DC vs RR
-
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)తో విభేదాలంటూ వచ్చిన వార్తలపై.. ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని.. సంజూ, తానూ జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తామని స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇద్దరికీ గాయాల బెడదఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో రాయల్స్ కేవలం రెండు మాత్రమే గెలిచింది. మరోవైపు.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజూ శాంసన్ గాయాల బారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ సీజన్ ఆరంభానికి ముందు ద్రవిడ్ లీగ్ మ్యాచ్ ఆడి కాలికి దెబ్బ తాకించుకోగా.. వీల్‌చైర్‌లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.ఇంపాక్ట్ ప్లేయర్గానేఇక సంజూ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు. ఆ తర్వాత సారథిగా పగ్గాలు చేపట్టిన ఈ కేరళ బ్యాటర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా మరోసారి గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పితో అతడు తదుపరి లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితి.ద్రవిడ్- సంజూ మధ్య విభేదాలు?ఇదిలా ఉంటే.. ఢిల్లీపై గెలవాల్సిన మ్యాచ్‌ను రాయల్స్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులే చేయడంతో మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్లో ఢిల్లీ రాయల్స్‌పై జయభేరి మోగించింది. అయితే, సూపర్ ఓవర్‌కు ముందు ద్రవిడ్ ఆటగాళ్లతో డగౌట్లో చర్చలు జరుపగా.. సంజూ మాత్రం అందులో పాలుపంచుకోలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. ద్రవిడ్- సంజూ మధ్య విభేదాలనే వదంతులు వచ్చాయి.అతడు జట్టులో అంతర్భాగంఅయితే, ఈ వార్తలను ద్రవిడ్ ఖండించాడు. లక్నోతో శనివారం నాటి మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు. నేను, సంజూ ఒకే విధంగా ఆలోచిస్తాం. మా ప్రణాళికలు ఒక్కటే.అతడు జట్టులో అంతర్భాగం. ప్రతి చర్చ, నిర్ణయంలోనూ అతడు భాగమై ఉంటాడు. అయితే, కొన్నిసార్లు మనం అనుకున్న ఫలితాలు రాకపోతే ప్రతి ఒక్కరు నిరాశ చెందుతారు. ఆటలో ఇవన్నీ సహజం.మన ప్రదర్శన బాగా లేకపోతే విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ ఇలా ఆధారాల్లేకుండా వస్తున్న వార్తలను మేమైతే అరికట్టలేము. మా జట్టులోనూ ఎలాంటి విభేదాలు లేవు.మా వాళ్లు కఠినంగా శ్రమిస్తున్నారు. గెలుపు కోసం కృషి చేస్తున్నారు. తమ ప్రదర్శన బాగాలేకపోతే ఆటగాళ్ల మనసు ఎంతగా గాయపడుతుందో మీకు తెలియదు. ఎవరో పనిగట్టుకుని వారిని విమర్శించాల్సిన పనిలేదు. పొరపాట్లను సమీక్షించుకుని సరిచేసుకోగల సత్తా వారికి ఉంది’’ అని ద్రవిడ్ విమర్శకులకు, వదంతులు వ్యాప్తి చేసే వారికి చురకలు అంటించాడు.చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా -
‘ద్రవిడ్‌కు సంజూ నచ్చడు.. అందుకే ఇలా!’.. రాయల్స్ క్యాంపులో విభేదాలు?
