in hyderabad
-
ఎక్స్పీరియన్ హైదరాబాద్ జీఐసీ.. ఇప్పుడు డబుల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా, టెక్నాలజీ దిగ్గజం ఎక్స్పీరియన్, హైదరాబాద్‌లోని తమ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ని (జీఐసీ) మరింతగా విస్తరించింది. గతానికన్నా రెట్టింపు ఆఫీస్ స్పేస్‌తో 85,000 చ.అ. విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటైనట్లు సంస్థ సీఈవో (టెక్నాలజీ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఇన్నోవేషన్) అలెగ్జాండర్ లింట్నర్ తెలిపారు.ప్రపంచ స్థాయి ప్రోడక్టులు రూపొందించేందుకు, నిరంతరాయంగా సర్వీసులు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సెంటర్ ప్రధానంగా ఫిన్‌టెక్, అనలిటిక్స్, మోసాల నివారణ వంటి అంశాలకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెడుతుంది.హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ జీఐసీ ఎక్స్పీరియన్ ప్రపంచవ్యాప్త సాంకేతిక కార్యకలాపాలకు కీలకమైన నాడీ కేంద్రంగా రూపుదిద్దుకుంది. క్లౌడ్ మైగ్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పురోగతి, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ప్రాసెస్ ఆటోమేషన్‌లో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌లోని బలమైన ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రతిభను ఉపయోగించుకోవడం ద్వారా, ఎక్స్పీరియన్ ప్రపంచవ్యాప్తంగా స్కేలబుల్, డేటా ఆధారిత పరిష్కారాలను అందించే సామర్థ్యాన్ని పెంచుతోంది. -
22న సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై శిక్షణ
సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో రైతులకు ఈ నెల 22(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన నిపుణులు డా. జి. రాంబాబుతోపాటు గొర్రెలు, మేకల పెంపకంలో అనుభవజ్ఞులైన రైతులు శిక్షణ ఇస్తారన్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు సంప్రదించాల్సిన నంబర్లు: 970 538 3666, 0863–2286255 22న కాకినాడలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ శిక్షణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై లోతైన అవగాహన కలిగించే లక్ష్యంతో సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్(సేవ్) స్వచ్ఛంద సంస్థ ఈ నెల 22 (ఆదివారం)న కాకినాడ విద్యుత్‌నగర్‌లోని చల్లా ఫంక్షన్ హాల్ (వినాయకుడి గుడి ఎదుట)లో ఉ. 8.30 గం. నుంచి సా. 5.30 గం. వరకు రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? పెట్టుబడి, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు, రైతులు పంట దిగుబడులను మొత్తం నేరుగా అమ్ముకోకుండా కొంత మోత్తాన్ని విలువ ఆధారిత ఉత్పత్తులగా మార్చి అమ్ముకోవడం, అధికాదాయం కోసం ప్రయత్నాలు, దేశీ విత్తనాల ఆవశ్యకత, దేశీ ఆవు విశిష్టత తదితర అంశాలపై సేవ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ శిక్షణ ఇస్తారు. ప్రవేశ రుసుము: ఒక్కొక్కరికి రూ. వంద. ఆసక్తి గల రైతులు ముందుగా తమ పేర్లను ఫోన్ చేసి నమోదు చేసుకోవాలి.. వివరాలకు.. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ సమాచార కేంద్రం: 04027654337, 86889 98047 94495 96039 మార్చిలో జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ భూతాపోన్నతిని శాశ్వత వ్యవసాయ (పర్మాకల్చర్) పద్ధతుల్లో సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలపై రైతాంగంలో చైతన్యం తెచ్చే లక్ష్యంతో వచ్చే ఏడాది మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ జరగనుంది. తెలంగాణలోని జహీరాబాద్ దగ్గర్లోని బిడకన్నె గ్రామంలో అరణ్య పర్మాకల్చర్ అకాడమీలో ఈ మూడు రోజుల మహాసభ జరగనుందని అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ తెలిపింది. 20న ప్రకృతి సేద్య పద్ధతుల్లో కూరగాయల సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయల సాగుపై కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలోని రామరాజు గారి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 20 (శుక్రవారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆం. ప్ర. శాఖ తరఫున రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. కూరగాయల సాగులో కొత్త పద్ధతులను అనుసరిస్తున్న సీనియర్ రైతులు అనుభవాలను పంచుకుంటారు. వివరాలకు.. 78934 56163 -
మాజీ ఎంపీ కేఎస్సార్ మూర్తి మృతి
హైదరాబాద్‌లోని స్వగృహంలో కేన్సర్‌తో కన్నుమూత కోనసీమ దాహార్తిని దూరం చేసి తాగునీటి ప్రాజెక్టులు తెచ్చిన నేత కాంగ్రెస్ ఎంపీగా, విశ్రాంత ఐఏఎస్‌గా సేవలు అమలాపురం టౌన్ : అమలాపురం మాజీ ఎంపీ, విశ్రాంత ఐఏఎస్ అధికారి కేఎస్ఆర్ మూర్తి గురువారం తెల్లవారు జాము 4.30 గంటలకు మృతి చెందారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కోంపల్లిలో గల స్వగృహంలో కన్నుమూశారు. 1996లో మూర్తి అమలాపురం ఎంపీగా జీఎంసీ బాలయోగిపై గెలుపొందారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన మూర్తి 1969లో ఐఏఎస్‌కు ఎంపికై రాష్ట్రంలో కలెక్టర్, తదితర ఉన్నత ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లలో కీలక హోదాల్లో పనిచేశారు. 1993లో ఉద్యోగ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చి 1995లో అమలాపురం ఎంపీగా గెలుపొందారు. అప్పటి ప్రధాని దౌవగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాౖటెన కేంద్ర ప్రభుత్వంలో కొన్ని ప్రతికూల కారణాల పార్లమెంటు రద్దు కావడంతో మూర్తి ఎంపీ పదవి 18 నెలలకే పరిమితమైంది. తర్వాత 1998లో ఎంపీగా బాలయోగి చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరి సలహాదారుడిగా...రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసి, కొద్దికాలంలోనే అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు. అలాగే ముమ్మిడివరంలోని బాలయోగీశ్వరుల తపో ఆశ్రమానికి 1985 నుంచి కమిటీ సభ్యునిగా... 1994 నుంచి కమిటీ చైర్మ¯ŒS పనిచేశారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సంజయ్‌మూర్తి తండ్రి బాటలోనే ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఇన్ఫర్మేషన్, బ్రాడ్ కాస్ట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 9 భారీ తాగునీటి ప్రాజెక్టులకు రూపశిల్పి : మూర్తి ఎంపీ కాగానే కోనసీమలోని సముద్ర తీర గ్రామాలు తాగునీటితో ఇబ్బంది పడుతున్న సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో సెక్రటరీగా పనిచేసిన అనుభవం, రాష్ట్రంలో వివిధ శాఖలతో పరిచయాలు, పలుకుబడితో 1997లో కోనసీమకు ఒకేసారి దాదాపు రూ. వంద కోట్లతో 9 భారీ తాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేయించి దాదాపు 500 గ్రామ శివార్లకు తాగునీరు అందేలా చేశారు. ఆ ప్రాజెక్టులే ఇప్పుడు గుడిమెళ్లం, తొత్తరమూడి, ఉప్పలగుప్తం తదితర ఆర్‌డబ్లు్యఎస్ ప్రాజెక్టులుగా సేవలు అందిస్తున్నాయి. -
కలర్ఫుల్గా హైదరబాద్ ఆర్ట్ ఫెస్టివల్