Conference Call
-
కాల్లో ప్రియురాలు.. కాబోయే ఇల్లాలు వీడుకోలు!
‘ప్యార్ హువా ఇక్రార్ హువా హై.. ప్యార్ సే ఫిర్ క్యోం డర్తా హై దిల్’ అంటూ ఆ కుర్రవాడు బహుశా లోలోపల సాంగేసుకుని ఉండవచ్చు. ఒక ప్యారీతో ప్యార్ నడుస్తూ ఉండగానే.. మరో పోరి పెళ్లికి రెడీ అయిపోయి.. తనకు కట్నం కూడా ముట్టజెప్పిన తరువాత.. ఇక డర్ నే కోయీ బాత్ హై క్యా అనుకుని సంబరపడుతూ చెలరేగి ఉండవచ్చు. కానీ.. అరచేతిలో ఉండే భూతం మొబైలు ఫోను మీటలు నొక్కడంలో చిన్న పొరబాటు అతగాడి కపటమైన కలలన్నింటినీ కల్లలు చేసేసింది.ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చాలామంది చూసే ఉంటారు. ఎంత కాదనుకున్నా.. వంటింట్లో ప్రియురాలిని పనిలో పెట్టి.. ఆ సంగతి ఇల్లాలికి తెలియకుండా మేనేజ్ చేయడానికి నానా పాట్లు పడుతూ.. హీరో ఆ చిత్రంలో ఒక వర్గం ప్రేక్షకులను బాగానే అలరించాడు. అయితే జీవితం అంటే ముందుగా స్క్రిప్టు రాసుకుని, ఆ మేరకు మాత్రమే సీన్లను నడిపించుకుంటూ వెళ్లే సినిమా కాదు కదా! జీవితం అన్నాక.. అందులో ఎన్నెన్నో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అనూహ్య మలుపులు ఎదురవుతాయి. కొన్ని మన కొంప ముంచుతాయి కూడా! ఆదిలాబాద్ జిల్లాలోని ఓ జల్సారాయుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతగాడు దాచిన గుట్టు రట్టవడంతో.. కొంప కొల్లేరయింది. మరికొన్ని రోజుల్లో జరగాల్సి ఉన్న పెళ్లి పెటాకులు అయింది.ఏం జరిగిందో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువకుడికి నెలకిందట పెళ్లి నిశ్చయమైంది. వధూవరులిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. నిశ్చయమైన తరువాత.. ఒకరితో ఒకరు ఫోను సంభాషణలు కూడా ప్రారంభించుకున్నారు. నెలరోజుల్లో పెళ్లిఉంది. ఇరువైపులా పెళ్లి పనులు కూడా ముమ్మరంగానే మొదలయ్యాయి. రోజులిలా రొమాంటిక్ గా నడుస్తుండగా.. ఒకనాడు కాబోయే భర్తకు ఆ అమ్మాయి ఫోను చేసింది. కాల్ వెయిటింగ్ వచ్చింది. సరిగ్గా ఆ సమయానికి అతగాడు.. ఫోనులో తన ప్రియురాలితో ముచ్చట్లు నడిపిస్తున్నాడు. స్వీట్ నథింగ్స్ మాట్లాడుకుంటున్నారు. అలాంటి రొమాంటిక్ సమయంలో వచ్చిన కాల్.. పెళ్లయని తర్వాత భార్యనుంచి అయితే.. కాస్త ఇగ్నోర్ చేసి ఉండేవాడేమో గానీ.. ‘కాబోయే’ భార్య గనుక వెంటనే ఆన్సర్ చేశాడు. అవతలి ప్రియురాలి కాల్ ఆటోమేటిగ్గా ‘హోల్డ్’ లోకి వెళ్లింది. ‘తాను బైక్ పై ఉన్నానని, మళ్లీ కాల్ చేస్తానని’ కాబోయే భార్యకు చెప్పాడు. ఆమె కూడా నమ్మింది.అక్కడే మనవాడు పప్పులో కాలేయడం జరిగింది. కాబోయే భార్య కాల్‌ను కట్ చేయబోయి.. ‘మెర్జ్’ బటన్ నొక్కేసి.. ప్రియురాలితో సంభాషణను యథావిధిగా కొనసాగిస్తూ పోయాడు. మళ్లీ చేస్తానన్న కాబోయే భర్త, ఆయనే కాల్ కట్ చేస్తాడని ఎదురుచూస్తున్న వధువుకు.. సంభాషణ కంటిన్యూ అవుతూ వినిపించింది. ఒకటి రెండు డైలాగులు విన్న తరువాత, ఆ సంభాషణ కాబోయే ప్రియురాలితో సాగుతున్నదని కూడా అర్థమైంది.ఆ బంధం బహు రొమాంటిక్ గా సాగుతున్నదని కూడా ఆమె గ్రహించింది. సైలెంట్ గా వారి సంభాషణ మొత్తం వింది. వినడం మాత్రమే కాదు. రికార్డు కూడా చేసింది. ఆ ఆడియో రికార్డు తీసుకువెళ్లి పెద్దల ఎదుట ఉంచింది. వాళ్లు ముందు కంగు తిన్నారు. తరువాత కారాలు మిరియాలు నూరారు. ఆ తరువాత.. మరికొన్ని రోజుల్లో జరగాల్సి ఉన్న పెళ్లిని రద్దు చేసుకున్నారు. అప్పటికే సమర్పించుకున్న కట్నం సొమ్మును అణా పైసల్తో సహా వెనక్కు లాక్కున్నారు. కరతలమలపై చరవాణి సేదతీరుతుండగా.. వీనులవిందుగా ప్రియురాలు రస భాషణ సాగిస్తుండగా.. మైమరచిన కైపులో ఒళ్లు దగ్గర పెట్టుకోకుండా.. ఏదో బటన్ నొక్కబోయి.. ఇంకేదో నొక్కితే.. విధి ఇలాగే వికటాట్టహాసం చేస్తుందని కుర్రకారు చాలా మంది పాఠాలు నేర్చుకోవాలి వీడినుంచి!-ఎం. రాజేశ్వరి -
సెప్టెంబర్ నాటికి ఆడిట్ పూర్తి
న్యూఢిల్లీ: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాతాల ఆడిట్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి కాగలదని ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ సీఈవో బైజూ రవీంద్రన్.. ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. అలాగే 2023 ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలు డిసెంబర్ నాటికి పూర్తి కాగలవని షేర్హోల్డర్లతో కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో తప్పిదాలు జరిగాయని అంగీకరించిన రవీంద్రన్.. వాటి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. అటు బోర్డు సభ్యుల రాజీనామా విషయం కూడా వాస్తవమేనని, కానీ కంపెనీ ఇంకా వాటిని ఆమోదించలేదని తెలిపారు. ఈలోగానే రా జీనామా వార్తలు లీకయ్యాయని పేర్కొన్నారు. కొత్త గా నియమితులైన సీఎఫ్‌వో అజయ్ గోయల్‌ను రవీంద్రన్ పరిచయం చేశారు. రాజీనామా చేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా సమావేశంలో పా ల్గొన్న ట్లు సమాచారం. ఆడిటర్లు వైదొలగడం, తమ రా జీనామాలు రెండూ వేర్వేరు అంశాలని వారు చెప్పి నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. సంస్థ లోని వివిధ విభాగాలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని, గ్రూప్ కౌన్సిల్‌తో కలిసి కొత్త సీఎఫ్‌వో సంస్థను మరింత పటిష్టం చేయగలరని రవీంద్రన్ తెలిపిన ట్లు పేర్కొన్నాయి. 2022 ఆర్థిక సంవత్సర ఫలితాలను ఇంకా వెల్లడించకపోవడం, ఆడిటర్లు.. డైరెక్ట ర్లు రాజీనామా చేయడం, 1 బిలియన్ డాలర్ల రుణా ల చెల్లింపుపై వివాదం నెలకొనడం తదితర సవాళ్ల తో బైజూస్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. -
ప్రీపెయిడ్ కస్టమర్లకు కాన్ఫరెన్స్ కాల్ సదుపాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కాన్ఫరెన్స్ కాల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒక కాల్‌పై ఏకకాలంలో అయిదుగురితో మాట్లాడుకునేందుకు కాన్ఫరెన్స్ సౌకర్యం వీలు కల్పిస్తుంది. ఇప్పటికే ఉన్న, ఎంపిక చేసుకున్న ప్యాకేజీలకు అనుగుణంగా కాల్ చార్జీలు ఉంటాయని సర్కిల్ బిజినెస్ హెడ్ మన్దీప్ సింగ్ భాటియా తెలిపారు. సర్కిల్లో వొడాఫోన్‌కు 67 లక్షల మంది ప్రీపెయిడ్ వినియోగదార్లు ఉన్నారు.