Muthappa Rai
-
తనకు తానే కాల్పులు జరుపుకున్న రిక్కీరై!
కర్ణాటక: పారిశ్రామికవేత్త రిక్కీరైపై జరిగిన కాల్పుల ఘటన మలుపు తిరిగింది. ఆయన తనంటత తానే కాల్పులు జరుపుకున్నారని కాల్పుల వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ గన్‌మెన్ మన్నప్ప విఠల్ వాంగ్మూలం ఇచ్చారు. కాల్పులకు పాల్పడ్డారనే అనుమానంతో మన్నప్పవిఠల్ను బిడది పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని రామనగర కోర్టులో హాజరుపరిచి 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు.తమదైనశైలిలో విచారణ చేపట్టగా రిక్కీరై తనంతటతానే కాల్పులు జరుపుకున్నట్లు మన్నప్ప విఠల్ వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో రిక్కీరై షూటౌట్ కాల్పుల ఘటనపై నాటకం ఆడినట్లు అనుమానం మరితం బలపడినట్లైంది. మాజీ డాన్ దివంగత ముత్తప్పరై చిన్నకుమారుడు పారిశ్రామికవేత్త రిక్కీ రైపై ఈనెల 18వ తేదీ రాత్రి 11.30 సమయంలో కారులో బెంగళూరుకు వెళ్తుండగా బిడది వద్ద ఆయనపై ఫైరింగ్ జరిగింది. రిక్కీరై ముక్కు, చేతులకు గాయాలయ్యాయి. అనంతరం అతడిని బెంగళూరు హెచ్ఏఎల్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు షూటౌట్ జరిగిన స్థలంలో లభించిన బుల్లెట్, విఠల్ వద్ద ఉన్న గన్లోనిదని తేలింది. పోలీసులు ఇతడి గన్ను స్వాదీనం చేసుకుని ఎప్ఎస్ఎల్ ల్యాబోరేటరీకి పంపించారు. ముత్తప్పరై వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న విఠల్.. రిక్కీ రై వద్దనే పనిచేసేవాడు. ఆరోగ్యం సరిగాలేనందున ఆ ఉద్యోగం వదిలిపెట్టి ఇంటివద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ముత్తప్పరై చనిపోకముందు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ రిక్కీ రై సైట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కారణంతో మన్నప్పవిఠల్ కోపంతో ఉండవచ్చని అనుమానం వ్యక్తమైంది. రిక్కీరై గన్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదులో ముగ్గురు పేర్లు ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసులో ఉన్న పాత్ర ధ్రువీకరించడానికి ఎలాంటి సాక్ష్యాలు కనబడకపోవడంతో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ముత్తప్పరై మాజీ సహచరుడు, మొదటి ఆరోపి రాకేశ్మల్లి, మూడో ఆరోపి నితీశ్శెట్టిని విచారణ చేపట్టి పోలీసులు వదిలిపెట్టారు. రెండో ఆరోపి ముత్తప్పరై రెండో భార్య అనురాధ విదేశాల్లో ఉన్నారు. -
హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్‌మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెపై తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్‌కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..? -
నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?
దొడ్డబళ్లాపురం: రామనగర తాలూకా బిడదిలో మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్పరై చిన్న కుమారుడు రిక్కీ రై పై 18న అర్ధరాత్రి కాల్పులు జరిపి హత్యాయత్నం చేసిన కేసులో పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అలాగే రిక్కీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు, పనివాళ్లు, సెక్యూరిటీని విచారించారు. సంఘటన జరిగిన చుట్టుపక్కల పరిసరాల్లో శోధిస్తున్నారు. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిక్కీ రై కోలుకుంటున్నాడు.వారి మీదే అనుమానంనా మీద హత్యాయత్నం చేసింది తన పిన్ని అనురాధ, రియల్ ఎస్టేట్ వ్యాపారి నితేశ్ శెట్టి, రాకేశ్ మల్లి, వైద్యనాథన్ అనేవారని రిక్కీ రై చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారికి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వనున్నారు. అయితే రిక్కీ పిన్ని అనురాధ కాల్పులు జరగడానికి ఐదు రోజుల ముందు విదేశాలకు వెళ్లిపోయినట్టు సమాచారం.కుక్కలు మొరిగాయికాల్పులు జరిగిన రోజు రిక్కీ ఇంట్లో ఉండగా కుక్కలు మొరగడంతో ఒక గన్ మ్యాన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. కాసేపటికి రిక్కీ కారులో బయలుదేరగానే కాల్పులు జరిగాయి. రిక్కీ వెంట ఉన్న గన్‌మ్యాన్‌ను పోలీసులు విచారించారు. హోంమంత్రి పరమేశ్వర్ కాల్పుల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్త రాకేశ్ మల్లి ప్రమేయం గురించి తనకు తెలియదన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. -
