art festivals
-
ఆర్ట్ ఫెస్ట్.. అదిరేట్టు.. !
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగర వేదికగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎఫ్) దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కళాకారులతో, ఔస్తాహికులతో సందడి నెలకొంది. హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి అత్తాపూర్‌లోని కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్ వేదికగా నడుస్తున్న ఫెస్ట్‌లో 200 మందికి పైగా ప్రముఖ కళా కారులు రూపొందించిన 3,500 పైగా వైవిధ్యమైన కళారూపాలను ప్రదర్శించారు. ఇందులో 25 ఆర్ట్ గ్యాలరీలతో, 100 ఎయిర్ కండీషన్డ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖ కళాకారులు భాగస్వామ్యమవుతున్న ఈ ఆర్ట్ ఫెస్ట్ ఆదివారంతో ముగిసింది. ఎంఎఫ్ హుస్సేన్ వారసత్వానికి నివాళి.. ప్రఖ్యాత భారతీయ కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ మేనల్లుడు ఫిదా హుస్సేన్ ఎక్స్‌క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శన ఫెస్ట్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేదికగా తన మామతో ఉన్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. భారతదేశం నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఎంఎఫ్ హుస్సేన్ కళను పదిలపరచడంలో ప్రత్యేక బాధ్యతను తీసుకున్నట్లు వెల్లడించారు. 2006 నుంచి 2011 వరకూ ఎంఎఫ్ హుస్సేన్ బహిష్కరణ సమయంలో అతను దుబాయ్, ఖతార్‌లో తనతో నివసించారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన సృజనాత్మకతను తాను పరిరక్షించానని, ఇందులో భాగం 2017లో హుస్సేన్ సెరిగ్రాఫ్లను భారతదేశానికి తిరిగి ఇచ్చే పనిని చేపట్టానని, ఇది తమ కళా వారసత్వానికి నిదర్శనమని అన్నారు. అనంతరం ముంబై, బరోడాలో ఎంఎఫ్ హుస్సేన్ కళను ప్రదర్శించడం, సమకాలీన కళాకారులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఎక్స్‌క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించానని తెలిపారు. సృజనాత్మకతలో తత్వ శాస్త్రం.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అంజలి ప్రభాకర్ సృజనాత్మకత ఇండియన్ ఆర్టి ఫెస్ట్‌లో విశేషంగా ఆకట్టుకుంది. జీవితంలోని వివిధ కోణాలను, తత్వశాస్త్రంపై ఆమెకున్న లోతైన అవగాహనను చిత్రాల ద్వారా ప్రదర్శించారు. విజయం, ప్రేమ, ఆధ్యాత్మికతతో పాటు జీవితంలోని అనేక ఆచరణాత్మక అంశాలను అంజలి చిత్రీకరించారు. పెయింటింగ్‌లో నైపుణ్యం, 3డీ మ్యూరల్ ఆర్ట్, మధుబని పెయింటింగ్, క్రిస్టల్ రెసిన్, సెఫోరిక్స్, అబ్స్ట్రాక్ట్ వంటి కళల్లో తన సృజనాత్మకతను ఈ ఫెస్ట్‌లో ప్రదర్శించారు.భారత్‌తో పాటు విదేశాల్లో తాను సోలో, గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌లో పాల్గొన్నానని, తాను రాసిన పుస్తకం ‘ట్యూన్స్ ఆఫ్ లైఫ్’ విడుదలైందని, ప్రస్తుతం ‘మహిళల మానసిక ఆరోగ్యంలో ఆర్ట్ థెరపీ ప్రభావాన్ని అన్వేషించడం’ అనే అంశంపై పీహెచ్డీ ఎంట్రీని చేస్తున్నట్లు తెలిపారు. 16 ఏళ్లుగా అంజలి ఇన్నోవేటివ్ ఆర్ట్ శిక్షకురాలిగా కృషి చేస్తున్నానని అన్నారు. 2017లో ఇండోర్ మిరాజ్ నేషనల్ ఆర్ట్ ఫెస్ట్, బోపాల్ ‘ఆర్ట్ ఆల్కెమీ’, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ (ఆష్మి ఇనీషియేటివ్ గాంధీ ఆర్ట్ గ్యాలరీ) వంటి ప్రదర్శనలో తన చిత్రాలకు ప్రశంసలు లభించినట్లు తెలిపారు. (చదవండి: ఇంటి రుచులకు కేరాఫ్.. హోమ్ చెఫ్..!) -
హైదరాబాద్‌లో ఘనంగా ‘ఆర్ట్ ఫెస్టివల్’ ప్రారంభం (ఫొటోలు)
-
ప్రఖ్యాత కళాకారులతో హైదరాబాద్‌లో తొలిసారి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్
కళా ప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7నుం చి మూడు రోజుల పాటు జరగనుంది. ఇండియా ఆర్ట్ ఫెస్టిల్ను తొలిసారి హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతమైన కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో అలరించనున్నా యి. ఇప్పటివరకూ ప్రతి ఏటా ఢిల్లీ, బెంగళూరు , ముంబై తదితర నగరాల్లో ఈ ఫెస్టివల్ నిర్వహించగా ఇపుడు హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొం టున్నా రు. జూన్ 7న ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 9వ తేదీతో ముగుస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కొనసాగుతుందని ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు. విశేష చారిత్రక, సాంస్కృతిక చరిత్ర ఉన్న హైదరాబాద్‌లో మొదటిసారి ఇం డియా ఆర్ట్ ఫెస్టివల్ ఏర్పా టు చేస్తున్నామని ఆయన తెలిపారు. అర్ట్ ఫెస్టివల్ విశేషాలు దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మందికళాకారులు , గ్యా లరీ ఎగ్జిబిట్ లు, ఇండిపెండెంట్ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. జోగెన్ చౌదరి, మను పరేఖ్, కిషన్ ఖన్నా , శక్తి బర్మ న్, సీమా కోహ్లీ, పరేష్ మైతీ, యూసుఫ్ అరక్కల్, S G వాసుదేవ్, అం జోలీ ఎలా మీనన్, అతుల్ దోడియా, లక్ష్మా గౌడ్, టీ.వైకుంఠం , లక్ష్మ ణ్ ఏలే , అశోక్ భౌమిక్, లాలూ ప్రసాద్ షా, గురుదాస్ షెనాయ్, వినీతా కరీం , జతిన్ దాస్, పి. జ్ఞాన, రమేష్ గోర్జాల, ప్రసన్న ఎం నారాయణ్ తదితరుల కళాఖండాలు కొలువుదీరతాయి.ప్రముఖ కళాకారులు గుర్మీత్ మార్వా, లాల్ బహదూర్ సింగ్, రాయ్ కె జాన్, ఎం.వీ రమణా రెడ్డి, పిజెస్టాలిన్, ఆసిఫ్ హుస్సేన్, వివేక్ కుమావత్, భాస్కర్ రావు, యూసుఫ్, అమిత్ భర్, సుజాతా అచ్రేకర్, సుప్రియ అంబర్, తౌసిఫ్ ఖాన్, కప్పరి కిషన్, జి. ప్రమోద్ రెడ్డి, రమణారెడ్డి, కాంత ప్రసాద్, ఔత్సాహిక కళాకారులు ప్రవీణ పారేపల్లి, ఓం తాడ్కర్, పంకజ్ బావ్డేకర్, దేవ్ మెహతా, ప్రవీణ్ కుమార్, సత్య గౌతమ్ తదితరుల కళాఖండాలను ప్రదర్శనకు ఉంచుతారు. హైదరాబాద్ నుంచి ఆర్ట్స్ బ్రీజ్ ఆర్ట్ గ్యా లరీ, స్నే హ ఆర్ట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, బెంగళూరు నుంచి చార్వి ఆర్ట్ గ్యా లరీ, సారా అరక్కల్ గ్యాలరీ, న్యూ ఢిల్లీ నుంచి ఆర్ట్ హట్, గ్యా లరీ పయనీర్, ఎమినెంట్ ఆర్ట్ గ్యాలరీ, పాస్టెల్ టేల్స్ , స్టూడియో 3 ఆర్ట్ గ్యాలరీ, ఉచాన్, ముంబై నుంచి బియాండ్ ది కాన్వా స్, బొకే ఆఫ్ ఆర్ట్ గ్యాలరీ, హౌస్ ఆఫ్ ఎనర్జీ, దేవ్ మెహతా ఆర్ట్ గ్యా లరీ, మ్రియా ఆర్ట్స్ , ట్రెడిషన్స్ ఆర్ట్ గ్యా లరీ, కలాస్ట్రో ట్, రిగ్వే ద ఆర్ట్ గ్యా లరీ, స్టూడియో పం కజ్ బావ్డేకర్, ది బాం బే ఆర్ట్ సొసైటీ, తేలా ఆర్ట్ గ్యాలరీ పాల్గొంటాయి. అలాగే జ్ఞాని ఆర్ట్స్ (సిం గపూర్), ఎక్స్ క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీ (బరోడా), ది ఇండియన్ ఆర్ట్ కాటేజ్ (కోల్ కతా), కాన్వా స్ డ్రీమ్స్ ఆర్ట్ గ్యా లరీ (నాగ్ పూర్), ఎం నారాయణ్ స్టూడియో (పుణె) తదితర ఆర్ట్ గ్యాలరీలు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటాయి. కళాఖండాల ప్రదర్శనతో పాటు వివిధ రకాల ఫ్యూజన్ షోలు, సంగీత కచేరీలు, లైవ్ పెయింటింగ్ ప్రదర్శన కూడా ఉంటుంది.భారతదేశ గొప్ప కళాత్మక వారసత్వాన్ని అన్వేషించే చలన చిత్రం "ది ఎటర్నల్ కాన్వాస్ - 12,000 ఇయర్స్ జర్నీ త్రూ ఇండియన్ ఆర్ట్", హైలైట్‌గా నిలవనున్నాయి. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 2024 వైవిధ్యం, సృజనాత్మక , కళాత్మక వ్యక్తీకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. కళాభిమానులు, ఆర్ట్ కలెక్టర్స్ ఈ ప్రత్యేక సాంస్కృ తిక కార్యక్రమాన్ని చూసేందుకు బుక్ మై షోలో టికెట్స్ (299 రూపాయలు) అందుబాటులో ఉన్నాయి.ఈవెంట్ వివరాలు:ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ : జూన్ 7-9వ తేదీ వరకువేదిక: కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్, పిల్లర్ 68, పివి నర్సిం హారావు ఎక్స్ ప్రెస్ వే, రేతిబౌలి, హైదరాబాద్సమయం : ఉదయం 11:00 నుం డి రాత్రి 8:00 వరకుమరింత సమాచారం కోసం IAF డైరెక్టర్ రాజేంద్ర : 7400009978, 9820737692 -
‘భారత్ మాతా కూడా మీటూ బాధితురాలే’
చెన్నై : చెన్నై లయోలా కాలేజీలో నిర్వహించిన ఓ ఆర్ట్ ఫెస్టివల్ వివాదాస్పదంగా మారింది. ఈ నెల 19, 20 తేదిల్లో కాలేజీలో ‘స్ట్రీట్ అవార్డ్ ఫెస్టివల్’ పేరుతో ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు. ‘అక్మే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించడం కోసం ఉద్దేశించిన ఈ ఫెస్టివల్ వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని చిత్రాలు, వాటి క్యాప్షన్లు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని కించపరిచేలా ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని చిత్రాలకు ‘భారత్ మాతా కూడా మీటూ బాధితురాలే’, ‘రచయిత గౌరీ లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉంది’, ‘పీఎం మోదీ సామ్రాజ్యవాదాన్ని అనుసరిస్తారు’ అంటూ వివాదాస్పద క్యాప్షన్లు పెట్టారు. దాంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమా ఆనంద్ అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘స్ట్రీట్ అవార్డ్ ఫెస్టివల్’ అని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. స్ట్రీట్ అవార్డ్స్ అంటే.. మన జాతీయ చిహ్నాలను.. దేశ ప్రధానిని అవమానించడమేనా’ అని ప్రశ్నించారు. మరో బీజేపీ కార్యకర్త మాట్లాడుతూ.. ‘లయోలా కాలేజీ కేంద్రం నుంచి నిధులు పొందుతుంది. కానీ ఇక్కడ లౌకిక భావనను పూర్తిగా దెబ్బ తీస్తున్నారు. జాతీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ‘ఒక వేళ కాలేజీ యాజమాన్యమే ఇలాంటి కార్యకలపాలను ప్రోత్సాహిస్తుందని తెలిస్తే.. కేంద్రం నుంచి కాలేజికి వచ్చే నిధులను నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరతామ’ని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కాలేజీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. కాలేజీ ప్రాంగణాన్ని తప్పుడు కార్యక్రమాల కోసం దుర్వినియోగం చేసినందుకు తాము ఎంతో బాధపడుతున్నామని.. క్షమించమని కోరింది. -
ఆర్ట్ ఫెస్టివల్ అదుర్స్
కణేకల్లు: వారంతా దివ్యాంగులు...కానీ తమ అద్భుత కళా నైపుణ్యంతో అందరి చేత ఔరా అనిపించారు. కణేకల్లు క్రాస్‌లోని ఆర్డీటీ ఫీల్డ్ కార్యాలయంలో మంగళవారం సెంటర్‌స్థాయి దివ్యాంగుల ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు. కణేకల్లు, కదిరి, బత్తలపల్లి, బుక్కరాయసముద్రం, ఉరవకొండ, రాప్తాడు ప్రాంతాల దివ్యాంగులు రంగోళి, పిక్చర్ పెయింటింగ్, పేపర్ కటింగ్, మట్టిబొమ్మల తయారీ, న్యాచురల్ కొల్లేజ్ (ప్రకృతిలో దొరికే వస్తువులతో బొమ్మల తయారీ) పోటీల్లో పాల్గొని తమ కళానైపుణ్యం ప్రదర్శించారు. ఆర్డీటీ సీబీఆర్ డైరెక్టర్ దశరథరాముడు మాట్లాడుతూ, దివ్యాంగుల కళానైపుణ్యం అమోఘమని ప్రశంసించారు. సెంటర్‌స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన 18 మంది జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఆర్ట్‌ఫెస్టివల్ ప్రోగ్రామ్ మేనేజర్ నవ్య, ఎస్టీఎల్ నారాయణ, పద్మావతి ఉరవకొండ రీజనల్ డైరెక్టర్ మహబూబ్‌బీ, ఆర్డీటీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్సాహంగా.. ఊగింది ఉస్మానియా..