Jind
-
బిడ్డను చంపి తల్లిపై గ్యాంగ్‌రేప్!
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. సగటున రోజుకి వందకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వెలుగులోకి రానివి మరెన్నో?. తాజాగా.. హర్యానాలోని జింద్‌లో ఘోరమైన ఘటన జరిగింది. నలుగురు దుండగులు అయిదేళ్ల చిన్నారిని హత్య చేసి, ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాత గొడవల కారణాంగానే నిందితులు ఈ దారుణానికి తెగబడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం చెత్త ఏరుకుంటూ జింద్ జిల్లా(Jind) శివారులోని గుడిసెల్లో నివసిస్తోంది. కొన్నిరోజుల కిందట అమిత్ అనే వ్యక్తికి, బాధిత మహిళ భర్తకి గొడవ జరిగింది. ఈ గొడవలో ఆమె భర్త తలకు గాయం కాగా పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు నిందితుడు అమిత్‌పై చర్యలు తీసుకోకుండా.. గొడవను సర్దిచెప్పి పంపించారు. ఇది మనసులో పెట్టుకున్న అమిత్, అతని మైనర్ సోదరుడు కోపంతో రగిలిపోయారు. మంగళవారం రాత్రి ఆమె భర్త లేని సమయం చూసి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గుడిసెలోకి చొరబడ్డారు. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోయాక.. ఆమెతోపాటు అయిదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ చిన్నారి గొంతునులిమి హత్య చేసి, బాధితురాలిపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. చిన్నారి మృతదేహం రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళ వాళ్లను గుర్తించి స్థానికులకు సమాచారం అందించింది. చిన్నారిని ఖననం చేశాక.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు తన ఐదేళ్ల వయసున్న బిడ్డపైనా నిందితులు అత్యాచారానికి ఒడిగొట్టారని చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక ఎస్సై యశ్వీర్, సమాధి నుంచి పసికందు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు. మరోవైపు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు అమిత్‌తో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. -
హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి
జీంద్: హర్యానాలోని జింద్ జిల్లా ఉచన కలాన్‌లో కలకలం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కాన్వాయ్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం దుష్యంత్ చౌతాలా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా కొందరు యువకులు వీరంగం సృష్టించారు. అనంతరం దుష్యంత్ కాన్వాయ్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.ఈ రోడ్ షోలో దుష్యంత్‌తో పాటు ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్రశేఖర్ రావణ్ కూడా పాల్గొన్నారు. ఈ హఠాత్ దాడి హర్యానా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో చంద్రశేఖర్ ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. జేజేపీ నేత, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ఉచన కలాన్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. చంద్రశేఖర్ ఆయనకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. హర్యానాలో అక్టోబర్ 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఇది కూడా చదవండి: గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు -
రాజస్థాన్‌లో కాంగ్రెస్ జయభేరి
జైపూర్/ చండీగఢ్ : రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి జయభేరి మోగించింది. రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి షఫియా జుబేర్ 12వేల ఓట్ల మెజారిటీతో గురువారం విజయం సాధించారు. జుబేర్‌కు 83,311 ఓట్లు రాగా.. సమీప భాజపా అభ్యర్థి సువంత్ సింగ్‌కు 71,083 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో 200 శాసనసభ స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం 100కు పెరిగింది. గతేడాది డిసెంబరు 7న రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. అయితే అప్పుడు రామ్‌గఢ్‌లో బీఎస్పీ అభ్యర్థి మృతితో ఆ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా వేసి తిరిగి జనవరి 27న ఎన్నికలు నిర్వహించారు. గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. జింద్...మళ్లీ బీజేపీ వశం హరియాణాలో జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి కృష్ణ మిద్దా గెలుపొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఐఎన్ఎల్డీ పార్టీకి చెందిన జింద్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరిచంద్ మిద్దా మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కృష్ణ మిద్దా బీజేపీ తరపున బరిలో దిగారు. ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ఐఎన్ఎల్డీ నుంచి ఉమ్ సింగ్, కొత్తగా ఏర్పాటైన జేజేపీ నుంచి దిగ్విజయ్ చౌతాలా పోటీ చేశారు. -
ఇంటిపని చేయని అమ్మాయిలందరిని..
జింద్: ఇంటిపని చేయలేదని విద్యార్థినులను చితక బాదిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. దీంతో విద్యార్థినులకు తీవ్ర గాయాలవడంతో వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించారు. ఆ టీచర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జింద్ జిల్లాలోని లిజ్వానా అనే గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. అందులో చదువుతున్న ఏడో తరగతి అమ్మాయిలు హోం వర్క్ పూర్తి చేయలేదని కారణంతో క్లాస్ ఉపాధ్యాయురాలు వారిని కర్రతతో చితక్కొట్టడమే కాకుండా బెంచిలపై నిల్చోబెట్టింది. దీంతో ఆ పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పిల్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. -
15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
జింద్ జిల్లాలోని కుర్ద్ గ్రామంలో 15 ఏళ్ల బాలికపై నిన్న ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారని పాల్పడ్డారని పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం జిల్లా కేంద్రమైన జింద్‌లో వెల్లడించారు. నిందితలు ముగ్గురు పవన్, నరేందర్, దల్షర్లులుగా గుర్తించినట్లు తెలిపారు. అయితే వారంతా పరారీలో ఉన్నారని చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. సామూహిక అత్యాచర ఘటన నిన్న చోటు చేసుకుందని చెప్పారు. బహిర్బుమికి వెళ్లిన ఆ బాలికను నిందితులు సమీపంలోని వ్యవసాయ భూమి వైపు బలవంతంగా తీసుకుని వెళ్లారని, అనంతరం ఆ బాలికపై అత్యాచారం జరిపారని పేర్కొన్నారు. ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అత్యాచారం గురైనట్లు వైద్యులు దృవీకరించారన్నారు. నిందితులపై కేసు నమెదు చేసినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.