‘రాజస్తాన్ రాయల్స్ నాయకత్వ బృందంలో విభేదాలు తలెత్తాయా?.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)- కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) మధ్య సఖ్యత కొరవడిందా?.. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయా?’.. అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అవుననేందుకు ఆస్కారం ఇస్తున్నాయి.ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. సీజన్ ఆరంభానికి ముందే హెడ్‌కోచ్ ద్రవిడ్ గాయపడ్డాడు. అయినప్పటికీ వీల్‌చైర్‌లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.మరోవైపు.. ఐపీఎల్ ఆరంభానికి ముందు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు అతడు కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నాడు. సారథిగా, వికెట్ కీపర్‌గా జట్టు అతడి సేవలను కోల్పోయింది.ఇక సంజూ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ వచ్చిన రియాన్ పరాగ్ (Riyan Parag) సారథ్యంలో.. మూడు మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అయితే, సంజూ వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఈ క్రమంలో చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్స్ తలపడింది.అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్ నిర్వహించగా.. ఢిల్లీ రాయల్స్‌ను ఓడించి గెలుపు జెండా ఎగురవేసింది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా సంజూ పక్కటెముకల నొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.ఇదిలా ఉంటే.. సూపర్ ఓవర్ సమయంలో రాజస్తాన్ రాయల్స్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. రియాన్ పరాగ్‌తో పాటు షిమ్రన్ హెట్‌మెయిర్‌ను రాయల్స్ బ్యాటింగ్‌కు పంపింది. వీరిద్దరు రనౌట్ అయి ఐదు బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి జట్టు ఓటమికి పరోక్ష కారణమయ్యారు.𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 PC: BCCIనిజానికి ఈ మ్యాచ్‌లో నితీశ్ రాణా అద్భుత అర్ధ శతకం (28 బంతుల్లో 51)తో రాణించాడు. కానీ మేనేజ్మెంట్ మాత్రం అతడిని సూపర్ ఓవర్లో పంపలేదు. ఇక సూపర్ ఓవర్‌కు ముందు ద్రవిడ్ డగౌట్లో తన సహాయక సిబ్బంది, ఆటగాళ్లతో ప్రణాళికల గురించి చర్చించాడు.ఆ సమయంలో కెప్టెన్ సంజూ మాత్రం తనకు ఈ విషయం పట్టనట్లుగా ఆటగాళ్ల వెనుక అటూ ఇటూ తిరిగాడు. మధ్యలో సహచర ఆటగాడు రమ్మని పిలిచినా తనకు ఇష్టం లేదన్నట్లుగా వద్దంటూ చేతితో సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాయల్స్ క్యాంపులో విభేదాలు అన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఇది చూసిన సంజూ అభిమానులు ద్రవిడ్‌కు సంజూ నచ్చడని.. అందుకే ఇక్కడా తనకు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్-2025లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాజస్తాన్ కేవలలం రెండే గెలిచింది.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! I knew there was definitely a rift within the setup when there were absolutely no discussions or chat in the dugout before the super over.Everyone was standing quite in a circle in the dugout.Look at Sanju's hand signal in the first video,he is deliberately ignoring everyone. https://t.co/DfxmlwGgBG pic.twitter.com/688ji3MXrS— Delhi Capitals Fan (@pantiyerfc) April 17, 2025 -
ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ!
గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ (Munaf Patel)కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. అంతేకాదు.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా మునాఫ్ పటేల్ అనుచిత ప్రవర్తనకు గానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మేరకు శిక్ష విధించింది.మ్యాచ్ ‘టై’.. ఫలితం తేల్చేందుకుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ సొంత మైదానంలో బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో తలపడింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అక్షర్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.సూపర్ ఓవర్లో గెలిచిన ఢిల్లీఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ కూడా 20 ఓవర్ల పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి.. 188 పరుగులే చేసింది. ఫలితంగా మ్యాచ్ ‘టై’ కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ ఐదు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేయగా.. ఢిల్లీ (2, 4, 1, 6) నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.పట్టికలో అగ్రస్థానానికిఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపొందడంతో పాటు.. సీజన్లో ఐదో విజయం అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ- రాజస్తాన్ జట్ల మధ్య సూపర్ ఓవర్ సమయంలో ఢిల్లీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ ఫోర్త్ అంపైర్‌తో వాదనకు దిగాడు.అంపైర్‌తో వాగ్వాదంబౌండరీ లైన్ వద్ద ఫోర్త్ అంపైర్ నిల్చుని ఉండగా.. అక్కడే కూర్చుని ఉన్న మునాఫ్ పటేల్ అతడితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాడు. మైదానంలో ఉన్న తమ ఆటగాళ్లకు సందేశం చేరవేసేందుకు వేరే ఆటగాడిని పంపాలని భావించగా.. ఫోర్త్ అంపైర్ అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడితో మునాఫ్ వాదనకు దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.జరిమానాతో పాటుఈ క్రమంలో ఐపీఎల్ పాలక మండలి మునాఫ్ పటేల్‌కు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా జతచేసినట్లు వెల్లడించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.20 నిబంధనను అతడు ఉల్లంఘించిన కారణంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.కాగా మునాఫ్ పటేల్ మార్గదర్శనంలో ఢిల్లీ బౌలింగ్ విభాగం రాణిస్తోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ జట్టును అగ్రస్థానంలో నిలపడంలో బౌలర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసి.. మ్యాచ్ టై కావడానికి ప్రధాన కారణమైన పేసర్ మిచెల్ స్టార్క్.. సూపర్ ఓవర్లోనూ అద్భుతం చేసి ఢిల్లీని గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.చదవండి: Rohit Sharma: కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
సందీప్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే
రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ సందీప్ శర్మ (Sandeep Sharma) అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఆఖరి ఓవర్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్‌గా సందీప్ నిలిచాడు. ఐపీఎల్-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శర్మ ఈ చెత్త రికార్డును నెలకొల్పాడు.ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన సందీప్ ఏకంగా 11 బంతులు విసిరాడు. ఆ ఓవర్లో సందీప్ నాలుగు వైడ్లు, ఓ నోబాల్ వేయడం గమనార్హం. ఆఖరి ఓవర్లో శర్మ మొత్తంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా ఈ చెత్త రికార్డు సాధించిన నాలుగో బౌలర్‌గా సందీప్ నిలిచాడు. సందీప్ కంటే ముందు మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్ పాండే, శార్ధూల్ ఠాకూర్ 11 బంతలు ఒకే ఓవర్లో వేశారు. అయితే ఈ ముగ్గురు ఆఖరి ఓవర్ కాకుండా వేర్వేరు ఓవర్లల్లో 11 బంతులు విసిరారు.ఐపీఎల్లో ఒకే ఓవర్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్లు..👉11 బంతులు మొహమ్మద్ సిరాజ్ vs ముంబై ఇండియన్స్ 2023 (ఓవర్ 19)👉11 బంతులు తుషార్ దేశ్‌పాండే vs లక్నో సూపర్ జెయింట్స్ 2023 (ఓవర్ 4)👉11 బంతులు శార్దూల్ ఠాకూర్ vs కేకేఆర్ 2025 (ఓవర్ 13)👉11 బంతులు సందీప్ శర్మ vs ఢిల్లీ క్యాపిటల్స్ 2025 (ఓవర్ 20)కాగా చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. సూపర్ ఓవర్లో రాజస్తాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే సూపర్ ఓవర్లో కూడా సందీప్ శర్మనే బౌలింగ్ చేయడం గమనార్హం. 12 పరుగుల టార్గెట్‌ను సందీప్ డిఫెండ్ చేసుకోలేకపోయాడు.చదవండి: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది' -
జిడ్డు బ్యాటింగ్!.. ఇలా అయితే కష్టం రాహుల్: పుజారా విమర్శలు
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ (KL Rahul) బ్యాటింగ్ తీరును భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) విమర్శించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాహుల్ జిడ్డు ఇన్నింగ్స్ ఆడాడని.. సీనియర్ ఆటగాడు ఇలా చేయడం తగదని పేర్కొన్నాడు. క్రీజులో కుదురుకున్న తర్వాతైనా ఈ కర్ణాటక క్రికెటర్ బ్యాట్ ఝులిపించాల్సిందని పుజారా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆరంభ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన రాహుల్ ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తన విలువను చాటుకుంటున్నాడు. ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 238 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఢిల్లీ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం కేఎల్ రాహుల్ స్లో ఇన్నింగ్స్ ఆడాడు. అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ (9) వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన కరుణ్ నాయర్ రనౌట్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు.స్ట్రైక్ రేటు 118.75ఈ క్రమంలో మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ (37 బంతుల్లో 49) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకోగా.. నాలుగో స్థానంలో వచ్చిన రాహుల్ అతడికి సహకరించాడు. అయితే, క్రీజులో నిలదొక్కుకునేందుకు రాహుల్ చాలా సమయమే తీసుకున్నాడు. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 118.75.ఇక జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో షార్ట్ డెలివరీని ఆడబోయి రాహుల్ బంతిని గాల్లోకి లేపగా.. మిడ్ వికెట్ పొజిషన్లో ఉన్న హెట్మెయిర్ వేగంగా పరిగెత్తుకుని వచ్చి క్యాచ్ అందుకున్నాడు. దీంతో రాహుల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.షాట్ల ఎంపికలో జాగ్రత్త రాహుల్ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి ఛతేశ్వర్ పుజారా స్పందించాడు. ‘‘కేఎల్ సీనియర్ ఆటగాడు.. అతడు 15- 20 బంతులు ఆడాలని అనుకుని ఉంటాడు. ఆ తర్వాత బ్యాట్ ఝులిపిద్దామనుకున్నాడేమో!... కానీ నాకైతే అతడు కాస్త దూకుడుగా ఆడితే బాగుండు అనిపించింది.తను క్రీజులో కుదురుకున్నాడు.. పిచ్ పిరిస్థితులపై కూడా అవగాహన ఉంది. పరుగులు రాబట్టకపోతే కష్టమనీ తెలుసు. అయినా సరే ఎందుకో అతడు దూకుడుగా ఆడలేకపోయాడు. రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త మార్పు వచ్చింది.ఐపీఎల్లో తను ఓపెనర్‌గా వచ్చేవాడు. ఇప్పుడు మిడిలార్డర్లో వస్తున్నాడు. నిజానికి పవర్ ప్లేలో అతడి ఆట తీరు వేరేలా ఉండేది. ఏదేమైనా షాట్ల ఎంపికలో రాహుల్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే, అతి జాగ్రత్త పనికిరాదు.ఎంత సేపూ వికెట్ కాపాడుకోవడం కోసమేనా?కేవలం వికెట్ కాపాడుకునేందుకే అతడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అలా కాకుండా తనదైన సహజశైలిలో రాహుల్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది’’ అని పుజారా అభిప్రాయపడ్డాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రాహుల్ అవుటైన తర్వాత.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్), కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా ఢిల్లీ 20 ఓవర్లలో 188 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ కూడా 188 పరుగులు చేసినా.. సూపర్ ఓవర్లో చెత్త బ్యాటింగ్‌తో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్📁 TATA IPL↳ 📂 Super OverAnother day, another #TATAIPL thriller! 🤩Tristan Stubbs wins the Super Over for #DC in style! 🔥Scorecard ▶ https://t.co/clW1BIPA0l#DCvRR pic.twitter.com/AXT61QLtyg— IndianPremierLeague (@IPL) April 16, 2025𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
DC vs RR: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?
రాజస్తాన్ రాయల్స్ నాయకత్వ బృందంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ (Shane Watson) మండిపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సూపర్ ఓవర్లో రాయల్స్ తెలివి తక్కువగా వ్యవహరించి.. మ్యాచ్‌ను చేజార్చుకుందని పేర్కొన్నాడు. సూపర్ ఓవర్లో ఇన్ఫామ్ బ్యాటర్ నితీశ్ రాణాను పంపకపోవడాన్ని మతిలేని చర్యగా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశాడు.ఒకే స్కోరు.. 188 పరుగులు ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్- రాజస్తాన్ రాయల్స్ (DC vs RR) బుధవారం తలపడ్డాయి. అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (37 బంతుల్లో 49), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 38) రాణించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్), కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఇక లక్ష్య ఛేదనలో రాయల్స్ 20 ఓవర్ల ఆటలో నాలుగు వికెట్లు నష్టపోయి సరిగ్గా 188 పరుగులే చేసింది.ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 51), కెప్టెన్ సంజూ శాంసన్ (19 బంతుల్లో 31 రిటైర్ట్ హర్ట్) రాణించగా.. నితీశ్ రాణా (28 బంతుల్లో 51) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఆఖర్లో ధ్రువ్ జురెల్ (17 బంతుల్లో 26), షిమ్రన్ హెట్మెయిర్ (9 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.సూపర్ ఓవర్లో ఢిల్లీ గెలుపుఇక ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తొలుత రాజస్తాన్ బ్యాటింగ్ చేయగా.. ఢిల్లీ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బంతితో రంగంలోకి దిగాడు. రాయల్స్ బ్యాటర్లలో హెట్మెయిర్ తొలికి పరుగులేమీ తీయలేదు. రెంబో బంతికి ఫోర్ బాది, మూడో బంతికి ఒక్క రన్ సాధించాడు.ఇక నాలుగో బంతికి రియాన్ ఫోర్ బాదాడు.. అది నోబాల్‌గా తేలడంతో ఫ్రీ హిట్ అవకాశం రాగా.. రియాన్ రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొనే క్రమంలో హెట్మెయిర్ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 0.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి రాయల్స్ 11 పరుగులు మాత్రమే చేసింది.అనంతరం సందీప్ శర్మ బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 2, 4, 1 పరుగులు రాబట్టగా.. నాలుగో బంతిని ట్రిస్టన్ స్టబ్స్ సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఈ ఉత్కంఠ పోరులో రాజస్తాన్‌పై ఢిల్లీ జయభేరి మోగించి.. సీజన్లో ఐదో గెలుపు నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్లో రాజస్తాన్ రాయల్స్ నితీశ్ రాణాను బ్యాటింగ్‌కు ఎందుకు పంపలేదని షేన్ వాట్సన్ ప్రశ్నించాడు. ‘‘రాయల్స్ ఇన్నింగ్స్‌లో తొందరపాటు చర్యలు కనిపించాయి. ఇద్దరు బ్యాటర్లు రనౌట్ అయ్యారు. అసలు నితీశ్ రాణా ఏం తప్పు చేశాడు? అతడిని ఎందుకు సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు పంపలేదు?అతడు మంచి రిథమ్‌లో బ్యాటింగ్ చేశాడు. పరుగులు రాబట్టాడు. అయినా సరే.. అతడిని సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు పంపలేదంటే.. మీకు బుర్ర పనిచేయడం లేదని అనుకోవాలా?’’ అంటూ షేన్ వాట్సన్ రాయల్స్ యాజమాన్యాన్ని విమర్శించాడు. చదవండి: SRH vs MI: రైజర్స్ రఫ్ఫాడించేనా! 𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
RR vs DC: కెప్టెన్‌గా నేను కాదు!.. అతడే సరైనోడు..
ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభం నుంచే రాజస్తాన్ రాయల్స్‌కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే అందుబాటులో ఉన్నాడు. ఆ తర్వాత సంజూ సారథిగా పునరాగమం చేసినా రాయల్స్ రాతలో పెద్దగా మార్పులేదు.వరుస ఓటములుఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం రెండు మాత్రమే గెలిచి.. నాలుగు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. కాగా సంజూ స్థానంలో టీమిండియా యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ (Riyan parag)రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలో సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన పింక్ జట్టు.. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలోనూ పరాజయం పాలైంది.అనంతరం చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. అయితే, జట్టులో అనుభవజ్ఞుడైన నితీశ్ రాణాను కాదని.. యువ ఆటగాడైన రియాన్ పరాగ్‌కు పగ్గాలు అప్పగించడంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై నితీశ్ రాణా తాజాగా పెదవి విప్పాడు.‘‘నేను గతంలో కేకేఆర్ కెప్టెన్‌గా పనిచేశాను. అప్పటికి నేను ఆ జట్టుతో 6-7 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నా. కాబట్టి ఫ్రాంఛైజీ వాతావరణం, సంస్కృతి ఎలా ఉంటుందో నాకు పూర్తి అవగాహన ఉంది.కెప్టెన్‌గా నేను కాదు!.. అతడే సరైనోడు..కానీ.. రాజస్తాన్ రాయల్స్‌లోకి కొత్తగా వచ్చాను. రియాన్ మాత్రం చాలా కాలంగా ఈ జట్టుతోనే ఉన్నాడు. కాబట్టి అతడికి ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంటుంది. అందుకే మేనేజ్మెంట్ నన్ను కాదని.. రియాన్‌ను కెప్టెన్‌గా చేసి తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ సరైందే’’ అని నితీశ్ రాణా పేర్కొన్నాడు.అదే విధంగా.. ‘‘ఒకవేళ యాజమాన్యం నన్ను తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించమని అడిగితే తప్పకుండా అంగీకరించేవాడిని. అయితే, అంతిమంగా మా అందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యం. అందుకే వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను’’ అని నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌కు ముందు అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.రూ. 4.20 కోట్లకుకాగా ఐపీఎల్-2023లో శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో నితీశ్ రాణా కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలో కేకేఆర్ పద్నాలుగింట ఆరు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచి.. ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది. ఇక ఐపీఎల్-2024లో అయ్యర్ రాకతో రాణా ఆటగాడిగానే కొనసాగగా.. మెగా వేలానికి ముందు కేకేఆర్ అతడిని విడిచిపెట్టింది.ఈ క్రమంలో రూ. 4.20 కోట్లకు రాజస్తాన్ నితీశ్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 117 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో ఓవరాల్‌గా 113 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 2753 రన్స్ చేశాడు.చదవండి: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’