LSG vs GT
-
‘అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుంది’
లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)కు కోపమొచ్చింది. విమర్శలు చేసే వాళ్లు.. ముందుగా తమ పరిస్థితి ఏమిటో గమనించుకోవాలని.. ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడాలంటూ మండిపడ్డాడు. స్టూడియోలో కూర్చుని మైదానంలోని పరిస్థితులను ఎవరూ అర్థం చేసుకోలేరని.. కామెంట్రీ పేరుతో శ్రుతిమించిన విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.అమ్ముడుపోకుండా మిగిలిపోయాడుఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విషయం తెలిసిందే. ముంబై తరఫున దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటినా ఫ్రాంఛైజీలు ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను పట్టించుకోలేదు. అయితే, లక్నో యువ పేసర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) గాయం కారణంగా.. శార్దూల్‌కు ఊహించని విధంగా అదృష్టం కలిసి వచ్చింది.జట్టులోకి వచ్చి అదరగొడుతున్నాడుసీజన్ మొత్తానికి దూరమైన మొహ్సిన్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుంది. అంతేకాదు తుదిజట్టులోనూ చోటిచ్చింది. అయితే, శార్దూల్ కూడా యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లలో కలిపి 11 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.200 స్కోరు అనేది కామన్ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌పై శనివారం నాటి మ్యాచ్‌లో లక్నో విజయానంతరం శార్దూల్ ఠాకూర్ విమర్శకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ‘‘ఈ సీజన్ ఆరంభం నుంచి మేము బాగానే బౌలింగ్ చేస్తున్నాం. అయితే, చాలాసార్లు కామెంట్రీలో మా గురించి విమర్శుల చేస్తూనే ఉన్నారు.బౌలర్ల పట్ల కఠినంగా మాట్లాడుతున్నారు. ఈరోజుల్లో 200 స్కోరు అనేది కామన్ అయిపోయిన విషయాన్ని గుర్తించాలి. క్రికెట్ ఆడే తీరు రోజురోజుకూ మారిపోతోంది. స్టూడియోలో కూర్చుని ఒకరి బౌలింగ్ గురించి వ్యాఖ్యానాలు చేయడం సులువే.అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుందికానీ మైదానంలో ఉన్న వాళ్లకే వాస్తవ పరిస్థితుల గురించి తెలుస్తుంది. వేరే వాళ్లను విమర్శించే వాళ్లు.. వారి గణాంకాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి సమీక్షించుకోవాలి’’ అని శార్దూల్ ఠాకూర్ కామెంటేటర్లకు చురకలు అంటించాడు.కాగా ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో ఓటమి పాలైన లక్నో త్వరగానే కోలుకుంది. ఇప్పటికి ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఘన విజయంబాధ్యతాయుతమైన బౌలింగ్‌కు తోడు.. దూకుడైన బ్యాటింగ్‌తో సొంత మైదానంలో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయంతో మెరిసి సత్తా చాటింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంత్ సేన.. గుజరాత్‌ను 180 పరుగులకు కట్టడి చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి రెండేసి వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (31 బంతుల్లో 58) మరోసారి విజృంభించగా.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ (18 బంతుల్లో 21) మరోసారి విఫలమయ్యాడు. అయితే, నికోలస్ పూరన్ (34 బంతుల్లో 61) ధనాధన్ దంచికొట్టగా.. ఆయుశ్ బదోని (20 బంతుల్లో 28 నాటౌట్) అతడికి సహకరించాడు. ఫలితంగా 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి లక్నో లక్ష్యాన్ని ఛేదించింది.చదవండి: నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్ అయ్యర్ -
అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant). ఈ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌ను దక్కించుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. మెగా వేలంలో ఇతర జట్లతో పోటీపడి మరీ లక్నో యాజమాన్యం పంత్‌ను భారీ ధరకు దక్కించుకుంది.ఐపీఎల్-2025లో కెప్టెన్‌గా పంత్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, సారథిగా ఫర్వాలేదనిపిస్తున్న ఈ టీమిండియా స్టార్.. బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో అతడి కెప్టెన్సీలో లక్నో ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది.19 పరుగులుఇక బ్యాటర్‌గా రిషభ్ పంత్ చేసిన పరుగులు మొత్తం కలిపి కేవలం 19. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లక్నో జట్టు శనివారం సొంత మైదానం ఏకనా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా పంత్ బ్యాట్ ఝులిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఒకేసారి అంత డబ్బు నేను కళ్లజూడలేదుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా రిషభ్ పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రైస్ ట్యాగ్’ పంత్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందా? అన్న నెటిజన్ల ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఏమో నాకైతే తెలియదు. ఎందుకంటే.. నా జీవితంలో ఒకేసారి అంత డబ్బు నేను కళ్లజూడలేదు.