descipline
-
ఆధ్యాత్మికథ : ధర్మనిష్ఠ
అది ఒక గురుకులం. ఒక శిష్యుడికి శిక్షణ పూర్తయింది. గురువుగారు అతన్ని పిలిచి ‘‘నాయనా! ఇక నీ శిక్షణ పూర్తయింది. నీవిక వెళ్లి, గృహస్థాశ్రమం స్వీకరించి, నీ విద్యలన్నిటినీ లోకకల్యాణానికి ఉపయోగించు.’’ అని చెప్పాడు.. ఆ శిష్యుడు చాలా పేదవాడు. అయినప్పటికీ, గురువుగారికి ఎంతో కొంత దక్షిణ చెల్లించా లనుకుని గురువుగారిని అడిగాడు దక్షిణ ఏమి కావాలని. అతని గురించి తెలిసిన గురువుగారు ‘‘నాకేమీ వద్దు’’ అని చెప్పారు. అయినా సరే, వదలకుండా పదే పదే అడుగుతుండడంతో విసిగిపోయిన గురువు ‘‘నీకు నేను 14 విద్యలను నేర్పాను. ఒక్కో విద్యకూ లక్ష బంగారు నాణాల చొప్పున పద్నాలుగు లక్షల బంగారు నాణాలు చెల్లించు’’ అని చెప్పాడు.గురుదక్షిణ చెల్లించాలన్న సంకల్పమే తప్ప దానిని ఎలా సమకూర్చుకోవాలో తెలియని ఆ శిష్యుడు కౌత్సుడు. అయితే, రాజు తండ్రి వంటి వాడు కాబట్టి రాజునే అడుగుదామనుకుని నేరుగా రాజు వద్దకు వెళ్లాడు. ఆ రాజు రఘువు. మహాపరాక్రమవంతుడు, ధర్మనిష్టాగరిష్ఠుడు. ఆడిన మాట తప్పనివాడు. కౌత్సుడు ఆయన వద్దకు వెళ్లడానికి ముందురోజే ఆయన విశ్వజీ అనే యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ నియమంగా తనకున్న సర్వస్వాన్నీ దానం చేశాడు. కౌత్సుడు వెళ్లేసరికి ఆయన మట్టిపిడతలతోనే సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అది గమనించిన కౌత్సుడు ఏమీ అడగకుండానే వెనుదిరగబోతుండగా, రఘుమహారాజు అతన్ని ఉండమన్నట్లుగా సైగ చేసి, సంధ్యావందనం ముగియగానే ఏం కావాలని అడిగాడు. గురుదక్షిణ చెల్లించడానికి తనకు 14 లక్షల బంగారు నాణాలు కావాలన్నాడు కౌత్సుడు. ఎవరినీ ఖాళీ చేతులతో పంపకూడదన్న నియమం కలవాడైన ఆ రాజు ‘‘అలాగే ఇస్తాను కానీ, ప్రస్తుతానికి లేవు కాబట్టి రేపు ఉదయం వచ్చి తీసుకు వెళ్లు’’ అని చెప్పాడు. సరేనంటూ సంతోషంగా సెలవు తీసుకున్నాడు కౌత్సుడు. తన వద్ద ధనం లేదు కాబట్టి, ఏం చేయాలో తగిన తరుణోపాయం చెప్పమని గురువైన వశిష్ఠుని అడిగాడు రఘుమహారాజు. ‘‘రాజా! నీకు కావలసిన ధనాన్ని సమకూర్చగల సమర్థుడు ఇంద్రుడొక్కడే. కాబట్టి వెంటనే ఇంద్రుని మీద దండెత్తడమే ఉత్తమం’’అని సలహా ఇచ్చాడు వశిష్టుడు. గురువు సలహా మేరకు వెంటనే ఇంద్రుని మీద యుద్ధం చేస్తున్నట్లుగా భేరీలు మోగించాడు రఘువు. ఆ భేరీ నాదాలు అయోధ్యా నగరం నుంచి వస్తున్నాయని తెలుసుకున్న ఇంద్రుడు వెంటనే ధర్మపరాయణుడు, పరాక్రమవంతుడు అయిన రఘుమహారాజుకు కోపం తెప్పించడం కంటే ఆయనతో సంధి చేసుకోవడమే మేలని, దిక్పాలకులను ఆదేశించి, ఆ రాజ్యమంతటా బంగారు వర్షం కురిపించాడు. కొద్దిసేపటిలోనే కోశాగారమంతా నిండి, రాజ్యమంతటా బంగారు నాణాలతో నిండిపోయింది. దాంతో వెంటనే ఇంద్రునిపై యుద్ధం విరమిస్తున్నట్లు ప్రకటించి రఘుమహారాజు, కౌత్సుడిని పిలిపించి, నీవడిగిన ధనం కోశాగారంలో ఉంది తీసుకు పొమ్మని చెప్పాడు. తనకు కావలసిన దానికన్నా ఎక్కువ ధనం ఉందని తెలుసుకున్న కౌత్సుడు తనకు కావలసినంత మాత్రమే తీసుకుని వెళ్లి, గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మిగిలిన ధనమంతటినీ ఇంద్రుడికి తిరిగి పంపించేశాడు రఘువు. అంతటి ధర్మాత్ముడైన రఘు వంశంలో పుట్టిన వాడు కాబట్టే రాముడికి ఆయన గుణాలన్నీ అలవడ్డాయి. – డి.వి.ఆర్. -
ఈ నేరప్రవృత్తికి కారణాలేమిటి?