రిక్కీ అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రాష్ట్రంలో, అందులోనూ బెంగళూరు పరిసరాల్లో గత 48 గంటల్లో అనూహ్యమైన నేర సంఘటనలు దేశమంతటా చర్చనీయాంశమయ్యాయి. జాతీయ టీవీ చానెళ్లలో చాలా సమయాన్ని ఆక్రమించాయి. దీంతో బెంగళూరు హాట్ హాట్ చర్చల్లో భాగమైంది. సినిమా స్టైల్లో మాఫియా డాన్ కొడుకుపై తుపాకులతో హత్యాయత్నం, ఆ గొడవ సద్దుమణగకముందే ఏకంగా రిటైర్డు డీజీపీ ఇంట్లోనే హత్యకు గురికావడం, అందులోనూ ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అరెస్టు చేయడం హాలీవుడ్ క్రైం స్టోరీలను మించిపోయింది. రిక్కీ కేసులో ఎవరు సూత్రధారి? మాజీ మాఫియా డాన్, దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై మీద గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి కాల్పులు జరపడం సంచలనం కలిగిస్తోంది. రిక్కీని మట్టుబెట్టాలని ఫైరింగ్ చేయగా, తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. సిలికాన్ సిటీతో పాటు చుట్టుపక్కల జరుగుతున్న రియల్ ఎస్టేట్ గొడవలు, మాఫియా పోరాటాలు ఈ సంఘటనతో ఒక్కసారిగా తెర మీదకు వచ్చాయి. మొదట రియల్ ఎస్టేట్ నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందని అందరూ భావించినప్పటికీ సమయం గడిచేకొద్దీ ముత్తప్ప రై రెండవ భార్య అనురాధపై అనుమానాలు పెరుగుతున్నట్లు పోలీసు వర్గాల కథనం. ముత్తప్పరై ఇద్దరు కుమారులు, రెండవ భార్య అనురాధ పేరున తన ఆస్తులు వీలునామా రాశారు. అనురాధకు ఓ మోస్తరుగా బంగారు ఆభరణాలు, ఒక కారు, పెద్ద మొత్తంలో నగదు, హెచ్డీ కోటలో ఉన్న ఆస్తి, బెంగళూరు సహకార నగరలో ఉన్న ఒక భవంతి రాసిచ్చారు. అయితే ఆస్తిలో తనకు ఇంకా భాగం రావాలని ఆమె కోర్టుకు వెళ్లింది. రిక్కీ, అతని అన్న రాకీతో ఆమెకు గొడవలు కూడా జరిగాయి. అయితే తరువాత రిక్కీ సోదరులు రాజీ చేసుకున్నారు. వారు పరస్పరం హత్యలకు కుట్రలు చేసినట్లు కూడా వార్తలున్నాయి. ఇప్పుడీ హత్యాయత్నంతో అది బహిర్గతమైంది. రిక్కిరై సెక్యూరిటీ ఏమైంది రిక్కీ రై మీద హత్యాయత్నం తరువాత అందరిలో అనేక ప్రశ్నలు కలుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల వారసుడు, విస్తృతంగా శత్రువులను కలిగిన రిక్కీ రై అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు? పటిష్టమైన ప్రైవేటు భద్రత ఏమైంది? అనే సందేహాలున్నాయి. రిక్కీ రై సొంతంగా వీవీఐపీకి ఉన్నంత సెక్యూరిటీని పెట్టుకున్నాడు. గన్లు పట్టుకుని చుట్టూ బాడీగార్డులు ఉంటారు. బాడీ గార్డులు షార్ప్ షూటర్స్ అయి ఉంటారు. రిక్కిరై పై కాల్పులు జరిపిన సమయంలో కారులో ఒకరే సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. మిగతా ఇద్దరు ఎందుకు లేరనేది సందేహాస్పదమైంది. కాల్పుల వెనుక బయటి శత్రుల కన్నా లోపలి శత్రువులే ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిక్కీకి డిప్యూటీ సీఎం పరామర్శ రిక్కీ రై బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారంనాడు ఆస్పత్రికి వెళ్లి అతనిని పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా పోలీసులు అరెస్టు చేస్తారని రిక్కీకి భరోసా ఇచ్చారు.రిటైర్డు డీజీపీ విషాదాంతం యశ్వంతపుర: రాష్ట్ర రిటైర్డు డీజీపీ ఓం ప్రకాశ్ బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని సొంత భవనంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం ఈ ఘోరం వెలుగుచూసింది. తానే హత్య చేసినట్లు భార్య పల్లవి పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం ఆమె పోలీసులకు కాల్ చేసినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో ఉన్న పల్లవితో పాటు ఆమె కూతురిని పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా భావిస్తున్నారు. వీరి కుటుంబంలో స్పర్థల గురించి చుట్టుపక్కలవారితో పాటు కొందరు విశ్రాంత పోలీసు అధికారులకు కూడా తెలుసని సమాచారం. తనకు ప్రాణభయం ఉందని ఓంప్రకాశ్ స్నేహితులకు చెప్పుకుని బాధపడినట్లు తెలుస్తోంది. ఓం ప్రకాశ్ హత్యతో ఆయన సహచర రిటైర్డు ఐపీఎస్‌లు విచారానికి లోనయ్యారు. -
అండర్ వరల్డ్ డాన్ కన్నుమూత
బెంగళూరు : అండర్ వరల్డ్ డాన్ ముతప్ప రాయ్(68) శుక్రవారం కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ముతప్ప శుక్రవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ముతప్పరాయ్ విద్యావంతుడు, ఉన్నత కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ముతప్ప విజయ బ్యాంక్‌లో ఉద్యోగిగా వృత్తిని ప్రారంభించాడు. దాదాపు 30 ఏళ్లు బెంగుళూరు అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. (టిక్‌టాక్.. ఎంత పని చేసింది?) 1980 చివరలో బెంగళూరు అండర్ వరల్డ్‌తో రాయ్‌కి పరిచయం ఏర్పడింది. అనంతరం జయ కర్ణాటక అనే సంస్థను స్థాపించాడు. కొద్ది కాలానికి క్యాన్సర్ బారిన పడటంతో మాఫీయా నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం మైసూరు రోడ్డులోని బీదాదిలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఇక రాయ్ అంత్యక్రియలు అతని నివాస స్థలంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంత్యక్రియల్లో పాల్గొనడానికి ప్రజలు ఎవరినీ అనుమతించడం లేదు. (లాక్డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం ) -
'ముత్తప్ప ముందు దావూద్ ఎంత!'
'గాడ్ ఫాదర్ ఆఫ్ బెంగళూరు' గా పేరుపొందిన ముత్తప్ప రాయ్ నేరజీవితంలోని నాటకీయతతో పోల్చుకుంటే ప్రపంచ ప్రఖ్యాత డాన్లు పాబ్లో ఎస్కోబర్, దావూద్ ఇబ్రహీమ్, అత్ కపొనే లాంటి వాళ్ల జీవితాల్లోని నాటకీయత ఎందుకూ పనికిరానిది' అంటూ తన తాజా చిత్రం 'రాయ్' ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. బెంగళూరు కేంద్రంగా కర్ణాటకలోనే కాక దుబాయ్ కేంద్రంగా పలు దేశాల్లో దందాలు చేసి, క్రైమ్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్న ముత్తప్పరాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ్, హిందీల్లో రూపొందించనున్నట్లు వర్మ తెలిపారు. ముత్తప్ప రాయ్ పుట్టిన రోజు సందర్భంగా మే 1న 'రాయ్' ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని, స్వయంగా ముత్తప్పరాయే దాన్ని విడుదల చేస్తారని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. మొదట 'అప్ప'గా అనుకున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రకు సుదీప్ ను ఎంపికచేశారు. అయితే అనివార్యకారణాలవల్ల సుదీప్ స్థానంలో వివేక్ ఒబెరాయ్ ని రాయ్ పాత్రకోసం ఫైనలైజ్ చేశామని, బెంగళూరు, మంగళూరు, ముంబై, దుబాయ్, లండన్ తదితర దేశాల్లో షూటింగ్ చేస్తామని వర్మ తెలిపారు. సీఆర్ మనోహర్ ఈ సినిమాకు నిర్మాత. బెంగళూరుకు చెందిన ముత్తప్ప రాయ్ యువకుడిగా ఉన్నప్పుడు నేర సామ్రాజ్యంలోకి ప్రవేశించి, డాన్ గా ఎదిగాడు. తనపై హత్యాయత్నం జరగటంతో దుబాయ్ పారిపోయిన రాయ్.. అక్కడ దావూద్ తో కలిసి నేరాలు కొనసాగించారు. 2002లో అనూహ్యంగా ఇండియాకు వచ్చి పోలీసులకు లొంగిపోయిన ముత్తప్ప 2008లో జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రజాసేవకు అంకితమయ్యాడు! 'జయ కర్ణాటక' ఫౌండేషన్ ద్వారా సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. అటు హోటల్ వ్యాపారాల్లోనూ రాణిస్తూ ఉత్తమ వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన జీవితం ఆధారంగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్ చిత్రమే 'రాయ్'.