almaty city
-
చాట్ జీపీటీ సాయంతో కేసు గెలిచాడు..!
సినిమాల్లో మాదిరి పంచ్ డైలాగ్స్తోనూ, నవ్వులు కురిపించే వాదనలతో కాదు. కేవలం, పదే పది నిమిషాల్లో సూటిగా సుత్తిలేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా, అసలు లానే చదవకుండా వాదించాడు ఈ లాయర్. ఆ లాయర్ పేరే ‘చాట్ జీపీటీ’. తాజాగా ఓ కుర్రాడు ఈ టెక్నాలజీ సాయంతోనే కోర్టులో తన కేసు గెలిచాడు. కేసు వాదనలు పట్టుమని పది నిమిషాల్లోనే పూర్తయిపోయాయి. వాయిదాల లాయర్ల మాదిరిగా కాకుండా, చాట్ జీపీటీ ఫటాఫట్ కేసు ముగించేసింది. కజక్స్తాన్లోని అల్మాటీ నగరానికి చెందిన కెంజెబెక్ ఇస్మాయిలోవ్ తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో, బేస్‌లైన్ క్రాస్ చేసి, ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించాడు. ఈ అపరాధానికి ప్రభుత్వం అతనికి పదకొండు డాలర్లు (అంటే రూ.940) జరిమానా విధించింది. పుట్టి బుద్ధెరిగాక ఎప్పుడూ కోర్టుకు వెళ్లని ఇస్మాయిలోవ్కి కోర్టు పద్ధతులు తెలియవు. తన కేసును వాదించడానికి లాయర్ల సాయం తీసుకోకుండా, చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. అది అతనికి కోర్టులో సవాలు చేయమని సలహా ఇవ్వడమే కాదు, కేసు దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసింది. పది నిమిషాల విచారణలో, జడ్జి అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ స్పీచ్ సింథసిస్ ఫీచర్ ద్వారా అతను సమాధానాలు ఇచ్చాడు. చాట్ జీపీటీ వాదన ఎంతో సమర్థంగా ఉండటంతో జడ్జి జరిమానాను రద్దు చేశారు. (చదవండి: -
టేకాఫ్ అవుతుండగానే ఘోర ప్రమాదం
నూర్ సుల్తాన్ : కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆల్మటీ ఎయిర్పోర్ట్ నుంచి టెకాఫ్ అవుతున్న సమయంలోనే విమానం అదుపు తప్పి కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 95 మంది ప్రయాణికులతో పాటు, 5గురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్టుగా అధికారులు ధ్రువీకరించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం కజకిస్తాన్‌లోని ప్రధాన నగరం ఆల్మటీ నుంచి రాజధాని నూర్ సుల్తాన్‌కు బెక్ ఎయిర్‌కు చెందిన విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అవుతున్న సమయంలోనే విమానం గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కొల్పోయింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే రెండతస్తుల బిల్డింగ్‌ను ఢీ కొట్టింది. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన భద్రత సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మంది చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై కజకిస్తాన్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. -
టాప్–10 చవక నగరాల్లో 4 మనవే
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే నివాసయోగ్యమైన అత్యంత చవకైన నగరాల జాబితాలో భారత్ నుంచి నాలుగింటికి చోటు దక్కింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రపంచవ్యాప్తంగా చేసిన ఈ చవక నగరాల సర్వేలో బెంగళూరుకు 3వ స్థానం, చెన్నైకి 6, ముంబైకి 7, ఢిల్లీకి 10వ స్థానాలు దక్కాయి. కజకిస్తాన్‌లోని అల్మటీ నగరం ఈ జాబితాలో మొదటి స్థానం సాధించి ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో నైజీరియాలోని లాగోస్ (2వ స్థానం), పాకిస్తాన్‌లోని కరాచీ (4), అల్జీరియా రాజధాని అల్జీర్స్ (5), ఉక్రెయిన్ రాజధాని కీవ్ (8), రుమేనియా రాజధాని బుకారెస్ట్ (9) ఉన్నాయి. అలాగే అత్యంత ఖరీదైన తొలి పది నగరాలుగా వరుసగా సింగపూర్, హాంకాంగ్, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్, జపాన్ రాజధాని టోక్యో, జపాన్‌కే చెందిన ఒసాక, దక్షిణ కొరియా రాజధాని సియోల్, స్విట్జర్లాండ్‌లోని జెనీవా, ఫ్రాన్స్ రాజధాని పారిస్, అమెరికా నగరం న్యూయార్క్, డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లు నిలిచాయి. ‘సాధారణంగా భారత ఉపఖండంలో నివసించడం తక్కువ ఖర్చుతో కూడినదేనైనా, అస్థిరత్వం దానిని మరింత చవకగా మారుస్తోంది’అని నివేదిక పేర్కొంది. చవక నగరాల్లో నివసించడంలో కొంత ప్రమాదం కూడా దాగి ఉందంది.