jai veer
-
సీఎల్పీలో ఎమ్మెల్యేకి సీఎం రేవంత్ క్లాస్!
సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడే సమయంలో మీరు మధ్యలో వెళ్లిపోతే ఎలా? క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. ఇంతకి సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్న ఎమ్మెల్యే ఎవరు? అసలేం జరిగింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభలో ప్రసంగించారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేస్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.జానారెడ్డి కుమారుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి సమావేశం నుంచి భయటకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడుతున్నా కదా. మీరు బయటకు వెళ్లడం ఏంటి? అని ప్రశ్నించారు. క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. అనంతరం, తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
జై జాడ తెలిపితే..
కాగజ్‌నగర్: మహారాష్ర్టలోని ఉమ్రెద్ కర్హండ్లా అభయారణ్యం నుంచి గత కొద్ది రోజుల క్రితం ‘జై' అనే అతి పెద్ద పులి అదృశ్యమైంది. అది అదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్ట్‌లోకి వచ్చినట్లు భావిస్తున్న అక్కడి సర్కారు.. దాని ఆచూకి తెలిపితే రూ. 50 వేల రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తొమ్మిది అడుగుల భారీ కాయంతో ఉండే ‘జై’ కోసం ఇప్పటికే మహారాష్ట్ర అటవీ శాఖ విస్తృత స్థాయిలో గాలించిన లాభం లేకపోవడంతో.. కొత్త దారి అన్వేషించింది. దాని వివరాలు తెలిపిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించింది. గిరిజనులు సంచరించే ప్రాంతాల్లో రివార్డుకు సంబంధించిన వివరాలను తెలియజేయడంతో జై ఆచూకీ తెలిసే అవకాశం ఉందని మహారాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పులుల వలసలు సాగుతుంటాయని గుర్తించిన అధికారులు జై కూడా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోకి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. పులి ఆచూకి తెలిపిన వారికి నగదు పురస్కారంతో పాటు ఘన సన్మానం ఏర్పాటు చేస్తామని తెలపడంతో అటవీ ప్రాంతంలో కొత్తవేట మొదలైంది. జై లాంటి అతి పెద్ద పులిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండటంతో అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారికి తెలంగాణ అటవీ శాఖ అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు.