Christ Jesus
-
Easter Sunday: నవోదయాన్నిచ్చిన ఆదివారం
మానవ చరిత్రలో ఆ ఆదివారం ఎన్నటికీ మరపురానిది. ఎందుకంటే యేసుక్రీస్తు అన్ని కుట్రలనూ, దుర్మార్గాలనూ, దౌర్జన్యాలనూ పటాపంచలు చేసి సమాధినీ, మరణాన్నీ గెలిచి సజీవుడు కావడం ద్వారా దీనులు, పాపులు, నిరాశ్రయులందరికీ నవోదయాన్నిచ్చిన దినం ఆ ఆదివారం...యేసుక్రీస్తు మానవరూప ధారియైన రక్షకుడుగా ఈ లోకానికి తన పరమ తండ్రి ఆదేశాలు, సంకల్పాలను అమలుపర్చడానికి విచ్చేసిన దైవకుమారుడు, అంటే అన్నివిధాలా దేవుడే!!!. అలాగైతే జననానికి, మరణానికి, పునరుత్థానానికి దేవుడు అతీతుడు కదా... మరి ఇదంతా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న తప్పక రావాలి.నాలుగేళ్ల ఒక బాలుడు నీళ్లు పెద్దగా లేని ఒక బావిలో పడ్డాడు. అయ్యో అంటూ జనం బావి చుట్టూ గుమికూడారు. వాడసలే భయకంపితుడై ఉన్నాడు. పైగా పసితనం, అంతా గందరగోళం.. గట్టిగా ఏడుస్తున్నాడు. ఇంతలో ఒకాయన బావి వద్దకొచ్చి లోనికి తొంగి చూశాడు. వెంటనే అక్కడున్న ఒక తాడు తన నడుముకు కట్టుకొని అక్కడున్న వారితో తనను లోనికి దించమన్నాడు. అతన్ని చూసి పిల్లాడు మహదానందంతో ‘డాడీ’ అని గట్టిగా అరిచి తండ్రిని కరిచి పట్టుకున్నాడు. తండ్రి వాడిని చంకకేసుకొని గట్టిగా కరుచుకొని తమను పైకి లాగమన్నాడు. పిల్లాడు బావిలో పడిపోతే అందరికీ సానుభూతే!! కాని పర్యవసానాలాలోచించకుండా చనిపోయేందుకు కూడా తెగించి కొడుకును కాపాడుకునే శక్తి ఒక్క తల్లి, తండ్రి ప్రేమకు మాత్రమే ఉంటుంది. శుక్రవారం నాడు సిలువలో అదే జరిగింది. పాపిని కాపాడేందుకు పరమ తండ్రి కుమారుడిగా, రక్షకుడుగా చనిపోయేందుకు కూడా సిద్ధపడి యేసుప్రభువు బావిలోకి దూకాడు. నేను చనిపోయినా ఫరవాలేదు, నా కుమారుడు బతికితే చాలు అనుకునేదే నిజమైన తండ్రి ప్రేమ. పరమ తండ్రిలో ఆయన అద్వితీయ కుమారుడు, కుమారునిలో పరమ తండ్రి సంపూర్ణంగా విలీనమైన అపారమైన ప్రేమ ఆ దైవత్వానిది. బావిలోనుండి కొడుకుతో సహా బయటికొచ్చిన సమయమే యేసు మరణాన్నీ గెలిచి సజీవుడైన ఈస్టర్ ఆదివారపు నవోదయం.నేనే పునరుత్థానాన్ని... నేనే జీవాన్నిఆయన ఆరోహణుడు కావడం కళ్లారా చూసిన అనుభవంతో ఆయన అనుచరుల జీవితాలు సమూలంగా పరివర్తన చెందాయి. ఆయన సజీవుడైన దేవుడు అన్న నిత్యసత్యం వారి జీవితాల్లో లోతుగా ప్రతిష్ఠితమై వారంతా ఒక బలమైన చర్చిగా శక్తిగా ఏర్పడి, ఆ తర్వాత సువార్త సత్యం కోసం ప్రాణాలు కూడా త్యాగం చేసేందుకు సంసిద్ధమయ్యే ధైర్యాన్ని వారికిచ్చింది. మరణానికి మనిషిపై పట్టు లేకుండా చేసిన నాటి ఉదంతమే ఈస్టర్ అనుభవం. యేసుప్రభువు నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని అని కూడా ప్రకటించి, తానన్నట్టే చనిపోయి తిరిగి లేవడం ద్వారా తానే జీవాన్నని రుజువు చేసుకున్నాడు. తనలాగే విశ్వాసులు కూడా పురుత్థానం చెంది పరలోకంలో తమ దేవుని సహవాసంలో నిత్య జీవితాన్ని పొందుతారని ప్రభువు బోధించాడు.– డా. సుభక్త -
మరణమా నీ ముల్లెక్కడ?
దేవుని విమోచన కార్యక్రమంలో అత్యంత శకిమంతమైనది క్రీస్తు పునరుత్థాన శక్తే. మానవునికి మరణం తోనే జీవితం అంతం కాదని పునరుత్థానం తెలియజేసింది. ప్రతి మనిషి సదాకాలము దేవునితో కలిసి జీవించవచ్చన్న గొప్ప నిరీక్షణ కలిగింది. ఎందుకంటే యేసు అంటున్నాడు ‘పునరుత్థానం జీవం నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. బతికి నాయందు విశ్వాసముంచు వాడు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు’.శుక్రవారం సిలువ వేయబడిన యేసును తలచుకొని యూదా మతపెద్దలు యేసు ఇక శాశ్వతంగా మట్టిలో కలిసి పోయాడని సంబర పడ్డారు. వారిలో ఆ దుష్ట తలంపు పెట్టిన అపవాదియైన సాతాను దేవునిపై విజయం సాధించానని ఇక ఈ లోకం అంతా తన చెప్పు చేతల్లో ఉండిపోతుందని భ్రమ పడ్డాడు. అయినా ఎందుకైనా మంచిదని క్రీస్తును ప్రత్యేకంగా అరిమత్తయి ఏర్పాటు చేసిన సమాధి చుట్టూ ఎవరు తొలగించలేని పెద్ద రాతిని ఏర్పాటు చేశారు. బలమైన రోమా సైనికులను సమాధికి కాపలాగా పెట్టారు. క్రీస్తు మూడవ దినమున లేస్తానని చెప్పిన మాట నెరవేరకుండా శతవిధాలుగా తమ ప్రయత్నం వారు చేశారు. ఇక ఏసు చరిత్ర శాశ్వతంగా ఖననం చేశామని ఇక ఎప్పటికీ తామే మతపెద్దలుగా యూదా ప్రజలను తమ అధీనంలోనే వుంచుకోవచ్చని రోమా అధికారులకు లంచం కడుతూ తమ పబ్బం గడుపుకోవచ్చని కలలుగంటూ శనివారం అంతా హాయిగా నిద్రపోయారు. మరోపక్క యేసు చేసిన అద్భుత సూచక క్రియలు చూసి ఆయన పరలోక దివ్య వాక్కులు విన్న ప్రజలు యేసు సిలువ మరణాన్ని జీర్ణించు కోలేని స్థితిలో వుండిపోయారు. యూదా గలిలయా సమరియ ప్రాంతాల్లో క్రీస్తు ద్వారా స్వస్థత పొందిన గుడ్డి, కుంటి, మూగ, చెవిటి వారు, కుష్టు రోగులు మరణించి క్రీస్తుతో బతికింపబడినవారు, క్రీస్తును అభిమానించేవారు, వివిధ అద్భుతాలను చూసినవారు యేసు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. చివరకు యేసుతో మూడున్నర సంవత్సరాలు తిరిగిన ఆయన శిష్యులు యూదా మతపెద్దలకు భయపడి యెరూషలేము పట్టణంలో ఓ గదిలో దాక్కుండి పోయారు. అయినా దేవుని ప్రవచనాలు నెరవేరక తప్పవు కదా! భూమి పునాదులు వేయక ముందే ఆయన ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక అనాది సంకల్పం నెరవేరక తప్పదు కదా!తొలగింపబడిన రాయిఆదివారం ఉదయమే ఇంకా తెల్లవారకముందు యేసుద్వారా స్వస్థత పొందిన మగ్ధలేని మరియ, కొంతమంది ధైర్యవంతులైన స్త్రీలు సుగంధ ద్రవ్యాలను తీసుకొని యేసును సమాధి చేసిన చోటుకు చేరుకున్నారు. రోమా అధికారక ముద్రతో వేయబడ్డ ఆ పెద్ద రాయి ఎవరు తొలగిస్తారన్న ఆలోచన ఆ మహిళకు కలిగింది. తీరా సమాధి వద్దకు వచ్చి చూస్తే వారి జీవితంలో ఎన్నడు కలుగనంత విభ్రాంతికి లోనయ్యారు. అప్పటికే సమాధి మీద రాయి తొలగించబడింది. అంతకు క్రితమే యేసు సమాధిమీద ఉన్నరాయి పరలోకం నుండి ప్రభువుదూత దొర్లించినట్లు లేఖనాలలో రాయబడింది. ఆప్రాంతంలో భూకంపం వచ్చింది. అక్కడ కావలి వున్న రోమా సైనికులు భయపడి చచ్చినవారిలా పరుండిపోయారు. స్త్రీలు అక్కడికి వచ్చినప్పుడు రాయి దొర్లించబడి ఉండటం చూశారు. సమాధి లోపల యేసు దేహం వారికి కనిపించలేదు. అప్పుడు దూత ప్రత్యక్షమై ‘‘సజీవుడైన క్రీస్తును మృతులలో ఎందుకు వెదుకుచున్నారు? ఆయన ముందుగా చెప్పిన విధంగా లేచి యున్నాడు. ఈ శుభవర్తమానం శిష్యులకు తెలియ జేయండి’’ అని చెప్పడంతో స్త్రీలు మహానందంతో వెనుకకు తిరిగారు.పునరుత్థానుడైన క్రీస్తుయేసు చెప్పిన విధంగానే చనిపోయిన మూడవరోజు మృత్యుంజయుడై లేచాడు. దానితో ప్రపంచ చరిత్రలో మరణాన్ని గెలిచి లేచిన చారిత్రాత్మిక పురుషుడిగా నిలిచి పోయాడు. ప్రపంచ చరిత్ర క్రీస్తుపూర్వం క్రీస్తు శకంగా చీలిపోయింది. పునరుత్థానుడైన యేసు ముందుగా తనను వెదకడానికి వచ్చిన స్త్రీలకు కన్పించి వారికి శుభమని చెప్పి ముందు మీరు వెళ్ళి నా శిష్యులకు గలిలయ వెళ్ళమని చెప్పి అక్కడ వారిని కలుస్తానని చెప్పాడు.ఈలోగా సమాధికి కాపలాగా ఉన్న రోమా సైనికులు ప్రధాన యాజకుల వద్దకు పోయి యేసు మరణం నుండి లేచిన సంగతి వివరించారు. వారు రోమా సైనికులకు లంచం ఇచ్చి ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని చెబుతూ మేము రాత్రివేళ నిద్దుర పోతుంటే యేసు శిష్యులు వచ్చి యేసు శరీరాన్ని ఎత్తుకు వెళ్ళారని అబద్ధం చెప్పండి ఒకవేళ అధికారులు ఏమన్నా హడావుడి చేస్తే వారిని మేము చూసుకుంటామని నచ్చచెప్పి పంపించి వేశారు. అయితే యేసు చెప్పిన విధంగానే గలిలయ శిష్యులకు దర్శనం ఇచ్చాడు. ఈ ఈస్టర్ పండుగ సమయంలో యేసు పునరుత్థాన శక్తి ప్రతి ఒక్కరం పొందుదం గాక! ఆమేన్!!యేసు పునరుత్థాన శక్తియేసు తన శరీరంలో సిలువ ద్వారా పాపానికి శిక్ష విధించి బలి అర్పణగా శరీరాన్ని సమర్పించడం ద్వారా మరణంపై సాతానుకున్న అధికారాన్ని నాశనం చేశాడు. మనుషుల్లో మరణం పట్ల ఉన్న భయాన్ని పునరుత్థాన శక్తితో తీసివేయడం ద్వారా దేవునితో ధైర్యంగా విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి బాటలు వేశాడు. ప్రథమ మానవుడైన ఆదామును సాతాను లోబరుచుకొని మరణానికి ΄ాత్రుడుగా చేశాడు. ఫలితంగా పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే కడపటి ఆదాముగా వచ్చిన యేసు పునరుత్థానం ద్వారా ఆ శాపం పూర్తిగా తొలగించబడింది. అంటే మనుష్యుని ద్వారా ఎలా మరణం వచ్చిందో మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగింది. ఈ ప్రక్రియ ద్వారా క్రీస్తులా ప్రతి ఒక్కరూ పునరుత్థానం పొందే అవకాశం లభించింది.– మన్య జ్యోత్స్న రావు -
Christmas 2022: రక్షణోదయం క్రిస్మస్
యేసు అంటే రక్షణ. యేసు జననమే రక్షణోదయం. అదే క్రిస్మస్. రక్షణకు పుట్టిన రోజు. ఆ రక్షణా కార్యానికి దేవునిచే నియుక్తుడై, అభిషిక్తుడైన ఆ క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. లోకాన్ని బాధించి వేధించే చీకటి కుట్రల సమస్యల నుండీ, మానసిక సమస్యల నుండీ తప్పించి శాంతిని ప్రసాదించేదే ఈ క్రిస్మస్! మానవుల్ని రక్షించడం కోసం నియమితుడైన క్రీస్తును ఆస్వాదించడం, ఆ రక్షణలో ఆనందించడం, అందు మమేకం కావడం, అదే ఆరాధించడం అంటే! ఇంతకూ ఆ రక్షణలో ఏముంది? ఆ రక్షణలో వెలుగుంది. పెడ దారిన పడనీయకుండా నడిపే ఆ వెలుగు, ఒక మంచి మార్గం చూపిస్తుంది. ఎక్కడో కొండల్లో, కోనల్లో లోయల్లో గొర్రెల కాపరుల్ని అర్ధ రాత్రి తోక చుక్క రూపంలో నడిపించింది, బెత్లెహేం పురానికి చేర్చింది. పశుల శాలలో శిశువు రూపాన ఉన్న చిన్ని దేవుడ్ని చూపించింది. ఆ మహాప్రకాశాన్ని ఆరాధించేట్టు చేసింది. క్రిస్మస్ అంటే వెలుగును ఆరాధించడం. దేవ శబ్దానికి కాంతి అనీ, కాంతితో పాటు అన్నీ ఇచ్చు వాడనేది మన భారతీయ ఆధ్యాత్మిక తాత్త్విక నైఘంటి కార్థం. ఆ యేసు రక్షణ కాంతితో పాటు ఇంకేమేమి ఇస్తున్నట్టు? లోకం నేడు కల్ల బొల్లి మాటల గారడీల్లో చిక్కుకు పోయింది. కుట్రలకు మోసాలకూ లోనైంది. మూఢ ఆచారాలకు, సాంఘిక దురాచారాలకు బానిసయై పోయింది. వీటినుండి రక్షింప బడడానికై అసలైన సిసలైన సత్య కాంతి అవసరం. అది ఈ బాల దేవుని దగ్గర వాక్య రూపేణా పుష్కళంగా లభిస్తుంది. మన శ్శాంతి దొరుకుతుంది. అందుకే దాన్ని అందుకోవాలనే అందరూ ఆరాధించారు. లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవాది దేవుడు తన ఏకైక ప్రియ కుమారుడ్ని తన ప్రేమ చిహ్నంగా భూమండలానికి పంపించాడు. ప్రాణానికి ప్రాణమైన ఆ తీపిప్రాణం మన మానవ కోటి రక్షణార్థంగా బలై పోయింది. ఆ ప్రభుని ప్రేమనూ, త్యాగాలనూ తమలోకి ఆహ్వానించుకోవడం, ఆయన చూపిన ప్రేమను సాటి వ్యక్తులక్కూడా అందించడమే క్రిస్మస్! – డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు (క్రిస్మస్ సందర్భంగా) -
క్రీస్తు చరిత్ర
చండ్ర పార్వతమ్మ సమర్పణలో చండ్రస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై చంద్రశేఖర్ చండ్ర నిర్మిస్తున్న చిత్రం ‘లోకరక్షకుడు’. బ్రహ్మం సి.హెచ్. దర్శకత్వం వహిస్తున్నారు. గత నెల 29న లండన్ పార్లమెంట్లో చిత్రం లోగో విడుదల చేశారు. నేడు ఈస్టర్ పండగ సందర్భంగా చంద్రశేఖర్ చండ్ర మాట్లాడుతూ– ‘‘ఏసుక్రీస్తు జీవిత చరిత్రలోని కొత్త అంశాలతో అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నాం.ఇంగ్లాండ్‌లో రెండో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. ఈ ఏడాది క్రిస్మస్కు చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని అన్నారు. ‘‘ఏసుక్రీస్తు జీవిత చరిత్రపై ఇదో మంచి సినిమా అవుతుంది. ఎక్కడ రాజీ అన్నదే లేకుండా చిత్రాన్ని నిర్మిచేందుకు నిర్మాతలు సహాయం చేస్తున్నారు’’ అని చిత్రదర్శకుడు బ్రహ్మం సి.హెచ్ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం: ఎ.కె రిసాల్ సాయి.