పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకు తెలంగాణ టీడీపీ మద్దతు తెలిపింది. ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు.
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకు తెలంగాణ టీడీపీ మద్దతు తెలిపింది. ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు. గత సంప్రదాయలను అనుసరించి పాలేరు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు చనిపోతే ఆ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ప్రతిపాదనను టీడీపీనే తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సుచరితకు మద్దతు తెలుపుతున్నమన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపాలని రమణ కోరారు. టీడీపీ నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలో దిగుతారని అనుకున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తుదిపోరులో అధికార పార్టీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తలపడనున్నాయి.
ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్‌గా ఉంటూ అకాలమరణం చెందిన వెంకట్‌రెడ్డి స్థానంలో ఆయన కుటుంబీకులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశమివ్వాలని టీపీసీసీ ప్రతిపాదించింది. కానీ అధికార టీఆర్‌ఎస్ స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి భార్య సుచరిత బరిలో ఉండగా, టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉన్నారు. మే16న పోలింగ్, 19న కౌంటింగ్ జరగనుంది.