Data Database Breach
-
జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు
మెటా అధినేత మార్క జుకర్‌బర్గ్‌పై ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ విజిల్‌బ్లోయర్(వేగు) సారా విన్ విలియమ్స్ సంచలన ఆరోపణలకు దిగారు. జుకర్‌బర్గ్‌కు అమెరికా ప్రయోజనాల కన్నా డబ్బే ముఖ్యమని, ఈ క్రమంలోనే చైనాతో చేతులు కలిపి తన సొంత దేశం జాతీయ భద్రతా విషయంలో రాజీ పడ్డారని వెల్లడించారామె. సెనేటర్ జోష్ హవ్యూలే నేతృత్వంలోని కౌంటర్‌టెర్రరిజం సబ్ కమిటీ ఎదుట హాజరైన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. సీబీఎస్ కథనం ప్రకారం సారా విన్ వాంగ్మూలంలో.. చైనాలో వ్యాపార ఉనికిని పెంచుకోవడానికే మెటా కంపెనీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. చైనాతో మార్క్ జుకర్‌బర్గ్ చేతులు కలిపారు. అందుకే.. పదే పదే అమెరికా జాతీయ భద్రతా విషయంలో మెటా రాజీ పడుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారామె. మెటా కంపెనీ చైనా ప్రభుత్వం కోసం కస్టమ్ సెన్సార్షిప్ను టూల్స్‌ను రూపొందించింది. తద్వారా కంటెంట్ విషయంలో నియంత్రణ వాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. తాను స్వేచ్ఛావాదినని, దేశ భక్తుడినని అమెరికా జెండా కప్పేసుకుని ప్రకటించుకునే జుకర్‌బర్గ్.. గత దశాబ్దకాలంగా 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం అక్కడ ఎలా స్థాపించుకోగలిగారు?. ఇది అమెరికన్లను మోసం చేయడమే అని ఆమె అన్నారు. సారా విన్ విలియమ్స్ గతంలో ఫేస్బుక్లో గ్లోబల్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా పని చేశారు. ఏడేళ్లపాటు సంస్థలో పని చేసిన ఆమె.. ఈ ఏడాది మార్చిలో కేర్లెస్ పీపుల్ పేరిట ఒక నివేదికను పుస్తకాన్ని విడుదల చేసి తీవ్ర చర్చనీయాంశంగా మారారు. అయితే ఈ పుస్తంపై మెటా కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిషేధించింది. అయితే బుధవారంనాటి విచారణ సందర్భంగా.. ‘‘ఫేస్బుక్ ఆ పుస్త విషయంలో ఆమెను ఎందుకు నిలువరించాలని అనుకుంటోంది?.. అమెరికన్లకు వాస్తవం తెలియాల్సి ఉంది’’ అని సెనేటర్ జోష్ హవ్యూలే అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తమ ఎదట హాజరై వివరణ ఇవ్వాలంటూ గురువారం జుకర్‌బర్గ్‌కు ఆయన ఓ లేఖ రాశారు. వాస్తవాలు బయటపెడితే తనను కోర్టుకు ఈడుస్తామంటూ మెటా బెదిరిస్తోందని సారా విన్ విలియమ్స్ చెబుతుండగా.. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమేనని, చైనాలో తమ కార్యకలాపాలు నడవడం లేదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఆధార్ డేటా : బీజేపీపై శివసేన ఫైర్
సాక్షి, ముంబై : ఆధార్ సమాచార భద్రతపై విస్తృత చర్చ సాగుతున్న క్రమంలో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ తీరుపై శివసేన మండిపడింది. ఆధార్ కార్డుల సమాచారం పూర్తిగా భద్రతతో కూడుకున్నదని ప్రభుత్వం చెబుతుండగా, భద్రతలో డొల్లతనం బయటపడుతున్నదని ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన పార్టీ పత్రిక సామ్నాలో దుయ్యబట్టింది. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ విసిరిన ఆధార్ భద్రత సవాల్‌పై ఫ్రెంచ్ హ్యకర్ ఎలియట్ అల్డర్సన్ వెల్లడించన అంశాలు దీని భద్రతను ప్రశ్నార్థకం చేశాయని పేర్కొంది. యూఐడీఏఐకి పౌరులు సమర్పించిన డేటా ఏమాత్రం సురక్షితం కాదని ఎలియట్ అల్డర్సన్ బహిర్గతం చేశారని శివసేన పేర్కొంది. ట్రాయ్ చైర్మన్ శర్మ తన ఆధార్ నెంబర్‌ను ట్విటర్లో షేర్ చేసి దీన్ని ఉపయోగించి తనకు హాని తలపెట్టాలని ఆధార్ భద్రతను ప్రశ్నిస్తున్న వారిని సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో శర్మ వ్యక్తిగత వివరాలు కొన్నింటిని ఫ్రెంచ్ హ్యాకర్ ట్విటర్లో షేర్ చేయడంతో ఆధార్ భద్రతపై పలు సందేహాలు ముంచుకొస్తున్నాయి. హ్యాకర్ చేస్తున్న వాదనను తోసిపుచ్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని శివసేన పేర్కొంది. ట్రాయ్ చీఫ్ ఆధార్ నెంబర్ ఆధారంగా శర్మ కుమార్తెకు సైతం హ్యాకర్ ఈమెయిల్స్ పంపాడని, కీలక పత్రాలు పబ్లిక్ డొమెయిన్‌లో పెడతానని హెచ్చరించాడని సేన ఆందోళన వ్యక్తం చేసింది. హ్యాకర్ వెల్లడించిన సమాచారం ఎలాంటిదైనా ఈ అంశం ప్రజల రాజ్యాంగ హక్కులు, వారికి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ముడిపడినదని గుర్తించాలని సామ్నా సంపాదకీయంలో శివసేన పేర్కొంది. కాగా, హ్యాకర్ వెల్లడించిన సమాచారం గూగుల్ వంటి ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉందని, తమ డేటాబేస్ నుంచి సమాచార చోరీ జరగలేదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. మరోవైపు ఎథికల్ హ్యాకర్‌గా చెప్పుకుంటున్న ఓ ట్విటర్ యూజర్ ట్రాయ్ చీఫ్ బ్యాంక్ ఖాతాలో ఒక రూపాయి డిపాజిట్ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ పరిణామాలతో ప్రభుత్వం చెబుతున్న ఆధార్ సమాచార భద్రతలోని డొల్లతనం బయటపడిందని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. -
జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్..!
ముంబై: ఉచితడేటా, వాయిస్ కాలింగ్ ఆఫర్లతో ఎంజాయ్ చేస్తున్న రిలయన్స్ జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్. జియో కస్టమర్ల డేటా ఆన్లైన్లో లీక్ అయిందన్న వార్త ఇపుడు ప్రకంపనలు రేపుతోంది. జియో వినియోగదారుల సమాచారం ప్రస్తుతం ఒక వెబ్సైట్లో అందుబాటులోఉందన్నవార్త హల్ చల్ చేస్తోంది. లక్షల కొద్దీ రిలయన్స్ జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం ఆన్లైన్లో మాజిక్ ఏపీకే.కాం అనే వెబ్సైట్లో లీక అయిందనే కథనాలు ఆదివారం వెలువడ్డాయి. సంబంధిత వెబ్సైట్ యూఆర్ఎల్ను కొంతమంది ట్విట్టర్లో షేర్ చేశారు. జియో కస్టమర్ల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్తదితర సమాచారం ఈ సైట్ లో దర్శనిమస్తున్నాయని ట్వీట్ చేయడంతో దుమారం రేగింది. డేటాబేస్ ఉల్లంఘన ఏమేరకు ఉంది అనేది మాత్రం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. అయితే ఈ వార్తను జియోతీవ్రంగా ఖండించింది. వదంతులను నమ్మవద్దని వివరించింది. మరోవైపు ఈ వార్తలను రిలయన్స్ జియో కొట్టిపారేసింది. తమ వినియోగదారుల డేటా సురక్షితంగా ఉందని గట్టిగా వాదిస్తోంది. ఎలాంటి డేటా లీక్ కాలేదని జియో ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. తమ కస్టమర్ల డేటా భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన అనంతరం డేటాలీక్ అనేది అవాస్తవమని, నిరాధారనమైనదని జియో తేల్చింది. దీనిపై మరింత విచారణ కొనసాగుతోందని చెప్పారు. కాగా రిలయన్స్ జియోలో సుమారు 120 మిలియన్ల మంది ఖాతాదారులు ఉన్నట్టు అంచనా.