సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ బస్సులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి (శుక్రవారం) గ్రేటర్‌లో బస్సులను నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం బస్సులను తిప్పేందుకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాక్‌డౌన్ మార్గదర్శకాలను పాటిస్తూ.. 25 శాతం సర్వీసులు నడపాలని నిర్ణయించారు. లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఆరు నెలల తరువాత నగరంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. దీనిపై మరికాసేపట్లో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అలాగే మార్చి ఉంచి నిలిచిపోయిన మహారాష్ట్ర, కర్ణాటక బస్సులు కూడా నడిపేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ మేరకు రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఏపీ సర్వీసులపై మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. (జీతాలు ఇచ్చేదెట్లా?)
Comments
Please login to add a commentAdd a comment