసులు వేశారు. ఆర్టీసీకి నిధులు లేవని నివేదించాం. డబ్బులు లేవని చెప్పాం. హైకోర్టు ఏం చేస్తది కొడుతదా? బస్సులు, బస్టాండ్లు అమ్మి జీతాలు ఇవ్వాలి ఆర్టీసీ యూనియన్లు మహానేరం చేస్తున్నారు. అమాయక కార్మికలు గొంతు కోస్తున్నారు. వారిని ఎవరూ కాపాడలేరు. వందశాతం ఆర్టీసీ ఇప్పుడు ఉన్నట్లు ఉండదు. మోదీ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం.. ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వాని సంపూర్ణ అధికారాలు ఇచ్చారు. ఆర్టీసీలో పోటీని పెంచాలని సూచించారు. ఆర్టీసీకి పోటీదారిని సృష్టించమని అధికారాలు ఇచ్చారు. సెప్టెంబర్ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మేము అదే చేస్తాం. హైకోర్టుకు తీర్పు చెప్పే హక్కు లేదు. లేబర్ కోర్టుకు వెళితే ఆస్తులు అమ్మి జీతాలు ఇవ్వమంటారు. అప్పుడు బస్సులు, బస్టాండ్లు అమ్మి జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వదు. బుద్దిఉన్న ఏ వ్యక్తి ఇలాంటి సమ్మె చేయరు. నా దృష్టింలో ఆర్టీసీ పని అయిపోయింది. వారిపై ఎస్మా ఉన్నా కూడా సమ్మెకు పోయారు. ఇది చట్టవిరుద్ధ చర్య. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బుల్లేవు. బ్యాంకులు అప్పులు ఇవ్వరు. వెయ్యిశాతం పాత ఆర్టీసీ ఉండదు. ఈ యూనియన్లే ఆర్టీసీని ముంచాయి. ఇకపై కూడా ఇలాంటి యూనియన్లు ఉండి ఇదే గొంతెమ్మ కోరికలు కోరితే ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. కార్మికులతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. యూనియన్లు లేకుండా ఆర్టీసీ పనిచేస్తే కచ్చితంగా లాభాల్లోకి వస్తుంది. ఆర్టీసీ సమ్మెకు ముంగింపు ఆర్టీసీ ముగింపే జవాబు. తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులే కాదు అందరూ పనిచేశారు. కొద్దిరోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులకు రాకుండా చూసుకుంటాం. ఆర్టీసీ సంఘాలు తక్షణం దిగిరావాలి లేదంటే ఒక్క సంతకంతో 7వేల బస్సులకు పర్మిషన్లు ఇస్తాం’ కేసీఆర్ హెచ్చరించారు. -
ఆర్టీసీ సమ్మె: బస్సుపై రాళ్ల దాడి
ఆసిఫాబాద్: ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉదృతమవుతోంది. ఆసిఫాబాద్‌లోని హనుమాన్ విగ్రహం వద్ద రెండు బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరి ద్వంసం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో ప్రభుత్వం బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాగజ్‌నగర్ నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న బస్సుపై దుండగులు రాళ్లు విసరడంతో ధ్వంసమైంది. దాంతోపాటు మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న మరో బస్సుపై కూడా ఇదే తరహా దాడి జరిగింది. దీంతో బస్సు స్వల్పంగా ధ్వంసమైంది. ఊహించని ఘటనలతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాడికి పాల్పడిన వ్యక్తులు పరారయ్యారు. దాడులపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
రేవంత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు
బంజారాహిల్స్: పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వహణలో ఉన్న అధికారిని తోసేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనలో మల్కాజ్గిరి ఎంపీ, టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.48లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు, జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి, సెక్టార్ ఎస్ఐ నవీన్ రెడ్డి తదితరులు ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన బయటకు రాకుండా కట్టడి చేశారు. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుచరులతో కలిసి అతివేగంగా ఇంట్లో నుంచి బయటకు దూసుకొ చ్చారు. ఆ సమయంలో అడ్డుకున్న ఎస్ఐ నవీన్ రెడ్డితో పాటు పలువురు పోలీసులను నెట్టుకుంటూ, పక్కకు తోసేస్తూ అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్‌పై దూసుకుపోయారు. పోలీసులు అప్రమత్తమై చాలాదూరం చేజ్ చేసుకుంటూ వెళ్లినా అప్పటికే రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈ ఘటనలో నవీన్ రెడ్డికి గాయాలయ్యాయి. మిగతా పోలీసులను కూడా నెట్టుకుంటూ వెళ్లడంతో వారు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ నవీన్ రెడ్డి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేయగా ఆయనపై ఐపీసీ సెక్షన్ 341, 332తో పాటు 353 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్మికుల డిమాండ్లపై కేసీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమ్మె పరిష్కారానికి ఇరువర్గాలు బెట్టు వీడి ప్రయత్నాలు చేయాలన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశాన్ని పక్కనపెట్టి మిగిలిన 21 డిమాండ్లను పరిశీలించా లని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్నందున దాన్ని పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. మిగిలిన డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి రెండు మూడు రోజుల్లో నివేదిక అందించేలా చూడాలంటూ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. ఆ నివేదిక అందిన తర్వాత చర్చలపై తుది నిర్ణ యం తీసుకోనున్నారు. ఈనెల 28న జరిగే విచారణలో హైకోర్టుకు అదే విషయాన్ని నివేదించనున్నారు. కోర్టు ఉత్తర్వులతో.. ఆర్టీసీ సమ్మెపై విచారణ జరుపుతున్న హైకోర్టు.. శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి సంబంధించి ఆర్టీసీ ఎండీకి కొన్ని సూచనలు చేసింది. కానీ ఇందుకు సంబంధించిన మధ్యంతర ఉత్తర్వుల ప్రతి అధికారులకు అందకపోవడంతో సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కోర్టు చేసిన వ్యాఖ్యలను స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే స్పందించాలని నిర్ణయించారు. అధికారులు రెండుసార్లు సీఎంతో సమావేశం కోసం వెళ్లినా.. ఉత్తర్వుల ప్రతి లేకుండా చేసేదేమీ లేకపోవడంతో ముఖ్యమంత్రి కూడా భేటీలో పాల్గొనలేదు. చివరకు మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు అందడంతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తొలుత అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం రాత్రి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నివేదిక పరిశీలించాకే చర్చలపై నిర్ణయం.. కార్మిక సంఘాలు చేసిన డిమాండ్లలో 21 అంశాలను కొత్తగా ఏర్పాటైన కమిటీ పరిశీలిస్తుంది. వాటి అమలు సాధ్యాసాధ్యాలపై పూర్తి వివరాలతో నివేదికను ఎండీకి అందజేస్తుంది. దాన్ని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతారు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాతనే కార్మిక సంఘాలతో చర్చలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదంతా కోర్టు తదుపరి వాయిదా (ఈనెల 28)లోపు జరగాల్సి ఉంది. కోర్టుకు ఆ రోజు తన నిర్ణయాన్ని ప్రభుత్వం వెల్లడిస్తుంది. ఇటు కమిటీ.. అటు అద్దె బస్సులకు ఆదేశాలు కార్మికుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ వేయాలని ఆదేశించిన సీఎం కేసీఆర్.. అదే సమయంలో వెయ్యి అద్దె బస్సులను సమకూర్చుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులకు సూచించారు. వాస్తవానికి ఇప్పటికే అద్దె బస్సుల కోసం అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా.. దానికి సంబంధించి దాఖలైన టెండర్లను అధికారులు సోమవారం రాత్రి పరిశీలించారు. జిల్లాల్లో 250 బస్సులకు 9,700 దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో మాత్రం 750 బస్సులకు కేవలం 18 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. తాజాగా మరో వెయ్యి బస్సులకు నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. సరిపడా దరఖాస్తులు రానిపక్షంలో మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. కమిటీలో సభ్యులు వీరే... ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఆర్టీసీ ఇన్చార్జీ ఎండీ సునీల్‌శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. ఆర్టీసీ ఈడీ టి.వెంకటేశ్వర్రావు అధ్యక్షుడిగా ఈడీలు ఎ.పురుషోత్తం, సి.వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్.రమేష్‌లు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పడింది. హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండికి అందిస్తుందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. మోదీ ప్రభుత్వం చేసిన చట్టప్రకారమే చేస్తున్నాం... ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్బలంతో చట్టవ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, బీజేపీలు మద్దతు పలకడం అనైతికమని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీలు ఆర్టీసీ విషయంలో చేస్తున్న వాదనలు విచిత్రంగా ఉన్నాయి. ఆర్టీసీని, రూట్లను ప్రైవేటుపరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం, అవకాశం కల్పిస్తూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చట్టం చేసింది. దానికి వ్యతిరేకంగా ఇక్కడి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని మూసేసింది. కానీ ఆ పార్టీ నేతలు తెలంగాణ విషయంలో మాత్రం విచిత్రంగా, విభిన్నంగా మాట్లాడుతున్నారు’’అని కేసీఆర్ దుయ్యబట్టారు. ‘‘1950లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మోటారు వాహనాల చట్టాన్ని రూపొందించారు. దాని ప్రకారమే రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవద్దని కూడా ఆ చట్టంలో పేర్కొన్నారు. ఆ చట్టంలోని 3వ సెక్షన్లో సవరణలు చేస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019 బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు ఆమోదించి, చట్టం చేసింది. ఆర్టీసీలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించాలని అందులో పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించడానికి, తక్కువ ధరల్లో ప్రయాణం సాగించడానికి పోటీ అనివార్యమని కూడా కేంద్రం అభిప్రాయపడింది. మొబైల్ రంగంలో, విమానయాన రంగంలో ప్రైవేటుకు అవకాశం కల్పించడం వల్ల ఆయా రంగాల్లో రేట్లు తగ్గాయని, సౌకర్యాలు పెరిగాయని వివరించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్లోనే చెప్పారు. అలాంటిది బీజేపీ నాయకులు తెలంగాణలో మాత్రం ఆర్టీసీ విషయంలో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు’’అని కేసీఆర్ విమర్శించారు. కేంద్రం తెచ్చిన చట్టాన్నే అమలు చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే, స్థానిక బీజేపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్న విషయంపై ప్రధానికి, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రికి లేఖ రాయాలనే అభిప్రాయపడ్డారు. దీనిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. సీఎంతో జరిగిన సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు పాల్గొన్నారు. విలీనంపై పట్టు పట్టబోమని చెప్పారు.. ‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలి. కార్మిక సంఘాల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ నెరవేరితే తప్ప చర్చలకు కార్మికులు రారని ఎప్పుడూ చెప్పలేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్ వదులుకున్నట్లయింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. వాటిని పరిశీలించాలి’’అని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీని కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ బాధ్యతను ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మకు అప్పగించారు. ఈనెల 18న హైకోర్టు నేరుగా ఆర్టీసీ ఎండీకే సూచనలు చేయడంతో ఆయనే స్పం దించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. -
మరో రికార్డు బద్దలు కొట్టిన మెట్రో
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌వాసుల కలల మెట్రో మరో రికార్డు సృష్టించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు పోటెత్తడంతో సోమవారం నాలుగు లక్షలకు పైగా ప్రయాణికుల జర్నీతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు మెట్రోరైళ్లలో 3.75 లక్షలమంది జర్నీ చేయడమే ఇప్పటివరకు నమోదైన రికార్డు కాగా..సోమవారం రికార్డుతో పాత రికార్డు బద్దలైంది. పలు ప్రధాన రూట్లలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో లక్షలాదిమంది మెట్రోరైళ్లను ఆశ్రయించారు. దీంతో 4 అదనపు రైళ్లు..120 అదనపు ట్రిప్పులను నడిపారు. మొత్తంగా సోమవారం 830 ట్రిప్పుల మేర మెట్రో సర్వీసులను నడపడం విశేషం. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పీక్ అవర్స్‌లో ప్రతి 3.5 నిమిషాలకు..ఇతర సమయాల్లో ప్రతి ఏడు నిమిషాలకో రైలును నడిపినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. స్టేషన్లలో అధిక రద్దీ నేపథ్యంలో....ట్రిప్పులను అదనంగా నడిపామన్నారు. ప్రధానంగా ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ఎల్భీనగర్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, లక్డికాపూల్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మియాపూర్ స్టేషన్లు కిక్కిరిశాయి. స్టేషన్లలోకి చేరుకునేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులు బారులు తీరారు. అన్ని మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి. ఇక నాగోల్–హైటెక్‌సిటీ రూట్లోని నాగోల్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, మాదాపూర్, హైటెక్‌సిటీ స్టేషన్లలో వేలాది మంది మెట్రో రైళ్లకోసం నిరీక్షించడం కనిపించింది. ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. అమీర్‌పేట్ మెట్రోస్టేషన్లో ప్రయాణికుల రద్దీ బేగంపేట్ మెట్రోస్టేషన్‌కు తాళం.. ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు బేగంపేట మెట్రో స్టేషన్‌కు అధికారులు తాళం వేశారు. నిరసన కారులు స్టేషన్లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. కాగా భద్రతా కారణాల రీత్యా బేగంపేట మెట్రో స్టేషన్లో రైలు ఆగదంటూ మెట్రో అధికారులు ముందుగానే ప్రతి మెట్రో స్టేషన్లో నోటీసు అంటించడం విశేషం. అయితే స్టేషన్ మూసివేత కారణంగా ఈ స్టేషన్లో దిగాల్సిన ప్రయాణికులు ముందు స్టేషన్లో దిగాల్సి రావడంతో ఇబ్బందులు పడ్డారు. -
ఆర్టీసీ సమ్మెః ఎక్కువ బస్సులు నడపండి
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారం 18వ రోజుకు చేరుకుంది. రెండొంతుల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్వైజర్లు, తదితర కేటగిరీలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలిసి డిపోలు, బస్స్టేషన్ల వద్ద బైఠాయించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. జూబ్లీబస్‌స్టేషన్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, బస్‌భవన్ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. సెప్టెంబర్ నెల జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతుగా కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడి చేపట్టడం, మరోవైపు కార్మికులు తమ కుటుంబాలతో కలిసి ఆందోళనకు దిగడంతో బస్‌డిపోలు, ప్రయాణ ప్రాంగణాల వద్ద, బస్‌భవన్ వద్ద పోలీసులు గట్టిభద్రతను ఏర్పాటు చేశారు. ఇక కార్మికులు 30వ తేదీన సకలజనుల సమరభేరి నిర్వహించనున్నారు. అంతంత మాత్రంగా ఆర్టీసీ బస్సులు.... కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక సిబ్బంది సహాయంతో సోమవారం నుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ డ్రైవర్ల కొరత కారణంగా ప్రయాణికులు, విద్యార్థుల రద్దీకి తగిన విధంగా బస్సులు నడపలేకపోయారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి బస్టాపుల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. విద్యార్థులు సకాలంలో కాలేజీలకు చేరుకోలేకపోయారు. ఎక్కువ బస్సులు నడపండి: మేడ్చల్ కలెక్టర్ నేరేడ్మెట్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఎక్కువ బస్సులు నడపాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నేరేడ్మెట్ వాయుపురిలోని మల్కాజిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఆయన తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయా డిపోలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు ప్రయాణికుల అవసరాలు తీర్చాలని కోరారు. -
ఆర్టీసీ సమ్మె: సొంత విధుల్లోకి ప్రైవేట్ డ్రైవర్లు
సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలకుబయలుదేరిన విద్యార్థులు తొలిరోజే చుక్కలు చూశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యాసంస్థలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి స్టాపుల్లో నిరీక్షించినా బస్సులు రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఒకట్రెండు బస్సులు వస్తే అందులో కిక్కిరిసి ప్రమాదరక స్థితిలో ప్రయాణించారు. ప్రధానంగా నగర శివార్లలోని కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అధ్యాపకులుఅవస్థలు పడ్డారు. అదనపు సర్వీసులు నడపాలని గ్రేటర్ ఆర్టీసీ భావించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగతా రోజులతో పోలిస్తే సర్వీసుల సంఖ్య మరింత తగ్గింది. తాత్కాలిక సిబ్బందితో ఇప్పటి వరకు 1300 బస్సులు నడపగా... అదికాస్త 1087కుపడిపోయింది. టెంపరరీ డ్రైవర్లు సొంత విధుల్లోకి వెళ్లడంతోఈ పరిస్థితి తలెత్తింది. విద్యాసంస్థల పునఃప్రారంభం సందర్భంగా‘సాక్షి’ సోమవారం విజిట్ నిర్వహించింది. సాక్షి,సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె కష్టాలు సోమవారం విద్యార్థులను చుట్టుముట్టాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు తగినన్ని బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణ ప్రయాణికులు సైతం గంటల తరబడి బస్టాపుల్లో పడిగాపులు కాశారు. శివార్లలోని ఇంజినీరింగ్, ఒకేషనల్ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు చేసేది లేక ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. చాలా మంది బైకులపై త్రిబుల్ రైడింగ్ చేశారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విద్యార్థులు, ఉద్యోగులు వాహనాలు దొరక్క నరకం చూశారు. తిరిగిన ఒకటి, రెండు బస్సుల్లోనూ కిక్కిరిసి వెళ్లారు. దసరా సెలవుల్లో సమ్మె ప్రారంభం కావడంతో ప్రభుత్వం వారం రోజుల పాటు సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించేందుకు, ప్రైవేట్ సిబ్బంది సహాయంతో పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు అనువుగా ఈ సెలవులను పొడిగించారు. కానీ విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన సోమవారం నాటికి ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ 1087 బస్సులను మాత్రమే రోడ్డెక్కించగలిగింది. మరో 375 అద్దె బస్సులు ఉన్నప్పటికీ వాటిపై నియంత్రణ కొరవడింది. అవి ఏ రూట్లో తిరిగాయి.. ప్రయాణికులకు ఎలాంటి సేవలందజేశారనే అంశంపై స్పష్టత లేదు. నగరంలో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా కనీసం 2000 బస్సులను నడిపాలి. ఆర్టీసీ ప్రణాళిక రూపొందించినప్పటికీ ఆ స్థాయిలో నడపలేకపోయారు. తాత్కాలిక డ్రైవర్లలో చాలామంది తిరిగి తమ సొంత విధుల్లోకి వెళ్లిపోయారు. బస్సులు నడిపేవారు లేక ఘట్కేసర్, బోగారం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్, కీసర, బాచుపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, గండిమైసమ్మ, తదితర ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లే సుమారు 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రయాణ గండం తప్పలేదు. మెట్రో బస్సులు నడపలేరు ప్రస్తుతం పనిచేస్తున్న డ్రైవర్లు కేవలం అశోక్ లేలాండ్‌కు చెందిన ఆర్డినరీ బస్సులను మాత్రమే నడుపగలుగుతున్నారు. ఆర్టీసీలో ఉన్న 160 మార్కోపోలో లోఫ్లోర్ నాన్ ఏసీ, మరో 90 వోల్వో ఏసీ, మరో 6 మల్టి యాక్సిల్ బస్సులు, 40 రాజధాని ఏసీ బస్సులు, 246 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు నడపాలంటే ప్రత్యేక శిక్షణ పొందినవారు అవసరం. ఆర్టీసీలో అనుభవం ఉన్నవారికే ఈ బస్సులను అప్పగిస్తారు. ప్రస్తుతం తాత్కాలికంగా విధుల్లో చేరుతున్న వాళ్లంతా లారీలు, ట్రాక్టర్లు నడిపిన వాళ్లే కావడంతో ఈ బస్సులను వారికి అప్పగించడం లేదు. వెంటాడుతున్న డ్రైవర్ల కొరత ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో మొత్తం 3,775 బస్సులు తిరుగుతుంటాయి. 19,500 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో 7.5 వేల మంది డ్రైవర్లు, మరో 7 వేల మంది కండక్టర్లు ఉన్నారు. 17 రోజులుగా సిబ్బంది మొత్తం సమ్మెలో ఉండడంతో కేవలం డిపోమేనేజర్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులు నడుస్తున్నాయి. కండక్టర్లుగా పని చేసేందుకు చాలా మంది సుముఖంగా ఉన్నప్పటికీ డ్రైవర్లు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు నడిపే డ్రైవర్లే ఇప్పటి దాకా బస్సులు నడిపారు. కానీ విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో వారంతా తిరిగి తమ విధులకు వెళ్లారు. దీంతో ప్రైవేట్ సిబ్బంది సహాయంతో నడిపే బస్సుల సంఖ్య 1300 నుంచి 1087కు పడిపోయింది. నో టిమ్స్..టికెట్ ప్రైవేట్ సిబ్బంది దోపిడీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రింటెడ్ టిక్కెట్ల జారీని ప్రవేశపెట్టనున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. అలాగే టిమ్స్ యంత్రాల ద్వారా టిక్కెట్లను అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ సదుపాయం రాలేదు. మరోవైపు సొంత ప్రింటింగ్‌ప్రెస్ లేకపోవడం వల్ల ప్రింటెడ్ టిక్కెట్ల కోసం ఇతర ముద్రణ సంస్థలపై ఆధార పడాల్సి వస్తుంది. మియాపూర్ బస్‌బాడీ యూనిట్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌ను గతంలోనే మూసేశారు. దీంతో ఆర్టీసీలో టిక్కెట్ల జారీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై అనిశ్చితి నెలకొంది. -
ఆర్టీసీ సమ్మె: సోషల్ మీడియా పోస్టులతో ఆందోళన వద్దు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె ప్రభావంతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ మార్గాల్లో ఆదివారం 3.50 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సాధారణ రోజుల్లో రద్దీ 3 లక్షలుండగా, నిత్యం 50 వేల మంది అధికంగా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి 3–5 నిమిషాలకో రైలు నడిపినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీతో ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మియాపూర్ స్టేషన్లు కిటకిటలాడాయి. ఆయా స్టేషన్ల ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లోనూ స్థలం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అమీర్‌పేట్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఇక నాగోల్–హైటెక్‌సిటీ రూట్లో నాగోలు, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, మాదాపూర్, హైటెక్‌సిటీ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. రద్దీ పెరగడంతో హెచ్ఎంఆర్ అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరింత పెంచినట్లు తెలిపారు. సోమవారం సుమారు 4లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెట్రో రైళ్లు, స్టేషన్ల భద్రతపై కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులతో ప్రయాణికులు ఆందోళన చెందవద్దన్నారు. నగరంలోని మెట్రో రైళ్లు, స్టేషన్లు అత్యంత సురక్షితమైనవని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ నగరం.. విశ్వనగరం’ దిశగా మెట్రో అడుగులు వేస్తున్నామన్నారు. -
ఆర్టీసీ సమ్మె : బడికి బస్సెట్ల!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం పొడిగించిన దసరా సెలవులు ఆదివారంతో ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఓవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండడం, మరోవైపు తరగతుల మూడో రోజు నుంచే పరీక్షలు ప్రారంభమవుతుండడంతో బస్సు సేవలపై ఆధారపడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు అరకొరనే తిరుగుతుండడంతో శివారు ప్రాంతాల్లోని కళాశాలలకు వెళ్లేది ఎలా? అని స్టూడెంట్స్ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 10వేల వరకు ఉన్నాయి. వీటిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు సుమారు 15 లక్షల మంది చదువుకుంటున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం... సమ్మె నేపథ్యంలో సెలవులను 19 వరకుపొడిగించిన విషయం విదితమే. సోమవారం విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతుండగా... 23 నుంచి 30 వరకు సమ్మెటీవ్–1 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖప్రకటించింది. ఈ నేపథ్యంలో సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతోపాఠశాలలకు ఎలా చేరుకోవాలని విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. పాసులు 3.50 లక్షలు గ్రేటర్లో 890 ఇంటర్మీడియెట్ కాలేజీలుఉండగా... వీటిలో నాలుగున్నర లక్షల మంది చదువుకుంటున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఇతర కాలేజీలు మరో 900 వరకు ఉండగా... వాటిలో 6లక్షల మంది విద్యార్థులున్నారు. సాంకేతిక వృత్తివిద్యా కోర్సులకు సంబంధించిన కాలేజీల్లో చాలా వరకు దేశ్‌ముఖ్, ఇబ్రహీంపట్నం, చెంగిచర్ల, నారపల్లి, ఘట్కేసర్, భువనగిరి, సూరారం, బాచుపల్లి, లింగంపల్లి, గచ్చిబౌలి, మెహిదీపట్నం,మొయినాబాద్, షాద్‌నగర్, శంషాబాద్ పరిసరాల్లోనే ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో 4.50 లక్షల బస్సు పాసులు ఉండగా... వీటిలో 3.50 లక్షల పాసులు విద్యార్థులవే. ఆయా కాలేజీల విద్యార్థుల రవాణాకు ఆర్టీసీ బస్సులే కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు.శివార్లలోని నల్లగొండ, భువనగిరి, మేడల్చ్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, చేవేళ్ల జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో చాలా మంది నగరంలోనే ఉంటున్నారు. వీరంతా రోజూ ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తుంటారు. వీరూ సోమవారం నుంచి ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. -
4 లక్షల మందితో సకల జనుల సమర భేరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించిన నేపథ్యంలో సమ్మె మలిదశ కార్యాచరణ పటిష్టంగా ఉండేలా చూడాలని ఆర్టీసీ కార్మికులు సంఘాల జేఏసీ తీర్మానించింది. సమ్మెపై హైకోర్టులో జరిగే తదుపరి విచారణ వరకు ఉధృతంగా నిరసనలు కొనసాగించాలని ఆదివారం జరిగిన రాజకీయ అఖిలపక్ష నేతలతో సమావేశంలో నిర్ణయించింది. దీనికి సంపూర్ణ మద్దతు అందిస్తామని రాజకీయ పార్టీలు కూడా తేలి్చచెప్పాయి. సమ్మె కార్యాచరణలో భాగంగా ఈ నెల 30న కనీసం 4 లక్షల మందితో సకల జనుల సమర భేరీ పేరుతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో 3 లక్షల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, మరో లక్ష మంది సాధారణ ప్రజలు హాజరయ్యేలా రాజకీయ పారీ్టలతో కలసి జనసమీకరణ జరపాలని నిశ్చయించారు. ఈలోగా ఇతర నిరసన కార్యక్రమాలు కొనసాగించనున్నారు. అఖిలపక్ష భేటీలో ఎవరేమన్నారంటే... కోర్టు తీర్పును కూడా ప్రభుత్వం గౌరవించకపోవడం దారుణం. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారు. దానికి మద్దతు ఇస్తున్నట్టుగా పోలీసులు దమనకాండను కొనసాగిస్తున్నారు. ప్రజలు మా ఉద్యమానికి మద్దతుగా నిలిచి ఆరీ్టసీని విధ్వంసం చేసే కుట్రను అడ్డుకొని ప్రజారవాణా సంస్థను కాపాడుకునేందుకు సహకరించాలి.– ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు, సుధ కార్మికుల వెంట నడుస్తాం ఆర్టీసీ కార్మికులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాల్లో మా నేతలు పాల్గొంటారు. ప్రజాప్రతినిధుల ములాఖత్‌లో మేమూ పాల్గొంటాం. వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. – తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), ఎస్.వెంకటేశ్వరరావు (న్యూడెమొక్రసీ) ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి ఆర్టీసీ పరిరక్షణకు నడుంబిగించాలని కోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం విడ్డూరం. ఆర్టీసీ ఆస్తులు, అప్పులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి పౌరసమాజం మద్దతు ఉంది. – ఎల్.రమణ, టీడీపీ కోర్టు తీర్పును గౌరవించాలి. కోర్టు ఆదేశాన్ని గౌరవించి కారి్మకులను ప్రభుత్వం చర్చలకు పిలవాలి. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఆర్టీసీ జేఏసీకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. – కోదండరాం, టీజేఎస్ పుస్తకాలు చదివి నేర్చుకున్నదిదేనా? వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే ముఖ్యమంత్రి నేర్చుకున్నది ఇదేనా? ప్రజలు శక్తిమంతులు, వారి ఆగ్రహాన్ని తట్టుకోవడం కష్టమంటూ హైకోర్టు వ్యాఖ్యానించినా కేసీఆర్ పెడచెవిన పెట్టడం వల్ల ఆయనకే నష్టం. – డాక్టర్ చెరుకు సుధాకర్, ఇంటి పార్టీ న్యాయవ్యవస్థపై గౌరవం లేకుంటే ఎలా? న్యాయవ్యవస్థపైనా ప్రభుత్వానికి గౌరవం లేకుంటే ఎలా? ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించినా చర్చలకు ఎందుకు పిలవట్లేదు. లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీని అక్కడి ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంటే మిగుల బడ్జెట్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తోంది. – మంద కృష్ణమాదిగ . మలిదశ సమ్మె కార్యాచరణ ఇలా.. నేడు అన్ని డిపోల వద్ద కారి్మకుల కుటుంబ సభ్యులు బైఠాయించి దీక్షలు. 22న అద్దె బస్సుల డ్రైవర్లు, యజమానులు, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు (ఇక నుంచి విధులకు హాజరు కావద్దని, తమ పొట్ట కొట్టొద్దని) విన్నపాలు. 23న మండలస్థాయి ప్రజాప్రతినిధులు మొదలు ఎంపీల వరకు కలసి ఆర్టీసీ పరిస్థితిపై వివరణ. 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు సహా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ మహిళా ఉద్యోగుల నిరాహార దీక్షలు. 25న ప్రజాసంఘాలు, సాధారణ ప్రజలతో కలసి రాస్తారోకోలు. 26న ఆర్టీసీ కారి్మకుల పిల్లల ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు. 27న దీపావళి వేడుకలకు దూరం. కొన్ని పారీ్టల నేతలు మాత్రం కార్మికుల కుటుంబాలను తమ ఇళ్లకు ఆహా్వనించి వారితో కలిసి దీపావళి జరుపుకోనున్నట్టు ప్రకటించారు. 28న (సోమవారం) సమ్మెపై హైకోర్టులో ఒకవైపు వాదనలు కొనసాగిస్తూనే మరోవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగింపు. 30న సకల జనుల సమర భేరీ బహిరంగ సభ నిర్వహణ. -
16వ రోజుకు సమ్మె: మరో ఆర్టీసీ కార్మికుడు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుంది. నిరసనల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ప్లకార్డులతో కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఓ వైపు సమ్మె విరమించి చర్చలకు రావాలని ఆర్టీసీ యాజమాన్యం పిలుపునిస్తుంటే.. డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించారు. దీంతో ప్రతిష్టంభన కొనసగుతోంది. చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. యాజమాన్యం పిలిస్తే చర్చలకు సిద్ధమని కార్మిక సంఘాలు తెలిపారు. సమ్మె భవిష్యత్ కార్యచరణ నేపథ్యంలో రాజకీయ జేఏసీతో కార్మిక సంఘాలు నేడు భేటీ కానున్నాయి. మరో కార్మికుడి మృతి ఈ క్రమంలో ఖమ్మంలో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు. సత్తుపల్లి ఆర్టీసీ డిపో డ్రైవర్ ఎస్కే ఖాజామియా గుండెపోటుతో మరణించారు. 15 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మెలో ఖాజామియా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. సమ్మె విషయంలో ప్రభుత్వ మొండి వైఖరి నేపథ్యంలోనే ఖాజామియా మనస్తాపంతో మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఖాజామియా మృతిపట్ల ఆర్టీసీ జేఏసీ, ప్రజాసంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. -
16వ రోజు కొనసాగుతున్న ఆర్టిసీ కార్మికుల సమ్మె
-
‘తన చెల్లి ఓడిపోయింది.. మా అక్కను గెలిపిస్తాను’
సాక్షి, సూర్యాపేట: ఆర్టీసీ సమ్మెతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వివిధ సంఘటనల నేపథ్యంలో భవిష్యత్ తెలంగాణ స్వరూపాన్ని నిర్ణయించేది హుజూర్నగర్ ఉప ఎన్నికే అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి పలు అంశాలపై స్పందిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ రెండో దఫా పాలన పడకేసిందన్నారు రేవంత్ రెడ్డి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్‌కు కేసీఆరే కారణమని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేదు సరే.. ఆర్టీసీని సగం ప్రైవేట్ పరం చేస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు కదా.. మరి మంత్రులు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎర్రబస్సుకు 27శాతం ఇంధన ట్యాక్స్ వసూలు చేస్తోన్న కేసీఆర్.. ఎయిర్ బస్‌కు మాత్రం 1శాతం ట్యాక్స్‌ను మాత్రమే ఎందుకు వసూలు చేస్తున్నాడో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రూ.85 వేల కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను తన తాబేదార్లకు కట్టబెట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఉద్యోగులను సెల్ఫ్ డిస్మిస్ అనే అధికారం కేసీఆర్‌కు లేదని స్పష్టం చేశారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మంత్రుల బాధ్యతారహితమైన మాటల వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. కోర్టులతో ఆటలాడితే.. కేసీఆర్‌కు మొట్టికాయలు తప్పవన్నారు. ఉద్యమ నాయకులేవరు ఆర్టీసీ సమ్మెపై మాట్లాడకపోవడం దారుణమన్నారు రేవంత్ రెడ్డి. మా అక్కను గెలిపించుకుంటాను కేసీఆర్ పాలన రాచరికానికి పరాకాష్టల నిలిచిందన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నియంతృత్వాన్ని, నిర్భంధాన్ని అణచివేయాలంటే.. హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్ తెలంగాణ స్వరూపాన్ని నిర్ణయించేది ఈ ఎన్నికలే అని స్పష్టం చేశారు. కేటీఆర్ నిజామాబాద్‌లో తన చెల్లిని గెలిపించుకోలేకపోయాడు.. కానీ తాను మాత్రం హుజూర్‌నగర్‌లో తన అక్కను గెలిపించుకుంటానని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కవన్నారు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ అభిప్రాయ బేధాలు ఉండవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలి కేసీఆర్ పాలనలో మద్యం అమ్మకాల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడమే కాక రూ. 2.5లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రోడ్డు వెడల్పు కోసం స్వచ్ఛందంగా సహకరించిన వారిని మరో 5 ఫీట్లు వెనక్కి జరగాలంటూ బెదిరించడం అన్యాయమన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. పాలన లోపం వల్లే మూసీ గేట్లు దెబ్బతిన్న సంఘటన చోటు చేసుకుందని విమర్శించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని సాండ్ మాఫియా మొదలు.. ల్యాండ్ మాఫియా వరకు అన్ని జగదీశ్ రెడ్డి కనుసన్నలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. మూసీ నీళ్లు వృథాగా పోవడం వల్ల నష్టపోయిన రైతులకు, మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. -
సమ్మెకు పూర్తి మద్దతు.. కేసీఆర్ గద్దె దిగాలి
-
‘అప్పుడిలా చేసుంటే.. కేసీఆర్ సీఎం అయ్యేవాడా’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నట్లు మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి తండ్రి లాంటి వారని.. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా సీఎం గద్దె దిగి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాల్సింది పోయి.. వారిని ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో హై కోర్టు చురకలంటించినా.. కేసీఆర్ తీరు మారకపోవడం బాధకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ చర్యలను గమనిస్తుందని.. అదును చూసి ఆయన పని పడుతుందని మోత్కుపల్లి హెచ్చరించారు. గవర్నర్ ఆర్టీసీ సమ్మెపై ఆరా తీస్తున్నారంటే.. కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బంది మొదలయినట్లే అని తెలిపారు మోత్కుపల్లి. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను కూడా ఇలానే ఇబ్బంది పెట్టి ఉంటే.. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. పరిస్థితులు చేయి దాటకముందే.. మేల్కొంటే మంచిదని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మంచి పని చేశారని ప్రశంసించారు మోత్కుపల్లి. (చదవండి: ఆర్టీసీని నాకివ్వండి.. లాభాల్లో నడిపిస్తా!) -
అన్ని డిమాండ్లపై చర్చలకు సిద్ధమే
-
ప్రజాగ్రహం పెరగకుండా చూడండి.. హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కార్మిక సంఘాలతో వెంటనే చర్చలు జరపాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఇన్చార్జి)ను హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ), ఆర్టీసీ తెలం గాణ మజ్దూర్ యూనియన్ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించి సమస్య పరిష్కార దిశగా అడుగులు వేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా సమ్మె పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత సూచనలు... ఆపై ఉత్తర్వులు ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆర్. సుబేందర్‌సింగ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతోపాటు మరో మూడు రిట్లను ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. మధ్యాహ్నం 2:15 గంటల నుంచి కోర్టు సమయం ముగిసిన తర్వాత కూడా అరగంటపాటు 4:45 గంటల వరకూ వాదనలు జరిగాయి. కిక్కిరిసిన కోర్టు హాల్లో వాదనల సమయంలో ప్రభుత్వానికి సూచనలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు ధర్మాసనం ఆర్టీసీ ఎండీ (ఇన్చార్జి) చర్చలకు శ్రీకారం చుట్టాలని ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వానిది తండ్రి పాత్ర...ఈ అంశంపై తొలుత ఆర్టీసీ యాజమాన్యం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదించేందుకు నిలబడగానే ధర్మాసనం కల్పించుకొని ఆర్టీసీకి ఎండీని నియమించారా అని ప్రశ్నించింది. దీనికి ఏఏజీ బదులిస్తూ ఇంకా లేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త వ్యక్తిని ఎండీగా నియమిస్తే సమస్యల్ని అవగాహన చేసుకోవడం కష్టమవుతుందన్నారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఎండీని నియమిస్తే కార్మికులకు నమ్మకం ఏర్పడుతుందని, ఎండీ నియామకంతో జీతభత్యాలేమీ మీ జేబులోంచి ఇవ్వరు కదా? అని వ్యాఖ్యానించింది. కొత్త ఎండీని నియమిస్తే ఇప్పుడున్న ఇన్చార్జి ఎండీ సహకరించవచ్చు కదా, ప్రభుత్వానికి అధికారాలు ఉండేకొద్దీ మరింత వినయంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వానిది తండ్రి లాంటి పాత్ర అని, ఉద్యోగులు పిల్లలని, ఒక కుటుంబంలో సభ్యులు ఏమైనా డిమాండ్లు లేదా సమస్యల్ని తీసుకొస్తే కుటుంబ పెద్ద చర్చించి పరిష్కరించాలని, ఆర్టీసీ సమ్మె విషయంలో అదే చేయాలని హితవు పలికింది. ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన పాత్ర కూడా ఉందని, అధికారాలతోపాటు బాధ్యతలను కూడా నెరవేర్చేది ప్రభుత్వమేనని వ్యాఖ్యానించింది. కొత్త సిబ్బంది నుంచి డిమాండ్లు రావని గ్యారంటీ ఉందా? ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో బస్సుల్లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యాసంస్థలకు సెలవులు పొడిగించడంతో విద్యార్థులు సమస్యల్లో ఉన్నారని ధర్మాసనం పేర్కొనగా ఏఏజీ కల్పించుకొని ఇప్పటికే 87 శాతం బస్సులు తిరుగుతున్నాయన్నారు. సోమవారం (21వ తేదీ) నుంచి విద్యాసంస్థలన్నీ ప్రారంభమవుతాయని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘నిజమే.. ఆర్టీసీలో 100 కాదు 110 శాతం మంది సిబ్బందిని తీసుకొని సమ్మె ప్రభావం లేదని తేల్చినా రేపు ఈ సిబ్బంది నుంచి డిమాండ్లు రావని గ్యారంటీ ఏముంది?’’అని ప్రశ్నించింది. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని ఏఏజీ పేర్కొనగా ప్రభుత్వ నిధుల దుబారాపై ఇదే హైకోర్టుకు కేసులు వచ్చాయని గుర్తుచేసింది. అయితే తాను చెబుతున్న ఆర్థిక గడ్డు పరిస్థితి ఆర్టీసీ గురించి అని, తాను ప్రభుత్వం తరఫున వాదించడం లేదని, ఆర్టీసీ యాజమాన్యం తరఫున వాదిస్తున్నానని ఏఏజీ వివరణ ఇచ్చారు. ప్రజాగ్రహం పెరగకుండా చూడండి.. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలతో చర్చలు ఎందుకు జరపలేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించగా చర్చలు విఫలమైనట్లుగా 5వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందిందని, చట్ట ప్రకారం చర్చలు విఫలమయ్యాక తిరిగి చర్చలకు వీల్లేదని ఏఏజీ బదులిచ్చారు. సమస్యను కార్మిక వివాదాల పరిష్కార అధీకృత అధికారి వద్దే పరిష్కరించుకోవాలన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘రేపు లేబర్ కోర్టు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని తేలిస్తే ప్రభుత్వం లేదా కార్పొరేషన్ ఏం చేస్తుంది? శనివారం తెలంగాణ బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. క్యాబ్ డ్రైవర్లు, టీఎన్జీవో సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి’’అని గుర్తుచేసింది. అయితే సమ్మెపై రాజకీయాలు మొదలు పెట్టారని ఏఏజీ వ్యాఖ్యానించగా ప్రధాన న్యాయమూర్తి కల్పించుకుంటూ ‘‘ఇప్పటికే అగ్గి మొదలైంది. అది రాజుకోకుండా చూడాలి. నియంత్రణ చర్యలు చేపట్టాలని పదేపదే హితవు చెబుతున్నాం. రాష్ట్రం చూడదని ఏఏజీ చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె వంటి చిన్న సమస్య మొదలై రెండు వారాలైంది. ప్రజాగ్రహం రాష్ట్రవ్యాప్తమైతే ఏం చేస్తారు? పౌర సమాజం గొంతు విప్పితే ఎవ్వరూ ఆపలేరు. ఫిలిపిన్స్‌లో జరిగిన పరిణామాలు అందుకు నిదర్శనం. ప్రజాఉద్యమం ప్రజాగ్రహంగా మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. హైకోర్టు ఉద్దేశం కూడా అదే. అందుకే ఆచితూచి స్పందిస్తున్నాం’’అని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించాలని ధర్మాసనం సూచించగా ఏఏజీ కల్పించుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని, ఈ డిమాండ్ సంగతి తేలిస్తేనే ఇతర డిమాండ్లలోకి వెళ్తామని షరతు విధించాయన్నారు. సగం డిమాండ్లు పరిష్కరించేవే.. ఈ సందర్భంగా ధర్మాసనం ఐదు నిమిషాలకుపైగా కార్మికుల డిమాండ్లను చదివింది. ఒక్కో డిమాండ్ చదివి ఆర్థిక అంశాలతో సంబంధం లేని వాటిని పరిష్కరించేందుకు ఉన్న ఇబ్బందులు ఏమిటో చెప్పాలని ఏఏజీని కోరింది. కొన్నింటిని ఆర్టీసీ యాజమాన్యమే పరిష్కరించాలని, యూనియన్లు డిమాండ్లుగా పేర్కొనాల్సినవే కాదని అభిప్రాయపడింది. 42 డిమాండ్లల్లో సగానికిపైగా అలాంటివేనని, పైగా వాటికి ఆర్థిక అంశాలతో సంబంధం లేదని వివరించింది. కరీంనగర్, హైదరాబాద్ జోన్లకు ఈడీల నియామకం, ఉద్యోగ భద్రత మార్గదర్శకాల రూపకల్పన, తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో మందుల లభ్యత, వైద్య బిల్లుల రీయింబర్స్మెంట్, రిటైర్డు కార్మికులకు ఆరోగ్యశ్రీ కార్డులు, ఆసరా పింఛన్లు, అనారోగ్యం వచ్చినప్పుడు పీఎఫ్ విత్‌డ్రా సౌకర్యం, డిపోల్లో విడిభాగాల లభ్యత, వోల్వా బస్సుల ద్వారా శిక్షణ, సిబ్బంది పిల్లలకు ఐటీఐలో శిక్షణ వంటి సగానికిపైగా డిమాండ్లు సులువుగా పరిష్కరించదగ్గవేనని ధర్మాసనం అభిప్రాయపడింది. విడిభాగాలు కావాలంటే ఆర్టీసీ ప్రయాణికుల భద్రత కోసమే కదా, శిక్షణ కోరుతున్నది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు కోసమే కదా, ఈడీ వంటి పోస్టుల భర్తీ వల్ల సంస్థకే మేలు కదా, వైద్య, ఆరోగ్య రంగానికి కేరాఫ్‌గా ఉన్న తెలంగాణలో రిటైర్డు ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తే మేలే కదా.. అని ధర్మాసనం పేర్కొంది. భావితరాల వాళ్లు ఎలా ఉండాలో టాటా స్టీల్ సిటీ జంషెడ్‌పూర్‌లో ఇస్తున్న శిక్షణను పరిశీలిస్తే మనమేం చేయాలో అర్థం అవుతుందని, అక్కడ వర్షం పడితే చుక్క నీరు కూడా రోడ్లుపై నిలవదని, మన పిల్లలకు శిక్షణ ఇవ్వాలని కోరుతుంటే ఆలోచన ఎందుకుని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. దీనిపై ఏఏజీ స్పందిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఇతర డిమాండ్లపై చర్చించబోమని యూనియన్లు మొండిగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆర్టీసీలో విలీనం డిమాండ్ పాతదే: యూనియన్లు యూనియన్ల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌కు ఇతర అంశాలను ముడిపెట్టలేదన్నారు. విలీనం డిమాండ్ చేస్తూనే ఇతర విషయాలపై చర్చలకు యూనియన్లు సిద్ధంగానే ఉన్నాయన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం ఇప్పటిది కాదని, 2013లో నాటి ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనానికి కమిటీ వేసిందన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదిస్తూ యూనియన్లు, ఆర్టీసీ యాజమాన్యం మొండిగా వ్యవహరించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 19న బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని, 21 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభమైతే సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, మద్రాస్ హైకోర్టు గతంలో ఆ మేరకు తీర్పు చెప్పిందన్నారు. దీనిపై ప్రకాశ్‌రెడ్డి కల్పించుకొని యూనియన్లు, యాజమాన్యం ఒకటేనని పిటిషనర్ ఆరోపించడాన్ని ఖండించారు. గత విచారణ సమయంలో హైకోర్టు ఆదేశించాక చర్చలకు యూనియన్ సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్‌లకు ఫోన్ చేసి చెప్పినా ఫలితం లేకపోయిందని వివరించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల తర్వాత ఏమైందో అందరికీ తెలుసునని, సమస్య జటిలం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అమలుకాని ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. యూనియన్, జేఏసీ ప్రతినిధులను ఆర్టీసీ ఎండీ (ఇన్చార్జి) పిలిచి చర్చలు జరిపి సమస్య సానుకూలంగా పరిష్కారమయ్యేలా చూడాలంటూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
క్యాబ్ ఆవాజ్: డ్రైవర్ల సమ్మె బాట
నగరంలో క్యాబ్ సేవలూ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ఆర్టీసీకార్మికులు సమ్మె చేస్తుండగా... క్యాబ్ డ్రైవర్లూ ఈ నెల 19 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు. ఈ మేరకుతెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ నాయకులు గురువారం ప్రకటించారు. కిలోమీటర్‌కు రూ.22 చెల్లించాలని, డ్రైవర్ల ఐడెంటిటీ రద్దును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వమే మొబైల్ యాప్‌లతో పాటు మీటర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిపై స్పష్టమైన హామీ ఇవ్వని పక్షంలో సమ్మె అనివార్యమన్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు సైతం సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 19నుంచి క్యాబ్ బంద్ చేపట్టనున్నట్లు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ షేక్ సలావుద్దీన్, కన్వీనర్ కె.ఈశ్వర్రావు, కో–చైర్మెన్ బి.వెంకటేశం తెలిపారు. దీంతో 19నుంచి ఉబెర్, ఓలా తదితర క్యాబ్‌లతో పాటు, ఐటీ కంపెనీలకు నడిపే క్యాబ్ సేవలు కూడా నిలిచిపోనున్నాయి. కిలోమీటర్‌కు రూ.22 చొప్పున చెల్లించాలని, లేనిపక్షంలో ప్రభుత్వమే మొబైల్ యాప్‌లతో పాటు మీటర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు పెద్ద ఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దీంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. చాలామంది అప్పులపాలయ్యారు. ఫైనాన్షియర్ల వద్ద చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక రోడ్డున పడుతున్నారు. డ్రైవర్ల కుటుంబాలు పస్తులుంటున్నాయి. ఈ పరిస్థితులను మార్చేందుకు ప్రతి డ్రైవర్‌కు కనీసం బిజినెస్ గ్యారెంటీ ఇవ్వాలని, ఇందుకనుగుణంగా ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను మార్చుకోవాలని జేఏసీ చైర్మెన్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీలకు నడిపే క్యాబ్‌లకు సంబంధించి జీవో 61, 66లకు అమలు చేయాలని కోరారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు.19వ తేదీ వరకు తమ డిమాండ్లపైన స్పష్టమైన హామీ లభించకపోతే సమ్మెను నిరవధికంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. నిలిచిపోనున్న 50 వేల క్యాబ్‌లు క్యాబ్ బంద్ కారణంగా నగరంలో సుమారు 50 వేలకు పైగా ఓలా, ఉబెర్, తదితర క్యాబ్‌ల సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే సుమారు 5 వేలకు పైగా క్యాబ్‌లకు కూడా బ్రేక్ పడనుంది. అలాగే హైటెక్‌సిటీ, కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె కారణంగా రాత్రి పూట సిటీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్యాబ్ సేవలను వినియోగించుకుంటున్నారు. కానీ క్యాబ్‌లు కూడా సమ్మెలో పాల్గొంటే ప్రజా రవాణాకు మరింత ఆటంకం కలగనుంది. క్యాబ్ డ్రైవర్ల సమ్మె వల్ల సుమారు 5 లక్షల మందికి పైగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. -
ఆర్టీసీ చర్చలపై సర్కారు తర్జనభర్జన
-
ప్రైవేటీకరణపై దండెత్తుదాం
సాక్షి, హైదరాబాద్: సమ్మె విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. తాము చర్చలకు సిద్ధమని మరోసారి తేల్చి చెప్పింది. చర్చలు ఎవరితో జరపాలన్న విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టం చేయకపోవటాన్ని తప్పుపట్టింది. హైకోర్టు స్పందన నేపథ్యంలో జేఏసీ ప్రతినిధులు బుధవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ లేమని ప్రభుత్వం కోర్టుకు కూడా చెప్పడంతో.. ఈ విషయంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ విషయంలో పట్టుపట్టకుండా, ఆర్టీసీ పరిరక్షణ కోణంలో డిమాండ్ చేయాలని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణ, అద్దె బస్సుల సంఖ్య పెంపు విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. ఆర్టీసీ విలీనం అంశం విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించి, ప్రైవేటీకరణ యోచనపై గట్టిగా వాదించాలని నిర్ణయించారు. అనంతరం మద్దతు కూడగట్టుకునేందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాజకీయ జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు. చర్చలకు ఆహ్వానించాలి.. కోర్టు సూచనల మేరకు చర్చలకు ఆహ్వానించి ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నా రు. అనంతరం మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన ఆర్టీసీ కార్మికులను వెంటనే విడుద చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 19న జరిగే ఆర్టీసీ కార్మికుల బంద్‌ను విజయవంతం చేయా లని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. -
ఆర్టీసీ సమ్మె: జీతాలెప్పుడు ఇస్తారు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు సెప్టెంబర్‌లో పని చేసిన కాలానికి జీతాలు ఎందుకు నిలుపుదల చేశారో.. ఎప్పటిలోగా జీతాలు చెల్లిస్తారో తెలియజేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ ఉద్యోగుల సెప్టెంబర్ జీతాలు చెల్లించకపోవడాన్ని తప్పుపడుతూ తెలంగాణ ఆర్టీసీ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారించారు. ఆర్టీసీ యాజమాన్య వివరణపై ఈ నెల 21న తదుపరి విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. జీతాల మొత్తాన్ని హైకోర్టు రిజిస్ట్రీ వద్ద ఆర్టీసీ యాజమాన్యం డిపాజిట్ చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. రెండ్రోజుల్లో జీతాలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని, జీతాల చెల్లింపు కోసం సిబ్బంది అవసరమైతే కార్మిక యూనియన్‌కు చెందిన 100 మంది పనిచేసేందుకు వస్తారని తెలిపారు. ఇప్పటికే ఏడుగురు కార్మికులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని, అప్పు చెల్లించలేక ఒక కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించకపోవడం చట్ట వ్యతిరేకమని, ఈ విధంగా చేయడాన్ని సుప్రీం కోర్టు కూడా పలు కేసుల్లో తప్పుపట్టిందని చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యం తరఫు న్యాయవాది వాదిస్తూ.. జీతభత్యాలు చెల్లించే ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నారని, అందుకే చెల్లింపులు ఆగిపోయాయని చెప్పారు. -
ఆర్టీసీ సమ్మె: సీఎం కేసీఆర్ తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని, కార్మికులు సమ్మె విరమించేలా చేయాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. చర్చల ప్రసక్తే లేదని సీఎం కరాఖండిగా చెప్పడం, ఆ తర్వాత చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించడంతో ఏం చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు 4 గంటలకు పైగా చర్చించారు. ఆర్టీసీ నేతలతో ఇప్పటికే ముగ్గురు అధికారులతో కూడిన బృందం తొలి దఫా చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మిక జేఏసీ, రాష్ట్ర ప్రభు త్వం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. చర్చలు జరపాల్సి వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆర్టీసీ ఎండీ పోస్టును సైతం తక్షణమే భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అందుకోసం సమర్థులైన అధికారిని నియమించేందుకు సమావేశంలో కసరత్తు చేశారు. సీనియర్ ఐపీఎస్‌లైన అకున్ సబర్వాల్, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, శివధర్‌రెడ్డి పేర్లను ఆ పోస్టు కోసం పరిశీలించినట్లు సమాచారం. శుక్రవారం కొత్త ఎండీ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కొత్త ఎండీ ఆధ్వర్యంలో చర్చలు జరపాలా.. లేదా మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి చర్చలు నిర్వహించాలా అన్న దానిపై చర్చ జరిగింది. అయితే చివరికి మంత్రుల కమిటీకే ప్రభుత్వం మొగ్గి చూపినట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశిస్తే చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. సమ్మె నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో రవాణా పరిస్థితిని సీఎం సమీక్షించారు. బస్సులను నూటికి నూరు శాతం తిప్పేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు హాజరయ్యారు. -
ఆర్టీసీ సమ్మె: ‘డేంజర్’ డ్రైవర్స్!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్లు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని గందరగోళంనెలకొంది. పలుచోట్ల డ్రైవర్లు బస్సులను సక్రమంగా నడపలేకపోతుండడంతో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో డ్రైవర్లను, కండక్టర్లను డిపోలకు తరలిస్తున్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉంటే చాలు. పెద్దగా అనుభవం, నైపుణ్యం లేకపోయినా సరే బస్సులను అప్పగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ డిపోల్లో సుమారు 1500 మంది తాత్కాలిక డ్రైవర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం లారీలు, ట్రాక్టర్లు, తదితర సరుకు రవాణా వాహనాలను నడిపిన వారే ఉన్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిటీ బస్సులు నడిపేందుకు ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ అవసరమని, అలాంటి శిక్షణ కొరవడిన వ్యక్తులు బస్సులు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధానకార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆరోపించారు. తాత్కాలిక డ్రైవర్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మద్యం సేవించి బస్సులు నడపడం, అదుపు తప్పి డివైడర్లకు ఢీకొట్టడం లేదా ముందు బస్సులను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హయత్‌నగర్, కూకట్‌పల్లిలో జరిగిన ప్రమాదాలు ప్రయాణికులను, వాహనదారులను భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఓల్వోలు ఎలా అప్పగించాలి... ఈ క్రమంలో సమ్మె మరి కొంత కాలం ఇలాగే కొనసాగితే నాన్ ఏసీ లోఫ్లోర్, ఏసీ మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులను తాత్కాలిక డ్రైవర్లకు అప్పగించడంపై ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే బస్సుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాత్రి సర్వీసులను నిలిపివేశారు. ఒకవేళ తప్పనిసరిగా పూర్తిస్థాయిలో అన్ని బస్సులను నడపవలసి వస్తే ఎలా అనేది ఇప్పుడు ఆర్టీసీ అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది. 11వ రోజుకు చేరిన సమ్మె.. ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. బస్‌భవన్ వద్ద ఏఐఎస్ఎఫ్ఐ, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.అలాగే మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్ష్టేషన్లు, డిపోల వద్ద కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. సమ్మె కారణంగా నిలిచిపోయిన బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి పూట బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు పెద్ద ఎత్తున దోచుకుంటున్నాయి. -
ఆర్టీసీని విలీనం చేసేది లేదు
-
సీఎం ఆదేశిస్తే మధ్యవర్తిత్వానికి సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పరిస్థితులు చేజారకముందే సమ్మె విరమించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి సోమవారం లేఖ విడుదల చేసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ కె. కేశవరావు మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను కార్మికుల పక్షపాతి అని చెప్పుకున్న కేశవరావు.. ఆర్టీసీ సమ్మెతో పరిస్థితులు చేజారుతున్నాయనే అనుమానంతో లేఖ విడుదల చేశానన్నారు. ‘‘నేను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండను. కార్మికుల వైపే ఉంటాను. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయి. ప్రభుత్వం, ఆర్టీసీ నడుమ చర్చలు జరగాలి. ప్రస్తుతం సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా సీఎం అందుబాటులోకి రాలేదు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని నేను అనలేదు. మంచి జరుగుతుందనుకుంటే మధ్యవర్తిత్వానికి నేను సిద్ధం. సీఎం ఆదేశిస్తే కచ్చితంగా చర్చలకు దిగుతా. నాతో చర్చలకు కార్మికులు సానుకూలంగా ఉండటం మంచి పరిణామం. అయితే చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి నాకు అనుమతి రాలేదు’’అని కేశవరావు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. -
11వ రోజూ ఉధృతంగా సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గ కుండా సమ్మె ఉధృతంగా కొనసాగిస్తున్నారు. 11 రోజైన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు కార్మికుల సంతాప సభలు కొన్ని ప్రాంతాల్లో మంగళవారం కొనసాగాయి. ఓ వైపు ప్రభుత్వం చర్చలకు పిలిచే అవకాశం ఉందన్న మాటలు.. కోర్టు జోక్యంతో అందుకు అనుకూల పరిస్థితి ఉంటుందన్న సంకే తాలతో సమ్మె ఆగిపోయే పరిస్థితి ఉంటుందం టూ కాస్త ఊహాగానాలు వినిపించినా మంగళవారం రాత్రి వరకు ఆ సూచనలు అందకపోవ టంతో కార్మికులు యథావిధిగా సమ్మె కొనసాగించారు. టీఎన్జీవో, టీజీవోలు కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించటంతో ఆర్టీసీ కార్మికుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఉద్యోగ సంఘాలతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చించి మద్దతు కూడగట్టుకోగలిగారు. సకలజనుల సమ్మె తరహాలో ఉధృతం చేద్దామంటూ నేతలు వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపటంతో ఉత్సాహం రెట్టింపైంది. బుధవారం మరింత ఉధృతంగా సమ్మె నిర్వహించాలన్న ఆదేశాలూ అందాయి. 62 శాతం బస్సులు తిప్పాం: ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 62.13 శాతం బస్సు సర్వీసులు తిప్పినట్లు సంస్థ తెలిపింది. 4,192 ఆర్టీసీ, 1,952 అద్దె బస్సులు కలిపి 6,144 బస్సులు తిప్పినట్లు పేర్కొంది. ఇక కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఇబ్ర హీంపట్నం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న బూడిద జంగయ్య.. ఆర్టీసీ సమ్మె వార్తలు విని మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. -
ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి నివేదిక!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ప్రభావంపై కేంద్రానికి గవర్నర్ నివేదించినట్లు సమాచారం. మంగళవారం ఢిల్లీ వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడం, ఆత్మహత్యలు చేసుకుంటుండటం.. బస్సుల్లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కేంద్రం నివేదిక కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమిళిసై ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. పైగా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఆమె ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం, సమ్మెపై ప్రభుత్వ, ప్రజా, రాజకీయ వర్గాల వైఖరి, ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలు సహా పలు అంశాలపై ప్రధానికి నివేదించినట్లు సమాచారం. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలసిన గవర్నర్.. రాష్ట్రంలోని పరిస్థితులపై ఆయనకు వివరించారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రితో భేటీ సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ప్లాస్టిక్‌పై నిషేధం, యోగా తరగతులు, రెడ్ క్రాస్ సొసైటీతో కలసి రక్తదాన శిబిరాల ఏర్పాటు వివరాలు కూడా గవర్నర్ తెలిపినట్లు రాజ్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఆర్టీసీ సమ్మె: మీరేమైనా బ్రిటిష్ పాలనలో ఉన్నారా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు స్వస్తి పలకాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతం అవునో కాదో పక్కనబెడితే.. దసరా పండుగకు ముందు సమ్మె ప్రారంభించి ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ నెల 5 నుంచి సమ్మె మొదలైతే ఇప్పటివరకు చర్చలు జరిపేందుకు ఎందుకు చొరవ చూపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరేమైనా బ్రిటిష్ పాలనలో ఉన్నారా.. మీ ఇద్దరి మధ్య ఏమైనా టగ్ ఆఫ్ వార్ ఆట జరుగుతోందా అంటూ ధర్మాసనం ఇరు పక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎస్మా ప్రయోగించినా, సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు ప్రకటించినా పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవాలని హైకోర్టు పరోక్షంగా ఆర్టీసీ జేఏసీని హెచ్చరించింది. సమ్మె వల్ల ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతున్నారని, వెంటనే సమ్మె విరమించేలా మధ్యంతర ఆదేశాలివ్వాలని, ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యల సాధనకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటుకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్‌సింగ్ దాఖలు చేసిన పిల్‌పై మంగళవారం వాదనలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా ఇరుపక్షాలకు పలు సూచనలు చేసింది. ఇబ్బంది లేదని ఎలా చెబుతారు..? ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల డిమాండ్‌ను ప్రభుత్వం అమలు చేయబోదని తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇతర ప్రభుత్వరంగ సంస్థలు కూడా ఇదే డిమాండ్‌తో ముందుకు వస్తాయన్నారు. సమ్మె ప్రభావం ప్రయాణికులపై లేదని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో.. ఇంకా 4 వేల బస్సులు నడపట్లేదని, మిగిలిన 6 వేల బస్సులు నడుస్తున్నాయని పేర్కొనడాన్ని హైకోర్టు ఎత్తి చూపింది. 4 వేల బస్సులు నడపకుండానే ప్రయాణికులు ఇబ్బందులు పడట్లేదంటే ఎలా అని ప్రశ్నించింది. మరి ఇబ్బందులు లేనప్పుడు విద్యాసంస్థలకు దసరా సెలవులు ఎందుకు పొడిగించారని ప్రశ్నించింది. కండక్టర్లు, డ్రైవర్ల భర్తీ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. యూనియన్ తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ ఆర్టీసీకి పూర్తిస్థాయి మేనేజింగ్ డైరెక్టర్ లేకపోవడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, కార్మికులు తమ సమస్యలను ఎవరి ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లాలో తెలియని అయోమయంలో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్టీసీకి ఎండీని నియమించే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని అదనపు ఏజీ చెప్పడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భుత్వంలో ఎంతో మంది ఐఏఎస్ అధికారులు ఉంటారని, వారిలో ఒకరిని ఆర్టీసీ ఎండీగా నియమించేందుకు వ్యవధి కావాలనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది. సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం చేయకపోవడం వల్లే లోకాయుక్తను నియమించాలని, శిశు సంక్షేమ జిల్లా కమిటీలను నియమించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం ఆర్టీసీ సమ్మె ప్రభావం ఎక్కువగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. గత్యంతరం లేకే సమ్మె.. సమ్మె చేసిన కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడాన్ని ప్రకాశ్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్మికుల సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చాక చర్చలు జరుపుతామని చెప్పి అర్ధాంతరంగా సమావేశాన్ని వాయిదా వేశారని, గత్యంతరం లేకే సమ్మె నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేనప్పుడే సమ్మె చేస్తారని, ప్రభుత్వం చర్చలు జరకుండా ఏకపక్షంగా మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్టీసికి చెందిన రూ.545 కోట్లను ప్రభుత్వం మళ్లించిందని, పీఎఫ్ సొమ్ము, ఇతర సమస్యల్ని పరిష్కరించాలని సమ్మె చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాది రచనారెడ్డి చెప్పారు. ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ నియమించి, అర్ధంతరంగా రద్దు చేసిందని, ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదన్నారు. కాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదిస్తూ.. సమ్మె విరమించేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అధ్యయనం కోసం సమర్థుడైన అధికారి నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, సమస్య జఠిలం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీతం ఇవ్వాలని రిట్ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పనిచేసిన సెప్టెంబర్ జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మరో పిటిషన్ మంగళవారం హైకోర్టు విచారణకు వచ్చింది. దీన్ని హైకోర్టు బుధవారం న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారించారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించాలని, వాటిని నిలుపుదల చేసే అధికారం ఆర్టీసీ యాజమాన్యానికి లేదని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఆర్టీసీ సమ్మెపై ధర్మాసనం విచారణ జరుగుతోందని, కాబట్టి ఈ రిట్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. సెలవుల పొడిగింపుపై రిట్.. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం దసరా సెలవుల్ని పొడిగిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలైంది. విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన రిట్లో వెంటనే విద్యాసంస్థలు తెరిచేలా ఉత్తర్వులివ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
ప్రస్తుతానికి సమ్మె యథావిధిగా కొనసాగుతుంది
-
ఆర్టీసీ సమ్మె: చర్చలు జరిపేందుకు నేనెవరిని?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కేసీఆర్ చర్చల ప్రసక్తే లేదంటూ ప్రకటిస్తే.. ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు చర్చలకు సిద్ధంకండంటూ పత్రికా ప్రకటన విడుదల చేసి సంచలనం సృష్టించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో తాజాగా కేకే మాట మార్చారు. కార్మికులతో చర్చలు జరపడానికి తనకు ఎలాంటి అధికారం లేదన్నారు. ఇది ప్రభుత్వ సమస్య అని... పార్టీ సమస్య కాదని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితులు చేజారుతున్నాయని.. ప్రభుత్వం, కార్మికులు పరస్పరం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మాత్రమే తాను సూచించానన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. అయితే మంచి జరుగుతుందనుకుంటే.. మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమే అన్నారు. కార్మికులు తనతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉండటం మంచి పరిణామంగా పేర్కొన్నారు కేశవరావు. (చదవండి: ‘ప్రభుత్వం చర్చలకు పిలుస్తే మేము సిద్ధం’) అయితే ప్రభుత్వం తరఫున చర్చలు జరిపేందుకు తనకు ఎలాంటి అనుమతి రాలేదని కేకే స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. అయితే సీఎం ఇంకా తనకు అందుబాటులోకి రాలేదన్నారు. తాను సోషలిస్టునని.. రాజ్యం వైపు కాక కార్మికుల వైపే ఉంటానని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు కొట్టుకోకుండా కలసికట్టుగా ఉండాలని కేకే సూచించారు. ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తానంటే తనకేమి అభ్యంతరం లేదన్నారు. అయితే ఆర్టీసీ విలీనం సాధ్యపడకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని కేకే స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటనేది తనకు తెలియదని.. ఒకవేళ తెలిస్తే.. సమస్య పరిష్కారం అయ్యేదన్నారు కేశవరావు. -
ఆర్టీసీ సమ్మె : క్యాబ్ దోపిడీ తారాస్థాయికి
క్యాబ్ సంస్థలు ఆర్టీసీ కార్మికుల సమ్మెను సొమ్ము చేసుకుంటున్నాయి. పీక్ అవర్స్ పేరుతో అధిక చార్జీలు వసూలుచేస్తున్నాయి. మరోవైపు నిబంధనలకువిరుద్ధంగా సర్‌చార్జీలు కూడా విధిస్తున్నాయి. దీంతో క్యాబ్ చార్జీలు దాదాపు రెండింతలయ్యాయి. తాత్కాలిక డ్రైవర్లతో అరకొరగా నడుస్తున్న సిటీ బస్సులు సాయంత్రం 7గంటల లోపే డిపోలకుచేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో క్యాబ్ సంస్థలు ప్రయాణికులను దోపిడీ చేస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో క్యాబ్ దోపిడీ తారాస్థాయికి చేరుకుంది. ఉబెర్, ఓలా, తదితర క్యాబ్ సంస్థలు ఆర్టీసీ సమ్మెను పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. సమ్మెను దృష్టిలో ఉంచుకొని సర్‌చార్జీలు విధించకూడదని, పీక్ అవర్స్ (రద్దీ వేళలు) నెపంతో చార్జీలు పెంచడానికి వీల్లేదని రవాణాశాఖ స్పష్టం చేసినా క్యాబ్‌ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా బస్సులు అందుబాటులో ఉండకపోగా, సాయంత్రం 6 నుంచి 7 గంటలలోపే బస్సులు డిపోలకు చేరుకుంటున్నాయి. అంతేగాక ఆర్టీసీ సైతం నైట్ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో క్యాబ్‌లు, ఆటోలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాయి. క్యాబ్‌లలో అన్ని వేళల్లోనూ పీక్ అవర్స్ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అంతేగాక ప్రయాణికులు కోరుకున్న ప్రాంతం నుంచి క్యాబ్‌లు అందుబాటులో లేవనే సాకుతో సర్‌చార్జీలు విధిస్తున్నారు. దీంతో క్యాబ్ చార్జీలు రెండింతలయ్యాయి. దీంతో నగరంలో ప్రయాణం భారంగా మారింది. సాధారణ రోజుల్లోనే ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసే ఆటోవాలాలు సమ్మె పేరుతో మరింత అడ్డగోలుగా దోచుకుంటున్నారు. సాయంత్రం బస్సులు లేకపోవడంతో ఈ దోపిడీ ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. కొరవడిన నియంత్రణ... క్యాబ్‌లు, ఆటోలపై రవాణాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టలేదు. గ్రేటర్ పరిధిలో 1.4 లక్షల ఆటోలు తిరుగుతుండగా 85 శాతం ఆటోల్లో మీటర్లను వినియోగించడం లేదు. ఆటోవాలాలు డిమాండ్ చేసినంత ఇవ్వాల్సిందే. ఇక క్యాబ్‌లలో బుకింగ్ సమయంలోనే చార్జీల భారం తెలిసిపోతుంది. పీక్అవర్స్ను సాకుగా చూపుతూ అమాంతంగా పెంచేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు క్యాబ్‌లను ఆశ్రయించవలసి వస్తుంది. దిల్సుఖ్నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు సాధారణ రోజుల్లో క్యాబ్ చార్జీలు రూ.225 వరకు ఉండగా, గత పది రోజులుగా ఈ రూట్లో చార్జీ రూ.300 నుంచి రూ.350 వరకు పెరిగింది. తార్నాక నుంచి లాలాపేట్ వరకు సాధారణంగా రూ.350 వరకు చార్జీ అవుతుంది, ఇప్పుడు ఏకంగా రూ.650 కి పైగా నమోదవుతున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘మణికొండ నుంచి లింగంపల్లి వరకు ఉబెర్ క్యాబ్‌లో మొదట రూ.120 చార్జీ నమోదైంది. ఫరవాలేదనుకొని బయలుదేరాను. తీరా దిగే సమయంలో అది రూ.220 అయింది.’’ అని సాయి అనే ప్రయాణికుడు తెలిపారు. పీక్ అవర్ నెపంతో అడ్డగోలుగా విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో ఓలా, ఉబెర్ క్యాబ్లే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని కొత్త క్యాబ్ సంస్థలు వచ్చినప్పటికీ ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా లేకపోవడంతో ఓలా, ఉబెర్‌లపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఐటీ ఉద్యోగులకు కష్టాలు... నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, తదితర ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే లక్షలాది మంది ఉద్యోగులు బస్సుల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో ఆయా మార్గాల్లో సుమారు 1500 ట్రిప్పులు తిరుగుతాయి. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సమ్మె కారణంగా రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోగా, రాత్రి పూట పూర్తిగా సర్వీసులు నిలిచిపోవడంతో క్యాబ్‌లకు డిమాండ్ పెరిగింది. విధులు ముగించుకొని ఆలస్యం గా ఇళ్లకు బయలుదేరేవారు పెద్ద మొత్తంలోనే సమర్పించుకోవలసి వస్తుంది. 10వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె... ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారం 10వ రోజుకు చేరుకుంది. నగరంలోని మహాత్మాగా>ంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్, దిల్సుఖ్నగర్, రాణీగంజ్, కంటోన్మెంట్, పికెట్, హెచ్‌సీయూ, తదితర అన్ని డిపోల వద్ద కార్మికులు కుటుంబాలతో సహా బైఠాయించి నిరసన తెలిపారు. రాణిగంజ్ డిపోకు చెందిన కండక్టర్ సురేందర్‌గౌడ్ ఆత్మహత్య ఉదంతం ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగానే మరోవైపు హెచ్‌సీయూ డిపో వద్ద మరో కార్మికుడు బ్లేడ్‌తో గాయపర్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అలాగే ప్రైవేట్ డ్రైవర్ల చేతిలో బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆదివారం హయత్‌నగర్ వద్ద ఓ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను, బైక్‌ను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. సోమవారం కూకట్పల్లి వద్ద ఒక బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ముందు బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు సమ్మెపై అనిశ్చితి కొనసాగుతున్న దృష్ట్యా గ్రేటర్ ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది నియామకాలను వేగవంతం చేసింది. ప్రస్తుతం 1200 మంది డ్రైవర్లు, 1200 కండక్టర్లు తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్నారు. అశోక్లీలాండ్, టాటా ఐశ్చర్, తదితర కంపెనీలకు చెందిన సుమారు 20 మెకానిక్ బృందాలను డిపోల్లో ఏర్పాటు చేశారు. ఈ బృందంలో మెకానిక్, ఎలక్ట్రీషియన్, తదితర సిబ్బంది ఉంటారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నగరంలో 1133 అద్దె బస్సుల భర్తీకి రంగం సిద్ధమైంది. అలాగే మరో 752 ప్రైవేట్ బస్సులను నడపాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నగర శివార్లలోని గ్రామాలకు తిరుగుతున్న ఆర్టీసీ మఫిషియల్ సర్వీసుల స్థానంలో ఈ ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. క్యాబ్‌లకు మీటర్లు బిగించాలి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్ధతునిస్తున్నాం. క్యాబ్‌లలో దోపిడీని అరికట్టేందుకు మీటర్ల విధానాన్ని అమలు చేయాలి. స్లాక్ అవర్స్, పీక్ అవర్స్‌తో నిమిత్తం లేకుండా కిలోమీటర్‌కు రూ.22 చొప్పున చార్జీ విధించాలి. అప్పుడే ప్రయాణికులు, డ్రైవర్లకు న్యాయం జరుగుతుంది. –షేక్ సలా ఉద్దీన్,( చైర్మన్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ ) -
చర్చల దిశగా ఆర్టీసీ సమ్మె
-
టీఆర్ఎస్కు మద్దతు వెనక్కి..
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ప్రకటిం చిన మద్దతును సీపీఐ ఉపసంహరించుకుంది. ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కమిటీని సంప్రదించి రెండు రోజుల్లో ప్రకటించాలని నిర్ణయించింది. సోమ వారం మఖ్దూం భవన్లో పార్టీ సీనియర్ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ సమక్షంలో తొలుత రాష్ట్ర కార్యదర్శి వర్గం, ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఉపసంహరణ నిర్ణయంపై సమావేశం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఉపఎన్నికలో టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించాలని మొదట తీసుకున్న నిర్ణయం వల్లే పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని సురవరం అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్య నేపథ్యంలో మద్దతు ఉపసంహరణ నిర్ణయం సరైనదేనని పేర్కొన్నట్టు సమాచారం. ఆర్టీసీ కార్మికులు 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా, అన్యాయంగా ఉందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. సమ్మె హక్కును నిరాకరించి, కార్మిక సంఘాలతో చర్చించకుండా 48 వేల మందిని డిస్మిస్ చేసి, సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు పూనుకుని, కొత్త రిక్రూట్మెంట్ ప్రకటించి ఘర్షణ వాతావరణం కల్పించడాన్ని మానుకోవాలని సీపీఐ కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కార్మికులు ఆత్మహత్యలకు దిగుతున్నా, పరిష్కారానికి బదులు ప్రభుత్వం మరింత విద్వేషపూరితంగా వ్యవహరిస్తుండటంతో కార్మిక, శ్రామికవర్గ పార్టీగా టీఆర్ఎస్కు మద్దతు ఉపసంహరించినట్టు తెలిపారు. -
చర్చల దారిలో..సర్కారు సంకేతాలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె పదో రోజున టీఆర్ఎస్ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చేసిన ప్రకటన కీలక మలుపు తిప్పనుందా? చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలంటూ కేకే ప్రకటన విడుదల చేయడం. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం వంటి పరిణామాలు సోమవారం ఆసక్తి రేకెత్తించాయి. కార్మికులు సమ్మె విషయంలో మొండివైఖరి విడనాడాలని, విలీనం మినహా ఇతర అంశాల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలంటూ కేకే ప్రకటన చేశారు. ఈ ప్రకటన విడుదల చేసి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన కేకే... రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. చర్చలకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన దరిమిలా మంగళవారం చర్చలకు సానుకూల వాతావరణం ఉందని అధికార పార్టీ నేత ఒకరు సాక్షికి వెల్లడించారు. మరోవైపు సమ్మె పదో రోజున కార్మికులు అన్ని డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో బైఠాయించి నిరసన తెలియజేశారు. జేఏసీ నేతలు గవర్నర్‌ను కలసి తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వినతిపత్రం సమర్పించారు. -
సీఎంతో పాటు ముగ్గురు మంత్రులపై ఫిర్యాదు
సాక్షి, కరీంనగర్ జిల్లా: సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌లపై మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు సీఎం, మంత్రులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడి కార్మికుడి ఆత్మహత్యకు కారణమైన సీఎంతో పాటు ముగ్గురు మంత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని శోభ డిమాండ్ చేశారు. 24 గంటల్లో కేసు నమోదు చేయకుంటే పీఎస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు స్వీకరించారు. -
ఉధృతంగా సమ్మె.. ఖమ్మంలో ఉద్రిక్తత
-
ఉధృతంగా సమ్మె.. ఖమ్మంలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు యత్నించడంతో ఆర్టీసీ సంఘాలు ఆదివారం బస్సుల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం నుంచే ఆర్టీసీ డిపోల దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఖమ్మం, మణుగూరు సహా ఆరు డిపోల్లో బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. కార్మికుల ఆందోళనకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ఇచ్చాయి. హైదరాబాద్‌లో.. హైదరాబాద్ పాతబస్తీలో డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఫలక్‌నుమ, ఫారూఖ్‌నగర్ డిపోల ముందు మౌనప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు బీజేపీ, సీఐటీయూలు తమ మద్దతు తెలిపాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విక్రమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హక్కింపేట్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆయన ధర్నా చేశారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు లాభాల బాటలో నడిపించేందుకు కృషిచేయాల్సిన ప్రభుత్వం.. ఉద్యోగులున తొలగించి వారి కుటుంబాలను రోడ్డు పడేయడం దుర్మార్గమన్నారు. ఇబ్రహీంపట్నం డిపో వద్ద రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో కార్మికులు.. ఆందోళన కొనసాగిస్తున్నారు. నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. డిపో ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హన్మకొండలో మౌనదీక్ష తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌనదీక్షకు దిగారు. తమ డిమాండ్లు న్యాయమైనవని... తమ పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం ఇలానే నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తే.. సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. జనగామ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు మౌనదీక్ష చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. జనగామ ఆర్టీసీ డిపో నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మౌనప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయకపోతే... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని భూపాలపల్లిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌనదీక్ష చేశారు. ప్రభుత్వం పంతం వీడి తమ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిజామాబాద్‌లో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి డిపో వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేదిలేదని స్పష్టం చేశారు. నల్ల బ్యాడ్జీలతో మౌనప్రదర్శన తమ డిమాండ్ల నెరవేర్చాలంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి మౌనప్రదర్శన చేశారు. పట్టనంలో భారీ ర్యాలీ చేశారు. అఖిలపక్షం నాయకులు కార్మికులకు మద్దతుగా మద్దతుగా నిలిచారు. ప్రైవేట్ డ్రైవర్లు, కండెక్టర్లతో బస్సులను నడిపిస్తుంటే... ప్రజలు క్షేమం గాల్లో దీపంలా ఉందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు మౌనప్రదర్శన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మె చేస్తుంటే... ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు.. నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి మౌనప్రదర్శన చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అఖిలపక్షం నేతలు కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ కార్మికుల బతుకులతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. -
ఆర్టీసీని నష్టపరిచిన కార్మికులను క్షమించేది లేదు
-
గూండాగిరీ నడవదు.. కేసీఆర్ తీవ్ర హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ‘ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్లుగా చెప్పుకునే వారు ప్రకటిస్తున్నారు. ఉధృతం చేసినా, పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదు. బెదిరింపులకు భయపడదు. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. బస్సులను ఆపి, బస్టాండ్లు, బస్ డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదు. గూండాగిరీ నడవదు. ఇప్పటివరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉంది. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుంది. బస్ స్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’అని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉత్పన్నమైన పరిస్థితులపై శనివారం ప్రగతి భవన్లో సమీక్షించారు. ప్రతి ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తు పెంచాలని, అన్నిచోట్ల సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని, నిఘా పోలీసులను ఉపయోగించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని, ఉద్యమం పేరిట విధ్వంసం సృష్టిస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదని సమావేశం నుంచే డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేసి ఆదేశించారు. ఎవరినీ ఎవరు డిస్మిస్ చేయలేదు.. ‘యూనియన్ నేతల పిచ్చి మాటలు నమ్మి కార్మికులు అనధికారికంగా గైర్హాజరయి తమంతట తామే ఉద్యోగాలు వదులుకున్నారు. అంతే తప్ప ఎవరినీ ఎవరు డిస్మిస్ చేయలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి లాగారు. యూనియన్ నేతలు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా చేశారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశమే లేదు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదు.. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్టీసీని నష్టపరిచిన కార్మికులను క్షమించే ప్రసక్తే లేదు. అసలు వారు చేస్తున్నది సమ్మె కానే కాదు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. విధులకు హాజరైన ఉద్యోగులు, కార్మికుల సెప్టెంబర్ జీతం వెంటనే విడుదల చేస్తాం’అని సీఎం వివరించారు. నాదాష్ దుష్మన్లా పరిస్థితి.. ‘అర్థరహిత డిమాండ్లతో, చట్ట విరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పక్షాలు మద్దతివ్వడం అనైతికం. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయ సమ్మతం కాని కోర్కెలతో సమ్మె చేసే వారికి మద్దతిచ్చే రాజకీయ పక్షాలకు ప్రజల మద్దతు లేదు. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదు. రాష్ట్రంలో పరిస్థితి నాదాన్ దుష్మన్ అనేలా ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నాయి. వారి ఆశ ఫలించదు. గతంలో అనేక విషయాల్లో తప్పుడు వైఖరి వల్లే వారు ప్రజల మద్దతు కోల్పోయారు. ఆర్టీసీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో వేటిని కూడా ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయట్లేదు’అని సీఎం పేర్కొన్నారు. అక్కడ అలా.. ఇక్కడ ఇలాగా? ‘బీజేపీ నేతలు బాగా మాట్లాడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రైల్వే వ్యవస్థను, రైళ్లను ప్రైవేటీకరిస్తోంది. ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించింది. చివరికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను కూడా ప్రైవేటీకరించింది. వివిధ ప్రభుత్వ రంగసంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్లోనే చెప్పింది. అక్కడి వారి ప్రభుత్వం ఇలా చేస్తుంటే, ఇక్కడి ఆ పార్టీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’అని మండిపడ్డారు. వెంటనే నియామకాలు.. ‘మూడు రోజుల్లో వంద శాతం బస్సులు పునరుద్ధరించాలి. ఇందుకు అసవరమైన సిబ్బందిని వెంటనే తీసుకోవాలి. రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలి. బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారిని పనిలోకి తీసుకోవాలి’అని సీఎం ఆదేశించారు. ‘ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఆర్టీసీలో 50 శాతం (5,200) సంస్థ సొంత బస్సులు నడపాలి. ఇందుకు అవసరమైన సిబ్బదిని వెంటనే నియమించాలి. 30 శాతం(3,100) అద్దె బస్సులు నడపాలి. ఇందులో ఇప్పటికే 21 శాతం ఉన్నాయి. మరో 9 శాతం బస్సుల కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. 20 శాతం (2,100) ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా పర్మిషన్లు ఇవ్వాలి’అని సీఎం స్పష్టం చేశారు. సమీక్షలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ అధికారులు సునీల్ శర్మ, నర్సింగ్‌రావు, సందీప్ సుల్తానియా, ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్లు పాండురంగనాయక్, సి.రమేశ్, మమతా ప్రసాద్, డీటీసీలు ప్రవీణ్ రావు, పాపారావు, ఆర్టీసీ ఈడీలు టీవీ రావు, యాదగిరి, వినోద్, వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె: తీవ్ర ఉద్రిక్తత, లక్ష్మణ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శనివారం బీజేపీ బస్ భవన్ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ని, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్ చేశారు. దాంతో ఓ ఆర్టీసీ కార్మికుడు చెట్టు ఎక్కి నిరసన తెలిపాడు. ధర్నా నేపథ్యంలో బస్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్థంభించడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే.. ప్రగతి భవన్‌ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇన్ని రోజులుగా కార్మికుల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి.. వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటుందని తెలిపారు. కార్మికుల సమస్యలపై స్పందించకపోతే.. కేసీఆర్ పాలనను స్తంభింపచేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు. -
ప్రైవేట్ కండక్టర్ల చేతికి టికెట్ మెషిన్లు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సుల్లో అడ్డగోలు చార్జీలపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ప్రైవేట్ కండక్టర్లు, డ్రైవర్లు ఎక్కడికక్కడ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ దోపిడీకి పాల్పడుతుండడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రవాణాశాఖ అప్రమత్తమైంది. ఆర్టీఏ అధికారులు నగరంలో పలు చోట్ల శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. మరోవైపు ఆర్టీసీ గ్రేటర్ జోన్ సైతం చర్యలు తీసుకుంటోంది. సమ్మెపై కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బంది విధులను పటిష్టం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. మరో రెండు రోజుల్లో విద్యార్థులకు సెలవులు ముగియనున్నాయి. స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. శివార్లలోని ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. కానీ ఈలోగా సమ్మె ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో అందుబాటులో ఉన్న బస్సులన్నింటిలో టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ (టిమ్స్)ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీటి వినియోగంపై ప్రైవేట్ కండక్టర్లకు శిక్షణనిచ్చి రెగ్యులర్ సిబ్బంది తరహాలో వారి సేవలు వినియోగించుకోనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బస్సుల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణనివ్వాలని అధికారులు భావిస్తున్నారు. ‘టిమ్స్’తో సేవలు పారదర్శకం... ప్రస్తుతం టికెట్ల జారీ విధానం లేకుండా ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. పైగా ప్రయాణికుల నుంచి వసూలు చేసిన చార్జీల్లోనూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ రూట్లో ఏ కండక్టర్ నుంచి ఎంత ఆదాయం వచ్చిందనే విషయంపై అధికారులకు అవగాహన ఉండడం లేదు. దీంతో ప్రైవేట్ కండక్టర్లు కచ్చితంగా టికెట్ మెషిన్లను వినియోగించే విధంగా తర్ఫీదు ఇవ్వడమే మంచిదని అధికారులు ఒక అవగాహనకు వచ్చారు. టికెట్ల జారీతో దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో ఆయా రూట్లలో ఎన్ని టికెట్లు జారీ అయ్యాయి? ఎంత ఆదాయం వచ్చిందనే అంశంపై కూడా స్పష్టత వస్తుంది. అలాగే సిటీ బస్సుల నిర్వహణపై డ్రైవర్లకు కూడా అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం సుమారు 2,500 మంది కండక్టర్లు, డ్రైవర్లు తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. శుక్రవారం నాటికి 1300 బస్సులను రోడ్డెక్కించినట్లు అధికారులు తెలిపారు. మరో 2,300లకు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అధికారుల హెచ్చరిక... ప్రయాణికుల నుంచి చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెహిదీపట్నం ప్రాంతీయ రవాణా అధికారి సీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శీతల్ చౌహాన్ బృందం అక్కడి బస్టాప్ వద్ద తనిఖీలు నిర్వహించింది. మెహిదీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్లను సీరియస్‌గా హెచ్చరించింది. ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు తీసుకుంటే డ్యూటీలోకి తీసుకోబోమని, నేరుగా ఇంటికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఖైరతాబాద్, అమీర్‌పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, కార్ఖానా తదితర ప్రాంతాల్లో ఆర్టీఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కండక్టర్ల వద్దనున్న టికెట్ చార్ట్‌లను పరిశీలించారు. చార్ట్ ప్రకారమే డబ్బులివ్వాలని ప్రయాణికులకు అవగాహన కల్పించారు. -
ఆర్టీసీ సమ్మె: బస్‌భవన్ ఎదుట ధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లాలో కార్మికులు యధావిధిగా సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు కార్మికులు డిపోల ఎదుట మౌన దీక్ష చేయనున్నారు. అదే విధంగా బీజేపీ అధ్వర్యంలో బస్ భవన్ ముందు ధర్నా నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రం వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, పలు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఖమ్మం మున్సిపల్ కార్మికులు తమ విధులను బహిష్కరించి.. మున్సిపల్ కార్యాలయం నుంచి డిపో వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మద్దతు పలుకుతుందని జీ దామోదర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు బర్తరఫ్ అయినట్లుగా ప్రకటించి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించడం అప్రజాస్వామికం అన్నారు. ప్రభుత్వం చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎనిమిది డిపోల పరిధిలో 672 బస్సులు, 2890 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా సమ్మెలో పాల్గొన్నడం వల్ల ఇప్పటి వరకు రూ. 7 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ తోడ్పాటు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. వరుసగా 7 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్చలకు తావులేకుండా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు.. సమ్మెపై ఎక్కడా తగ్గబోమని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మరింత వాడిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని భావించిన జేఏసీ.. ఈ కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో జేఏసీ నేతలు.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరగా.. సానుకూలంగా స్పందిస్తూ ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటారని, ఈ మేరకు పీసీసీ తరఫున పిలుపునిస్తామని చెప్పారు. కేంద్ర హోం శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని పలువురు ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. అనంతరం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కలిశారు. లక్ష్మణ్ స్పందిస్తూ ఆర్టీసీ సమ్మెను తమ భుజాలపై ఎత్తుకుని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. శనివారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని బస్సు డిపోల ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి తమ పార్టీ ప్రతినిధిని పంపుతామని లక్ష్మణ్ తెలిపారు. నేడు మౌనదీక్షలు.. ఆర్టీసీ జేఏసీ కార్యాచరణలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను తీవ్ర తరం చేయనున్నారు. ప్రతిరోజు ర్యాలీలు నిర్వహిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా.. శనివారం గాంధీ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేపట్టనున్నారు. తాలూకా కేంద్రాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలసి వినతిపత్రాలు సమర్పించనుంది. శుక్రవారం కరీంనగర్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలసిన పలువురు వినతులు ఇచ్చే క్రమంలో ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌లో ఆర్టీసీ కార్మికులపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీల జోరు.. నినాదాల హోరు! ఆర్టీసీ కార్మికుల 7వ రోజు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మండల, తాలూకా, జిల్లా కేంద్రా ల్లో ర్యాలీలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ కార్మికులతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొని మద్దతు తెలిపాయి. జేఏసీ నేతలు తమ డిమాండ్లను పేర్కొంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలాచోట్ల రాస్తారోకోలు చేపట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మెజార్టీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రయాణికుల తాకిడికి సరిపడా బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తున్నా అనుభవజ్ఞులైన డ్రైవర్లు దొరకట్లేదు. -
ఆర్టీసీలో కొత్త కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మె చేస్తున్న కార్మికుల సెల్ఫ్ డిస్మిస్‌తో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి యాజమాన్యం చర్యలు వేగిరం చేస్తోంది. పక్షం రోజుల్లోగా ఆర్టీసీని పూర్వ స్థితికి తీసుకురావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. 7 రోజులుగా సమ్మె కొనసాగుతుండగా.. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు చేరని వారంతా సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ గణాంకాలను ప్రాతిపదికన తీసుకున్న ఆర్టీసీ అధికారులు.. ఎన్ని పోస్టులు కొత్తగా భర్తీ చేయాలనే దానిపై కసరత్తు దాదాపు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 97 బస్ డిపోల పరిధిలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు, సూపర్వైజర్లు తదితర కేటగిరీల లెక్కలు తేల్చిన ఆర్టీసీ యాజమాన్యం.. ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఆర్టీసీలో మూడు పద్ధతుల్లో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిబ్బంది అవసరం ఏ మేరకు ఉంటుందనే దానిపై అంచనాలు తయారు చేసిన అధికారులు ఏ విధంగా నియామకాలు చేపట్టాలనే దానిపై ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. కొత్తవిధానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు ఇతర సిబ్బంది కలుపుకొంటే దాదాపు 25 వేల మంది వరకు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించిన ఆర్టీసీ.. సీఎం కేసీఆర్‌కు సమర్పించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం కల్లా సీఎంవోలో సమర్పించాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల జాప్యం జరిగినట్లు తెలిసింది. టిమ్స్ ద్వారా టికెట్లు.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి టిమ్స్ ద్వారా టికెట్లు జారీ చేసే ప్రక్రియపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందని, ప్రజా రవాణా సేవల్ని మరింత మెరుగు పరుస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. విజిలెన్స్ స్ట్రెంత్‌ను పెంచడంతో పాటు బస్ సర్వీసులలో టిమ్స్ ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ త్వరితంగా అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ అధికారులకు ఆదేశించారు. ఆయా పాయింట్ల వద్ద సర్వీసులు చెక్ చేసేందుకు ఆర్టీవో అధికారుల సహకారం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం 5788 బస్సులు నడిపినట్లు తెలిపారు. ఇందులో 3,766 ఆర్టీసీ, 2,022 అద్దె బస్సులున్నాయన్నారు. 6 వేల ప్రైవేట్ వాహనాలను కూడా తిప్పినట్లు చెప్పారు. -
సమ్మె విషాదం
సాక్షి, సిటీబ్యూరో/రాయదుర్గం/మేడిపల్లి/అల్వాల్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం ఆరో రోజుకు చేరింది. గురువారం మరింత ఉధృతమైంది. మరోవైపు తిరిగి నగరానికి చేరుకుంటున్న ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమ్మెపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె చేస్తామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సమ్మె కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చెంగిచెర్ల డిపోకు చెందిన డ్రైవర్ కొమురయ్య ఉప్పల్ డిపో వద్ద నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న తరువాత గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. అల్వాల్‌లో హకీంపేట్ డిపోకు చెందిన కండక్టర్ పద్మ భర్త గుండెపోటుతో చనిపోయాడు. మరోవైపు హెచ్‌సీయూ డిపోకు చెందిన డ్రైవర్ ఖలీల్‌మియా సైతం రామచంద్రాపురం ఈఎస్ఐ వద్ద గుండెపోటుతో చనిపోయాడు. వీరికి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగం పోయిందనే బెంగతో... హెచ్‌సీయూ డిపోకు చెందిన సీనియర్ డ్రైవర్ ఎస్కె ఖలీల్‌మియా(48) గుండెపోటుతో మృతి చెందాడు. కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తీవ్ర భయాందోళనతో గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖలీల్‌మియా మృతితో హెచ్‌సీయూ డిపోలో విషాద వాతావరణం నెలకొంది. ఆయనకు భార్య, నలుగురు పిల్లలున్నారు. రామచంద్రాపురంలోని ముంబై కాలనీలో నివాసముంటున్నారు. బుధవారం మధ్యాహ్నం తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో చందానగర్‌లోని అర్చన ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. గుండెపోటుతో మరో డ్రైవర్... ఉప్పల్ డిపో ఎదుట గురువారం ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. చెంగిచెర్ల డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న కొమరయ్య (57) ఇందులో పాల్గొన్నాడు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో బోడుప్పల్ మల్లికార్జున్‌నగర్‌లోని తన నివాసానికి వెళ్లాడు. సమ్మెపై కొనసాగుతున్న ప్రతిష్టంభన, ఉద్యోగ భద్రత తదితర కారణాలతో తీవ్ర మనస్తాపానికి గురైన కొమరయ్య గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు భార్య బుచ్చమ్మ తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కొమరయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. మరో ఘటనలో ఆర్టీసి ఉద్యోగి భర్త... ఆర్టీసి ఉద్యోగి పద్మ భర్త రఘు హఠాన్మరణం పట్ల ఆర్టీసీ జేఏసీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హకీంపేట్ డిపొలో కండక్టర్‌గా పనిచేస్తున్న అల్వాల్‌కు చెందిన పద్మ భర్త రఘు గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. ఒకవైపు భార్య ఉద్యోగం కోల్పోవడం.. జీతం రాకపోవడంతో నెలసరి చెల్లించే రుణ వాయిదా చెక్కు బ్యాంకులో బౌన్స్ కావడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. ఈ ఒత్తిడితోనే రఘుకు గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. సమ్మె ఉధృతం ఆర్టీసీ కార్మికులకు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కూడా మదద్దతు పలకడంతో సమ్మె ఉధృతమైంది. నగరంలోని అన్ని డిపోల వద్ద గురువారం ధర్నాలు నిర్వహించారు. ఎంజీబీఎస్, జేబీఎస్‌తో పాటు పలు చోట్ల మానవహారాలు ఏర్పాటు చేశారు. పలు డిపోల నుంచి ప్రధాన రహదారుల వరకు ర్యాలీలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. పలుచోట్ల ప్రైవేట్ వాహనాలను అడ్డగించారు. అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, మహిళా కండక్టర్లు సైతం నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. దిల్సుఖ్నగర్, కోఠి, ఉప్పల్, మిధానీ, కూకట్పల్లి, పటాన్చెరు, కుషాయిగూడ, ఈసీఐఎల్, కంటోన్మెంట్, పికెట్, మేడ్చల్, బర్కత్‌పురా, హెచ్‌సీయూ, హయత్‌నగర్, మియాపూర్, రాణీగంజ్, ముషీరాబాద్, చెంగిచెర్ల తదితర అన్ని డిపోల వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. పోలీసులు అన్ని చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. -
సమ్మె యధాతథంగా కొనసాగుతుంది
-
ఆర్టీసీ సమ్మెపై విచారణ 15కు వాయిదా
-
ఆర్టీసీ సమ్మెపై విచారణ 15కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరు పక్షాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాది రామచందర్ రావు, ఆర్టీసీ యాజమన్యం, కార్మిక సంఘాల తరఫున న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. సమ్మె ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై కార్మిక సంఘాలు వివరణనిచ్చాయి. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కార్మిక సంఘాల తరపు న్యాయవాది.. సమ్మెను విరమించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు... పూర్తి వివరాలతో మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. డిమాండ్లు పరిష్కరిస్తే.. తక్షణమే విరమణ అంతకుముందు ఇరుపక్షాలు కోర్టుకు తమ వాదనలు వినిపించాయి. ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన ప్రయత్నం కార్మికులు చేయడం లేదని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలని కార్మికులు సమ్మె బాట పట్టారని కార్మిక సంఘాల తరపున న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు నెల రోజుల ముందే ప్రభుత్వాన్ని కోరారన్నారు. అంతేకాక గత నెల 3, 24, 26 తేదీల్లో ఆర్టీసీకి, ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారని వెల్లడించారు. కార్పొరేషన్ ఫండ్స్ రూ.545 కోట్లతో పాటు ఇతర రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన జీత భత్యాలు, ఇతరత్రా వాటిని పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే కార్మికులు సమ్మెకు వెళ్లారన్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తే.. కార్మికులు వెంటనే సమ్మె విరమిస్తారని రచనా రెడ్డి కోర్టుకు వివరించారు. సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అని ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ రామచందర్ రావు తెలిపారు. కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి సమయం ఇవ్వాలని కోరినా.. వారు వినిపించుకోలేదని కోర్టుకు తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు గత నెల 29వ తేదీన సునీల్ శర్మ ఆధ్వర్యంలో కమిటీ నియమించడం జరిగిందని తెలిపారు. కమిటీ నిర్ణయం తీసుకోకముందే.. కార్మికులు సమ్మెలోకి వెళ్లారన్నారు. సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు తెలిపారు. -
ప్రతి బస్సులో చార్జీల పట్టిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రతి బస్సులో చార్జీల పట్టికను ప్రయాణికులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్టేజీ క్యారియర్ తదితర బస్సులు ఈ నిబంధనను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణ చార్జీకి మించి ఒక్క పైసా కూడా అదనంగా వసూలు చేయవద్దని, తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకుని నడిపిస్తున్న బస్సుల్లో అన్ని రకాల రాయితీ బస్‌పాస్‌లను అనుమతించాలని సూచించారు. 80 శాతం బస్సులను తప్పనిసరిగా ప్రయాణికుల కోసం తిప్పాలన్నారు. ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తీసుకున్న అన్ని బస్సులను రోడ్డెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకుంటే కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేయబోమని హెచ్చరించారు. పోలీస్ అధికారులు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల సహకారంతో బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్లను, ఆర్డీఓలను కోరారు. నైట్‌హాల్ట్ బస్సులను స్థానిక పోలీస్ స్టేషన్లలో నిలపాలని పేర్కొన్నారు. అర్ధంతరంగా బస్సులు మరమ్మతులకు గురైతే 100కు డయల్ చేయాలని సూచించారు. మద్యం మత్తులో విధులకు వచ్చే డ్రైవర్లను, కండక్టర్లను అనుమతించవద్దని పేర్కొన్నారు. రూ.6 కోట్ల మేర నష్టం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో బస్సులు రోడ్డెక్కకపోవడం వల్ల జిల్లాలో ఆర్టీసీకి బుధవారం నాటికి రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. సాధారణ రోజులతో పోల్చితే దసరా పండగ సీజన్లో ప్రయాణికులు అదనంగా 65 శాతం ప్రయాణిస్తారని పేర్కొంటున్నారు. -
ఆరో రోజుకు చేరిన సమ్మె..
-
ఆర్టీసీ సమ్మె: నేడు హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేయాలంటూ గత విచారణలో కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్సుల బంద్ ప్రభావంపై అన్ని డిపోల మేనేజర్లు ఇచ్చిన రిపోర్ట్‌ను ప్రభుత్వం నేడు కోర్టుకు సమర్పించి, పిటిషన్ దాఖలు చేయనుంది. సమ్మె చట్టబద్ధం కాదని అటు ప్రభుత్వం.. తమ డిమాండ్ల సాధనకే సమ్మె అంటూ ఇటు కార్మికులు వాదిస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పు కీలకంగా మారనుంది. సమ్మె నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఆర్టీసీ జేఏసీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అనంతరం తెలంగాణ బంద్ ప్రకటనపై గవర్నర్‌ను కలవనుంది. ఆరో రోజుకు చేరిన సమ్మె.. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. నేడు రాజకీయ పక్షాలతో కలిసి ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు. సమ్మె విషయంలో ఇటు ఆర్టీసీ కార్మికులు, అటు ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవడం లేదు. సమ్మె ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ రోజువారీ కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులు నడుపుతుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా దాదాపు 5 వేల బస్సులును నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఇదిలా ఉండగా సమ్మె నేపథ్యంలో అద్దె బస్సుల్లో బస్సు పాసులను అనుమతించడం లేదు. ఫలితంగా ప్రైవేటు వాహనదారులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా అధిక చార్జీలు వసూలు చేస్తూ.. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా చర్యలు తప్పవంటూ ప్రభుత్వం హెచ్చరించినప్పటికి దోపిడీ మాత్రం ఆగడం లేదు. -
సమ్మెపై ఉత్కంఠ
-
ఆర్టీసీ సమ్మె: భార్య ఉద్యోగం పోతుందనే బెంగతో
సంగారెడ్డి అర్బన్: ఆర్టీసీలో పనిచేస్తున్న భార్య ఉద్యోగం పోతుందన్న బెంగతో మనస్తాపానికి గురైన భర్త గుండె పోటుతో మృతిచెందిన ఘటన బాబానగర్‌లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కర్నె కిశోర్ (39) ఓ ప్రైవేట్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య నాగరాణి ఆర్టీసీలో పని చేస్తుంది. గత ఐదు రోజులుగా ఆర్టీసీలో సమ్మె జరుగుతుండటం.. ప్రభుత్వం కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రకటించడంతో పరిస్థితి ఎలా అని ఇంట్లో చర్చించుకున్నారు. ఈ క్రమంలో భార్య ఉద్యోగం పోతే బతకడం కష్టమవుతుందని భర్త మనస్తాపానికి గురైయ్యాడు. రెండ్రోజులుగా సరిగ్గా భోజనం కూడా చేయకపోవడంతో అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో నిద్రలోనే మృతి చెందాడు. దీంతో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య నాగరాణితోపాటు రెండేళ్ల పాప ఉంది. తన భర్త మృతికి సీఎం కేసీఆర్ వ్యాఖ్యాలే కారణమని నాగరాణి ఆరోపించారు. -
సర్కార్ దిగిరాకపోతే సకల జనుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్టీసీ సంఘాల తో చర్చలు జరిపి ప్రభుత్వం విలీన చర్యలు చేపట్టకపోతే సమ్మె ఉధృతం చేయనున్నట్టు ఆర్టీసీ జేఏసీ, రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల అఖిల పక్ష సమావేశం ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు టీపీసీసీ, టీజేఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ (రెండు గ్రూపులు), టీటీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీ, జనసేన, శివసేన, ఎమ్మార్పీఎస్, బీసీ సంక్షే మ సంఘం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ, వివిధ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అలాగే భవిష్యత్ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని తమ సహకారాన్ని అందిస్తామని వెల్లడించాయి. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాకపోతే మరో సకల జనుల సమ్మెకు సిద్ధం కావాలని అఖిల పక్ష నేతలు నిర్ణయించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్ నిర్వ హించాలని నిర్ణయించినా, గురువారం మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మరోసారి భేటీ అయ్యి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. సమ్మెలో భాగంగా గురువారం డిపోల ఎదుట నిరసనలు, ఎమ్మార్వోలకు వినతిపత్రాల సమర్పణ, త్వరలోనే గవర్నర్‌కు మెమోరాండం అందజేయనున్నారు. అందరూ పాల్గొనాలి: కోదండరాం ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెగా ఉన్నది కాస్తా సకల జనుల సమ్మెగా మారాల్సి ఉందని, ఇందులో ప్రధాన రాజకీయ పార్టీలు, కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పాల్గొనాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. సమ్మె కొనసాగిస్తాం: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ సమ్మె కొనసాగించి తీరుతామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి స్పష్టం చేశారు. కాడిని మధ్యలో దించే ప్రసక్తేలేదని, తమ సంఘం ఏ పార్టీకి అనుబంధం కాదని చెప్పారు. ఆర్టీసీలో 48 వేల ఉద్యోగాలు తీసేసే హక్కు సీఎంకు లేదని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని, దీనిపై పోరాటానికి న్యాయ పరమైన సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు తెలిపారు. కేసీఆర్ బెదిరింపులకు భయ పడేది లేదని, ఆర్టీసీకి సంబంధించి ఎలాంటి పోరాటానికి అయినా మద్దతునిచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి చెప్పారు. కార్మికులెవరూ అధైర్యపడొద్దని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ చెప్పారు. ముందే మద్దతిచ్చాం: చాడ సెల్ప్ డిస్మిస్ అనేది అత్యంత ఘోరమైన పదమని, ఇట్లా పిచ్చోడు కూడా మాట్లాడడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. సమ్మె మొదలుకాక ముందే టీఆర్ఎస్కు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ మద్దతునిచ్చిందని, ఆర్టీసీ ప్రైవేటీకరణను సహించేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కోసం పోరాడాలి.. ఆర్టీసీ నిర్వీర్యం చేసి ప్రైవేటుకు కట్టబెట్టే కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్ అహంకారానికి అడ్డుకట్ట వేసేందుకు పోరాటం కొనసాగించాలని చెప్పారు. ఆర్టీసీ ఓడితే, తెలంగాణ ఓడిపోయినట్టేనని అందువల్ల అన్ని వర్గాలు కలసి ఈ సంస్థ పరిరక్షణకు పోరాడాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పిలుపునిచ్చారు. సీఎం ప్రతిష్టకు పోకుండా సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 48 వేల మందిని ఒక్క కలం పోటుతో డిస్మిస్ చేస్తామంటే, చరిత్రలో నియంతలకు పట్టిన గతే సీఎంకు పడుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ భేటీలో విమలక్క (టీయూఎఫ్), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ), జిట్టా బాలకృష్ణారెడ్డి (యువ తెలంగాణ పార్టీ), రాజిరెడ్డి, థామస్‌రెడ్డి (ఆర్టీసీ జేఏసీ), చిక్కుడు ప్రభాకర్ (తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక), సాధినేని వెంకటేశ్వరరావు, పోటురంగారావు (న్యూడెమోక్రసీ రెండు వర్గాలు), భుజంగరావు, సదానందం, విజయ్‌మోహన్, దత్తాత్రేయ (ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు)ఇతర సంఘాల వారు పాల్గొన్నారు. సమ్మెపై ఉత్కంఠ: నేడు విచారించనున్న హైకోర్టు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను విరమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ కొనసాగించనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్‌సింగ్ దాఖ లు చేసిన పిల్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారణ కొనసాగించనుంది. వ్యాజ్యం దాఖలు వెనుక ప్రజాహితమే లేదని, కార్మిక సంఘాల ప్రయోజనం దాగి ఉందని చెప్పి ప్రభు త్వం తన వైఖరిని వెల్లడించిందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. సమ్మె చట్ట విరుద్ధమని, వెంటనే సమ్మె విరమించేలా హైకో ర్టు 2015లో వెలువరించిన మధ్యంతర ఉత్తర్వుల మాదిరిగానే ఇప్పుడు కూడా ఇవ్వాలని పిటిషనర్ కోరుతున్నారు. గురువారం నాటి విచారణలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వ వివరణ ఇవ్వనుంది. -
సీఎం ఆదేశాలతో ఉద్యోగాల భర్తీపై ఆర్టీసీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో రెండు పక్షాలు పట్టువీడటం లేదు. తమ డిమాండ్ల పరిష్కారం జరిగే వరకు ఆందోళన చేస్తామని కార్మిక సంఘాలు భీష్మించుకోగా, ప్రభుత్వం కూడా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. సమ్మెలో భాగంగా బుధవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీల మద్దతు కోరగా, ఇప్పటికే సీఎంకు రవాణా కార్యదర్శి సునీల్ శర్మ నివేదిక సమర్పించారు. సీఎం ఆదేశాలతో ఉద్యోగ ఖాళీల లెక్కలపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు పక్షాల పరిస్థితి ఇలా ఉంటే ప్రయాణికుల కష్టాలు ఐదో రోజు కూడా కొనసాగాయి. సెలవులు అయిపోతుండటంతో తిరుగు ప్రయాణాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వస్తున్న వారి నుంచి ప్రైవేటు వాహనాలు రెట్టిం పు చార్జీలు వసూలు చేస్తూ దోచుకుంటున్నాయి. ఖాళీల భర్తీకి తర్జనభర్జన.. సీఎం ఆదేశాలతో ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీల లెక్కలపై అధికారగణం తర్జనభర్జన పడుతోంది. ఆర్టీసీలో కేటగిరీల వారీగా ఎన్ని ఖాళీలున్నాయి? అనే అంశంపై అంచనాలు తయారు చేస్తున్నారు. మూడు పద్ధతుల్లో బస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎంతమంది కార్మికులు అవసరమనే అంశంపైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మొత్తం 50వేల మంది వరకు కార్మికులున్నారు. డ్రైవర్, కండక్టర్ కేటగిరీల్లో 1,200 మందే ఉన్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఈ నేపథ్యంలో మిగతా ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఆర్టీసీ ద్వారా 10వేల బస్సులు నడపాలని నిర్ణయించగా.. ఇందులో 50శాతమే పూర్తిస్థాయిలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా 30శాతం అద్దె ప్రాతిపదికన, మరో 20% పూర్తిగా ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో 50% బస్సులకు మాత్రమే డ్రైవర్లు, కండక్టర్లు ఉంటే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 97 బస్ డిపోల పరిధిలో 5వేల బస్సులకు సిబ్బంది కావాలి. ప్రతి బస్సు కు ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్ల చొప్పున గణిస్తే 20వేల మంది సరిపోతారని లెక్కలు వేస్తున్నా రు. శ్రామికుల కేటగిరీలో 4వేల మందితో పాటు సూపర్వైజ్ కేడర్‌లో మరో 400 పోస్టులు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా 28వేలమందిని నియమిస్తే సరిపోతుందనే దానిపై ఆర్టీసీ అధికారుల్లో చర్చలు జరుగుతున్నాయి. కొత్తగూడెం బస్సు డిపో వద్ద మోకాళ్లపైనిల్చుని నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సీఎం ఆమోదం తర్వాతే... ఆర్టీసీలో ఖాళీలు, నియామకాలపై రెండ్రోజల్లో లెక్కలు తేల్చేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా అన్ని వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అన్నింటిపైనా స్పష్టత వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనలకు సీఎం ఆమోదించిన తర్వాత నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. టికెట్ ధరకు రెట్టింపు వసూలు.. దసరా పండుగకు ఊరెళ్లిన వారు క్రమంగా తిరుగుప్రయాణమవుతుండటంతో రద్దీ పెరుగుతోంది. ఈ నెల 5న సమ్మె ప్రారంభమవుతుందని ముందే ప్రకటించడం... విద్యా సంస్థలకు అంతకుముందే సెలవులు రావడం తో ఊరికి వెళ్లేవారు ప్రణాళికతో వ్యవహరించారు. దీంతో పండుగకు ఊరెళ్లిన వారిపై ఆర్టీసీ సమ్మె పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం ప్రయాణికులు క్రమంగా వెనుతిరుగుతుండటంతో డిమాండ్ పెరుగుతోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో కొన్ని బస్సులను ఆర్టీసీ నిర్వహిస్తున్నప్పటికీ డిమాండ్‌కు సరిపడా బస్సులు రోడ్డెక్కడం లేదు. ఈ నేపథ్యంలో పల్లెలకు వెళ్తున్న ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల చేతిచమురు వదిలిస్తున్నారు. సాధారణ బస్సు టికెట్లు కంటే రెట్టిం పు వసూళ్లు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. గురు, శుక్ర, శనివారాల్లో రద్దీ విపరీతం కానుంది. ఈ సమయంలో ఆర్టీసీ మరిన్ని బస్సులు నడిపితే తప్ప ఇబ్బందులకు ఉపశమనం ఉండదు. తాత్కాలిక సిబ్బందిపై ఆర్టీసీ కార్మికుల దాడి నారాయణఖేడ్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లపై రెగ్యులర్ కార్మికులు చేయిచేసుకున్నారు. బుధవారం సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్ రాజీవ్‌చౌక్ చౌరస్తా నుంచి సంగారెడ్డికి బయలుదేరింది. అందులో స్థానిక ఆర్టీసీ కార్మికులు ఎక్కారు. బస్సు చార్జీ అడిగిన తాత్కాలిక కండక్టర్‌ను తాము స్టాఫ్ అని చెప్పారు. పాసులు చూపించాలని కోరగా..డిపో వద్ద చూపిస్తామని చెప్పారు. డిపోనకు వెళ్లగానే కార్మికులు తాత్కాలిక కండక్టర్ సాయిబాబ, డ్రైవర్ దత్తుపై చేయిచేసుకున్నారు. -
అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చాలినన్ని బస్సులు తిరుగుతున్నాయని, ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో చార్జీలపై దృష్టి పెడుతున్నామని ఆయన వెల్లడించారు. టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్మికుల సమ్మె, రవాణా శాఖ తీసుకున్న చర్యలు, పండుగకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మతో కలిసి ఆర్టీసీ అధికారులు, ఈడీలు, రీజినల్, డివిజనల్ మేనేజర్లు, ఆర్టీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీకి సరిపడా బస్సులు నడుపుతున్నామని, కొన్ని చోట్ల టికెట్ ధర కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అధిక వసూళ్లు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి బస్సులో ఆయా రూట్లలో ఉండే చార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికోసం ప్రతి డిపోలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇన్‌చార్జీగా నియమిస్తున్నట్లు తెలిపారు. బస్సుల్లో డ్రైవర్ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్ రూమ్ నంబర్లను ప్రదర్శిస్తామని, టికెట్ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 14 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండటంతో షెడ్యూల్ ప్రకారం బస్సులను నడుపుతామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్ షెడ్యూల్ ఉండేదో అదే షెడ్యూల్‌ను దాదాపు శుక్రవారం నుంచి అమలు చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి వెళ్లాల్సిన బస్సులను నడుపుతామని, ఆర్టీసీ బస్సుల్లో బస్‌పాస్‌లను యథావిధిగా అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులు, వికలాంగులు, పాత్రికేయులు, ఉద్యోగులతో పాటు బస్ పాసులన్నీ అనుమతించాలని, దీనిపై ఎలాంటి ఫిర్యాదులు రావద్దని మంత్రి స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు వివిధ వాహనాలను తిప్పి, ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చామని, ఇదే రీతిన తిరుగు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రత్యేక సర్వీసుల సేవలన్నీ వినియోగించుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంతో ఆయా శాఖల అధికారులు సంయుక్తంగా ప్రజా రవాణా స్థితిగతులన్నీ పరిశీలిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 5,049 బస్సులు తిప్పామని మంత్రి అజయ్ వెల్లడించారు. ఇందులో ఆర్టీసీ బస్సులు 3,116, ఆర్టీసీ అద్దె బస్సులు 1,933తో పాటు ప్రైవేట్ వాహనాలు తిరిగాయని చెప్పారు. ఈ రెండు రోజులు ప్రయాణీకుల రద్దీని బట్టి మరిన్ని వాహనాలను నడుపుతామని తెలిపారు. వీటితోపాటు మరో 6 వేల ప్రైవేటు వాహనాలను నడుపుతున్నట్లు చెప్పారు. రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను పెంచామని, అన్ని శాఖల సహకారంతో సమ్మె ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మొత్తం కార్మికుల సంఖ్య: 50,000 విధులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిన వారి సంఖ్య: 10,000 సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించిన వారి సంఖ్య: 48,500 ఆర్టీసీ ద్వారా నడపాలని నిర్ణయించిన బస్సులు:10,000 ఇందులో పూర్తిగా ప్రభుత్వమే నడిపేవి: 5,000 వీటి కోసం కావాల్సిన పూర్తి సిబ్బంది సంఖ్య(అంచనా): 28,000 -
‘కర్రు కాల్చి వాత పెడతారు జాగ్రత్త..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఎయిర్‌బస్‌పై ఉన్న ప్రేమ ఎర్రబస్సుపై లేదని విమర్శించారు. ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈస్ట్‌మన్ కలర్ సినిమా చూసిస్తున్నారని మండి పడ్డారు. సీఎం ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 1200 మంది ఉద్యోగులే ఉన్నారన్న కేసీఆర్ ప్రకటన రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ చేస్తే.. కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్తామని.. కర్రు కాల్చి వాత పెట్టే సందర్భం వస్తుందని రావుల హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు: తమ్మినేని ఆర్టీసీ సమ్మెకు సీపీఎం పూర్తి మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశానికి హాజరైన తమ్మినేని ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌కు పాలేర్లు కాదని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె నూటికి నూరు శాతం జయప్రదమవుతున్న సమ్మె అని స్పష్టం చేశారు. సమ్మెకు మద్దతు తెలపడానికి టీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ మాటలు ఆయన అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మండి పడ్డారు. -
ఆర్టీసీ సమ్మె రేపు ఆఖిలపక్ష సమావేశం
-
ఆర్టీసీ సమ్మె: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చంచేందుకు ఆర్టీసీ జేఏసీ బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగే ఈ సమావేశంలో తమ భవిషత్తు కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన జరిగే.. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించామని జేఏసీ తెలిపింది. సమ్మెని విరమించి విధుల్లో చేరాలని ఓ వైపు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తాత్కలికంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు వాహానాలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు పూర్తి కార్యాచరణ రంగం సిద్ధం చేశారు. మరోవైపు డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మెను విరమించేదే లేదని కార్మికులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే జేఏసీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. -
ఆర్టీసీ సమ్మె: కార్మికుల ఉద్యోగాలు ఊడినట్టేనా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. సంస్థలో ఇక మిగిలింది1200 మంది ఉద్యోగులు మాత్రమే అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లో చేరని వారిని ఇక ఉద్యోగులుగా గుర్తించమని సీఎం ప్రకటించారు. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన మొదలైంది. ఇక తమ ఉద్యోగాలు పోయినట్టేనని కొంతమంది కలవరపడుతున్నారు. ఇదిలావుడంగా సమ్మెపై ప్రభుత్వ ప్రకటనకు భయపడేదిలేదని, ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఉద్యోగుల భవిష్యత్తులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సీఎం ప్రకటనతో సమ్మె చేస్తున్నవారంతా ఉద్యోగాలు కోల్పోయినట్లేనా? కార్పొరేషన్ ఉద్యోగులను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే గతంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులపై తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరించింది. తమిళనాడులో ఏం జరిగింది.. 2003లో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో అక్కడి టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులు దాదాపు లక్షా 70వేల మంది సమ్మెకు దిగారు. ప్రభుత్వం బుజ్జగించినా వారు దిగిరాకపోవడంతో ఒక్క కలంపోటుతో లక్షా 70వేల మందిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తూ జయ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయడం అప్పట్లో దేశంలోనే సంచలనం సృష్టించింది. అయితే ఆ ఆదేశాల తరువాత అక్కడ ఉద్యోగులు, ప్రతిపక్ష డీఎంకే సహాయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే నైతిక హక్కు లేదని, అయితే, మానవతా దృక్పథంతో ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పి వారంతా ఉద్యోగాల్లో చేరవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగులను వెనక్కి తీసుకోం..సగం బస్సులు ప్రైవేటుకు ఆర్టీసీని మూడు రకాలుగా విభజిస్తాం : కేసీఆర్ ''ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఆర్థిక, పారిశ్రామిక కార్యక్రమాలను స్తంభింపజేసే హక్కు రాజకీయ పార్టీలు లేదా సంస్థలకు లేదు'' అని జస్టిస్ ఎంబీ షా, జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. కార్మిక సంఘాలకు యాజమాన్యంతో బేరసారాలు సాగించే హక్కు ఉన్నప్పటికీ సమ్మె చేసే హక్కు లేదని జస్టిస్ ఎంబీ షా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో సమ్మెలో పాల్గొన్నవారిలో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెబుతూ, మళ్లీ సమ్మెకు దిగమని ప్రమాణపత్రం దాఖలు చేసిన 1,56,106 మంది ఉద్యోగులను ప్రభుత్వం మళ్లీ విధుల్లోకి తీసుకుంది. కానీ అంతకు ముందు పిటిషన్‌పై స్పదించిన మద్రాస్ హైకోర్టు ఉద్యోగులను విధుల్లోనుంచి తీసివేయడం సరైన నిర్ణయం కాదని తీర్పునిచ్చింది. కార్మికులకు సమ్మెచేసే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే సమ్మెకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా సమ్మెకు దిగినవారిపై ప్రభుత్వం ఏరకమైన చర్యలపైనా తీసుకుకోవచ్చని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా తమిళనాడులో ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో జయలిత పార్టీ 37 స్థానాలకు పడిపోయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇదిలావుండగా.. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తే న్యాయస్థాలను ఆశ్రమిస్తామని టీఆఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఇదివరకే ప్రకటించారు. సమ్మె చేయడం చట్టబద్దమేనా? ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ - 1947 సమ్మె గురించి నిర్వచించింది. ఇందులోని సెక్షన్ 2 (క్యూ) సమ్మెను వివరిస్తుంది. దీని ప్రకారం సమ్మె అంటే ఏదైనా పరిశ్రమలో పనిచేసే కార్మికులు సంఘటితంగా పనులు నిలిపివేయడం, కొనసాగించడం చేయవచ్చు. సెక్షన్ 22 (1) ప్రకారం సమ్మె అనేది చట్టం చెప్పిన విధానాన్ని అనుసరించాలి. లేకపోతే ఆ సమ్మెను చట్టవిరుద్ధంగా భావించవచ్చు. ఈ చట్టం సమ్మె హక్కులపై కొన్ని ఆంక్షలను విధించింది. కాంట్రాక్టును ఉల్లంఘిస్తూ ప్రజా సంబంధిత సేవా సంస్థల్లో పనిచేసే ఏ వ్యక్తి ముందస్తు నోటీసు లేకుండా సమ్మెకు దిగకూడదని పేర్కొంది. -
ఆర్టీసీ సమ్మె: ఖమ్మంలో ఉద్రిక్తత
సాక్షి, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఖమ్మం రీజియన్ డిపో ఆర్టీసీ కార్మికులు.. మేయర్ కారును అడ్డుకొని.. ఆందోళనకు దిగారు. మేయర్ కారు ముందుకుపోకుండా కార్మికులు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో మేయర్ కారు...ఆర్టీసీ కార్మిక నేత పాదంపైనుంచి వెళ్లడం.. కార్మికులకు ఆగ్రహం తెప్పించిందీ. దీంతో కారుకు అడ్డంగా ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తప్పించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. మహమూబ్ నగర్లో ప్రశాంతంగా సమ్మె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడవ రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది. మొదటి రోజు 9 డిపోల పరిధిలోని 880 బస్సులను పోలీసుల పహారా మధ్య నడిపించారు. ఆర్టీసీ బస్టాండ్, డిపోల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. -
ప్రైవేట్‌కే పండగ!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ రోజుల్లోహైదరాబాద్–విజయవాడ నాన్ ఏసీబస్ చార్జీ రూ.370, ఖమ్మంకు రూ.250, కరీంనగర్‌కు రూ.200... కానీ ఆదివారం వరుసగా రూ.900, రూ.500, రూ.400 వసూలు చేశారు. ఇలా ఒక్క ప్రాంతమని కాదు... తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతానికైనా రెట్టింపు చార్జీలు వడ్డిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం ప్రైవేట్‌వాహనాలకు అనుమతులివ్వడంతోఅందినకాడికి దండుకుంటున్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల్లోనూ దోపిడీపర్వంకొనసాగిస్తున్నారు. ఓవైపు సమ్మె... మరోవైపు ‘ప్రైవేట్’ దోపిడీతోప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొన్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు దాదాపు 50శాతం అధిక చార్జీలుసమర్పించారు. దీంతో ప్రయాణికుల పండగ సంబరం ఆవిరి కాగా... ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇక ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుంచిఆదివారం రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు దాదాపు 2వేల బస్సులునడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటిలో సింహభాగంఅద్దె బస్సులే ఉన్నాయని చెప్పారు. అంతటా దోపిడీ... గ్రేటర్ పరిధిలో 29 డిపోల్లోని మొత్తం 3,800 బస్సులకు గాను.. ఆదివారం కేవలం 1,200 బస్సులే రోడ్డెక్కాయి. వీటిలో 370 అద్దె బస్సులున్నట్లు అధికారులు తెలిపారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో బస్సులను నడిపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ బస్సుల్లోనూ కండక్టర్లు చేతివాటం ప్రదర్శించి ప్రయాణికుల జేబులు గుల్ల చేశారు. తక్కువ దూరాలకు రూ.10 చార్జీకి రూ.20 వసూలు చేసి దోపిడీ చేశారు. విధిలేని పరిస్థితుల్లో ప్రయాణికులు అడిగినంత సమర్పించుకున్నారు. ఇక ఆటోలు, క్యాబ్‌లలోనూ దోపిడీ కొనసాగింది. పలు ప్రధాన మార్గాల్లో స్వల్ప దూరాలకే రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. క్యాబ్ సర్వీసుల్లో అదనపు శ్లాబు రేట్లు, సర్ చార్జీల పేరుతో ప్రయాణికులను నిలువు దోపిడీ చేశారు. కార్మికులు ఆదివారం డిపోల ఎదుట బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. తాత్కాలిక ఉద్యోగులను అడ్డుకోగా పోలీసులు జోక్యం చేసుకొని బస్సుల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. రైళ్లలో రద్దీ... సమ్మె నేపథ్యంలో మెట్రో, ఎంఎంటీఎస్, సాధారణ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సుమారు 127 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో దాదాపు 1.75 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ రూట్లలో రద్దీని బట్టి ప్రతి మూడు, ఐదు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. సుమారు 100 అదనపు సర్వీసులను నడిపినట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వీసుల్లో ఆదివారం సుమారు 4లక్షల మంది జర్నీ చేశారన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనూ రద్దీ నెలకొంది. రైళ్లలో సీట్లు, బెర్తులు దొరక్క ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ నష్టం.. రూ.6 కోట్లు గ్రేటర్ పరిధిలోని 29 డిపోల్లో తాత్కాలిక ఉద్యోగుల సాయంతో అరకొరగా బస్సులు నడుపుతుండడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడింది. ఆదివారం కేవలం రూ.12 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. తాత్కాలిక కండక్టర్లు అందినకాడికి దండుకోవడం, టికెట్ల జారీపై వారికి స్పష్టత లేకపోవడంతో ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. గ్రేటర్ ఆర్టీసీకి శని, ఆదివారాల్లో ఏకంగా రూ.6 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. -
గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత
-
ఆర్టీసీ సమ్మె: అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గన్ పార్క్ వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ అరెస్టులపై ఆర్టీసీ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వస్తే అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమని, తమను అక్రమంగా అరెస్ట్ చేశారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. అరెస్టయిన జేఏసీ నేతలను వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని మహంకాళి పీఎస్‌కు తరలించగా.. జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని సైఫాబాద్ పోలీసు సేష్టన్‌కు తరలించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నివాళులర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్దకు తరలివస్తున్నఆర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గన్ పార్క్ వద్ద ధర్నా, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం తాము గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివారులర్పించడానికి వచ్చామని, దీనికి అరెస్టు చేయడమేమిటని మండిపడుతున్నారు. మరికాసేపట్లో గన్ పార్క్ వద్దకు ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల నేతలు వచ్చే అవకాశముండటంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరాహార దీక్ష చేపట్టాలనుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తలపెట్టిన ఆర్టీసీ జేఏసీ నిరాహార దీక్షను వాయిదా వేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు. టీఎస్ ఆర్టీసీలో కొత్త నియామకాల నేపథ్యంలో డ్రైవర్, కండక్టర్ అభ్యర్థులు డిపోల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె: జేఏసీ నేతల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరాహార దీక్ష చేపట్టాలనుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తలపెట్టిన ఆర్టీసీ జేఏసీ నిరాహార దీక్షను వాయిదా వేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. భవిష్యత్తు కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపేది లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. పండగ సమయంలో సమ్మెకు దిగి ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన తప్పిదం చేశారన్నారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లో చేరని ఉద్యోగులను తిరిగి తీసుకోబోమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. మరోవైపు ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని ఆర్టీసీ జేఏసీ స్పష్టంచేసింది. తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్తామంటోంది. తాము జీతాల కోసం సమ్మె చేయడం లేదని...ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నామని అన్నారు. -
‘ఆర్టీసీని హస్తగతం చేసుకునేందుకు కుట్ర’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయన అహంకారానికి పరాకాష్ట అని సీఎల్పీనేత భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమని, కార్మికులు వారి కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ దేశం ఇచ్చిన కార్మిక చట్టాల ద్వారా సమ్మె చేయడం ఒక భాగమని అన్నారు. ఈ మేరకు భట్టి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కార్మికులతో చర్చలు జరిపి సమస్యకు ఒక సానుకూల పరిష్కారం చూపడం ప్రభుత్వం బాధ్యత. సమ్మెకు దిగిన ఉద్యోగులతో చర్చలు జరపకుండా.. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం.. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంభావనికి నిదర్శనం’ అన్నారు. చదవండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదు.. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పై అధిక పన్నులు వేసి ఆర్టీసీ నష్టాలకు కారణం అయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్టీసీ అనేది ప్రభుత్వం ఆస్తి. ఆ ఆస్తులను ప్రభుత్వం సంరక్షించాలి. కోరికల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయనలోని ఫ్యూడల్ మనసత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఒక రాచరిక పరిపాలన చేస్తున్నట్లు ఉంది తప్ప ప్రజాస్వామ్య పాలన చేస్తున్నట్లు లేదు. ఆర్టీసీ కార్మికులు తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్టీసీ వ్యవహారంలో ముఖ్యమంత్రి వ్యహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఆ సంస్థను హస్తగతం చేసుకునేందుకే అంతర్లీనంగా కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోంది. కార్మికుల పక్షాన మేము నిలబడటం’ అని విక్రమార్క పేర్కొన్నారు. -
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
-
సమ్మెపై ముసిగిన సీఎం కేసీఆర్ సమీక్ష
-
రేపటి సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసుల లాఠీచార్జ్
-
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభం
-
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
-
చిలుకూరుకు చార్జి రూ. 200
గొల్కొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సందట్లో సడేమియా అన్నట్లుగా ప్రైవేట్ వాహనాలవారు అందినకాఇకి దోచుకున్నారు. ట్యాక్సీ, ఆటో నిర్వాహకులు మెహిదీపట్నం నుంచి టోలిచౌకీకి ఒక్కో ప్రయాణికుడికి రూ.30, లంగర్‌హౌస్‌కు రూ.40 చొప్పున వసూలు చేశారు. మరోవైపు సుమోలు, తుఫాన్ల వారు చేవెళ్లకు ఒక్కో వ్యక్తికి రూ.350 నుంచి 400, చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు రూ.200, గచ్చిబౌలికి రూ.100 వసూలు చేశారు. మహిళల పాట్లు ఎన్నో నేను రోజూ దిల్సుఖ్నగర్ నుంచి బండ్లగూడ వెళ్లాలి. బస్సులు దొరక్క ఆటోలో ఆఫీసుకు వెళ్లడంతో ఖర్చు రెట్టింపైంది. మరోవైపు సకాలంలో ఆఫీసుకు చేరుకోలేక ఇబ్బంది పడ్డాం. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ సమ్మె వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయి.–కె.భారతి, పీ అండ్ టీ కాలనీ,దిల్సుఖ్నగర్ పూల కోసం వస్తే సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని పూలు కొనుగోలు చేసేందుకని షాద్‌నగర్ చిన్నరేవల్లి నుంచి నగరానికి వచ్చాను. కాని బస్సులు నడవక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎక్కువ డబ్బులు చెల్లించి తుపాన్ వాహనంలో వచ్చాను. పండుగ సమయం కావడంతో తిరిగివెళ్లేసమయంలో మరింత ఇబ్బంది ఎదురవుతోంది. –మల్లారెడ్డి, చిన్న రేవల్లి ఉద్యోగానికివెళ్లడం కష్టమైంది... నేను బాలానగర్ మండలానికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. రూ.65 టికెట్‌కు గాను రూ.35 అదనంగా చెల్లించి వెళ్లాను. అధికంగా ఎక్కువ తీసుకుంటున్నావని ప్రశ్నిస్తే ఇష్టం లేకుంటే దిగిపో అంటున్నారు. బస్సులు నడవని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. –సాజిదా బేగం, ఉద్యోగిని -
అమ్మా.. బస్సుల్లేవ్ టైమ్ పడ్తది!
ఆర్టీసీ సమ్మెతో సిటీ బస్సులుశనివారం ఎక్కడివి అక్కడేనిలిచిపోయాయి. మూడు వేల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సుల్లేక జేబీఎస్, ఎంజీబీఎస్ సహా ఆయా ప్రాంతాల్లోని బస్టాండ్లు వెలవెలబోయాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు వాహనాలు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులువస్తాయేమోనని గంటల తరబడి బస్టాపులలో పడిగాపులు కాశారు. ఫలితం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు దోపిడీకి పాల్పడ్డారు. రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగాఆర్టీఏ రెండు వేల ప్రైవేట్, మినీ, స్కూల్ బస్సులు ఏర్పాటుచేయడం, తాత్కాలిక సిబ్బంది సహాయంతో బస్సులు నడపడంతో కొంత ఊరట లభించింది. మరోవైపు సమ్మె నేపథ్యంలో మెట్రో రైళ్లు కిటకిటలాడాయి. సమయాన్ని పొడిగించి, అదనపు ట్రిప్పులునడపడంతో రికార్డు స్థాయిలో ప్రయాణికులు పయనించారు. సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో శనివారం ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. సిటీ బస్సులతో పాటు దూరప్రాంతాలకు వెళ్లేవి సైతం స్తంభించాయి. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని 29 డిపోలలో సుమారు 3,000 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కండక్టర్లు, డ్రైవర్లు, సూపర్వైజర్లు, మెకానిక్‌లు తదితర అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ తదితర బస్ స్టేషన్లలో, డిపోల వద్ద కార్మికులు ఆందోళన చేశారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమ్మె సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ అద్దె బస్సులను రోడ్డెక్కించింది. తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన కండక్టర్లు, డ్రైవర్ల సహాయంతో కొన్ని బస్సులను నడిపించారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తాత్కాలిక పర్మిట్లపై ప్రైవేట్ బస్సులు, కాంట్రాక్ట్, టూరిస్టు, స్కూల్ బస్సులను ఏర్పాటు చేశారు. ఓవైపు దసరా రద్దీ, మరోవైపు సమ్మెతో ప్రైవేట్ ఆపరేటర్లు రెచ్చిపోయారు. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రైవేట్ వాహనాల్లో చార్జీలపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. ఇక ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్స్టేషన్లు, డిపోల వద్ద భారీ ఎత్తున మోహరించారు. రోడ్డెక్కిన బస్సులకు భద్రత కల్పించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ స్వయంగా హకీంపేట్, కుషాయిగూడ తదితర డిపోల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. సమ్మె దృష్ట్యా ప్రైవేట్ బస్సులు, టాటాఏస్‌లు, వ్యక్తిగత వాహనాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో పలు చోట్ల ట్రాఫిక్‌జామ్ అయింది. ప్రయాణికుల కోసం ఆర్టీఏ చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సత్ఫతాలినిచ్చాయి. కానీ చార్జీల దోపిడీని నియంత్రించలేకపోయారు. మరోవైపు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఆటోలు, సెవెన్ సీటర్ ఆటోలు, క్యాబ్‌లు కూడా అందుబాటులో ఉండడంతో ప్రయాణికుల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. కొన్ని మార్గాల్లో రాకపోకలు గ్రేటర్‌లోని అన్ని డిపోల పరిధిలో మొదటి రోజు 798 బస్సులు నడిపారు. ఇందులో 345 అద్దె బస్సులున్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన 826 మంది కండక్టర్లు, డ్రైవర్ల సహాయంతో 453 బస్సులను నడిపినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే సికింద్రాబాద్–ఉప్పల్, జేబీఎస్– అఫ్జల్‌గంజ్, దిల్సుఖ్నగర్–కోఠి, బీహెచ్ఈఎల్–సికింద్రాబాద్ తదితర రూట్లలో ఇవి నడిచాయి. అలాగే జేఎన్టీయూ, సికింద్రాబాద్, పర్యాటకభవన్, తార్నాకల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 40 ఎలక్ట్రిక్ ఓల్వో బస్సులు యథావిధిగా నడిచాయి. త్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు కొనసాగుతున్నాయని.. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గ్రేటర్ జోన్‌లోని మొత్తం 19,903 మంది కండక్టర్లు, డ్రైవర్లు, అధికారులు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందిలో 55 మంది అధికారులు, 179 మంది సెక్యూరిటీ సిబ్బంది, మరో ముగ్గురు సూపర్వైజర్లు మాత్రమే శనివారం విధులకు హాజరయ్యారు. మిగతా 19,666 మంది విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు కంటోన్మెంట్, దిల్సుఖ్నగర్ డిపోల్లో ఇద్దరు కండక్టర్లు మాత్రం విధుల్లో చేరారు. ‘ప్రైవేట్’లో దోపిడీ పర్వం.. సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ వాహనాల దోపిడీ కొనసాగింది. ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేశారు. ప్రైవేట్ బస్సులు, వివిధ రకాల వాహనాలకు రవాణా అధికారులు ఎడాపెడా పర్మిట్లు ఇవ్వడం మినహా చార్జీలపై ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోలేదు. శనివారం ఒక్కరోజే సుమారు 2,000 వాహనాలకు తాత్కాలిక పర్మిట్లు ఇచ్చారు. వీటిలో స్కూల్ బస్సులు కూడా ఉన్నాయి. కొన్ని బస్సులు సిటీలో తిరిగాయి. కానీ ఎక్కువ శాతం దూరప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. ఈ బస్సుల్లో చార్జీలపై నియంత్రణ లేకపోవడంతో ఎల్బీనగర్ నుంచి విజయవాడకు సాధారణంగా రూ.450 వరకు చార్జీ ఉంటే.. రూ.900 వరకు వసూలు చేశారు. అలాగే ఉప్పల్ క్రాస్‌రోడ్స్ నుంచి హన్మకొండ వరకు సాధారణ రోజుల్లో రూ.150 ఉంటే.. రూ.350కి పెంచారు. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి కరీంనగర్ వరకు రూ.200 చార్జీ కాగా... రూ.450 వరకు తీసుకున్నారు. దసరా కావడంతో ప్రయాణికులకు మరో గత్యంతరం లేకుండా పోయింది. మినీ బస్సులు, టాటాఏస్‌లతో పాటు క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు తదితర అన్ని వాహనాల్లో దోపిడీ పెద్ద ఎత్తున కొనసాగింది. ఇక నగరంలోనూ సెవెన్ సీటర్ ఆటోలు, మూడు సీట్ల ఆటోలు ప్రయాణికుల జేబులు లూఠీ చేశాయి. సికింద్రాబాద్ నుంచి తార్నాక వరకు రూ.20 చార్జీ ఉంటే సెవెన్ సీటర్ ఆటోలు రూ.50 వరకు తీసుకున్నాయి. సాధారణ రోజుల్లోనే అడ్డగోలుగా చార్జీలు వసూలు చేసే ఆటోవాలాలు సమ్మెను మరింత సొమ్ము చేసుకున్నారు. అలాగే సమ్మె కారణంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్ తదితర ఆసుపత్రులకు వచ్చే ఔట్పేషెంట్ల సంఖ్య కూడా సగానికి తగ్గిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎంక్వైరీలో ఎవ్వల్లేరు! అఫ్జల్‌గంజ్: సమ్మె విషయం తెలియక శనివారం ఇమ్లీబన్ బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు ఏ సమయానికి వస్తాయో? అసలు వస్తాయో లేదో? అనే విషయం కనుక్కుందామని ప్రయాణికులు విచారణ కేంద్రానికి వెళ్తే, అక్కడ సమాధానం చెప్పేవారే కరువయ్యారు. ఎంతసేపైనా బస్సులు రాకపోయేసరికి చేసేదేమీ లేక కొందరు ప్రయాణం వాయిదా వేసుకొని వెనుదిరిగి వెళ్లారు. మరికొందరు అందుబాటులో ఉన్న ట్రావెల్స్‌ను ఆశ్రయించారు. చార్జీలకే సగం కూలీ ప్రతిరోజు తూప్రాన్ నుంచి మేడ్చల్‌కు కూలీ పని కోసం వస్తాను. రోజంతా పనిచేస్తే రూ.200 ఇస్తారు. సమ్మె కారణంగా శనివారం ఆటోలో వచ్చాను. సాధారణ రోజుల్లో అయితే రూ.20 తీసుకుంటారు. కానీ సమ్మె అని రూ.50 వసూలు చేశారు. రానూపోను రూ.100 చార్జీలకే పోయింది. ఇక సగం కూలీనే నాకు మిగిలింది. – లక్ష్మీ, తూప్రాన్, మెదక్ జిల్లా సమ్మె సరికాదు దసరా సమయంలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్తారని తెలిసి కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం సరికాదు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో తగిన నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది. బస్సుల్లేకప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కోవాల్సి వస్తోంది. శనివారం కార్యాలయాలకు వెళ్లేందుకుఉద్యోగులు నానాపాట్లు పడ్డారు. – మహేశ్వర్‌గౌడ్, అంబేడ్కర్ వర్సిటీ -
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఫోకస్
-
సిటీలో స్తంభించిన ప్రజా రవాణా
ఇదీ విరుగుడు: సమ్మె నేపథ్యంలో ఆర్టీఏ, ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి. ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు మంజూరు చేస్తుండగా.. డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తున్నాయి. మరోవైపు మెట్రో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మెట్రో రైళ్లు శనివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 3–5 నిమిషాలకు ఒక రైలు ఉంటుందన్నారు. అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. డబుల్ బాదుడు :సమ్మెపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంతో ప్రైవేట్ ఆపరేటర్లు దోపిడీ పర్వం కొనసాగిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే చార్జీలను రెండింతలు చేశారు. హైదరాబాద్ – విజయవాడకు సాధారణ రోజుల్లో ఏసీ బస్సు చార్జీ రూ.450 వరకుంటే.. ఇప్పుడది రూ.900. అలాగే వైజాగ్‌కు చార్జీని రూ.860 నుంచి రూ.1,500 వరకు పెంచారు. అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సు ఆగింది.. సమ్మెతో స్తంభించింది.. డిపోలకే పరిమితమైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నగరం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని దూరప్రాంతాలకు వెళ్లే కొన్ని బస్సులను శుక్రవారం రాత్రి నుంచేనిలిపివేశారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని 29 డిపోలలో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు,రీజినల్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మినహా మిగతా 19వేల మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సూపర్వైజర్లు తదితర సిబ్బంది సమ్మెలోకి వెళ్లారు. కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి రావడంతో కార్మికులంతా ఒక్కటై సమ్మె చేస్తున్నారు. దీంతో నగరంలో రాకపోకలు సాగించే 3,850 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. మరోవైపు సమ్మెను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం చాలామంది సొంతూళ్లకు వెళ్లారు. ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్ కిటకిటలాడాయి. ఏపీలోని విజయవాడ, గుంటూరు, తిరుపతి, వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాలతో పాటు బెంగళూరు, ముంబై, షిర్డీ, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర దూరప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను శుక్రవారం రాత్రి నుంచే నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే టీఎస్ ఆర్టీసీ ముందస్తు బుకింగ్‌లు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలివీ... కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించారు. డిపోల వారీగా తాత్కాలిక సిబ్బందిని నియామకానికి చర్యలు చేపట్టారు. కనీసం 18 నెలల సీనియారిటీతో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారిని, పదో తరగతి పాసైన వారిని డ్రైవర్లుగా, కండక్టర్లుగా నియమించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఈ నియామకాలు జరుగుతున్నాయని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. అలాగే సుమారు 250 అద్దె బస్సులను యథావిధిగా నడిపేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రిటైర్డ్ ఉద్యోగులను కూడా తాత్కాలికంగా నియమించుకోనున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలో తిరిగే 1.4 లక్షల ఆటోలతో పాటు వివిధ జిల్లాల నుంచి నగర శివార్లలోకి రాకపోకలు సాగించే మరో 50 వేల ఆటోలను కూడా సిటీలోని అన్ని ప్రాంతాలకు అనుమతినిస్తున్నారు. మరో 50వేలకు పైగా ఉన్న సెవెన్ సీటర్ ఆటోలపై తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రతి 5 నిమిషాలకు ఒక ట్రిప్పు చొప్పున తిరుగుతున్న మెట్రో రైళ్లు ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున నడుస్తాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రాత్రి 11:30 గంటల వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. 121 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, బేగంపేట్, లింగంపల్లి, హైటెక్ సిటీ లాంటి ప్రధాన రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రైవేట్ బస్సులకు అనుమతి దసరా సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రవాణా అధికారులు ప్రైవేట్ బస్సులకు ప్రత్యేక అనుమతులిస్తున్నారు. 12,000 స్కూల్ బస్సులను కూడా అద్దె ప్రాతిపదికపై నడపనున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్, టూరిస్టు బస్సులను స్టేజీ క్యారేజీలుగా తిప్పుతారు. అలాగే పోలీసు భద్రతతో బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా నగరంలో ఆటోవాలాలు, ఇతర ప్రైవేట్ వాహనాలు పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపనున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు జేటీసీ పాండురంగ్ నాయక్ చెప్పారు. మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైళ్లు శనివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. రద్దీని బట్టి ప్రతి మూడు, ఐదు నిమిషాలకో రైలును నడుపుతామన్నారు. రద్దీ పెరిగితే రైళ్ల ఫ్రీక్వెన్సీని అప్పటికప్పుడు తగ్గిస్తామన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అమీర్‌పేట్, ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్ స్టేషన్ల నుంచి రాత్రి 11:30 గంటలకు చివరి రైలు బయలుదేరి అర్ధరాత్రి 12:30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందన్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ రూట్లలోని స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్అండ్టీ సీనియర్ అధికారులు రద్దీ నియంత్రణకు ఎల్బీనగర్, అమీర్‌పేట్, హైటెక్‌సిటీ, సికింద్రాబాద్ ఈస్ట్, పరేడ్‌గ్రౌండ్స్ తదితర స్టేషన్లలో స్వయంగా రంగంలోకి దిగుతారన్నారు. ప్రయాణికులు క్రమశిక్షణను పాటించి క్యూలైన్లలో స్టేషన్లు, రైళ్లలోకి చేరుకోవాలని ఎన్వీఎస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులకు సహాయ పడాలని కోరారు. స్మార్ట్‌కార్డుల కొనుగోలు ద్వారా టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గుతుందన్నారు. డిపోకు ఒక ఆఫీసర్ అఫ్జల్‌గంజ్: సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజినల్ మేనేజర్ బి.వరప్రసాద్ తెలిపారు. ఎంజీబీఎస్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... డిపోల వారీగా పోలీసు, రెవెన్యూ, ఆర్టీసీ అధికారులతో కమిటీ వేసి, వారి సహకారంతో బస్సులను నడపనున్నట్లు చెప్పారు. అలాగే డిపోకు ఒక ఆఫీసర్‌ను కేటాయించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామన్నారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే బస్సులు సీబీఎస్ (పాత బస్టాండ్)లో... సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లో ఉంటాయన్నారు. అలాగే హన్మకొండ, వరంగల్, నర్సింపేట్, పరకాల, జనగాం, తొర్రూరు, యాదగిరిగుట్ట వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్‌రోడ్డు నుంచి... కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట్ వైపు వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం చేసిన ఈ మార్పులను గమనించాలని సూచించారు.