కాబట్టి.. అతడిపై ఒత్తిడి ఉంటుందో లేదో నేను అంచనా వేయలేను. అయితే, ఓ ఆటగాడిపై ఇలాంటివి కచ్చితంగా ప్రభావం చూపుతాయా? అంటే అవుననీ చెప్పవచ్చు. డబ్బు (ప్రైస్ ట్యాగ్) లేదంటే కెప్టెన్సీ భారం అతడిపై ఒత్తిడి పెంచుతుండవచ్చు. కారణం ఏదైనా పంత్ దానిని అధిగమించాలి.. గానీ తప్పించుకోకూడదు. అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి?గత మ్యాచ్‌లో పంత్ బ్యాటింగ్‌కు వెళ్లకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. క్రీజులోకి వెళ్తేనే కదా.. పరుగులు వస్తాయో.. రావో తెలిసేది. కనీస ప్రయత్నానికి కూడా వెనుకాడితే ఎలా?.. అతడు బ్యాటింగ్‌కు వెళ్లకుండా తప్పించుకోవడం ఎంతమాత్రం సరికాదు’’ అని ఆకాశ్ చోప్రా విమర్శించాడు.కాగా గత మ్యాచ్‌లో లక్నో జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఆతిథ్య కేకేఆర్.. పంత్ సేనను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (28 బంతుల్లో 47), మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 81) దంచికొట్టగా.. నికోలస్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్ (36 బంతుల్లో 87 నాటౌట్) ఆడాడు.అయితే, మిడిలార్డర్లో వచ్చే పంత్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. నాలుగో స్థానంలో అబ్దుల్ సమద్ (6).. ఐదో స్థానంలో డేవిడ్ మిల్లర్ (4 నాటౌట్)ను ఆడించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్నో 238 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్ 234 రన్స్‌కే పరిమితం కావడంతో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పంత్ సేన జయభేరి మోగించింది. చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం -
IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం
వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు డైనమిక్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఈ న్యూజిలాండ్ క్రికెటర్ స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో సత్తా చాటిన గ్లెన్ ఫిలిఫ్స్ మెగా వేలంలోకి రాగా.. గుజరాత్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఇంత వరకు ఈ సీజన్లో అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.గాయపడిన ఫిలిప్స్ఈ క్రమంలో గత ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (GT vs SRH)తో మ్యాచ్ సందర్భంగా మాత్రం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు ఫిలిప్స్. కానీ దురదృష్టవశాత్తూ అతడు గాయపడ్డాడు. ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బంతిని పాయింట్ వైపు తరలించగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ బాల్‌ను ఆపబోయి గాయపడ్డాడు.ఈ క్రమంలో ఫిజియో వచ్చి అతడిని బయటకు తీసుకువెళ్లాడు. అయితే, గజ్జల్లో నొప్పి తీవ్రం కావడంతో సీజన్ మొత్తానికి ఫిలిప్స్ దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి టైటాన్స్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సీజన్ మొత్తానికి దూరం‘‘ఏప్రిల్ 6న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా గ్లెన్ ఫిలిప్స్ గాయపడ్డాడు. గజ్జల్లో గాయం కారణంగా అతడు తిరిగి న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. గ్లెన్ త్వరగా కోలుకోలుకోవాలని గుజరాత్ టైటాన్స్ ఆకాంక్షిస్తోంది’’ అని టైటాన్స్ యాజమాన్యం పేర్కొంది. కాగా 28 ఏళ్ల గ్లెన్ ఫిలిఫ్స్ ప్రపంచంలోని ఉత్తమ ఫీ ల్డ ర్లలో ఒకడు. తనదైన రోజున లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌తోనూ చెలరేగగలడు. అతడు దూరం కావడం టైటాన్స్‌కు ఓ రకంగా ఎదురుదెబ్బ లాంటిదే.కాగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన గ్లెన్ ఫిలిప్స్.. కుడిచేతి వాటం బ్యాటర్. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 65 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. క్యాష్‌రిచ్ లీగ్‌లో చివరగా 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడు బరిలోకి దిగాడు.జోరు మీదున్న గిల్ సేనఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిన శుబ్‌మన్ గిల్ సేన.. ఆ తర్వాత ఊహించని విధంగా పుంజుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టైటాన్స్.. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపొందింది. ఇక శనివారం (ఏప్రిల్ 12) నాటి మ్యాచ్‌లో టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతుంది. ఇందుకు లక్నోలోని ఏకనా స్టేడియం వేదిక.చదవండి: KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? ఇంతకీ మెదడు పనిచేస్తోందా?!