క్రమశిక్షణే విద్యార్థికి సంస్కారవంతమైన విద్యను అంది స్తుంది. క్రమశిక్షణే విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దే సాధనం. అది లోపించడం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు కొన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ ఉపాధ్యా యులపై దారుణంగా భౌతిక దాడులకు దిగడం అందులో ఒకటి. రాయచోటి (Rayachoty) పట్టణంలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ‘ఏజాష్ అహ్మద్’ అనే ఉపాధ్యాయునిపై ఇద్దరు విద్యార్థులు పిడిగుద్దులతో భౌతికదాడి చేయడంతో టీచర్ ప్రాణాలు విడిచారు. తన తరగతిలో బోధన చేస్తుండగా, పక్క క్లాసులో అల్లరి చేస్తున్న వారిని టీచర్ మందలించారు. అంతే... కోపోద్రిక్తులై టీచర్‌పై దాడిచేశారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనలు మరవక ముందే మరో రెండు రోజుల తర్వాత మధ్యప్రదేశ్ (Madhya Pradesh) చత్తర్‌పూర్ జిల్లాలోని ధామోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ‘సురేంద్రకుమార్ సక్సేనా’పై ఓ విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్లు తలలోకి దూసుకెళ్లడంతో టీచర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇది కూడా పాఠశాలకు విద్యార్థి ఆలస్యంగా వచ్చాడని మందలించడం వలనే జరిగింది.దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు గతంలో కూడా రకరకాల కారణాలతో జరిగాయి. కానీ మూడు – నాలుగు రోజుల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే కారణంతో పై సంఘటనలు సంభవించడం బాధా కరం. విద్యారంగంలో జరుగుతున్న ఈ దారుణ పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? పిల్లలు స్వతహాగా సున్నిత హృదయులు. వారి లేలేత మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఇంటిలో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు మెలగాలి. పిల్లలు ఎక్కువ సమయం మిత్రులతో గడుపుతారు. ఈ క్రమంలో సహవాస దోషం వల్ల కొన్ని చెడ్డ అలవాట్లు సంక్రమిస్తాయి. దీన్ని ఎవరైనా వ్యతిరేకించి మందలిస్తే, వారిని శత్రువులుగా పరిగణిస్తారు. అందుకే వారిని అనునయిస్తూ పరిష్కారాలను కనుగొనాలి.చిన్నతనంలో కుల, లింగ వివక్ష, లైంగిక వేధింపులకు గురి కావొచ్చు. ఇవన్నీ పిల్లల విపరీత ధోరణికి కారణమౌతాయి. టీనేజ్ పిల్లలు రాత్రనక పగలనక స్మార్ట్ ఫోన్లలో సామాజిక మాధ్యమాలు చూస్తూ కాలం గడుపుతుంటారు. బెట్టింగ్, రమ్మీ, రేసింగ్ లాంటి ఆటల్లో పాల్గొని డబ్బు పోగొట్టుకుంటారు. దీంతో ప్రతీ విషయానికీ కోపం, అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు. వీటన్నింటి వల్లనే నేడు విద్యార్థులలో వింత ప్రవర్తన చూస్తున్నాం. ఈ కారణాలతోనే పిల్లలు మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారు. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, రీల్స్ చూసి నాయికా నాయకులను అనుకరిస్తున్నారు. ఈ రోజుల్లో హైస్కూల్ స్థాయి విద్యార్థులు సైతం ధూమపానం, మద్యం సేవించడం చూస్తున్నాం. ఇవన్నీ పిల్లల్లో నేర ప్రవృత్తిని పెంచేవే.ఒక విద్యార్థిని ‘నీకేమీ రాదు, నీవు దేనికీ పనికి రావు’ అని పది మందిలో తక్కువ చేసి టీచర్ మాట్లాడకూడదు. శారీరకంగా శిక్షించకూడదు. దాన్ని అవమానంగా భావించి కృంగిపోతాడు. గ్రామీణ విద్యార్థులను చులకనగా చూడకూడదు. వీరికి పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించకూడదు. వీరికి అవసరమైన పక్షంలో ప్రాథమిక నైపుణ్యాలు నేర్పాలి. స్కూల్లో అందరు టీచర్లూ ఐక్యంగా ఉండాలి. పాఠశాలల్లో సహ పాఠ్యేతర అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. వాటిలో విద్యార్థులను భాగస్వామ్యలుగా చేయాలి. అవసరమైతే పాఠశాలలో సైకియాట్రిస్ట్‌లతో కౌన్సిలింగ్ ఇప్పించాలి.చదవండి: బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నంబడి గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను, పత్రికలను పిల్లలు చదివేలా చూడాలి. సైన్స్, సోషల్, మోరల్ క్లబ్బులను నిర్వహించాలి. ప్రపంచీకరణ వల్ల సంక్రమించిన వస్తువుల వల్ల కలిగే నష్టాలను ఎరుక పరచాలి. ప్రభుత్వమైతే విద్యా ప్రణాళికలో మార్పులు చేయవచ్చు. ఆ మార్పులు సామాజిక అంతరాలను నిలువరిస్తూ, మానవత్వాన్ని చాటేలా ఉండాలి. స్ఫూర్తిదాయక, నీతి ప్రబోధక పాఠ్యాంశాలను తప్పనిసరిగా చేర్చాలి. అప్పుడే విద్యార్థికి విలువలతో కూడిన విద్య అందుతుంది. లేనిచో విద్యార్థుల్లో హింసాప్రవృత్తి పెచ్చు మీరిపోయి, రాబోవు యువతరం నిర్వీర్యయ్యే ప్రమాదం లేకపోలేదు.- పిల్లా తిరుపతిరావుతెలుగు ఉపాధ్యాయుడు -
క్రమశిక్షణ మంత్రం.. దేశభక్తి సూత్రం
- భావిభారత పౌరుల తీర్చిదిద్దడంలో ఎన్సీసీ కీలకం - ఎన్‌సీసీతో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు - జిల్లాలోని ప్రముఖులు ఈ కోవలోని వారే...! - నేడు ఎన్సీసీ డే క్రమశిక్షణమైన జీవితం, నిజాయితీగా బతకడం, ఎంతటి కఠోరశ్రమనైనా తట్టుకోవడం, ఎన్ని కష్టాలు ఎదురైనా నిలదొక్కుకోవడం, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు దూరంగా ఉండగలిగే మనోస్థైర్యాన్ని చిన్నతనంలోనే పెంపొందించడం, సమాజం గురించి తెలుసుకోవడం, జ్ఞానాన్ని సముపార్జించడం.. ఇలాంటి లక్షణాలన్నీ ఎన్‌సీసీతో సాధ్యమవుతాయనడంలో అతిశయోక్తి లేదు. చదువుతో పాటు ఇతర అంశాల్లో అవగాహన కల్పించేందుకు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇప్పుడు ఎన్సీసీలో చేర్పిస్తున్నారు. తద్వారా వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆదివారం (ఈనెల 27న) ఎన్సీసీ డే ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. - కర్నూలు(హాస్పిటల్) ఎన్సీసీ (నేషనల్ కేడెట్ కాప్స్) అంటే క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్. డ్రిల్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవ, దేశభక్తి తదితర విషయాలపై పూర్తి స్థాయిలో శిక్షణ పొందే భావిభారత పౌరులు. జిల్లాలో 2002వ సంవత్సరం వరకు తిరుపతి హెడ్‌క్వార్టర్‌గా ఎన్సీసీ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ తర్వాత కర్నూలు కేంద్రంగా 2002లో స్థానిక డాక్టర్స్ కాలనీలో ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్ ప్రారంభమైంది. దీని పరిధిలో ప్రస్తుతం బాయ్స్ బెటాలియన్, 28 ఆంధ్రా బెటాలియన్, కర్నూలు, అనంతపురం గర్ల్ బెటాలియన్, వన్ ఆంధ్రా మెడికల్ కంపెనీ ఉన్నాయి. జిల్లాలోని 71 పాఠశాలలు, 30 కళాశాలల్లో మొత్తం 10,250 మంది ఎన్సీసీ కేడెట్లు ఉండగా, ఇందులో 4,350 మంది బాలురు, 5,900 మంది బాలికలు ఉన్నారు. కర్నూలు గ్రూపులో ఆరు మంది ఆర్మీ ఆఫీసర్లు, 75 మంది జేసీవోలు, ఓఆర్‌లు, 100 మంది సాధారణ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరితో పాటు ప్రతి కళాశాలలో ఒక ఎన్సీసీ ఆఫీసర్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఎన్సీసీలో మూడు రకాల శిక్షణ ఇన్సిట్యూషన్ ట్రైనింగ్ ఎన్సీసీ అధికారులు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా డ్రిల్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే శిక్షణ, విపత్తు నివారణలో శిక్షణ, మ్యాప్ రీడింగ్, ఫైరింగ్, బ్యాటిల్ క్రాఫ్ట్, ఫీల్డ్ క్రాఫ్ట్ వంటి అంశాల్లో ప్రత్యేక తరగతుల్లో శిక్షణ ఇస్తారు. క్యాంప్ ట్రైనింగ్ ఈ శిక్షణను అనంతపురం జిల్లా పూడేరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 10 రోజుల పాటు ఎన్సీసీ కేడెట్లకు శిక్షణ ఇస్తారు. ఇన్సిట్యూషన్ ట్రైనింగ్‌లో ఇచ్చే శిక్షణతో పాటు వైద్యం, ఫైర్ ఫైటింగ్, రెడ్‌క్రాస్ సేవలు, 108 సేవలు, కమ్యూనిటీ లివింగ్, స్నేహితులతో ఎలా మెలగాలి వంటి అంశాలను నేర్చుకుంటారు. అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇందులో భాగంగా ఆర్డీసీ (రిపబ్లిక్ డే క్యాంపు), తలసైనిక్ క్యాంపులకు ఎన్సీసీ విద్యార్థులను పంపించేందుకు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులను ఢిల్లీకి పంపిస్తారు. ఆర్డీసీలో భాగంగా ఢిల్లీలో డ్రిల్, సాంస్కృతిక కార్యక్రమాలు, గార్డ్ ఆఫ్ ఆనర్, బెస్ట్ కేడెట్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. ఫ్లాగ్ ఏరియా కాంపిటీషన్‌ను ఉప రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి, మూడు రకాల భద్రతాధికారుల సమక్షంలో మోడల్ రూపొందించి ప్రదర్శిస్తారు. తలసైనిక్ క్యాంపునకు పంపించేందుకు సైతం పై విధంగానే ఎంపికలు నిర్వహించి ఢిల్లీకి పంపిస్తారు. ఇది పూర్తిగా ఆర్మీలో ఇచ్చే శిక్షణ ఇస్తారు. ఆఫ్సిటికల్స్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, జడ్జింగ్ డిస్టెన్ ఫీల్డ్ సిగ్నల్స్, హెల్త్ అండ్ హైజనింగ్లలో శిక్షణ ఉంటుంది. పాఠశాల స్థాయి పిల్లలకు ఏ- సర్టిఫికెట్, కళాశాల స్థాయి పిల్లలకు బీ,సీ సర్టిఫికెట్ పరీక్షలను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహిస్తారు. ఎన్సీసీ ప్రయోజనాలు ఎన్సీసీలో పలు రకాల సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయి. ఆర్డీసీ, తలసైనిక్ క్యాంపుల్లో పాల్గొన్న విద్యార్థులకు జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏ సీట్ల కేటాయింపులో వీరికి రిజర్వేషన్ ఉంటుంది. దీంతో పాటు యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలోనూ వీరికి మంచి అవకాశాలు ఉంటాయి. ఎన్సీసీలో చేరడంతో పిల్లల్లో బాల్యం నుంచే క్రమశిక్షణ అలవడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేన్ స్కిల్స్, పరస్పర సహకారం, నిజాయితీగా జీవించడం వంటి లక్షణాలు అలవడతాయి. శిక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు: పీజీ కృష్ణ, గ్రూప్ కమాండర్ ఎన్సీసీ విద్యార్థులకు అవసరమైన శిక్షణతో పాటు సామాజిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా స్వచ్ఛభారత్, బేటీ బచావో, బేటీ పడావో, షుగర్, ఎయిడ్స్, లెప్రసి, మానవహక్కులు, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్సీసీ విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. యూత్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌లో విదేశాలకు: గౌస్ బేగ్, లెఫ్ట్‌నెంట్ కల్నల్ యూత్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 20 మంది విద్యార్థులను ఇప్పటి వరకు విదేశాలకు పంపించాము. సిల్వర్‌జూబ్లీ కళాశాలకు చెందిన ధీరజ్ శ్రీనివాస్ కజకిస్తాన్, భాస్కర్ బంగ్లాదేశ్‌కు వెళ్లి వచ్చారు. వారు అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, వాతావరణ పరిస్థితులు, వ్యక్తుల మనస్తత్వాలను పరిశీలిస్తారు. తద్వారా వారు భవిష్యత్‌లో సమాజంలో ఎలా జీవించాలో నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది.